టీమిండియా ప్లేయ‌ర్‌ ఊచ‌కోత‌.. 12 బంతుల్లో 50! అయినా తప్పని ఓటమి | Rahul Tripathis 14-Ball 56 Goes In Vain As India Lose To England In Hong Kong Sixes 2026 | Sakshi
Sakshi News home page

టీమిండియా ప్లేయ‌ర్‌ ఊచ‌కోత‌.. 12 బంతుల్లో 50! అయినా తప్పని ఓటమి

Oct 31 2026 4:47 PM | Updated on Oct 31 2026 4:53 PM

Rahul Tripathis 14-Ball 56 Goes In Vain As India Lose To England In Hong Kong Sixes 2026

PC: X

హాంగ్ కాంగ్ సిక్సెస్‌-2026 టోర్నమెంట్‌లో భారత జట్టు హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. శనివారం మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన బౌల్ గ్రూప్ సెమీఫైనల్‌-2లో 3 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 125 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.

ఓపెన‌ర్‌ నితీష్ రాణా కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత‌ శ‌శాంక్ సింగ్‌(9 బంతుల్లో 29),  రాహుల్ త్రిపాఠి (14 బంతుల్లో 56, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ఇంగ్లీష్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డిన త్రిపాఠి కేవ‌లం 12 బంతుల్లో త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఖ‌రిలో కెప్టెన్ కృనాల్ పాండ్యా (7 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 28) దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ మార్టిన్ అండర్సన్ సంచలన బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లో 392 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్సర్లు) సాధించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 

అతడికి తోడుగా ఎడ్ బర్నార్డ్ (14 బంతుల్లో 35, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో త్రిపాఠీ, నితీష్ రాణా తలా వికెట్ సాధించారు. కాగా భారత్‌ ఇప్పటికే పాకిస్తాన్‌, యూఏఈ చేతిలో ఓడిపోయంది. కృనాల్ సేన తమ చివరి మ్యాచ్‌లో నవంబర్ 1న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
చదవండి: సౌతాఫ్రికా పేసర్‌ వరల్డ్‌ రికార్డు.. సరికొత్త చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement