కోహ్లి రికార్డును ట‌చ్ చేయ‌లేక‌పోయిన బాబ‌ర్ ఆజం | Babar Azam Achieves Major Milestone-But-Fails-To-Touch-Kohli Record | Sakshi
Sakshi News home page

కోహ్లి రికార్డును ట‌చ్ చేయ‌లేక‌పోయిన బాబ‌ర్ ఆజం

Oct 19 2026 7:40 AM | Updated on Oct 19 2026 7:45 AM

Babar Azam Achieves Major Milestone-But-Fails-To-Touch-Kohli Record

Photo Credit: Twitter

శ్రీలంక‌, ఇంగ్లండ్‌ల‌తో జ‌రుగుతున్న వ‌న్డే  ట్రై సిరీస్‌లో పాకిస్తాన్ సీనియ‌ర్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజం సూప‌ర్ ఫామ్‌తో అద‌ర‌గొడుతున్నాడు. ఆదివారం శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డేలో 57 బంతుల్లో 45 ప‌రుగులు చేసిన బాబ‌ర్ ఆజం.. అంతర్జాతీయ క్రికెట్‌లో 16000 పరుగులు (అన్ని ఫార్మాట్లు) పూర్తి చేసుకున్న ఐదో పాకిస్తాన్‌ క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్, జావెద్ మియాందాద్ పాక్‌ తరఫున ఈ ఘనత సాధించారు.

కోహ్లికి ఆమడదూరంలో..
బాబర్ అన్ని ఫార్మాట్లు క‌లిపి 16వేల ప‌రుగులు పూర్తి చేసేందుకు 399 వ అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు అవ‌స‌ర‌మయ్యాయి. అయితే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రికార్డును మాత్రం బాబ‌ర్ ట‌చ్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్య‌డు. అంత‌ర్జాతీయంగా 16వేల ప‌రుగులు పూర్తయ్యేందుకు కోహ్లి 350 ఇన్నింగ్స్‌లు మాత్ర‌మే తీసుకున్నాడు. ఈ రికార్డు ఇప్ప‌టికీ చెక్కుచెద‌ర‌లేదు. దాదాపు 49 ఇన్నింగ్స్‌ల వ్య‌త్యాసంతో బాబ‌ర్ ఆజం.. కోహ్లి రికార్డుకు ఆమ‌డ‌దూరంలో నిలిచిపోయాడు.

అయితే పాకిస్తాన్ త‌ర‌ఫున మాత్రం 16వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న మూడో ఫాస్టెస్ట్ బ్యాట‌ర్‌గా బాబ‌ర్ ఆజం నిలిచాడు. బాబ‌ర్ కంటే ముందు మ‌హ్మ‌ద్ యూస‌ఫ్ (388 ఇన్నింగ్స్‌లు), జావెద్ మియాందాద్ (398 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇంజ‌మామ్ ఉల్ హ‌క్‌, యూనిస్ ఖాన్‌లు కూడా 16వేల ప‌రుగుల మార్క్‌ను దాటారు. 

ఇక పాక్ త‌ర‌ఫున‌ 16వేల ప‌రుగులు పూర్తి చేసిన ఐదో బ్యాట‌ర్‌గా, ఓవ‌రాల్‌గా 35వ బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఇక అంత‌ర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు క‌లిపి 355 మ్యాచ్‌లు ఆడిన బాబ‌ర్ ఆజం ఖాతాలో 32 సెంచరీలు, 111 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 16 వేల పరుగులు పూర్తి చేసిన 35వ ఆటగాడిగా బాబర్‌ రికార్డుల్లోకెక్కాడు.

బోణీ కొట్టిన పాకిస్తాన్‌..
ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు పాల్గొంటున్న ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆదివారం ఆతిథ్య పాకిస్తాన్‌ 37 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సల్మాన్‌ ఆఘా (90 బంతుల్లో 107; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో విజృంభించాడు.

బాబర్‌ ఆజమ్‌ (45; 6 ఫోర్లు), సాద్‌ బైగ్‌ (39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హసన్‌ నవాజ్‌ (37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. లంక బౌలర్లలో ఇషాన్‌ మలింగ 4, అషిత ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 48.1 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది.

పవన్‌ రత్నాయకే (79; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జనిత్‌ లియానగె (60; 5 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. పాకిస్తాన్‌ బౌలర్లలో కెప్టెన్‌ షాహీన్‌ షా అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా... నసీమ్‌ షా, హరీస్‌ రవూఫ్, ఫహీమ్‌ అష్రఫ్‌ తలా రెండు వికెట్లు ఖతాలో వేసుకున్నారు. సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌తో పాకిస్తాన్‌ తలపడనుంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement