source: X
యూఏఈలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ (294) చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (102) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (90) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.
మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (25), హష్మతుల్లా షాహిది (28).. కెప్టెన్ రహ్మత్ షా (7), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (8), మొహమ్మద్ నబీ (9), రషీద్ ఖాన్ (8), ఘజన్‌ఫర్ (6), జియా ఉర్ రహ్మాన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, మసుకు తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ టోర్నీలో జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే బంగ్లాదేశ్‌పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌కు జరిమానా
తొలి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో 99 పరుగుల తేడాతో ఓడిపోయిన బంగ్లాదేశ్‌కు ఐసీసీ మరో షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించింది.
ఇదీ చదవండి: డబ్ల్యూపీఎల్ 2027 మినీ వేలం తేదీ ఖరారు


