PC: SLC X
పాకిస్తాన్‌తో రెండో టెస్టులో శ్రీలంక పరాజయం పాలైంది. రావల్పిండి వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో లంక ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. లంకతో రెండో టెస్టులో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
98 పరుగులకే కుప్పకూలి
ఈ క్రమంలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 98 పరుగులే చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ కుశాల్ మెండిస్ (32), సొనాల్ దినుష (21) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగలిగారు. పాక్ బౌలర్లు మహ్మద్ అబ్బాస్, రజావుల్లా, ఆమేర్ జమాల్ తలా మూడు వికెట్లు తీసి లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. సాకిబ్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
227 పరుగుల మేర భారీ ఆధిక్యం
అనంతరం పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు స్కోరు చేసి.. 227 పరుగుల మేర భారీ ఆధిక్యం సంపాదించింది. ఓపెనర్లు అజాన్ అవైస్ (47), తయ్యబ్ ఆరిఫ్ (46), సాకిబ్ ఖాన్ (37), రజావుల్లా (42) రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఘాజి ఘోరి అర్ధ శతకం (54) సాధించాడు.
89 పరుగుల స్వల్ప లక్ష్యం
లంక బౌలర్లలో లాహిరు కుమార ఐదు వికెట్లు దక్కించుకోగా.. అసిత ఫెర్నాండో మూడు, మిలాన్ ప్రియనాథ్ రత్ననాయకే, ప్రబాత్ జయసూర్య తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 316 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తద్వారా పాకిస్తాన్‌కు కేవలం 89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విధించింది.
ఆడుతూ పాడుతూ పనిపూర్తి చేసిన పాక్
ఈ టార్గెట్‌ను పాక్ ఆడుతూ పాడుతూ కేవలం 13 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. తయ్యబ్ ఆరిఫ్ (13), మహ్మద్ తాహా (4) విఫలం కాగా.. అజాన్ ఆవైస్ (32), ఆమేర్ జమాల్ (34) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు.
చెత్త రికార్డు
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది శ్రీలంక ఇప్పటికి ఆరు టెస్టులు ఆడి.. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేకపోయింది. తద్వారా 29 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా ఒక్క టెస్టు విజయం కూడా లేకుండానే ఏడాదిని ముగించి చెత్త రికార్డు మూటగట్టుకుంది.
శ్రీలంక జట్టు 2026లో తొలుత వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టులు ఆడింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో ఇన్నింగ్స్, 217 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన లంక జట్టు.. రెండో టెస్టును డ్రా చేసుకోగలిగింది.
29 ఏళ్లలో ఇదే తొలిసారి
ఇక ఆగష్టులో స్వదేశంలో టీమిండియాతో రెండు టెస్టులు ఆడిన శ్రీలంక.. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తాజాగా పాకిస్తాన్ పర్యటనలో తొలి టెస్టును డ్రా చేసుకున్న శ్రీలంక.. రెండో మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 1997 తర్వాత శ్రీలంక ఇలా ఓ ఏడాదిలో ఒక్క టెస్టు విజయం కూడా సాధించకపోవడం ఇదే తొలిసారి.
మరోవైపు.. పాకిస్తాన్ టెస్టుల్లో 2019 నుంచి ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2019లో 1-0తో లంకపై గెలిచిన పాక్.. 2022లో 1-1తో డ్రా చేసుకుంది. 2023లో 2-0తో వైట్‌వాష్ చేసిన పాకిస్తాన్.. 2026లో 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది శ్రీలంకకు తొలుత ధనంజయ డి సిల్వ కెప్టెన్‌గా వ్యవహరించగా.. తర్వాత కుశాల్ మెండిస్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.
ఇవీ చదవండి: NZ vs IND: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
రాణించిన పృథ్వీ షా.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపులు.. ఆఖరి బంతికి..


