జనగణనకు ప్రామాణికాలేంటో తెలపండి  | SC asks Centre to submit census SOPs on caste data collection | Sakshi
Sakshi News home page

జనగణనకు ప్రామాణికాలేంటో తెలపండి 

Nov 27 2026 6:11 AM | Updated on Nov 27 2026 6:11 AM

SC asks Centre to submit census SOPs on caste data collection

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న జనగణనలో కుల సంబంధిత సమాచారాన్ని నమోదు చేసేందుకు, ధ్రువీకరించేందుకు అనుసరిస్తున్న ప్రామాణిక విధానాల         (ఎస్‌వోపీ)ను తెలపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వారంలోగా తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని, డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ను ఆదేశించింది. 

వ్యక్తిగత గోప్యతను కాపాడుతూనే కుల వివరాల సేకరణ, ధ్రువీకరణలకు పారదర్శక విధానాలను అనుసరించేలా కేంద్రాన్ని ఆదేశించాలని, ఈ సమాచారాన్ని కుల ధ్రువీకరణకు ప్రాతిపదికగా తీసుకోరాదంటూ ఆకాశ్‌ గోయెల్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి పైవిధంగా ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement