బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే | Zimbabwe defeat Bangladesh by 99 runs in the 1st ODI of the tri-series | Sakshi
Sakshi News home page

BAN vs ZIM: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే

Oct 18 2026 12:52 AM | Updated on Oct 18 2026 12:52 AM

Zimbabwe defeat Bangladesh by 99 runs in the 1st ODI of the tri-series

ముక్కోణపు వన్డే సిరీస్‌లో జింబాబ్వే బోణీ కొట్టింది. శనివారం అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే  నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 

జింబాబ్వే బ్యాటర్లలో వెటరన్‌ బ్రెండన్‌ టేలర్‌(81), క్రెయిగ్‌ ఎర్విన్‌(93) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్‌ అహ్మద్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. షోర్‌ఫుల్‌ ఇస్లాం, సైఫ్ హసన్ తలా వికెట్‌ సాధించారు.

నిప్పులు చెరిగిన ఎవాన్స్‌
అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  బంగ్లాదేశ్‌కు జింబాబ్వే బౌలర్లు చుక్కలు చూపించారు. బ్రాడ్‌ ఎవాన్స్‌ నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బ తీశాడు. అతడితో పటు సికందర్‌ రజా, వెల్లింగ్టన్ మసకాద్జా తలా రెండు వికెట్లు సాధించారు. ఫలితంగా బంగ్లా జట్టు 33.4 ఓవర్లలో కేవలం 172 పరుగులకే కుప్పకూలింది.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో టాంజిద్‌ హసన్‌(46) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ లిట్టన్ దాస్‌, వైస్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ గాయం కారణంగా దూరమయ్యారు. దీంతో బంగ్లా జట్టు కెప్టెన్‌గా తహిద్ హ్రిదోయ్ వ్యవహరించాడు. ఇక రెండో మ్యాచ్‌లో అబుదాబి వేదికగా సోమవారం అఫ్గానిస్తాన్‌, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి.
చదవండి: వర్షం కారణంగా భార‌త్‌-వెస్టిండీస్ ఐదో టీ20 రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement