Photo Credit: Twitter
భారత మహిళల క్రికెట్ జట్టు ప్రయాణం మొదలై నేటితో 50 ఏళ్ల పూర్తయ్యింది. 1976 అక్టోబర్ 31న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత మహిళల జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. భారత మహిళల జట్టు ఆడిన మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్‌కు శాంతా రంగస్వామి కెప్టెన్‌గా వ్యవహరించారు.
ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి దాదాపు 22,000 మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీసీసీఐ వెస్టిండీస్‌తో ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు భారత మహిళల ప్లేయింగ్ ఎలెవెన్ వివరాలను 'ఎక్స్' వేదికగా పంచుకుంది.

PC: Twitter
తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు మహిళల జట్టు ప్లేయింగ్ ఎలెవెన్
సంధ్యా మజుందార్
శోభ పండిట్
ఫొజేహి ఖలిలి (వికెట్ కీపర్)
శాంతా రంగస్వామి (కెప్టెన్)
ఉజ్వల నికమ్
శుభాంగి కులకర్ణి
సుసన్ ఇట్టిచెరియా
డయానా ఎడుల్జీ
షర్మిలా చక్రబర్తి
బెహ్‌రోజ్ ఎడుల్జీ
తొలి విజయం ఎప్పుడంటే?
ఇదే సిరీస్‌లో పాట్నాలో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి భారత్ తన తొలి అంతర్జాతీయ విజయాన్ని నమోదు చేసింది. నాటి స్టార్ ప్లేయర్ డయానా ఎదుల్జీ విన్నింగ్ రన్స్ కొట్టారు.
ఎన్నో మైలురాళ్లు..
ఇక 50 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 2025 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను భారత్ ముద్దాడింది. ముంబైలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి చరిత్ర సృష్టించింది. 8 సార్లు ఆసియా కప్ టైటిళ్లను గెలవడంతో పాటు, 2022, 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకాలను సాధించింది

PC: BCCI Twitter
సమాన హక్కులు
ఒకప్పుడు రైళ్లలో జనరల్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడిన మహిళా క్రికెటర్లకు, నేడు BCCI పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజును అందిస్తోంది. అలాగే WPL (వుమెన్స్ ప్రీమియర్ లీగ్) రాకతో మహిళల క్రికెట్ దశే మారిపోయింది. శాంతా రంగస్వామి, డయానా ఎదుల్జీ, సుధా షా వంటి మొదటి తరం క్రికెటర్ల నుంచి మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానల నేటి ఆధునిక విజయాల వరకు 'వుమెన్ ఇన్ బ్లూ' ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.
1️⃣1️⃣ names forever part of the history books 📝 🫡 🗓️ Turning back the clock to this day 5️⃣0️⃣ years ago as the Indian Women's Team took to the field for the first time in a Test vs West Indies 🙌 #TeamIndia https://t.co/jDfsrshkG4
— BCCI Women (@BCCIWomen) October 31, 2026
For the greats who paved the way 👏 🎥 Throwback to a special felicitation of former #TeamIndia Captains ahead of our #CWC25 campaign opener in Guwahati 💙 https://t.co/cRsvGgFrer
— BCCI Women (@BCCIWomen) October 31, 2026
ఇదీ చదవండి: విండీస్ కెప్టెన్ అరుదైన ఫీట్.. బంగ్లాతో టెస్టులో విజయం దిశగా!


