హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే మొనగాడు లేడు: సునీల్ గావస్కర్ | India should stop seeking replacement for irreplaceable Hardik Pandya, says Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే మొనగాడు లేడు: సునీల్ గావస్కర్

Oct 19 2026 4:09 AM | Updated on Oct 19 2026 4:09 AM

India should stop seeking replacement for irreplaceable Hardik Pandya, says Sunil Gavaskar

పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ప్రత్యామ్నాయం వెతికే క్రమంలో భారత జట్టు కొనిసార్లు అతిగా ఆలోచిస్తోందని మాజీ కెప్టెన్ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. దానికి బదులు విభిన్న పాత్రలు పోషించగల ఆటగాళ్లపై దృష్టి సారించడం మంచిదని సన్నీ సూచించాడు. ప్రస్తుతం టీమిండియాలో బౌలింగ్‌ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.

వెస్టిండీస్‌తో చివరి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2–2తో  సమంగా ముగిసింది. ఈ నేపథ్యంలో గావస్కర్‌ మాట్లాడుతూ... "హార్దిక్‌ పాండ్యా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అతడి స్థాయి ఆటగాడు దొరకకపోతే, అందుకు కాస్త భిన్నమైన పాత్ర పోషించగల మరో ఆటగాడిని ఎంచుకోవాలి. బ్యాటింగ్‌ లైనప్‌ను పెంచుకునేందుకు బౌలింగ్‌ బలాన్ని తగ్గించుకోవడం సరైన వ్యూహం అనిపించుకోదు.

టీమిండియా కనీసం నలుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లతో ఆడాలి. ఐదో, ఆరో బౌలర్‌ బాధ్యతలు నిర్వర్తించే ప్లేయర్‌ అటు బ్యాటింగ్‌లోనూ ఒక చేయి వేయగలిగిన వాడై ఉండాలి’ అని వెల్లడించాడు. విభిన్న పాత్రను పోషించగల ఆటగాడిగా నమన్ దీర్‌ను పేర్కొంటూ... అతడు అటు బ్యాట్‌తో, ఇటు బంతితో జట్టుకు తనదైన సహకారం అందిస్తున్నాడని సన్నీ అన్నాడు. ‘నమన్‌ ధీర్‌ ఆ పని బాగా చేస్తున్నాడు. అతను తన ఓవర్లను బాగా వేయడంతో పాటు... అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు.

వర్షం కారణంగా రద్దయిన 9 ఓవర్ల మ్యాచ్‌లో ధాటిగా ఆడాల్సిన అవసరమున్న సమయంలో క్రీజులోకి వచ్చి 6 బంతుల్లోనే అజేయంగా 24 పరుగులు చేశాడు. అదనపు బ్యాటర్‌ కోసం బౌలింగ్‌ వనరులను తగ్గించుకుంటే ఫలితాలు తేడా వస్తాయి’ అని గావస్కర్‌ వివరించాడు. జట్టులో ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల బ్యాటర్‌లు ఉండటం మంచిదే కానీ... అదే సమయంలో జట్టు బౌలింగ్‌ కూడా పటిష్టంగా ఉండాల్సిన అవసరముందని... లేకుండా ఎంత భారీ స్కోరు చేసినా మ్యాచ్‌లు గెలవలేమని సన్నీ హెచ్చరించాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement