సౌతాఫ్రికా కెప్టెన్ ప్ర‌పంచ రికార్డు | Temba Bavuma Surpasses Lindsay Hassett for Most Wins in First 16 Tests as Captain | Sakshi
Sakshi News home page

SA vs BAN: సౌతాఫ్రికా కెప్టెన్ ప్ర‌పంచ రికార్డు

Nov 19 2026 8:35 PM | Updated on Nov 19 2026 8:43 PM

Temba Bavuma Surpasses Lindsay Hassett for Most Wins in First 16 Tests as Captain

టెస్టు క్రికెట్‌లో వరల్డ్ ఛాంపియన్స్‌ సౌతాఫ్రికా అధిపత్యం కొనసాగుతోంది. జోహాన్స్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రోటీస్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టాపార్డర్ విఫలమైనప్పటికి మిడిలార్డర్ ‍బ్యాటర్లు తౌహిద్ హ్రిదోయ్(137), లిట్టన్ దాస్‌(120) భారీ సెంచరీలతో కదం తొక్కారు.

ప్రోటీస్ బౌల‌ర్ల‌లో ర‌బాడ ఐదు, డేన్ ప్యాటర్సన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం సౌతాఫ్రికా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 557 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్వెస్ అకెర్‌మాన్ (157),  ర్యాన్ రికెల్టన్ (102) సెంచరీలతో మెరిశారు. దీంతో ప్రోటీస్‌కు  157 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

ఆ తర్వాత  157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 168 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్ నిర్ధేశించిన 12 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ప్రోటీస్ కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి చేధించింది.

బ‌వుమా అరుదైన రికార్డు
కాగా ఈ విజ‌యంతో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి 16 మ్యాచ్‌లలో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా టెంబా బవుమా వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పాడు. 2023లో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన బవుమా.. ఇప్పటివరకు త‌ను సారథ్యం వహించిన 16 టెస్టుల్లో ఏకంగా 14 విజయాలు నమోదు చేశాడు. 

ఇందులో కేవలం ఒకే ఒక్క ఓటమి, ఒక డ్రా మాత్ర‌మే ఉన్నాయి. అతడి విజయ శాతం 87.5%గా నిలిచింది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ లిండ్సే హ్యాసెట్ పేరిట ఉండేది. ఆయ‌న‌ తొలి 16 టెస్టుల్లో 13 విజయాలతో న‌మోదు చేశారు. తాజా మ్యాచ్‌తో ఇప్పుడు బవుమా ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
చదవండి: SA Vs BAN: సౌతాఫ్రికా ప్లేయర్‌ సరికొత్త ప్రపంచ రికార్డు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement