'సంజూను కాపాడుతుంది వాళ్లే.. ఇది క‌రెక్ట్ కాదు' | Krishnamachari Srikkanth-Comments-Sanju Samson-Has-Great PR working For Him | Sakshi
Sakshi News home page

'సంజూను కాపాడుతుంది వాళ్లే.. ఇది క‌రెక్ట్ కాదు'

Oct 18 2026 11:11 AM | Updated on Oct 18 2026 11:13 AM

Krishnamachari Srikkanth-Comments-Sanju Samson-Has-Great PR working For Him

Photo Credit: BCCI Twitter

టీమిండియా స్టార్ ఓపెన‌ర్ సంజూ సామ్స‌న్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అత‌డిలో అద్భుత ప్ర‌తిభ దాగున్న‌ప్ప‌టికీ, విఫ‌లమైన ప్ర‌తీసారి సంజూ పీఆర్ విభాగం కాపాడుతూ వ‌స్తోంద‌ని తెలిపాడు. ఈ కార‌ణం చేత‌నే వైభ‌వ్ జ‌ట్టులోకి రాకుండా సంజూ సామ్స‌న్ అడ్డుకుంటున్నాడ‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నాడు. 

విండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన త‌ర్వాత టీమిండియా న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న నేప‌థ్యంలో శ్రీకాంత్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న మాట్లాడుతూ.. ''సంజు సామ్సన్ ఒక సంపూర్ణ మ్యాచ్ విన్నర్, అతను టీ20 ప్రపంచ కప్‌లో ఇది నిరూపించుకున్నాడు. కానీ అతడికి నిలకడ లేకపోవడం పెద్ద సమస్య. 

అతను ఫామ్‌లో ఉన్నప్పుడు అద్భుతంగా రాణిస్తాడన‌డంలో సందేహం లేదు. కానీ త‌క్కువ స్కోర్ల‌కు ఔటైన సంద‌ర్భాల్లో త‌న స్థానాన్ని కాపాడుకోవ‌డానికి రకరకాల మార్గాలను అన్వేషించ‌డం అల‌వాటుగా మార్చుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జ‌రిగిన‌ టీ20 ప్రపంచ కప్ తర్వాత సామ్సన్ చాలా మ్యాచ్‌ల్లో త‌క్కువ స్కోర్ల‌కే వెనుదిరిగాడు.

అభిమానులు అతనిపై విమర్శలు ఎక్కుపెట్టిన‌ప్పుడు, అతని పీఆర్ బృందం బ‌య‌టికి వ‌చ్చి ఆ విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్ట‌డం చేస్తున్నారు. అత‌డి పీఆర్ విభాగం బ‌లంగా ఉండ‌డం చేత‌నే వైభవ్ సూర్యవంశీ స్థానాన్ని అడ్డుకుంటున్నాడనే ప్ర‌చారం పెరిగిపోయింది. అలా కాకుండా జట్టులో వాళ్లిద్ద‌రికీ సమాన అవకాశాలు ఇచ్చి ఉండుంటే, వాళ్ల‌ ప్రదర్శనలపై మనకు మరింత స్పష్టమైన అవగాహన వచ్చేది'' అని పేర్కొన్నాడు.

ఇక సంజూ సామ్స‌న్ టీ20 సిరీస్‌లో త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. సిరీస్‌లో రెండు అర్థ‌సెంచరీలు సాధించిన సామ్స‌న్ 5 ఇన్నింగ్స్‌లు క‌లిపి 168 ప‌రుగులు సాధించాడు. తొలి టీ20లో విఫ‌లం కావ‌డంతో సంజూను ప‌క్క‌న‌బెట్టి వైభ‌వ్‌ను ఆడించాల‌ని డిమాండ్లు వ‌చ్చాయి. 

జ‌ట్టు మేనేజ్‌మెంట్ మాత్రం సామ్స‌న్‌పై న‌మ్మ‌కంతో అత‌డికే ఓటు వేసింది. రెండో టీ20లో 82 ప‌రుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో అల‌రించిన సామ్స‌న్.. ఉప్ప‌ల్‌లో జ‌రిగిన నాలుగో టీ20లో 23 బంతుల్లోనే 56 ప‌రుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. అయితే సామ్స‌న్ రాణించిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓటమిపాల‌వ్వ‌డం గ‌మ‌నార్హం.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement