చరిత్ర సృష్టించిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా | Glenn Phillips Creates History With 118, Matches Rohit Sharmas Rare Record | Sakshi
Sakshi News home page

IND vs NZ: చరిత్ర సృష్టించిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Nov 20 2026 8:25 AM | Updated on Nov 20 2026 8:38 AM

Glenn Phillips Creates History With 118, Matches Rohit Sharmas Rare Record

టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్ సూపర్ స్టార్  గ్లెన్ ఫిలిప్స్‌.. ఇప్పుడు టెస్టుల్లోనే అదే జోరును కొనసాగిస్తున్నాడు. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఫిలిప్స్ అద్భుత సెంచరీతో చెలరేగారు. 70 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన కివీస్‌ను హెన్రీ నికోల్స్‌(175)తో క‌లిసి ఫిలిప్స్ ఆదుకున్నాడు.

ఈ క్ర‌మంలో 193 బంతుల్లో త‌న రెండో టెస్టు సెంచ‌రీ మార్క్‌ను ఫిలిప్స్ పూర్తి చేసుకున్నాడు. అత‌డు ఓవ‌రాల్‌గా 216 బంతుల్లో 118 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఇక ఈ వీరోచిత సెంచ‌రీతో ఫిలిప్స్ పలు అరుదైన రికార్డులను త‌న పేరిట లిఖించుకున్నాడు.

ఫిలిప్స్‌ సాధించిన రికార్డులు ఇవే

👉ఒకే క్యాలెండర్ ఇయర్‌లో భారత్‌పై (టెస్టులు, వన్డేలు , టీ20లు) మూడు ఫార్మాట్ల‌లోనూ సెంచ‌రీలు చేసిన తొలి ప్లేయ‌ర్‌గా ఫిలిప్స్ చ‌రిత్ర సృష్టించాడు. అతడి కంటే ముందు ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. గత నెలలో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో శతక్కొట్టిన ఫిలిప్స్‌.. ఇప్పుడు టెస్టుల్లోనూ మూడెంకల మార్క్‌ను అందుకున్నాడు.

👉ఓవరాల్‌గా పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా ఫిలిప్స్ రికార్డులకెక్కాడు.

👉అదే విధంగా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఒకే ప్రత్యర్థిపై మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా ఫిలిప్స్ నిలిచాడు. గతంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 2017లో శ్రీలంకపై ఈ ఘనత సాధించాడు.

👉ఏ ప్రత్యర్థిపై అయినా సరే, మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్ ఫిలిప్సే కావడం గమనార్హం.
చదవండి: IND vs NZ: హెన్రీ నికోల్స్‌, ఫిలిప్స్‌ సెంచరీలు.. 368 పరుగులకు కివీస్‌ ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement