నేడు ఈసీతో టీఎంసీ ఎంపీల భేటీలు?  | TMC leaders meet Election Commission on 27 nov 2026 | Sakshi
Sakshi News home page

నేడు ఈసీతో టీఎంసీ ఎంపీల భేటీలు? 

Nov 27 2026 6:25 AM | Updated on Nov 27 2026 6:25 AM

TMC leaders meet Election Commission on 27 nov 2026

వేర్వేరుగా అపాయింట్‌మెంట్‌ కోరిన రెండు వర్గాలు 

చర్చించే అంశాలపై సర్వత్రా ఆసక్తి 

సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లోని రెండు వర్గాల ఎంపీలు శుక్రవారం ఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్లను విడివిడిగా కలవనున్నారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత నియామకాలు, రాబోయే ఎన్నికల వ్యూహాల విషయంలో ఒక వర్గం ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

పార్లమెంట్‌ వేదికగా రాష్ట్ర స్థాయి సమావేశాల్లో రెండు గ్రూపుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. ఒక వర్గం పార్టీ అధికారిక లైన్‌కు కట్టుబడి ఉండగా, మరో వర్గం స్వతంత్రంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు ఈసీతో వేర్వేరుగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం గమనార్హం. ముందుగా మమత వర్గం, ఆ తర్వాత మరో వర్గం ఎంపీలు ఎన్నికల కమిషనర్లను కలుస్తారు. బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ, కేంద్ర బలగాల మొహరింపు, రాబోయే ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల నిర్వహణలో కేంద్రం జోక్యంపై వీరు ఈసీకి వినతిపత్రం సమరి్పంచే అవకాశం ఉంది. 

పార్టీకి తామే అసలైన అధికారిక ప్రతినిధులమంటూ వాదనలు వినిపిస్తారని భావిస్తున్నారు. రెండో వర్గం ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న ఎన్నికల పరమైన ఇబ్బందులు, స్థానిక యంత్రాంగం తీరుపై ఫిర్యాదు చేసే అవకాశముంది. పార్టీ అంతర్గత వ్యవహారాలు, తమ గుర్తింపునకు సంబంధించిన కీలక అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తారని విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో చీలిక, అంతర్గత విభేదాల విషయం ప్రస్తావనకు వచ్చిన పక్షంలో అది బెంగాల్‌ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement