టీఎంసీ రెబెల్స్‌కు కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ | Calcutta High Court Quashes Ritabrata Banerjee LoP Appointment | Sakshi
Sakshi News home page

టీఎంసీ రెబెల్స్‌కు కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ

Nov 28 2026 6:19 AM | Updated on Nov 28 2026 6:19 AM

Calcutta High Court Quashes Ritabrata Banerjee LoP Appointment

ఎల్‌వోపీ, చీప్‌ విప్‌ల నియామకాలు చెల్లవంటూ తీర్పు

కోల్‌కతా: సీనియర్‌ నేత రితబ్రత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ తిరుగుబాటు వర్గానికి కలకత్తా హైకోర్టులో చుక్కెదురైంది. బెంగాల్‌ అసెంబ్లీలో శాసనసభా పక్ష నేత(ఎల్‌వోపీ)గా రితబ్రత బెనర్జీ, చీఫ్‌ విప్‌గా అఖ్రుజ్జమాన్‌ల నియామకాలను హైకోర్టు కొట్టివేసింది. తిరుగుబాటు వర్గం చేపట్టిన ఈ నియామకాలు చట్ట ప్రకారం చెల్లవంటూ జస్టిస్‌ కృష్ణా రావు శుక్రవారం తీర్పు వెలువరించారు.

ఎల్‌వోపీ, చీఫ్‌ విప్‌ల నియామకాలను చట్ట ప్రకారం తిరిగి చేపట్టే విషయం పది రోజుల్లోగా తేల్చాలంటూ స్పీకర్‌ రతీంద్ర బోస్‌ను ఆయన ఆదేశించారు. ఈ రెండు కీలక నియామకాలను సవాల్‌ చేస్తూ మమత వర్గానికి చెందిన టీఎంసీ నేత శోభన్‌దేవ్‌ చటోపాధ్యాయ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ కృష్ణారావు ఈ మేరకు తీర్పు వెలువరించారు. 

మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీపై తిరుగుబాటు ప్రకటించిన టీఎంసీ రెబెల్‌ వర్గం జూన్‌ 3వ తేదీన ఎల్‌వోపీ, చీఫ్‌ విప్‌ల నియామకాలను ప్రకటించుకుంది. ఎన్నికల్లో గెలిచిన టీఎంసీకి చెందిన మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకుగాను తమ పక్షాన 58 మంది ఉన్నారంటూ రితబ్రత బెనర్జీ వర్గం ప్రకటించుకుంది. తాజా తీర్పు, మమతా బెనర్జీకి భారీ ఊరట లభించినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement