ధనంజయ, కుసాల్‌ సెంచరీలు.. స్వల్ప ఆధిక్యంలో శ్రీలంక | Sri lanka got 12 runs lead vs pakistan in 1st test | Sakshi
Sakshi News home page

ధనంజయ, కుసాల్‌ సెంచరీలు.. స్వల్ప ఆధిక్యంలో శ్రీలంక

Nov 12 2026 12:01 PM | Updated on Nov 12 2026 12:01 PM

Sri lanka got 12 runs lead vs pakistan in 1st test

source: X

రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక 12 పరుగుల స్వల్ప ఆధిక్యం​ సాధించింది. ధనంజయ డిసిల్వ (167), కెప్టెన్‌ కుసాల్‌ మెండిస్‌ (119) సెంచరీలతో కదంతొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 446 పరుగులకు ఆలౌటైంది. 

పాక్‌ బౌలర్లలో సాకిబ్‌ ఖాన్‌ 7 వికెట్లతో చెలరేగగా.. మహమ్మద్‌ అబ్బాస్‌ 2, రజావుల్లా ఓ వికెట్‌ పడగొట్టారు. మిగతా లంక బ్యాటర్లలో లహీరు ఉదార 42, కమిందు మెండిస్‌ 58, చండీమల్‌ 1, సూరియబండార డకౌట్‌, సోనల్‌ దినుషా 20, మిలన్‌ రత్నాయకే 12, లహీరు కుమార డకౌట్‌, అసిత ఫెర్నాండో 4 పరుగులు చేయగా.. మధుషంక (0) నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ను 434-9 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది.  తయ్యబ్‌ ఆరిఫ్‌ (57), మొహమ్మద్‌ తాహా (51), కెప్టెన్‌ బాబర్‌ ఆజం (50), అరాఫత్‌ మిన్హాస్‌ (52) అర్ద సెంచరీలతో రాణించారు. సౌద్‌ షకీల్‌ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

వికెట్‌ కీపర్‌ ఘాజీ ఘోరీ (48) అర్ద సెంచరీ మిస్‌ కాగా.. అజాన్‌ అవైస్‌ 30, సల్మాన్‌ అఘా 16, రజావుల్లా 10 పరుగులకు ఔటయ్యారు. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుషంక, అసిత ఫెర్నాండో చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లహీరు కుమార, మిలన్‌ రత్నాయకే, సోనల్‌ దినుష తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, శ్రీలంక జట్టు టీ20, టెస్ట్‌ సిరీస్‌ల కోసం పాక్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలుత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాక్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి: IPL 2027: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న అక్షర్..?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement