బెంగళూరు వేదికగా భారత్-వెస్టిండీస్ మద్య జరగాల్సిన ఐదో టీ20 వర్షార్పణమైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ట్రోఫీని ఇరు జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. తొలుత వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత తొమ్మిది ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ దశలో మళ్లీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. వర్షం ఆగితే కనీసం ఐదు ఓవర్ల ఆటనైనా జరుగుతుందని అభిమానులు భావించారు. కానీ వర్షం తగ్గముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇషాన్ కిషన్, నామన్ ధీర్ మెరుపులు
టాస్ గెలిచి విండీస్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ(6) మొదటి ఓవర్లోనే ఔటైనప్పటికి.. ఇషా కిషన్ మెరుపులు మెరిపించాడు. రొమారియో షెపర్డ్ వేసిన ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు.
అతడితో సంజూ శాంసన్(16) కూడా దూకుడుగా ఆడాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ వెనుదిరిగారు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(22), నమన్ ధీర్(24 నాటౌట్)లు బ్యాట్‌కు పనిచెప్పారు. అయితే 7.4 ఓవర్ల వద్ద భారత్ 5 వికెట్లకు 118 పరుగులు చేసిన సమయంలో వర్షం మళ్లీ జోరుగా కురవడంతో ఇన్నింగ్స్‌కు తెరపడింది.


