చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌ | KL Rahul Becomes 1st Indian Opener To Score 50 In All SENA Nations | Sakshi
Sakshi News home page

NZ vs IND: చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌

Nov 20 2026 12:53 PM | Updated on Nov 20 2026 12:53 PM

KL Rahul Becomes 1st Indian Opener To Score 50 In All SENA Nations

PC: BCCI/X

టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరంభంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్‌.. ఆ తర్వాత కివీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 52 పరుగులతో రాహుల్ క్రీజులో ఉన్నాడు. అయితే ఈ హాఫ్ సెంచరీతో రాహుల్ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో సేనా ( దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నింటిలోనూ అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు.

అదేవిధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్  చరిత్రలో భారత్ తరఫున అత్యధిక  ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్(17) రోహిత్ శర్మతో కలిసి ఐదో స్ధానంలో నిలిచాడు.  ఈ జాబితాలో రిషబ్ పంత్ (24) అగ్రస్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా (23), యశస్వి జైస్వాల్ (21), శుభ్‌మన్ గిల్ (19) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టెస్టుల్లో భారత ఓపెనర్‌గా రాహుల్‌కు ఇది 30వ యాభైకి పైగా స్కోరు. దీంతో ఈ జాబితాలో రాహుల్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అతనికంటే ముందు సునీల్ గవాస్కర్ (75), వీరేంద్ర సెహ్వాగ్ (51), గౌతమ్ గంభీర్ (31) మాత్రమే ఉన్నారు.

ధీటుగా బదులిస్తున్న భారత్‌
కాగా వెల్లింగ్టన్ టెస్టులో కివీస్‌కు భారత్ ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. భారత్‌ ఇంకా కివీస్ కంటే ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement