పాటిదార్‌ మెరుపు శతకం | RAJAT PATIDAR SMASHED HUNDRED FROM JUST 114 BALLS IN RANJI TROPHY | Sakshi
Sakshi News home page

పాటిదార్‌ మెరుపు శతకం

Oct 19 2026 7:32 PM | Updated on Oct 19 2026 7:50 PM

RAJAT PATIDAR SMASHED HUNDRED FROM JUST 114 BALLS IN RANJI TROPHY

source: IPL X

రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌ను మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ ఘనంగా ప్రారంభించాడు. పుదుచ్చేరితో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లో మెరుపు శతకంతో ఆకట్టుకున్నాడు. 116 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో 107 పరుగులతో అజేయంగా ఉన్నాడు. పాటిదార్‌ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్‌ పటిష్ట స్థితిలో ఉంది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసి, కీలకమైన 125 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. పాటిదార్‌కు జతగా అథర్వ్‌ మహాజన్‌ (32) క్రీజ్‌లో ఉన్నాడు. వారి ఇన్నింగ్స్‌లో చంచల్‌ రాథోడ్‌ (78), శుభమ్‌ శర్మ (78) అర్ద సెంచరీలతో రాణించగా..  హర్ష్‌ గావ్లి (10), యశ్‌ దూబే (4), కుమార్‌ కార్తికేయ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పుదుచ్చేరి బౌలర్లలో గౌరవ్‌ యాదవ్‌ 3 వికెట్లతో రాణించగా.. సాగర్‌ ఉదేశి, అంకిత్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు.

అ​ంతకుముందు పుదుచ్చేరి 177 పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్‌ బౌలర్లు తలో చేయి వేసి పుదుచ్చేరి ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. రవి కిరణ్‌ 3, ఆర్యన్‌ పాండే, కుమార్‌ కార్తికేయ, సరాన్ష్‌ జైన్‌ తలో 2, అర్షద్‌ ఖాన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. పుదుచ్చేరి ఇన్నింగ్స్‌లో రితేశ్‌ గుడ్జ్‌ (53) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ప్లేయర్లలో కనీసం ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును తాకలేకపోయారు. 

ఇదీ చదవండి: సెంచరీతో కదంతొక్కిన సర్ఫరాజ్ ఖాన్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement