SMAT 2026: చ‌రిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ ఓపెన‌ర్‌ | Priyansh Arya Registers-Highest T20-Individual Score-Indian man-SMAT 2026 | Sakshi
Sakshi News home page

SMAT 2026: చ‌రిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ ఓపెన‌ర్‌

Nov 24 2026 11:19 AM | Updated on Nov 24 2026 11:37 AM

Priyansh Arya Registers-Highest T20-Individual Score-Indian man-SMAT 2026

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా త‌మిళ‌నాడుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్, పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించాడు. 68 బంతుల్లోనే 7 ఫోర్లు, 19 సిక్స‌ర్ల సాయంతో 181 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. కేవ‌లం బౌండ‌రీలు, సిక్స‌ర్ల ద్వారానే ప్రియాన్ష్ ఆర్య 150 ప‌రుగులు రాబ‌ట్ట‌డం విశేషం. 

18 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ప్రియాన్ష్ ఆర్య 36 బంతుల్లో వంద ప‌రుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఆ త‌ర్వాత మరో 32 బంతుల్లో 81 ప‌రుగులు సాధించ‌డం విశేషం. అత‌డి విధ్వంసంతో ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 275 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. మిగ‌తా బ్యాట‌ర్ల‌లో అనూజ్ రావ‌త్ (22 బంతుల్లో 29 నాటౌట్‌), నితీశ్‌రానా (18) రాణించారు. త‌మిళ‌నాడు బౌల‌ర్ల‌లో షారుక్‌ఖాన్‌, మ‌నిమ‌ర‌న్ సిద్దార్థ్, రాజ్‌కుమార్‌, గుర్జ‌ప్‌నీత్ సింగ్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

ఇక ప్రియ‌న్ష్ ఆర్య 181 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లోనే స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పాడు. ఏడు ప‌రుగుల తేడాతో ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లుకొట్టే అవ‌కాశం కోల్పోయిన‌ప్ప‌టికీ, ప్రియాన్ష్ ఆర్య చాలా రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

ప్రియాన్ష్‌ సాధించిన రికార్డులు..
👉టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన క్రికెట‌ర్‌గా ప్రియాన్ష్ ఆర్య రికార్డుల‌కెక్కాడు. ఇక‌ కేఎల్ రాహుల్ 2026 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 152 ప‌రుగులు చేయ‌డం ఇప్ప‌టివ‌ర‌కు అత్యుత్త‌మంగా ఉండేది. తాజాగా ప్రియాన్ష్ ఆర్య ఆ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు.

👉టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌ర‌ఫున 150 ప్ల‌స్ స్కోరు సాధించిన మూడో బ్యాట‌ర్‌గా ప్రియాన్ష్ ఆర్య నిలిచాడు. గ‌తంలో తిల‌క్ వ‌ర్మ (151 నాటౌట్‌, 2024లో మేఘాల‌యాపై), కేఎల్ రాహుల్ (152 ప‌రుగులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

👉ఓవ‌రాల్‌గా పురుషుల టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన క్రికెట‌ర్ల జాబితాలో ప్రియాన్ష్ ఆర్య రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. తొలి స్థానంలో లుహాన్ డి ప్రిటోరియ‌స్ (188 నాటౌట్‌) ఉండ‌గా, క్రిస్ గేల్ (175 నాటౌట్, ఆర్సీబీ త‌ర‌ఫున‌) మూడో స్థానంలో ఉన్నాడు. కేవలం ఏడు పరుగుల తేడాతో ప్రపంచ రికార్డు మిస్‌ చేసుకున్నాడు.

👉ఇక స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో ప్రియాన్ష్ ఆర్య (181 ప‌రుగులు నాటౌట్‌)దే అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు. గ‌తంలో తిల‌క్ వ‌ర్మ పేరిట ఈ రికార్డు ఉండేది. 2024లో మేఘాల‌యాతో మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ 67 బంతుల్లో 151 ప‌రుగులు చేశాడు. మూడో స్థానంలో అభిషేక్ శ‌ర్మ (52 బంతుల్లో 148 ప‌రుగులు) ఉన్నాడు.

👉దీంతో పాటు కెప్టెన్‌గా టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు బాదిన క్రికెట‌ర్‌గా ప్రియాన్ష్ ఆర్య నిలిచాడు. మ్యాచ్‌లో మొత్తం 19 సిక్స‌ర్లు కొట్టిన ప్రియాన్ష్ ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన భార‌తీయ క్రికెట‌ర్‌గా సంయుక్తంగా ఉన్నాడు.

👉టీ20 క్రికెట్‌లో కేవ‌లం ఫోర్లు, సిక్స‌ర్ల ద్వారా 150 ప‌రుగులు సాధించిన రెండో క్రికెట‌ర్‌గా ప్రియాన్ష్ ఆర్య నిలిచాడు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement