నంబర్‌ ప్లేట్‌ కన్పించకుండా చేస్తే భారీ జరిమానా | Penalty of five times user fee for deliberately masking vehicle number plates | Sakshi
Sakshi News home page

నంబర్‌ ప్లేట్‌ కన్పించకుండా చేస్తే భారీ జరిమానా

Nov 28 2026 6:08 AM | Updated on Nov 28 2026 6:08 AM

Penalty of five times user fee for deliberately masking vehicle number plates

ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్‌పై వెళ్లే వాహనదారులకు ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరిక 

న్యూఢిల్లీ: మల్టీ లేన్‌ ఫ్రీ ఫ్లో(ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్‌)టోల్‌ ప్లాజాల వద్ద చార్జీలను తప్పించుకునేందుకు నంబర్‌ ప్లేట్లను ఉద్దేశ పూర్వకంగా కన్పించకుండా చేసే వాహనదారుల నుంచి యూజర్‌ ఫీజుకు ఐదు రెట్ల జరిమానా విధిస్తామని జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) హెచ్చరించింది. వాహనం నంబర్‌ ప్లేట్‌కు మాస్క్‌ కట్టినా, అంకెలను కనిపించకుండా చేసినా, ఫాస్టాగ్‌ను అతికించకున్నా యూజర్‌ ఫీజుతోపాటు అంతకు ఐదు రెట్ల మొత్తాన్ని వసూలు చేస్తామని, ఈ సొమ్ము నేరుగా ఎన్‌హెచ్‌ఏఐ ఖాతాలో జమవుతుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ వివరించింది. 

వాహనదారు టూల్‌ రుసుమును ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయిన చోట మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఫాస్టాగ్‌ గుర్తించని సందర్భాల్లోనూ వాహనం రిజి్రస్టేషన్‌ నంబర్‌కు ఇదే నిబంధన అమలవుతుందని పేర్కొంది. ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్‌ విధానం బారియర్‌–లెస్‌ ఎల్రక్టానిక్‌ టోలింగ్‌ వ్యవస్థ. ఓవర్‌హెడ్‌ గాంట్రీలపై అమర్చిన ఫాస్టాగ్‌ రీడర్లు, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగి్నషన్‌ కెమెరాలు వాహనాలను గుర్తించి, టోల్‌ రుసుమును ఆటోమేటిక్‌గా మినహాయించుకుంటాయి. ఈ వెసులుబాటు ఉన్న చోట వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement