ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 19,934 కోట్ల రూపాయల నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్. కన్‌స్ట్రక్షన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టం పథకానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది.
ఇతర నిర్ణయాలు
తమిళనాడులోని కామరాజా పోర్టులో రెండవ కంటైనర్ టర్మినల్ ఏర్పాటుకు 4,288 కోట్ల రూపాయలు కేటాయింపు
అస్సాంలోని సిల్చారు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు 2014 కోట్ల రూపాయలు కేటాయింపు
16వ ఆర్థిక సంఘం కాలపరిమితి అయిన 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు “తపాలా కార్యకలాపాలు (Postal Operations)” అనే కేంద్ర ప్రాయోజిత పథకాన్ని కొనసాగించేందుకు ఆమోదం
పోస్టల్ ఆపరేషన్ పథకం కోసం ఒక 11,41 కోట్లు కేటాయింపు
పోస్టల్ శాఖలో ఎస్టేట్స్ మేనేజ్మెంట్ పథకం కోసం 1491 కోట్ల రూపాయలు కేటాయింపు
దేశవ్యాప్తంగా తపాలా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, లాజిస్టిక్స్, ఈ-కామర్స్ డిజిటల్ సేవల పంపిణీకి పెరుగుతున్న అవసరాలను తీర్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా నెట్‌వర్క్‌లలో ఒకటైన భారత తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 1.65 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో 1,49,655 పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా మారుమూల సేవలు సరిగా అందని ప్రాంతాల్లో ప్రజలకు ఉత్తరాల పంపిణీ, పార్శిళ్ల సేవలు, బ్యాంకింగ్, బీమా తదితర పౌర సేవలను అందించడంలో ఇండియా పోస్ట్ కీలక పాత్ర పోషిస్తోంది.
సాధారణ తపాలా సేవలతో పాటు, ఇండియా పోస్ట్ అనేక ప్రజోపయోగ సేవలను కూడా అందిస్తోంది. వాటిలో ముఖ్యమైనవి:
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (POSB)
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI)
ఆధార్ నమోదు వివరాల నవీకరణ
పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు
కేవైసీ (KYC) ధ్రువీకరణ సేవలు
డాక్‌ఘర్ నిర్యాత్ కేంద్రాల (DNKs) ద్వారా గ్రామీణ కళాకారులకు చేతివృత్తుల వారికి సహకారం
ఈ పథకం ద్వారా తపాలా మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, చివరి మైలు వరకు సేవల పంపిణీని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం, ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అలాగే, ఈ పథకం డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వికసిత భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది.
ఈ పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్ల పాటు అమలు చేయనున్నారు.


