breaking news
Hong Kong Sixes 2026
-
ఫైనల్లో ఆస్ట్రేలియా చిత్తు.. ఛాంపియన్స్‌గా అఫ్గానిస్తాన్
హాంగ్‌కాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్ విజేతగా అఫ్గానిస్తాన్ నిలిచింది. ఆదివారం మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన అఫ్గానిస్తాన్.. తమ తొలి హాంగ్‌కాంగ్ సిక్సెస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఈ తుది పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 115 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ ఓపెనర్ మాక్స్ బ్రయంట్ (14 బంతుల్లో 44 పరుగులు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అలెక్స్ రాస్ (10 బంతుల్లో 29 పరుగులు), నిక్ హాబ్సన్ (8 బంతుల్లో 23 పరుగులు) రాణించారు.ఇమ్రాన్ మీర్ తుపాన్ ఇన్నింగ్స్116 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 5.1 ఓవర్లలో చేధించింది. ఇమ్రాన్ మీర్ కేవలం 14 బంతుల్లో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేసి అఫ్గాన్‌కు విజయాన్ని అదించాడు. ఆఖరిలో ఫర్మనుల్లా సాఫీ (7 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో 26 పరుగులు) కూడా దూకుడగా ఆడాడు.కాగా ఈ చారిత్రాత్మక విజయంతో హాంగ్‌కాంగ్ సిక్సెస్ టైటిల్‌ను గెలుచుకున్న 8వ దేశంగా అఫ్గానిస్తాన్ నిలిచింది. ఇప్పటివరకు పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మాత్రమే ఈ ట్రోఫీని గెలుచుకున్నాయి.చదవండి: IND vs NZ: గ్లెన్ ఫిలిప్స్ సరికొత్త ప్రపంచ రికార్డు -
పాకిస్తాన్ కెప్టెన్ వీరవిహారం.. 6 ఓవర్లలో 154 పరుగులు
హాంకాంగ్ సిక్సెస్ 2026 ఎడిషన్ ప్లేట్ ఫైనల్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఒమన్ టీమ్‌ను 18 పరుగుల తేడాతో ఓడించిన పాకిస్తాన్.. వరుసగా రెండో సారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ సిక్సెస్ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగుల భారీ స్కోరు సాధించింది.వరుసగా 5 సిక్సర్లు.. 13 బంతుల్లోనే అర్ధశతకంఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ అబ్బాస్ ఆఫ్రిది విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అబ్బాస్.. ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతడు ముఖ్యంగా 2వ ఓవర్ వేసిన ఒమన్ బౌలర్ షఫీక్ జాన్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో కేవలం 13 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అబ్బాస్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 16 బంతులు ఎదుర్కొన్న ఆఫ్రిది.. 1 ఫోర్, 11 సిక్సర్లతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు అబ్దుల్ సమద్(32),డనియల్(25) రాణించారు.అనంతరం లక్ష్య చేధనలో ఒమన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఒమన్ ఓపెనర్లు జోహైబ్ అమానత్(61), ఉస్మాన్ అలీ అఫ్రిది(67) హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికి జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. -
టీమిండియా ఓపెనర్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు
హాంగ్ కాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్లో భారత జట్టుకు ఊరట విజయం లభించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం జరిగిన 11వ స్థానపు ప్లే-ఆఫ్ పోరులో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 11వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ జట్టు 116 పరుగులు చేసింది. కెప్టెన్ అబూ హైదర్ కేవలం 13 బంతుల్లోనే 1 సిక్సర్, 5 ఫోర్లతో 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే హబీబుర్ రహ్మాన్ (18), సబ్బీర్ రహ్మాన్ (13), మొహమ్మద్ రిజ్వాన్ (12) కూడా రాణించారు. భారత బౌలర్లలో కెప్టెన్ కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా, రాహుల్ త్రిపాఠి ఒక వికెట్ దక్కించుకున్నాడు.శశాంక్ సింగ్ విధ్వంసకర అర్ధశతకంఅనంతరం 117 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. భారత బ్యాటర్లలో శశాంక్ సింగ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శాంక్ సింగ్ కేవలం 15 బంతుల్లోనే 1 ఫోర్, 7 భారీ సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు సాధించాడు. అలాగే రాహుల్ త్రిపాఠి (32 పరుగులు, 12 బంతుల్లో, 3 సిక్సర్లు, 3 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. -
టీమిండియా ప్లేయర్ ఊచకోత.. 12 బంతుల్లో 50! అయినా తప్పని ఓటమి
హాంగ్ కాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్లో భారత జట్టు హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. శనివారం మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన బౌల్ గ్రూప్ సెమీఫైనల్-2లో 3 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 125 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.ఓపెనర్ నితీష్ రాణా కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత శశాంక్ సింగ్(9 బంతుల్లో 29), రాహుల్ త్రిపాఠి (14 బంతుల్లో 56, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడిన త్రిపాఠి కేవలం 12 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఖరిలో కెప్టెన్ కృనాల్ పాండ్యా (7 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 28) దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు.అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ మార్టిన్ అండర్సన్ సంచలన బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లో 392 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్సర్లు) సాధించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతడికి తోడుగా ఎడ్ బర్నార్డ్ (14 బంతుల్లో 35, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో త్రిపాఠీ, నితీష్ రాణా తలా వికెట్ సాధించారు. కాగా భారత్ ఇప్పటికే పాకిస్తాన్, యూఏఈ చేతిలో ఓడిపోయంది. కృనాల్ సేన తమ చివరి మ్యాచ్‌లో నవంబర్ 1న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: సౌతాఫ్రికా పేసర్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
పబ్లిక్ హాలిడే ప్రకటించండి!.. పాక్ ప్రధానిపై సెటైర్లు
పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. గల్లీ మ్యాచ్‌లకు కూడా ఆనందపడటం ఏమిటో అంటూ నెటిజన్లు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. విజయానికి గుర్తుగా పబ్లిక్ హాలిడే ప్రకటించేయండి అంటూ సెటైర్లు వేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నీకి శుక్రవారం తెరలేచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న పాక్ జట్టు తొలుత యూఏఈతో తలపడి వికెట్ తేడాతో ఓటమిపాలైంది. అనంతరం భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.అభినందనలు అబ్బాయిలుఈ నేపథ్యంలో పాక్ ప్రధాన షెబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా తమ జట్టును అభినందించారు. ‘‘అభినందనలు అబ్బాయిలు. హాంకాంగ్ సిక్సెస్ 2026 ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇండియాపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచినందుకు కంగ్రాట్స్.పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీని కూడా అభినందిస్తున్నా. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ.. అడుగడుగునా ప్రోత్సహించడం గొప్ప విషయం’’ అంటూ షెబాజ్ ప్రశంసలు కురిపించారు. నిజానికి పాక్ తొలి మ్యాచ్‌లో యూఏఈ చేతిలో ఓడిపోగా.. భారత్‌తో తమ జట్టు తొలి మ్యాచ్ ఆడి గెలిచిందని షెబాజ్ పప్పులో కాలేశారు.పబ్లిక్ హాలిడే ప్రకటించండి!ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ‘‘గల్లీ క్రికెట్ మాదిరి ఆరు ఓవర్ల ఆటలో గెలిచినందుకు ప్రధాని ఇంత సంబరపడిపోతున్నారా!.. ఇంకా నయం ఐసీసీ టోర్నీలో గనుక పాక్ జట్టు గెలుపొందితే ఇంకేం చేసేవారో!.. మీ జట్టు గల్లీ మ్యాచ్‌లో గెలిచినందుకు పబ్లిక్ హాలీడే ఇచ్చేయండి’’ అంటూ నెటిజన్లు షెబాజ్ షరీఫ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు -
ఆస్ట్రేలియా ఆటగాడి విధ్వంసం.. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ
హాంగ్ కాంగ్ సిక్స్సెస్ 2026 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శనివారం మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో యూఏఈను 53 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్‌కు ఆసీస్ దూసుకెళ్లింది. ఈ సెమిస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు మ్యాక్స్ బ్రయంట్, నిక్ హాబ్సన్ మరోసారి విధ్వంసం సృష్టించారు. బ్రయంట్ కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60 పరుగులు చేయగా.. హాబ్సన్ 11 బంతుల్లో (4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 రన్స్) హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ జుహైబ్ ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా ఇద్దరు బ్యాటర్లు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు.అనంతరం 142 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 5.3 ఓవర్లలో కేవలం 88 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో క్రిస్ గ్రీన్, అలెక్స్ రోస్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాక్ వుడ్, బ్రయంట్ తలా వికెట్ సాధించారు.చదవండి: విండీస్ కెప్టెన్ అరుదైన ఫీట్.. బంగ్లాతో టెస్టులో విజయం దిశగా! -
నటరాజన్ సిక్సర్లు వృథా; టీమిండియాకు షాకిచ్చిన యూఏఈ
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు ఏదీ కలిసిరావడం లేదు. టోర్నీలో భారత్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. శుక్రవారం పాకిస్తాన్‌తో ఓటమి మరిచిపోకముందే ఈసారి యూఏఈ జట్టు భారత్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. గ్రూప్-సిలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈత చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్ (14 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాహుల్ త్రిపాఠి (7 బంతుల్లో 24) పర్వాలేదనిపించాడు. యూఏఈ బౌలర్లలో జాహిద్ అలీ మూడు వికెట్లు తీయగా, ముహమ్మద్ ఫరూక్, మొహమ్మద్ ఫరాజుద్దీన్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ 4.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఖాలిద్ షా (14 బంతుల్లో 52; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా, అన్ష్ టాండన్ (12 బంతుల్లో 39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గ్రూప్ దశలో రెండు ఓటములతో గ్రూప్-సి పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన భారత్ ప్లేట్ సెమీస్ ఆడనుంది. ప్లేట్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీకి సిద్ధమైంది. 😱 UAE HUMILIATES INDIA BY 6 WICKETS! 🇦🇪🔥🇮🇳 A shocking defeat for India in the Hong Kong Sixes 2026! 💔 India scored 94/6 in 6 overs, but UAE chased down the 95-run target to seal a stunning 6-wicket victory! 🏆💥 Image Credt: Fancode #INDvsUAE #HongKongSixes2026 #TeamIndia https://t.co/apoJFk3gq4— CricInformer (@CricInformer) October 31, 2026 🏏🔥 T NATARAJAN SHINES WITH A BLISTERING 38 OFF 14 BALLS AGAINST UAE! 🇮🇳💥 What a sensational batting performance by India's T Natarajan in the Group C clash of the Hong Kong Sixes 2026! 🚀🏏 Natarajan emerged as India's standout batter, smashing 38 runs off just 14 balls, including 3 fours and 4 massive sixes, at an impressive strike rate of 271.43! 🤯🔥 Despite India's batting struggles, Natarajan delivered a fearless counterattack against the UAE bowling attack! 💪 Image Credit: Fancode #INDvsUAE #HongKongSixes2026 #TNatarajan #TeamIndia— CricInformer (@CricInformer) October 31, 2026ఇదీ చదవండి: ఆసీస్ టార్గెట్ 288.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు జెర్సీ నెంబర్ '45' మిస్టరీ గుట్టువిప్పిన రోహిత్ శర్మ! -
లంకను చావుదెబ్బ తీసిన స్కాట్లాండ్
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో స్కాట్లాండ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 26 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ మైకెల్ లీస్క్ (15 బంతుల్లో 70 నాటౌట్; 2 ఫోర్లు, 10 సిక్సర్లు) లంక బౌలర్లను ఊచకోత కోయగా, ఫిన్లే మెక్‌క్రీత్ (7 బంతుల్లో 26), జాస్పర్ డేవిడ్సన్ (6 బంతుల్లో 22) రాణించారు. లంక బౌలర్లలో ముదిత లక్షణ్ రెండు వికెట్లు తీయగా, రవిందు ఫెర్నాండో, సచితా జయతిలకే చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లంక జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి ఓటమిపాలయ్యింది. విషెన్ హలంబగే (12 బంతుల్లో 30), సచితా జయతిలకే (9 బంతుల్లో 28 నాటౌట్), ముదితా లక్షన్ (5 బంతుల్లో 28 నాటౌట్) ఆఖరిదాకా క్రీజులో నిలిచినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయాడు. కెప్టెన్ సంగీత్ కూరే (9 బంతుల్లో 22) పర్వాలేదనిపించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జాస్పర్ డేవిడ్సన్ మూడు వికెట్లతో చెలరేగాడు. లంకపై విజయంతో స్కాట్లాండ్ గ్రూప్-బిలో టాప్ స్థానానికి చేరుకుంది.ఒమన్‌పై ఆఫ్గన్ విజయంమరో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 4 వికెట్ల తేడాతో ఒమన్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఉస్మాన్ అలీ అఫ్రిది (17 బంతుల్లో 71 నాటౌట్; 1 ఫోర్, 10 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, సమి హసన్ (7 బంతుల్లో 21) రాణించాడు. ఆఫ్గన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్, కరీమ్ జనత్లు చెరో వికెట్ తీశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. సేదికుల్లా పచా (10 బంతుల్లో 45 నాటౌట్), ఫర్మానుల్లా సఫీ (11 బంతుల్లో 37 నాటౌట్) జట్టును గెలిపించారు.ఇదీ చదవండి: జైస్వాల్ డకౌట్.. మరోసారి మెరిసిన పడిక్కల్జెర్సీ నెంబర్ '45' మిస్టరీ గుట్టువిప్పిన రోహిత్ శర్మ! -
ఆస్ట్రేలియా ఓపెనర్ విధ్వంసం.. 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మోంగ్ కోక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 38 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 159 పరుగులు చేసింది.బ్రయంట్ మెరుపు హాఫ్ సెంచరీఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ మాక్స్ బ్రయంట్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ నిక్ హాబ్సన్ మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన బ్రయంట్.. కేవలం 9 బంతుల్లోనే తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతడు ఓవరాల్‌గా కేవలం 11 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 56 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.నిక్ హాబ్సన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు జాక్ వుడ్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 40 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో నాథన్ గిల్‌క్రిస్ట్ 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం 160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ జాన్ సింప్సన్ 12 బంతుల్లోనే 1 ఫోర్, 8 సిక్సర్లతో 54 పరుగులు చేసి రిటైర్డ్ నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు మార్టిన్ ఆండర్సన్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేసినప్పటికీ, జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. -
పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పసికూన
హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో వికెట్ తేడాతో పాక్ ఓటమిపాలైంది. మోంగ్‌కాక్ వేదికగా హాంకాంగ్ సిక్సెస్ తాజా ఎడిషన్ శుక్రవారం మొదలైంది.గ్రూప్- ‘సి’లో భాగంగా పాకిస్తాన్- యూఏఈతో తలపడింది. మిషన్ రోడ్ గ్రౌండ్లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో ఖవాజా నఫాయ్ (3) విఫలం కాగా.. అబ్దుల్ సమద్ (15 బంతుల్లో 30 నాటౌట్) అదరగొట్టాడు.పాక్ కెప్టెన్ మెరుపులు.. 13 బంతుల్లోనేఇక కెప్టెన్ అబ్బాస్ ఆఫ్రిది ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 13 బంతుల్లోనే ఒక ఫోర్, ఎనిమిది సిక్సర్ల సాయంతో ఏకంగా.. 407కు పైగా స్ట్రైక్‌రేటుతో 53 పరుగులు రాబట్టాడు. అబ్బాస్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగగా.. ఇర్ఫాన్ ఖాన్ (8) నిరాశపరిచాడు.ఫలితంగా నిర్ణీత ఆరు ఓవర్లలో పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ ఫారూక్, మరూఫ్ మర్చంచ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ అనూహ్య రీతిలో విజయం సాధించింది.That's how you get the job done! 🏏🇦🇪 #TurnItUpToSix #HongKongSixes #M品牌活動#大型體育活動事務委員會#政府資助計劃 #MMarkEvents #MajorSportsEventsCommittee https://t.co/3AphyVbIuj— Cricket Hong Kong, China (@CricketHK) October 30, 2026యూఏఈ సారథి విధ్వంసంఓపెనర్, కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఖలీద్ షా కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 71 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అన్ష్ టాండన్ డకౌట్ కాగా.. ముహ్మద్ జుహైబ్ 7, మరూఫ్ మర్చంచ్ 2 పరుగులే చేశారు. ఆఖర్లో జహీద్ అలీ 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.ఈ క్రమంలో నిర్ణీత ఆరు ఓవర్లలో యూఏఈ ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 109 పరుగులు చేసింది. ఫలితంగా వికెట్ తేడాతో గెలిచి.. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా షాకిచ్చింది. అయితే, ఇదే రోజు టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా గ్రూప్-‘సి’ నుంచి అగ్రస్థానంలో నిలిచింది.ఇవీ చదవండి: IND vs NZ: అర్ష్‌దీప్ సింగ్ ప్రపంచ రికార్డువాళ్లకు జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి.. లేదంటే అంతే: కివీస్ కెప్టెన్ -
IND vs PAK: ఓపెనర్ల విధ్వంసం.. పాక్ గెలుపు
హాంగ్‌కాంగ్ సిక్సెస్-2026 టోర్నీని ఇండియా సిక్సెస్ జట్టు ఓటమితో ఆరంభించింది. శుక్రవారం మోంగ్ కాక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా పాకిస్తాన్ సిక్సెస్తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు అహ్హనించాడు. ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్‌కు దిగిన కృనాల్ పాండ్యా బృందం 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేయగలిగింది. భారత బ్యాటర్లలో శశాంక్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. అయితే ఓపెనర్లు నితీష్ రాణా(14 బంతుల్లో 19), రాహుల్ త్రిపాఠీ(5 బంతుల్లో 9) తీవ్ర నిరాశపరిచారు. కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సమద్ రెండు, అహ్మద్ దనియల్,షెహాజాద్ తలా వికెట్ తీశారు.అనంతరం 89 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ సిక్సెస్ కేవలం 3.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన భారత కెప్టెన్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌ను ప్రత్యర్థి కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది ఆటాడుకున్నాడు. వరుసగా 5 సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్లోనే ఏకంగా 31 పరుగులు వచ్చాయి. అబ్బాస్ అఫ్రిది 8 బంతుల్లో 35 పరుగులు సాధించి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ఖవాజా నాఫే కేవలం 12 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 41 పరుగులు చేశాడు.భారత బౌలర్లలో శశాంక్ సింగ్, తెవాటియా తలా వికెట్ సాధించారు. స్టార్ పేసర్ టి. నటరాజన్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన నటరాజన్ ఏకంగా 28 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో శనివారం (అక్టోబర్ 31) యూఏఈ సిక్సెస్తో తలపడనుంది. -
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన భారత జట్టు కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకుంది. కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని కృనాల్ పాండ్యా భర్తీ చేశాడు. కాగా ఐపీఎల్లో గత రెండు సీజన్లలో సత్తా చాటి ఆర్సీబీ వరుసగా రెండుసార్లు టైటిళ్లు గెలవడంలో భువీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.టీమిండియాలో రీఎంట్రీఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత భువీకి తిరిగి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపువచ్చింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఈ వెటరన్ పేస్ బౌలర్ ఎంపికయ్యాడు. అయితే, అంతకంటే ముందే ఈ యూపీ పేసర్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.తప్పుకొన్న భువీ.. వెస్టిండీస్‌తో బెంగళూరులో ఆఖరిదైన ఐదో టీ20కి ముందు అర్ష్‌దీప్ సింగ్ గాయపడగా.. భువీని జట్టులో చేర్చింది యాజమాన్యం. కాగా అంతకంటే ముందు హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, అతడు టీమిండియాతో చేరడంతో.. ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నాడు.కుల్వంత్ ఖేజ్రోలియాకు చోటుఈ నేపథ్యంలో భువీ స్థానంలో కొత్త కెప్టెన్‌గా ఆల్‌రౌండర్, మరో ఆర్సీబీ ప్లేయర్ కృనాల్ పాండ్యా ప్రమోషన్ పొందగా.. గుజరాత్ టైటాన్స్ స్టార్ కుల్వంత్ ఖేజ్రోలియా జట్టులోకి వచ్చాడు. కాగా ఇరుజట్లు ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే హాంకాంగ్ సిక్సెస్ టోర్నీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి గుర్తింపు ఉంది. మోంగ్ కాక్ వేదికగా అక్టోబరు 30- నవంబరు 1 మధ్య హాంకాంగ్ సిక్సెస్ టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. కాగా గత సీజన్లో భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించి చేదు అనుభవం మూటగట్టుకుంది.హాంకాంగ్ సిక్సెస్-20260 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)కృనాల్ పాండ్యా (కెప్టెన్), నితీశ్ రాణా, శశాంక్ సింగ్, టి.నటరాజన్, రాహుల్ త్రిపాఠి, రాహుల్ తెవాటియా, కుల్వంత్ ఖేజ్రోలియా.ఇదీ చదవండి: అతడికి అన్యాయం: టీమిండియా సెలక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్ -
పాకిస్తాన్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆరోజే!
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ జట్టుకు అనుభవజ్ఞుడైన బౌలింగ్ ఆల్‌రౌండర్ అబ్బాస్ ఆఫ్రిదిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది.నాలుగు గ్రూపులుకాగా మోంగ్ కాక్ వేదికగా అక్టోబరు 30 నుంచి నవంబరు 1 మధ్య హాంకాంగ్ సిక్సెస్ తాజా ఎడిషన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. గ్రూప్-‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా, హాంకాంగ్-చైనా... ఇంగ్లండ్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్.. గ్రూప్- ‘సి’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ.. గ్రూప్-‘డి’ నుంచి సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్, ఒమన్ తలపడనున్నాయి.ఇరుజట్లు ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే ఈ టోర్నీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గుర్తింపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్లో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్టులోకి ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తాయి. పాక్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.భారత జట్టు సారథిగా భువీఇక ఈసారి హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టుకు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథిగా ఎంపికయ్యాడు. అయితే, టీమిండియా పునరాగమనం, న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో భువీ ఈ టోర్నీ నుంచి తప్పుకొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గ్రూప్-‘సి’ మ్యాచ్‌లో భాగంగా భారత్- పాక్ అక్టోబరు 30న తలపడనున్నాయి. కాగా గత ఎడిషన్‌లో పాక్ విజేతగా నిలిచింది.హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నీకి పాకిస్తాన్ జట్టుమహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అహ్మద్ దనియాల్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఖవాజా నఫే, ముహమ్మద్ షాజాద్, సాద్ మసూద్.చదవండి: సెలక్టర్లతో మాట్లాడాను.. టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమే!


