గాడిదకు నర్సింగ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ | Donkey gets nursing registration certificate online in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

గాడిదకు నర్సింగ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌

Nov 28 2026 6:29 AM | Updated on Nov 28 2026 6:29 AM

Donkey gets nursing registration certificate online in Madhya Pradesh

మధ్యప్రదేశ్‌ నర్సింగ్‌ రిజిస్ట్రేషన్‌ కౌన్సిల్‌ నిర్వాకం  

బయటపెట్టిన ఎన్‌ఎస్‌యూఐ నేత రవి పర్మార్‌ 

భోపాల్‌: సిరంజీకి, స్టెతస్కోప్‌కు మధ్య తేడా తెలియని ఒక గాడిదకు ఏకంగా నర్సింగ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ లభించింది. మధ్యప్రదేశ్‌లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. ‘డంకీ ఎంపీఎన్‌ఆర్‌సీ’ పేరిట ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రం జారీ చేసిన ఘటనపై భోపాల్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించిన నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఫిర్యాదుదారుడు రవి పర్మార్‌ వాంగ్మూలాన్ని శుక్రవారం నమోదు చేశారు. 

ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, డిజిటల్‌ సాక్ష్యాలను కూడా ఆయన సమర్పించారు. మధ్యప్రదేశ్‌ నర్సింగ్‌ రిజిస్ట్రేషన్‌ కౌన్సిల్‌(ఎంపీఎన్‌ఆర్‌సీ) ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను పరీక్షించేందుకు రవి పర్మార్‌ ‘డంకీ ఎంపీఎన్‌ఆర్‌సీ’ పేరుతో దరఖాస్తు సమర్పించారు. అందులో తండ్రి పేరు ‘డంకీ ఫాదర్‌’, తల్లి పేరు ‘డంకీ మదర్‌’, కులం ‘యానిమల్‌’ అని పేర్కొన్నారు. ఈ పోర్టల్‌ రవి పర్మార్‌ దరఖాస్తును స్వీకరించి, రూ.2,050 చెల్లింపును ప్రాసెస్‌ చేసి, సెపె్టంబర్‌ 25న డిజిటల్‌ నర్సింగ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

 ఈ ధ్రువపత్రం 2031 సెప్టెంబర్‌ 24వ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది. పోర్టల్‌లోని లోపాలను బయటపెట్టిన తర్వాత, అక్టోబర్‌ 1న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పర్మార్‌ తెలిపారు. ఎవరికీ నకిలీ రిజిస్ట్రేషన్‌ ఇప్పించాలనే ఉద్దేశం తనకు లేదని, కేవలం వ్యవస్థలోని లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఎంపీఎన్‌ఆర్‌సీకి నోటీసు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ప్రక్రియపై సాంకేతిక పరిశీలన జరపాలని, అలాగే కౌన్సిల్‌ అధికారులు, ఉద్యోగులు, పోర్టల్‌ను నిర్వహిస్తున్న సాంకేతిక సంస్థల పాత్రలపై విచారణ చేపట్టాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్‌ చేసంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement