జొహన్నెస్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 2 టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాదేశ్‌ను తౌహిద్ హృదయ్ (137), లిటన్ దాస్ (120) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లాదేశ్ నాలుగుందల పరుగుల మార్క్‌ను చేరుకోగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ ఐదు, డేన్ ప్యాటర్సన్ నాలుగు వికెట్లు చొప్పున పడగొట్టారు.
అనంతరం సౌతాఫ్రికా కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 557 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్వెస్ అకెర్‌మాన్ (157), ర్యాన్ రికెల్టన్ (102) సెంచరీలతో చెలరేగగా.. లోయర్ ఆర్డర్‌లో కగిసో రబాడా (72) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రోటీస్‌కు 157 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత 157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు సఫారీ బౌలర్లు చుక్కలు చూపించారు.
స్పిన్నర్ సైమన్ హార్మర్ 6 వికెట్లు పడగొట్టగా..రబాడ 3 వికెట్లు సాధింఆడు. ఫలితంగా బంగ్లా 168 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే బంగ్లా జట్టు సౌతాఫ్రికా ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని ప్రోటీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.
చదవండి: శాండ్‌పేపర్ కాదు.. బాటిల్ మూతలతో ట్యాంపరింగ్ చేశాం: షోయబ్ అక్తర్


