Photo Credit: Twitter
వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగించుకున్న టీమిండియా ఐదు రోజుల గ్యాప్‌లోనే న్యూజిలాండ్ టూర్‌కు బయల్దేరి వెళ్లనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో టీమిండియా మొదట ఐదు టీ20లు, ఆ తర్వాత ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు న్యూజిలాండ్‌లోనే ఉండనుంది.
ఈ నేపథ్యంలో భారత స్టార్ ఓపెనర్ సంజూ సామ్సన్.. టీమిండియా బిజీ షెడ్యూల్‌పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. టైట్ షెడ్యూల్ కారణంగా సరైన నిద్ర కూడా పోవడం లేదని వాపోయాడు. ఆసియా గేమ్స్ నుంచి రాగానే విండీస్‌తో టీ20 సిరీస్, అది ముగియగానే మళ్లీ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడాల్సి వస్తోందని, వారి గడ్డపై అడుగుపెట్టాకా కేవలం ఒక్కరోజు మాత్రమే తమకు ప్రాక్టీస్‌కు అవకాశం ఉండడం ఇబ్బంది కలిగించే అంశమని సామ్సన్ తెలిపాడు.
ఐదో టీ20 మ్యాచ్ అనంతరం సంజూ సామ్సన్ మాట్లాడుతూ.. ''నిజం చెప్పాలంటే ఇటీవలే మా షెడ్యూల్ తీరు చూస్తుంటే, ప్రాక్టీస్ చేయడానికి సరైన సమయమే దొరకడం లేదనిపిస్తోంది. జపాన్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచి భారత్‌లో అడుగుపెట్టిన మూడు రోజులకే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు న్యూజిలాండ్‌కు బయల్దేరి వెళ్తున్నాం.
మేము 20వ తేదీన న్యూజిలాండ్‌కు చేరుకుంటాము, 21వ తేదీన ప్రాక్టీస్ చేస్తాము.. 22వ తేదీన తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నాం. కాబట్టి, మాకు అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు సమయం లేదు. ప్రాక్టీస్‌కు ఒకేరోజు సమయం మాత్రమే ఉండడంతో, విండీస్‌తో సిరీస్‌లో నేర్చుకున్న పాఠాలను కివీస్ గడ్డపై కొనసాగించాలనుకుంటున్నాం.
అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది. అయితే విండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ రద్దు కావడంతో మాకు కాస్త విశ్రాంతి దొరికినట్లయింది.’’ అని చెప్పుకొచ్చాడు. భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.
శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 వర్షంతో రద్దు కావడం వల్ల ఇరుజట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఇక సంజూ సామ్సన్ టీ20 సిరీస్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. సిరీస్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన సామ్సన్ 5 ఇన్నింగ్స్‌లు కలిపి 168 పరుగులు సాధించాడు.
తొలి టీ20లో విఫలం కావడంతో సంజూను పక్కనబెట్టి వైభవ్‌ను ఆడించాలని డిమాండ్లు వచ్చాయి. అయితే జట్టు మేనేజ్మెంట్ మాత్రం సామ్సన్‌పై నమ్మకంతో అతడికే ఓటు వేసింది. రెండో టీ20లో 82 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించిన సామ్సన్.. ఉప్పల్‌లో జరిగిన నాలుగో టీ20లో 23 బంతుల్లోనే 56 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. అయితే సామ్సన్ రాణించిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓటమిపాలవ్వడం గమనార్హం.
🔴NO TIME TO PREPARE, JUST PLAY - SANJU UNHAPPY ON BCCI HECTIC SCHEDULE 🤦 🎙️: Sanju Samson says that nowadays, the busy cricket schedule leaves very little time for practice & preparation. - India will arrive on the 20th, practise on the 21st and play on the 22nd. With changing weather and pitch conditions in NZ, players have to rely on their experience, adapt quickly & make the most of the limited practice time.
— Sam (@cricsam02) October 17, 2026
ఇదీ చదవండి:


