రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ విజయం దిశగా సాగుతోంది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం కేవలం 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
క్రీజులో మిలన్ ప్రియనాథ్ రత్నాయకే(60), అషితా ఫెర్నాండో(2) ఉన్నారు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ అబ్బాస్, రజావుల్లా తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ అబ్బాస్, అమీర్ జమాల్, రజావుల్లా తలా మూడు వికెట్లు చొప్పున పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించారు.
ఆ తర్వాత ఆతిథ్య పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసి ఆలౌటైంది. ఘాజీ ఘోరీ (54), అజాన్ అవైస్ (47), తయ్యబ్ ఆరిఫ్ (46), రజావుల్లా (42) రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌కు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారీ వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక బ్యాటర్లు పట్టుదలతో ఆడి 300 పరుగుల మార్కును దాటారు. కానీ 82 పరుగుల ఆధిక్యం మాత్రమే ఉండడంతో పాకిస్తాన్ గెలుపు ఖాయమైందేనే చెప్పాలి.


