సౌతాఫ్రికా ప్లేయర్‌ సరికొత్త ప్రపంచ రికార్డు | SA Vs BAN 1st Test, Simon Harmer Creates History, Breaks 130 Year Old World Record with Stunning Six Wicket Haul, Check Highlights Inside | Sakshi
Sakshi News home page

SA Vs BAN: సౌతాఫ్రికా ప్లేయర్‌ సరికొత్త ప్రపంచ రికార్డు

Nov 19 2026 5:27 PM | Updated on Nov 19 2026 5:48 PM

SA vs BAN: Simon Harmer Creates History Breaks 130 YO World Record

PC: ProteasMenCSA X

సొంతగడ్డపై సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు సత్తా చాటింది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జొహన్నస్‌బర్గ్‌ వేదికగా గురువారం ముగిసిన ఈ మ్యాచ్‌లో పర్యాటక బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్య రీతిలో 400 పరుగులు చేసింది.

​ఆరేసిన హార్మర్‌
రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 168 పరుగులకే ఆలౌట్‌ అయింది. ప్రొటిస్‌ స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ ఆరు వికెట్లతో చెలరేగి.. బంగ్లా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఈ రైటార్మ్‌ బౌలర్‌ 4.10 ఎకానమీ రేటుతో 51 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. 

మాఫిజుల్‌ ఇస్లాం (32), కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో (11), ముష్ఫికర్‌ రహీం (22), మెహిదీ హసన్‌ మిరాజ్‌ (15), హసన్‌ మహమూద్‌ (4), ఇబాదత్‌ హుసేన్‌ (0)ను పెవిలియన్‌కు పంపాడు.

సరికొత్త చరిత్ర
ఈ నేపథ్యంలో హార్మర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ సగటుతో కనీసం యాభై వికెట్లు తీసిన బౌలర్‌గా హార్మర్‌ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో 130 ఏళ్లుగా ఇంగ్లండ్‌ బౌలర్‌ బాబీ పీల్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

టెస్టు క్రికెట్‌ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ సగటుతో కనీసం యాభై వికెట్లు తీసిన బౌలర్లు
👉సైమన్‌ హార్మర్‌ (సౌతాఫ్రికా): 2015-2026 మధ్య 14.09 సగటుతో 53 వికెట్లు
👉బాబీ పీల్‌ (ఇంగ్లండ్‌): 1884-1896 మధ్య 14.25 సగటుతో 56 వికెట్లు
👉జానీ బ్రిగ్స్‌ (ఇంగ్లండ్‌): 1884-1899 మధ్య 16.83 సగటుతో 53 వికెట్లు
👉హ్యూ ట్రంబెల్‌ (ఆస్ట్రేలియా): 1890-1904 మధ్య 17.23 సగటుతో 71 వికెట్లు
👉జిమ్‌ లేకర్‌ (ఇంగ్లండ్‌): 1948-1959 మధ్య 18.58 సగటుతో 89 వికెట్లు.

ఇదీ చదవండి: IND vs NZ: గ్లెన్‌ ఫిలిప్స్‌, నికోల్స్‌ పోరాటం.. భారత్‌కు ఐదు వికెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement