న్యూజిలాండ్‌కు ధీటుగా బదులిస్తున్న భారత్‌ | Jaiswal, Rahul Power Indias Strong Reply After Nicholls Unbeaten 175* Lifts New Zealand to 368 | Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్‌కు ధీటుగా బదులిస్తున్న భారత్‌

Nov 20 2026 11:12 AM | Updated on Nov 20 2026 11:38 AM

Jaiswal, Rahul Power Indias Strong Reply After Nicholls Unbeaten 175* Lifts New Zealand to 368

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌కు టీమిండియా ధీటుగా బ‌దులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి పటిష్ట స్ధితిలో నిలిచింది. భారత్‌ ఇంకా కివీస్ కంటే ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌(52), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(16) ఉన్నారు. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ (85) మెరుపు హాఫ్‌ సెంచరీ ఔటయ్యాడు.

నికోల్స్‌, ఫిలిప్స్‌ సెంచరీలు
అంతకముందు న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. హెన్రీ నికోల్స్ (335 బంతుల్లో 175, 21 ఫోర్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (118) సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో  జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. ఆకాష్‌ దీప్‌ మూడు, అన్షుల్‌ కాంబోజ్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన గ్లెన్‌ ఫిలిప్స్‌ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో భారత్‌పై మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా గ్లెన్ ఫిలిప్స్ నిలిచాడు.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement