కెప్టెన్సీ ఉంటుందా? ఊడిపోతుందా? క‌మిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు | Pat Cummins Crowded By Reporters After Cameron Bancroft's Allegations. Video Viral | Sakshi
Sakshi News home page

కెప్టెన్సీ ఉంటుందా? ఊడిపోతుందా? క‌మిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు

Nov 19 2026 6:40 PM | Updated on Nov 19 2026 6:44 PM

 Pat Cummins Crowded By Reporters After Cameron Bancroft's Allegations. Video Viral

2018 దక్షిణాఫ్రికా సిరీస్‌లో చోటుచేసుకున్న 'శాండ్‌పేపర్‌గేట్' బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ విషయం తనకు తెలియదని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇటీవల కుండబద్దలు కొట్టి చెప్పిన సంగతి తెలిసిందే. 

అయితే  కమిన్స్ వ్యాఖ్యల మరుసటి రోజే క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బాంబ్ పేల్చాడు. బంతిని ట్యాంపరింగ్ చేస్తున్న విషయం జట్టులోని అందరికీ తెలుసంటూ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం  ప్యాట్ కమిన్స్‌ను విలేకరులు అతడి నివాసం వద్దే చుట్టుముట్టారు. ప్రాక్టీస్ కోసం వెళ్లేందుకు ఇంటి బయటకు వచ్చిన కమిన్స్‌పై శాండ్‌పేపర్‌గేట్, బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలు, కెప్టెన్సీ భవితవ్యం గురుంచి రిపోర్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు.

ఒక రిపోర్ట్ అత‌డి ఇంటి బౌండ‌రీలోకి ప్రవేశిస్తూ కమిన్స్‌కు క్షమాపణ చెప్ప‌గా.. "బహుశా మీరు అంతగా చింతిస్తున్నట్లు లేరు" అని ఆసీస్ కెప్టెన్ బ‌దులిచ్చాడు. అయితే ఆ త‌ర్వాత అడిగిన ఏ ప్రశ్నకూ క‌మిన్స్‌ సమాధానం ఇవ్వలేదు. బాన్‌క్రాఫ్ట్ తనను ఇరకాటంలో పడేశారా? కెప్టెన్సీకి ముప్పు వాటిల్లిందా? అన్న ప్రశ్నలకు స‌మాధ‌నం చెప్ప‌కుండానే మౌనంగానే కారు ఎక్కి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది.

బాన్‌క్రాఫ్ట్ సంచ‌ల‌న వ్యాఖ్యలు
కాగా బుధవారం 'ది వెస్ట్ ఆస్ట్రేలియన్' పత్రికలో బాన్‌క్రాఫ్ట్ సుమారు 4,000 పదాల అర్టికల్‌ రాశాడు.  కమిన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత తనకు తీవ్ర ఆగ్రహం, వేదన కలిగాయని, మోసపోయినట్లుగా.. ఒంటరివాడినయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.

"దక్షిణాఫ్రికాలో బంతిపై శాండ్‌పేపర్ వాడిన విషయం కేవలం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, నాకు మాత్రమే తెలుసని అందరూ అనుకుంటారు. కానీ ఆ విషయం జట్టు మొత్తానికి తెలుసు. బంతి రివర్స్ స్వింగ్ అవుతుందా లేదా అన్న దానిపై ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ మార్ష్‌లతో నేను మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. 

నేను చేస్తున్న పని ఫలితమిస్తోందా లేదా అని బౌలర్లందరూ ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారు. 'ఇంకా స్వింగ్ కావడం లేదు, ఇంకాస్త చేయాలి' అని వారు చెప్పడంతో శాండ్‌పేపర్‌ను మరింత ఎక్కువగా వాడేవాడిని" కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ వ్యాసంలో రాసుకొచ్చాడు.
చదవండి: సిరాజ్‌ ఒక అద్భుత బౌలర్‌.. అతడికి అన్యాయం చేస్తున్నారు: అజారుద్దీన్


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement