ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో కమిన్స్, అతడి భార్య రెబెక జేన్ కమిన్స్ తీవ్రస్థాయిలో గొడవపడినట్లుగా ఉంది. కాగా ఆసీస్ మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా పుస్తకం కంగారూ క్రికెట్‌లో ‘సబర్’ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
బాంబు పేల్చిన ఖవాజా
సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టు సందర్భంగా జరిగిన ‘సాండ్‌పేపర్‌గేట్’ వివాదాన్ని ఖవాజా తన పుస్తకంలో ప్రస్తావించాడు. సాండ్‌పేపర్ వాడటం గురించి ప్రస్తుత కెప్టెన్ కమిన్స్ సహా జట్టులో అందరికీ తెలుసునని.. అయినా కొందరు బలిపశువులు అయ్యారని అతడు పేర్కొన్నాడు. అంతేకాదు అంతకుముందు టెస్టులో కూడా తాము సాండ్‌పేపర్‌తో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించామని బాంబు పేల్చాడు.
కమిన్స్‌తో గొడవపడిన భార్య
ఈ నేపథ్యంలో కమిన్స్- అతడి భార్య బహిరంగంగా గొడవపడినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఖవాజా చేసిన ఆరోపణల గురించే వారి మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగిందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో కమిన్స్ ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘‘నేను సెంట్రల్ క్రికెట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నా.
కచ్చితంగా మాట్లాడతాను
షీల్డ్ మ్యాచ్‌కు ముందు బ్లూస్ కోసం ప్రాక్టీస్‌లో ఉన్నా. ఈ వారంలో నేను మీడియాతో మాట్లాడతాను. అన్ని విషయాల గురించి చెప్తాను. ఉజ్జీ (ఉస్మాన్ ఖవాజా) చేసిన అన్ని ఆరోపణల గురించి, అతడి ఆరోపణల జాబితా గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు కొంతసమయం పడుతుంది. ఆ తర్వాత కచ్చితంగా నేను క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడి తప్పక మీ ముందుకు వస్తాను’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.

మరోవైపు.. తామిద్దరం గొడవపడి విడిపోయే స్థాయికి చేరుకున్నామంటూ వచ్చిన వదంతులపైన రెబెక కమిన్స్ కూడా స్పందించింది. భర్త కమిన్స్, కూతురుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘మై లవ్స్’’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇదే స్టోరీని కమిన్స్ కూడా రీషేర్ చేశాడు. తద్వారా తమ మధ్య ప్రేమ అలాగే ఉందంటూ గాసిప్‌రాయుళ్ల కథనాలకు చెక్ పెట్టారు.
ఇదీ చదవండి: IND vs NZ: నాలుగో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!.. ఓపెనర్లుగా వీరే
Sandpaper Crisis! Pat Cummins and his wife Becky look so animated. Something is not good in between them. #patcummins #CricketNews https://t.co/naj4yPz179
— Nadir Emaan (@NadirEmaanz) November 12, 2026


