సెంచరీతో కదంతొక్కిన సర్ఫరాజ్ ఖాన్ | Ranji Trophy 2026: Sarfaraz ton puts Mumbai in control against Himachal Pradesh | Sakshi
Sakshi News home page

సెంచరీతో కదంతొక్కిన సర్ఫరాజ్ ఖాన్

Oct 19 2026 7:09 PM | Updated on Oct 19 2026 7:33 PM

Ranji Trophy 2026: Sarfaraz ton puts Mumbai in control against Himachal Pradesh

source: X

రంజీ ట్రోఫీ 2026-27లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో కదంతొక్కాడు. 213 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 139 పరుగులతో అజేయంగా నిలిచాడు. సర్ఫరాజ్‌ సెంచరీతో సత్తా చాటడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. 

రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసి, 258 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సర్ఫరాజ్‌కు జతగా ఆకాశ్‌ ఆనంద్‌ (58) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ (87) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. 

సర్ఫరాజ్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ (57) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు అంగ్‌కృస్‌ రఘువంశీ 20, దివ్యాంశ్‌ సక్సేనా 9 పరుగులు చేసి ఔటయ్యారు. హిమాచల్‌ బౌలర్లలో అభిషేక్‌ కుమార్‌, జితేందర్‌ రానా తలో 2 వికెట్ల తీశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హిమాచల్‌ ప్రదేశ్‌, తుషార్‌ దేశ్‌పాండే (4-46), సిల్వెస్టర్‌ డిసౌజా (2-43), మోహిత్‌ అవస్తి (1-37), తనుశ్‌ కోటియన్‌ (1-11) ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. వారి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ పుక్‌రాజ్‌ మన్‌ (35), వైభవ్‌ కల్టా (33), ఆకాశ్‌ వశిష్ట్‌ (39), ఇన్నేశ్‌ మహాజన్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముగ్గురు డకౌట్లు కాగా.. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాకపోయినా..!
న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టులో చోటు దక్కని సర్ఫరాజ్, రంజీ ట్రోఫీలో శతకంతో సత్తా చాటాడు. ఈ సెంచరీతో అతడు భారత సెలెక్టర్లకు సవాల్‌ విసిరాడు. సర్ఫరాజ్‌ గతకొంతకాలంగా అద్బుతంగా రాణిస్తున్నా, టీమిండియా సమీరణల కారణంగా అతడికి జట్టులో చోటు దక్కడం లేదు. సర్ఫరాజ్‌కు 65 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో ఇది 18వ శతకం. 

ఇదీ చదవండి: రంజీ ట్రోఫీలో సంచలనం.. 400 పరుగులు చేసిన అనామక ప్లేయర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement