హెన్రీ నికోల్స్‌, ఫిలిప్స్‌ సెంచరీలు.. 368 పరుగులకు కివీస్‌ ఆలౌట్‌ | Henry Nicholls, Glenn Phillips Hit Centuries as New Zealand Bowled Out for 368 | Sakshi
Sakshi News home page

IND vs NZ: హెన్రీ నికోల్స్‌, ఫిలిప్స్‌ సెంచరీలు.. 368 పరుగులకు కివీస్‌ ఆలౌట్‌

Nov 20 2026 7:29 AM | Updated on Nov 20 2026 7:45 AM

Henry Nicholls, Glenn Phillips Hit Centuries as New Zealand Bowled Out for 368

వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లు హెన్రీ నికోల్స్‌(175), గ్లెన్ ఫిలిప్స్‌(118) భారీ సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత కివీస్‌ను బ్యాటింగ్ అహ్హ‌నించింది. చక్కటి స్వింగ్, బౌన్స్‌తో ఉన్న బేసిన్‌ రిజర్వ్‌ పిచ్‌ ఆరంభంలో బౌలర్లకు బాగా అనుకూలించింది. 

బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే న్యూజిలాండ్‌కు షాక్‌ తగిలింది. మ్యాచ్‌ మూడో బంతిని కివీస్ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (0) వదిలేయగా, బంతి లోపలికి దూసుకొచ్చి స్టంప్స్‌ను పడగొట్టింది.

ఆ తర్వాత కొద్ది సేపటికే కాన్వే (4)ను కంబోజ్‌ పెవిలియన్‌కు పంపించగా, రచిన్‌ రవీంద్ర (15) వికెట్‌ ఆకాశ్‌దీప్‌ ఖాతాలో చేరింది. కొంత విరామం తర్వాత తిరిగొచ్చిన‌ బుమ్రా తన మొదటి ఓవర్లోనే మిచెల్‌ (1) ఆట ముగించాడు. 

లంచ్‌ తర్వాత బ్లన్‌డెల్‌ (5) కూడా అవుట్‌ కావడంతో కివీస్‌ కష్టాలు పెరిగాయి. ఈ దశలో నికోల్స్, ఫిలిప్స్‌ సమన్వయంతో ఆడుతూ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 216 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా కివీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు, ఆకాష్ దీప్ మూడు వికెట్లు చొప్పున పడగొట్టారు. వీరితో పాటు అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement