పాకిస్తాన్‌తో ఫైనల్‌.. శ్రీలంక 325 పరుగుల భారీ స్కోర్‌ | Tri-Series Final: Kamindu Mendis Blistering 131 Powers Sri Lanka to 325-8 vs Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌తో ఫైనల్‌.. శ్రీలంక 325 పరుగుల భారీ స్కోర్‌

Oct 31 2026 6:46 PM | Updated on Oct 31 2026 6:53 PM

Tri-Series Final: Kamindu Mendis Blistering 131 Powers Sri Lanka to 325-8 vs Pakistan

PC: X

ల‌హోర్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న ట్రైసిరీస్ ఫైన‌ల్లో శ్రీలంక బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 325 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. లంక బ్యాట‌ర్ల‌లో కమిందు మెండిస్‌ భారీ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 128 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు.

అతడితో పవన్ రత్నాయకే(65 బంతుల్లో 77) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ షా అఫ్రిది, నసీం షా, సల్మాన్‌ అఘా, హారీస్‌ రవూఫ్‌ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. భారీ లక్ష్య చేధనలో పాకిస్తాన్ తడబడుతున్నారు. కేవలం 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మరోసారి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

తుది జట్లు
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, కమిందు మెండిస్, కుసల్ మెండిస్(కెప్టెన్‌), పవన్ రత్నాయకే, సహన్ అరాచ్చిగే, జనిత్ లియానాగే, దసున్ షనక, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక

పాకిస్థాన్: ఫఖర్ జమాన్, మాజ్ సదాకత్, బాబర్ ఆజం, సాద్ బేగ్(వికెట్ కీపర్‌), సల్మాన్ అఘా, హసన్ నవాజ్, అరాఫత్ మిన్హాస్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది(కెప్టెన్‌), నసీమ్ షా, హరీస్ రవూఫ్
చదవండి: సౌతాఫ్రికా పేసర్‌ వరల్డ్‌ రికార్డు.. సరికొత్త చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement