సల్మాన్‌ సూపర్‌ సెంచరీ.. శ్రీలంకపై పాక్‌ ఘన విజయం | Salman Agha ton powers Pakistan to 37-run win over Sri Lanka in tri-series opener | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ సూపర్‌ సెంచరీ.. శ్రీలంకపై పాక్‌ ఘన విజయం

Oct 19 2026 2:00 AM | Updated on Oct 19 2026 2:11 AM

Salman Agha ton powers Pakistan to 37-run win over Sri Lanka in tri-series opener

రావల్పిండి: సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు పాల్గొంటున్న ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆదివారం ఆతిథ్య పాకిస్తాన్‌ 37 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సల్మాన్‌ ఆఘా (90 బంతుల్లో 107; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో విజృంభించాడు.

బాబర్‌ ఆజమ్‌ (45; 6 ఫోర్లు), సాద్‌ బైగ్‌ (39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హసన్‌ నవాజ్‌ (37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. లంక బౌలర్లలో ఇషాన్‌ మలింగ 4, అషిత ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 48.1 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది.

పవన్‌ రత్నాయకే (79; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జనిత్‌ లియానగె (60; 5 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. పాకిస్తాన్‌ బౌలర్లలో కెప్టెన్‌ షాహీన్‌ షా అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా... నసీమ్‌ షా, హరీస్‌ రవూఫ్, ఫహీమ్‌ అష్రఫ్‌ తలా రెండు వికెట్లు ఖతాలో వేసుకున్నారు. సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌తో పాకిస్తాన్‌ తలపడనుంది.
చదవండి: IND vs ZIM: టీమిండియా ఓపెనర్‌ ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement