breaking news
Web Special
-
కమల వ్యూహం బెడిసికొట్టింది అక్కడే..!
బిహార్ రాజకీయాల్లో ఓ చిన్న ఉప ఎన్నిక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. ఇది కేవలం ఓ అభ్యర్థి గెలుపు మాత్రమే కాదు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారింది. బీజేపీని ఓడించి తీరాలన్న కసి అక్కడి ఓటర్లలో కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కమల వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? అనేది పరిశీలిస్తే.. పట్నా నగరంలోని బంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి బలమైన అడ్డాగా ఉంది. 1995 నుంచి ఈ స్థానంలో కమలం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. తొలుత నితిన్ నబీన్ తండ్రి నవీన్ చంద్ర సిన్హా.. ఆ తర్వాత నితిన్ నబీన్ వరుస విజయాలతో ఈ సీటును బీజేపీ తన గుప్పిట్లో ఉంచుకుంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి అనూహ్య ఫలితం వెలువడింది.జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీకేకు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 44,827 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.అక్కడే బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్బంకీపూర్ ఫలితాల్లో బీజేపీ వ్యూహ లోపం ప్రధానంగా అభ్యర్థి ఎంపిక దగ్గరే కనిపించిందనే చర్చ జరుగుతోంది. తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ ‘బంటీ’ చివరి సమయంలో తప్పుకోవడంతో.. పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను రంగంలోకి దించాల్సి వచ్చింది. బీజేపీకి బలమైన పట్టు ఉన్న స్థానంలో చివరి నిమిషంలో మార్పు జరగడం క్యాడర్లో కొంత గందరగోళానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే వేదికపైకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సహజంగా ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ ఈసారి “బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం ఎవరు?” అనే లెక్కలో కొంతమంది ఓటర్లు జనసూరాజ్ వైపు మళ్లినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.సంబంధిత వార్త: పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?పీకే ఎంట్రీతో మారిన బిహార్ లెక్కలుఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం తొలి ప్రయత్నాల్లో పెద్ద విజయాన్ని అందుకోలేకపోయారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో ఆయన వ్యూహం పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఒక్క నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టి.. స్థానిక అంశాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో ప్రచారం సాగించారు. ఫలితంగా బీజేపీ కంచుకోటనే బద్దలు కొట్టారు. ఈ విజయం జనసూరాజ్కు అసెంబ్లీలో తొలి అడుగు మాత్రమే కాదు.. బిహార్‌లో మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనే పీకే ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చింది.బీజేపీకి దెబ్బ.. ఆర్జేడీకీ హెచ్చరికబంకీపూర్ ఫలితంలో మరో కీలక అంశం ఆర్జేడీ వెనుకబడటం. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆర్జేడీ.. ఈ ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీకి కూడా ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ బలంగా నిర్మించిన ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకు ఆర్జేడీకి ప్రధాన బలం. అయితే బీజేపీ వ్యతిరేక ఓటులో కొంత భాగం ఈసారి జనసూరాజ్ వైపు వెళ్లినట్లు కనిపించింది. ఈ ధోరణి కొనసాగితే.. ఆర్జేడీ రాజకీయ ఆధిపత్యానికి కూడా సవాల్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇద్దరిలో కారకులెవరూ?బంకీపూర్ ఓటమి ఇప్పుడు బీజేపీలో అంతర్గత చర్చకు దారితీసింది. బాధ్యత ఎవరిపై వేయాలన్న ప్రశ్నపై నితిన్ నబీన్, సమ్రాట్ చౌదరీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సొంత కుటుంబానికి మూడు దశాబ్దాలుగా పట్టున్న స్థానాన్ని కోల్పోవడం నితిన్ నబీన్‌కు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అభ్యర్థి ఎంపిక, ప్రచార నిర్వహణ, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో లోపాలే ఓటమికి కారణమయ్యాయనే చర్చ సాగుతోంది.మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమ్రాట్ చౌదరీకి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్ష. ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో చౌదరీ నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఫలితం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఓ హెచ్చరికగా మారింది.అయితే ఒక్కరిని నిందించడం కంటే.. బంకీపూర్ ఓటమి బీజేపీ ఎన్నికల వ్యూహానికి వచ్చిన పరీక్షగా చూడాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బంకీపూర్ ఇచ్చిన సంకేతం ఏంటి?బంకీపూర్ ఫలితం కేవలం ఓ ఉప ఎన్నిక తీర్పు కాదు.. బిహార్ రాజకీయాల్లో కొత్త పోటీకి సంకేతం. ఇంతకాలం బీజేపీ–ఆర్జేడీ మధ్య సాగిన పోరులోకి ఇప్పుడు జనసూరాజ్ ప్రత్యామ్నాయ శక్తిగా అడుగుపెట్టింది. బీసీ, అగ్రవర్ణాల ఓట్లు ఆ పార్టీకి మళ్లాయి. కమలానికి ఇది కంచుకోట కోల్పోవడమే కాదు.. బలమైన స్థానాల్లో కూడా ఓటర్ల నాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఫలితం. ఆర్జేడీకి తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన సవాలు ఎదురైంది.ప్రశాంత్ కిషోర్ గెలుపు ఒక్క సీటుతో మొదలైనప్పటికీ.. దీని ప్రభావం రాబోయే బిహార్ రాజకీయ సమీకరణాలపై ఎంతవరకు పడుతుంది? బీజేపీ తన కోటను ఎలా తిరిగి నిర్మించుకుంటుంది? జనసూరాజ్ ఈ విజయాన్ని ఎలా విస్తరిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆందోళనలు, నినాదాలు, ప్రజా ఉద్యమాలు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా.. తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. అనేక వర్గాలకు ఇది దశాబ్దాలుగా కీలక వేదికగా మారింది. తాజాగా నీట్ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలకు కూడా ఇదే ప్రాంతం వేదికైంది. ఇలాంటి చరిత్ర ఉన్న జంతర్ మంతర్‌ను నిరసనల కోసం వినియోగించడంపై పునరాలోచించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం, కేంద్రం–ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ చారిత్రక ప్రాంతం మరోసారి చర్చలోకి వచ్చింది.అయితే జంతర్ మంతర్ పుట్టుక నిరసనల కోసం కాదు. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం.. కాలక్రమేణా ప్రజల సమస్యలు ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఒకప్పుడు సూర్యుడు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత పాలకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించే వేదికగా పరిణామం చెందింది. మరి ఈ మార్పు ఎలా జరిగింది? జంతర్ మంతర్ చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు ఏవి? ఆ లోతులోకి వెళ్తే. ఖగోళ కేంద్రం నుంచి ఉద్యమాల వేదిక వరకుజంతర్ మంతర్‌ను 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజు సవాయి జైసింగ్-2 నిర్మించారు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.జంతర్ మంతర్ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (సూత్రం లేదా లెక్కింపు) అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఖగోళ గణనలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా ‘యంత్ర మంత్ర’ కాలక్రమంలో ‘జంతర్ మంతర్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.కానీ కాలం మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్ మంతర్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటం వల్ల తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మొదలైంది. అలా ఖగోళ పరిశోధనలకు వేదికగా ప్రారంభమైన ఈ ప్రదేశం.. క్రమంగా దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిరసన వేదికల్లో ఒకటిగా మారింది.అన్నా ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపుజంతర్ మంతర్‌కు భారీ గుర్తింపు తెచ్చిన ఉద్యమాల్లో 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకటి. బలమైన లోక్‌పాల్ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని దేశం మొత్తం చూసేలా చేసిన ఈ ఉద్యమం తర్వాత జంతర్ మంతర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.అయితే అన్నా ఉద్యమంతోనే జంతర్ మంతర్ నిరసనల చరిత్ర ప్రారంభం కాలేదు. అంతకుముందు నుంచే ఉద్యోగాలు, కార్మిక హక్కులు, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఆందోళనలు నిర్వహించాయి. అన్నా ఉద్యమం మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిపింది.నిర్భయ ఘటనతో యువత కదిలి..2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయం కోసం, కఠిన చట్టాల కోసం జరిగిన నిరసనల్లో జంతర్ మంతర్ కీలక కేంద్రంగా మారింది. యువత ఒక్కటిగా పోరాటానికి దిగింది. ఈ ఉద్యమం ఒక ఘటనకు వ్యతిరేకత మాత్రమే కాదు.. దేశంలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ, చట్టాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల ఆగ్రహం ప్రభుత్వాలను స్పందించేలా చేసిన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.రైతు ఉద్యమాలకు సాక్ష్యంజంతర్ మంతర్ చరిత్రలో రైతు ఉద్యమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయ సమస్యలు, కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం వంటి అంశాలపై రైతు సంఘాలు ఎన్నోసార్లు ఇక్కడ తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020–21లో జరిగిన రైతు ఉద్యమ సమయంలో జంతర్ మంతర్ మరోసారి కీలకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఆందోళనలు సాగినప్పటికీ.. రైతు సంఘాలు ఇక్కడ ప్రత్యేక నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానాలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.రెజ్లర్ల ఆందోళనతో మరోసారి చర్చలోకి2023లో మహిళా రెజ్లర్ల నిరసనలతో జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలకు సంబంధించి సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు క్రీడా రంగంలో మహిళల భద్రత, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.నీట్ నిరసనలు.. కొనసాగుతున్న గళంఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు కూడా జంతర్ మంతర్‌ను ఆశ్రయించారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ వంటి అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, వివిధ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై కూడా అనేక వర్గాలు ఇక్కడ నిరసనలు చేపట్టాయి. ఇలా జంతర్ మంతర్ కేవలం ఒక ప్రాంతంగా కాకుండా.. ప్రజల సమస్యలు దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మారింది.ఇబ్బందులు కూడా ఉన్నాయా?అయితే జంతర్ మంతర్ నిరసనల వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. తరచూ జరిగే ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, స్థానిక ప్రజలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్‌కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది.ప్రజాస్వామ్యానికి ప్రతీక.. మార్పు అవసరమా?జంతర్ మంతర్ భారత ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించే హక్కుకు ఇది ప్రతీకగా నిలిచింది. అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల గొంతు పాలకుల వరకు చేరే అవకాశం కల్పించింది. అయితే నగర నిర్వహణ, సాధారణ ప్రజల సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. జంతర్ మంతర్ ఉద్యమాల వేదికగా కొనసాగుతుందా? లేక కొత్త నిరసన కేంద్రానికి మారుతుందా? అనేది. -
మారిన సీన్.. ధర్మేంద్ర ప్రధాన్‌కు బిగ్ చాన్స్?
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు.. మరో చాన్స్ దక్కనుందా?. స్వరాష్ట్రంలో లభించిన ఘన స్వాగతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఆయనకు ఇకపై ఎలాంటి బాధ్యతలు దక్కబోతున్నాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆయనకు బిగ్చాన్స్ దక్కే అవకాశం ఉందన్న విశ్లేషణలు జోరందుకున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ బలానికి 2024 సంబల్పూర్ విజయం ఒక ఉదాహరణగా నిలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఒడిశాలోని సంబల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 1,19,836 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నితేశ్ గంగా దేవ్ కేవలం 9,162 ఓట్ల స్వల్ప ఆధిక్యంతోనే గెలిచారు. ఐదేళ్ల వ్యవధిలో సంబల్పూర్లో బీజేపీ బలం ఎంతగా పెరిగిందో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పు వెనుక ధర్మేంద్ర ప్రధాన్ చేసిన సంస్థాగత కృషి కీలకమని పార్టీ వర్గాలు భావిస్తాయి. చాలా కాలం ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఒడిశాలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందారు.మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఒడిశాకు తిరిగి వచ్చిన సమయంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ పరిణామమే ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది. ఇది కేవలం ఓ నేతకు ఇచ్చిన స్వాగతమేనా? లేదంటే భవిష్యత్‌లో కీలక బాధ్యతలకు సంకేతమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయనకు జాతీయ రాజకీయాల్లో మరో అవకాశం కష్టమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.రాజీనామా.. అవకాశంగా మారిందా?NEET వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయనకు మరో మంత్రి పదవి ఇవ్వడాన్ని.. అటు ఆందోళనకారులు, ఇటు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఆయనకు మరో అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. అయితే.. సాధారణంగా ఒక మంత్రి పదవి నుంచి తప్పుకోవడం రాజకీయంగా ప్రతికూల పరిణామంగానే భావిస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.రాజీనామా తర్వాత ఆయనకు లభించిన స్వాగతం, పార్టీ నేతల బహిరంగ మద్దతు.. ఆయన రాజకీయ ప్రాధాన్యం ఇంకా తగ్గలేదనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రజల్లో “ఒడిశాకు చెందిన కీలక నేత కేంద్రంలో బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు తిరిగి రాష్ట్రానికి వచ్చారు” అనే భావన కూడా ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.అయితే మరోవైపు.. NEET వివాదం ప్రభావం పూర్తిగా తగ్గిందా? అనేది కూడా ప్రశ్నగానే ఉంది. ముఖ్యంగా యువతలో ఆయనపై ఉన్న అభిప్రాయం ఎలా ఉందన్నది భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుంది.ఒడిశాలో అసలు బలం ఎంత?జాతీయ రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఒడిశా రాజకీయాలపై పట్టు లేదనే వాదనకు ఆయన రాజకీయ ప్రయాణమే సమాధానంగా నిలుస్తుంది. విద్యార్థి దశలో ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఒడిశాలో బీజేపీ ఒక చిన్న శక్తిగా ఉన్న సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతాయి.ప్రత్యేకంగా పశ్చిమ ఒడిశాలో పార్టీ విస్తరణ, కార్యకర్తల నెట్వర్క్ పెంచడం, ఎన్నికల వ్యూహాల్లో ఆయన పాత్ర ఉందనే గుర్తింపు ఉంది. 2024లో సంబల్పూర్లో వచ్చిన భారీ విజయం కూడా ఆయనకు ఉన్న క్షేత్రస్థాయి అనుబంధానికి నిదర్శనంగా బీజేపీ నేతలు చెబుతున్నారు.అయితే ఆయన బలం ఎక్కువగా సంస్థాగత రాజకీయాలు, వ్యూహ రచన, పార్టీ నాయకులతో సమన్వయం చేయడంలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాల్లో ఉండే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఇమేజ్ను మాత్రం మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.సీఎం రేసులో మళ్లీ ధర్మేంద్ర ప్రధాన్?2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి ఒడిశాలో అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీని వెనుక గిరిజన ఓటు బ్యాంక్, సామాజిక సమీకరణాలు కీలకంగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు భావించారు.ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే.. ఆయనకు ఉన్న అనుభవం, ఢిల్లీ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ వెంటనే సీఎం మార్పు చేయడం మాత్రం పార్టీకి అంత సులభమైన నిర్ణయం కాదని భావిస్తున్నారు.ఎందుకంటే మోహన్ చరణ్ మాఝీ ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి కావడంతో ఆయనను మార్చడం మరో రాజకీయ సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది.బీజేపీలో కొత్త సమీకరణాలు?ధర్మేంద్ర ప్రధాన్ పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఒడిశా బీజేపీలో అంతర్గత సమీకరణాలపై కూడా చర్చ మొదలైంది. రాష్ట్ర బీజేపీలో అపరాజిత సారంగి, బైజయంత్ పాండా, మన్మోహన్ సామల్ వంటి నేతలు కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. అందువల్ల ప్రధాన్ పాత్రను పెంచే విషయంలో పార్టీ అధిష్ఠానం సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్టీలో ఉన్న అనుభవం, జాతీయ స్థాయి పరిచయాలు ఆయనకు ప్రత్యేక బలంగా మారుతున్నాయి.ముందున్న దారులు ఏంటి?ధర్మేంద్ర ప్రధాన్ ముందు ప్రధానంగా రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. బీజేపీలో జాతీయ స్థాయిలో మరింత కీలకమైన సంస్థాగత బాధ్యతలు చేపట్టడం. ఎన్నికల వ్యూహాలు, పార్టీ విస్తరణలో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడం. రెండోది.. ఒడిశా రాజకీయాల్లోకి మరింత చురుగ్గా ప్రవేశించి రాష్ట్రంలో పార్టీకి మార్గనిర్దేశం చేయడం.వెంటనే ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా.. భవిష్యత్‌లో ఆయనకు కీలక బాధ్యతలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకవైపు ఆయనపై వచ్చిన విమర్శలకు కారణమైనప్పటికీ.. మరోవైపు ఒడిశాలో ఆయన రాజకీయ బలాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది. సానుభూతి ఎంతవరకు పనిచేస్తుంది? బీజేపీ అధిష్ఠానం ఆయనకు ఎలాంటి పాత్ర ఇస్తుంది? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. -
షా వారసుడికి అడ్డుపడుతోంది ఎవరో తెలుసా?
ఒక అవకాశం వస్తే చాలు.. చరిత్ర తిరగరాస్తానని భావించాడు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసిందనుకున్నాడు. అల్లకల్లోల పరిస్థితులు.. మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.. ఇదే సరైన సమయం అనుకున్నాడు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదు. మద్దతు పెరుగుతుందని భావించిన వేళ.. వరుస సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ప్రయత్నాల్లో షా వారసుడికి ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు.ఇరాన్లో పాలనా మార్పు వస్తే కొత్త నాయకత్వం ఎవరిది? అనే ప్రశ్నకు సమాధానంగా తనను తాను ముందుకు తెచ్చుకున్న మాజీ షా కుమారుడు రెజా పహ్లవీ ప్రయత్నాలకు అనూహ్య అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవంలో తన తండ్రి మహ్మద్ రెజా పహ్లవీ పాలన కూలిపోయిన తర్వాత దేశం విడిచిన రెజా పహ్లవీ దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రవాస జీవితంలోనే ఉన్నారు. రాజరికం అంతమైనప్పటికీ.. షా కుటుంబ వారసుడిగా ఆయన పేరు ఇరాన్ రాజకీయాల్లో మాత్రం కొనసాగుతూనే వచ్చింది. అయితే ఇరాన్లో ఇటీవలి పరిణామాలు, అమెరికా–ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో రాజకీయ మార్పు వస్తుందనే అంచనాలతో ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. ఇరాన్లో కొత్త వ్యవస్థ ఏర్పడితే తాత్కాలిక మార్పు దశకు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో.. ‘నేను గమ్యం కాదు.. వంతెన మాత్రమే’రెజా పహ్లవీ తనను భవిష్యత్ పాలకుడిగా కాకుండా ప్రజాస్వామ్య మార్పుకు మార్గదర్శిగా చూపించుకునే ప్రయత్నం చేశారు. ‘‘నేను గమ్యం కాదు.. గమ్యానికి తీసుకెళ్లే వంతెన మాత్రమే’’ అంటూ ఆయన తన పాత్రను వివరించారు. ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ప్రకటించారు. అయితే..అదే సమయంలో అమెరికా, యూరప్‌లో పర్యటిస్తూ ఆయన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. అమెరికాలోని కొంతమంది సంపన్న ప్రవాస ఇరానీయులు కూడా ఆయనకు ఆర్థిక సహకారం అందించారు. అయితే ఈ మద్దతు దేశంలో బలమైన ప్రజా ఉద్యమంగా మారిందా? అనే అనుమానాలు ఆ సమయంలో వ్యక్తం అయ్యాయి కూడా!.ప్రతిపక్షంలోనే అసలు పోరుఒకవైపు ఇరాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. మరోవైపు ప్రతిపక్షంలోనే విభేదాలు.. ఇంకోవైపు అంతర్జాతీయ మద్దతుపై అనిశ్చితి.. ఇలా మూడు వైపుల సవాళ్ల మధ్య పహ్లవీ రాజకీయ ప్రయాణం సాగుతోంది. రెజా పహ్లవీకి ఎదురైన అతిపెద్ద సవాలు ఇరాన్ ప్రభుత్వమే కాదు.. ప్రతిపక్షంలోని విభేదాలే. ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు అనేకం ఉన్నప్పటికీ.. వాటి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం సమస్యగా మారింది.రాయిటర్స్ కథనం ప్రకారం.. పహ్లవీ చుట్టూ ఉన్న కొందరు మద్దతుదారులు ఇతర ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేయడం, కొందరిపై దాడులకు పాల్పడిన ఘటనలు ఉద్యమ ఐక్యతను దెబ్బతీశాయి. 2023లో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదనే విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం గమనార్హం.దాతల్లోనూ పెరిగిన అసంతృప్తిపహ్లవీకి మద్దతుగా కొందరు ఇరానియన్-అమెరికన్ వ్యాపారవేత్తలు మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో రాజకీయ ఫలితాలు కనిపించడం లేదనే అసంతృప్తి కొందరిలో పెరిగినట్లు సమాచారం. ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయడం, ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది.అమెరికా మద్దతు కూడా ప్రశ్నార్థకమేఇరాన్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న పహ్లవీకి అమెరికా మద్దతు పూర్తిగా లభించలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. ట్రంప్ సహా అమెరికా అధికారులు కూడా ఆయనను భవిష్యత్ ఇరాన్ నాయకుడిగా అధికారికంగా ప్రకటించలేదు. ఇరాన్లో ఆయనకు ఉన్న వాస్తవ ప్రజాదరణ, రాజకీయ స్థిరత్వంపై సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది.షా వారసత్వం.. బలంతోపాటు బలహీనత కూడా!రెజా పహ్లవీకి అతిపెద్ద బలం ఆయన కుటుంబ పేరు. చివరి షా కుమారుడిగా కొందరు ఆయనను స్థిరత్వానికి ప్రతీకగా చూస్తున్నారు. అయితే అదే గతం ఆయనకు సవాల్‌గా మారింది. షా పాలనలో జరిగిన అణచివేతను గుర్తు చేస్తూ కొందరు వర్గాలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అనేక శక్తుల్లో రెజా పహ్లవీ అత్యంత గుర్తింపు ఉన్న వ్యక్తిగా ఉన్నప్పటికీ.. ఆయన ముందున్న అసలు పరీక్ష మాత్రం ఒక్కటే. విభిన్న ప్రతిపక్షాలను ఏకం చేసి, దేశంలో విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా నిలబడగలరా? అన్నదే. -
బాస్కే బాస్ ఎవరు?
అడవిలో పులి అడుగుపెడితేనే చాలా జంతువులు అప్రమత్తమవుతాయి. నిశ్శబ్దంగా కదులుతూ.. క్షణాల్లో వేటను ముగించే సామర్థ్యం దాని సొంతం. బలమైన పంజా, పదునైన గోర్లు, శక్తివంతమైన దవడలతో పులి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ అడవిలో అసలు నిజం వేరే ఉంది.. ఎంతటి శక్తివంతమైన జీవికైనా ప్రకృతిలో ఒక సవాల్ తప్పదు. అడవికి బాస్‌గా పేరున్న పులి కూడా కొన్ని జంతువుల ముందు ఆచితూచి అడుగు వేయాల్సిందే.భారీ శరీరం, అపారమైన బలం, సమూహంగా కదిలే శక్తి, ఊహించని దూకుడు.. ఇలా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న జీవులు పులికి కూడా ఎదురుదెబ్బ ఇవ్వగలవు. అవసరం లేని పోరాటాలకు పులి కూడా దూరంగా ఉంటుంది.. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం ప్రాణాలకే ముప్పు కావచ్చు. తన వేట నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ‘పెద్ద పిల్లి’కి సైతం కొన్ని జంతువులు గట్టి సవాల్‌గా నిలుస్తాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవం(International Tiger Day, Global Tiger Day) సందర్భంగా.. పులిని కూడా వెనక్కి తగ్గించే ఆ జంతువులు ఏవో తెలుసుకుందాం.అడవిలో అత్యంత శక్తివంతమైన జీవుల్లో ఏనుగు ఒకటి. భారీ శరీరం, అపారమైన బలం, తెలివి కారణంగా ఏనుగులు చాలా జంతువులకు సవాల్ విసురుతాయి. సాధారణంగా పులులు పెద్ద ఏనుగులపై దాడి చేయవు. ముఖ్యంగా ఏనుగుల మందలోకి వెళ్లడం పులికి ప్రమాదకరం. చిన్న ఏనుగు పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరిగినా.. తల్లి ఏనుగు, మొత్తం మంద కలిసి పులిని తరిమికొట్టగలవు. ఒక్కసారి ఏనుగు దాడి చేస్తే.. పులికి తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఏనుగుల సమూహాన్ని చూసినప్పుడు పులి కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటుంది.పులికి అసలైన పరీక్ష ఇదే..పులికి ఇష్టమైన ఆహారాల్లో అడవి దున్న (గౌర్) ఒకటి. అయితే దాన్ని వేటాడటం అంత సులభమైన విషయం కాదు. భారీ శరీరం, బలమైన కాళ్లు, పదునైన కొమ్ములు అడవి దున్నకు ప్రధాన ఆయుధాలు. ఒక పెద్ద అడవి దున్న ఎదురుదాడికి దిగితే పులికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పులులు సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద అడవి దున్నలపై కాకుండా.. బలహీనంగా ఉన్నవి, ఒంటరిగా ఉన్నవాటిపై దృష్టి పెడతాయి.మొసలితో మామూలుగా ఉండదుభూమిపై పులి ఎంత శక్తివంతమైనదైనా.. నీటిలో పరిస్థితులు మారిపోతాయి. పెద్ద మొసళ్లు తమ పరిధిలో అత్యంత ప్రమాదకరమైనవి. నదులు, చెరువుల్లోకి దిగినప్పుడు పులి కూడా మొసలి దాడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిలో మొసలి బలం, దాని ఆకస్మిక దాడి పులికి ముప్పుగా మారుతుంది. అయితే పులులు కూడా మంచి ఈతగాళ్లే. అవసరమైతే నదులను దాటి వేట కొనసాగించగల సామర్థ్యం వాటికి ఉంటుంది.ఊహించని ప్రత్యర్థికొన్ని అడవి ప్రాంతాల్లో పులులు, ఎలుగుబంట్లు ఒకే ఆవాసాన్ని పంచుకుంటాయి. ముఖ్యంగా స్లోత్ బేర్ (ఎలుగుబంటి) చాలా దూకుడుగా స్పందించే జంతువు. ఆహారం లేదంటే ప్రాంతం విషయంలో ఎదురుపడినప్పుడు ఎలుగుబంటి వెనక్కి తగ్గకపోవచ్చు. దాని బలమైన గోర్లు, దూకుడు స్వభావం కారణంగా పులి కూడా ఇలాంటి ఘర్షణలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.మరి సింహం పులిని ఓడించగలదా?పులి, సింహం మధ్య ఎవరు బలమైనవారు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. శారీరక బలం, ఒంటరి వేట విషయంలో పులికి కొంత ఆధిక్యత ఉంటుందని చెబుతారు. అయితే సింహం బలం వేరే. అది గుంపుగా జీవిస్తుంది. ఒక సింహం కంటే.. మొత్తం గుంపుగా ఉన్న సింహాలు చాలా ప్రమాదకరం. పులి, సింహం ఎదురుపడితే ఎవరు గెలుస్తారనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు. వాటి పరిమాణం, వయసు, ఆరోగ్యం, పరిస్థితులపై ఫలితం ఆధారపడి ఉంటుంది.పులి అసలు బలం ఏంటి?పులి గొప్పతనం కేవలం దాని బలంలో లేదు.. దాని వ్యూహంలో ఉంది. ఒంటరిగా జీవించే ఈ జంతువు సహనం, తెలివి, సమయస్ఫూర్తితో వేటాడుతుంది. తనకంటే పెద్ద జంతువులను కూడా సరైన సమయం చూసి ఎదుర్కోగలదు. కానీ అవసరం లేని పోరాటాలకు వెళ్లదు. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం దాని ప్రాణాలకు ముప్పే. అడవిలో శాశ్వతంగా బాస్ ఎవరూ ఉండరు. ప్రతి జీవికి ఒక బలం ఉంటుంది.. అదే సమయంలో ఒక సవాలు కూడా ఉంటుంది. -
ఈ జెన్‌జీ భాష కనిపెట్టింది ఎవరో తెలుసా?
నిన్నటి వరకు సోషల్ మీడియా మీమ్స్, చాటింగ్‌ల్లో మాత్రమే కనిపించిన జెన్ జీ భాష.. ఇప్పుడు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలోనూ వినిపించింది. రాజకీయ విమర్శలకు యువత వాడే స్లాంగ్ పదాలను ఎంపీలు ఉపయోగించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఆన్లైన్ సంభాషణల్లో కనిపించే పదాలు.. తాజాగా లోక్‌సభ చర్చలోనూ చోటు దక్కించుకున్నాయి.నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన చర్చలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తొలుత Gen Z పదజాలాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలను విమర్శిస్తూ.. ‘MIA’ (Missing In Action), ‘FOMO’ (Fear Of Missing Out), ‘Delulu’ (Delusional) వంటి పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ కూడా ‘Clock it’ అనే పదాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తేజస్వి సూర్య సైతం ‘Delulu’, ‘source code’ వంటి పదాలను ఉపయోగిస్తూ తన వాదనను వినిపించారు.It's raining Gen Z lingo in Loksabha.BJP MP Bansuri Swaraj said that PM Modi clocked by bringing a bill against the Paper leak. https://t.co/ovC4uz8QKs pic.twitter.com/o2cNJtUT4k— Political Kida (@PoliticalKida) July 28, 2026 "Congress was having FOMO and staying in DELULU".Dr. Shrikant Shinde of Shivsena just bodied Congress in Loksabha in GenZ style! 😂 pic.twitter.com/LMN5IRUQmt— Political Kida (@PoliticalKida) July 28, 2026 అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈ కొత్త భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది విద్యా వ్యవస్థలోని సమస్యలపై అని.. కేవలం కొత్త పదాల ప్రదర్శన కోసం కాదని సూచించారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా ‘Delulu’ పదాన్ని ఉపయోగిస్తూ.. యువత మొత్తం తమవైపే ఉందని భావించొద్దని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.'Delulu' takes over #LokSabha: #TejasviSurya, #SupriyaSule clash over who has Gen Z's support🌍 Catch the day's latest news here ➠ https://t.co/40gdOz6FIS 🗞️ pic.twitter.com/B9cr59wJTm— Economic Times (@EconomicTimes) July 28, 2026అసలు ఈ Gen Z భాష పుట్టింది ఎక్కడ?Gen Z స్లాంగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టిన భాష కాదు. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీమ్ సంస్కృతి, డిజిటల్ జీవనశైలి కలిసి సృష్టించిన కొత్త భాషా రూపం. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగింది. అందుకే వీరి సంభాషణల్లో వేగం, సంక్షిప్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది.ఎక్కువ భావాన్ని తక్కువ పదాల్లో చెప్పడం, సరదాగా స్పందించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం కోసం కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదట చిన్న ఆన్లైన్ గ్రూపులు, గేమింగ్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా చర్చల్లో మొదలైన ఈ పదాలు.. TikTok, Instagram, YouTube వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.మీమ్స్‌తో మొదలై..జెన్‌జీ భాష వ్యాప్తిలో మీమ్ కల్చర్ కీలక పాత్ర పోషించింది. ఒక సంఘటనను లేదంటే ఒక భావాన్ని సీరియస్‌గా కాకుండా సరదాగా చెప్పేందుకు యువత కొత్త పదాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్త పదాలు సినిమాలు, టెలివిజన్, సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్లేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని తీసుకుంది. ఒక వైరల్ వీడియో, ఒక మీమ్ లేదంటే ఒక ట్రెండ్ ద్వారా పుట్టిన పదం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇలా డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పదజాలం ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం, ప్రకటనలు వంటి రంగాల్లోకి కూడా ప్రవేశించింది.యువత ఎందుకు ఇష్టపడుతోంది?ఈ భాషలో కొన్ని పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ‘Delulu’ అంటే వాస్తవానికి దూరమైన ఊహల్లో ఉండటం, ‘FOMO’ అంటే ఏదైనా అవకాశం కోల్పోతామేమో అన్న భయం, ‘MIA’ అంటే కనిపించకుండా పోవడం, ‘Clock it’ అంటే ఒక విషయాన్ని గుర్తించడం లేదా నిజాన్ని బయటపెట్టడం. ‘Rizz’ అంటే ఆకర్షించే వ్యక్తిత్వం, ‘Slay’ అంటే అద్భుతంగా చేయడం, ‘No cap’ అంటే నిజం చెబుతున్నాను అనే అర్థం. సోషల్ మీడియా, మీమ్ కల్చర్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదాలు ఇప్పుడు యువత సంభాషణల్లో భాగమయ్యాయి.జెన్‌జీ భాషకు ప్రధాన ఆకర్షణ దాని సరళత, వేగం. సుదీర్ఘమైన భావాలను ఒకే పదంతో వ్యక్తం చేసే అవకాశం ఈ స్లాంగ్ ఇస్తోంది. అంతేకాదు.. ఒకే తరానికి చెందిన వారు ఒకే రకమైన పదాలను ఉపయోగించడం ద్వారా తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఇది కేవలం మాట్లాడే విధానంలో మార్పు కాదు.. డిజిటల్ యుగంలో ఒక తరం తన గుర్తింపును వ్యక్తం చేసుకునే మార్గంగా మారింది.వ్యాపారాలకు కూడా ఉపయోగమే..ఇప్పుడు కేవలం యువత సంభాషణలకే ఈ భాష పరిమితం కాలేదు. యువ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకునే కంపెనీలు, బ్రాండ్లు కూడా ఈ పదజాలాన్ని గమనిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల్లో యువతకు దగ్గరగా ఉండే భాషను ఉపయోగించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక తరం ఎలా ఆలోచిస్తోంది, ఎలా స్పందిస్తోంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ స్లాంగ్ ఒక సాధనంగా మారింది.విమర్శలు కూడా..అయితే Gen Z భాషపై విమర్శలు కూడా ఉన్నాయి. అధికారిక వేదికల్లో ఇలాంటి స్లాంగ్ పదాలను ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా విద్య, విధానాలు వంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో భాష మరింత గంభీరంగా ఉండాలని కొందరి అభిప్రాయం.భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఎన్నో పదాలు ఇప్పుడు సాధారణ వాడుకలోకి వచ్చాయి. టెక్నాలజీ, సినిమాలు, వీధి సంస్కృతి నుంచి గతంలో పదాలు వచ్చినట్లే.. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పదాలకు వేదికగా మారింది. Gen Z భాష వెనుక అసలు కథ కొన్ని విచిత్రమైన పదాల కథ కాదు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన ఒక తరం తన భావాలను, ఆలోచనలను, గుర్తింపును వ్యక్తం చేసుకునేందుకు సృష్టించుకున్న కొత్త శైలి. అందుకే మీమ్స్, చాటింగ్‌ల నుంచి మొదలైన ఈ భాష.. ఇప్పుడు పార్లమెంట్ చర్చల వరకూ చేరింది.:::వెబ్ ప్రత్యేకం -
అస్సాం వరదల వెనుక భయంకర నిజాలు
అస్సాం మరోసారి జల విలయాన్ని చవిచూస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది వరదలను ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రం.. ఈసారి మాత్రం ఇటీవలి కాలంలోనే అత్యంత తీవ్ర వరద పరిస్థితుల్లో ఒకదాన్ని ఎదుర్కొంది. గ్రామాలకు గ్రామాలు నీట మునగడం, వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం.. అస్సాం వరదల భీకర రూపాన్ని చూపిస్తున్నాయి.ఈసారి వరదల బారిన పడి ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీట మునగగా.. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలిపోయాయి. 37 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ భూమి నీట మునిగింది. పశుసంపద, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి వరద నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే అస్సాం వరదలు కేవలం భారీ వర్షాల ఫలితమేనా? లేదంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కూడా ఈ విపత్తు తీవ్రతను పెంచుతున్నాయా?.. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినా వరదలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?.. Amid Assam's devastating floods, a father was seen swimming through floodwaters while carrying his children in a large tub to safety. The viral visuals have become a powerful symbol of a parent's courage, sacrifice, and unconditional love.#AssamFloods #FloodRescue #Father pic.twitter.com/uz5ZousOSM— Apka Aashish (@ApkaAashish) July 28, 2026అస్సాం భౌగోళిక పరిస్థితులే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మార్చాయి. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర.. అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల నుంచి భారీగా నీటిని తీసుకొస్తుంది. దీనికి అస్సాంలో 50కిపైగా ఉప నదులు కలుస్తాయి. వర్షాకాలంలో ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది.బ్రహ్మపుత్ర నది మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భారీగా ఇసుక, మట్టిని (సిల్ట్) మోసుకొస్తుంది. దీంతో నది లోతు తగ్గి.. తక్కువ నీటిని మాత్రమే మోయగల పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నది తన గట్లను దాటి ప్రవహిస్తుంది.40 శాతానికి పైగా భూభాగం..అస్సాంలో వరద సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఒక గణాంకం చాలు. రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 39.58 శాతం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా గుర్తించారు. ఇది దేశ సగటు వరద ముప్పు ప్రాంతంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి ఏడాది సగటున లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. అంటే అస్సాంలో వరదలు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక వాస్తవం కూడా.ఈసారి ఎందుకు ఇంత భయంకరంగా?ఈ ఏడాది అస్సాం, పొరుగు నాగాలాండ్ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో భారీగా వర్షం కురవడంతో కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు మైదాన ప్రాంతాలకు చేరింది. దీనికి తోడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం తీరు మారుతోంది. గతంలో కొన్ని రోజుల్లో కురిసే వర్షం ఇప్పుడు కొద్ది గంటల్లోనే భారీగా పడుతోంది. ఇలాంటి ఆకస్మిక వర్షాలు నదులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.ప్రభుత్వం వల్ల కావట్లేదా?వరదలను పూర్తిగా ఆపడం అస్సాం లాంటి ప్రాంతంలో దాదాపు అసాధ్యం. కానీ నష్టాన్ని తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.👉పాతబడుతున్న కట్టలువరదలను నియంత్రించేందుకు అస్సాంలో వేల కిలోమీటర్ల మేర కట్టలు (ఎంబాంక్మెంట్లు) నిర్మించారు. రాష్ట్రంలో దాదాపు 4,473 కిలోమీటర్ల మేర కట్టలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది భారీ ప్రవాహాలతో కొన్ని చోట్ల ఇవి బలహీనపడుతున్నాయి. కట్టలు తెగిపోవడమో, బలహీన ప్రాంతాల్లో నీరు చొచ్చుకురావడం వల్లనో ఒక్కసారిగా గ్రామాలు మునిగిపోతున్నాయి.👉తాత్కాలిక చర్యలకే పరిమితంఅస్సాం వరద నిర్వహణలో ఎక్కువగా సహాయక చర్యలు, కట్టల మరమ్మతులు, తాత్కాలిక రక్షణ పనులపైనే దృష్టి ఉందనే విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాలైన నది నిర్వహణ, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ, వరద ప్రాంతాల ప్రణాళిక వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి.👉నదీ కోత మరో పెద్ద సమస్యఅస్సాంలో వరదలతో పాటు నదీ కోత కూడా పెద్ద ప్రమాదమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఏటా భూమిని కోతకు గురిచేస్తాయి. దీంతో ప్రజలు ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నారు.ఆ మార్పులు పెంచుతున్న ముప్పుప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాం వంటి నది పరివాహక ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో సమస్య కేవలం “వరద వస్తుందా?” అన్నది కాదు.. “ఎంత తీవ్రంగా వస్తుంది?” అన్నదే కీలక ప్రశ్నగా మారుతోంది.కావాల్సింది కొత్త విధానంఅస్సాం వరద సమస్యకు కేవలం మరిన్ని కట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. నదుల సహజ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరం. ప్రస్తుతం సహాయక చర్యలతో ప్రాణాలను కాపాడటం ముఖ్యం. కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే.. వరదలను ఎదుర్కొనే విధానంలో మూలమైన మార్పులు అవసరం.అస్సాం వరదలు మరోసారి చెప్పే నిజం ఒక్కటే.. ప్రకృతిని పూర్తిగా నియంత్రించలేం.. కానీ నష్టాన్ని తగ్గించే సిద్ధతను మాత్రం పెంచుకోవచ్చు. -
సహరాలో ఏనుగులు.. దట్టమైన అడవులు! గతం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి.. సహారా. పేరు వినగానే మన కళ్ల ముందు అంతులేని ఇసుక తిన్నెలు, మండే ఎండలు, చుక్క నీరు కూడా దొరకని నిర్మానుష్య భూభాగమే కనిపిస్తుంది. దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఎడారి.. ప్రస్తుతం ఉత్తర ఆఫ్రికాలోని పలు దేశాలను కప్పేసి ఉంది. కానీ వేల సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతం పూర్తిగా భిన్నంగా ఉండేదంటే నమ్మగలమా?ఇప్పుడు ఇసుక తుఫానులతో కనిపించే సహారా.. ఒకప్పుడు పచ్చని గడ్డి మైదానాలు, దట్టమైన అడవులు, ప్రవహించే నదులు, భారీ సరస్సులతో కళకళలాడిన ప్రాంతం. అక్కడ ఏనుగులు, నీటి గుర్రాలు, జిరాఫీలు, ఖడ్గమృగాలు వంటి భారీ జంతువులు సంచరించేవి. మనుషులు కూడా అక్కడ నివసిస్తూ వేటాడుతూ, చేపలు పట్టుతూ, వ్యవసాయం చేస్తూ జీవించేవారట.‘గ్రీన్ సహారా’గా మారిన ఎడారిశాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. సుమారు 11 వేల నుంచి 5 వేల సంవత్సరాల క్రితం మధ్య కాలంలో సహారా ప్రాంతం ‘ఆఫ్రికన్ వెట్ పీరియడ్’ (African Humid Period)గా పిలిచే తేమతో కూడిన దశను ఎదుర్కొంది. ఆ సమయంలో భూమి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎడారి ప్రాంతం పచ్చని భూభాగంగా మారింది. అప్పట్లో సహారాలో అనేక సరస్సులు ఏర్పడ్డాయి. కొన్ని సరస్సులు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేవని ఆధారాలు చెబుతున్నాయి. నదులు ప్రవహించడంతో జీవ వైవిధ్యం పెరిగింది. ఇప్పటి ఇసుక దిబ్బల కింద కూడా పురాతన నదీ మార్గాలు, సరస్సుల ఆనవాళ్లు శాస్త్రవేత్తలకు కనిపించాయి.గోడలపై కనిపించిన గతంసహారా ప్రాంతంలోని పురాతన రాతి చిత్రాలు కూడా అక్కడి చరిత్రను చెబుతున్నాయి. వేల సంవత్సరాల నాటి గుహలు, రాళ్లపై చెక్కిన చిత్రాల్లో ఏనుగులు, నీటి గుర్రాలు, జిరాఫీలు, పశువులు వంటి జంతువుల బొమ్మలు కనిపిస్తాయి. ఇవి ఒకప్పుడు అక్కడ విస్తారమైన జీవజాలం ఉండేదనడానికి ఆధారాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఆ కాలంలో మనుషులు కూడా అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వేటతో పాటు పశుపోషణ, వ్యవసాయం చేసినట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి.ఎలా ఎడారిగా మారింది?సహారా మార్పుకు ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి అక్షం స్వల్పంగా మారడం వల్ల సూర్యకిరణాల ప్రభావం, వర్షపాతం నమూనాలు మారాయి. క్రమంగా వర్షాలు తగ్గిపోయాయి. సరస్సులు ఎండిపోయాయి. నదులు కనుమరుగయ్యాయి. పచ్చని మైదానాలు క్రమంగా ఇసుక ప్రాంతాలుగా మారిపోయాయి. వేల సంవత్సరాల పాటు జరిగిన ఈ ప్రక్రియలో సహారా ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటిగా మారింది.భవిష్యత్తులో మళ్లీ మారుతుందా?ప్రకృతి చరిత్రలో ఎడారులు శాశ్వతంగా ఒకే రూపంలో ఉండవని సహారా కథ చెబుతోంది. వాతావరణ పరిస్థితులు మారితే భూభాగాలు కూడా మారిపోతాయని ఇది నిరూపిస్తోంది. అయితే ప్రస్తుత వాతావరణ మార్పుల ప్రభావంతో సహారా మళ్లీ పచ్చగా మారే అవకాశం తక్షణ భవిష్యత్తులో లేదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి సహారా మనకు ఓ అంతులేని ఎడారిలా కనిపించినా.. దాని ఇసుక పొరల కింద ఓ పచ్చని చరిత్ర దాగి ఉంది. ఒకప్పుడు నదులు ప్రవహించిన, జంతువులు సంచరించిన, మనుషులు జీవించిన ఈ భూమి.. ప్రకృతి శక్తి ఎంత గొప్పదో చెప్పే అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. -
నీట్ లీక్.. రాజీనామా కచ్చితంగా చేయాలా??
ఒక పరీక్ష.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్.. కోట్లాది కుటుంబాల ఆశలు. అలాంటి పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్-యూజీలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత ఎవరిది? లీక్‌కు పాల్పడిన వ్యక్తులదా? లేక ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న మంత్రిదా?..నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్‌ను తోసిపుచ్చుతోంది. ప్రశ్నపత్రం లీక్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని, పరీక్షా వ్యవస్థలో మున్ముందు ఈ తరహావి జరగకుండా సంస్కరణలు చేపడుతున్నామని చెబుతోంది.అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి?. ఆయనేమైనా పేపర్ లీక్ చేశారా?. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు కదా అని!. కానీ.. తన శాఖ పరిధిలో ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థాపరమైన వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదా? అంటూ ఇంకోవైపు కూడా ఒత్తిడి నెలకొంది.నైతిక బాధ్యతా?.. పెద్ద మాటే!రాజకీయాల్లో “నైతిక బాధ్యత” అనేది చట్టపరమైన నేరంతో సమానం కాదు. ఒక మంత్రి స్వయంగా తప్పు చేశారని నిరూపణ కాకపోయినా.. తన శాఖలో జరిగిన తీవ్రమైన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవడం అనే సంప్రదాయం భారత రాజకీయాల్లో గతంలో కనిపించింది. అయితే కాలంతో పాటు ఈ సంప్రదాయంపై అభిప్రాయాలు మారాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు సాధారణంగా.. “తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం, దర్యాప్తు పూర్తి చేయడం, వ్యవస్థను సరిదిద్దడం”నే బాధ్యతగా చెబుతున్నాయి. ఇదే నీట్ వివాదంలోనూ కేంద్రం వాదన.గతం ఏం నేర్పింది మరి?నీట్ వ్యవహారంలో మరో కీలక ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. 2024లోనూ నీట్-యూజీ నిర్వహణపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్షా విధానంపై అనుమానాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. ఆ సమయంలోనూ కేంద్ర విద్యాశాఖపై ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు ధర్మేంద్ర ప్రదానే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నీట్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినడంతో.. “గత వివాదాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? వ్యవస్థలో లోపాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మరోవైపు నీట్ వివాదాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆందోళనలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు చెబుతున్నారు.అయితే కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. లీకో, అవకతవకలో.. పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా సంస్కరణలు తీసుకురావడమే అసలు బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది.గతంలో నైతిక బాధ్యతతో పదవి వదిలిన నేతల గురించి తెలుసా?.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న వీళ్లు పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి మరి!. లాల్ బహదూర్ శాస్త్రి..స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో నైతిక బాధ్యతకు తొలి ఉదాహరణగా తరచూ ప్రస్తావించే పేరు లాల్ బహదూర్ శాస్త్రి. 1956లో తమిళనాడులోని అరియలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి శాస్త్రి ప్రత్యక్షంగా కారణం కాదు. అయినప్పటికీ రైల్వే మంత్రిగా శాఖ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలుత ఆయన నిర్ణయాన్ని అంగీకరించకపోయినా.. శాస్త్రి పట్టుదలతో చివరకు రాజీనామాను ఆమోదించారు.టీటీ కృష్ణమాచారి..1958లో వెలుగులోకి వచ్చిన ముండ్రా కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఎల్ఐసీ పెట్టుబడుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, ఆర్థిక శాఖపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో తన శాఖపై వచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా నైతిక బాధ్యతకు ఉదాహరణగా చెప్పబడుతుంది.మాధవరావ్ సింధియా.. 1992లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావ్ సింధియా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష కారణం కాకపోయినా.. శాఖ మంత్రిగా వ్యవస్థాపరమైన లోపాలకు బాధ్యత వహించడం రాజకీయాల్లో నైతిక ప్రమాణంగా నిలిచింది.నితీశ్ కుమార్.. గైసాల్ రైలు ప్రమాదం1999లో పశ్చిమ బెంగాల్‌లోని గైసాల్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వందలాది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి రైల్వే మంత్రి నితీశ్ కుమార్.. ప్రమాదానికి తాను ప్రత్యక్ష కారణం కాకపోయినా, రైల్వే శాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.జార్జ్ ఫెర్నాండెజ్..2001లో తెహల్కా నిర్వహించిన ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ స్టింగ్ ఆపరేషన్ రక్షణ శాఖలో అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఈ వ్యవహారంపై తీవ్ర రాజకీయ దుమారం రేగడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. తర్వాత ఆయన తిరిగి కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పటికీ.. ఆ సమయంలో రక్షణ శాఖపై వచ్చిన ఆరోపణలకు రాజకీయ బాధ్యత వహించిన ఘటనగా ఇది నిలిచింది.ప్రతి వైఫల్యానికి రాజీనామా జరిగిందా?అలా ఏం జరగలేదు. భారత రాజకీయ చరిత్రలో ప్రతి పరిపాలనా వైఫల్యానికి మంత్రి పదవి వదిలిన సందర్భాలు లేవు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు దర్యాప్తులు, కమిటీలు, సంస్కరణలతో ముందుకు వెళ్లాయి. అందుకే ఇప్పుడు నీట్ వివాదంలోనూ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వాదన ప్రకారం.. లీక్‌కు పాల్పడిన వ్యక్తులు గుర్తించబడ్డారు. అరెస్టులు జరిగాయి. దర్యాప్తు కొనసాగుతోంది. ఒక నేరానికి పాల్పడిన వ్యక్తుల చర్యలకు మంత్రిని నేరుగా బాధ్యుడిని చేయడం సరైన విధానం కాదని కేంద్రం చెబుతోంది.మరోవైపు ఆందోళనకారులు, ప్రతిపక్షాల వాదన మాత్రం వేరుగా ఉంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు.. వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న మంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.నీట్ వివాదం.. అసలు పరీక్ష ఎవరికంటే?నీట్ లీక్ వివాదం చివరకు ఒక మంత్రి పదవి ప్రశ్నకే పరిమితం కాదు. దేశంలోని పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మిస్తారు? భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భరోసా ఇస్తారు? అన్నదే అసలు సవాల్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? లేదా అన్నది రాజకీయ నిర్ణయం. కానీ “ఒక వ్యవస్థ విఫలమైతే.. దాని అధిపతి ఎంతవరకు బాధ్యత వహించాలి?” అనే పాత ప్రశ్నను నీట్ వివాదం భారత రాజకీయాల్లో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ::వెబ్ ప్రత్యేకం -
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్‌కు అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్‌లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్‌ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్‌కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్‌గా వెల్లడించారు. -
ఒక్క గోల్.. 12 ఏళ్ల తర్వాత అదే చరిత్ర!
ఫుట్‌బాల్‌లో ఒక గోల్ అంటే కేవలం స్కోర్ బోర్డుపై పెరిగే ఒక సంఖ్య కాదు.. కోట్లాది మంది అభిమానుల ఆశలు, భావోద్వేగాలను మార్చే క్షణం. ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్ లాంటి అత్యున్నత వేదికపై ఒక్క గోల్ కూడా ఓ జట్టును చరిత్రలో నిలబెడుతుంది. కొన్ని ఫైనల్స్‌లో అయితే 90 నిమిషాల ఉత్కంఠకు తెరదించేది ఒకే ఒక్క గోల్. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. ఒకే దెబ్బతో ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సందర్భాలు ఫిఫా చరిత్రలో అరుదుగా నమోదయ్యాయి.ఒక్క గోల్.. ఒక్క క్షణం.. కానీ ఆ క్షణమే ఓ జట్టును చరిత్రలో శాశ్వతంగా నిలబెడుతుంది. అందుకే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో 1-0 విజయాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే మ్యాచ్ ఫలితం 1-0తో తేలింది. ఈ ప్రతి విజయానికీ ఓ ప్రత్యేక కథ ఉంది.బ్రెహ్మే పెనాల్టీతో జర్మనీ చాంపియన్1990 ఇటలీ ప్రపంచకప్ ఫైనల్లో వెస్ట్ జర్మనీ, అర్జెంటీనా తలపడ్డాయి. అప్పటికే ఇరు జట్లు గట్టి పోరాటం సాగించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. గోల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు 85వ నిమిషంలో కీలక క్షణం వచ్చింది. జర్మనీకి లభించిన పెనాల్టీని ఆండ్రియాస్ బ్రెహ్మే గోల్‌గా మలిచాడు. ఆ ఒక్క గోల్‌తో వెస్ట్ జర్మనీ ప్రపంచకప్‌ను ముద్దాడింది.ఇనియెస్టా గోల్‌తో స్పెయిన్ కల సాకారం2010 దక్షిణాఫ్రికా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. 116వ నిమిషంలో ఆండ్రెస్ ఇనియెస్టా చేసిన అద్భుతమైన గోల్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. అదే స్పెయిన్‌కు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది. ఒక్క గోల్.. స్పెయిన్ ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలుగా నిలిచిపోయింది.గోట్జే దెబ్బతో అర్జెంటీనాకు నిరాశ2014 బ్రెజిల్ ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనా మరోసారి ప్రపంచ వేదికపై తలపడ్డాయి. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా టైటిల్‌పై కన్నేయగా.. జర్మనీ పటిష్ఠ రక్షణతో పోరాడింది. మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లిన తర్వాత 113వ నిమిషంలో మారియో గోట్జే చేసిన గోల్ జర్మనీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఫైనల్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డుపై నిలిచింది 1-0.2026.. స్పెయిన్ మరోసారి అదే ఘనత12 ఏళ్ల తర్వాత.. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే తరహా ఫలితం నమోదైంది. స్పెయిన్, అర్జెంటీనా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో నిర్ణీత 90 నిమిషాల్లో గోల్స్ నమోదు కాలేదు. అదనపు సమయంలో 106వ నిమిషంలో ఫెర్రాన్ టోరెస్ చేసిన కీలక గోల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ ఒక్క గోల్‌తో స్పెయిన్ ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఫైనల్‌ను 1-0తో గెలిచిన అరుదైన జట్ల జాబితాలో స్పెయిన్ చేరింది.ఎందుకంత ప్రత్యేకం? ప్రపంచకప్ ఫైనల్లో జట్లు సాధారణంగా ఎంతో జాగ్రత్తగా ఆడతాయి. చిన్న తప్పిదం కూడా ట్రోఫీని దూరం చేయగలదనే ఒత్తిడి ఆటగాళ్లపై ఉంటుంది. అందుకే ఫైనల్స్‌లో భారీ స్కోర్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. 1-0 విజయాల్లో గెలిచిన జట్లు కేవలం దాడిలోనే కాదు.. రక్షణలోనూ తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా.. వచ్చిన ఒక్క అవకాశాన్ని గోల్‌గా మార్చుకుని ప్రపంచ చాంపియన్లుగా నిలిచాయి. -
ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?
కృత్రిమ మేధస్సు .. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యాధునిక సాంకేతికతగా మారింది. ఒకప్పుడు మనిషి మాత్రమే చేయగలడని భావించిన అనేక పనులను ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. వార్తల రచన నుంచి వైద్య నిర్ధారణ వరకు, సినిమాల నిర్మాణం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, విద్య నుంచి వ్యాపార రంగం వరకు ప్రతి చోటా తన ముద్ర వేస్తోంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, టెక్నాలజీ సంస్థలు మరో ప్రశ్నపై దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏఐ తర్వాతి స్థాయి టెక్నాలజీ ఏమిటి? భవిష్యత్తు ప్రపంచాన్ని ఏ సాంకేతిక విప్లవం నడిపించబోతోంది?..ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పనులనే సమర్థంగా నిర్వహిస్తాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, చిత్రాలు రూపొందించడం, అనువాదాలు చేయడం, డేటాను విశ్లేషించడం వంటి నిర్దిష్ట పనుల్లో ఇవి అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. కానీ మనిషిలా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మాత్రం వీటికి లేదు. ఈ పరిమితిని అధిగమించాలనే లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)పై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి.👉ఏజీఐ అంటే మనిషిలా ఆలోచించగలిగే, కొత్త విషయాలను స్వయంగా నేర్చుకోగలిగే, ఒక రంగంలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరో రంగంలో కూడా ఉపయోగించగలిగే కృత్రిమ మేధస్సు. ఒకే వ్యవస్థ వైద్యుడిలా రోగాన్ని గుర్తించడమే కాకుండా, శాస్త్రవేత్తలా పరిశోధనలు చేయడం, ఇంజినీర్లా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, ఉపాధ్యాయుడిలా బోధించడం వంటి అనేక పనులను నిర్వహించగల స్థాయికి చేరుకోవడమే ఏజీఐ లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ సంస్థ కూడా పూర్తిస్థాయి ఏజీఐని అభివృద్ధి చేయలేదు. అయితే ఆ దిశగా తీవ్ర పరిశోధనలు కొనసాగుతున్నాయి.👉ఏజీఐ తర్వాత శాస్త్రవేత్తలు ఊహిస్తున్న మరో దశ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI). ఇది మానవ మేధస్సును కూడా అధిగమించే స్థాయి కృత్రిమ మేధస్సుగా భావిస్తున్నారు. విజ్ఞానం, పరిశోధనలు, విశ్లేషణ, నిర్ణయాలు, సృజనాత్మకత వంటి అన్ని రంగాల్లో మనిషి కంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంటుందని అంచనా. అయితే ఇది ఇప్పటికీ పూర్తిగా సిద్ధాంత స్థాయిలోనే ఉంది. అలాంటి వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు.👉భవిష్యత్తులో మరో కీలక మార్పు ‘ఎంబాడీడ్ ఏఐ’ రూపంలో కనిపించే అవకాశం ఉంది. అంటే కేవలం కంప్యూటర్ లేదా మొబైల్లో ఉండే ఏఐ కాకుండా, మనుషుల మాదిరిగా నడిచే, చూసే, వినే, వస్తువులను తాకి పని చేసే హ్యూమనాయిడ్ రోబోల్లో ఏఐ పనిచేస్తుంది. ఇలాంటి రోబోలు పరిశ్రమలు, ఆసుపత్రులు, వ్యవసాయం, వృద్ధుల సంరక్షణ, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే భవిష్యత్తు కేవలం ఏఐతోనే పరిమితం కాదని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, మెదడు-కంప్యూటర్ అనుసంధానం (Brain-Computer Interface), జన్యు సాంకేతికత, ఫ్యూజన్ ఎనర్జీ వంటి రంగాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఏఐతో కలయిక జరిగితే ప్రస్తుతం ఊహించలేని స్థాయిలో సాంకేతిక విప్లవం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యంత్రాలు మనిషిని పూర్తిగా భర్తీ చేయడం కంటే, మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచే సహాయకులుగా మారే దిశగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని మార్చుతున్నట్లే.. భవిష్యత్తులో ఏజీఐ, ఎంబాడీడ్ ఏఐ వంటి సాంకేతికతలు మన జీవన విధానాన్ని మరోసారి పూర్తిగా మార్చే అవకాశాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.:::వెబ్ ప్రత్యేకం -
ఎల్ నినో ఉగ్రరూపం!.. ఫసిఫిక్ వేడితో డేంజర్ బెల్స్
భూమి వాతావరణాన్ని తలకిందులు చేసే శక్తివంతమైన ఎల్ నినోమరోసారి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి కేవలం సముద్ర ఉపరితలంలోనే కాదు.. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లోనే భారీగా వేడి నీటి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ అసాధారణ మార్పులను నాసా ఉపగ్రహాలు గుర్తించడంతో ప్రపంచ వాతావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. సముద్రం అడుగున నుంచి తూర్పు పసిఫిక్ వైపు కదులుతున్న ఈ వేడి ప్రవాహాలు భవిష్యత్‌లో అత్యంత శక్తివంతమైన(గాడ్జిల్లా) ఎల్ నినోకు సంకేతాలా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా కనిపించే ఎల్ నినో (El Niño) పరిస్థితులతో పోలిస్తే.. ఈసారి సముద్రం వేడెక్కుతున్న వేగం, తీవ్రత భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే 2026లో ఏర్పడే అవకాశం ఉన్న ఈ ఎల్ నినోను కొందరు నిపుణులు ‘గాడ్జిల్లా ఎల్ నినో’గా అభివర్ణిస్తున్నారు.150 ఏళ్ల రికార్డును బద్దలయ్యేనా?2026-27 కాలానికి సంబంధించి వెలువడుతున్న తాజా వాతావరణ నమూనాలు సంచలన అంచనాలను చూపిస్తున్నాయి. ఈసారి ఏర్పడే ఎల్ నినో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన ఘటనలను అధిగమించే అవకాశం ఉందని కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. గతంలో 1997-98లో నమోదైన ఎల్ నినో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత 2015-16 ఎల్ నినో కూడా రికార్డు స్థాయి వేడితో చరిత్రలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సముద్ర మార్పులు.. 2026 ఎల్ నినో వీటిని మించే స్థాయికి చేరవచ్చనే అంచనాలకు కారణమవుతున్నాయి.ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 14 ప్రధాన వాతావరణ నమూనాల నుంచి సేకరించిన వందలాది అంచనాల్లో ఎక్కువ భాగం ఈసారి ఎల్ నినో బలంగా మారే అవకాశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల పసిఫిక్‌లోని నినో-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమూనాలు అంచనా వేస్తున్నాయి.ఇది 2015-16లో నమోదైన దాదాపు 2.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కంటే ఎక్కువ. ఈ అంచనాలు నిజమైతే.. గత 150 ఏళ్ల వాతావరణ రికార్డుల్లోనే ఇది అత్యంత అసాధారణమైన ఎల్ నినోగా నిలిచే అవకాశం ఉంది.నాసా ఉపగ్రహాల్లో కనిపించిన వేడి అలలుపసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెంటినెల్-6 మైఖేల్ ఫ్రైలిచ్ ఉపగ్రహం పరిశీలిస్తోంది. ఉపగ్రహ డేటాలో సముద్రం లోతుల్లో ప్రయాణించే కెల్విన్ తరంగాలు (Kelvin Waves) భారీ మొత్తంలో వేడి నీటిని తూర్పు పసిఫిక్ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎల్ నినో ఏర్పడటంలో ఈ తరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి.సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో గాలుల ప్రవాహం, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత ఉంటుంది. అయితే ట్రేడ్ గాలులు బలహీనపడినప్పుడు.. సముద్రం లోతుల్లో దాగి ఉన్న వేడి నీరు తూర్పు వైపు కదులుతుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి.వేగం కూడా శాస్త్రవేత్తలకు షాక్ఈసారి ఎల్ నినో తీవ్రత మాత్రమే కాదు.. అది అభివృద్ధి చెందుతున్న వేగం కూడా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. 1997-98 ఎల్ నినో అత్యంత వేగంగా బలపడిన ఘటనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుత పరిణామాలు అంతకంటే వేగంగా మారుతున్నట్లు కొన్ని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. 2026 ప్రారంభంలో లా నినా తరహా పరిస్థితుల నుంచి ఈ ఎల్ నినో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సముద్ర మార్పులకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి తక్కువ వ్యవధిలోనే పసిఫిక్ వేడెక్కడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు ఎల్ నినో అంటే..పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని పశ్చిమ ప్రాంతాలకు తరలిస్తాయి. అదే సమయంలో సముద్రం లోతుల్లోని చల్లని నీరు పైకి వస్తుంది. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి మారుతుంది. సముద్రం అడుగున ఉన్న వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపు చేరుతుంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్నే ఎల్ నినో అంటారు. ఇది కేవలం ఒక సముద్ర ప్రాంతానికి పరిమితమైన మార్పు కాదు. ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తివంతమైన ప్రకృతి ప్రక్రియ.ప్రపంచ వాతావరణంపై ప్రభావం ఎలా?శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, వేడి గాలులు పెరగొచ్చు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, నీటి కొరత, అటవీ అగ్నిప్రమాదాలు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.భారత్‌పై ఎలాంటి ప్రభావం?భారత్‌కు ఎల్ నినో ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చు. వర్షాలు తగ్గితే పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే భారత రుతుపవనాలపై ఎల్ నినోతో పాటు హిందూ మహాసముద్ర డైపోల్ (IOD), స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో కలిస్తే మరింత ముప్పు?ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో.. ఇలాంటి శక్తివంతమైన ఎల్ నినో మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2023, 2024లో ప్రపంచం రికార్డు స్థాయి వేడిని చూసింది. ఇప్పుడు మరో బలమైన ఎల్ నినో కూడా తోడైతే.. ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులను తాకుతాయా? అనే అంశంపై నిపుణులు దృష్టి సారించారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న వేడి.. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతుందా? అన్నదే కీలక ప్రశ్న. ‘గాడ్జిల్లా ఎల్ నినో’ నిజంగా బలపడితే.. దాని ప్రభావం పసిఫిక్ తీరాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. -
పోక్సో చట్టం.. కవచమా? కాగితపు పులినా?
పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన నిందితుడు ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడం.. అందునా బాధిత బాలికను అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోక్సో.. పిల్లలకు కవచమా? నిందితులకు అవకాశమా? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన సామూహిక హత్యలు ఈ ప్రశ్నను మరోసారి దేశం ముందుకు తెచ్చాయి. దీంతో పిల్లల రక్షణ కోసం రూపొందించిన కఠిన ‘పోక్సో’ చట్టం అమలులో ఏ మేర లోపాలున్నాయి? మైనర్లకు రక్షణ కల్పించాల్సింది బదులు నిందితులకు అవకాశంగా మారుతున్నాయా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.మన దేశంలో 2012లో లైంగిక దాడుల్లో మైనర్ల రక్షణ కోసం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇదే ఏడాది డిసెంబర్లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఈ రెండు సంఘటనలను చాలామంది ఒకటిగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి పోక్సో చట్టం నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందే (2012 నవంబర్ 14 నుంచి) అమల్లోకి వచ్చింది. అయితే నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత, లైంగిక నేరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పోక్సో చట్టం అమలు మరింత కఠినంగా మారింది. 2019లో కేంద్ర ప్రభుత్వం పోక్సోకు కొన్ని సవరణలు చేసి, కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష వరకు విధించే అవకాశాన్ని కూడా చట్టంలో చేర్చింది.పోక్సో ప్రత్యేకత ఏంటి?ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు ప్రతి బాలుడు, బాలికకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. శారీరక దాడితో పాటు లైంగిక వేధింపులు, అశ్లీల ప్రదర్శనలు, ఆన్లైన్ లైంగిక వేధింపులు, పిల్లల అశ్లీల చిత్రాల తయారీ, వినియోగం వంటి అనేక నేరాలను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అలాగే ప్రత్యేక పోక్సో కోర్టులు, ఇన్‌కెమెరా విచారణ, బాధితుడి గుర్తింపు గోప్యంగా ఉంచడం, పిల్లలకు అనుకూలమైన విచారణ విధానం వంటి అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి.పోక్సోకు ముందు పరిస్థితి ఏంటి?చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే.. పోక్సోకు ముందే పిల్లలపై లైంగిక నేరాలకు చట్టమే లేదనేది. కానీ అది నిజం కాదు. పోక్సోకు ముందు కూడా భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద అత్యాచారం, అసభ్య ప్రవర్తన, వేధింపులు, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్షలు విధించేవారు. అయితే ఆ చట్టాల్లో పిల్లల కోసం ప్రత్యేక నిర్వచనాలు, ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక విచారణ విధానం లేవు. ముఖ్యంగా అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులు, శారీరక సంబంధం లేకుండా జరిగే లైంగిక వేధింపులు, పిల్లలను అశ్లీల చిత్రాల్లో ఉపయోగించడం వంటి అనేక నేరాలకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనం లేకపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండేవి.పోక్సో వచ్చాక కూడా.. బెయిల్ ఎలా?పోక్సో కేసు అంటే బెయిల్ రాదనుకోవడం సరికాదు. నేర తీవ్రత, సాక్ష్యాలు, దర్యాప్తు దశ, నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, బాధితుల భద్రత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టులు బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటాయి. అంటే చట్టం బెయిల్‌ను పూర్తిగా నిషేధించలేదు. అయితే బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించే షరతులు, వాటి అమలు చాలా కీలకం. షాబాద్ కేసులో..రాజశేఖర్ విషయంలో ఇదే జరిగి ఉంటుంది.చట్టంలో లోపమా.. అమలులో లోపమా?న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య ఎక్కువగా చట్టంలో కంటే అమలులోనే ఉంది. బెయిల్‌పై విడుదలైన నిందితులపై నిరంతర నిఘా, బాధిత కుటుంబాలకు రక్షణ, నిందితుడు బాధితులను సంప్రదించకుండా కఠిన ఆంక్షలు అమలు చేయడం, అవసరమైతే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వంటి వ్యవస్థలు మన దేశంలో ఇంకా పరిమితంగానే ఉన్నాయి.ఇలాంటి చర్చ ఇదే తొలిసారి కాదు. పోక్సో చట్టం అమలు, దాని వ్యాఖ్యానంపై గతంలోనూ దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీవ్ర చర్చ జరిగింది. 2021లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇచ్చిన 'స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్' తీర్పు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. బట్టలపై నుంచి తాకితే అది పోక్సో కింద లైంగిక దాడి కాదన్న వ్యాఖ్యలపై బాలల హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ.. లైంగిక ఉద్దేశంతో పిల్లలను తాకే ఏ చర్య అయినా పోక్సో పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. అలాగే పోక్సో కేసుల్లో బెయిల్‌పై విడుదలైన నిందితులు బాధితులను బెదిరించడం, సాక్షులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు కూడా గతంలో పలు రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో బెయిల్ షరతులను మరింత కఠినతరం చేయడం, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించడం, విడుదలైన నిందితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న డిమాండ్ అప్పట్లోనే వినిపించింది.విదేశాల్లో ఎలా ఉంటుంది?అమెరికాలో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని రికార్డుల్లో(Sex Offender Registry)లో నమోదు చేసి.. విడుదల తర్వాత కూడా ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తారు. పిల్లల పాఠశాలలు, పార్కులు, నివాస ప్రాంతాలకు వెళ్లకుండా కోర్టులు ఆంక్షలు విధిస్తాయి.బ్రిటన్‌లో ఎస్హెచ్పీవో( Sexual Harm Prevention Orders) ద్వారా నిందితుల కదలికలు, పిల్లలతో సంబంధాలు, ఇంటర్నెట్ వినియోగంపైనా పరిమితులు విధించవచ్చు.ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్లో విడుదలైన లైంగిక నేరస్థులపై ఎలక్ట్రానిక్ ట్రాకింగ్, పోలీసు పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉన్నాయి.భారత్‌లో చట్టం బలహీనమా?శిక్షల పరంగా చూస్తే భారత పోక్సో చట్టం ప్రపంచంలోనే కఠినమైన చట్టాల్లో ఒకటి. తీవ్రమైన కేసుల్లో జీవిత ఖైదు, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కానీ నిపుణులు చెబుతున్నది ఒక్కటే. చట్టం కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులపై కఠిన నిఘా, బాధిత కుటుంబాల భద్రత, వేగవంతమైన విచారణ, సాక్షుల రక్షణ వంటి అంశాలు కూడా అంతే బలంగా అమలు కావాలి.షాబాద్ ఘటన చెబుతున్న పాఠంషాబాద్ సామూహిక హత్యలు కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు. పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టం అమలు విషయంలో ఉన్న లోటుపాట్లను మరోసారి గుర్తు చేశాయి. పోక్సోను మరింత కఠినతరం చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చట్టం కంటే దాని అమలు, బెయిల్ తర్వాత నిందితుల పర్యవేక్షణ, బాధిత కుటుంబాల భద్రతను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.:::వెబ్ ప్రత్యేకం -
24 గంటలూ కరెంట్.. ఇంధనం మాత్రం జీరో!
విద్యుత్ అంటే బొగ్గు, గ్యాస్, అణుశక్తి, జలవిద్యుత్, సౌర, పవన శక్తి.. ఇప్పటివరకు ప్రపంచం చూసింది ఇవే. కానీ ఇప్పుడు జపాన్ మరో అడుగు ముందుకేసింది. ఇంధనం అవసరం లేదు.. పొగలు, కాలుష్యం ఉండదు.. గాలి ఉన్నా లేకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేయగల సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తోంది.జపాన్‌లోని ఫుకువోకా నగరంలో ప్రపంచంలోనే అరుదైన ‘ఆస్మోటిక్ పవర్ ప్లాంట్’ నడుస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని ‘బ్లూ ఎనర్జీ’గా అభివర్ణిస్తున్నారు.సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటిలోని ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంట్ ప్రపంచానికి చూపిస్తోంది.అలా ఎలా?ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. దీని వెనుక ఉన్న సూత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు ఉప్పు నీటిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల నీటిని ప్రత్యేకమైన సెమీ-పర్మియబుల్ మెంబ్రేన్ (ప్రత్యేక పొర) ద్వారా వేరు చేసి ఉంచుతారు. సహజంగా ఉప్పు తక్కువగా ఉన్న నీరు.. ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి వైపు కదలడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియనే ఆస్మోసిస్ అంటారు. ఈ సహజ పీడనాన్ని టర్బైన్లకు అనుసంధానిస్తే అవి తిరిగి.. జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. అంటే.. ఇంధనం లేకుండానే, ప్రకృతి సిద్ధమైన ఉప్పు సాంద్రత తేడానే విద్యుత్‌కు మూలం అవుతుంది.వాతావరణంతో సంబంధం లేదుసౌర విద్యుత్‌కు ఎండ అవసరం. పవన విద్యుత్‌కు గాలి అవసరం. జలవిద్యుత్‌కు నీటి ప్రవాహం అవసరం. కానీ బ్లూ ఎనర్జీకి ఇవేవీ అవసరం ఉండవు. సముద్రం ఉన్నంత కాలం, శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో ఉన్నంత కాలం ఈ ప్లాంట్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. అందుకే భవిష్యత్తులో బేస్‌లోడ్ పవర్ (నిరంతర విద్యుత్ సరఫరా)కు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.ప్రయోజనాలే ప్రయోజనాలుఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం ఉండవు. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు దాదాపు ఉండవు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ఇది అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఇప్పటికే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సులభం. విద్యుత్ ఉత్పత్తితో పాటు మురుగు నీటి నిర్వహణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.సవాళ్లు కూడా..అయితే ఈ సాంకేతికత ఇప్పుడే పూర్తిస్థాయిలో వాణిజ్య వినియోగానికి సిద్ధం కాలేదు. అత్యంత నాణ్యమైన మెంబ్రేన్‌ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాల్. అలాగే సముద్రపు నీటిలో ఉండే ఉప్పు, సూక్ష్మ జీవుల వల్ల మెంబ్రేన్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయినా.. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రపంచానికి కొత్త దారి..సముద్రపు అలల్లోనే కాదు.. సముద్రపు ఉప్పు నీటిలోనూ అపారమైన శక్తి దాగి ఉందని జపాన్ ప్రపంచానికి చూపిస్తోంది. బొగ్గు, గ్యాస్‌లపై ఆధారపడకుండా.. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. 24 గంటలూ విద్యుత్‌ను అందించే 'బ్లూ ఎనర్జీ' భవిష్యత్తులో ఇంధన రంగానికే కొత్త దిశను చూపే సాంకేతికతగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇంకో విశేషం.. 2025 ఆగస్టులో జపాన్‌లోని ఫుకువోకాలో ఈ ‘బ్లూ ఎనర్జీ’ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటి మధ్య ఉండే ఉప్పు సాంద్రత తేడాను వినియోగించే ‘ప్రెషర్ రిటార్డెడ్ ఆస్మోసిస్ (PRO)’ సాంకేతికతతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. సౌర, పవన విద్యుత్‌లా వాతావరణంపై ఆధారపడకుండా పగలు–రాత్రి నిరంతరం పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తే.. ప్రపంచ విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం వరకు తీర్చే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.:::వెబ్ స్పెషల్ -
ట్రంప్‌ను కూల్ చేసేందుకు.. నాటో కొత్త ఎత్తుగడలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలకు తెరదించే ప్రయత్నంలో అట్లాంటిక్ కూటమి (నాటో) కీలక అడుగులు వేస్తోంది. సభ్యదేశాల మధ్య ఐక్యతపై ఎలాంటి సందేహాలకు తావులేకుండా చేయడంతో పాటు, వాషింగ్టన్ ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ.. ఐరోపా భద్రతకు పెరుగుతున్న సవాళ్లు, అమెరికా వైఖరిలో వచ్చిన మార్పులు, సభ్యదేశాలపై ట్రంప్ ఒత్తిడి.. ఈ మూడింటి మధ్య జరుగుతున్న అంకారా(టర్కీ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.నాటో ఏర్పడి దాదాపు ఎనిమిది దశాబ్దాలు అవుతోంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఐరోపాలోని మొత్తం 32 దేశాలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ సైనిక వ్యయంలో సగానికి పైగా ఈ దేశాలదే. అలాంటి కూటమిలో గత కొన్నేళ్లుగా ఒక ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అమెరికా లేకుండా నాటో కొనసాగగలదా? అదే సమయంలో మరో ప్రశ్న కూడా ముందుకొచ్చింది. అమెరికా ఎందుకు మిగతా దేశాల భద్రత కోసం అంత భారీగా ఖర్చు చేయాలి? ఈ రెండో ప్రశ్ననే డొనాల్డ్ ట్రంప్ అత్యంత బలంగా లేవనెత్తారు.ట్రంప్‌కు నాటోపై వ్యక్తిగత వ్యతిరేకత లేదు. కానీ కూటమి నిర్వహణ తీరుపై ఆయన చాలాకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్లు రక్షణపై వెచ్చిస్తుంటే, ఐరోపాలోని అనేక దేశాలు మాత్రం తమ భద్రత బాధ్యతను అమెరికాపైనే వదిలేశాయని ఆయన విమర్శిస్తున్నారు. "అమెరికా డబ్బుతో యూరప్ భద్రత ఎందుకు?" అనే ప్రశ్నను ఆయన ఎన్నికల ప్రచారంలోనే కాదు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ పదేపదే లేవనెత్తారు. సభ్యదేశాలు తగిన రక్షణ వ్యయం చేయకపోతే అమెరికా తన భద్రతా హామీలను పునఃసమీక్షిస్తుందని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఒక దశలో అమెరికా నిజంగానే నాటో నుంచి తప్పుకుంటుందా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగింది.అయితే ట్రంప్ ఎప్పుడూ ‘‘నాటోను రద్దు చేస్తాను’’.. ‘‘నాటో నుంచి తప్పుకుంటాం’’ అని అధికారికంగా ప్రకటించలేదు. ఆయన లక్ష్యం కూటమిని బలహీనపరచడం కాదని, సభ్యదేశాలు కూడా సమాన బాధ్యతలు తీసుకునేలా చేయడమేనని ఆయన సన్నిహితులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అంకారాలో జరుగుతున్న సమావేశం చూస్తే, ట్రంప్ ఎన్నాళ్లుగానో చెబుతున్న అంశాలకే నాటో స్పందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అందుకే ఈసారి సభ్యదేశాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో కనీసం 2 శాతం రక్షణ రంగానికి కేటాయించాలనే లక్ష్యాన్ని దశలవారీగా 5 శాతానికి పెంచేందుకు అంగీకరించాయి. ఇందులో 3.5 శాతం నేరుగా సైనిక సామర్థ్యాల పెంపు, ఆయుధాల కొనుగోలు, సైనిక దళాల ఆధునికీకరణకు వినియోగిస్తారు. మిగిలిన 1.5 శాతం సైబర్ భద్రత, కీలక మౌలిక సదుపాయాలు, రక్షణ పరిశ్రమ, సైనిక రవాణా వ్యవస్థల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. నాటో చరిత్రలో ఇదే అతిపెద్ద రక్షణ వ్యయ లక్ష్యంగా భావిస్తున్నారు.ఇదొక్కటే కాదు.. సమావేశం ముగింపులో విడుదల చేసే సంయుక్త ప్రకటనలో నాటో ఒప్పందంలోని ఆర్టికల్-5 మీద తమ నిబద్ధత "అచంచలం" అని మరోసారి ప్రకటించనున్నారు. ఈ నిబంధనే నాటోకు వెన్నెముకగా భావిస్తారు. ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి మిగతా సభ్యదేశాలన్నీ రక్షణకు ముందుకు రావాలనేది దీని సారాంశం. ట్రంప్ గతంలో ఈ అంశంపైనా సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ సమావేశంలో మరో కీలక అంశం ఉక్రెయిన్. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీవ్‌కు సైనిక, ఆర్థిక సహకారాన్ని ఎలా కొనసాగించాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. అయితే గత సమావేశాలతో పోలిస్తే ఈసారి ఉక్రెయిన్ అంశం కంటే అమెరికా-నాటో సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ట్రంప్ వైఖరి కారణంగా కూటమిలో ఎలాంటి చీలికలు ఏర్పడకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.నాటోలోని చాలా దేశాలు ఇప్పటికే రక్షణ వ్యయాన్ని పెంచడం ప్రారంభించాయి. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడు కేవలం మూడు దేశాలే జీడీపీలో 2 శాతం రక్షణకు ఖర్చు చేసేవి. ఇప్పుడు 32 సభ్యదేశాల్లో మెజారిటీ ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐరోపా దేశాలు తమ సైనిక బలాన్ని పెంచడంపై మరింత దృష్టి సారించాయి. ఇప్పుడు 5 శాతం లక్ష్యంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం అమెరికా-చైనా పోటీ, రష్యా దూకుడు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ఇలా అనేక పరిణామాలు ఒకేసారి చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నాయకత్వంలోని నాటోలో ఎలాంటి బలహీనత కనిపించినా అది ప్రత్యర్థి దేశాలకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని సభ్యదేశాలు భావిస్తున్నాయి. అందుకే ట్రంప్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను విస్మరించకుండా, వాటికి సమాధానమిస్తూ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా ఈసారి అడుగులు వేస్తున్నాయి.అమెరికా లేకుండా నాటోను ఊహించడం కష్టం. అదే సమయంలో నాటో లేకుండా ఐరోపా భద్రతను ఊహించడం కూడా అంతే కష్టం. ఈ వాస్తవాన్ని గుర్తించిన సభ్యదేశాలు ఇప్పుడు ఒకే సందేశం ఇవ్వాలని చూస్తున్నాయి. అమెరికా నమ్మకాన్ని కోల్పోకుండా, కూటమి బలాన్ని మరింత పెంచుకోవడం. అంకారా సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు రానున్న సంవత్సరాల్లో అమెరికా-నాటో సంబంధాలను ఏ దిశగా తీసుకెళ్తాయో నిర్ణయించనున్నాయి. -
70 ఏళ్ల చరిత్రకు ముగింపు.. భవిష్యత్ విమానం ఇదేనా?
ఆకాశంలో ఎగిరే విమానం ఎలా ఉంటుంది?.. ఈ ప్రశ్నకు దాదాపు 70 ఏళ్లుగా ప్రపంచం ఒకటే సమాధానం చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ సమాధానాన్నే మార్చేయాలనే ఓ స్టార్టప్ చేస్తున్న సాహసోపేత ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన విమానాల రూపమే గతం కావొచ్చనే చర్చా.. ఇటు విమానయాన రంగంలో మొదలైంది. ప్రపంచంలోని రెండు దిగ్గజ కంపెనీలు కూడా ఈ కొత్త ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!..దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్య విమానాల మార్కెట్‌ను రెండు దిగ్గజ సంస్థలు.. బోయింగ్, ఎయిర్‌బస్ శాసిస్తూ వస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న బడా విమానాలన్నీ దాదాపుగా ఇవి రూపొందించినవే. అయితే ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ సంస్థ జెట్‌జీరో (JetZero) ఈ ఆధిపత్యానికి సవాల్ విసురుతోంది. సంప్రదాయ విమానాల కంటే పూర్తిగా భిన్నమైన డిజైన్‌తో, ఇంధన వినియోగాన్ని సగానికి తగ్గిస్తామని చెబుతున్న కొత్త తరహా విమానాన్ని అభివృద్ధి చేస్తోంది.రెక్కలు–శరీరం ఒకటే..అమెరికాలోని మొహావే ఎడారిలో జెట్‌జీరో పూర్తి పరిమాణంలో ప్రదర్శన (డెమోన్స్ట్రేటర్) విమానాన్ని నిర్మిస్తోంది. సాధారణ విమానాల్లో శరీరం (ఫ్యూజలేజ్), రెక్కలు వేర్వేరుగా ఉంటాయి. కానీ జెట్‌జీరో ఆ డిజైన్‌కు పుల్‌స్టాప్ పెట్టే పని చేపట్టింది. ఆ కంపెనీ రూపొందిస్తున్న విమానంలో రెండూ కలిసిపోయి ఒకే నిర్మాణంగా ఉంటాయి. దీనినే ‘‘బ్లెండెడ్ వింగ్ బాడీ’’ (Blended Wing Body) డిజైన్ అంటారు. ఈ ఆకారం మంతా రే (Manta Ray) చేపను పోలి ఉంటుంది.50 శాతం ఇంధనం ఆదా!ప్రస్తుతం విమానయాన సంస్థలకు అతిపెద్ద ఖర్చు ఇంధనమే. జెట్‌జీరో విమానం సాధారణ జెట్లతో పోలిస్తే 50 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదని సంస్థ పేర్కొంటోంది. దీని ఆకారం కారణంగా.. గాలిని చీల్చుకుంటూ వెళ్లేటప్పుడు తక్కువ నిరోధం (డ్రాగ్) ఏర్పడటం వల్ల ఇంధన వినియోగం భారీగా తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. విమానం వెనుక భాగంపై ఇంజిన్లను అమర్చడం వల్ల నేలపై శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని కంపెనీ చెబుతోంది.మరింత సుఖవంతమైన జర్నీ..ఈ విమానం లోపలి నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఉండే సన్నని గొట్టం ఆకారంలోని కేబిన్‌కు బదులుగా విశాలమైన, చదునైన ప్రయాణికుల విభాగం ఉంటుంది. దీంతో.. పెద్ద కిటికీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సీట్ల అమరికను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. వంటగదులు (గ్యాలీలు), మరుగుదొడ్లను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభిస్తుంది.జెట్‌జీరో అభివృద్ధి చేస్తున్న Z4 విమానం ఒకేసారి 200 నుంచి 270 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. గతంలో ఈ విభాగంలో బోయింగ్ 757, 767 విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని జెట్‌జీరో అడుగులు వేస్తోంది.నాసా పరిశోధనలకు కొనసాగింపుబ్లెండెడ్ వింగ్ బాడీ ఆలోచన కొత్తది కాదు. గత మూడు దశాబ్దాలుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA) ఈ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటివరకు పూర్తి పరిమాణంలో వాణిజ్య విమానాన్ని నిర్మించే స్థాయికి ఏ సంస్థా రాలేదు. ‘‘కొత్త టెక్నాలజీని కనిపెట్టడం కాదు... ఇప్పటికే నిరూపితమైన సాంకేతికతను ఉపయోగించి వాణిజ్య విమానంగా మార్చడమే మా లక్ష్యం’’ అని జెట్‌జీరో సీఈఓ టామ్ ఓ'లీరీ చెబుతున్నారు.అమెరికా వైమానిక దళం అండజెట్జీరో ఆషామాషీ కంపెనీ ఏం కాదు. 2023లో అమెరికా వైమానిక దళం ఈ ప్రాజెక్టు కోసం 235 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ నిధులతో పూర్తి స్థాయి డెమోన్స్ట్రేటర్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే యునైటెడ్ ఎయిర్‌లైన్స్(United Airlines), అలస్కా ఎయిర్‌లైన్స్ (Alaska Airlines) వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా జెట్జీరోలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై విమానయాన రంగంలో ఆసక్తి మరింత పెరిగింది.2030 నాటికి..జెట్‌జీరో లక్ష్యం ప్రకారం డెమోన్స్ట్రేటర్ విమానం వచ్చే ఏడాది(2027) నాటికి తొలి పరీక్ష పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత చేపట్టే వరుస పరీక్షలు విజయవంతమైతే మరిన్ని పెట్టుబడులు సమీకరించాలని అనుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2030కల్లా వాణిజ్య విమానాల ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అదే సమయంలో ఈ డిజైన్‌ను సైనిక రవాణా, గగనతల ఇంధన నింపే (Aerial Refueling) విమానాలుగా కూడా ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది.సవాళ్లు భారీగానే.. ఈ ప్రయాణం అంత సులభం కాదు. కొత్త డిజైన్ నిజంగానే ప్రకటించిన స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేస్తుందా? భద్రతా ప్రమాణాలు ఎలా ఉంటాయి? ప్రపంచ విమానయాన నియంత్రణ సంస్థల నుంచి ధ్రువీకరణ పొందడానికి సంవత్సరాల సమయం, బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ‘‘ఈ ప్రాజెక్టు ఇప్పుడే విజయవంతమైందని చెప్పలేం. కానీ అసాధ్యమని కూడా చెప్పలేం’’ అని విమానయాన రంగపు విశ్లేషకుడు రిచర్డ్ అబౌలాఫియా అభిప్రాయపడుతున్నారు.విమానాల రూపకల్పనలో దాదాపు 70 ఏళ్లుగా పెద్దగా మార్పులు రాలేదు. జెట్‌జీరో ప్రయత్నం విజయవంతమైతే, భవిష్యత్తులో మనం ప్రయాణించే విమానాల ఆకారంతో పాటు ఇంధన వినియోగం, ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాంకేతిక, ఆర్థిక, నియంత్రణ పరమైన అనేక పరీక్షలను ఈ స్టార్టప్ విజయవంతంగా దాటాల్సి ఉంటుంది.:::వెబ్ స్పెషల్నోట్: కథనంలో చూపించిన విమానం తాలుకా ఫొటోలు ఏఐ జనరేటెడ్‌వి. వాస్తవానికి దగ్గరగా ఉండేలా పాఠకుడికి చూపించాం.. -
చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే ఊహలకు రెక్కలు తొడిగిన కథలు గుర్తొచ్చేవి. ఎగిరే కార్లు, అంతరిక్ష యుద్ధాలు, భవిష్యత్తు నగరాలు... అలాంటి కలల ప్రపంచమే ఆ తరహా సినిమాల ప్రత్యేకత. కానీ కాలం మారింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సే(AI) ప్రపంచాన్ని నడిపిస్తోంది. మనతో మాట్లాడుతోంది. మనకోసం రాస్తోంది. చిత్రాలు గీస్తోంది. సంగీతం సృష్టిస్తోంది. మనిషి చేసే పనుల్లో చాలావరకు తనదైన ముద్ర వేస్తోంది. అయితే..ఈ అద్భుతాలన్నింటి మధ్య ఇప్పటికీ సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉంది.. ప్రేమను కూడా సృష్టించగలమా?. ఆ ప్రశ్నను ప్రపంచం ముందు పాతికేళ్ల క్రితమే నిలబెట్టింది A.I. Artificial Intelligence అనే ఆంగ్ల చిత్రం. ఇది యంత్రాల గురించి తీసిన సినిమా కాదు. మనిషిలా ప్రేమించాలనుకున్న ఒక చిన్నారి గురించి చెప్పిన కథ. రక్తమాంసాలు లేని శరీరంలోనూ మనసు ఉంటే ఎలా ఉంటుందో చూపించిన అరుదైన చిత్రం. సాంకేతిక అద్భుతాల కన్నా భావోద్వేగాలకే పెద్దపీట వేసిన సినిమా. ఈ కథ వెనుక కూడా ఒక కథే ఉంది.ఎన్నో ఏళ్ల పాటు ఈ ఆలోచనను తనలో మోసిన దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్. ఒక రోబో బాలుడు తన తల్లి ప్రేమ కోసం వెతికే కథ ఆయనకు ఎంతో నచ్చింది. అయితే అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ కథను తాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించడం సాధ్యం కాదని భావించి, దాదాపు రెండు దశాబ్దాల పాటు దానిపై పరిశోధన చేశారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురాకముందే ఆయన వెళ్లిపోయారు(1999). ఆ కలను ఆయన సన్నిహితుడు, మరో దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ Steven Spielberg తన భుజాలపై వేసుకున్నారు. ఒకరి ఆలోచన, మరొకరి హృదయం కలిసినప్పుడు పుట్టిన చిత్రమే A.I. Artificial Intelligence.2001 జూన్ 29న A.I. Artificial Intelligence రిలీజ్అయ్యింది. జులై మొదటి వారంలో భారత్‌లో విడుదలయ్యింది. విడుదలైన రోజున ఈ చిత్రాన్ని అందరూ అర్థం చేసుకోలేదు. కొందరికి ఇది చాలా నెమ్మదిగా అనిపించింది. మరికొందరికి ముగింపు భారంగా అనిపించింది. కానీ మంచి కళకు కాలమే న్యాయనిర్ణేత. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ సినిమాకు అభిమానులు పెరిగారు. నేడు ప్రపంచ సినీ చరిత్రలో భావోద్వేగానికి కొత్త అర్థం చెప్పిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చాలామంది "కుబ్రిక్ మేధస్సు, స్పీల్బర్గ్ హృదయం కలిసిన చిత్రం" అని అభివర్ణిస్తారు. ఈ కథలో డేవిడ్ అనే చిన్న రోబో ఉంటాడు. చూడటానికి పిల్లాడే. మాట్లాడతాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. కానీ అతడిని మిగతా యంత్రాలన్నింటి నుంచి వేరు చేసింది ఒక్కటే. అదే.. ప్రేమించే గుణం. అయితే ఒక కుటుంబం అతడిని తమ బిడ్డగా అంగీకరిస్తుంది. అతడు కూడా ఆ మహిళను యజమానిగా కాదు... అమ్మగా భావిస్తాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. ఎలాంటి లెక్కలు ఉండవు. ఒక చిన్నారి హృదయం మాత్రమే ఉంటుంది. కానీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. పరిస్థితులు అతడిని ఆ ఇంటి నుంచి దూరం చేస్తాయి. అయినా అతడు వదిలిపెట్టడు. అమ్మ మళ్లీ తనను దగ్గరకు తీసుకుంటుందనే ఆశతో ప్రయాణం మొదలుపెడతాడు. అక్కడే ఈ సినిమా మనసును తాకుతుంది. ఎందుకంటే ఆ ప్రయాణం ఒక రోబోది కాదు. ప్రేమ కోసం ఎదురుచూసే ప్రతి మనిషిది.ఈ చిత్రం విడుదలైనప్పుడు కృత్రిమ మేధస్సు అనేది కొద్దిమంది శాస్త్రవేత్తల చర్చల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే ప్రతి ఇంట్లోకి వచ్చింది. ప్రతి చేతిలోని ఫోన్లో ఉంది. ప్రతి కార్యాలయంలో ఉంది. మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఎంత మారినా... డేవిడ్ అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది. ఒక యంత్రం నిజంగా ప్రేమిస్తుందా? లేక ప్రేమిస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుందా?చాలా సినిమాలు యంత్రాలు ప్రపంచాన్ని జయిస్తాయని ఊహించాయి. ఈ సినిమా మాత్రం ప్రపంచం ఒక చిన్న యంత్రాన్ని ఎలా ఒంటరిగా వదిలేసిందో చూపించింది. అందుకే కాలం గడిచినా దీని విలువ ఏమాత్రం తగ్గలేదు. ఇది భవిష్యత్తును ఊహించినందుకు గొప్ప సినిమా కాదు. భవిష్యత్తులో మనిషి ఏం కోల్పోవచ్చో ముందే హెచ్చరించిన సినిమా కాబట్టే గొప్పది. -
కొత్త స్క్రిప్ట్ రాసే పనిలో దళపతి విజయ్!
సినిమా తెరపై దశాబ్దాల పాటు ‘దళపతి’గా అభిమానులను ఊర్రూతలూగించిన సి. జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనపై అందరికీ సందేహాలే!. ‘‘రాజకీయాలు తెలియదు’’, “ఎలాంటి అనుభవం లేదు”, “పాలన అంటే సినిమా చేయడం కాదు” ఇలా.. ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తమిళనాడు ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న కొద్ది నెలల్లోనే.. విజయ్ తనపై ఉన్న ఆ అనుమానాలనే లక్ష్యంగా చేసుకుని ఒక్కో అడుగుతో సమాధానం చెబుతున్నట్టు కనిపిస్తోంది.మొదట్లోనే ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజకీయాల కంటే పాలనపైనే ఫోకస్ పెట్టినట్టు సంకేతాలు ఇచ్చాయి. బాధ్యతలు చేపట్టిన వెంటనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటనతో కోట్లాది కుటుంబాలకు నేరుగా ఊరట కలిగించారు. అదే సమయంలో ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా “సింగప్పెన్ టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేయడం మరో కీలక నిర్ణయంగా మారింది.వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ మద్యం దుకాణాల(TASMAC) విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. దేవాలయాలు, పాఠశాలలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న దుకాణాలను దశలవారీగా మూసివేయడం ద్వారా “పాలనలో కఠినత” అనే సందేశాన్ని బలంగా పంపింది.అయితే విజయ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నది కేవలం నిర్ణయాలు కాదు.. ఆ వెనుక ఉన్న “పాలనా శైలి”. ప్రతి రోజు సమయానికి సచివాలయానికి చేరుకోవడం, గంటల తరబడి ఫైళ్లపై దృష్టి పెట్టడం, అధికారులపై క్రమశిక్షణను తప్పనిసరి చేయడం వంటి అంశాలు కొత్త చర్చకు దారితీశాయి. సంప్రదాయ రాజకీయ నేతలలా కాకుండా, ఆయన కార్పొరేట్ సీఈఓ తరహాలో పాలన నడుపుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.అంతేకాదు, వ్యక్తిగత అలవాట్లు కూడా ఈ కథనంలో భాగమయ్యాయి. టైం కంటే ముందే ‘ఆఫీస్’కు వెళ్తున్న ఆయన.. సాదాసీదాగా సెక్రటేరియెట్‌లోని తన ఛాంబర్ భోజనం చేయడం, అనవసర రాజకీయ సమావేశాలను తగ్గించడం వంటి విషయాలు ఆయన “డిసిప్లిన్ ఫస్ట్” పాలనా విధానానికి ఉదాహరణలుగా చెబుతున్నారు. అధికార వర్గాల్లో సమయపాలనను కఠినంగా అమలు చేయడం కూడా అదే దిశలోని సంకేతం.విజయ్ ప్రభుత్వం కేవలం సంక్షేమంపై మాత్రమే కాదు, వ్యవస్థ మార్పుపై కూడా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అమ్మా ఉణవగం క్యాంటీన్ల ఆధునీకరణ, నిలిచిపోయిన తాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతులకు ఆర్థిక ప్యాకేజీలు వంటి నిర్ణయాలు ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం చూపేలా ఉన్నాయి. అదే సమయంలో ఆర్థిక పారదర్శకత కోసం ఫైనాన్స్ వైట్‌పేపర్ విడుదల చేయడం కూడా చర్చనీయాంశమైంది.రాజకీయంగా చూస్తే కేంద్రంతో ఆయన వైఖరి కూడా సమతుల్యంగానే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ, నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా.. తమిళనాడు ప్రయోజనాలను బలంగా వినిపిస్తూనే, కేంద్రంతో విభేదాలను పెద్దగా పెంచకుండా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.మరో కీలక అంశం.. అవినీతి వ్యతిరేక చర్యలు. హెచ్ఆర్&సీఈ శాఖకు చెందిన పలు ప్రాజెక్టులను రద్దు చేయడం, పర్యవేక్షణ వ్యవస్థను కఠినతరం చేయడం, కాంట్రాక్ట్ వ్యవస్థపై నియంత్రణ పెంచడం వంటి చర్యలు ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి.అయితే ఈ కథ ఇంకా పూర్తికాలేదు. కొన్ని ఎన్నికల హామీలు అమలు దశలోనే ఉన్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అనుభవం లోపం, పాలనా స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. విమర్శలు తగ్గకపోయినా, వాటికి సమాధానం ఇప్పుడు మాటలతో కాదు, నిర్ణయాలతో వస్తోంది. సినిమాల్లో ఎలా అయితే ప్రతి సన్నివేశానికి ఒక క్లైమాక్స్ ఉంటుందో, రాజకీయాల్లో విజయ్ కూడా తన పాలనను అదే తరహాలో “పర్ఫార్మెన్స్ మోడ్”లో నడుపుతున్నాడన్న భావన బలపడుతోంది. ఇది తాత్కాలిక ఉత్సాహమా? లేక స్థిరమైన రాజకీయ మార్పుకు ఆరంభమా అన్నది రాబోయే కాలమే నిర్ణయించాలి. -
15 ఏళ్ల డాలర్ బంధానికి ముగింపు!
ఒక దేశపు కరెన్సీ విలువను మరో దేశపు కరెన్సీతో స్థిరంగా అనుసంధానించి ఉంచడం.. ఆ తర్వాత ఆ బంధాన్ని తెంచుకోవడం సాధారణ నిర్ణయం కాదు. అలాంటి కీలక అడుగే ఇప్పుడు బొలీవియా వేసింది. 15 ఏళ్లుగా కొనసాగిన డాలర్ పెగ్ విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? డాలర్ పెగ్‌ను వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మార్పు బొలీవియా ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేయనుంది? పరిశీలిస్తే..సాధారణంగా ఒక దేశ కరెన్సీ విలువ మార్కెట్లో డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను అమెరికన్ డాలర్‌కు స్థిరంగా కట్టిపెడతాయి. దీనినే "డాలర్ పెగ్" అంటారు. బొలీవియా కూడా గత 15 ఏళ్లుగా తన కరెన్సీ అయిన "బొలివియానో" విలువను డాలర్‌తో స్థిరంగా కొనసాగించింది. మార్కెట్లో పరిస్థితులు ఎలా మారినా.. ఒక నిర్దిష్ట మారకపు రేటును ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. ఇందుకోసం భారీ మొత్తంలో డాలర్ నిల్వలు అవసరమవుతాయి.సడన్‌గా ఎందుకు?..ఇటీవలి కాలంలో బొలీవియా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంధన దిగుమతులు, విదేశీ చెల్లింపుల కోసం అవసరమైన డాలర్లను సమకూర్చడం ప్రభుత్వానికి భారంగా మారింది. మరోవైపు మార్కెట్లో డాలర్ల కొరత తీవ్రమైంది. అధికారిక మారకపు రేటు ఒకలా ఉండగా, బ్లాక్ మార్కెట్లో డాలర్ ధర మరింత ఎక్కువగా పలుకుతోంది. దీంతో ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి బ్లాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో పాత విధానాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది.ఇకపై..డాలర్ పెగ్ విధానాన్ని రద్దు చేయడంతో ఇకపై బొలీవియా కరెన్సీ విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది. అంటే డిమాండ్, సరఫరా ఆధారంగా కరెన్సీ విలువ పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. ఈ నిర్ణయం తర్వాత బొలివియానో విలువ గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దీని ప్రభావంగా.. దిగుమతి వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో కరెన్సీ నిజమైన మార్కెట్ విలువను ప్రతిబింబించడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరికొన్ని దేశాలు..బొలీవియా నిర్ణయం ప్రపంచానికి కొత్తేమీ కాదు. గతంలో అనేక దేశాలు డాలర్‌తో ఉన్న స్థిర అనుబంధాన్ని వదిలేశాయి. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా 1990లలో తన కరెన్సీ పెసోను డాలర్‌కు 1:1 నిష్పత్తిలో కట్టిపెట్టింది. కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా 2002లో ఆ విధానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం అర్జెంటీనా కరెన్సీ భారీగా విలువ కోల్పోయింది. అలాగే కజకిస్తాన్ 2015లో, ఈజిప్ట్ 2016లో తమ కరెన్సీలను మార్కెట్ ఆధారిత విధానానికి మార్చాయి. నైజీరియా కూడా గత కొన్నేళ్లుగా విదేశీ మారక సంక్షోభం నేపథ్యంలో కరెన్సీపై నియంత్రణలను సడలిస్తోంది.అయితే మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ వంటి దేశాలు ఇప్పటికీ డాలర్ పెగ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దేశాల వద్ద భారీ విదేశీ మారక నిల్వలు ఉండటం ఇందుకు ప్రధాన కారణం.ఒక దేశం తన కరెన్సీని డాలర్‌కు కట్టిపెట్టడం ఎంత కష్టమో, ఆ బంధాన్ని తెంచుకోవడం కూడా అంతే కీలక నిర్ణయం. బొలీవియా తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చెబుతూనే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం, కరెన్సీ విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.భారత్ డాలర్ పెగ్ విధానాన్ని అనుసరించదు. మన కరెన్సీ రూపాయి 'మేనేజ్డ్ ఫ్లోట్' విధానంలో ఉండటంతో.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాని విలువ మారుతుంటుంది. అయితే రూపాయిలో తీవ్ర ఒడిదొడుకులు రాకుండా అవసరమైనప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. -
భారత్‌లో వివాదం.. మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?
పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదంటూ కేంద్రం చేసిన తాజా వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాస్‌పోర్ట్ కోసం పోలీసు వెరిఫికేషన్ నుంచి పలు స్థాయిల పరిశీలన జరిగితే.. అదే పత్రాన్ని పౌరసత్వానికి ఆధారంగా ఎందుకు గుర్తించరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వివాదం మధ్య మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? పాస్‌పోర్ట్‌ను అక్కడ పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తారా? లేదంటే భారత్‌లాగే అభ్యంతరాలు ఉన్నాయా? పరిశీలిస్తే.. పాస్‌పోర్ట్ అనగానే చాలా మందికి అది ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిరూపించే అత్యంత బలమైన పత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏ దేశమైనా తన పౌరులకే పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తుంది. అయితే చట్టపరంగా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండదు. పాస్‌పోర్ట్‌కు ఇచ్చే చట్టబద్ధ హోదా దేశానికో విధంగా ఉంటుంది.అమెరికాలో.. ప్రపంచంలో పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి అత్యంత బలమైన ఆధారంగా గుర్తించే దేశాల్లో అమెరికా ముందుంటుంది. అక్కడ చెల్లుబాటు అయ్యే అమెరికన్ పాస్‌పోర్ట్ ఉంటే.. అది పౌరసత్వ ధ్రువీకరణ పత్రంతో సమానంగా పరిగణిస్తారు. ప్రభుత్వ సంస్థలు, కోర్టులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా సాధారణంగా అమెరికన్ పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి ప్రత్యక్ష ఆధారంగా అంగీకరిస్తారు. అమెరికాలో జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate), Certificate of Citizenship, US Passport.. ఈ మూడు ప్రధాన పౌరసత్వ ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో పాస్‌పోర్ట్‌కే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ..అమెరికా తరహాలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కామన్ లా దేశాల్లో కూడా పాస్‌పోర్ట్‌కు భారీ చట్టబద్ధ ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంటే.. సాధారణ పరిస్థితుల్లో అతడు ఆ దేశ పౌరుడేనని అధికారులు భావిస్తారు. అయితే అవసరమైతే పౌరసత్వ రికార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, నేచురలైజేషన్ సర్టిఫికెట్లు వంటి అదనపు ఆధారాలను పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది.యూరప్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల్లో పాస్‌పోర్ట్ బలమైన పౌరసత్వ ఆధారంగా పరిగణించబడుతుంది. అయితే అక్కడ చాలా దేశాల్లో జాతీయ గుర్తింపు కార్డులు (National ID Cards) కూడా ఉంటాయి. అందువల్ల పౌరసత్వ నిర్ధారణలో పాస్‌పోర్ట్‌తో పాటు జాతీయ గుర్తింపు వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. యూరోపియన్ యూనియన్‌లోని అనేక దేశాల్లో పౌరులు దేశీయ ప్రయాణాలు, ప్రభుత్వ సేవల కోసం పాస్‌పోర్ట్ కంటే జాతీయ గుర్తింపు కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తారు.మరి భారత్‌లాంటి దేశాలు ఉన్నాయా?అవును.. భారత్ మాత్రమే కాదు కొన్ని దేశాల్లో పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన అది పౌరసత్వానికి శాశ్వత, అంతిమ రుజువు కాదని భావిస్తారు. ఉదాహరణకు కెనడాలో పాస్‌పోర్ట్‌కు అధిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. సిటిజన్‌షిప్ సర్టిఫికెట్(Citizenship Certificate) అనే ప్రత్యేక పత్రాన్ని పౌరసత్వానికి మరింత బలమైన ఆధారంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో పాస్‌పోర్ట్‌తో పాటు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి రావొచ్చు.అలాగే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జాతీయ పౌరసత్వ రిజిస్టర్లు, ప్రత్యేక సిటిజన్ కార్డులు, ప్రభుత్వ రికార్డులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది.అసలు ఎన్ని దేశాలు పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తున్నాయి?. ఇదే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఒకే విధమైన అధికారిక జాబితా లేదు. అయితే సాధారణంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ భాగం పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి బలమైన, ప్రాథమిక ఆధారంగా అంగీకరిస్తాయి. మరోవైపు కొన్ని దేశాలు మాత్రం అదనపు పౌరసత్వ ధ్రువీకరణ వ్యవస్థలను కూడా కొనసాగిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 190కి పైగా దేశాల్లో పాస్‌పోర్ట్‌కు ఉన్న చట్టబద్ధ హోదా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.భారత్‌లో వివాదం ఎందుకంటే.. భారత్‌లో ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఇచ్చే ఒకే ఒక్క "యూనివర్సల్ సిటిజన్‌షిప్ డాక్యుమెంట్" లేదు. ఆధార్ గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. ఓటరు కార్డు ఓటు హక్కును సూచిస్తుంది. పాన్ కార్డు పన్ను అవసరాల కోసం. పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే. దీంతో పౌరసత్వాన్ని నిరూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క పత్రం కాకుండా.. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల రికార్డులు, విద్యా ధ్రువపత్రాలు, ప్రభుత్వ రికార్డులు వంటి అనేక ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి వస్తోంది.చర్చ ఎటు దారితీస్తోంది?పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువా? కాదా? అనే ప్రశ్న కంటే.. భారత్‌లో ప్రత్యేక పౌరసత్వ గుర్తింపు వ్యవస్థ అవసరమా? అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో పాస్‌పోర్ట్ ఒక్కటే సరిపోతుండగా.. భారత్‌లో మాత్రం పౌరసత్వ నిర్ధారణకు బహుళ పత్రాల అవసరం కొనసాగుతోంది. అందుకే కేంద్రం చేసిన తాజా వ్యాఖ్యతో మొదలైన ఈ చర్చ.. ఇప్పుడు భారత పౌరసత్వ వ్యవస్థ భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారుతోంది. -
వందేళ్లకొకసారి సంభవించే అరుదైన భూకంపం!
వామ్మో.. భూమి రెండుగా చీలిపోయిందా? అన్నట్లు వెనెజువెలా వణికిపోయింది. జంట భూకంపాలు రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ భవనాలు ఊగిపోతూ కుప్పకూలిపోగా.. సుదూరాన ఉన్న కొలంబియా దేశ రాజధాని బోగొటాలో ఆ ప్రకంపనల ప్రభావం కనిపించింది. వేల నుంచి లక్ష వరకు మరణాలు ఉండొచ్చన్న అంచనాల మధ్య దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇంతటి భారీ విధ్వంసానికి కారణమైన ఈ రెండు భూకంపాలు.. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే ఎలా సంభవించాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.దక్షిణ అమెరికా దేశం వెనిజువెలా భూకంపాల దెబ్బకు అతలాకుతలమైంది. మొదట 7.1 తీవ్రతతో భూమి కంపించగా, ఆ భయం తగ్గకముందే కేవలం 39 సెకన్లలోనే 7.5 తీవ్రతతో రెండో భారీ ప్రకంపన అదే ప్రాంతాన్ని తాకింది. ఈ రెండు శక్తివంతమైన భూకంపాలు కలిసి దేశాన్ని కుదిపేసి, ప్రజలను వీధుల్లోకి పరుగులు తీయించాయి. సాధారణంగా ఒక భారీ భూకంపం సంభవించిన తర్వాత భూమి లోపల ఒత్తిడి కొంతవరకు విడుదలవుతుంది. ఆ తర్వాత చిన్నచిన్న ఆఫ్టర్‌షాక్‌లు మాత్రమే వస్తాయి. కానీ వెనెజువెలా ప్రకంపనల పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రెండు పెద్ద భూకంపాలు వరుసగా రావడంతో విధ్వంసం రెట్టింపైంది. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను శాస్త్రవేత్తలు ‘‘సిస్మిక్ డబ్లెట్” (Earthquake Doublet)’’ గా పేర్కొన్నారు. అంటే ఒకే ప్రాంతంలో ఉన్న భూగర్భ చీలికలు లేదంటే ఫాల్ట్ లైన్లు చాలా తక్కువ వ్యవధిలో విడివిడిగా విరగడం. సాధారణంగా ఒక భూకంపం తర్వాత మరొకటి గంటలు లేదంటే రోజుల గ్యాప్‌తో వస్తాయి. కానీ ఇక్కడ కేవలం 39 సెకన్లలోనే రెండో భారీ భూకంపం రావడం ఈ ఘటనను అరుదైనదిగా మార్చింది.వెనెజువెలాలో మొదటి భూకంపం తర్వాత పక్కనున్న భూగర్భ చీలికలపై ఒత్తిడి పెరిగి, వెంటనే రెండో భారీ భూకంపం సంభవించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే.. ఒత్తిడి తట్టుకోలేక సమీపంలోని మరో చీలిక కూడా కదలడంతో రెండో భూకంపం వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.వెనెజువెలా భౌగోళికంగా అత్యంత ప్రమాదకర భూకంప జోన్లో ఉంది. కరీబియన్ ప్లేట్ మరియు దక్షిణ అమెరికా ప్లేట్ కలిసే ప్రాంతంలో ఈ దేశం ఉంది. ఈ రెండు భూభాగాలు నిరంతరం ఒకదానికొకటి స్లైడ్ అవుతూ కదులుతుంటాయి. ఈ కదలికల వల్ల భూగర్భంలో భారీ ఒత్తిడి ఏర్పడి, అది ఒక్కసారిగా విడుదలైనప్పుడు శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి.బొకోనో, సాన్ సెబాస్టియన్, ఎల్ పిలార్, మోరోన్ వంటి అనేక ఫాల్ట్ జోన్లు పరస్పరం అనుసంధానమై ఉండటంతో, ఒక ప్రాంతంలో జరిగిన కదలిక మరో ప్రాంతాన్ని కూడా వెంటనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇదే ఈసారి రెండు భారీ ప్రకంపనలు వరుసగా రావడానికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రస్తుతం వెనెజువెలా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సహాయక బృందాలు శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. ఈ డబ్లెట్ భూకంపాల తర్వాత ఆఫ్టర్‌షాక్‌ల ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని యూఎస్జీఎస్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బలహీనమైన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలను బయటే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సాధారణంగా వందేళ్లకు ఒకసారి లేదంటే అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి తీవ్ర స్థాయి జంట భూకంపాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనల్లో సాధారణంగా మొదటి భూకంపం తర్వాత భూగర్భ ఒత్తిడి సమీప ఫాల్ట్‌లకు బదిలీ అవుతుంది. ఆ ఒత్తిడి వెంటనే విడుదలైతే రెండో పెద్ద భూకంపం సంభవిస్తుంది. ఇండోనేషియా, ఇరాన్, అమెరికాలోనూ ఎర్త్‌క్వేక్ డబ్లెట్ చోటు చేసుకున్నాయి. అయితే వెనిజువెలాలో ఈసారి కేవలం 39 సెకన్లలోనే రెండు భారీ ప్రకంపనలు రావడం భూమి లోపల ఉన్న ఒత్తిడి ఎంత అస్థిరంగా ఉందో చూపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇదీ చదవండి: జంట భూకంపాల దెబ్బ.. లక్ష మంది మృతి? -
బంధం ముగిస్తే సరిపోదా?.. బలి ఎందుకు?
ఒకప్పుడు ప్రేమ విఫలమైతే దూరమయ్యేవారు. పెళ్లి బంధం సరిగా సాగకపోతే విడాకులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా?. ప్రేమించిన వారినే హత్య చేయడం, జీవిత భాగస్వామిని అంతమొందించడం, సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రాణాలు తీయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు బంధాలు ‘బ్రేక్’ అవ్వడం కాకుండా ఎందుకు బలైపోతున్నాయి?. కాస్త లోతుల్లోకి వెళ్తే..మేఘాలయ హనీమూన్ కేసునే పరిశీలిద్దాం. ఇండోర్‌కు చెందిన జంట.. హనీమూన్‌కు వెళ్లింది. దంపతులు మిస్ కావడం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు.. భర్త చనిపోవం.. భార్య దీనావస్థలో రోడ్డు మీద కనిపించడం.. చివరకు భార్య&ప్రియుడి చేతిలోనే హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపింది. మరోవైపు ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన సర్వేయర్ హత్య కేసులోనూ వివాహేతర సంబంధాల కోణం ప్రధానంగా చర్చకు వచ్చింది. అటు.. ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన మీరట్ "బ్లూ డ్రం" కేసులో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా పుణెలో పెళ్లికి సిద్ధమవుతున్న కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అది హత్య అని తేలడం సంచలనం సృష్టించింది. ఫొటోషూట్ పేరుతో ఓ కోటకు తీసుకెళ్లి కాబోయే వధువు, ఆమె ప్రియుడే అతన్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.These are Ketan Agarwal and Siya Goel. They were engaged and supposed to get married this year. Look how happy, in love, and comfortable they are with each other.They must have dreamed of a great future together, but cruel fate had other ideas. On June 18, Siya's birthday,… pic.twitter.com/4Av4OQvXuc— THE SKIN DOCTOR (@theskindoctor13) June 23, 2026ఈ ఘటనల్లో పరిస్థితులు, వ్యక్తులు, ప్రాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదే.. సంబంధాన్ని ముగించడం కంటే వ్యక్తినే శాశ్వతంగా తొలగించాలనే ప్రమాదకర ఆలోచన.మనస్తత్వ నిపుణుల ప్రకారం.. నేటి కాలంలో కొందరు ప్రేమను పరస్పర గౌరవంతో కూడిన బంధంగా కాకుండా, స్వాధీన భావంతో చూస్తున్నారు. నువ్వు నాకే చెందాలి.. లేదంటే ఎవరికీ దక్కకూడదు అనే ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.అలాగే, తిరస్కరణను అంగీకరించలేకపోవడం కూడా కీలక కారణమని నిపుణులు చెబుతున్నారు. సంబంధం కొనసాగకపోతే విడిపోవడం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం వంటి మార్గాలు ఉన్నప్పటికీ, కొందరు వాటిని పరాజయంగా భావిస్తున్నారని అంటున్నారు. పరువు పోతుందనే భయం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతామనే ఆందోళన, కుటుంబమో.. సమాజమో ఏమనుకుంటుందో అనే ఒత్తిడి కొందరిని తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా సంబంధాలపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ చిత్రాలతో తమ బంధాలను పోల్చుకోవడం, చిన్న చిన్న విభేదాలను కూడా పెద్ద సమస్యలుగా భావించడం వల్ల అసహనం పెరుగుతోందని చెబుతున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, కోపాన్ని ఆరోగ్యకరంగా వ్యక్తం చేయలేకపోవడం, కౌన్సెలింగ్ తీసుకోవడంపై ఇప్పటికీ ఉన్న అపోహలు కూడా సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. అయితే సంభాషణ, కుటుంబ సభ్యుల సహకారం, అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. బంధం కొనసాగించడం సాధ్యం కాకపోతే విడిపోవడం కూడా ఒక మార్గమే. కానీ ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది స్వాధీనం కాదు, బాధ్యత. బంధం అనేది నియంత్రణ కాదు, పరస్పర గౌరవం. ఆ గౌరవం, నమ్మకం కోల్పోయినప్పుడు బంధాలు బలహీనపడతాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మరొకరికి లేదన్న విషయాన్ని సమాజం మరచిపోకూడదు.::వెబ్ ప్రత్యేకం -
బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!
లండన్‌లోని ప్రతిష్ఠాత్మక 10 డౌనింగ్ స్ట్రీట్.. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం, కార్యాలయంల కూడా. బయటకు చూస్తే అది కేవలం ఒక ప్రభుత్వ భవనం. కానీ ఆ చారిత్రక గోడల మధ్య మాత్రం ఒక ప్రత్యేకమైన ఉనికి ఎప్పటినుంచో కొనసాగుతోంది. పదేళ్లలో ఆరుగురు ప్రధానమంత్రులు మారినా, ఆ వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించదు. అదే భవనంలో.. దశాబ్దంపైగా అక్కడే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ల్యారీ.. “నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. అప్పుడు ఒక ప్రధాని ఉన్నాడు. తర్వాత ఇంకొకరు. కొంతకాలానికి ఇంకొకరు. ఇప్పుడే ఇంకొకరు రాజీనామా చేశారు. రేపు ఇంకెవరో?.. నేను మాత్రం నా సోఫాలో అలాగే ఉంటూ వస్తున్నా..” అంటూ ల్యారీగాడు ఓ వెక్కిరింపు చూస్తున్నాడు. ల్యారీ.. 11 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చాడు. అప్పట్లో బ్రిటన్‌కు నాయకత్వం వహిస్తున్నది డేవిడ్ కామెరూన్. యూరప్‌తో బ్రిటన్ సంబంధాలపై, ఆర్థిక సంక్షోభం ప్రభావాలపై చర్చల్లో మునిగిపోయి ఉన్న సమయం అది. కానీ ల్యారీకి అవేం పట్టింపు లేదు. వాడికి అర్థమైంది ఒక్కటే.. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, మంచి తిండి.. అలాగే రొటీన్ లైఫ్‌లో కాస్త చేంజ్.ఆ తర్వాత మార్పుల ప్రవాహం మొదలైంది. థెరెసా మే వచ్చారు. బ్రెగ్జిట్ గందరగోళం మధ్య దేశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, పార్లమెంటులో మద్దతు తగ్గడం, ఒప్పందాలపై విభేదాలు ఆమెను పదవికి రాజీనామా చేసేలా చేశాయి. ఆయన ప్రధాని పీఠం నుంచి దిగిపోయి.. డౌనింగ్ స్ట్రీట్‌ను వీడుతుంటే ల్యారీ మాత్రం అదే హాలులో నిద్రపోతూనే ఉన్నాడు.తర్వాత బోరిస్ జాన్సన్ వచ్చారు. దేశాన్ని బ్రెగ్జిట్ తర్వాత కొత్త దారిలో నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పార్టీల్లో వివాదాలు, కరోనా సమయంలో ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, ఆచరణాత్మక తప్పిదాల ఆరోపణలు ఆయనను కూడా పదవికి దూరం చేశాయి. ఆయన బయటకు వెళ్తున్న టైంలోనూ.. ల్యారీగాడు సోఫాలో మాంచి కునుకు తీస్తున్నాడు.తరువాత లిజ్ ట్రస్ వచ్చారు. అయితే ఆర్థిక విధానాల్లో ఆమె చేసిన భారీ ప్రకటనలు మార్కెట్లను కుదిపేశాయి. ప్రజల్లో, పార్టీలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కొన్ని వారాల్లోనే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె పాలన అయితే బ్రిటన్ రాజకీయ చరిత్రలోనే అత్యంత తక్కువకాలంలో ముగిసిన అధ్యాయంగా నిలిచింది. “లెట్యూస్(ఆ రకం ఆకుకూర..) తాజాదనం కంటే ఆమె ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేకపోయింది అంటూ సెటైర్లు వినిపించాయి. కానీ, అవేవీ పట్టించుకునే స్థితిలో ల్యారీగాడు లేడు..తర్వాత రిషి సునాక్ వచ్చారు. ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభం, ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ అనిశ్చితి ఆయన ప్రభుత్వాన్ని నిరంతరం పరీక్షించాయి. చివరకు 2024 సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు లేబర్ పార్టీ చేతికి మారాయి. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో సునాక్ ప్రధానమంత్రి పదవికి వీడ్కోలు పలికారు. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో మరోసారి అధికార మార్పిడి జరిగింది. ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ల్యారీగాడు తనదైన నిశ్శబ్దంతో గమనిస్తూ ఉండిపోయాడు.తరువాత బాధ్యతలు చేపట్టిన కీర్ స్టార్మర్ పాలన కూడా బ్రిటన్ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారింది. దేశ ఆర్థిక ఒత్తిళ్లు, విధాన నిర్ణయాలపై పెరిగిన విమర్శల మధ్య ఆయన నాయకత్వంపై కూడా అనిశ్చితి కొనసాగింది. చివరికి ఆయన కూడా పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో, 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తాజాగా మరోసారి నాయకత్వ మార్పు తప్పలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, రాజకీయ సమీకరణాలు తిరుగుతున్నా, ఆ చారిత్రక భవనంలోని నిశ్శబ్ద సాక్షి మాత్రం ఎప్పటిలాగే తన స్థానంలో నిలిచే ఉంది.లారీకి రాజకీయాలు అర్థం కావు. కానీ ఒక విషయం మాత్రం అతనికి స్పష్టంగా తెలుసు.. ఈ ఇంట్లో మనుషులు శాశ్వతం కాదు. వారు వస్తారు, కెమెరాల ముందు నిలుస్తారు, నిర్ణయాలు ప్రకటిస్తారు, కొన్నిసార్లు దేశాన్ని ప్రశంసిస్తారు, కొన్నిసార్లు విమర్శల్లో మునిగిపోతారు. ఆ తర్వాత ఒక రోజు నిశ్శబ్దంగా వెళ్లిపోతారు. కానీ లారీ మాత్రం ఎప్పటికీ అదే చోట ఉంటాడు. అదే కిటికీ దగ్గర కూర్చుంటాడు. అదే హాలులో నిద్రపోతాడు. అతనికి పదవులు లేవు, ఎన్నికలు లేవు, రాజీనామాలు లేవు. అతని ప్రపంచంలో ఒకే ఒక నిజం ఉంది.. ఆ ఇల్లు, ఆ సోఫా బతికి ఉన్నంత దాకా తనదేనని. ల్యారీ ది క్యాట్ (Larry the Cat).. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధానమంత్రి అధికార నివాసంలో నివసిస్తున్న ప్రసిద్ధ పిల్లి. ఎలుకల్ని పట్టుకునేందుకు “Chief Mouser to the Cabinet Office” అనే అధికారిక హోదాను దానికి కట్టబెట్టారు. అలాగని ఈ పదవి కొత్తది కాదు. అక్కడి ప్రభుత్వ భవనాల్లో ఎలుకల సమస్యను నియంత్రించేందుకు దశాబ్దాలుగా ఇలాంటి ‘మౌసర్ క్యాట్’లను నియమించే సంప్రదాయం ఉంది. ఈ బాధ్యతలను సాధారణంగా క్యాబినెట్ ఆఫీస్ పర్యవేక్షణలో ఉన్న సిబ్బంది చూసుకుంటారు, అయితే ఈ పిల్లుల సంరక్షణ, ఆహారం, వైద్య సదుపాయాలు వంటి విషయాలను అక్కడి సిబ్బందే నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా ల్యారీ 2011 నుంచి ఈ భవనంలో ఉంటూ, అనేక ప్రధానమంత్రుల కాలాన్ని సాక్షిగా చూసిన ఒక నిశ్శబ్ద అధికారిగా గుర్తింపు పొందాడు. -
చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు!
ఆత్మహత్యకు ముందు ఆస్తుల పంపకం, అప్పుల వివరాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు.. అంతెందుకు ఏటీఎం, ఫోన్‌పే పిన్ల సమాచారం.. డెత్‌నోట్‌లో రాసేసి మరీ వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆఖరికి అంత్యక్రియల ఖర్చులు కూడా కుటుంబమో, బంధువులకు భారం కాకూడదనే ఆలోచనతో చివరి క్షణాలకు ముందే అన్నీ ముందుగానే సర్దేసి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి!. ఎందుకిలా?.. మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..చిత్తూరు జిల్లాలోని బంగారెడ్డి పల్లి ప్రాంతంలో దాము అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్య అనారోగ్యం కారణంగా కుటుంబం ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితుల్లో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరణానికి ముందు ఆయన ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు ఏటీఎం పిన్ నెంబర్ వంటి వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని కూడా డెత్‌నోట్‌లో నమోదు చేసినట్లు సమాచారం. దానిని టీవీ స్క్రీన్కు అంటించారాయన.ఇలాంటి ఘటన ఒక్కటే కాదు. ఇటీవల నెల్లూరు జిల్లాలో రిటైర్డ్ టీచర్ దంపతులు కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. తాము లేకుండా చెట్టంత కొడుకు బతకలేడనే ఉద్దేశంతో అతన్ని కూడా వాళ్లు తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబానికి భారంగా మారకూడదనే ఆలోచనతో వారు అంత్యక్రియల ఖర్చుల కోసం ముందుగానే ఏర్పాట్లు చేయడం, కొంత ఆస్తిని దానం చేయడం, బ్యాంక్ లావాదేవీల వివరాలు సైతం రాసి పెట్టడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.విజయవాడ సహా కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. నార్త్ ఇండియాలోనూ ఈ తరహా ఘటనలు నమోదవుతుండటంతో ఇది ఒక “కొత్త ధోరణి”గా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ ఘటనల్లో ఒక సాధారణ మానసిక నమూనా కనిపిస్తోంది.. తాము లేకపోయినా కుటుంబం/తమకు మేలు చేసిన వాళ్లు ఇబ్బంది పడకూడదు అనే భావన. ఇదే ఆలోచనలో వ్యక్తులు తమ ఆర్థిక వ్యవహారాలను చివరి క్షణాల్లో పూర్తిగా క్రమబద్ధం చేసి వెళ్తున్నారు. ఇది బయటకు చూసేందుకు బాధ్యతగా కనిపించినా, నిపుణులు మాత్రం దీన్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంకేతంగా భావిస్తున్నారు.ఈ తరహా ధోరణిపై మానసిక నిపుణులు స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా దీర్ఘకాలిక నిరాశ (depression), తీవ్ర ఆందోళన (anxiety), “నిరాశాత్మక ఆలోచనా విధానం” (hopeless thinking pattern) వల్ల వస్తాయి. సమస్యలకు పరిష్కారం కనిపించకపోవడం, అప్పుల భారం, అనారోగ్యం, కుటుంబ బాధ్యతల ఒత్తిడి.. ఇవన్నీ కలిసి వ్యక్తిని “తప్పించుకోవడమే మార్గం” అనే భావన వైపు నెట్టేస్తాయని హెచ్చరిస్తున్నారు.ఇది ఒక రకమైన కాగ్నిటివ్ టన్నెల్ విజన్ అని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యక్తి తన సమస్యలకు ఒక్కటే పరిష్కారం కనిపించడం, ఇతర సహాయ మార్గాలు కనిపించకపోవడం. ఈ దశలో సహాయం కోరే అవకాశం ఉన్నా, దాన్ని ఉపయోగించలేని స్థితి ఏర్పడుతుందని వారు వివరిస్తున్నారు.నిపుణుల హెచ్చరిక ఏంటంటే.. ఆత్మహత్యకు ముందు ఇలా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లిపోవడం బయటకు బాధ్యతగా కనిపించినా, వాస్తవానికి అది తీవ్రమైన మానసిక సంక్షోభానికి చివరి సంకేతమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ దశలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం త్వరగా స్పందించడం చాలా కీలకమని సూచిస్తున్నారు.ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, జీవన ఒత్తిడులు ఏవైనా కావొచ్చు. కానీ, వాటికి పరిష్కారం జీవితం ముగించడం కాదు. “అన్నీ సర్దేసి వెళ్లిపోవడం” వెనుక కనిపించని మానసిక పోరాటం ఉంటుంది. ఆ సంకేతాలను ముందుగానే గుర్తించి సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ఫిఫా క్రేజ్: చూస్తే కిక్ రాదు.. అసలు మజా అందులోనే!
భారత్‌లో ఫుట్‌బాల్ క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. ఫిఫా వరల్డ్‌కప్ నేపథ్యంలో.. ఐపీఎల్ తరహా సందడి వాతావరణం కనిపిస్తోంది. హోటళ్లు, పబ్‌లు, స్పోర్ట్స్ బార్లు అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. మెస్సీ, రొనాల్డో, ఎంబాప్పే, యమాల్ వంటి స్టార్ ఆటగాళ్ల అభిమానులు తెరపైకి వచ్చేశారు. అయితే మ్యాచ్ జరిగేటప్పుడు కామెంటేటర్లు తరచూ వాడే పదాలకు చాలామందికి అర్థం మాత్రం తెలియదు. క్రికెట్‌ను కామెంటరీతో ఏలాగైతే ఆస్వాదిస్తామో.. ఫుట్‌బాల్‌ను మరింత ఆస్వాదించాలంటే ముందుగా ఆ ఆటలో వాడే కొన్ని పదాలను అర్థం చేసుకోవాల్సిందే.గోల్ (Goal).. ఫుట్‌బాల్‌లో అత్యంత ముఖ్యమైన పదం ఇదే. బంతి పూర్తిగా గోల్‌పోస్టుల మధ్య, క్రాస్‌బార్ కిందుగా గోల్లైన్ను దాటితే గోల్‌గా పరిగణిస్తారు. ఎక్కువ గోల్స్ చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది.ఆఫ్‌సైడ్ (Offside).. ఫుట్‌బాల్‌లో అత్యంత క్లిష్టమైన నిబంధనగా దీన్ని భావిస్తారు. ఆటగాడు బంతి అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్ కంటే ముందుంటే, అలాగే ఆటలో ప్రభావం చూపితే ఆఫ్‌సైడ్‌గా ప్రకటిస్తారు. గోల్ చేసినా అది చెల్లదు. చాలా వివాదాలు, వీఏఆర్ సమీక్షలు ఎక్కువగా ఈ నిబంధన చుట్టూనే తిరుగుతుంటాయి.పెనాల్టీ (Penalty).. పెనాల్టీ బాక్స్‌లో డిఫెండర్ ఫౌల్ చేస్తే రిఫరీ పెనాల్టీ ఇస్తాడు. అప్పుడు బంతిని పెనాల్టీ స్పాట్‌పై ఉంచి ఒక ఆటగాడు నేరుగా గోల్‌పై షాట్ కొట్టే అవకాశం పొందుతాడు. ఫుట్‌బాల్‌లో గోల్ చేసే అత్యుత్తమ అవకాశాల్లో ఇది ఒకటి.ఫ్రీ కిక్ (Free Kick).. ఫౌల్ జరిగినప్పుడు ప్రత్యర్థి జట్టుకు లభించే అవకాశం. డైరెక్ట్ ఫ్రీ కిక్.. నేరుగా గోల్ కొట్టవచ్చు. ఇన్‌డైరెక్ట్ ఫ్రీ కిక్.. మరో ఆటగాడు బంతిని తాకిన తర్వాత మాత్రమే గోల్ చెల్లుతుంది.హ్యాట్రిక్ (Hat-trick).. ఒకే మ్యాచ్‌లో ఒక ఆటగాడు మూడు గోల్స్ చేస్తే దానిని హ్యాట్రిక్ అంటారు. మెస్సీ, రొనాల్డో, హ్యారీ కేన్, ఎర్లింగ్ హాలాండ్ వంటి స్టార్లు అనేక హ్యాట్రిక్‌లు సాధించారు అని తరచూ వింటుటాం కదా!.క్లీన్ షీట్ (Clean Sheet).. గోల్‌కీపర్ లేదా జట్టు ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగిస్తే దాన్ని క్లీన్ షీట్ అంటారు. డిఫెండర్లు, గోల్‌కీపర్లకు ఇది ప్రతిష్టాత్మక గణాంకం.వీఏఆర్ (Video Assistant Referee).. ఫుట్‌బాల్ మ్యాచ్‌కి రివ్యూలాంటిది. మైదానంలో రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని వీడియోల ద్వారా పరిశీలించే వ్యవస్థ. ఇందులో.. గోల్ చెల్లుతుందా?, పెనాల్టీ సరైందా?.. రెడ్ కార్డ్ ఇవ్వాలా? ఈ తరహా కీలక నిర్ణయాల్లో వీఏఆర్ ఉపయోగిస్తారు.యెల్లో కార్డ్ – రెడ్ కార్డ్.. యెల్లో కార్డ్.. ఆటగాడికి హెచ్చరికగా ఇస్తారు. రెడ్ కార్డ్.. ఆటగాడిని వెంటనే మైదానం నుంచి పంపిస్తారు. ఆ జట్టు మిగతా మ్యాచ్‌ను ఒక ఆటగాడు తక్కువతో ఆడాల్సి ఉంటుంది.ఎక్స్ట్రా టైమ్ (Extra Time).. నాకౌట్ మ్యాచ్‌ల్లో నిర్ణీత 90 నిమిషాల తర్వాత స్కోరు సమంగా ఉంటే అదనంగా 30 నిమిషాలు ఆడిస్తారు.పెనాల్టీ షూటౌట్ (Penalty Shootout).. ఎక్స్ట్రా టైమ్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే రెండు జట్లు పెనాల్టీల ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. వరల్డ్‌కప్‌లలో ఎన్నో చారిత్రక మ్యాచ్‌లు ఇలాగే ముగిశాయి.కార్నర్ కిక్ (Corner Kick).. ప్రత్యర్థి ఆటగాడు బంతిని తన గోల్‌లైన్ దాటి బయటకు పంపితే దాడి చేస్తున్న జట్టుకు కార్నర్ లభిస్తుంది. ఇవి తరచూ గోల్స్‌కు దారితీస్తుంటాయి.థ్రో-ఇన్ (Throw-in).. బంతి సైడ్‌లైన్ దాటి బయటకు వెళ్తే చేతులతో మైదానంలోకి విసిరే విధానాన్ని థ్రో-ఇన్ అంటారు.ఎక్స్‌జీ(xG) అంటే.. Expected Goals (xG) అనే ఆధునిక గణాంకం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది.ఒక షాట్ గోల్‌గా మారే అవకాశాన్ని శాతం రూపంలో కొలుస్తుంది. జట్టు ఎలా ఆడిందో అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.డర్బీ (Derby).. ఒకే నగరం లేదా ప్రాంతానికి చెందిన రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను డర్బీ అంటారు. ఉదాహరణకు.. రియల్ మాడ్రిడ్-అట్లెటికో మాడ్రిడ్, అలాగే.. ఏసీ మిలాన్ వర్సెస్ ఇంటర్ మిలాన్ ఇలాగన్నమాట.ట్రెబుల్ (Treble).. ఒకే సీజన్లో లీగ్, దేశీయ కప్, ఖండాంతర టోర్నీ గెలిస్తే ట్రెబుల్ అంటారు. ఇది ఫుట్‌బాల్‌లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటి.ఫుట్‌బాల్ కేవలం 22 మంది ఆటగాళ్లు బంతి వెంట పరుగెత్తే ఆట కాదు. దానికి సొంత భాష, సొంత వ్యూహాలు, సొంత పదజాలం ఉన్నాయి. "ఆఫ్‌సైడ్" ఎందుకు ఇచ్చారు? "వీఏఆర్" ఎందుకు జోక్యం చేసుకుంది? "క్లీన్ షీట్" అంటే ఏమిటి? వంటి విషయాలు అర్థమైతే మ్యాచ్ చూడటంలోనే కాదు.. చర్చల్లో పాల్గొనడంలోనూ మజా పెరుగుతుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ను ప్రేమించే భారతీయులు పెరుగుతున్న ఈ సమయంలో.. ఆ ఆటకు సంబంధించిన భాషను నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. -
ట్రంప్–మెలోనీ.. ఎక్కడ చెడింది?.. ఆ ఐదే కారణమా?
మొన్నటిదాకా జార్జియా మెలోనీ.. డొనాల్డ్ ట్రంప్‌కు యూరప్‌లో అత్యంత సన్నిహిత మిత్రురాలిగా గుర్తింపు పొందారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయనకు అత్యంత నమ్మకమైన యూరోపియన్ భాగస్వామిగా నిలిచారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకోవడం, బహిరంగ వేదికలపై పరస్పరం సరదా వ్యాఖ్యలు చేసుకోవడం కనిపించింది. అలాంటిది ఈ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా మాటల యుద్ధం మొదలవడం, అది వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ట్రంప్–మెలోనీ స్నేహానికి ఎక్కడ బీటలు వారాయో గమనిస్తే..ట్రంప్–మెలోనీ బంధం కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు. కుడిపక్ష(రైట్‌వింగ్) భావజాలం, వలసల నియంత్రణ, జాతీయవాద విధానాలు వంటి అనేక అంశాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. అందుకే యూరప్‌లో ట్రంప్‌కు అత్యంత సన్నిహిత మిత్రురాలిగా మెలోనీకి గుర్తింపు లభించింది. అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ స్నేహంపై ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్క ఫొటో వివాదం కాదు. గత కొన్ని నెలలుగా పేరుకుపోతున్న రాజకీయ విభేదాల ఫలితంగా కనిపిస్తోంది. ఆ ఐదు కారణాలివే..1. మొదటి చిచ్చు.. యుద్ధమే!ట్రంప్‌కు మెలోనీ ఎంత సన్నిహితురాలో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలనిపిస్తుంది. 2025లో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వేడుకకు హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు కూడా ఆమెనే. ఆ తర్వాత గాజా శాంతి చర్చల సందర్భంగా మెలోనీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘అందం, తెలివితేటలు రెండూ ఉన్న నాయకురాలు’ అంటూ కొనియాడారు. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత పరిస్థితి మారడం మొదలైంది. హర్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్‌పై ఒత్తిడి వంటి అంశాల్లో అమెరికా వైఖరికి ఇటలీ పూర్తి మద్దతు ఇవ్వలేదు. యుద్ధంలో పాల్గొనేందుకు మెలోనీ నిరాకరించడంతో ట్రంప్‌లో అసంతృప్తి పెరిగింది. ఆ అసంతృప్తి క్రమంగా బహిరంగ విమర్శలకు దారితీసింది. మెలోనీకి ధైర్యం లేదని, అంతర్జాతీయ సంక్షోభాల విషయంలో ఆమె సరైన నాయకత్వం చూపడం లేదంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇద్దరి మధ్య విభేదాలు ఎంత దూరం వెళ్లాయో చెప్పకనే చెబుతోంది.2. పోప్ లియో వివాదంఇరాన్ యుద్ధంపై పోప్ లియో XIV శాంతి సందేశం ఇవ్వడం కూడా ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. యుద్ధం విస్తరించకుండా చర్చల ద్వారానే పరిష్కారం వెతకాలని పోప్ పిలుపునివ్వగా.. ట్రంప్ మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ భద్రతా అంశాలపై పోప్ మాట్లాడటం తగదన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే కాథలిక్ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే ఇటలీ ప్రధాని మెలోనీ మాత్రం పోప్‌కు బహిరంగంగా అండగా నిలిచారు. ట్రంప్ వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని, పోప్ అభిప్రాయాలను గౌరవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.ఈ పరిణామం ట్రంప్‌కు ఏమాత్రం నచ్చలేదని చెబుతున్నారు. అప్పటివరకు మిత్రురాలిగా భావించిన మెలోనీ.. తనకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారనే భావన ఆయనలో ఏర్పడింది. దీంతో మాటల యుద్ధం మరింత ముదిరింది. ఒక దశలో పోప్ కంటే మెలోనీనే పరిస్థితులను సరిగా అర్థం చేసుకోవడం లేదంటూ ట్రంప్ సెటైర్లు వేయగా.. మెలోనీ కూడా వెనక్కి తగ్గకుండా తన వైఖరిని సమర్థించుకున్నారు. దీంతో విధానపరమైన విభేదం క్రమంగా వ్యక్తిగత స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.3. G7లో బహిరంగ విభేదాలుఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులోనే ఇద్దరి మధ్య విభేదాలు మొదటిసారి బహిరంగంగా బయటపడ్డాయి. ఇరాన్ యుద్ధం, నాటో బాధ్యతలు, పశ్చిమ దేశాల పాత్ర వంటి అంశాలపై జరిగిన చర్చల్లో ట్రంప్ తన అసంతృప్తిని దాచుకోలేదు. యూరప్ అమెరికాను ఒంటరిగా వదిలేసిందని, నాటో మిత్రదేశాలు తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మెలోనీ ఈ వ్యాఖ్యలను నేరుగా సవాలు చేసినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అమెరికా–యూరప్ భాగస్వామ్యం ఇప్పటికీ బలంగానే ఉందని, పశ్చిమ దేశాల మద్దతును తక్కువ చేసి చూపడం సరైంది కాదని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని చర్చిస్తున్న దృశ్యాలు బయటకు కనిపించినా.. ఆ సమావేశాల్లో వాతావరణం అంత స్నేహపూర్వకంగా లేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్ తరచూ చేస్తున్న ‘యూరప్ మమ్మల్ని వదిలేసింది’ అన్న వ్యాఖ్యలను మెలోనీ ఖండించగా.. ట్రంప్ కూడా తన వైఖరి నుంచి వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. దీంతో ఇంతకాలం తెరవెనుక మాత్రమే ఉన్న విభేదాలు G7 వేదికగా అందరికీ కనిపించే స్థాయికి చేరుకున్నాయి. చాలా మంది విశ్లేషకుల దృష్టిలో ఇదే ఇద్దరి బంధంలో కీలక మలుపుగా నిలిచింది.4. ఫొటో వ్యాఖ్యలతో మరింత దూరంఇద్దరి మధ్య పెరుగుతున్న దూరానికి ప్రతీకగా నిలిచింది ఈ ఫొటో వివాదం. G7 సమావేశం సందర్భంగా మెలోనీ తనతో ఫొటో దిగేందుకు "బతిమాలిందని", "ఆమెపై జాలిపడి ఫొటో ఇచ్చానని" ట్రంప్ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని మెలోనీ ఈసారి మాత్రం వెంటనే స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని, తాను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవ్వరినీ బతిమాలుకోదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.అంతటితో ఆగకుండా, పశ్చిమ దేశాల మిత్రుల పట్ల ట్రంప్ చూపుతున్న వైఖరిపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా మిత్రదేశాల కంటే ప్రత్యర్థి దేశాల నేతల పట్ల ఆయన మరింత మర్యాదగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. మరోవైపు ట్రంప్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు మెలోనీ తన అభిమానుల్లో ఒకరని, కానీ ఇప్పుడు ఆమె తనకు అభిమానిగా ఉండటం ఇష్టం లేదంటూ మరోసారి వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ విభేదాలుగా మొదలైన ఈ ఘర్షణ.. వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు బహిరంగంగానే పంచులు వేసుకోవడం పరిస్థితి ఎంత మారిపోయిందో చెబుతోంది.5. మెలోనీ శిబిరం నుంచి ఎదురుదాడిఈ వివాదంలో అత్యంత గమనార్హమైన అంశం మెలోనీ చుట్టూ ఉన్న నాయకుల స్పందన. సాధారణంగా ట్రంప్‌పై నేరుగా విమర్శలు చేయడానికి దూరంగా ఉండే మెలోనీ శిబిరం ఈసారి మాత్రం అసాధారణంగా ఘాటుగా స్పందించింది. ప్రధాని కార్యాలయంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా భావించే జియోవాన్బట్టిస్టా ఫజ్జోలారి ఏకంగా ట్రంప్ అమెరికా–యూరప్ చారిత్రక సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలతో యూరప్ అంతటా అమెరికా వ్యతిరేక భావన పెరిగేలా చేస్తున్నారని కూడా విమర్శించారు.ఇంతటితో ఆగకుండా, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం మరింత చర్చకు దారి తీసింది. దీనితో పాటు అమెరికాలో జరగాల్సిన ఇటలీ–అమెరికా వ్యాపార సదస్సు కూడా వాయిదా పడింది. ఈ వివాదాన్ని కేవలం ట్రంప్–మెలోనీ మధ్య వ్యక్తిగత ఘర్షణగా చూడలేం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా–యూరప్ సంబంధాలు, నాటో బాధ్యతలు, ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలపై ఇరువైపులా పెరుగుతున్న భిన్నాభిప్రాయాలకు ఇది తాజా ప్రతిబింబంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ట్రంప్‌కు యూరప్‌లో అత్యంత విశ్వసనీయ మిత్రురాలిగా భావించిన మెలోనీ సైతం ఇప్పుడు బహిరంగంగానే విభేదించడం పరిస్థితి ఎంత మారిపోయిందో సూచిస్తోంది. అందుకే ఈ మాటల యుద్ధం ఇద్దరు నేతలకే పరిమితమవుతుందా? లేక అమెరికా–యూరప్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక దూరానికి, అట్లాంటిక్ మిత్రబంధంలో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. -
అమెరికా–ఇరాన్ డీల్ జరగబోయేది ఇక్కడే..!
స్విట్జర్లాండ్‌లోని ఓ ప్రశాంత పర్వత ప్రాంతం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా లగ్జరీ రిసార్ట్‌గా, పర్యాటక వేదికగా మాత్రమే గుర్తింపు పొందిన ఈ ప్రదేశం… ఇప్పుడు యూఎస్–ఇరాన్ శాంతి ఒప్పంద సంతకానికి వేదికగా మారనుండటంతో అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. కానీ ఈ ప్రదేశానికి ఉన్న చరిత్ర, అక్కడ జరిగిన గత కీలక పరిణామాలు చూస్తే… ఇది కేవలం ఒక రిసార్ట్ మాత్రమే కాదనే ఫీలింగ్ కలగకమానదు.స్విట్జర్లాండ్‌లోని బుర్గెన్‌స్టాక్ (Bürgenstock) రిసార్ట్ ప్రపంచ రాజకీయాలకు మరోసారి కేంద్రబిందువుగా మారింది. నాలుగు నెలలుగా కొనసాగిన యుద్ధాన్ని ముగించేందుకు యూఎస్–ఇరాన్ మధ్య కుదిరిన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు ఈ శుక్రవారం ఇక్కడే జరగనున్నట్లు సమాచారం. అయితే.. పర్వత శిఖరంపై, సరస్సును చుట్టుముట్టినట్లుగా ఉన్న ఈ రిసార్ట్‌ను సమావేశానికి ఎంపిక చేయడం వెనుక భద్రతా కారణాలు ప్రధానంగా ఉన్నాయని స్విస్ అధికారులు తెలిపారు. యూఎస్, ఇరాన్‌తో పాటు పాకిస్తాన్ మరియు ఖతర్ మధ్యవర్తుల సూచనల మేరకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ హోటల్ సముదాయం 150 ఏళ్ల చరిత్ర కలిగినది. ప్రపంచ నేతలు, రాజ కుటుంబాలు, హాలీవుడ్ ప్రముఖులు తరచూ ఇక్కడి అతిథులుగా వచ్చారు. ప్రశాంత వాతావరణం, బహుముఖ భద్రతా ఏర్పాట్లు, చేరుకోవడం కష్టమైన భౌగోళిక స్థానం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక్కడి చరిత్రలో ప్రముఖ ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. 1950లలో ప్రపంచ నాయకులు, కళాకారులు ఈ రిసార్ట్‌ను కలుసుకునే వేదికగా ఉపయోగించారు. బ్రిటిష్ నటుడు సీన్ కానరీ జేమ్స్ బాండ్ సినిమా “గోల్డ్‌ఫింగర్” షూటింగ్ సమయంలో ఇక్కడే నెలరోజులు ఇక్కడే బస చేశారు. ఈ రిసార్ట్‌లోని నిర్మాణం కూడా విశిష్టంగా ఉంటుంది. పర్వత అంచున 450 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సముదాయం నాలుగు ప్రధాన హోటల్ భవనాలు, విలాసవంతమైన సూట్లు, విల్లాలతో కూడి ఉంటుంది. కొన్ని సూట్ల ధరలు ఒక్క రాత్రికి వేల డాలర్ల వరకు ఉంటాయి. ప్రత్యేక రైల్వే మార్గాలు, లిఫ్టులు, సరస్సు ద్వారా రాకపోకలు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.హాలీవుడ్ క్లాసిక్ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్‌కు వేదికైన ఈ లగ్జరీ ప్రదేశం… ఇప్పుడు యుద్ధం ముగింపు చర్చలు అక్కడే ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు ప్రపంచం సమాధానం వెతుకుతోంది. అయితే.. ప్రపంచ రాజకీయ చర్చలు, శాంతి ఒప్పందాలు కూడా ఇదే ప్రదేశంలో జరిగిన సందర్భాలు ఉన్నాయట. గతంలో కూడా ఇక్కడ ప్రపంచ స్థాయి రాజకీయ సమావేశాలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు, సుడాన్ శాంతి ఒప్పందం, సైప్రస్ సమస్యపై చర్చలు వంటి కీలక సమావేశాలకు ఇది వేదికగా నిలిచింది. అంతేకాదు, బిల్డర్‌బర్గ్ వంటి అత్యంత రహస్య గ్లోబల్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరిగిన చరిత్ర ఉంది. మొత్తానికి, సినిమాల్లో కనిపించే లాంటి ఆ లగ్జరీ పర్వత రిసార్ట్ ఇప్పుడు మరోసారి ప్రపంచ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. -
ట్రంప్ బిగ్ గేమ్! అమెరికా రాజకీయాల్లో ఇజ్జత్ కా సవాల్
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. ఆయన మద్దతు లభిస్తే ఎన్నికల్లో విజయం దాదాపు ఖాయమనే (స్ట్రయిక్ రేటు ఎక్కువ) అభిప్రాయం రిపబ్లికన్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ట్రంప్ మద్దతు పొందిన కెన్ పాక్స్టన్ ప్రైమరీలో తొలి అడ్డంకిని దాటి, ఇప్పుడు ప్రధాన ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకునే తదుపరి రాజకీయ నిర్ణయం పై అందరి దృష్టి నిలిచింది. టెక్సాస్ చాలా కాలంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన కోటగా ఉంది. ఇటీవల జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ మద్దతుతో రాష్ట్ర అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్, సీనియర్ సెనేటర్ జాన్ కార్నిన్ను ఓడించి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అయితే ప్రైమరీలో గెలవడం ఒక విషయం అయితే, సాధారణ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకోవడం మరో విషయం.ఈ పరిస్థితుల్లో కెన్ పాక్స్టన్కు ఎదురవుతున్న గట్టి పోటీని రిపబ్లికన్ పార్టీ కీలక పరీక్షగా చూస్తోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున జేమ్స్ టలారికో నుంచి పెరుగుతున్న సవాల్, ఆయన బలమైన ఫండ్‌రైజింగ్, అలాగే పాక్స్టన్‌పై ఉన్న పాత అవినీతి ఆరోపణలు రిపబ్లికన్లకు రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ పోరు రిపబ్లికన్ పార్టీకి “ఇజ్జత్ కా సవాల్”గా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తన మద్దతుతో అభ్యర్థిగా నిలిచిన కెన్ పాక్స్టన్ను గెలిపించేందుకు ట్రంప్ తన వద్ద ఉన్న అత్యంత భారీ ఎన్నికల నిధిని ఖర్చు చేస్తారా లేదా? ఇదే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో చర్చకు దారితీసిందిరిపబ్లికన్లకు ట్రంప్ వద్ద ఉన్న నిధి కీలకంగా కనిపిస్తోంది. అమెరికాలో ఎన్నికలు అత్యంత ఖరీదైన రాజకీయ ప్రక్రియల్లో ఒకటి. టెలివిజన్ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రజా సమావేశాలు, ప్రచార బృందాలు, ఓటర్లను చేరుకునే కార్యక్రమాల కోసం కోట్లాది డాలర్లు అవసరమవుతాయి. అందుకే రాజకీయ నాయకులు, పార్టీలు ముందుగానే భారీ మొత్తంలో విరాళాలు సేకరిస్తుంటాయి.ట్రంప్‌కు అనుబంధంగా ఉన్న మాగా (MAGA Inc), సూపర్ పాక్(PAC) వద్ద ప్రస్తుతం 356 మిలియన్ డాలర్ల(సుమారు రూ.3,000 కోట్లు) నిధి ఉంది. ఇది అమెరికా రాజకీయాల్లో అత్యంత భారీ ఎన్నికల నిధుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ డబ్బు ప్రధానంగా ట్రంప్ అభిమానులు, వ్యాపారవేత్తలు, పార్టీ మద్దతుదారుల విరాళాల ద్వారా సమీకరించబడింది. అయితే.. 👉ట్రంప్ ఈ డబ్బును టెక్సాస్ కోసం పాక్స్టన్ కోసం ఖర్చు చేస్తే ఏమవుతుంది?.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారీ ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థులపై రాజకీయ దాడులు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో పాక్స్టన్కు ఎన్నికల్లో స్పష్టమైన ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా టలారికో ఆర్థిక బలాన్ని ఎదుర్కోవడానికి ఇది ఉపయోగపడవచ్చు.👉అయితే ట్రంప్ ఈ నిధిని ఖర్చు చేయకుండా దాచిపెడితే పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. పాక్స్టన్ తన సొంత నిధులతోనే ఎన్నికల పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకవేళ టెక్సాస్ వంటి కీలక రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోతే, అమెరికా సెనేట్‌లో పార్టీ బలం తగ్గే అవకాశం ఉంటుంది. అలా జరిగితే భవిష్యత్తులో ట్రంప్ రాజకీయ అజెండాను అమలు చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు.👉అలాగే.. ట్రంప్ నిధిని వెంటనే ఖర్చు చేయకూడదని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. 2026 మధ్యంతర ఎన్నికలతో పాటు రాబోయే జాతీయ రాజకీయ పోరాటాల కోసం ఈ డబ్బును నిల్వ ఉంచడం వ్యూహాత్మకంగా మంచిదని వారు వాదిస్తున్నారు. అందుకే ట్రంప్ ఇప్పటివరకు తన తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు.మొత్తంగా చూస్తే, టెక్సాస్ ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక సెనేట్ సీటు కోసం జరిగే పోటీ కాదు. ట్రంప్ రాజకీయ ప్రభావం, ఆయన ఆర్థిక శక్తి, అలాగే రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన కీలక పరీక్షగా మారింది. ట్రంప్ తన ‘రూ.3,000 కోట్ల’ రాజకీయ నిధిని తెరపైకి తీసుకొస్తారా? లేదంటే సరైన సమయం కోసం దాచిపెడతారా?.. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఈ బిగ్ గేమ్ హాట్ టాపిక్‌గా మారింది. -
ఒకే రోజు.. అమెరికా, రష్యాలకు భారీ షాక్!
అవేం సాధారణ యుద్ధ విమానాలు కావు.. అవసరమైతే అణ్వాయుధాలను మోసుకెళ్లి వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై విరుచుకుపడగల గగన కోటలు. ఒకటి అమెరికా బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్, మరొకటి రష్యా టీయూ-22ఎం3.. కోల్డ్‌వార్ కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన రెండు మహాశక్తుల అణు బలానికి ప్రతీకలవి. అలాంటి రెండు దేశాల వ్యూహాత్మక శక్తికి ప్రతీకలైన బాంబర్లు.. కొన్ని గంటల వ్యవధిలో నేలకూలడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. అమెరికా, రష్యాలకు ఒకే రోజు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న రెండు దేశాల వ్యూహాత్మక బాంబర్లు ప్రమాదానికి గురయ్యాయి. అమెరికాకు చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ కూలి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. రష్యాకు చెందిన టీయూ-22ఎం3 బాంబర్ కూడా కుప్పకూలింది. అయితే రష్యా విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.SHOCKING COINCIDENCE: On June 15, 2026, TWO strategic bombers crashed on the SAME DAY — first Russia's Tu-22M3 in Siberia (4 pilots survived), then US B-52 in California (8 crew died) ❄️🇺🇸Both Cold War-era aircraft. Both gone in one day. pic.twitter.com/rxZ01MztPX— RB. (@KailashVashi) June 16, 2026అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బాంబర్ టెస్టింగ్‌లో భాగంగా.. ప్రమాదానికి గురైనట్లు అమెరికా వైమానిక దళం తెలిపింది. ప్రమాదంలో సిబ్బంది సజీవ దహనం కాగా.. స్పాట్ నుంచి భారీగా నల్లటి పొగలు ఎగసిపడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్‌లోని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.All 8 crew DEAD in B-52 bomber crash in routine test flight — CNN 'Indications are crash was not survivable' — officialshttps://t.co/Llhou3fYku pic.twitter.com/DwEmKbAhTb— RT (@RT_com) June 16, 2026మరోవైపు రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఇర్కుట్స్క్లో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్ కూలిపోయింది. శిక్షణా విమానయానంలో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ప్రమాదం సంభవించే ముందే సిబ్బంది ఎజెక్ట్ కావడంతో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. విమానం ఎలాంటి యుద్ధ సామగ్రి లేకుండానే ప్రయాణిస్తోందని, భూమిపై కూడా ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది.అసలు ఈ రెండు వ్యూహాత్మక బాంబర్ల ప్రత్యేకతే వాటిని ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత కీలక వేదికలుగా నిలిపింది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 1952లో తొలి ప్రయోగాన్ని పూర్తి చేసుకోగా, 1955లో అమెరికా వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశించింది. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇది అమెరికా వ్యూహాత్మక వైమానిక శక్తికి వెన్నెముకగా కొనసాగుతోంది. వియత్నాం యుద్ధం, గల్ఫ్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఆపరేషన్లలో ఈ బాంబర్లు కీలక పాత్ర పోషించాయి. అణు బాంబుల నుంచి అత్యాధునిక క్రూయిజ్ క్షిపణుల వరకు మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది.దీని ప్రారంభ ఉత్పత్తి కాలంలో ఒక్క బీ-52 విమానం ఖర్చు సుమారు 14 మిలియన్ డాలర్లకు చేరువగా ఉండేది. కానీ ఆధునికీకరణలు, అప్గ్రేడ్లు కలిపితే ప్రస్తుత విలువ మరియు నిర్వహణ వ్యయం వందల మిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లు రక్షణ విశ్లేషణలు పేర్కొంటాయి. ఇప్పటికీ కొత్త ఇంజిన్లు, అవియానిక్స్, ఆయుధ వ్యవస్థలతో దీన్ని నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నారు.మరోవైపు రష్యా టీయూ-22 బాంబర్ కుటుంబానికి చెందిన టీయూ-22ఎం3 వెర్షన్ 1980లలో సేవల్లోకి వచ్చింది. నాటో దేశాలు దీనిని "బ్యాక్‌ఫైర్"గా పిలుస్తాయి. సోవియట్ యుగం నుంచి రష్యా వ్యూహాత్మక వైమానిక శక్తిలో ఇది కీలక భాగంగా కొనసాగుతోంది. సిరియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో కూడా ఈ బాంబర్లను వినియోగించారు. ఖెచ్-22 క్రూయిజ్ క్షిపణులు, అలాగే ఆధునిక హైపర్సోనిక్ ఆయుధాలు మోసుకెళ్లగల సామర్థ్యం దీని ప్రధాన బలం.టీయూ-22ఎం3 ఖర్చు విషయానికి వస్తే, సోవియట్ కాల అంచనాలు మరియు ఆధునిక పునర్మూల్యాంకనాల ప్రకారం ఒక్క విమానం ఉత్పత్తి వ్యయం సుమారు 40–50 మిలియన్ డాలర్ల మధ్యగా భావించబడుతుంది. అయితే ఆయుధ సమీకరణ, నిర్వహణ, ఆధునికీకరణతో కలిపితే దీని మొత్తం జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది.బలం విషయానికి వస్తే.. బీ-52 విమానం దాదాపు 31 టన్నుల వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. గాల్లో ఇంధనం నింపుకుంటే వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకుని దీర్ఘదూర దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. మరోవైపు టీయూ-22ఎం3 సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించగలదు. సముద్రంలోని యుద్ధ నౌకలు, భూభాగంలోని వ్యూహాత్మక స్థావరాలపై వేగవంతమైన దాడుల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కోల్డ్‌వార్ ముగిసి మూడు దశాబ్దాలకు పైగా గడిచినా అమెరికా, రష్యా ఇప్పటికీ ఈ పాత తరం బాంబర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కొత్త వ్యూహాత్మక బాంబర్ల అభివృద్ధికి అయ్యే భారీ వ్యయం!. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అణు జలాంతర్గాములు, హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధితో బాంబర్ల ప్రాధాన్యం కొంత తగ్గినప్పటికీ.. అణు నిరోధక వ్యూహంలో వీటి పాత్ర మాత్రం ఇప్పటికీ కీలకంగానే ఉంది.అమెరికా ప్రస్తుతం అత్యాధునిక బీ-21 రైడర్ స్టెల్త్ బాంబర్‌ను అభివృద్ధి చేస్తుండగా.. రష్యా పాక్-డీఏ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. అయితే సాంకేతిక సవాళ్లు, భారీ వ్యయభారం, పరీక్షల్లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తిస్థాయిలో సేవల్లోకి రాలేదు. ఫలితంగా 1950ల, 1980ల కాలానికి చెందిన ఈ గగన దిగ్గజాలే ఆధునికీకరణలతో ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అణు శక్తికి ప్రతీకగా నిలిచిన బీ-52, రష్యా వ్యూహాత్మక బలానికి చిహ్నంగా భావించే టీయూ-22ఎం3 బాంబర్లు ఒకే రోజు ప్రమాదాలకు గురికావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోల్డ్ వార్ ప్రత్యర్థులైన రెండు దేశాలకు ఒకేసారి ఎదురైన ఈ అరుదైన ఎదురుదెబ్బ.. ప్రపంచ సైనిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. -
పాక్ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్ అక్కడే!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించి.. చాలామందికి ఓ సందేహం రావొచ్చు. పాకిస్థాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతమే అయితే అక్కడ ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి, శాసనసభ, రాజ్యాంగం, జెండా ఎందుకు ఉన్నాయి? పీవోకే నిజంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమా? కాదా?.. ఇటీవల పీవోకేలో చెలరేగిన ఆందోళనలు, పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత చర్యల నేపథ్యంలో ఈ ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.పాకిస్థాన్ అధికారికంగా పీవోకేను "ఆజాద్ జమ్మూ అండ్ కశ్మీర్"గా పిలుస్తుంది. పేరు వింటే అది స్వతంత్రమో.. స్వయం ప్రతిపత్తితో నడిచే ప్రాంతంలా అనిపిస్తుంది. అక్కడ ప్రత్యేక శాసనసభ ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, న్యాయవ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం కూడా ఉన్నాయి. పైకి చూస్తే ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ఉన్న ప్రాంతంలా కనిపిస్తుంది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.ఈ వ్యవస్థ వెనుక ఉన్న కథ 1947 విభజన కాలానికి వెళ్తుంది. జమ్మూ కశ్మీర్ సంస్థానం భారత్‌లో విలీనం కావడంతో మొదటి భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసే సమయానికి కశ్మీర్‌లోని కొంత భూభాగం పాకిస్థాన్ ఆక్రమణలో మిగిలిపోయింది. అయితే ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో అధికారిక ప్రావిన్స్‌గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జమ్మూ కశ్మీర్‌పై తమ హక్కు బలహీనపడుతుందని ఇస్లామాబాద్ భావించింది. అందుకే ఒకవైపు కశ్మీర్ వివాదం కొనసాగుతుందనే వాదనను నిలబెట్టుకుంటూనే, మరోవైపు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని అమలు చేసింది.దీంట్లో భాగంగానే 1949 కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగం, సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్థాన్ తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్రపతి, ప్రధాని, శాసనసభ, న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతో పీవోకేకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ రాజ్యాంగం ప్రకారం పీవోకేలో ఆ దేశ అధ్యక్షుడు రాజ్యాంగబద్ధ అధిపతి కాగా.. ప్రధాని కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరించాలి. కానీ అలా ఏనాడూ జరగలేదు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎక్కువగా పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. రక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక అంశాలు, కీలక పరిపాలనా నిర్ణయాలన్నీ ఇస్లామాబాద్ అనుమతితోనే అమలవుతాయి. పీవోకే పరిపాలనలో కూడా పాకిస్థాన్ నుంచి పంపిన అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది.అంతేకాదు, పీవోకేలో రాజకీయ వ్యవస్థపై పాకిస్థాన్ ప్రభావం ఎంత బలంగా ఉందో అక్కడి ఎన్నికల విధానం కూడా చూపిస్తుంది. శాసనసభలో కొన్ని స్థానాలు పీవోకేలో నివసించే ప్రజల కోసం కాకుండా, పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ఈ స్థానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విమర్శలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజల కంటే ఇస్లామాబాద్‌కు మరింత అనుకూలంగా రాజకీయ సమీకరణాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.మరో వివాదాస్పద అంశం విధేయత ప్రమాణం. పీవోకేలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు కశ్మీర్ పాకిస్థాన్‌లో విలీనం కావాలనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. భిన్నాభిప్రాయాలకు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అక్కడ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని విమర్శలు ఉన్నాయి. అలా.. ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్ సృష్టించిన నామ మాత్రపు రాజకీయ వ్యవస్థేనని స్పష్టమవుతోంది. ఇక భారత్ మాత్రం పీవోకేను ఎప్పటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కూడా పీవోకే భారత భూభాగమేనని అధికారికంగా పేర్కొంటోంది. అందుకే పీవోకేకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు, జెండా వంటి వ్యవస్థలు ఉన్నాయనే కారణంతో అది స్వతంత్ర ప్రాంతమో, ప్రత్యేక దేశమో అయిపోదని భారత్ వాదిస్తోంది. దశాబ్దాలుగా ‘ఆజాద్ కశ్మీర్’ అనే పేరుతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వాస్తవానికి పీవోకే రాజకీయ, పరిపాలనా, భద్రతా వ్యవస్థలన్నీ ఇస్లామాబాద్ నియంత్రణలోనే కొనసాగుతున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే పీవోకేలో కనిపించేది ఒక ప్రభుత్వం అయితే.. పనిచేసేది మాత్రం పాకిస్థాన్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థేనని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆశలన్నీ ఇంక ఆ నలుగురి మీదే!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో ముందడుగు వేసింది. దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి మనుషుల్ని దింపాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆర్టిమిస్ మిషన్‌కు సంబంధించిన ఓ ప్రకటన చేసింది. ఆర్టెమిస్-3 మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించింది. భవిష్యత్‌లో చంద్రుడిపై మానవుల శాశ్వత ఉనికికి బాటలు వేసే కీలక మిషన్ ఇది. అలాంటప్పుడు ఈ నలుగురినే ఎందుకు ఎంచుకున్నారనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. నాసా ఎంపిక చేసిన ఈ బృందంలో కమాండర్ రాండీ బ్రెస్నిక్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పైలట్ లూకా పార్మిటానో, నాసా వ్యోమగాములు ఫ్రాంక్ రూబియో, ఆండ్రే డగ్లస్ ఉన్నారు. ఇందులో ఆండ్రే డగ్లస్‌ను మినహాయిస్తే మిగతా ముగ్గురు అంతరిక్షయానం చేసి ఉన్నారు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహించిన అనుభవం, టెస్ట్ పైలటింగ్ నైపుణ్యాలు, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేసినట్లు నాసా వెల్లడించింది. అలాగని వాళ్ల బ్యాక్గ్రౌండ్లు ఆషామాషీగా లేవు.. రాండీ బ్రెస్నిక్: మిషన్‌కు సారథిఆర్టెమిస్-3 కమాండర్‌గా ఎంపికైన రాండీ బ్రెస్నిక్ నాసాలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాముల్లో ఒకరు. అమెరికా మెరైన్ కార్ప్స్ మాజీ పైలట్ అయిన ఆయన వేల గంటలపాటు యుద్ధ విమానాలను, టెస్టింగ్ ఫ్లైట్స్ నడిపారు. ఇప్పటికే రెండు అంతరిక్ష ప్రయాణాలు పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమాండర్‌గా కూడా సేవలందించారు. పలు స్పేస్‌వాక్‌లలో పాల్గొని అంతరిక్షంలో క్లిష్టమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. దీర్ఘకాలిక మిషన్ల నిర్వహణలో ఆయన అనుభవమే ఆర్టెమిస్-3లో ప్రధాన బలంగా భావిస్తున్నారు.లూకా పార్మిటానో: యూరప్ అంతరిక్ష వీరుడుఇటలీకి చెందిన లూకా పార్మిటానో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తరఫున ఈ బృందంలో చోటు దక్కించుకున్నారు. మాజీ ఫైటర్ పైలట్ అయిన ఆయన ఇప్పటికే రెండు అంతరిక్ష యాత్రలు పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్‌గా వ్యవహరించిన తొలి ఇటాలియన్గా రికార్డు సృష్టించారు. స్పేస్‌వాక్‌లలో విశేష అనుభవం ఉన్న ఆయన అంతరిక్షంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆర్టెమిస్-3లో ఆయన ఎంపిక నాసా-యూరప్ అంతరిక్ష సహకారానికి ప్రతీకగా నిలుస్తోంది.ఫ్రాంక్ రూబియో: రికార్డు సృష్టించిన వ్యోమగామినాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం ఆయన అంతరిక్షంలో గడిపిన సమయం. అమెరికన్ వ్యోమగాముల్లో అత్యధిక కాలం నిరవధికంగా అంతరిక్షంలో ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. వైద్యుడిగా, సైనిక అధికారిగా సేవలందించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మానవ శరీరంపై అంతరిక్ష ప్రభావాలను అధ్యయనం చేయడంలో ఆయన అనుభవం ఆర్టెమిస్-3 మిషన్‌కు ఎంతో ఉపయోగపడనుంది.ఆండ్రే డగ్లస్: ఇంట్రెస్టింగ్ఈ బృందంలో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక ఆండ్రే డగ్లస్. ఇంజినీరింగ్, రోబోటిక్స్, మానవ-యంత్ర వ్యవస్థలపై నైపుణ్యం కలిగిన ఆయన చంద్రుడిపై భవిష్యత్ కార్యకలాపాల కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష ప్రయాణ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్ చంద్రయాత్రల సాంకేతిక రూపకల్పనలో ఆయన చేసిన కృషిని గుర్తించి నాసా ఈ బృందంలో చోటు కల్పించింది.అమెరికా-యూరప్ కలయికఆర్టెమిస్-3 బృందంలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక యూరోపియన్ వ్యోమగామికి చోటు కల్పించడం యాదృచ్ఛికం కాదు. చంద్రుడిపై భవిష్యత్ అన్వేషణలు ఒక్క దేశం ఆధిపత్యంలో కాకుండా అంతర్జాతీయ భాగస్వామ్యంతో సాగుతాయనే సందేశాన్ని నాసా ఇవ్వాలనుకుంటోంది. ఆర్టెమిస్ కార్యక్రమంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అందుకే లూకా పార్మిటానో ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.ఇది ట్రయల్ మాత్రమే!ఈ నలుగురి బాధ్యత చంద్రుడిపై అడుగుపెట్టడం మాత్రమే కాదు. భవిష్యత్‌లో చంద్రుడిపై మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం వంటి మహత్తర లక్ష్యాలకు అవసరమైన సాంకేతికతను పరీక్షించడం. అందుకే ఆర్టెమిస్-3 బృందాన్ని నాసా సాధారణ వ్యోమగాముల బృందంగా కాకుండా, మానవ అంతరిక్ష అన్వేషణ తదుపరి అధ్యాయాన్ని రాసే బృందంగా అభివర్ణిస్తోంది.ఇప్పటికే ఆర్టెమిస్-1 ద్వారా మానవరహిత పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నాసా, ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి భూమికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్టెమిస్-3తో మరింత కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కానీ, ఇక్కడో క్లారిటీ అవసరం. ఆర్టెమిస్-3 మనుషుల్ని చంద్రుడి మీదకు దించే యాత్ర కాదు. భవిష్యత్‌లో చంద్రుడిపై వ్యోమగాములను సురక్షితంగా దించేందుకు అవసరమైన అత్యంత కీలక సాంకేతిక ప్రక్రియలను పరీక్షించడమే దీని ప్రధాన లక్ష్యం. సుమారు రెండు వారాల పాటు కొనసాగే ఈ మిషన్‌లో వ్యోమగాములు భూమి కక్ష్యలోనే ఉండి చంద్రుడిపై దిగే ల్యాండర్లతో డాకింగ్ ప్రక్రియను సాధన చేస్తారు. భవిష్యత్ చంద్రయాత్రల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మిషన్‌లో మరో ఆసక్తికర అంశం.. ప్రైవేట్ కంపెనీల పాత్ర. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ అభివృద్ధి చేస్తున్న ‘బ్లూ మూన్’ ల్యాండర్, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ రూపొందిస్తున్న ‘స్టార్‌షిప్’ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్‌లతో ఈ వ్యోమగాములు డాకింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. భవిష్యత్ అంతరిక్ష యుగంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి ఎలా పనిచేయబోతున్నాయో ఈ మిషన్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాబట్టి.. నాసా "మూన్ ల్యాండింగ్‌కు ముందు ఫైనల్ రిహార్సల్"గా అభివర్ణిస్తోంది.అందుకే కీలకంఅంటే ఆర్టెమిస్-3 అనేది చంద్రయాత్రకు ముందు చివరి పరీక్ష. భవిష్యత్‌లో చంద్రుడిపై దిగే వ్యోమగాముల భద్రతకు అవసరమైన సాంకేతిక, శాస్త్రీయ సమాచారాన్ని నాసా సేకరిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్టెమిస్-3 బృందం ప్రకటన ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇప్పటివరకు డిజైన్, ఇంజినీరింగ్ దశలో ఉన్న మిషన్ ఇప్పుడు మానవ ప్రయాణానికి సిద్ధమవుతోందనే సంకేతం. 1972లో అపోలో-17 మిషన్ అనంతరం మానవుడు మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టలేదు. దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత మానవులను తిరిగి చంద్రుడిపై దించాలన్న లక్ష్యంతో నాసా ఆర్టెమిస్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీర్ఘకాలికంగా చంద్రుడిపై స్థిరమైన మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం నాసా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఆర్టెమిస్-3 కీలక మలుపుగా మారనుంది. ఈ మిషన్ విజయవంతమైతే 2028లో చేపట్టే ఆర్టెమిస్-4 ద్వారా మానవులు చంద్రుడిపై అడుగుపెట్టే మార్గం మరింత సుగమం కానుంది. అయితే.. ఈ నలుగురు ఆర్టెమిస్-3లో పాల్గొనే నలుగురే కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ, నాసా ఆశలన్నీ ఇప్పుడు వీళ్లపైనే ఉన్నాయి.ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆర్టెమిస్-4లో నలుగురు వ్యోమగాములు చంద్ర కక్ష్యకు వెళ్తారు. వారిలో ఇద్దరు మాత్రమే ల్యాండర్లో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి దిగుతారు. అక్కడ వారం రోజుల పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి తిరిగి ఓరియన్ వ్యోమనౌకలో చేరతారు.:::సాక్షి వెబ్ ప్రత్యేకం -
ట్రంప్‌ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్‌నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది. ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది పరిశీలిస్తే..ఇరాన్‌పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్‌ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్‌లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్‌పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్‌పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్‌తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్‌కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్‌పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇదేం జెలసీ లోకేశ్?
చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో యువ ఐటీ మంత్రి.. అందునా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యే.. అతితక్కువ ఖర్చుతో పెట్టుబడుల్ని ఆకర్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తేడా సహజంగానే రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్‌కు దారితీసింది..విజయ్ కేబినెట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న ఎస్. కీర్తన ప్రస్తుతం సోషల్ మీడియా స్టైల్ పాలనతో హాట్ టాపిక్‌గా మారారు. మొన్నటి ఎన్నికల్లో శివకాశిలో నెగ్గిన ఆమె.. కొన్నిచోట్ల తెలుగులో ప్రచారం చేసి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు పాలనలోనూ అదే జెన్‌జీ మార్క్ చూపిస్తూ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలకు నేరుగా డిజిటల్‌గా రిక్వెస్టులు పంపడం, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్ వాడటం వంటివి తమిళనాడులో కొత్త చర్చకు దారి తీశాయి.దీంతో సహజంగానే కొంతమంది కంపెనీల దృష్టి తమిళనాడు వైపు మళ్లుతోందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కీర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ “రీల్స్ మంత్రిగా పాలన సాగుతోంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ఆమె మాత్రం “అంత తొందరెందుకు?.. వెయిట్ అండ్ సీ ఫర్ రిజల్ట్” అంటూ స్పందిస్తూ తన దారి తాను కొనసాగిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మరింత వేడి పెంచాయి. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని కీర్తనకు ఇచ్చిన సూచన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇది సాధారణ సలహాగా కనిపించినా.. మరోవైపు ఈ వ్యాఖ్యల తర్వాత తమిళనాడులో ప్రతిపక్షాలు ఆ అంశాన్ని పట్టుకుని కీర్తనపై విమర్శలు మరింత తీవ్రతరం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కోణం కూడా చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్‌గా పలు రాష్ట్రాల ఎన్నికలకు పని చేసిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వినికిడి. విశేషం ఏంటంటే.. ఆ సమయంలోనే ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్లపై మంచి పట్టు సాధించారట. అయితే వేగంగా పెంచుకుంటున్న డిజిటల్ ఇమేజ్, యువతలో కీర్తనకు లభిస్తున్న ఫాలోయింగ్ వంటి అంశాలు కొందరు రాజకీయ వర్గాల్లో కంటగింపుగా మారుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యమే లోకేష్ ఎంట్రీకి కారణమైందని చర్చ నడుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో కీర్తన చేస్తున్న కొత్త తరహా ప్రయోగాలు.. ఏపీలోని సంప్రదాయ ప్రమోషన్ మోడల్‌ను ప్రశ్నిస్తున్నాయన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే ‘మీ రాష్ట్రం సంగతి మీరు చూస్కోవచ్చు కదా!’ అంటూ కొందరు తమిళులు లోకేశ్‌ను నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్‌తో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకవైపు కీర్తన ప్రయత్నం చేస్తుంటే.. ప్రజాధనాన్ని అభివృద్ధి కంటే ఇమేజ్ బిల్డింగ్‌కు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కీర్తన నేపథ్యానికి తోడు.. వాడుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ స్టైల్, యువతలో ఆమెకు పెరుగుతున్న ఫాలోయింగ్ కూడా లోకేష్ వర్గానికి అసౌకర్యంగా మారిందన్న చర్చ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారం పాలసీ డిబేట్ కంటే వ్యక్తిగత రాజకీయ ఈర్ష్యగా మారిందన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ‘జెలసీ పాలిటిక్స్’ చర్చగా మారింది. -
ఆమె ప్రశ్నిస్తే ట్రంప్‌కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఎదురుగా డొనాల్డ్ ట్రంప్‌లాంటి నేతల ముందు అడుగు వేయడం అంటేనే చాలా మంది జర్నలిస్టులు జాగ్రత్తపడే పరిస్థితి. కానీ ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా ధైర్యంగా కఠిన ప్రశ్నలు వేసిన ఒక జర్నలిస్ట్.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారారు. ఇక చాలూ అనుకుంటూ ఆయన్ని ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేయించిన.. “ఆమె ఎవరబ్బా?” అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.. ఆమె పేరు.. క్రిస్టెన్ వెల్కర్. ఎన్బీసీ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆధారాలు చూపాలంటూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే అంశాన్ని ఆమె మళ్లీ మళ్లీ ప్రస్తావించడంతో ఇంటర్వ్యూ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సారీ డార్లింగ్ అంటూనే.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రంప్ విసుగ్గా కోటుకు ఉన్న లాపెల్ మైక్, వైర్లెస్ ట్రాన్స్‌మిటర్‌తో పాటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే మళ్లింది.WOW -- Trump crashes out and cuts his interview with Welker short as she presses him on his lack of evidence for claiming elections are rigged"You're either crooked or you're stupid. Let's call it quits. Because I've had enough. Thank you darling," he tells her.""I traveled… pic.twitter.com/qQaNIDnX4y— Aaron Rupar (@atrupar) June 7, 2026క్రిస్టెన్ వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వార్తా రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్రను అభ్యసించారు. అనంతరం జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని స్థానిక టెలివిజన్ ఛానళ్లలో రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. రిపోర్టింగ్‌లో చూపిన ప్రతిభతో 2010లో ఆమె ఎన్బీసీ న్యూస్‌లో చేరారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. వైట్‌హౌస్ కరస్పాండెంట్‌గా నియమితులైన ఆమె, అమెరికా అధ్యక్షుల విదేశీ పర్యటనలు, ఎన్నికలు, జాతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలను కవర్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే.. క్రిస్టెన్ వెల్కర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి పెద్దగా వినిపించింది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో. అప్పటి ట్రంప్–బైడెన్ మధ్య జరిగిన చివరి ప్రత్యక్ష చర్చకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇద్దరు అభ్యర్థులను సమతుల్యంగా ప్రశ్నిస్తూ, చర్చను నియంత్రించిన తీరు ఆమెకు విస్తృత ప్రశంసలు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ చర్చా కార్యక్రమాల్లో ఒకటైన “మీట్ ద ప్రెస్”కు 2023లో ఆమె హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా హోస్ట్‌గా, రెండో మహిళా యాంకర్‌గా నిలిచి విశేష గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. ట్రంప్ మాత్రమే కాదు.. గతంలో బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, జో బైడన్.. ఇంకా పలువురు టాప్ డెమోక్రటిక్, రిపబ్లికన్ లీడర్లను ఆమె తనదైన శైలి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రశ్నించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలు వేయడం, సమాధానాల్లోని అస్పష్టతను వెంటనే గుర్తించి తిరిగి ప్రశ్నించడం ఆమె జర్నలిజం శైలి. స్పష్టమైన సమాధానం వచ్చే వరకు వెనక్కి తగ్గకపోవడం వల్లే ఆమెను అమెరికా రాజకీయ జర్నలిజంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా భావిస్తారు. తాజా ఘటనతో మరోసారి ఆమె పేరు.. తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. -
చైనా దాచిన నిజాలు.. 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి!
ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువత.. ట్యాంకులతో వారిపై విరుచుకుపడిన సైన్యం.. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 1989 టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఇప్పటికీ చైనా చరిత్రలో చెరగని మచ్చగానే మిగిలింది. ఈ ఘటనకు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాటి ఉద్యమానికి సంబంధించిన మరికొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దృష్టి మరోసారి ఆ రక్తచరిత్రపైకి మళ్లింది.ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని ఘటనల్లో టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఒకటి. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు వీధుల్లోకి రావడం.. ఆ ఉద్యమాన్ని చైనా ప్రభుత్వం ట్యాంకులు, సైన్యంతో అణచివేయడం.. వందల మంది, మరికొందరి అంచనాల ప్రకారం వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం.. ఇవన్నీ చైనా చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయి.1980ల చివర్లో చైనా వేగంగా ఆర్థిక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛలు మాత్రం కఠిన నియంత్రణలోనే ఉండేవి. అవినీతి పెరుగుతోందన్న విమర్శలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రజాస్వామ్య సంస్కరణలపై యువతలో పెరుగుతున్న ఆకాంక్షలు దేశవ్యాప్తంగా అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సంస్కరణవాది నేత హు యాబాంగ్ మరణం ఉద్యమానికి నాంది పలికింది.హు యాబాంగ్ను విద్యార్థులు, మేధావులు మార్పుకు ప్రతీకగా భావించేవారు. ఆయన మరణం తర్వాత 1989 ఏప్రిల్‌లో వేలాది మంది విద్యార్థులు బీజింగ్‌లోని టియానన్మెన్ స్క్వేర్‌కు చేరుకున్నారు. మొదట ఇది కేవలం సంతాప సభగానే ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య సంస్కరణలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం భారీ ఉద్యమంగా రూపాంతరం చెందింది.రోజులు గడిచేకొద్దీ నిరసనల తీవ్రత పెరిగింది. విద్యార్థులతో పాటు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా ఉద్యమంలో చేరారు. లక్షలాది మంది స్క్వేర్‌లో గుమికూడడంతో బీజింగ్ అంతర్జాతీయ మీడియా దృష్టిలోకి వచ్చింది. ఒక దశలో ఈ ఉద్యమం చైనా కమ్యూనిస్టు పాలనకే సవాలుగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ప్రభుత్వం మే నెలలో మార్షల్ లా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జూన్ 3 రాత్రి నుంచి జూన్ 4 తెల్లవారుజామున వరకు సైన్యం ట్యాంకులు, సాయుధ బలగాలతో బీజింగ్‌లోకి ప్రవేశించి నిరసనలను అణచివేసింది. ఆ రాత్రి ఏం జరిగిందన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ప్రత్యక్ష సాక్షులు మరియు అంతర్జాతీయ మీడియా నివేదికలు వందల నుంచి వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం అధికారిక మరణాల సంఖ్యను ఇప్పటికీ వెల్లడించలేదు.ఈ ఘటనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దృశ్యం “ట్యాంక్ మ్యాన్”. ట్యాంకుల వరుస ముందు ఒంటరిగా నిలబడి వాటిని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చిత్రం ప్రభుత్వ శక్తికి ఎదురుగా వ్యక్తి ధైర్యానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది.ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన కొత్త చిత్రాలు ఆ రోజుల్లోని ఉద్రిక్త వాతావరణాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. స్క్వేర్‌లో గుమికూడిన విద్యార్థులు, తాత్కాలిక శిబిరాలు, ప్రజల రద్దీ, సైనిక కదలికలు, ఆందోళనల మధ్య నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులు ఈ ఫొటోల ద్వారా మరోసారి ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతున్నాయి. చరిత్రలో నమోదు కాని కొన్ని క్షణాలను కూడా ఇవి వెలుగులోకి తీసుకొస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.టియానన్మెన్ ఘటనలో కీలక పాత్ర పోషించిన హు యాబాంగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో సంస్కరణవాది నేతగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక విప్లవ సమయంలో అన్యాయానికి గురైన వారికి పునరావాసం కల్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయనను ప్రజల్లో మరింత గౌరవనీయుడిగా మార్చాయి. 1987లో ఆయన పదవి నుంచి తప్పించబడ్డారు. 1989 ఏప్రిల్‌లో ఆయన మరణించడంతో విద్యార్థులు నివాళుల కోసం స్క్వేర్‌కు చేరుకోవడం చివరికి పెద్ద ఉద్యమంగా మారింది.ఈ ఘటనపై చైనాలో ఇప్పటికీ బహిరంగ చర్చలు పరిమితంగానే ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు, మీడియా, సోషల్ మీడియా వేదికలపై కఠిన నియంత్రణ కొనసాగుతోంది. అయినప్పటికీ విదేశాల్లోని చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలు ప్రతి సంవత్సరం ఈ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అణచివేత వల్ల ఈ ఉద్యమం లక్ష్యాన్ని సాధించకపోయినా, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చల్లో అది ఒక శాశ్వత గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ కొత్త చిత్రాలు ఆ పోరాటంలో నిలిచిన వేలాది యువత ఆశలు, భయాలు, ధైర్యానికి మరోసారి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
కుప్పకూలిన వేల కోట్ల సామ్రాజ్యం.. తప్పెక్కడ జరిగింది?
అప్పటివరకు యాక్షన్ ఫిగర్లు అంటే ఎక్కువగా సైనికులు, ఫైర్‌ఫైటర్లు లాంటి వాస్తవిక పాత్రలే. ఆ తర్వాత కామిక్ పుస్తకాలు.. వాటి ఆధారంగా యానిమేషన్ సిరీస్‌లు.. సినిమాలు.. ఆఖరికి బొమ్మలు పిల్లల ఆటల ప్రపంచాన్ని ఆక్రమించేశాయి. అయితే 80వ దశకంలో వినోద పరిశ్రమలో ఒక విప్లవాత్మక ఆలోచన మొదలైంది. ముందుగా ఆడుకునే బొమ్మలను రూపొందించి.. వాటి చుట్టూ కథలను నిర్మించాలన్న ఆలోచన చేసింది మ్యాటెల్. అలా పుట్టుకొచ్చిన పాత్రే హీ మ్యాన్. “మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్”.. ఆరోజుల్లో అద్భుతమైన ఫాంటసీ లోకం. ఈ ప్రపంచంలో సూపర్ హీరో హీ-మ్యాన్. అతనికి ఉండే అపార శక్తి, పోరాటాలు.. పిల్లల ఊహల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. ముఖ్యంగా.. “గ్రేస్కల్ నాకు శక్తినిచ్చుగాక(బై ద పవర్ ఆఫ్ గ్రేస్కల్… ఐ హేవ్ ద పవర్)”.. అంటూ కత్తి దూసి చెప్పే డైలాగ్ కొన్నితరాల పిల్లలకు ఒక భావోద్వేగం. అప్పటిదాకా బొమ్మల మార్కెట్లో ఉన్న సంప్రదాయన్ని తలకిందులు చేసింది అమెరికాకు మ్యాటెల్ సంస్థ. ముందుగా బొమ్మలను తయారు చేసి, ఆ తర్వాత వాటి చుట్టూ కథలను, పాత్రలను, యానిమేషన్ ప్రపంచాన్ని నిర్మించడం ప్రారంభించింది. అలా “మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” రూపొందించింది. ఇందులో ప్రిన్స్ ఆడమ్.. ఓ మంత్రం చెప్పి శక్తివంతమైన హీ-మ్యాన్ రూపం ధరిస్తాడు. రహస్యాలతో నిండిన గ్రేస్కల్ కోట, హీమ్యాన్ వెంటే ఉండే బ్యాటిల్ క్యాట్(పిరికి పులి కాస్త పవర్‌ఫుల్‌గా మారడం..) భయంకరమైన శత్రువు స్కలేటర్ అండ్ కోతో హీమ్యాన్, అతని మిత్రబృందం చేసే పోరాటాలు.. అన్నీ కలిసి ఒక విస్తృతమైన ఫాంటసీ రాజ్యాన్ని సజీవంగా నిలిపాయి. 1983లో ప్రారంభమైన యానిమేషన్ సిరీస్ ఈ ప్రపంచాన్ని టీవీ తెరపైకి తీసుకువచ్చి, ప్రతి ఎపిసోడ్‌ను ఒక బొమ్మల ప్రకటనలా మార్చేసింది మ్యాటెల్. వెరసి అతితక్కువ టైంలో వేల కోట్ల సామ్రాజ్యంతో సంచలనాలకు నెలవు అయ్యింది. ఒకానొక టైంలో మార్వెల్ లాంటి కొండను సైతం ఢీ కొడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ విజయ యాత్ర ఎంత వేగంగా సాగిందో.. అంతే వేగంగా కుప్పకూలింది. కాస్ట్లీ మిస్టేక్కామిక్ సిరీస్ సూపర్ సక్సెస్‌తో మ్యాటెల్ నేల మీదకు దిగిరాలేదు. ఎడాపెడా బొమ్మల్ని ఉత్పత్తి చేసింది. ఈ క్రమంలో.. మార్కెట్లో డిమాండ్‌ను సరిగా అంచనా వేయలేక తడబడింది. దీంతో దుకాణాల్లో సరుకు పేరుకుపోయి నిల్వలు అధికమయ్యాయి. అదే సమయంలో ట్రాన్స్ఫార్మర్స్, జీఐ జాయ్ లాంటి పోటీ ఫ్రాంచైజీలు మరింత ఆధునిక డిజైన్లు, రూపాంతరం చెందే బొమ్మల కాన్సెప్ట్‌లతో పిల్లలను ఆకట్టుకోవడం ప్రారంభించాయి. ఈ మార్పుల మధ్య హీ-మ్యాన్ ఆకర్షణ క్రమంగా తగ్గుతూ వచ్చింది.మార్కెటింగ్ తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్లు చాలవన్నట్లు.. జీతాల విషయంలోనూ మ్యాటెల్ ఎచ్చులకు పోయింది. ఎంత ఎక్కువ ప్రొడక్టులు తయారు చేస్తే అంత బోనస్‌లు అంటూ చేసిన ప్రకటన.. నిండా ముంచేసింది. ఫలితంగా.. అవసరానికి మించి బొమ్మలు మార్కెట్లోకి వెళ్లాయి. సరఫరా డిమాండ్‌ను మించిపోయి ధరలు పడిపోయాయి. రిటైలర్లు నమ్మకం కోల్పోయారు. టోటల్‌గా.. బ్రాండ్ వాల్యూ ఘోరంగా దెబ్బతింది, పుండు మీద కారంలా.. 1987లో వచ్చిన హీ మ్యాన్ లైవ్ యాక్షన్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ఆపై వరుసపెట్టి సినిమాలు, సిరీస్‌లు వచ్చిన ఆకట్టుకోలేకపోయాయి. ఈ వరుస దెబ్బలతో.. కార్టూన్ సిరీస్ కూడా సరైన ముగింపు లేకుండానే అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ తరువాత జరిగిన పునరుద్ధరణ ప్రయత్నాలు కొంత ఆసక్తిని రేపినా.. పాత స్థాయి క్రేజ్ తేలేకపోయింది. ఇప్పుడు.. ఈ 2026లో కొత్త లైవ్ యాక్షన్ సినిమాతో హీ-మ్యాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎర్లీ రివ్యూస్ అయితే పాజిటివ్‌గానే వచ్చాయి. ఈసారి మిగిలిన ప్రశ్న ఒక్కటే.. ఈ కొత్త ప్రయత్నం నిజంగా ఆ పాత “శక్తిని” తిరిగి తీసుకురాగలదా? లేకుంటే.. నాస్టాల్జియా మీద ఆధారపడిన మరో ప్రయోగంగానే మిగిలిపోతుందా?.. వెయిట్ అండ్ సీ.. -
రియల్ పెద్ది షాకింగ్ జర్నీ
ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్‌గా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది!. ఇప్పుడు అదే అతన్ని మరో రంగంలో.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసే స్థాయికి చేరుకునేలా చేసింది. తాజాగా.. అంతర్జాతీయ వేదికలో అతని ప్రదర్శన చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రీల్ లైఫ్‌లో పెద్ది రాంచరణ్‌లా.. రియల్ లైఫ్‌లోనూ ఈ ‘పెద్ది’ క్రాస్ అథ్లెటిక్స్‌తో క్రీడారంగంలో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా.. రోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరగే(23) అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలోనే అతను 92.62 మీటర్ల జావెలిన్ విసిరి మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ త్రోతో అతను కేవలం శ్రీలంక నేషనల్ రికార్డ్ మాత్రమే కాదు.. 2026 సీజన్లో ప్రపంచంలోనే బెస్ట్ త్రో కూడా నమోదు చేశాడు.ఈ అద్భుత ప్రదర్శనతో రుమేష్, పురుషుల జావెలిన్‌లో 90 మీటర్ల మార్క్ దాటిన కేవలం నాలుగు ఆసియా అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. తద్వారా భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ అర్షద్ నదీమ్, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-త్సున్ తర్వాత ఈ క్లబ్లో చేరిన నాలుగో ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 21 ఏళ్ల చరిత్రలో.. జావెలిన్‌లో ఇది 21వ బెస్ట్ త్రోగా నమోదైంది. ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ పేరిట ఉంది.రుమేష్ ప్రయాణం ఆసక్తికరం.. పెద్దిలో హీరో రాంచరణ్.. క్రికెట్ నుంచి కుస్తీ.. అక్కడి నుంచి అథ్లెటిక్‌గా ప్రయాణం చేస్తాడు. అలాగే.. ఈ రియల్ లైఫ్ పెద్ది రుమేష్ ప్రయాణం కూడా క్రికెట్ తోనే ప్రారంభమైంది. అలాగని.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్‌గా!. కొలంబోకు దక్షిణంగా ఉన్న చిన్న తీర పట్టణం కలుతరాకు చెందిన ఇతగాడు.. చాలా మంది పిల్లల్లాగే క్రికెట్‌పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అండర్-18 స్థాయిలో గంటకు 134 కి.మీ వేగంతో బంతులు వేసిన ప్రతిభావంతుడు అతను. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున తన ఏకైక పోటీ మ్యాచ్‌లోనూ అతను అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది అతని క్రికెట్ కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రదర్శనగా నిలిచింది. అయితే తర్వాతి రోజుల్లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. టీ20 లీగ్‌ల ప్రభావం.. జాతీయ జట్టుకు చేరడంలో ఉన్న కఠిన పోటీ.. పైగా రాజకీయాల కారణంగా అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. ఆపై అథ్లెటిక్స్ వైపు మలుపు తీసుకున్నాడు.2017లో జావెలిన్ త్రో ప్రారంభించిన అతను మొదటిసారి 30 మీటర్లు మాత్రమే విసిరాడు. కానీ తండ్రి మార్గదర్శకత్వంలో వేగంగా ఎదిగి కొన్ని నెలల్లోనే 60 మీటర్లకు పైగా చేరుకున్నాడు. 2024 నాటికి 85 మీటర్ల మార్క్ దాటాడు. 2025లో నీరజ్ చోప్రా క్లాసిక్‌లో కూడా పోడియం ఫినిష్ సాధించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.తాజాగా రోమ్‌లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి స్టార్లు లేకపోయినా, రుమేష్ మాత్రం తన త్రోతో అందరినీ వెనక్కి నెట్టాడు. అతని తర్వాతి ప్రయత్నాల్లో ఫౌల్స్ వచ్చినా, ఎవరూ అతని దూరానికి దగ్గర కాలేకపోయారు.క్రికెట్ నుంచి జావెలిన్‌కి మారిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్‌లో కొత్త స్టార్‌గా ఎదుగుతున్నాడు. రుమేష్ పతిరగే త్రో కేవలం రికార్డు కాదు… అది ఒక కొత్త “ఏషియన్ డామినెన్స్” ప్రారంభం అన్నట్టుగా క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆ పాట లతాజీది కాదండీ.. నాదే!
ఆ స్వరం వినిపిస్తే చాలు… చెవుల్లో తేనె పోసినట్లు, మనసు ఎక్కడో మెల్లగా తేలిపోతున్న అనుభూతి కలిగేది. రేడియోలో అలనాటి పాటలు మోగుతుంటే చాలామంది “ఆహా.. ఎంతైనా లతా మంగేష్కర్ గారే కదా… ఆ గాత్రం అంత మధురంగా ఉంటుందో!” అని మురిసిపోయేవారు. కానీ ఆ మాధుర్యానికి మూలం ప్రతిసారి లతా మంగేష్కర్ స్వరం మాత్రమే కాదు. ఆ కాలంలో అంతే మృదువుగా, అంతే హృద్యంగా శ్రోతలను ఆకట్టుకున్న మరో గొంతు సుమన్ కళ్యాణ్పూర్ది కూడా. వినేవారిని గందరగోళంలో పడేసేంత సమానతతో, ఆమె గాత్రం లతా గాత్రానికి ఏమాత్రం తగ్గకుండా అదే మాధుర్యాన్ని, అదే భావాన్ని మనసులో నిలిపేది.అలనాటి మధుర గాన గంధర్వి, ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయోభారంతో ముంబైలోని తన నివాసంలో ఆమె ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత స్వర్ణయుగానికి చెందిన మరో గొప్ప స్వరం మూగబోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.1937 జనవరి 28న అప్పటి బ్రిటీష్ భారతదేశంలోని ఢాకాలో (ప్రస్తుత బంగ్లాదేశ్) సుమన్ హెమ్మాడిగా జన్మించిన ఆమె చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ముంబైకి వచ్చారు. సంగీతం, చిత్రలేఖనం రెండింటిపైనా ఆసక్తి ఉన్న ఆమె ముంబైలోని ప్రముఖ సర్ జే.జే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకున్నారు. అయితే అభిరుచిగా ప్రారంభమైన సంగీత ప్రయాణమే తర్వాత ఆమె జీవితాన్ని మలిచింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుని 1950లలో సినీ గాన రంగంలో అడుగుపెట్టారు. 1960, 70 దశకాల్లో ఆమె స్వరం దేశవ్యాప్తంగా మార్మోగింది. “నా తుమ్ హమే జానో”, “ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే”, “తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే”, “నా నా కర్తే ప్యార్”, “దిల్ ఏక్ మందిర్ హై” వంటి పాటలు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా Mohammed Rafiతో కలిసి పాడిన యుగళగీతాలు అపార ప్రజాదరణ పొందాయి.రఫీ కాంబోలోనే.. సుమన్ కళ్యాణ్పూర్ కెరీర్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆమె స్వరం లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా ఉండటం. దీంతో ఆమె పాడిన అనేక పాటలను శ్రోతలు లతా పాటలుగానే భావించేవారు. ఒకసారి తన పాటలను కూడా లతాజీ పాటలుగా గుర్తిస్తున్నారని చెప్పినప్పుడు, సుమన్ నవ్వుతూ “బాబోయ్.. ఆ గొంతు నాదేనండీ.. లతాజీది కాదు!” అంటూ సరదాగా స్పందించిన సంఘటన సంగీత వర్గాల్లో ఇప్పటికీ గుర్తుంటుంది. అదే కాలంలో హిందీ సినీ పరిశ్రమలో రఫీ–లతా మధ్య పాటల రాయల్టీ, క్రెడిట్ అంశాలపై వచ్చిన చిన్న ప్రొఫెషనల్ విభేదాల కారణంగా కొన్ని ప్రాజెక్టుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఏర్పడిన ఆ గ్యాప్ నేపథ్యంలోనే సుమన్ కళ్యాణ్పూర్ వంటి గాయనిలకు కూడా అవకాశాలు లభించాయి. అలా లతా పాడని కొన్ని పాటల్లో సుమన్ స్వరం వినిపించింది.లతాజీ ఏమనే వారంటే.. అయితే ఈ పోలికను ఆమె ఎప్పుడూ ప్రతికూలంగా తీసుకోలేదు. “నా స్వరం లతాజీ స్వరాన్ని పోలి ఉండొచ్చు. కానీ సంగీత పరిజ్ఞానం ఉన్నవారు రెండింటి మధ్య తేడాను గుర్తిస్తారు” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. లతా మంగేష్కర్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని, ఆమెను సన్నిహిత స్నేహితురాలిగానే భావించేదాన్నని కూడా సుమన్ చెప్పింది. ఇక.. లతా మంగేష్కర్ కూడా సుమన్ కళ్యాణ్పూర్ గురించి పలు ఇంటర్వ్యూలలో గౌరవంగానే మాట్లాడేవారు. “సుమన్‌కు చాలా మంచి స్వరం ఉంది. ఆమె గొంతు మధురంగా ఉంటుంది. మా ఇద్దరి స్వరాలు ఒకేలా అనిపించడంతో ప్రేక్షకులు కొన్నిసార్లు గందరగోళానికి గురయ్యేవారు. ప్రతి గాయకురాలికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది” అంటూ లతాజీ పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. పద్మభూషణ్.. 1958లో వ్యాపారవేత్త రమానంద్ కళ్యాణ్పూర్ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె పేరు సుమన్ హెమ్మాడి నుంచి సుమన్ కళ్యాణ్పూర్గా మారింది. ఆమె భర్త ప్రతి రికార్డింగ్‌కు వెంట ఉండేవారని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. గ్లామర్‌కు, ప్రచారానికి దూరంగా సాధారణ జీవితాన్ని గడపడం ఆమె ప్రత్యేకత. హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, కన్నడ, అస్సామీ, ఒడియా, గుజరాతీ, భోజ్‌పురి సహా అనేక భాషల్లో ఆమె పాటలు పాడారు. దాదాపు 700కు పైగా పాటలతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె గాన సేవలకు గుర్తింపుగా మహారాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్ అవార్డు ప్రదానం చేయగా, 2023లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది.అయితే సంగీత విమర్శకులు, పరిశీలకులు తరచూ ఒక విషయాన్ని ప్రస్తావిస్తుంటారు—సుమన్ కళ్యాణ్‌పూర్‌కు తన ప్రతిభకు తగినంత గుర్తింపు, ప్రధాన స్థాయి ప్రచారం పూర్తిగా దక్కలేదని. ఆమె స్వరం లతా మంగేష్కర్ స్వరంతో పోలికకు గురవడంతో, అనేక సందర్భాల్లో ఆమె ప్రత్యేకత నీడలో పడిపోయిందని వారు చెబుతుంటారు. అనేక మంది అభిప్రాయం ప్రకారం, అదే స్వర్ణయుగంలో ఉన్నప్పటికీ సుమన్‌కు రావాల్సిన స్థాయి గౌరవం, స్టార్డమ్ పూర్తిగా అందలేదన్న భావన సంగీత ప్రపంచంలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.ఆమె మరణంతో ఒక స్వరం ఆగిపోయి ఉండొచ్చు. కానీ “ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే” వినిపించే ప్రతిసారీ, “నా తుమ్ హమే జానో” మళ్లీ మళ్లీ హృదయాల్లో మోగే ప్రతిసారీ సుమన్ కళ్యాణ్పూర్ అనే మధుర జ్ఞాపకం సంగీత ప్రేమికుల మధ్య చిరకాలం జీవిస్తూనే ఉంటుంది. -
ఎల్‌నినో ఎఫెక్ట్: ఈసారి ఆ “అద్భుతం” జరగకపోతే..?
రెండేళ్లపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలకు ఈసారి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్ధకాలం తరువాత రుతుపవనాలు బలహీనంగా మారే ప్రమాదం ఉందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలే ఇందుకు కారణం. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే ప్రమాదమే కాకుండా.. ఆ లోటు తీవ్రంగా ఉండే అవకాశమూ ఉందని ఐఎండీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 2015 నాటి అత్యల్ప వర్షపాత రికార్డులు బద్ధలవుతాయా?, ప్రజలు మరోసారి కరవు కోరల్లో చిక్కుకుంటారా? అన్న అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.భారతదేశానికి జీవనాధారం లాంటి నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో దాదాపు 70 శాతం వర్షాన్ని అందిస్తాయి. 2024, 2025లో ఈ సీజన్లో వర్షాలు బాగా కురిశాయి. జలాశయాలు నిండిపోయాయి. వ్యవసాయం కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. కానీ 2026లో ఈ సానుకూల పరిస్థితి ప్రతికూలంగా మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.👉భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయికి కేవలం 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ అంచనా నిజమైతే 2015 తర్వాత దేశంలో నమోదయ్యే అత్యల్ప వర్షపాతం ఇదే అవుతుంది. ఆ ఏడాది భారత్ తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో పంటలు దెబ్బతినడం, నీటి వనరులు తగ్గిపోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవడం వంటి ప్రభావాలు కనిపించాయి.ఇక ఈసారి మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. సాధారణంగా ఇలాంటి బలహీన మాన్సూన్ వచ్చే అవకాశం కేవలం 16 శాతం మాత్రమే ఉండగా, తాజా అంచనాల్లో అది ఏకంగా 60 శాతానికి పెరిగింది. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉందని అర్థమన్నమాట.ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎల్‌నినో అనేది.. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ నుంచి వచ్చే గాలులు, సముద్ర ప్రవాహాలు భారతదేశ రుతుపవనాలను బలపరుస్తాయి. అయితే ఎల్‌నినో వల్ల ఈ గాలుల వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఫలితంగా భారతదేశానికి చేరే తేమ తగ్గి.. వర్షాలూ తగ్గిపోతాయి. అందుకే ఎల్‌నినో ప్రభావం వచ్చిన చాలా సంవత్సరాల్లో భారత్‌లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈసారి ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే సహజ వాతావరణ వ్యవస్థ అయిన భారత మహాసముద్ర డైపోల్ (IOD) కూడా న్యూట్రల్‌గా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఐవోడీ సానుకూలంగా (positive phase) ఉన్నప్పుడు భారతదేశానికి అదనంగా తేమను అందించి వర్షపాతం కొంతవరకు పెరగడానికి సహాయపడుతుంది. కానీ ఈసారి అది న్యూట్రల్‌గా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే.. ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గే ప్రభావాన్ని సమతుల్యం చేసే “సహజ రక్షణ వ్యవస్థ” పనిచేయదన్నమాట. ఫలితంగా వర్షపాతం తగ్గే ప్రమాదాన్ని తగ్గించే అదనపు బలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎల్‌నినో ప్రభావం నేరుగా మాన్సూన్పై ఎక్కువగా పడే అవకాశం ఉండి.. వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాన్ని పెంచుతోంది.ప్రాంతాల వారీగా చూస్తే మధ్య భారతం, దక్షిణ భారతం, వాయువ్య భారతంలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గుజరాత్ నుంచి ఒడిశా వరకు విస్తరించిన మాన్సూన్ కోర్ జోన్లో వర్షాభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతుండటంతో పంటలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.👉వర్షాలు తగ్గితే వరి, పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గి ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ ప్రజలపై భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ఎల్‌నినో ఉన్నప్పటికీ ప్రతి సారి కరువు తప్పనిసరిగా వస్తుందనేది కాదు. గతంలో కూడా కొన్ని ఎల్‌నినో సంవత్సరాల్లో సాధారణ వర్షాలు నమోదైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్ సూచనలు మాత్రం ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. 2015 కరువు రికార్డు మళ్లీ తిరగరాయబడుతుందా? లేదంటే ఏదైనా అద్భుతం జరిగి ఈసారి నైరుతి ఆశ్చర్యపరుస్తుందా? అని వాతావరణ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
చివరకు మిగిలింది రూ.140 మాత్రమే!
తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం.. ఎన్నికల్లో ఘన విజయం.. ఆయన చుట్టూ ప్రజాదరణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మళ్లీ కదిలిస్తోంది. యువతలో కనిపిస్తున్న మద్దతు, మార్పు కోరుకునే వాతావరణం నేపథ్యంలో ఒక పాత చరిత్ర మళ్లీ చర్చలోకి వచ్చింది. అదే కామరాజ్ ఓటమి. ఒకప్పుడు అపార ప్రజాదరణ కలిగిన మహానేత కూడా ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న సందర్భమది.. కామరాజ్ జీవితం భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. చిన్న వయసులోనే విద్యను వదిలేసినా, ఆయన ప్రజల మధ్యే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. గ్రామాలు, ప్రజల అవసరాలు, సమస్యలు.. ఇవే ఆయన పాలనకు మార్గదర్శకాలు అయ్యాయి. మాటల కంటే పనితోనే రాజకీయాన్ని నడిపిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. అలా ఆయనకు “తమిళనాడులోని ప్రతీ గ్రామాన్ని రెండుసార్లు సందర్శించిన నేత” అనే ముద్ర కూడా ఉంది. 1953–64 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన తమిళనాడులో విద్యా విప్లవానికి బాటలు వేశారు. వేల సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం, పేదలకు ఉచిత విద్యను విస్తరించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వంటి నిర్ణయాలు రాష్ట్ర సామాజిక రూపురేఖలను మార్చేశాయి. గ్రామీణ విద్యుతీకరణ, సాగునీటి ప్రాజెక్టులు, రవాణా అభివృద్ధి.. ఇవన్నీ ఆయన పాలనలో వేగంగా విస్తరించాయి. రాజకీయంగా కాకుండా పాలనాపరంగా ఆయనను “బిల్డర్ ఆఫ్ తమిళనాడు”గా చూస్తారు.అయితే ఇదే ప్రజాదరణ ఆయనకు రాజకీయ రక్షణ ఇవ్వలేదు. ద్రావిడ రాజకీయాల ఉధృతి, ఐడెంటిటీ పాలిటిక్స్, సినిమా ప్రభావం వంటి అంశాలను ఆయన తక్కువ అంచనా వేశారని విశ్లేషకులు చెబుతారు. డీఎంకే ఎదుగుదలతో పాటు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చివరికి 1967లో తన సొంత ప్రాంతంలోనే ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేతే ప్రజల తీర్పుతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీని ప్రధానిగా నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైంది. కానీ కాలక్రమేణా కాంగ్రెస్‌లోనే అంతర్గత మార్పులు, ఇందిరాగాంధీ కొత్త రాజకీయ శైలి, జనాకర్షణ రాజకీయాలు ఆయన ప్రభావాన్ని తగ్గించాయి. చివరికి ఆయన రాజకీయ ప్రయాణం ఒక “మౌన ముగింపు”కు చేరింది.అయితే ఆయన మరణానంతరం ఆయన జీవితం మరో కోణంలో వెలుగులోకి వచ్చింది. అత్యంత సరళ జీవితం గడిపిన ఆయన వద్ద కేవలం రూ.140 మాత్రమే మిగిలాయి. అదీ ఆయన పడుకునే దిండులో దొరికాయి. ఖాదీ దుస్తులు, కొన్ని పుస్తకాలు, రెండు జతల చెప్పులు.. ఆయన చివరి గుర్తులుగా మిగిలాయి. కానీ ఆయన నిర్మించిన విద్యా వ్యవస్థ, పాలనా మౌలిక వసతులు మాత్రం ఇప్పటికీ తమిళనాడును నడిపిస్తున్నాయి.ఇప్పుడీ చరిత్ర మళ్లీ ఎందుకు గుర్తొస్తోంది అంటే.. తమిళనాడులో విజయ్ చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చలే కారణం. సినిమా ప్రభావం, యువత ఆకర్షణ, మార్పు.. ఇవి కొత్త రాజకీయ శక్తిగా మారుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డబ్బు ప్రభావం తగ్గి, భావోద్వేగ ఓటింగ్ పెరుగుతోందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు శివకుమార్ (సూర్య, కార్తి తండ్రి) చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు మరింత వేడి తెచ్చాయి. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన భావన ఒకటే.. ప్రజల తీర్పును ఎవరూ శాశ్వతంగా అంచనా వేయలేరు. “కామరాజ్ లాంటి మహానేతనే ప్రజలు ఒకప్పుడు ఓడించారు. ఇది ప్రజాస్వామ్య స్వభావాన్ని చూపించే ఉదాహరణ. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. విజయ్ విజయం నాకు వ్యక్తిగతంగా ఆనందం కలిగిస్తోంది. కానీ చివరికి నిర్ణయం తీసుకునేది ప్రజలే” అని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, తమిళనాడు రాజకీయాల్లో తరచుగా కనిపించే “నాయకత్వ మార్పుల చక్రాన్ని” మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఒకవైపు కామరాజ్ లాంటి ప్రజా సేవా ప్రతీకలు ఓటమిని ఎదుర్కొన్న చరిత్ర, మరోవైపు కొత్త తరంలో సినీ ప్రభావంతో ఎదుగుతున్న రాజకీయ ఆకర్షణ.. ఈ రెండు విరుద్ధ ధోరణులు ఇప్పుడు ఒకే చర్చలో కలుస్తున్నాయి. ఇక అసలు ప్రశ్న ఏంటంటే.. ప్రజల తీర్పు నిజంగా స్థిరమైన విలువలపై ఆధారపడుతుందా? లేదంటే ప్రతి తరం తన అవసరాలు, భావోద్వేగాలు, ఆశల ప్రకారం కొత్త నాయకులను ఎంచుకుంటుందా? అని. -
కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?
కర్ణాటక రాజకీయాల్లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నాయకత్వ మార్పు ఖాయమైంది. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డీకే.. ఇప్పుడు అధికార పీఠం ఎక్కబోతుండటంతో ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం, ఆస్తుల వివరాలపై నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది.. డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్. 1962 మే 15న కర్ణాటకలోని కనకపుర ప్రాంతంలో జన్మించారు. వొక్కలిగ సమాజానికి చెందిన ఆయన కుటుంబం వ్యవసాయ నేపథ్యంతో ఎదిగింది. తండ్రి కెంపేగౌడ, తల్లి గౌరమ్మ. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న డీకే.. విద్యార్థి దశలోనే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సతనూరు నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన.. తర్వాత కనకపురకు మారి వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత ప్రభావవంతమైన వొక్కలిగ నేతగా గుర్తింపు పొందారు.కుటుంబం కూడా హైప్రొఫైల్!డీకే శివకుమార్ భార్య ఉషా శివకుమార్. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, ఆభరణ.. ఒక కుమారుడు ఆకాశ్. పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ప్రముఖ వ్యాపారవేత్త, కేఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో జరిగింది. ఈ వివాహం దేశవ్యాప్తంగా హైప్రొఫైల్ ఈవెంట్‌గా నిలిచింది.డీకే కుటుంబంలో రాజకీయ ప్రభావం కూడా గట్టిగానే ఉంది. ఆయన సోదరుడు డీకే సురేష్ కుమార్ కూడా కాంగ్రెస్ నేతగానే గుర్తింపు పొందారు. బెంగళూరు రూరల్ నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. దీంతో డీకే కుటుంబం కర్ణాటక కాంగ్రెస్‌లో శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ఎదిగింది.కాంగ్రెస్‌కు ‘ట్రబుల్ షూటర్’డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందారు. కర్ణాటకలో సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలను కాపాడటం, రిసార్ట్ రాజకీయాలు నిర్వహించడం, ప్రభుత్వాలను నిలబెట్టడం వంటి వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. గుజరాత్లో అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులో రక్షించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.దేశంలోనే ధనిక నేతల్లో ఒకరుడీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి. 2018 ఎన్నికల సమయంలోనే దాదాపు రూ.840 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు. తర్వాతి అఫిడవిట్లలో ఈ ఆస్తుల విలువ మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బెంగళూరులో భారీ స్థలాలు, వ్యాపార పెట్టుబడులు, లగ్జరీ వాహనాలు, ఆభరణాలు, ఖరీదైన గడియారాలు ఆయన పేరుతో ఉన్నట్లు అఫిడవిట్లలో నమోదైంది. ఇటీవల రూ.43 లక్షల విలువైన కార్టియర్ వాచ్‌పై కూడా రాజకీయ వివాదం చెలరేగింది. దానిపై స్పందించిన డీకే.. “నా దగ్గర రోలెక్స్ కూడా ఉంది” అంటూ సెటైరిక్‌గా బీజేపీకి కౌంటర్ ఇచ్చారు.ఈడీ, ఐటీ కేసులతోనూ వార్తల్లో..డీకే శివకుమార్ రాజకీయ జీవితంలో వివాదాలు కూడా తక్కువ లేవు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్, ఐటీ దాడుల కేసుల్లో ఆయన పేరు పలుమార్లు వార్తల్లో నిలిచింది. 2019లో ఈడీ కేసులో అరెస్టై జైలుకూ వెళ్లారు. అయితే ఆ తర్వాత మరింత బలంగా రాజకీయాల్లో తిరిగి నిలబడ్డారు.ఇప్పుడు సీఎం కుర్చీ..2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే డీకే సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ హైకమాండ్ అప్పట్లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి డీకే శివకుమార్ సహనంతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో.. ఆయన కల నిజం కాబోతోందన్న చర్చ కర్ణాటక రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
అమ్మో.. ఒకటో తారీఖు! ఇక ‘ధరల తుపాను’ మొదలా?
దాదాపు నాలుగేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడం కేవలం వాహనదారులకు షాక్ మాత్రమే కాదు.. రాబోయే భారీ ఆర్థిక తుపానుకు సంకేతమా? అనే చర్చ మొదలైంది. అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలు దెబ్బతినడంతో.. భారతదేశంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. కానీ ఈ పెంపు ప్రభావం కేవలం పెట్రోల్ బంకుల వరకే పరిమితం కాదని.. త్వరలోనే ప్రతి ఇంటి బడ్జెట్‌ను కుదిపేసే పరిస్థితి రావొచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.తాజాగా సోమవారం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే మే 15, 19, 23 తేదీల్లో కూడా వరుస పెంపులు చోటుచేసుకోవడంతో.. పదిరోజుల వ్యవధిలోనే పెట్రోల్‌పై మొత్తం రూ.7.34, డీజిల్‌పై రూ.7.45 వరకు భారమైంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.117 దాటగా.. హైదరాబాద్, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు సామాన్యుల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. “అమ్మో.. ఒకటో తారీఖు!”. ఎందుకంటే జీతాలు ఖాతాల్లో పడే సమయానికే గ్యాస్ సిలిండర్ ధరలపై మరో పెంపు ప్రకటన వచ్చే అవకాశముందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో.. గృహ వినియోగ LPG సిలిండర్ రేట్లు కూడా త్వరలో పెరగొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే.. మిగతా నిత్యావసరాల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనలకు అసలు కారణం మాత్రం ఇంధర ధరల పెంపే. భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. కూరగాయల నుంచి పాలు వరకు.. ఆన్లైన్ డెలివరీ నుంచి విమాన టికెట్ల వరకు.. అన్నీ డీజిల్, పెట్రోల్‌పైనే ఆధారపడి ఉంటాయి. దీంతో ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారి ఆ ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుపైనే పడుతుంది. ముందుగా ప్రజా రవాణా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీల ఛార్జీలు పెరగొచ్చని సంకేతాలు వస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు పెరిగితే మార్కెట్లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలు మరింత ఎగసిపడే అవకాశం ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. త్వరలోనే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫుడ్ డెలివరీ యాప్‌లు, ఈ-కామర్స్ కంపెనీలు కూడా డెలివరీ ఛార్జీలను పెంచే దిశగా అడుగులు వేయొచ్చని అంచనా. ప్రస్తుతం భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న కంపెనీలు.. పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చుల కారణంగా ఆ ఆఫర్లను తగ్గించే అవకాశం ఉంది. కనీస ఆర్డర్ విలువ పెరగడం, డెలివరీ ఫీజులు అధికమవడం వంటి మార్పులు కనిపించొచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. రైతులు ట్రాక్టర్లు, మోటార్లు, నీటి పంపులు వంటి వ్యవసాయ పరికరాల కోసం డీజిల్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. డీజిల్ ధరలు పెరిగితే సాగు ఖర్చులు పెరిగి.. చివరకు ఆ భారం కూడా ఆహార ధరల రూపంలో ప్రజలపైనే పడుతుంది.ఇప్పటివరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తూ వచ్చింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింత పెరుగుతుండటంతో ఇప్పుడు కేంద్రానికీ పరిమితులే కనిపిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు త్వరలో చల్లారే సూచనలు లేకపోవడం, హర్ముజ్ మార్గంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెంపులు తప్పవన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.ఇంధన ధరల పెంపు అంటే కేవలం బైక్‌కు పెట్రోల్ కొట్టించుకునే ఖర్చు పెరగడం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఉద్ధృతం కావడానికి అది ఆరంభ సంకేతమని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ‘సర్దుకుపోదాం’ అనుకున్న సామాన్యుడు.. ఇక ముందు ‘ఎంత తగ్గించుకుని బతకాలి?’ అనే పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన పెరుగుతోంది. -
అమెరికా దెబ్బలన్నీ చూసేశాం.. ఇక ఆట మాదే!
ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూసేవి.. ఇప్పుడు మాత్రం మెల్లగా తమవైపు తిరుగుతున్నాయని చైనా నమ్ముతోంది. అమెరికా వేసిన ఆర్థిక దెబ్బలు, సాంకేతిక ఆంక్షలు, ఒత్తిడులన్నింటినీ తట్టుకుని మరింత బలపడిపోయామని బీజింగ్ భావిస్తోంది. అంతేకాదు.. “ఇప్పటి నుంచి ఆటను నడిపేది మేమే” అనే సంకేతాలు కూడా పంపిస్తోంది. ట్రంప్ పర్యటన తర్వాత మారిన చైనా వైఖరి ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.రాజకీయ విశ్లేషకుడు ఆర్నాడ్ బెర్ట్రాండ్ వెల్లడించిన వివరాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. చైనా ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే ఒక పరిశోధనా సంస్థ తయారుచేసిన నివేదిక ఆధారంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా-చైనా సహజీవనం దిశగా ప్రపంచంలో జరుగుతున్న మహా మార్పు” అనే అంశంపై రూపొందిన ఈ నివేదికలో.. ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న భారీ మార్పులను చైనా ఎలా చూస్తోందో వివరించారు.ఈ నివేదిక ప్రకారం.. చైనా ఇప్పుడు అమెరికాను “అడ్డుకోలేని మహాశక్తి”గా చూడటం లేదట. గత కొన్నేళ్లుగా అమెరికా చేసిన ఆర్థిక ఒత్తిడులు, దిగుమతి సుంకాలు, సాంకేతిక ఆంక్షలు, ప్రపంచ దేశాలను చైనా నుంచి దూరం పెట్టే ప్రయత్నాలు.. ఇవన్నీ జరిగినా కూడా చైనా ఎదుగుదలేం ఆగలేదని బీజింగ్ బలంగా భావిస్తోంది. అందుకే “అమెరికా తన బలమైన దెబ్బ ఇప్పటికే కొట్టేసింది.. ఇక చైనాను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు” అనే నమ్మకం అక్కడ బలపడిందని చెబుతున్నారు.ఈ ఆలోచనకు చైనా మాజీ కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్ చెప్పిన “దీర్ఘకాల పోరాట సిద్ధాంతం”ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. మొదట బలహీనంగా ఉన్న దేశం శక్తివంతమైన దేశం ఒత్తిడిని తట్టుకుంటుంది. తర్వాత మెల్లగా ఆర్థికంగా, సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బలపడుతూ చివరకు ప్రత్యర్థిని మించిపోతుంది. ప్రస్తుతం చైనా అదే దశలో ఉందని ఆ నివేదిక చెబుతోంది.బలప్రయోగం కాదు, కానీ..ప్రపంచ తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధస్సు, పర్యావరణ హిత ఇంధన సాంకేతికత, బ్యాటరీ తయారీ వంటి రంగాల్లో చైనా వేగంగా ఆధిపత్యం పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది. అంటే కేవలం డబ్బు పరంగా మాత్రమే కాదు.. భవిష్యత్తు ప్రపంచాన్ని నడిపించే రంగాల్లో కూడా చైనా ముందుకు దూసుకెళ్తోందన్న మాట. ఇంకో కీలక అంశం ఏమిటంటే.. ప్రపంచ క్రమం కూడా మారుతోందని చైనా భావిస్తోంది. ఒకప్పుడు అమెరికా చుట్టూ తిరిగిన ప్రపంచం.. ఇప్పుడు అనేక శక్తి కేంద్రాలుగా విడిపోతుందని, అందులో తామే ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నామని బీజింగ్ అంచనా వేస్తోంది. అయితే ఈ మార్పు యుద్ధాల ద్వారా కాదని.. ఆర్థిక బలం, పరిశ్రమల శక్తి, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ వాణిజ్య సంబంధాల ద్వారా వస్తోందని నివేదిక చెబుతోంది. అంటే చైనా ప్రపంచాన్ని బలవంతంగా జయించాలని కాదు.. ప్రపంచ దేశాలు స్వయంగా చైనాపై ఆధారపడే పరిస్థితి వస్తోందని భావిస్తోందన్నమాట.ఇప్పటివరకు చైనా వ్యూహాత్మక పత్రాల్లో కనిపించిన “అమెరికా భయం” ఈసారి కనిపించలేదని బెర్ట్రాండ్ వ్యాఖ్యానించారు. గతంలో అమెరికాను పెద్ద ముప్పుగా చిత్రీకరించిన చైనా.. ఇప్పుడు మాత్రం దాన్ని మేనేజ్ చేయగలిగే అంశంగా మాత్రమే చూస్తోందట. అంటే అమెరికా ఇబ్బందులు కలిగించగలదు కానీ.. చైనా ఎదుగుదలను పూర్తిగా అడ్డుకోలేదనే నమ్మకం అక్కడ పెరిగిపోయిందన్నమాట.తగ్గేదే లే!అయితే చైనా నేరుగా యుద్ధ దారిలో వెళ్లాలని అనుకోవడం లేదని కూడా ఈ నివేదిక చెబుతోంది. అమెరికాతో పరస్పర గౌరవం, సహజీవనం అవసరమని సూచించింది. రెండు దేశాల మధ్య నేరుగా ఘర్షణలు జరగకుండా సంభాషణలు కొనసాగించాలని, కృత్రిమ మేధస్సు నియంత్రణ, వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని సూచించింది. అదేసమయంలో తైవాన్ విషయంలో మాత్రం చైనా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తైవాన్ చివరకు చైనాతో కలవాల్సిందేనని, అమెరికా అక్కడ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ‘తైవాన్ సుదూర’ వ్యాఖ్య చేసి ఉంటాడనే విశ్లేషణ నడుస్తోంది. మొత్తంగా ఈ నివేదిక ద్వారా.. ప్రపంచ భవిష్యత్తు నాయకత్వం తమదేనని చైనా ఇప్పుడు గట్టిగా నమ్ముతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ప్రభావం మెల్లగా తగ్గిపోతుందని.. తమ ప్రభావం పెరుగుతుందని బీజింగ్ భావిస్తోంది. అయితే అది యుద్ధాలతో కాదు.. ఆర్థిక బలం, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడడం పెరుగుతున్న నేపథ్యాలతో సాధ్యమవుతుందని చైనా అంచనా వేస్తోంది. -
బ్రిటీష్‌కాలం నాటి సంప్రదాయానికి వీడ్కోలు!
ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్‌లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్‌తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్‌ను ముగించాలంటూ విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది. Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026అలా మొదలైంది.. ఎయిర్‌కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్‌గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా. మార్పు మొదలైంది..అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్‌గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్‌కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 లిసిప్రియ ఎవరంటే.. లిసిప్రియా కాంగుజమ్.. భారత్‌కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్‌లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్‌నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్‌కు చేసిన రిక్వెస్ట్‌తో ఆమె వార్తల్లో నిలిచింది. -
NEET వివాదం: చైనా మోడల్‌తో ఏ లీకులు ఉండవ్!
భారతదేశపు పోటీ పరీక్షల్లో తరచూ పేపర్ లీకులు, అవకతవకలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. తాజాగా నీట్-యూజీ 2026 రద్దు ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది. అయితే.. విద్యార్థుల భవిష్యత్తు, వారి మనోధైర్యం దెబ్బతింటున్న ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలపై దృష్టిసారించడం అవసరమని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. చైనా మోడల్ తెర మీదకు తెచ్చారు. భారత్‌లో ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడాలంటే చైనా మాదిరి కఠిన చర్యలు అవసరమని ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ చెబుతున్నారు. ఈ మోడల్లో భాగంగా.. చైనా తన జాతీయ ప్రవేశ పరీక్ష గావ్కావో కోసం విస్తృతమైన చర్యలు తీసుకుందని.. అంతకంటే ముందు విద్యా సంస్కరణల్లో డబుల్ రిడక్షన్ విధానంతో సమూల మార్పులు చేసిందని గుర్తు చేస్తున్నారాయన. చైనా 2001లో తెచ్చిన ఈ విధానం (Double Reduction Policy) ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులపై ఉన్న అధిక హోంవర్క్ భారాన్ని తగ్గించడం. అలాగే ప్రైవేట్ ట్యూషన్ల ఒత్తిడిని తగ్గించడం, కుటుంబాల ఖర్చులను ఆదా చేయడం, పాఠశాల విద్యను అందరికీ సమానంగా అందించడం. ఇందులో భాగంగా ప్రైవేట్ ట్యూషన్లపై డ్రాగన్ కంట్రీ కఠిన నియంత్రణలు విధించింది. వారాంతాలు, సెలవుల్లో కోచింగ్ క్లాసులను నిషేధించింది. అదే సమయంలో.. అవకతవకలపై జరగకుండా కఠిన చర్యలు అవలంభించింది. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అధునాతన భద్రతా సాంకేతికతలు పాటించింది. ఈ మధ్యకాలంలో ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమలు చేసింది. ఆపై.. నకిలీ సీట్లు, అవకతవకల అడ్మిషన్లను అరికట్టేందుకు కఠిన పరిశీలన చేపట్టింది. సమాన అవకాశాల పేరిట గ్రామీణ, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోటాలు కల్పించింది.ఏంటీ గావ్కావో (Gaokao)? గావ్కావో అనేది చైనాలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(National College Entrance Examination). దానర్థం “ఉన్నత పరీక్ష”. ఇది చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం తప్పనిసరి. 1952లో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ మొదటిసారి నిర్వహించారు. ప్రతీ ఏడాది జూన్‌లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. 2025లో సుమారు 1.3 కోట్ల విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.ఈ ఎంట్రెన్స్‌లో ఒక్క మార్కు తేడా కూడా విద్యార్థి చేరే విశ్వవిద్యాలయాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక స్థానం అన్నీ ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే చైనా సమాజంలో గావ్కావోను “జీవితాన్ని తీర్చిదిద్దే పరీక్ష”గా భావిస్తుంటుంది. అందుకే కఠోర నియంత్రణలు, భద్రతా చర్యలు, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా చైనా ఈ పరీక్ష సమగ్రతను కాపాడుకుంటోంది. అయితే..అందుకే భారత్‌కు అవసరం!భారతదేశంలో చైనాలోలాగా ఒకే ఎంట్రెన్స్ ఉండదు. NEET, JEE ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలు ఉంటాయి. ఇవి లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ పేపర్ లీకులు, “గెస్ పేపర్లు” వంటి అవకతవకలు ప్రజల నమ్మకాన్ని.. విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాయి. అందుకే చైనా మోడల్‌ను భారత్ ఓ పాఠంగా నేర్వాలని ఆనంద్ కుమార్ లాంటి వాళ్లు చెబుతున్నారు. మోషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు నితిన్ విజయ్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. చైనా మోడల్ చెప్పేది ఏంటంటే.. కఠిన నియంత్రణలు, పారదర్శకత, సమాన అవకాశాలు. ఇవి ఉంటేనే పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలుస్తుంది. చైనా మాదిరిగా భారత్‌లోనూ కోచింగ్ పరిశ్రమపై కఠిన నియంత్రణలు అవసరమని.. ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణలో అధునాతన సాంకేతికతలు వినియోగించాలని.. అదనంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
తమిళనాడులో రాష్ట్రపతి పాలన? లేకుంటే..
దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఒక అగ్రనటుడు పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి బలం లేకున్నా ప్రభుత్వ ఏర్పాట్లకు ప్రయత్నించడం.. మ్యాజిక్ ఫిగర్ లేదంటూ గవర్నర్ అందుకు అనుమతించకపోవడం విమర్శలకూ తావిచ్చింది. ఈ తరుణంలో తమిళనాడులో మే 10 దాటితే ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో.. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ 118.. అంటే ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. విజయ్ రెండు చోట్ల పోటీ చేసి నెగ్గడంతో.. ఇంకో సీటు అదనంగా అవసరం కానుంది. అంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సరిపోతుందన్నమాట.ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత బలనిరూపణ చేసుకుంటామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు విజయ్ రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో.. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి. కానీ, తమిళనాడు విషయంలోనే గవర్నర్ ఆర్లేకర్ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయ్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో..విజయ్‌కు ఇతర పార్టీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో.. తమిళనాడు 16వ అసెంబ్లీ గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు ప్రభుత్వ ఏర్పాటు అంశం కచ్చితంగా ఓ కొలిక్కి రావాలని లేదు. కాకుంటే గవర్నర్ తన విశిష్ట అధికారాల్ని (Discretionary Powers) ఉపయోగించే అవకాశమూ లేకపోలేదు. ఒకటి.. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేదాకా కొనసాగమని కోరడం.. రెండోది టీవీకేను పక్కనపెట్టి ఇతర కూటములను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం.. మూడోది రాష్ట్రపతి పాలన విధించే అవకాశం!.తమిళనాడులో గతంలో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కరుణానిధి హయాంలో 1976 జనవరి నుంచి 516 రోజులపాటు, ఎంజీఆర్ సీఎంగా ఉన్న టైంలో 1980 ఫిబ్రవరి నుంచి 113 రోజులపాటు, 1988లో ఎంజీఆర్ మరణాంతరం ఆయన సతీమణి జానకీ సీఎంగా ఉన్నప్పుడు 363 రోజులపాటు, చివరగా.. 1991లో కరుణానిధి హయాంలో 145 రోజులపాటు రాష్ట్రపతి పాలన విధించారు.రాజకీయ విశ్లేషకులు చెబుతోంది ఏంటంటే.. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాలనే కచ్చితమైన రూల్ రాజ్యాంగంలో లేదు. కాకుంటే.. మెజారిటీ నిరూపించలేకపోయినా.. ప్రభుత్వం ఏర్పడకపోయినా "రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది" అని కారణాన్ని చూపిస్తూ కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపే అవకాశం ఉంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడవడం లేదని/ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం కొనసాగడం అసాధ్యమని కేంద్రం భావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఆ అవకాశం లేకపోలేదు.సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వడం ఒక సంప్రదాయం. అయినప్పటికీ, అది రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉండదు. గవర్నర్ తన నిర్ణయాన్ని మెజారిటీ నిరూపణ ఆధారంగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా తమిళనాడు ఎపిసోడ్ నేపథ్యంలో.. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అప్పుడు గవర్నర్లు రాష్ట్రపతి పాలనకు సిఫార్సులు చేసిన సందర్భాలు ఉన్నాయి.1996లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 174 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ టైంలో మేజిక్ ఫిగర్ 213. బీజేపీకి అది సాధ్యం కాలేదు. ఏ కూటమి కూడా మెజారిటీ సాధించలేకపోవడంతో అప్పటి గవర్నర్ రాష్ట్రపతి పాలన కొనసాగించారు(ఎస్పీ-బీఎస్పీ కూటమి కూలిపోవడంతో 1995లోనే గవర్నర్ మోతీలాల్ వోరా రాష్ట్రపతి పాలన విధించారు). ఆ తర్వాత ఏడాదికి బీజేపీ-బీఎస్పీ కూటమి ఏర్పడి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కేసు.. ఇక్కడ ఒక పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందడం ముఖ్యం కాదు అని చెప్పింది. ఇక.. 2005 బీహార్ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ఒకవైపు కూటమి ప్రయత్నాలు జరుగుతుండగానే అప్పటి గవర్నర్ బూటా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదటి సమావేశం జరగకముందే ఆ అసెంబ్లీని రద్దు చేసి.. ‘‘హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది’’ అని కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరడం.. గవర్నర్ వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టడం.. అది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని.. గవర్నర్ అధికారాలను పరిమితం చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగాయి. అయితే అప్పటికే ఎన్నికల తేదీలు ప్రకటించడంతో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం ఇక్కడికే పరిమితం చేసింది.విజయ్ పార్టీ (TVK) అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ మెజారిటీకి కావలసిన 118 సీట్లు దాటలేకపోవడంతో గవర్నర్ మద్దతు లేఖలు కోరుతున్నారు. ఆయన అడిగిన దాంట్లో తప్పుందని కూడా అనలేం. 2006లో డీఎంకేకు 96 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ, మిత్రపక్షాల మద్దతు లేఖలతో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకొచ్చింది. మెజారిటీ ఉండడంతో గవర్నర్ అందుకు అనుమతించారు. ఆ తర్వాత బలనిరూపణలో ప్రభుత్వం నెగ్గింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక అత్యవసర పరిస్థితిలో మాత్రమే అమలు చేసే చర్య. ప్రస్తుత తమిళనాడు విషయంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు దారి తీసే అవకాశం కూడా. గవర్నర్ నివేదికలు, ఆర్టికల్ 356 వినియోగం.. కోర్టు సమీక్షకు లోబడి ఉండాలని గతంలో న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అలాగే ఎన్నికల ద్వారా వచ్చిన అసెంబ్లీని రద్దు చేయడం అత్యంత అసాధారణం కూడా. ఒకవేళ.. తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ గనుక ఏదైనా అసాధారణ నిర్ణయం తీసుకుంటే టీవీకే పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. -
మారనున్న సీన్.. మోదీ సర్కార్‌కు పెద్ద పరీక్షే!
పలు దేశాల్లో పోరాటాలతో ప్రభుత్వాలను గద్దె దించిన ఘనత జెన్ జీదే. అలాంటి తరం భారత్‌లో కొత్త రాజకీయ సమీకరణకు కారణం కాబోతోందా?. రాజకీయాన్ని కేవలం కంటెంట్‌గా చూసే ఈ జనరేషన్.. రాబోయే ఎన్నికల్లో నిజంగానే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోందా?.. అవుననే అంటున్నాయి పలు విశ్లేషణలు.భారత రాజకీయాల్లో 12 ఏళ్ల కిందట నాయకత్వ మార్పు జరిగింది. అప్పట్లో మిల్లెనియల్స్ అనే తరం (1981–1996లో పుట్టినవాళ్లు) పెద్ద ఎత్తున ఓటర్లుగా ఉన్నారు. వారు యూపీఏ పాలనతో విసిగిపోయో.. మార్పు కోసం ఆసక్తిగా ఎదురుచూసో.. ఎన్డీయేకు రెండుసార్లు పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో ఓటర్లలో మూడో వంతుగా, 2019లో దాదాపు 40 శాతంగా ఉండి మోదీ సర్కార్‌ను గెలిపించారు. కానీ, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ సీన్ మారబోతోంది.2024 ఎన్నికల్లో జెన్‌జీ రూపంలో 9 కోట్ల మంది కొత్త ఓటర్లు సరికొత్త రాజకీయ సమీకరణకు సంకేతాలు ఇచ్చారు. ఫలితంగా.. ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చినా మెజారిటీపై ప్రభావం చూపెట్టింది. అయితే మరో మూడేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేది ఈ తరమే. అప్పటికల్లా భారత జనాభా 151 కోట్లకు చేరవచ్చని ఓ అంచనా. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. మిల్లెనియల్స్ + జెన్‌జీ కలిపి 91 కోట్లకు చేరుకుంటుందని.. ఇందులో జెన్‌జీ తరంవాళ్లే అత్యంత పెద్ద వర్గం ఓటర్లుగా(43 నుంచి 47 శాతం) ఉండబోతున్నారు.1997–2012 మధ్య పుట్టిన జెన్‌జీ తరం మోదీ పాలన చూస్తూ పెరిగారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాం గురించి వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు(తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్లు లేకపోలేదు). కాబట్టి ఈ జనరేషన్ బీజేపీ ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఓ వ్యవస్థగానే చూస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ జనాభా సుమారు 2.5 బిలియన్లు, అంటే ప్రపంచ జనాభాలో 30% అన్నమాట. ప్రపంచంలోనే అత్యధికంగా ఒక్క భారతదేశంలోనే 40 కోట్ల దాకా ఈ జనాభా ఉంది. ఇప్పటికే వారు దేశ కార్మిక శక్తిలో నాలుగో వంతుగా ఉన్నారు. 2030 నాటికి వీళ్ల ద్వారా ఎకనమీ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని ఓ అంచనా. సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాజకీయ అవగాహన పొందడం వీరికున్న మరో ప్రత్యేకత.అయితే.. భారత్‌లో దేశీయంగా ఐటీ వృద్ధి మందగించడం, విద్యావకాశాలు తగ్గిపోతుండడం, నిరుద్యోగం రేటు గణనీయంగా పెరగడం, విదేశీ అవకాశాలు కఠినతరం కావడం, ఆర్థిక భద్రత కొరవడడం ఆందోళనను రేకెత్తిస్తోంది. గిగ్, తయారీ రంగాల్లో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ వాదనతో జెన్‌జీ ససేమీరా అంటోంది. ఇది కేవలం విధానపరమైన చర్చ మాత్రమే కాదు.. ఈ జనరేషన్‌కి నిత్యజీవిత సమస్య కూడా.సోషల్ మీడియా ఒకప్పుడు అధికార మార్పుకు కీలకమైన సాధనం. అయితే ఇప్పుడు అదొక విభిన్న వేదికగా మారింది. ఒక కథనాన్ని ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా పలు కోణాల్లో చర్చించేందుకు అక్కడ అవకాశం ఉంటోంది. ఇందులో అత్యధికంగా పాల్గొంటోంది కూడా జెన్‌జీనే.కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కచ్చితంగా భిన్నంగా ఉండబోతున్నాయి. అంటే గత ఎన్నికల్లా బీజేపీ-కాంగ్రెస్‌ల పోలిక కంటే.. ‘‘మాకు మంచి చేసింది ఎవరు?’’ అనే ప్రశ్నే 2029లో వారి ఓటును డిసైడ్ చేయబోతోంది. వీళ్ల తీర్పు గతం ఆధారంగా కాకుండా, ప్రస్తుత ఫలితాలు (ఉద్యోగాలు, విద్య, అవకాశాలు) ఆధారంగా ఉండబోతోంది. ఈ లెక్కన 2029 ఎన్నికలు మోదీ సర్కార్‌కు ఒక పెద్ద పరీక్షగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.పైన చెప్పుకున్నది రాజకీయ అభిప్రాయం ఎంత మాత్రం కాదు. ఇది డేటా ఆధారిత విశ్లేషణ. పీఎల్ఎఫ్ఎస్ (Periodic Labour Force Survey)భారతదేశంలో ఉద్యోగాలు, నిరుద్యోగం, కార్మికశక్తి పాల్గొనడం వంటి అంశాలపై డేటా ఇస్తుంది. కేంద్ర బ్యాంక్ RBI ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై నివేదికలు విడుదల చేస్తుంది. నాస్కామ్(NASSCOM) .. ఐటీ రంగంలో ఉద్యోగాలు, వృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై నివేదికలు ఇస్తుంది. ఈ మూడింటి డేటా ఆధారంగా.. Gen Z Is Not Impressed With Modi | The 2029 Election Warning అనే యూట్యూబ్ వీడియోలో Gen Z ఓటర్ల ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అవకాశాల లోటు గురించి వివరించారు.అలాగే.. ది పయనీర్ పత్రిక రాసిన ఓ వ్యాసంలో(Why Urban Gen Z Voters Prefer Narendra Modi’s Performance-Driven Politics) పట్టణ జెన్‌జీ ఓటర్లు ఫలితాలు, పనితీరు ఆధారంగా రాజకీయాలను అంచనా వేస్తున్నారని విశ్లేషించారు. అలాగే అజంతా అనే ఓ జర్నలిస్టు కమ్ రచయిత్రి ‘Youth and Politics: How Gen Z Is Reshaping India’s Democracy’ అనే వ్యాసంలో జెన్‌జీ రాజకీయ అవగాహన, 2024 ఎన్నికల్లో వారి పాత్ర గురించి, ఆపై సోషల్ మీడియా ప్రభావం, 2029 ఎన్నికల్లో వాళ్ల ప్రభావం ఎలా ఉండబోతోంది అని విశ్లేషించారు. VIDEO Credits: What Does This Data Say -
ఇలాంటి ఓ అంతర్యుద్ధం జరుగుతోందని తెలుసా?
మనుషుల చరిత్రలో యుద్ధాలు, అంతర్యుద్ధాలు తరచుగా కనిపిస్తాయి. రాజ్యాల కోసం, మతాల కోసం, జాతుల కోసం జరిగిన ఈ పోరాటాలు సమాజాలను శాశ్వతంగా మార్చేశాయి. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఇలాంటి అంతర్యుద్ధాలు జరుగుతాయని.. వాటి ఫలితంగా 11 ఏళ్లుగా నిత్యం కారడవిలో రక్తపాతం జరుగుతోందని మీకు తెలుసా?.. ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్క్.. ప్రపంచంలోనే అతిపెద్ద చింపాంజీ సమూహంగా పేరుగాంచిన న్గోగో(Ngogo) కమ్యూనిటీకి కేరాఫ్. సాధారణంగా చింపాంజీలు 50 లోపే ఒక సమూహంగా ఉంటాయి. కానీ, న్గోగో జాతివి మాత్రం 200లకు పైనే కలిసి ఉండేవి. ఇది పరిశోధకులను ఎంతో ఆశ్చర్యపరిచేది. ఒకప్పుడు కలిసే ఉంటూ.. కలిసే వేటాడుతూ.. కాలం వెల్లదీస్తుంటాయివి. అలాంటిది ఓరోజు అనూహ్యమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఉన్నట్లుండి.. ఆ చింపాంజీ గ్రూప్ రెండుగా విడిపోయింది. ఒకదానితో మరొకటి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా అది ఘర్షణలకు దారి తీసింది. మనుషుల్లాగే.. అవి గ్యాంగ్ వార్లు చేస్తుండడం, పక్కా ప్లానులతో ప్రత్యర్థులు దాడులు చేయడం ఆశ్చర్యం కలిగించాయి. చివరకు వాటిలో అవి కొట్టుకుని చంపుకునే దాకా వెళ్లింది పరిస్థితి. అలా.. 2015 నుంచి ఇప్పటిదాకా ఏడు పెద్ద చింపాజీలు, మరో 17 పిల్ల చింపాంజీలు మరణించాయి. మరో 14 చింపాంజీలు జాడ లేకుండా పోయాయి. ప్రస్తుతం వెస్టర్న్ గ్రూప్, సెంట్రల్ గ్రూప్‌ల మధ్య అంతర్యుద్ధంతో నిత్యం కిబాలేలో రక్తం చిందుతోంది. ప్రఖ్యాత పరిశోధకుడు ఆరన్ సాండెల్ ఈ సంఘటనను “చింపాంజీల సివిల్ వార్”గా అభివర్ణించారు. 2014లో ఆ కమ్యూనిటీని అదుపు చేసిన కొన్ని చింపాజీలు వ్యాధులతో చనిపోవడం.. కొత్త ‘ఆల్ఫా మేల్’ రావడం వల్ల సంబంధాలు బలహీనపడ్డాయని చెబుతున్నారాయన. ఆయన మాటల్లో.. ఇది మనుషుల మధ్య మతం, జాతి కోసం జరుగుతున్న యుద్ధంలా కాదు. సంబంధాలు, ఆధిపత్యం, సామాజిక బంధాలు బలహీనపడటం వల్లే చింపాంజీల మధ్య విభజన జరిగింది అని అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనను 70వ దశకంలో జేన్ గూడాల్ గోంబే నేషనల్ పార్క్(టాంజానియాలోని అతి చిన్న నేషనల్ పార్క్)లో జరిగిన “ఫోర్ ఇయర్ వార్”తో పోలుస్తున్నారు. అప్పట్లో కూడా ఒకే సమూహంలో పెరిగిన చింపాంజీలు.. కహామా, కసకెలా కమ్యూనిటీలుగా విడిపోయి చంపుకున్నాయి. అయితేనీ వైరంతో తక్కువ కాలంలోనే ఆ జాతి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. న్గోగో చింపాంజీల యుద్ధం ఎలా ముగుస్తుందో పరిశోధకులకు అంతుచిక్కడం లేదు. ఇక్కడ మూడు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి.. సెంట్రల్ గ్రూప్ తమను తాము బలపరుచుకుని రక్షించుకోవడం. రెండోది.. వెస్టర్న్ గ్రూప్ పూర్తిగా ఆధిపత్యం సాధించి సెంట్రల్ గ్రూప్‌ను అంతమొందించడం. మూడోది.. రెండు గ్రూపులు మళ్లీ కలిసిపోవడం. అయితే చివరిది చాలా అరుదుగా జరిగే అవకాశం అని పరిశోధకులు చెబుతున్నారు. -
అమ్మో.. అమెరికా సైన్యం లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్‌గా ఎదిగిన అమెరికా.. పెద్దన్న పాత్రలో పలు దేశాల్లో తన సైన్యాన్ని మోహరిస్తోంది. పశ్చిమాసియా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో ఈ మోహరింపులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ సంక్షోభాలు, అంతర్యుద్ధాలు, యుద్ధాలు, వాణిజ్య మార్గాల రక్షణ, ఉగ్రవాదం.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యంతో మిత్రదేశాలతో ఈ తరహా డీల్ కుదుర్చుకోవాల్సి వస్తోంది. మరి ఏ దేశంలో ఆ ఫిగర్ ఎక్కువగా ఉందో తెలుసా?.. తెలిస్తే మీకు కచ్చితంగా షాకవుతారు.అమెరికా సైన్యం ఎక్కువగా మధ్యప్రాచ్యంలో లేదంటే యూరప్‌లో ఉంటుందని చాలామంది అనుకుంటారు. తాలిబన్ల దాడుల టైంలో(2001–2021) అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యధికంగా సైనికులను మోహరించింది. 2011 నాటికల్లా ఆ సంఖ్య లక్షకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2021లో చివరి దశలో కేవలం 2,500 సైనికులు మాత్రమే మిగిలి.. అటుపై ఆగస్టు 2021లో పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారం.. అమెరికా సైన్యం 1,71,500 మంది సైనికులను విదేశాల్లో మోహరించింది. అందులో ప్రపంచంలో అత్యధికంగా మోహరించింది మాత్రం జపాన్‌లోనే!!. ఎందుకిలా?.. జపాన్కంటూ సొంత సైన్యం లేదా?.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులేసిన దేశపు సైన్యాన్నే ఎందుకు ప్రొత్సహించాల్సి వచ్చింది?..అణుబాంబుల తర్వాత..రెండో ప్రపంచ యుద్ధంలో.. జపాన్ అంత త్వరగా ఓటమిని అంగీకరించలేదు. యుద్ధాన్ని త్వరగా ముగించడానికి, జపాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా తీవ్ర నిర్ణయం తీసుకుంది. హిరోషిమా, నాగసాకిలపై మూడు రోజుల వ్యవధిలో అణుబాంబులు ప్రయోగించింది. లక్షల సంఖ్యలో మరణాలు.. లెక్కలేనంత మందిపై రేడియేషన్ ప్రభావం. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లపాటు అమెరికా ఆధీనంలో ఉండిపోయింది జపాన్. ఆ తర్వాత తన వీక్నెస్ను పసిగట్టింది. తన రాజకీయ, రక్షణ వ్యవస్థను జపాన్ సమూలంగా మార్చుకుంది.1947లో అమెరికా పర్యవేక్షణలో జపాన్ కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఇందులో “యుద్ధం చేయకూడదు, సైన్యం పెట్టకూడదు” అనే క్లాజ్ ఏర్పాటు చేసుకుంది. సైన్యం కోసం కాకుండా.. ఆర్థిక అభివృద్ధి ఇందుకోసం సాంకేతికత, పరిశ్రమల రంగాలపై దృష్టిసారించాలని నిర్ణయించుకుంది. ఆపై 1951, 1960లో జపాన్ తన రక్షణ బాధ్యతను అమెరికాకు అప్పగిస్తూ US-Japan Security Treaty చేసుకుంది. అప్పుడు ఏర్పడ్డ అమెరికా సైన్యం స్థావరాలు.. ఏమాత్రం తగ్గకుండా మరింత వ్యూహాత్మకంగా పెరిగాయి.ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే.. 2026 నాటికి జపాన్‌లో సుమారు 61 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (35,989), దక్షిణ కొరియా (23,766) ఉన్నాయి. చైనా, ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉండడంతో అమెరికా సైన్య సహాయం తీసుకుంటోంది. ఆ రెండు దేశాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలుపుకోవడం కోసం జపాన్ రక్షణ బాధ్యతకు అమెరికా ముందుకొచ్చింది. పసిఫిక్ సముద్రంలో వాణిజ్య మార్గాలను రక్షించడానికి జపాన్‌లోని స్థావరాలు ఒకినావా, యోకోసుకా, మిసావా ముఖ్యమైనవిగా ఉన్నాయి.అక్కడే ఎక్కువ.. అమెరికా సైన్యం జపాన్‌లో అత్యధికంగా మోహరించబడింది. మొత్తం మీద జపాన్‌లో 120కి పైగా అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది Okinawa దీవి గురించి. చైనా, తైవాన్, ఉత్తర కొరియా దగ్గరగా ఉండటం వల్ల అమెరికా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇక్కడే అతిపెద్ద ఎయిర్ బేస్ (Kadena Air Base) ఉంది. సుమారు 23,000 పైగా అమెరికా సైనికులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది ఉన్నారు.అభ్యంతరాలు కూడా..అయితే.. అమెరికా సైన్యం మోహరింపుపై జపాన్‌లో అభ్యంతరాలూ ఉన్నాయి. స్థావరాల కోసం అధిక భూభాగాన్ని వినియోగించుకోవడం.. తరచూ ప్రమాదాలు.. స్థానికులపై అమెరికా సైనికులు దాడులకు తెగబడడం.. శబ్ధ కాలుష్యంపై ఒకినావా (Okinawa)లో ఇప్పటికీ నిరసనలు జరుగుతుంటాయి. 2025లో రెజల్యూట్ జపాన్ పేరుతో ఇరు దేశాలు ఎయిర్‌షో నిర్వహించాయి. అయితే ‘‘మా దీవులను యుద్ధభూమిగా మార్చొద్దు’’ అంటూ స్థానికులు రోడ్లను బ్లాక్ చేశారు. అమెరికా బేస్‌ల కారణంగానే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదని.. తద్వారా నిరుద్యోగం పెరిగిపోతోందనే విమర్శ ఒకటి ఉంది. అయితే జపాన్ తన రక్షణను స్వయంగా చూసుకోలేని స్థితి. మిత్రదేశం అమెరికాకు ఆ బాధ్యత అప్పగించింది. అందుకే మెజారిటీ ప్రజలు, రాజకీయ వర్గాలు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఒకటుంది. సైన్యం ఉంది, కానీ..జపాన్‌కి త్రివిధ దళాలతో కూడిన సొంత సైన్యం ఉంది. దాన్ని జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (JSDF) అంటారు. ఇది 1954లో స్థాపించబడింది. దీని వద్ద ఆధునిక ఆయుధాలు, నౌకలు, యుద్ధవిమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అందులో సుమారు 2.5 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. కానీ వీటి ప్రధాన లక్ష్యం రక్షణ మాత్రమే.. దాడి కాదు. జపాన్ రాజ్యాంగంలోని 9వ ఆర్టికల్ ప్రకారం.. జపాన్ “యుద్ధం చేయదు, దాడి సైన్యం పెట్టదు.”. మరి జేఎస్‌డీఎఫ్ ఏం చేస్తుంది? ప్రధానంగా.. రక్షణ, శాంతి పరిరక్షణ, విపత్తు సహాయం, అంతర్జాతీయ శాంతి మిషన్లలో మాత్రమే పాల్గొంటుంది. జపాన్ యుద్ధం కోరుకోదు.. కానీ తన రక్షణ కోసం ఆధునిక సైనిక శక్తిని కలిగి ఉంది. అందువల్ల JSDF “సైన్యం” కంటే “రక్షణ దళం” అనే పేరుతోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది. -
ఇద్దరూ ఇద్దరే
దేశ చరిత్రలో పాదయాత్రలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో లక్ష్య సాధన కోసం యాత్రలు చేసేవారు. ఆ తర్వాత అవి ప్రజల కోసం, సమస్యల పరిష్కారం కోసం రాజకీయ మలుపు తీసుకున్నాయి. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర, 2017లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చేసిన పాదయాత్ర.. ఈ రెండూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మహానేత, జననేత చేపట్టిన యాత్రలు ప్రజల జీవితాల్లో.. రాష్ట్ర అభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. వాటి ఫలితంగా వచ్చిన ఐదు ప్రధాన మార్పులను ఓసారి పరిశీలిద్దాం.విద్యా రంగంవైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. పేద పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం సుమారు రూ.4,000–5,000 కోట్లు ఖర్చు చేశారు. పేద పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అనేక మంది డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు అయ్యేలా మార్గం సుగమం చేశారు.వైఎస్ జగన్ హయాంలో.. నాడు–నేడు కార్యక్రమం ద్వారా సర్కారీ బడులను ఆధునికీకరించారు. అమ్మఒడి, జగనన్న వసతి తదితర పథకాల ద్వారా తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించి.. డ్రాపవుట్లను తగ్గించి పేద పిల్లల చదువును కొనసాగించేలా చేశారు. ఒక్క అమ్మ ఒడి పథకం కోసం సుమారు రూ. 35,000 కోట్లకు పైనే నిధులు ఖర్చు చేశారు. ఈ పాలనలోనే ఇంగ్లీష్ మీడియంతో పాటు అంతర్జాతీయ సిలబస్(IB)తో విద్యాభోదన ప్రయత్నాలు మొదలయ్యాయి. తద్వారా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి పేద విద్యార్థులను తీర్చిదిద్దాలని వైఎస్ జగన్ సంకల్పించారు.ఆరోగ్య రంగంవైఎస్సార్ హయాంలో.. ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు. రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పు ఇది. ఒక అంచనా ప్రకారం.. 2007–2009 మధ్య కాలంలోనే వైఎస్ ప్రభుత్వం రూ.3,500–4,000 కోట్లు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేసింది.వైఎస్ జగన్ హయాంలో.. ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ క్లినిక్స్, ఫ్యామీలీ డాక్టర్ కాన్సెప్ట్‌లు ఏర్పాటు చేశారు. ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందేలా చేశారు. ఇందుకుగానూ సుమారు రూ.10 వేల కోట్లకు పైనే ఖర్చు చేశారు.రైతన్న రాజ్యంలో.. వైఎస్సార్ హయాంలో.. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయాన్ని బలోపేతం చేశారు. రైతన్నకు రారాజును చేశారు. ఉచిత విద్యుత్ పథకంతో పా జలయజ్ఞం సాగునీటి ప్రాజెక్టులపై సుమారు రూ. 60,000 కోట్లు పైగా ఖర్చు చేశారు.వైఎస్ జగన్ హయాంలో.. రైతు సంక్షేమం కోసం అదనంగా.. రైతు భరోసా కేంద్రాలు(RBK సెంటర్లు) ఏర్పాటు చేసి, విత్తనాలు, ఎరువులు, మార్కెట్ సమాచారం అందించారు. ఇందుకుగానూ.. సుమారు రూ.4 వేల కోట్ల దాకా ఖర్చు చేశారు. మునుపెన్నడూ లేని రీతిలో పంట బీమా, తక్షణ నష్టపరిహారం అందజేశారు. ఇక.. రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.7,500 కోట్ల చొప్పున ఆర్థిక సహాయం రూపంలో రైతులకు అందజేశారు.ఇరిగేషన్వైఎస్సార్ హయాంలో.. అనేక సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు. పోలవరం లాంటి మెగా ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. జలయజ్ఞం ద్వారా 8.2 మిలియన్ ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం దిశగా కృషి చేశారు.వైఎస్ జగన్ హయాంలో.. నీటి వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా చేయడానికి చర్యలు తీసుకున్నారు. పోలవరం పనులను కొనసాగిస్తూ, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. పోలవరం పనులు కొనసాగిస్తూ, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.15,000 నుంచి 20,000 కోట్ల దాకా కేటాయించారు.పారిశ్రామిక రంగంవైఎస్సార్ హయాంలో.. పారిశ్రామిక వృద్ధికి పునాది వేసి, పెట్టుబడులను ఆకర్షించారు. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు వేల కోట్లు ఖర్చు చేశారు. దానికి తగ్గ ప్రతిఫలం నేటికి కళ్ల ముందు కనిపిస్తోంది.వైఎస్ జగన్ హయాంలో.. పారిశ్రామిక అభివృద్ధి కోసం వేల కోట్లు కేటాయించారు. భారీ ఎత్తున పెట్టుబడుల్ని, కంపెనీలను రాబట్టగలిగారు. YSR Jagananna Mega Industrial Hub వంటి ప్రాజెక్టులు ప్రారంభించి.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ ఇద్దరూ పాదయాత్రలు ప్రజలతో నేరుగా మమేకమై, వాళ్ల కష్టాలను దగ్గరగా చూశారు. ఆ పాదయాత్రల తర్వాతే ఇద్దరూ అధికారంలోకి వచ్చారు. తమ పాలనలో అన్నివర్గాల సమస్యలకు చక్కటి పరిష్కారం చూపగలిగారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, ఇరిగేషన్, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్ర రూపురేఖలను మార్చేశారు. జగన్ చెప్పినట్లు.. ఆయా రంగాల్లో వైఎస్సార్ వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరేమో. కానీ, తండ్రి బాటలో పయనించి తన సంక్షేమ పాలనతో ఆ మార్క్‌ను వైఎస్ జగన్ అందుకోగలిగారనే చెప్పొచ్చు. వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. -
హైడ్రాను ప్రభుత్వం పావుగా వాడుకుంటోందా?
అమృతా ప్రణయ్లాంటి సంచలనాత్మక కేసును డీల్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్.. ఆ తర్వాతి కాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న హైడ్రా అనే ఓ వ్యవస్థను కమిషనర్ హోదాలో ముందుకు నడిపిస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా సరే.. హైడ్రా ‘రైట్ రూట్’లోనే ముందుకు వెళ్తోందని అంటున్నారాయన. అలాంటి వ్యక్తి.. నిబంధనలకు విరుద్ధంగా చెరువులో ఇల్లు కట్టుకుని ఉంటున్నారా?.. సాక్షి డిజిటల్‌కు ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రభుత్వం మారితే హైడ్రా పరిస్థితి?రంగనాథ్: హైడ్రాకు ఐదేళ్లు ఏమాత్రం సరిపోదు. పది.. పదిహేనేళ్లు.. ఇలా నిరంతరాయంగా పని చేసినా సరిపోవు. ఉదాహరణకు.. మన చుట్టురా వేల చెరువులు ఉన్నాయి. వాటి పునరుద్దరణకు మొదటి అడుగు వేశాం. అదసలు అలా కొనసాగుతుంది. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువైంది. వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ అనేది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి(ఆర్టికల్ 51-A(g) ప్రకారం). పొరుగున ఉన్న కర్ణాటకలో చూసుకుంటే చెరువుల సంరక్షణ 2008 నుంచే కొనసాగుతుంది. అక్కడ ఇన్నేళ్లలో ప్రభుత్వాలు మారాయి కదా. కాబట్టి.. ఆ అవకాశాలను కొట్టిపారేయలేం.ప్రభుత్వాన్ని, బ్యూరోక్రట్లు వేరుగా చూసే పరిస్థితులు ఉన్నాయా? రంగనాథ్: నా భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వం సామాన్యులను కాలుస్తోంది అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. పావుగా వాడుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వం ఛాయిస్. అలాగే ఆ అధికారులపై విమర్శలు వచ్చినప్పుడు.. సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కూడా. ఈ సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదు. వాటికి హైడ్రా అనే వ్యవస్థ దూరం కూడా.ఒత్తిళ్లతో పెద్దవాళ్లను టచ్ చేయట్లేదన్న విమర్శలపై ఏమంటారు?రంగనాథ్: 2024 జులైలో హైడ్రా ఏర్పాటైంది. ఆగస్టు నుంచి అక్రమ కట్టడాలపై కొరడా జులిపించడం మొదలుపెట్టాం. పేదవాళ్ల ఇళ్లనే కాదు.. ప్రముఖుల నిర్మాణాలనూ వదిలిపెట్టలేదు. ఎన్ కన్వెషన్ కూల్చివేత అందుకు ఉదాహరణ. సినీ, రాజకీయ, వ్యాపార.. ఇతర రంగాల ప్రముఖుల కట్టడాలను కూల్చేశాం. కొన్నిసార్లు సామాజిక కోణంలో చూశాం. అందుకే ఎన్నో బస్తీలను వదిలేశాం. కొన్ని కేసుల్లో న్యాయం కూడా అందించాం. కొన్నింటికి ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) ఇంకా డిసైడ్ కాలేదు. ఒక్కసారిగా ఫిక్స్ అయితే వాటిని వదిలిపెట్టం. సోషల్ మీడియాలో ప్రచారాన్ని పట్టుకుని హైడ్రా పని తీరును శంకించాల్సిన అవసరం లేదు. వాటిని పట్టించుకోం కూడా. పనిలో 100 పర్సంట్ స్ట్రయిక్ రేట్ కోసం ప్రయత్నిస్తున్నాం. నమ్మకం ఉంది కాబట్టే హైడ్రా ప్రజావాణికి జనం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి కదా.ఒవైసీ కాలేజ్‌ను టచ్ చేయలేదన్న రాజకీయ విమర్శల నేపథ్యంలో తీసుకోబోయే యాక్షన్ ఎలా ఉందనుంది?రంగనాథ్: ఒవైసీ కాలేజీలాగే చాలా భవనాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క ఆ కాలేజ్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలి?. అక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఉండవచ్చు, పుల్లారెడ్డి లేదంటే వెంకట్ రెడ్డి కాలేజీ ఉండొచ్చు.. ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఒక నిర్దిష్టమైన పాలసీ లేకపోవడం వల్ల వాటికి ఎలాంటి పరిష్కారం కనిపించదు. నిజంగా మనం ఒక్క లింక్‌పై మాత్రమే దృష్టి సారిస్తున్నాం. ఒక్క కేసును మాత్రమే ఎత్తి చూపుతున్నాం. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ హైడ్రా సైలెంట్‌గా ప్రభుత్వ భూముల్ని, చెరువులను కబ్జా చేసిన వాటిని కూలగొట్టి ఎంతో మేలు చేస్తున్నాం.వేల, లక్షల కోట్ల ప్రజా ధనాన్ని కాపాడుతున్నాం. హైడ్రా అనేది దేశంలోనే వినూత్నమైన ప్రభుత్వం. జాతీయ మీడియా సంస్థలే కాదు.. ఐఎస్బీ కూడా హైడ్రాను ప్రస్తావించింది. ముంబైలోనూ హైడ్రా తరహా వ్యవస్థ కోరుకుంటున్నారు. అలాగే హైడ్రా పని తీరు కూడా మారింది. కూలగొట్టడమే కాదు.. చెరువుల పునర్మిరాణాలు చేపడుతోంది. కొందరు హైడ్రా పరిధి పెంచమని కోరుతున్నారు. దేవదాయ భూముల్ని ఎందుకు పరిరకక్షించకూడదని అనుకుంటున్నాం కూడా. కానీ, పాలసీ, ఎఫ్టీఎల్ ఫైనల్ నోటిఫికేషన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. కోర్టులు కూడా ఈ విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టులకు వాస్తవాలు వివరించే ప్రయత్నాలు మేం చేస్తున్నాం.హైడ్రా కార్యాచరణలో లోపాల గురించి..రంగనాథ్:చూసే వాళ్లను బట్టి ఉంటుంది. చెరువుల్లో వ్యర్థాలు చికెన్, మటన్, చేపల వేస్టేజ్‌లు పడేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెళ్లి సమస్య పరిష్కరించాం. నష్టంగా భావించేవాళ్లు.. వేళ్లమీద లెక్కపెట్టుకునేవాళ్లు. వాళ్లు హైడ్రా ఉద్దేశాలను తప్పుబడతారు. కానీ, వందల, వేల, లక్షల మందికి మంచి జరుగుతోంది. వాళ్లు మౌనంగా ఉంటారు. జరిగే మంచి గురించి వాళ్లు మాట్లాడుకోరు. మాట్లాడే ఆ ఒకరిద్దరి గురించే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా!. కాబట్టి ఉద్దేశం మంచిదే.. అలాగే కార్యాచరలోనూ సవ్యంగానే ఉంది.మీ ఇల్లు కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉందంట కదా?రంగనాథ్: నేను ఉండేది మధురానగర్‌లో. నా ఇంటికి కిలోమీటర్ దూరంలో కృష్ణకాంత్ పార్క్ ఉంది. అది ఒకప్పుడు చెరువు. ఆ చెరువు దిగువన ప్రాంతంలో నేను ఉంటా. అది ఎఫ్టీఎల్ పరిధికి ఎంతో దూరం. ఎవరో సెన్స్ లేకుండా కాంట్రవర్సిటీ కోసం క్రియేట్ చేసింది. హైడ్రా మీద వీలైనంత మంది అన్ని విధాల దాడులు చేశారు.. ఇంకా చేస్తున్నారు. అందులో భాగమే ఈ ప్రచారం కూడా.(నవ్వుతూ..)రంగనాథ్ కూల్చివేతలకు వెళ్లడం అవసరమా?రంగనాథ్: కచ్చితంగా అలా అనేం లేదు. ఆఫీస్ నుంచి కూడా పర్యవేక్షించొచ్చు. కానీ, ఒక్కోసారి హైడ్రా కమిషనర్‌గా అది నా బాధ్యత. ఎన్నో ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి.. విమర్శలు వస్తుంటాయి. ఆ బాధ్యతలను ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా.. జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆపరేషన్లప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. బ్యూరోక్రట్‌గా, సివిల్ సర్వెంట్‌గా, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌గా.. తక్కువ మందికి డ్యామేజ్ కలిగేలా ఎక్కువ మందికి లాభం కలిగేలా చూడాల్సిందే. అప్పుడే కదా.. తర్వాతి తరాలు హైడ్రా గురించి మాట్లాడుకునేది. -
పాక్ బలగాల పిరికిపంద చర్యలు
పాకిస్తాన్ గడ్డ మీద బెలూచిస్తాన్‌లో పరిణామాలు మళ్లీ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. బెలూచ్ రెబల్స్ పాక్ బలగాలపై అనూహ్య రీతిలో దాడులు జరపడం.. ఆ ఆత్మాహుతి దాడులు జరిపిన వాళ్లలో ఇద్దరు మహిళలు ఉండడం, ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించడం!.. ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ధురందర్ సినిమా చూసిన వాళ్లకు పాక్‌లో బలూచ్‌లు ఎదుర్కొనే వివక్ష గురించి ఓ ఐడియా ఉండొచ్చు. అయితే.. వాస్తవంలోనూ బలూచ్ ప్రజలు తమ అణచివేతకు వ్యతిరేకంగా నిలబడి.. స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో.. మహిళా ఫిదాయిన్ల త్యాగం చర్చనీయాంశంగా మారింది. పాక్ బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన ‘ఆపరేషన్ హెరోఫ్ – ఫేజ్ II’.. దానికి కౌంటర్‌గా పాక్ ఆర్మీ జరిపిన దాడులు 40 గంటలకుపైనే కొనసాగాయి. ఈ ఆపరేషన్‌లో పాక్ సైన్యాన్ని, ఫ్రంట్ వారియర్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు మహిళా ఫిదాయీన్లు పాల్గొన్నారని బీఎల్ఏ ప్రకటించింది. ‘‘ఖరాన్, మస్తుంగ్, టంప్, పస్ని ప్రాంతాల్లో మా ఆపరేషన్లు పూర్తయ్యాయి. క్వెట్టా, నోష్కీ ప్రాంతాల్లో కూడా మా యోధులు ఉన్నారు. అక్కడి పాక్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. దాడుల్లో మొత్తం 200 మంది పాక్ సైనికులు మరణించారు. బలూచ్ ప్రజల్లారా.. పాక్ సైన్యానికి దూరంగా ఉండండి. మా పోరాటానికి మద్దతు ప్రకటించండి’’ అంటూ బీఎల్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను తక్కువగా చేసి చెబుతోంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. మహిళలే ఆత్మాహుతి దాడులు జరిపారని చెబుతూ.. శుక్రవారం 41 మంది, శనివారం 92 మంది బీఎల్ఏ రెబల్స్ హతమయ్యారని ప్రకటించారు. నోష్కీ, హబ్, చమన్, నసీరాబాద్, గ్వాదర్, మక్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అన్నారు. బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ.. బీఎల్ఏ రెబల్స్ జరిపిన దాడుల్లో 17 భద్రతా సిబ్బంది, 31 పౌరులు మరణించారన్నారు. పాకిస్తాన్ సైన్యం 40 గంటలపాటు ప్రతిదాడి చేసి 140కి పైగా మిలిటెంట్లను హతమార్చినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటిస్తే.. బీఎల్ఏ మాత్రం 18 మంది మాత్రమే తమ యోధులు మరణించారని, ఇందులో 11 మంది ఆత్మాహుతి దాడుల్లోనే వీరమరణం పొందారని ప్రకటించుకుంది. Fidayeen" (ఫిదాయీన్) అనే పదం అరబిక్ మూలం నుంచి వచ్చింది. అర్థం తన ప్రాణాలను త్యాగం చేసే వ్యక్తి లేదంటే ఆత్మాహుతి యోధుడు/యోధురాలు అని..ఇదే మొదటిది కాదు.. !ఈ తరహా మహిళా మానవ బాంబు దాడులకు (fidayeen strike) దిగడం బలూచ్ రెబల్ గ్రూప్స్‌కు తొలిసారేం కాదు. బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ తరఫున జరీనా రఫీయా అలియాస్ ట్రాంగ్ మహూ అనే సూసైడ్ బాంబర్ ఆ మధ్య చగయ్ సమీపంలో చైనా మైనింగ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. తాజా దాడుల్లో.. 24 ఏళ్ల ఆసిఫా మంగళ్ తోపాటు మరో యోధురాలు పాల్గొన్నట్లు బీఎల్ఏ ప్రకటించుకుంది. నోష్కీలోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంపై వాహన బాంబుతో ఆసిఫా, మరో మహిళా యోధురాలు హవా బలోచ్ గ్వాదర్ ఫ్రంట్‌లో పోరాడి మరణించిందని తెలిపింది. వాళ్ల ఫొటోలు, దాడికి ముందు వాళ్ల ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని కూడా విడుదల చేసింది.#BLA the group behind ongoing coordinated attacks in #Balochistan has released a video showing one of its female fighters “Hawa Baloch” aka Droshum, reportedly filmed during a battle.Reports suggest more female fighters are involved but yet to be identified. pic.twitter.com/8bLY3iJSZ7— Hammad Baloch (@Hammad_Baluch) February 1, 2026మరోవైపు.. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మహిళా యోధురాలు పాక్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూనే.. సంచలన ఆరోపణలకు దిగింది. బలూచ్ యోధుల్ని ఏమీ చేయలేక.. తమ ఇంట ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోందని పేర్కొంది. ‘‘పాక్ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అది వాళ్ల కెపాసిటీకి మించిన పని. అందుకే మా ఇంట ఆడవాళ్లపై పడ్డారు. ఇది పిరికిపంద చర్య కాదంటారా?’’ అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలోచ్ ప్రజలు మేల్కొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. మాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదంటూ పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని బీఎల్ఏ పేర్కొంది. Hawa Baloch.Woman fighter of #Balochistan fighting the brutal, occupying Pakistan army.The young soldier died just hours later, defending her land, but not before sending dozens of Paki troops to the hoors.As brave as the rebel women of Iran.pic.twitter.com/sMDcExLd1E— Abhijit Majumder (@abhijitmajumder) February 1, 2026పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్ (సుమారు 44% భూభాగం). అయితే.. పంజాబీలు, పశ్తూన్లు వంటి జాతులు పాక్ రాజకీయ, సైనిక, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు శాతం జనాభా ఉన్న మైనారిటీ వర్గం బలూచ్.. సొంత గడ్డపై అన్నివిధాలుగా తీవ్ర అణచివేతకు గురవుతోంది. అదే సమయంలో గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ పోర్ట్ విషయంలోనూ పాక్ ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని.. స్థానికులైన తమకు తగిన లాభాలు అందడం లేదంటూ ఆ జాతి వాదిస్తోంది. వెరసి తమ హక్కుల కోసం తిరుగుబాట్లు, ఉద్యమాలు చేస్తున్నారు.బెలూచిస్తాన్‌లో తిరుగుబాట్ల చరిత్ర👇 మొదటి తిరుగుబాటు (1948): ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్లో విలీనాన్ని వ్యతిరేకించడంతో ప్రారంభమైంది. రెండో దశ తిరుగుబాటు (1958–59): భూస్వామ్యం, స్వతంత్రత డిమాండ్లతో మళ్లీ అల్లర్లు. మూడో దశ తిరుగుబాటు (1963–69): గిరిజన నాయకులు, పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు.. నాలుగో దశ తిరుగుబాటు (1973–77): పెద్ద ఎత్తున సైనిక చర్యలు, వేలాది మరణాలు.. ఐదో దశ తిరుగుబాటు (2003–ప్రస్తుతం): అత్యంత దీర్ఘకాలంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నాయి.బెలూచిస్తాన్‌లో తిరుగుబాట్లు (Baloch Insurgency) అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. బీఎల్ఏ, బీఎల్ఎఫ్ తరహా రెబల్స్ గ్రూపులు వేర్పాటువాద పోరాటాల్లో ప్రముఖంగా పాల్గొంటున్నాయి. అయితే పాక్‌తో పాటు మరికొన్ని దేశాలు వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి. బలూచ్‌ల జనాభా ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి 50 లక్షలు. ఇందులో ఇరాన్‌లోనే 40 లక్షల మంది ఉన్నట్లు 2023 గణాంకాలు చెబుతున్నాయి. అఫ్గనిస్తాన్‌లో మరో 10 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రధానమైన బలూచిస్తాన్ ప్రావిన్లో మాత్రం వీళ్ల జనాభా తక్కువగా ఉంటోంది. అందుకు అక్కడి ఉద్రిక్తతలు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఏదిఏమైనా.. బెలూచిస్తాన్ రీజియన్‌లో నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పొచ్చు. -
మరాఠా గడ్డపై ‘సునేత్ర’ చరిత్ర.. వీళ్ల గురించి తెలుసా?
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రి కానున్నారు. ఆమె శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో ఐదుగురు మహిళలు.. ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యలక్ష్మి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.కమలమ్మ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1952లో కమలమ్మ తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా పనిచేశారు. దీంతో, ఆమె దేశ చరిత్రలోనే మొదటి ఉప ముఖ్యమంత్రిగా చర్రితలో నిలిచిపోయారు.పాముల పుష్ఫ శ్రీవాణి.. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్ల పాటు డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగారు.తారాసింగ్.. పంజాబ్‌కు చెందిన తారా సింగ్ 1960లో తాత్కాలికంగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమె విధుల్లో కొనసాగారు.రాజేంద్ర కౌర్ భట్టాల్.. పంజాబ్‌కు చెందిన రాజేంద్ర కౌర్ భట్టాల్ 1996లో ఉప ముఖ్యమంత్రిగా విధుల్లో కొనసాగారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లకు పైగా ఆమె డిప్యూటీ సీఎంగా ఉన్నారు.నిత్యానందా దేవి.. బీహార్‌కు చెందిన నిత్యానందా దేవి 1990ల్లో తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆర్జేడీ ప్రభుత్వ హయాంలో ఆమె విధులు నిర్వహించారు.జమునా దేవి.. మధ్యప్రదేశ్‌కు చెందిన జమునా దేవి 1998లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఐదేళ్ల పాటు కొనసాగారు. దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం ఐదేళ్ల పీరియడ్ మొత్తం ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దీంతో, ఎక్కువ కాలం డీప్యూటీ సీఎంగా ఉన్న మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.కమలా బెనీవల్.. రాజస్థాన్‌కు చెందిన కమలా బెనీవల్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎంగా కొనసాగారు. 2003లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.దియా కుమారి.. రాజస్థాన్‌కు చెందిన దియా కుమారి బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా దాదాపు రెండేళ్ల పాటు ఉన్నారు. ప్రస్తుత భజన్ లాల్ శర్మ ప్రభుత్వంలో 2023 నుంచి బాధ్యతల్లో కొనసాగుతున్నారు.పార్వతీ పరిడా.. ఒడిశాకు చెందిన పార్వతి ప్రస్తుత సీఎం మోహన్ చరణ్ మాంఝీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. 2024 జూన్ నుంచి బాధ్యతల్లో ఉన్నారు.అయితే, దేశంలో ముఖ్యమంత్రి స్థానాల్లో మహిళలు ఎక్కువ కాలం సేవలు చేసినప్పటికీ.. ఉప ముఖ్యమంత్రలుగా మాత్రం చాలా తక్కువ మంది, తక్కువ కాలం మాత్రమే విధుల్లో ఉన్నారు. పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే మహిళలు ఈ పదవిని చేపట్టారు. ప్రస్తుతం (2026 జనవరి నాటికి) రెండు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఒడిశా) మాత్రమే మహిళలు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. భవిష్యత్తులో మహిళల రాజకీయ ప్రాధాన్యం పెరుగుతున్నందున మరిన్ని రాష్ట్రాల్లో మహిళలు డిప్యూటీ సీఎంలుగా ఉండే అవకాశం ఉంది. -
ఆపరేషన్ మదురో: అంత ఈజీగా ఎలా పట్టుకెళ్లారంటే..
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అంత ఈజీగా ఎలా బంధించిందబ్బా?.. వారం గడిచినా కూడా ఈ ప్రశ్న ప్రపంచాన్ని వేధిస్తూ ఉండొచ్చు. అయితే ఇందుకు అమెరికా సైన్యం ఉపయోగించిన ట్రిక్ ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది!. ముందుగా సైబర్ ఎటాక్ చేసి.. ఆ తర్వాత భౌతిక దాడులకు దిగిందట. అయితే అదేం ఆషామాషీగా జరగలేదు. అందుకోసం తెర వెనుక పెద్ద తతంగమే నడిచింది. అదెంటో చూసేద్దాం మరి.. వెనెజువెలాకు ఉన్న రష్యా తయారీ ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి విధ్వంసక వ్యస్థలను అమెరికా అసలు అంత తేలికగా ఎలా చేధించగలిగింది?. సైబర్ దాడితో అమెరికా నిర్వీర్యం చేసిందా? రాడార్లను స్పూఫింగ్ చేసి మరీ కారకాస్‌లోకి చొచ్చుకుపోయాయా?..ఈ ప్రశ్నలకు అమెరికా సైబర్ నిపుణులు అవుననే సమాధానమిస్తున్నారు. అమెరికా సైనిక చర్య మొదలు కావడానికి.. అరగంట ముందు సైబర్ ఎటాక్‌తో అసలు తతంగం నడిచినట్లు వివరిస్తున్నారు.నెలల తరబడి నిఘా!అమెరికా సేనలు నెలల తరబడి వెనెజువెలా అధ్యక్షుడు మదురో నివాసంపై నిఘా పెట్టాయి. ఏ సమయంలో అతను ఏ గదిలో ఉంటాడు? పడక గదికి చేరుకునే మార్గాలేమిటి? రాత్రిళ్లు ఎంతమంది అంగరక్షకులుంటారు? నిఘా ఏ విధంగా ఉంటుంది? పనివాళ్లు, వంటవాళ్ల వివరాలు.. ఇలా అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించించాయి. నిజానికి వెనెజువెలాపై అమెరికా ఈ నెల 3న దాడులు జరిపినా.. కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయిలో 90శాతానికి పైగా ఆపరేషన్ పూర్తి చేసిందట. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ వివరాలు కూడా అందాయని తెలుస్తోంది. అందులో దాడి మొదలు పెడితే.. ఎంత సమయంలో టాస్క్ పూర్తవుతుందో వివరించారట. అన్నీ ఓకే అనుకున్నాక ట్రంప్ పచ్చజెండా ఊపగానే.. అమెరికా సేనలు రంగంలోకి దిగాయి.అమెరికా సైబర్ కమాండ్ ద్వారా..సైబర్ ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ.. డొమైన్ సుప్రమసీగా కొనసాగుతోందని తెలిసిందే. వెనెజువెలాపై ఆపరేషన్‌లో భాగంగా.. కారకస్‌లోని మదురో నివాసంపై దాడికి అరగంట ముందే.. అమెరికా సైబర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం యాక్టివేట్ అయ్యింది. సైబర్ కమాండ్ సిబ్బంది తొలుత వెనెజువెలా రాజధాని కారకస్‌కు విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ (SCADA – Supervisory Control and Data Acquisition)పై సైబర్ ఎటాక్ చేశారు. దాంతో.. ఆ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆలస్యం చేయకుండా.. ఆ వెంటనే రక్షణ వ్యవస్థను టార్గెట్ చేశారు. రాడార్ స్పూఫింగ్ జరగడంతో.. అమెరికా సేనలు 150 యుద్ధ విమానాల్లో వెనెజువెలా సరిహద్దుల్లోకి ప్రవేశించినా ఒక్కటంటే ఒక్క రాడార్ కూడా పసిగట్టలేకపోయింది. దాంతో.. రష్యా సరఫరా అయిన ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యంగా మారిపోయాయి. ఈ ఆపరేషన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ‘‘మా ప్రత్యేక నైపుణ్యం కారణంగా.. కారకస్‌లో విద్యుత్తు నిలిచిపోయేలా చేశాం’’ అంటూ పోస్ట్ చేయడం తెలిసిందే. అంతేకాదు.. ఈ దాడి తర్వాత వెనెజువెలా కూడా తమ జాతీయ పవర్‌గ్రిడ్ (గురి డ్యామ్ నెట్వర్క్)ను అమెరికా టార్గెట్‌గా చేసుకుందని ప్రకటించింది. విద్యుత్తు నిలిచిపోవడం వల్ల వెనెజువెలా సైన్యం కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయలేదని తెలుస్తోంది.సైబర్ ఎటాక్ ఎలా చేశారంటే.. అమెరికా సైబర్ కమాండ్ ఈ దాడిలో విజయం సాధించడం ఒక్కరోజుతో జరిగిన పని కాదు. వెనెజువెలా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌పై నిఘా ఏళ్ల తరబడిగా కొనసాగుతోందని ఇప్పుడు వెల్లడైంది. తొలుత.. కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థల్లో మాల్వేర్ను చొప్పించారు. ఈ మాల్వేర్ ద్వారా అమెరికా సైబర్ కమాండ్ విద్యుత్తు వ్యవస్థ కంట్రోలర్లలోకి చొరబడి.. ‘పింగ్’ చేశారు. అంతే.. యావత్ విద్యుత్తు వ్యవస్థ ఢమాల్ అయిపోయింది. మొత్తం కారకస్ నగరానికి విద్యుత్తు నిలిచిపోయింది. అయితే.. ఈ ఆపరేషన్‌కు అమెరికా తన సొంత మాల్వేర్ ‘నైట్రోజ్యూస్’, రష్యా తయారీ అయిన ‘ఇండస్ట్రియర్’ ఈ రెండు మాల్వేర్లను ఒకదాన్ని వాడినట్లు తెలుస్తోంది.అత్యంత చాకచక్యంగా..నిజానికి అమెరికా సేనలు పెద్ద ప్రమాదాలను దాటుకుంటూనే వెనెజువెలా గగనతలంలోకి ప్రవేశించాయి. ఎస్-300 గగనతల వ్యవస్థలు విద్యుత్తు నిలిచిపోగానే ఆగిపోయినట్లు సమాచారం. నిజానికి ఈ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉంటుంది. ఒకవేళ విద్యుత్తు సరఫరా జరగకపోతే.. డీజిల్ జనరేటర్లతో బ్యాకప్ చేస్తారు. అయితే..ఇందుకు ఐదు నిమిషాల దాకా సమయం పడుతుంది. అంటే.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలు సరిహద్దులను దాటి.. కారకస్‌కు రావాల్సి ఉంటుంది. సైబర్ కమాండ్ అధికారులు తమ పనిని పూర్తిచేయగానే.. అమెరికా విమానాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. అత్యంత చాకచక్యంగా జరిగిన ఈ రాడార్ల విషయంలో జరిగిన ఆపరేషన్ విషయాల్ని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ కూడా ధృవీకరించడం గమనార్హం..!కలిసొచ్చిన సూటర్సాధారణంగా క్షిపణి వ్యవస్థలు సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి. ఇక్కడే అమెరికా సూటర్ అనే టెక్నాలజీని వాడింది. ఒక్కసారి రాడార్ వ్యవస్థలకు విద్యుత్తు నిలిచిపోగానే.. అమెరికా సైబర్ కమాండ్ సూటర్ టెక్నాలజీ ద్వారా రాడార్ స్పూఫింగ్‌కు పాల్పడింది. అంటే.. రాడార్ సిగ్నళ్లను జామ్ చేసింది. ఫలితంగా సూటర్ రాడార్ నెట్వర్క్ యాక్టివేట్ అయ్యింది. దాంతో.. డీజిల్ జనరేటర్ల ద్వారా ఎస్-300 రక్షణ వ్యవస్థలను తిరిగి యాక్టివేట్ చేసినా.. అవి స్పూఫింగ్ ప్రభావంతో స్తబ్ధుగా ఉండిపోయాయి.భారత్ ఎంత వరకు సురక్షితం?వెనెజువెలా ఉదంతం తర్వాత.. ప్రపంచదేశాలు సందిగ్ధంలో పడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో.. రష్యా అధినేత పుతిన్‌ను ఇలాగే కిడ్నాప్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విన్నపాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహును నిర్బంధించాలంటూ అమెరికా మిత్రదేశం పాకిస్థాన్ బహిరంగంగా కోరింది. అలాగే రష్యాతో చమురు వాణిజ్యం.. టారిఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ విషయంలోనూ ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఇలాంటి దాడులే ఒకవేళ భారత్‌పై జరిగితే ఎలా ఉంటుంది?.. ఐదేళ్ల క్రితం చైనా మాల్వేర్ కారణంగా మహారాష్ట్రలో గ్రిడ్ వైఫల్యం చెందిన విషయం తెలిసిందే..!. మనదేశంలో విద్యుత్తు వ్యవస్థలో చైనాకు చెందిన పరికరాలు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్‌ను వాడుతున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాడినటువంటి మాల్వేర్ను జిత్తుల మారి చైనా కూడా జొప్పించి ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2021లో మనదేశంలో పవర్ గ్రిడ్లలో మాల్వేర్పై మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. లోపాలను ఇప్పటికే సరిచేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆపరేషన్ సిందూర్ సమయంలోనే.. మన గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో ముందంజలో ఉన్నట్లు తేలింది. అంతెందుకు.. అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ కోచి తీరంలో తచ్చాడితే.. మన వైమానికదళం వెంటనే గుర్తించి హెచ్చరికలు పంపింది. అత్యంత అధునాతన స్టెల్త్ విమానంగా అమెరికా తన ఎఫ్-35కు పట్టం కట్టింది. అలాంటి విమానాన్ని కూడా భారత్ గుర్తించడంతో.. సాంకేతికలోపాల పేరుతో తిరువనంతపురంలో నెలరోజులపాటు ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే..! ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ అటు అఫెన్స్ లోనూ.. ఇటు డిఫెన్స్ లోనూ 99% కచ్చితత్వాన్ని కలిగి ఉందని, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌కు కూడా ఇంతటి రికార్డు లేదని తేలింది. సైబర్ అలర్ట్ లో మన సెర్ట్ ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో వెనెజువెలా తరహా దాడుల విషయంలో భారత్ అత్యంత సురక్షితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.:: హెచ్.కమలాపతిరావు -
ఆయన నమస్కార్‌తో ఎవరికీ నోట మాట రాలేదు!
భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడిగా, రాజకీయాల్లో అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న ఆయన.. సాహితి లోకానికి కవిగా, ఆరేళ్లపాటు ప్రధానిగా, బీజేపీకి ముఖ్యనేతగా సేవలందించారు. అయితే చివరిసారిగా ఆయన పబ్లిక్కు కనిపించింది ఎప్పుడో, అదీ ఏ సందర్భంలోనో తెలుసా?..గెలుపు-ఓటమి ఈ రెండింటినీ నవ్వుతూ స్వీకరించే నైజం వాజ్‌పేయిది. 2004లో దారుణ ఓటమి తర్వాత కూడా.. ఎలా ఓడిపోయారు? అంటే.. ‘ఓడిపోయాం.. అంతే’ అంటూ చిరునవ్వు విసిరారు ఆయన. అందుకే అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. అయితే ఆయన పాలనను, ఆదర్శాలను పొగిడేటోళ్లే తప్పించి.. వాటిని ఆచరించే నేతలు ఈరోజుల్లో లేరనే అంటారు రాజకీయ విశ్లేషకులు.2004 ఓటమి తర్వాత వాజ్‌పేయి.. పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా, బీజేపీ కీలక సమావేశాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే 2005 డిసెంబర్లో పుట్టినరోజు దగ్గరపడుతుండగా.. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి, అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద షాక్ ఇచ్చారు ఆయన. ఇక ఎన్నికల బరిలోకి దిగనప్పటికీ.. పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానని పార్టీ సారధ్య బాధత్యల నుంచి తప్పుకున్నాడాయన. ఆపై అనారోగ్యంతో ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు.ఫిబ్రవరి 11, 2007.. పంజాబ్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశం. బీజేపీ టికెట్‌తో అమృత్సర్ నుంచి లోక్ సభ స్థాన ఉప ఎన్నిక కోసం నవజోత్ సింగ్ సిద్దూ పోటీకి దిగాడు. ఆ ప్రచార సభకు ప్రధాన ఆకర్షణ ఎవరో కాదు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఓ బహిరంగ సభకు వస్తుండడంతో వేలమంది ఆ సభకు హాజరయ్యారు. టెంట్ల కింద జనం కిక్కిరిసి పోవడంతో.. బయట ఉండేందుకు వీలుగా సుమారు 10 వేల మందికి గొడుగుల్ని అందజేసింది బీజేపీ కమిటీ. కుర్చీలోనే కవితతో మొదలుపెట్టిన ఆయన ఉపన్యాసాన్ని .. ఎలాంటి కోలాహలం లేకుండా ఆసక్తిగా తిలకించారు ఆ జనం. ఆ రాజకీయ ఉద్దండుడి చివరి సభ అదేనని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.చలించిన పోయిన మీడియా ప్రతినిధులుఎంతటి విపత్కర పరిస్థితినైనా జర్నలిజం క్యాష్ చేసుకుంటుందనే ఒక అపవాదు ఉంది. అందుకు తగట్లు కొందరు జర్నలిస్టులు ప్రవర్తించడమే అందుకు కారణం. సాధారణంగా.. నేతలను ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం.. ఇరకాటంలో పడేయడం జాతీయ మీడియా చానెల్స్ జర్నలిస్టులకు వెన్నతో పెట్టిన విద్యం. కానీ, వాజ్‌పేయి విషయంలో మాత్రం వాళ్లు అలా చేయలేకపోయారు.2007, డిసెంబర్ 25న పుట్టినరోజు సందర్భంగా కొందరు జర్నలిస్టులు వాజ్‌పేయిను కలవాలనుకున్నారు. ‘2009లో మరోసారి రాజకీయ పోరాటానికి ఆయన సిద్ధమేనా? ప్రచారంలో అయినా పాల్గొంటారా? లేదంటే ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటారా? అద్వానీకి పగ్గాలు అప్పజెప్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఉద్దేశంతో ఓ జర్నలిస్ట్ బృందం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారు.వాళ్ల అజెండాపై స్పష్టత లేని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ దగ్గరుండి 10 మంది జర్నలిస్టులను విజయ్ మీనన్ మార్గ్‌లో ఉన్న వాజ్‌పేయి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ కొద్దినిమిషాల మీటింగ్ అరేంజ్ చేయించాడు హుస్సేన్. లోపలికి వెళ్లిన జర్నలిస్టులు.. వాజ్‌పేయి చూడగానే ఆశ్చర్యపోయారు.ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వాజ్‌పేయి.. కుర్చీలో కూర్చుకుని పాలిపోయిన ముఖంతో కదల్లేని స్థితిలో కనిపించేసరికి షాక్ తిన్నారంతా. చుట్టూ చేరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా ‘నమస్కార్’ అనే మాట మాత్రమే వచ్చింది ఆయన నోటి నుంచి. అంతే.. వాజ్‌పేయి పరిస్థితి అర్థం చేసుకుని అంతా బయటకు వచ్చేశారు.ఇంటికెళ్లి మరీ..2009లో ఛాతీ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి..కాస్త కొలుకున్నాక ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో 2009 ఎన్నికల క్యాంపెయిన్‌కు హాజరు కాలేదు. కానీ, ఆయన పేరు మీద లేఖలు మాత్రం విడుదల చేసింది బీజేపీ. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడంతో.. కీలక నేతలే అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా ఆయన్ని ఇంటికి వెళ్లి ప్రైవేట్‌గా కలుస్తూ వచ్చారు.వాజ్‌పేయికి కేంద్రం 2015లో భారతరత్న ప్రకటించింది. మార్చిన ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లి మరీ భారత రత్న అందుకున్నారు. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్‌లోనే అందుకోవాలి. కానీ, వాజ్‌పేయి ఆరోగ్య దృష్ట్యా, ప్రైవసీని కాపాడాలన్న ఉద్దేశంతో.. స్వయంగా రాష్ట్రపతే వెళ్లి అందించారు. చివరి రోజుల్లో.. ఆ రాజకీయ ఉద్దండుడు మతిమరుపు, కిడ్నీ సమస్యలు.. డయాబెటిస్, కదల్లేని స్థితిలో కనిపించిన ఫొటోలు చాలామందిని కదిలించివేశాయి. అందుకే.. 2018 ఆగస్టు 16వ తేదీన మరణించేంతవరకు ఆయన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు.ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి -
ఢిల్లీలో ఈ ఎమర్జెన్సీ.. ఇంకెన్నేళ్లో?
తీవ్ర వాయుకాలుష్యానికి తోడయ్యే దట్టమైన పొగమంచు.. ఎటు చూసినా మాస్కులు ధరించిన ప్రజలు.. కరోనా కానరాకుండా పోయినా శీతాకాలంలో మన దేశరాజధాని వీధుల్లో కనిపించే దృశ్యాలివే!. వాహనాల గొట్టాలు కక్కే పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే ప్రాణాంతక వాయువులు, నిర్మాణాలు వెదజల్లే ధూళి.. పంట అవశేషాల దహనాలు .. ఇవన్నీ కలగలిసిపోయి ఢిల్లీని ఓ గ్యాస్ చాంబర్‌గా మార్చేస్తున్నాయి.. ప్రతి సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ III, స్టేజ్ IV లాంటి ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటోంది. ఆ సమయంలో కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తారు. డీజిల్, పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెడతారు. స్కూల్స్ మూసేస్తారు. ఆఫీసులను హైబ్రిడ్.. మరింత దిగజారితే వర్క్‌ఫ్రమ్ హోంకు పరిమితం చేస్తారు. గాలి మందగించి, పొగమంచు కమ్ముకుని, ప్రజలు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ ఏడాది పరిస్థితి మరింతగా ముదిరింది. పిల్లలను కనీసం బయట కూడా తిరగొద్దని కోర్టులు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం వల్ల ఎమర్జెన్సీనే నార్మల్‌గా మారింది. పాలసీ ఫాటీగ్(మానసిక, భావోద్వేగ అలసట) పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కూడా ఈ చర్యలను సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. ఢిల్లీ కాలుష్యం కథ ఒక నిరంతర యుద్ధం. ప్రతి సంవత్సరం అదే దృశ్యం.. అదే చర్యలు.. అదే విఫలత. కానీ ఈసారి ప్రశ్న వేరుగా ఉంది. దేశరాజధానికి ఊపిరి ఇవ్వాలంటే.. సిస్టమ్ మొత్తాన్ని రీడిజైన్ చేయగలమా? లేదంటే ఎమర్జెన్సీని నార్మల్‌గా అంగీకరించేస్తూ పోతారా?.. ఢిల్లీలోనే ఎందుకంటే.. ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ ఎందుకు పడిపోతోంది?. ఎందుకంటే.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ. ఎన్సీఆర్లో ప్రధానంగా ఉండే కోల్ ఆధారిత పవర్ప్లాంట్లు.. ఫ్యాక్టరీలు ప్రమాదకరమైన వాయువుల్ని విడుదల చేస్తుంటాయి. చుట్టుపక్కల పంజాబ్, హర్యానాల రైతులు పంటలని కాల్చడంతో ఆ పొగ కాలుష్యానికి తోడవుతోంది. వీటన్నింటికి తోడు.. నిరంతరాయంగా కొనసాగే నిర్మాణ పనులతో ఆ ధూళి గాల్లో కలిసి కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. శాశ్వత పరిష్కారం ఉండవా?దేశరాజధానిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజల అవసరాలకు తగ్గట్లు పెంచాలి. మెట్రో లైన్లు విస్తరించినా.. బస్సుల సంఖ్య తక్కువ. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు. పంట అవశేషాల దహనం ఆపడానికి రైతులకు ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి, కానీ సపోర్ట్ సిస్టమ్ బలహీనంగా ఉంది. రైతులు తక్కువ ఖర్చుతో పంట అవశేషాలను కాల్చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ కాలుష్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. WHO ప్రమాణాల కంటే 10–15 రెట్లు ఎక్కువ టాక్సిక్ లెవెల్స్ ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో శ్వాస సమస్యలు, కంటి ఇర్రిటేషన్, గుండె సంబంధిత సమస్యలతో రోగులు పెరుగుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా విఫలమవుతున్నదనే సూచన.ప్రైవేట్ రంగం, స్టార్టప్‌లు కాలుష్య నివారణ కోసమంటూ ముందుకు వస్తున్నాయి. కార్‌పూలింగ్ యాప్‌లు, ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, క్రాప్ రెసిడ్యూ ప్రాసెసింగ్ వంటి పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఇవి చిన్న స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ లాంటి మహానగరానికి ఇవి సరిపోవు. పెద్ద స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వ మద్దతు, ప్రజల సహకారం కచ్చితంగా అవసరం.అంటే ఢిల్లీ పొల్యూషన్ కేవలం వాతావరణ సమస్య కాదు.. ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్‌కి ప్రతీక. ఇది ప్రభుత్వ పాలసీల లోపం, అమలు బలహీనత, ప్రజల ప్రవర్తన, ఆర్థిక ఒత్తిళ్లు అన్నీ కలిసిన విఫలత. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, రైతులకు ప్రత్యామ్నాయాలు, ఇండస్ట్రీలపై కఠిన నియంత్రణ, ప్రజల అవగాహన.. మొత్తం వ్యవస్థనే మార్చగలిగినప్పుడు మాత్రమే ఢిల్లీ మళ్లీ మంచి ఊపిరి తీసుకోగలుగుతుంది. -
కాస్ట్లీ అభిమానం.. కాసులు కుమ్మరిస్తేనే ఆ మహాభాగ్యం!
ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీతో ఒక్క ఫొటోకి 10 లక్షలంట!.. “అంత ఖర్చా?” అని ఆశ్చర్యపోయినవాళ్లు ఎందరో.కానీ ఆ ఒక్క ఫొటో కోసం టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోయాయని తెలుసా?అటు స్టేడియం, థియేటర్ గేట్ల వద్ద పొడవైన క్యూలు సరిపోదన్నట్లు ఇటు ఆన్లైన్లో వీఐపీ ప్యాకేజీల హడావిడి.గుండెల నిండా ఉండాల్సిన అభిమానం.. ఇప్పుడు కాసులు కుమ్మరించి కొనుగోలు చేసే ట్రెండ్‌గా మార్కెట్లో దూసుకుపోతోంది..తమ అభిమాన తారలను, ఆటగాళ్లను.. గ్రౌండ్లలో, స్క్రీన్లపైనే చూడడంతో సరిపోదన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. ప్రత్యక్షంగా కలిసి వీలైతే ఓ ఫొటో.. కుదిరితే కలిసి భోజనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వేల నుంచి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఫుట్‌బాల్ రారాజుగా పేరున్న మెస్సీతో ఫొటో కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు ఇందులో భాగమే!. అది ఎలాగంటే..🐐గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ కోసం రూ.9.95 లక్షలు + జీఎస్టీ కలిపి రూ.10 లక్షల దాకా అవుతోంది. ఈ ప్యాకేజీలో మెస్సీతో షేక్ హ్యాండ్, ప్రొఫెషనల్ గ్రూప్ ఫొటో(ఆరగురు దాకా ఉండొచ్చు.. నో సెల్ఫీ.. నో సోలో ఫొటో!), ప్రైవేట్ లౌంజ్ యాక్సెస్ (ఒక గంట పాటు, ప్రత్యేక ఫుడ్ & బేవరేజెస్‌తో) అన్నీ కలిపే ఉంటాయి. ఆయన ఎలాగూ వీవీఐపీ కాబట్టి ఆయనకు ఉండే భద్రత నడుమే ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే అవి మనకూ వర్తిస్తాయన్నమాట. సాధారణంగా.. బ్రాండ్ అంబాసిడర్‌గా మెస్సీ కొన్ని సెకన్లు కనిపిస్తే చాలని కోట్లు కమ్మరిస్తుంటాయి కంపెనీలు. సో.. జస్ట్ ఫొటోకే అంత ఖర్చా?.. అని అనుకోవడానికి ఏమాత్రం లేదు. 😲మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు ఖర్చవుతున్నట్లే.. మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో విషయంలోనూ భారీగానే ఈ ఛార్జ్ ఉంటోంది. ఫుట్‌బాల్ స్పెషల్ ఈవెంట్స్‌లో పాస్‌తో కలిపి ఫొటో కోసం రూ. 5-7 లక్షల దాకా వసూలు చేస్తుంటారు. పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన పాస్‌తో పాటు ఫొటో కోసం రూ.40 వేల నుంచి 80 వేల మధ్య, అలాగే.. మరో పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్‌తో ఫొటో, సంతకం కోసం లక్ష దాకా ఛార్జ్ చేస్తున్నారు. కొరియాకు చెందిన బీటీఎస్ బ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ రూ.2 లక్షలకు తక్కువ కాకుండా ఉన్నాయి మరి.👉ఎంతసేపు హాలీవుడ్ రేంజేనా?.. మన దగ్గర అలాంటి తారలు లేరని అనుకుంటున్నారా?. అక్కడికే వస్తున్నాం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే.. కొందరు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి చార్జీలు రూ.లక్షకు తక్కువ కాకుండానే ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. 😇ఈ డబ్బులు సెలబ్రిటీలు వసూలు చేసేవి కావు. కార్పొరేట్ ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, చారిటీ ఈవెంట్లలో భాగంగా ఏర్పాటు చేసే మీట్ ద గ్రీట్‌లో భాగంగా వసూలు చేస్తారు. ఇందులో వీఐపీ ఆతిథ్యం, స్పెషల్ పాస్, బ్యాక్ స్టేజ్ ఫొటోలు.. వగైరాతో బోనస్‌గా ఫొటో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవేవీ వాళ్లు వాళ్ల జేబుల్లో వేసుకునేందుకు నిర్ణయించే చార్జీలు కావన్నమాట. (నోట్: పైన పేర్కొన్న ఛార్జీలు ఫిక్స్ చేసినవి కావు.. ఈవెంట్లను.. డిమాండ్‌ను బట్టి మారే అవకాశమూ లేకపోలేదు). ☠️ఇది ప్రత్యేక వీఐపీ అనుభవం మాత్రమే. ఛార్జీలు ఉంటాయి కాబట్టి సాధారణ ప్రేక్షకులకు ఈ అవకాశం దక్కేది చాలా తక్కువ. పైగా వీటిని నిర్వాహకులు పక్కా వెబ్సైట్ల నుంచే నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఇక్కడ స్కామ్‌లకు అవకాశం లేకపోలేదు. అందుకే అధికారిక టికెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో కోనే ప్రయత్నంలో మోసపోకూడదని చెబుతుంటారు. 🥱ఇంత చెప్పాక కూడా.. లక్షల తగలేసి ఇదేం వెర్రితలలు వేసిన అభిమానం రా అయ్యా?.. అంతెందుకు బుజ్జీ అనుకుంటున్నారా?.. ఎవరి ఇష్టం వారిది కదా!. సినీ తారలు క్యాజువల్‌గా బయట తిరిగినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి దిగొచ్చు. ఒకవేళ వాళ్లు నో చెప్పడమో.. ఫోన్లు లాక్కోవడమో.. కుదరితే నాలుగు పీకడమో చేశారాంటరా?.. అప్పుడు ఏ మహేష్‌బాబునో, వెంకీ మామనో, ఐకాన్ స్టార్ బన్నీనో, రౌడీ విజయ్దేవరకొండనో లేదంటో పరభాషల్లో రజినీకాంత్, విజయ్, విజయ్ సేతుపతినో, మమ్మూటీ, మోహన్‌లాల్ మాదిరి అభిమానుల కోసం స్పెషల్ సెషన్లు నిర్వహించి ఫ్రీగా ఫొటోలకు ఫోజులు ఇచ్చే తారలు బోలెడు మంది ఉండనే ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు.. ఏఐ ఉండనే ఉందిగా! అంటారా?.. మ్.. అది మీ ఇష్టం ఇక.. చెలరేగిపోండి. -
ఫస్ట్ క్లాస్ నేషనల్ హైవేలు.. మృత్యు మృగాలు!
ప్రతి నిమిషానికి 2.. గంటకు 136.. రోజులో 3,260 మంది.. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల రూపంలో పోతున్న ప్రాణాల సంఖ్య ఇది. సేఫ్టీ ప్రచారాలు.. చర్యలు ఈ లెక్కను మరుసటి ఏడాదికి పెరగకుండా ఆపలేకపోతున్నాయి. ఇందునా భారతదేశం యాక్సిడెంట్లకు హాట్‌స్పాట్‌గా కొనసాగుతూ వస్తోంది. లక్షలాది ప్రమాదాలు, అపార ప్రాణనష్టం దేశానికి ఒక పెద్ద సవాలుగా మారాయి. అందునా.. శీతాకాలంలో ఈ రేటు మరింతగా ఉంటోంది. ఆ లోతుల్లోకి వెళ్తే.. భారతదేశం రోడ్డు భద్రతలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. 2025 జనవరి-జూన్ మధ్య యాక్సిడెంట్లో రూపంలో 29,000 మంది(కేవలం జాతీయ రహదారులపైన) బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 1.5–1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు (అన్నిరకాల యాక్సిడెంట్ల రూపంలో). ఇది ప్రపంచ మొత్తం మరణాల్లో 11%గా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (2025) నివేదిక ప్రకారం.. రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ అత్యంత ప్రమాదకర దేశంగా ర్యాంక్ అయ్యింది. డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, అధిక వేగం ప్రమాదాలకు కారణంగా ఈ నివేదిక చూపించింది. డాటా ఫర్ ఇండియా అనే సంస్థ సర్వే ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదు చేసే దేశం.కారణాలు ఇవిగో..👇👉చాలా రహదారులు సరైన డిజైన్ ప్రమాణాలు లేకుండా నిర్మించబడ్డాయి. వాటిపై సంకేతాలు (sign boards), స్పీడ్ బ్రేకర్లు, డివైడర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైటింగ్ లేకపోవడం రాత్రి సమయంలో ప్రమాదాలకు దారితీస్తోంది. 👉ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం.. అధిక వేగం, తప్పు దిశలో డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ దాటడం వంటి ఉల్లంఘనలు కారణాలుగా ఉంటున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగతున్నాయి. వీటికి తోడు.. 👉టూవీలర్ హెల్మెట్, ఫోర్ వీలర్లో సీటు బెల్ట్ వాడకాలు కూడా మరణాల రేటుపై ప్రభావం చూపెడుతోంది. హిట్ అండ్ రన్, ఓవర్ స్పీడ్లు కూడా మరణాలకు కారణం అవుతున్నాయి.డబ్యూహెచ్‌వో అంచనా ప్రకారం, హెల్మెట్ వాడితే తల గాయాలు 40% తగ్గుతాయి, సీటు బెల్ట్ వాడితే మరణాలు 50% తగ్గుతాయి.👉ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ (Golden Hour) లో చికిత్స అందకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంబులెన్స్ సేవలు, ట్రామా కేర్ సెంటర్లు సరైన స్థాయిలో ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు దూరంగా ఉండటం వల్ల సమయానికి చికిత్స అందక ప్రాణాలు పోతున్నాయి.శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరగుతున్నాయి. గణాంకాల ప్రకారం.. చలికాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 30వేలకు తక్కువగా ఉండడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పొగమంచు (Fog): దృశ్యమానం(విజిబిలిటీ) తగ్గిపోవడం వల్ల వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం సాధారణంగా మారింది.తడి రహదారులు: మంచు, తేమ కారణంగా రహదారులు జారిపోవడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం.అధిక వేగం: డ్రైవర్లు వేగం తగ్గించకపోవడం, ఫాగ్ లైట్లు వాడకపోవడం.అత్యవసర సేవల ఆలస్యం: ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సహాయం అందకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయి.యాక్సిడెంట్.. డెత్స్.. లెక్కలు:2022లో: 4.5 లక్షల ప్రమాదాలు, 1.5 లక్షల అధికారిక మరణాలు2023లో: 4.8 లక్షల ప్రమాదాలు, 1.72 లక్షల మరణాలు2024లో.. 4.73 లక్షల యాక్సిడెంట్లు(కాస్త తగ్గినా) మరణాలు 1.77 లక్షలకు పెరిగాయి2025 (జనవరి–జూన్): జాతీయ రహదారులపై 29,018 మరణాలు (పూర్తి గణాంకాలు రావాల్సి ఉంది) భారతదేశంలో హైవేలు మొత్తం రహదారి నెట్‌వర్క్‌లో ఉండేది కేవలం 2% మాత్రమే. వీటికి ఫస్ట్ క్లాస్ హైవేల గుర్తింపు ఉంది. కానీ, దేశంలో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 50% కంటే ఎక్కువ వాటా వీటికే ఉంది. 2025లో ఇప్పటిదాకా సగటున రోజుకి హైవేల మీద 150 మరణాలు సంభవించాయి. అంటే.. ప్రతీ గంటకూ ఆరు మరణాలు అన్నమాట. ఈ లెక్కన హైవేలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వెనుక నుంచి ఢీకొనడం (Rear-end collisions) రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా జరుగుతున్న విభాగం. ఇవి మొత్తం ప్రమాదాల్లో 21%కి కారణమవుతాయి. అలాగే మొత్తం మరణాల్లో 20% వీటి నుంచే ఉంటున్నాయి.హిట్-అండ్-రన్ కేసులు రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు పెద్ద కారణం. ఇవి మొత్తం మరణాల్లో 18% వాటా కలిగి ఉన్నాయి. లోయల్లో వాహనాల పడి జరిగే ప్రమాదాలు.. ఐదు శాతం కంటే తక్కువే ఉంటోంది. కానీ, వీటి ద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. మధ్యాహ్నా టైంలోనే అధిక యాక్సిడెంట్లు!గణాంకాలను (MoRTH నివేదికలు) పరిశీలిస్తే.. ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య ప్రమాదాలు 25–30% వరకు నమోదవుతాయి. - మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో సుమారు 40% దాకా ఉంటోంది(అధిక రద్దీ కారణంగా..). ఇక.. సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి మధ్య ప్రమాదాల సంఖ్య 20–25% దాకా ఉంటోంది. అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల సమయంలోనే ప్రమాదాల సంఖ్య కనిష్టంగానే ఉంటోంది. కానీ, అర్ధరాత్రి దాటాక జరిగే యాక్సిడెంట్లలోనే మరణాల రేటు అధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంభవించే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్(2024లో 24వేల మరణాలు.. ఈ ఏడాది కూడా అంతకు మించే..), తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ,రాజస్థాన్‌లో అత్యధిక మరణాల నమోదు అవుతున్నాయి. ఈ లెక్కన సగం రోడ్డు ప్రమాదాలు ఈ రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. -
భారత్‌లో నచ్చిన పార్టీకి ఓటేసే ఛాన్స్ వస్తే..
నచ్చిన అభ్యర్థికే ఓటేయడం అన్నది ఓటర్ల ఇష్టం. కానీ, నచ్చిన పార్టీకి కూడా ఓటేసే అవకాశం వస్తే.. దాని ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితుల ఏర్పడితే??. ఇందుకోసం ఒక ఓటరు.. రెండు ఓట్ల విధానం మన దేశంలోనూ అమలయ్యేలా చూడాలని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు. లోక్‌సభ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విప్లవాత్మక సంస్కరణను ప్రతిపాదన చేశారాయన. ఇంతకీ ఇలాంటి విధానం ఒకటి ఉందని.. అది ఏ దేశంలో అమల్లో ఉందని.. అది ఎలా పని చేస్తుందనే విషయం మీకు తెలుసా?..ఎమ్ఎమ్పీ (మిక్స్డ్ మెంబర్ ప్రపొర్షనల్) మోడల్.. జర్మనీ దేశం ఈ పద్దతిని ఫాలో అవుతోంది. దీని ప్రకారం.. అర్హత గల పౌరులకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటుతో అభ్యర్థులను నేరుగా ఎన్నుకుంటారు. గెలిచిన వారు నేరుగా పార్లమెంట్‌కి వెళ్తారు. మరో ఓటు మాత్రం పార్టీలకు వేయాల్సి ఉంటుంది!.దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో దాని ఆధారంగా మొత్తం పార్లమెంట్లో ఆ పార్టీకి ఉండాల్సిన సీట్లు(అదనపు) నిర్ణయిస్తారు. ఆ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి కూడా.!ఉదాహరణకు.. A, B, C అనే మూడు పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు.. తమ నియోజకవర్గంలో ఎవరు గెలవాలో నిర్ణయించడానికి ఓటేస్తారు.. రెండో ఓటు దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం సీట్ల రావాలో నిర్ణయించడానికన్నమాట. ఇందులో A అనే పార్టీ స్థానికంగా 180 సీట్ల నెగ్గింది. B అనే పార్టీ 90 సీట్లు గెలిచింది. C అనే పార్టీ 29 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే.. దేశవ్యాప్తంగా ఓట్ల శాతం అంటే పార్టీ ఏకి వచ్చిన ఓట్లు 40% ఓట్లు( రేషియో ప్రకారం.. 280 సీట్లు రావాల్సి ఉంటుంది), పార్టీ బీకి 35% ఓట్లు(రేషియో ప్రకారం.. 245 సీట్లు రావాల్సి ఉంటుంది). పార్టీ సీకి 25% ఓట్లు(175 సీట్లు రావాల్సి ఉంటుంది) పోలయ్యాయి. ఈ లెక్క ప్రకారం.. పార్టీ ఏకి అదనంగా 100 సీట్లు, పార్టీ బీకి అదనంగా 155 సీట్లు, పార్టీ సీకి అదనంగా 146 సీట్లు కేటాయిస్తారు.జర్మనీలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేది ఎక్కువ ఓట్లు పొందిన పార్టీ + ఎవరు కూటమి చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పార్టీ A (40%) ఒంటరిగా మెజారిటీ సాధించలేకపోతే, పార్టీ C (25%)తో కలిస్తే 65% మెజారిటీ వస్తుంది. అలాగే పార్టీ B (35%) + పార్టీ C (25%) కలిస్తే 60% మెజారిటీ వస్తుంది. ఇలా MMPలో స్థానిక గెలుపు + జాతీయ ఓట్ల శాతం రెండూ కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి.భారత్‌లో.. భారత్ పార్లమెంటరీ ఎన్నికల విధానాన్ని అవలంభిస్తోంది. దీనిని ఎఫ్‌పీటీపీ ( First Past The Post)గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో ప్రజలు నేరుగా అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఏ వ్యక్తికైతే అధికంగా ఓట్లు పోలవుతాయో వారినే విజేతగా నిర్ణయిస్తారు. ఎక్కువ సభ్యులు ఏ పార్టీ వాళ్లు ఉంటే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ గనుక సాధించకపోతే అప్పుడు కూటమికి వెళ్తుంది. అంతేగానీ.. పార్టీలకు ప్రత్యేకించి సీట్ల కేటాయింపు అనేది ఉండదు.మిక్స్డ్ విధానం వల్ల ఒరిగేదేంటి?..ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం పార్లమెంట్లో న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అంటే, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం సీట్లు కేటాయించబడతాయి, దీనివల్ల చిన్న పార్టీలకు కూడా అవకాశం కలగవచ్చు. అలాగే స్థానిక ప్రతినిధులు కూడా ఎలాగూ ఉండనే ఉంటారు. చట్ట సభలో స్థానికత ఫ్లస్ జాతీయ విధానం రెండూ ప్రతిబింబిస్తాయి.ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అరుదుగా జరగొచ్చు. కాబట్టి రెండు లేదంటే అంతకంటే ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. దీని వల్ల సహకారం, చర్చలు, సమతుల్య నిర్ణయాలు ఎక్కువగా జరుగుతాయి.ఓటర్లు తమ ప్రాంతానికి ఒక ప్రతినిధిని ఎంచుకోవచ్చు. అదే సమయంలో, తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసి దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సీట్లు పెంచవచ్చు. దీని వల్ల ఓటు వృథా అనే ప్రస్తావనే ఉండదు. ఎంఐఎం అధినేత ఒవైసీ ఈ ఎంఎంపీ మోడల్‌ను భారతదేశంలో అమలు చేయాలని ప్రతిపాదించడం వెనుక బలమైన కారణం ఉంది, భారత్‌లో ప్రస్తుతం అమలువుతున్న FPTP విధానం వల్ల చట్టసభలో చిన్న పార్టీలకు, మైనారిటీలకు, ప్రాంతీయ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రాతినిధ్యం కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎఫ్‌పీటీపీ వల్ల విధానంలో ఒక పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు రావొచ్చు. కానీ ఎంఎంపీలో అలాంటిది జరిగే అవకాశం ఉండదు. తద్వారా ప్రజాస్వామ్యం మరింత సమతుల్యంగా ఉంటుంది. -
అక్కడేమో భారీ జరిమానాలు.. మరి భారత్‌లో?!
మీ అకౌంట్లు క్లోజ్ చేస్తున్నాం. అప్రమత్తం అవ్వండి.. అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అక్కడి మైనర్లకు నోటిఫికేషన్లు పంపిస్తున్నాయి. ఆస్ట్రేలియా డిసెంబర్ 10, 2025 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇలాంటి నిషేధం అమలు చేయడం సాధ్యమేనా? అనే అంశాన్ని ఓసారి పరిశీలిద్దాం.. పిల్లలు.. పిల్లలాగే ఉండనివ్వాలి అన్నది ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ చెబుతున్నమాట. సో.మీ. ప్రభావంతో పిల్లలు హానికరమైన కంటెంట్, ఆన్లైన్ బుల్లీయింగ్, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని చెబుతోంది. ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్(సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) బిల్లు ప్రకారం.. ఆన్లైన్ ఎడ్యుకేషన్, యూట్యూబ్ కిడ్స్, ఈ లెర్నింగ్ యాప్‌లకు మాత్రం బ్యాన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే సో.మీ. యాప్‌లు ఈ బ్యాన్‌ను వ్యతిరేకించినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయబోతున్నాయి. మెటా.. దాని అనుబంధ యాప్‌లు, టిక్‌టాక్, యూట్యూబ్, ఎక్స్.. ఇలా ఎందులోనూ వాళ్లకు అకౌంట్లు ఉండడానికి వీల్లేదు. ఇప్పటికే మెయిల్స్, నోటిఫికేషన్ల రూపంలో మైనర్లకు సందేశాలు పంపిస్తున్నాయి. ఆ అకౌంట్లలో ఉన్న తమ డేటాను భద్రపరుచుకోవాలని వాళ్లకు సూచిస్తున్నాయి. నిర్ణీత వయసు దాటితే గనుక తమను తగిన ఆధారాలతో సంప్రదించాలని.. ఫేషియల్ ఏజ్ స్క్రీనింగ్ లాంటి సాంకేతిక సాయంతో ఆ విషయాన్ని ధృవీకరించుకుని ఆపై ఆ అకౌంట్లను యాక్టివేట్ చేస్తామని చెబుతున్నాయి. పలు యాప్‌లు పిల్లల అకౌంట్లను డీ యాక్టివేట్ చేయడం ప్రారంభించాయి. డిసెంబర్ 4వ తేదీ నుంచే పిల్లలు అకౌంట్లను క్రియేట్ చేయడానికి వీలుండదు. 10వ తేదీ నుంచి సంపూర్ణ నిషేధం అమల్లోకి వస్తుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. సదరు ప్లాట్‌ఫారమ్‌లకు 50 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు(మన కరెన్సీలో రూ.2,856 కోట్లు) దాకా జరిమానా విధిస్తారు. భారత్‌లో ఇది పరిస్థితి..ఆస్ట్రేలియా ప్రపంచంలో ఈ తరహా బ్యాన్ తేబోతున్న దేశం. అలాగే.. డెన్మార్క్ వంటి దేశాలు వయస్సు ఆధారంగా సోషల్ మీడియా నిషేధం అమలును పరిశీలిస్తున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ తరహా నిషేధం అమలు అవుతోంది కూడా. ఈ నేపథ్యంలో.. భారతదేశంలో కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. అయితే డిజిటల్ నిపుణులు చెబుతోంది ఏంటంటే.. నిషేధం అమలు చేయడం కష్టమని. ఎందుకంటే భారత్‌లో 25 కోట్ల మైనర్లు సో.మీ. వాడుతున్నారనే అంచనా ఒకటి ఉంది. అంతేకాదు.. భారతదేశంలో డిజిటల్ మానిటరింగ్ బలహీనంగా ఉందని. సోషల్ మీడియా వాడకాన్ని ఆరోగ్యకరంగా ప్రోత్సహించడం (healthy use) మంచిదని సూచిస్తున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, పూర్తిగా నిషేధం కంటే నియంత్రణ, అవగాహన అవసరమని నిపుణులు భావిస్తున్నారు. అయితే బిజీ లైఫ్‌లో ఇటు భారత్‌లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.కోర్టు ఏం చెప్పిందంటే.. భారత్‌లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించడం తమ పరిధిలో లేదని సర్వోన్నత న్యాయస్థానం ఇది వరకే తేల్చి చెప్పింది. ఇది చట్టపరిధిలోని అంశమని స్పష్టం చేసింది. అంతేకాదు.. 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. కఠిన చట్టం లేదా?.. భారత్‌లో మైనర్లు సో.మీ. వాడకూడదనే రూల్ ఏం లేదు. రాజకీయ కోణం, ఇక్కడి జనాభా, సో.మీ. ప్లాట్‌ఫారమ్ జరిపే వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటే అది సాహసమనే చెప్పాలి. అయితే.. కేంద్ర ప్రభుత్వం 2023లో Digital Personal Data Protection (DPDP) Act, 2023ను ఆమోదించింది. దీని ఆధారంగా DPDP Rules, 2025ను నోటిఫై చేసింది. ఈ నియమాల ప్రకారం.. 18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల లేదా లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా కంపెనీలు పిల్లల డేటా సేకరణ, వినియోగం, షేరింగ్‌పై కఠిన నియంత్రణలు పాటించాలి. ఉల్లంఘన జరిగితే కంపెనీలకు రూ. 250 కోట్లు వరకు జరిమానా విధించవచ్చు. అయితే.. ఇది సక్రమంగా అమలు కావడం లేదు. చివరగా.. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటి దేశంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు చేస్తోంది. భారతదేశంలో ఇలాంటి నిషేధం అమలు సాధ్యమా అనే ప్రశ్నపై నిపుణులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి నిషేధం కంటే నియంత్రణ, అవగాహన, డిజిటల్ లిటరసీపై దృష్టి పెట్టడం భారతదేశానికి అత్యంత అనుకూలమని సూచిస్తున్నారు. -
మొబైల్ చార్జర్‌ను ప్లగ్కే ఉంచుతున్నారా?
మొబైల్ చార్జర్‌ను కరెంట్ ప్లగ్లకే వేలాడేసి ఉంచడం.. చాలా ఇళ్లలో, ఆఫీసుల్లో కనిపించేదే. కొందరైతే స్విచ్ ఆన్‌లో ఉండగానే వాటిని అలా వదిలేస్తుంటారు. ఉరుకుల, పరుగుల జీవితమే అందుకు కారణమని సాకులు చెబుతుంటారు. అయితే ఇది తేలికగా తీసుకోవాల్సిన విషయమేమీ కాదని అంటున్నారు నిపుణులు. సెల్‌ఫోన్ చార్జర్లను ఇలా కరెంట్ ఫ్లగులకు వదిలేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల కొంచెం కొంచెంగా విద్యుత్ వినియోగం.. భారీ పరిమాణంలోనే జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాటిని పరిశీలిస్తే.. 👉ఫాంటమ్ పవర్ వినియోగం (Phantom Power): చార్జర్‌కి ఫోన్ కనెక్ట్ చేయకపోయినా, చిన్న మొత్తంలో విద్యుత్ (0.1–0.5 వాట్) వినియోగం జరుగుతుంది. దీన్ని ‘వాంపైర్ ఎనర్జీ’ అంటారు. దీన్ని ఇలాగే లెక్కస్తే రోజులు.. నెలలు.. సంవత్సరాలకు కొన్ని యూనిట్లు వృథా అవుతాయన్నమాట.👉చార్జర్ లైఫ్ తగ్గే అవకాశం.. నిరంతరం విద్యుత్ ప్రవాహంలో ఉండటం వల్ల చార్జర్‌లోని అంతర్గత భాగాలు మెల్లగా దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల దీర్ఘకాలికంగా పనితీరు తగ్గుతుంది.👉ఇలా స్విచ్ బోర్డులకు, ఫ్లగ్గులకు చార్జర్లు వదిలేయడం సేఫ్ కూడా కాదు. కొన్నిసార్లు విద్యుత్‌తో అవి వేడెక్కే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నాణ్యత లేని చార్జర్లతో. దీనివల్ల ఫోన్లు పాడైపోవడం, పేలిపోవడం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. 👉పర్యావరణంపై ప్రభావం.. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అలవాటు ఎంత మందికి ఉందో?. అంటే.. చాలా విద్యుత్ వృథా అవుతుందన్నమాట. కాబట్టి విద్యుత్ వినియోగం అనేది చిన్న మొత్తంలో అయినా, పెద్ద మొత్తంలో అయినా.. పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదు.పాటించాల్సినవి.. తడి చేతులతో చార్జర్లను ఫోన్‌కు కనెక్ట్ చేయకూడదుఫోన్ చార్జింగ్‌లో లేనప్పుడు చార్జర్‌ను ప్లగ్ నుంచి తీసేయడం ఉత్తమంనాణ్యమైన చార్జర్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా వేడి, విద్యుత్ వృథా వంటి సమస్యలు తగ్గుతాయి.మార్కెట్లలోకి రకరకాల చార్జర్లు(ఒరిజినల్ వెర్షన్) వస్తున్నాయి. స్మార్ట్ ప్లగ్‌లు వాడితే, ఆటోమేటిక్‌గా పవర్ ఆఫ్ చేయవచ్చు:::సాక్షి, వెబ్డెస్క్ఇదీ చదవండి: పవర్ ఆఫ్‌లో ఉన్నా మీ ఇంట్లో ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? -
మోనాలిసాతో మొదలై.. ప్రపంచంలోనే భారీ చోరీ ఏదో తెలుసా?
మిస్టరీతో కూడిన చిరునవ్వు మోనాలిసా.. లియోనార్డో డా విన్సీ చిత్రించిన 16వ శతాబ్దం నాటి అపురూపమైన పెయింటింగ్. అలాంటి దానిని వందల మంది కాపాలా కాసే చోటు నుంచి దానిని దొంగలించడం సాధ్యమేనా?.. తాజాగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీని చూస్తే.. ‘అదేం పెద్ద విషయం కాకపోవచ్చు’ అనే సందేశాన్ని ఇస్తోంది.లూవ్ర్ మ్యూజియం.. 12వ శతాబ్దంలో ఇదొక కోట. తర్వాతి కాలంలో.. ఫ్రాన్స్ రాజులు దీనిని రాజభవనంగా మార్చేశారు. అయితే.. లూయీ XIV తన రాజభవనాన్ని వెర్సైల్లెస్కు మార్చారు. అప్పటి నుంచి కళాత్మక ప్రదర్శనలు ఉంచే చోటుగా మారిపోయింది. 1793లో ఫ్రెంచ్ విప్లవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. Musée du Louvre అనే పేరుతో 18వ శతాబ్దం నుంచి దీనికి అధికారిక మ్యూజియం గుర్తింపు దక్కింది. ప్రస్తుతం Louvre museum ప్రపంచంలోనే అతిపెద్ద, సుప్రసిద్ధ కళా మ్యూజియం. మెసపటోమియా, ఈజిప్టు.. అనేక నాగరికతలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. గ్రీకు, రోమన్, ఫ్రెంచ్ రాజ్యాలకు చెందిన ప్రతీకలు ఇక్కడ కొలువు దీరాయి. మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ వంటి కళాఖండాలు లూవ్ర్కు ప్రత్యేక ఆకర్షణ. గాజు పిరమిడ్ షేపులో ఉండే మ్యూజియం ఎంట్రెన్స్ అదనపు ఆకర్షణ. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఏఐ పై డిజైన్ చేసిన ఈ ద్వారం 1989లో నిర్మించబడింది. పారిస్ నగరానికి ఆధునికతను చేర్చే చిహ్నంగా.. పిరమిడ్ 21.6 మీటర్ల ఎత్తు, 673 గాజు పలకలతో రూపొందించారు. అరోజుకు సగటున 30,000 మంది సందర్శకులు.. ఏటా దాదాపు కోటి మంది దీనిని సందర్శిస్తుంటారు. అందుకే భద్రతా కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ.. 2025 అక్టోబర్ 19న లూవ్ర్ మ్యూజియంలో భారీ దోపిడీ జరిగింది. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ విభాగం అపోలో గ్యాలరీలో నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి విలువైన ఆభరణాలను నలుగురు దుండగులు దొంగలించారు. మోటార్ స్కూటర్లపై వచ్చిన దొంగలు.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మ్యూజియం లోపలికి వెనకభాగం నుంచి చొరబడి(సీన్ నది వైపు).. సరుకు రవాణా ఎలివేటర్ ద్వారా గ్యాలరీలోకి ప్రవేశించారు. కట్టర్లు ఉపయోగించి రెండు డిస్ప్లే కేసులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టి తొమ్మిది విలువైన వస్తువులను అపహరించారు. కేవలం నాలుగు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ హైప్రొఫైల్ చోరీ జరిగింది. 🇫🇷 - BFMTV shares the first video of the criminal who is in the process of stealing the Napolean Era jewels in the Louvre museum. https://t.co/u0aXSP6yUv pic.twitter.com/DEuYEq39R7— EuroWatcher - News for you (@EuroWatcherEUW) October 20, 2025ఫ్రాన్స్ కల్చర్ మినిస్టర్ రాచిడా దాతి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. చోరీకి గురైన 9 వస్తువుల్లో నెపోలియన్ చక్రవర్తికి చెందిన తలపాగా.. ముత్యాల హారంతో పాటు ఫ్రాన్స్ చివరి మహారాణి యూజెనీ(నెపోలియన్-3 సతీమణి) ముత్యాల హారం కూడా ఉందని ప్రకటించారామె. అయితే.. తొమ్మిది నగల్లో.. ఒకటి అక్కడే పడిపోయిందని, దానిని తిరిగి భద్రపరిచినట్లు చెప్పారు. వీటి విలువ వెలకట్టలేనిదని తెలుస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. చోరీ నేపథ్యంలో మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అలాగని వరల్డ్ ఫేమస్ అయిన లూవ్ర్ చరిత్రలో ఇదే మొదటి దోపిడేం కాదు. 1911లో సుప్రిసిద్ధ మోనా లిసా చిత్రాన్ని మ్యూజియంలో పని చేసిన విన్సెంజో పెరుగ్గియా అనే ఇటాలియన్ కార్మికుడు దొంగలించాడు. అతని అరెస్ట్‌తో రెండు సంవత్సరాల తర్వాత అది తిరిగి లభించింది. 1976లో గుస్తావ్ కుర్బెట్ ‘ది వేవ్’ చోరీకి గురైనా.. ఇప్పటికీ దొరకలేదు. 1983లో రెండు పురాతన కవచాలను దొంగలించగా.. 40 ఏళ్ల తర్వాత తర్వాత అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చివరగా.. 1998లో Le Chemin de Sèvres అనే పెయింటింగ్ చోరికి గురై ఆ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదు. లె చెమిన్ చోరీ తర్వాత లూవ్ర్ మ్యూజియంలో భద్రతను భారీగా పెంచారు. అయినా కూడా ఇలా జరగడం తీవ్ర చర్చనీయాంగా మారింది. అక్కడ చోరీ జరిగితే అది అసలు దొరకదని, దొరికినా అసంపూర్తిగా ఉంటుందనే మచ్చ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో తాజా చోరీ కేసులో అయినా పురోగతి ఉంటుందేమో చూడాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన చోరీ ఏదో తెలుసా?.. అమెరికా బోస్టన్ ఇసబెల్లా స్టువర్ట్ గార్డ్నర్ మ్యూజియంలో (Isabella Stewart Gardner Museum Heist) జరిగిన చోరీ.. చరిత్రలోనే అత్యంత విలువైన కళా దొంగతనంగా గుర్తించబడింది. అప్పటి అంచనా ప్రకారం చోరీకి గురైన కళాకృతుల విలువ రూ.500 మిలియన్ డాలర్లు. ఆనాడు ఏం జరిగిందంటే.. 1990 మార్చి 18వ తేదీన ఇద్దరు వ్యక్తులు పోలీసుల వేషంలో మ్యూజియంకు వచ్చారు. డిస్టర్బెన్స్ కాల్ ఉందని చెబుతూ లోపలికి వెళ్లి.. భద్రతా సిబ్బందిని గంటపాటు బంధించి తమ పని కానిచ్చారు. మొత్తం 13 కళా వస్తువులను దొంగిలించగా.. అందులో రెంబ్రాంట్, వెర్మీర్, డెగా.. లాంటి పాపులర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ రంగంలోకి దిగినా.. దొంగల ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. ఈ కేసుకు సంబంధించి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మ్యూజియంలో అవి దొరకకపోతాయా? అనే ఆశతో ఖాళీ ఫ్రేమ్‌లను వేలాడదీయడం చూడొచ్చు. అలాగే.. అంట్వెర్ప్ డైమండ్ హైస్ట్ (2003, బెల్జియం)లో.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు, బంగారం దొంగిలించారు. అందుకే దీనిని ఈ శతాబ్దపు భారీ చోరీ "Heist of the Century" అని పిలుస్తారు. హ్యారీ విన్స్టన్ జువెల్ రాబరీ (2008, పారిస్).. 108 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఈ చోరీలో దొంగలు మహిళల వేషంలో వచ్చారు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ హైస్ట్ (2003).. సద్దాం హుస్సేన్ పాలనలో 1 బిలియన్ డాలర్ల నగదు కొట్టేసినట్లు ఒక అంచనా. ఇలా.. లూవ్ర్ చోరీ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన దొంగతనాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.ఇదీ చదవండి: స్కాండల్స్‌తో రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ -
గూగుల్‌కి అసలు అర్థమేంటో తెలుసా?
ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?.. దాని ఫాంట్ వేరే రకంగా కనిస్తోందా?.. అదేదో అప్డేట్ అనుకుని కంగారుపడేరు. ఇవాళ గూగుల్ 27వ పుట్టినరోజు. అందుకే డూడుల్ అలా దానికి విషెష్ తెలిపిందంతే. అయితే గూగుల్ ప్రారంభమైంది సెప్టెంబర్ 4వ తేదీన. అలాంటప్పుడు ఇవాళ బర్త్‌డే జరుపడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని మీకు తెలుసా?.. అసలు గూగుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా??..గూగుల్‌ను లారీ పేజ్(Larry Page), సెర్గీ బ్రిన్(Sergey Brin) ప్రారంభించారు. 1998లో సెప్టెంబర్ 4న అధికారిక కంపెనీ గుర్తింపు దక్కించుకుంది. అయితే.. 2003 నుంచి గూగుల్ బర్త్‌డే మారిపోయింది. 2003లో సెప్టెంబర్ 8న, 2004లో సెప్టెంబర్ 7న, 2005లో సెప్టెంబర్ 26 నిర్వహించుకుంది. అయితే 2006 నుంచి సెప్టెంబర్ 27ను క్రమం తప్పకుండా తన పుట్టినరోజుగా మార్చేసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు!.సెప్టెంబర్ 27, 2006లో గూగుల్ అరుదైన మైలురాయి దాటింది. అత్యధిక వెబ్‌పేజీలను ఇండెక్స్ చేసిన ఘనత గూగుల్ సొంతం చేసుకుంది. అంటే.. ఒక నిర్దిష్ట సమయంలో తన సెర్చ్ ఇంజిన్ ద్వారా అప్పటిదాకా ఎవరూ సాధించని ఫీట్ సాధించింది. అలా.. ఆ అరుదైన ఘనత సాధించిన సందర్భాన్ని బర్త్‌డేగా మార్చుకుంది. అప్పటి నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే తన పుట్టినరోజున డూడుల్స్, ప్రమోషన్స్, తన ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటిస్తుంటుంది. ఇంతకీ గూగుల్ అర్థమేంటంటే.. Google అనే పదానికి అర్థం ఏ డిక్షనరీలోనూ కనిపించదు. అసలు ఆ పదానికి ఓ అర్థమంటూ లేదు కూడా. వాస్తవానికి.. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ 1997లో తాము రూపొందించిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్‌కు గూగోల్(Googol) అనే పేరు పెట్టాలనుకున్నారు. గూగోల్ అంటే.. 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య. అపారమైన సమాచారాన్ని అందిస్తుంది అనే అర్థం వచ్చేలా ఆ పదం అనుకున్నారు. అయితే.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వీళ్లద్దరి సహచరి విద్యార్థి సీన్ అండర్సన్.. Googol.com అనే డొమెయిన్‌కు బదులు Google.com అని టైప్ చేశాడు. అయితే లారీ పేజ్ ఆ పేరు నచ్చి.. అప్పటికప్పుడు ఆ డొమెయిన్‌ను ఫిక్స్ చేశారు. అలా ఆ తప్పిదమే చివరికి ఇప్పుడు ప్రపంచమంతా వెతుక్కునే ప్రముఖ బ్రాండ్‌గా మారింది.ఇది తెలుసా?.. గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్ఫ్లెక్స్(Googleplex) అమెరికా కాలిఫోర్నియా స్టేట్ మౌంటెన్ వ్యూలో ఉంది. ఈ హెడ్ ఆఫీస్‌లో స్టాన్(Stan) అనే డైనోసార్ బొమ్మ ఉంటుంది. గూగుల్ అనేది ఎంత పెద్ద సెర్చ్ ఇంజిన్ అయినా సరే.. డైనోసార్లా అంతం అయిపోకుండా, కొత్త ఆలోచనలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారట. అంతేకాదు.. 2010లో తమ ఆవరణలో ఉన్న గడ్డిని కత్తిరించేందుకు మెషీన్లు, పరికరాల సాయంతో కాకుండా అద్దెకు గొర్రెలను తెచ్చి ఇకోఫ్రెండ్లీ ఐడియాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కూడా. ఇంకో ఆసక్తికరమైన ముచ్చట ఏంటంటే.. గూగుల్‌కు నెట్ ఆగిపోతే వచ్చే డైనోసార్ గేమ్ తెలుసు కదా. 2014లో ఈ ఆఫ్‌లైన్ గేమ్(T-Rex Runner-Chrome Dino) ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఇంటర్నెట్ లేకపోతే మనం డైనోసార్ యుగంలో ఉన్నాం అనే ఫన్‌తో యూజర్ల దృష్టి మరలకుండా ఉండేందుకే ఈ గేమ్‌ను క్రియేట్ చేశారట!. -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్‌వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్‌లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్‌కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్‌లో జెన్‌జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్‌జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్‌లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్‌ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్‌ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్‌కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
బీహార్‌లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్‌గా ఉండే బీహార్‌లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 2025 అక్టోబర్/నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్‌లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.బీహార్‌లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్‌లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్‌లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్‌పుత్‌లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్‌లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్‌ల మద్దతు లభిస్తోంది. 2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. బీహార్‌లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్‌గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్‌గంజ్‌తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్‌లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో, వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న సంక్షేమాలు కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. :::ఆర్.దిలీప్ రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ -
కిమ్.. ‘క్రీమ్’.. బంద్
సంచలనాలకు నెలవైన ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఐస్ క్రీం అనేది ఇక ఆ దేశంలో వినిపించకూడదని నిర్ణయించారు. ఈ తరహా నిర్ణయాలు కిమ్ గతంలోనూ తీసుకున్నాడని చదివే ఉంటారు. వాటిని ఉల్లంఘిస్తే ఎంతటి భయంకరమైన శిక్షలు ఉంటాయో కూడా తెలిసే ఉండొచ్చు. మరి ఐస్ క్రీంపై కిమ్‌కు ఎందుకు కోపమొచ్చింది? ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా ఐస్‌క్రీం అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా వినిపించే పదమే. కానీ, ఇప్పుడది కొరియా రాజకీయాల్లో కీలకంగా మారింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ఆ పదం కోపం తెప్పించింది. దీంతో ఆ పదమే ఇక దేశంలో ఏమూల కూడా వినిపించకూడదని ఆయన నిర్ణయించారు. బదులుగా.. ఎసుకిమో లేదంటే ఒరుంబోసూంగీ అని పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియన్ భాషలో ఈ పదాలకు అర్థం మంచు లాలీపాప్ లేదంటే మంచు ఐస్ బార్.డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రకారం.. ఉత్తర కొరియాలో.. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంలో పాశ్చాత్య (Western) పదాల వాడకం ఎక్కువగా ఉంటోంది. వాటిని కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియాలా.. తమ దేశమూ కట్టుదాటి ఆ తరహా భాషకు బానిస అవ్వకూడదనే కిమ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు టూర్ గైడ్లకు స్థానిక పదాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. సాధారణంగా.. ఏ దేశంలో అయినా టూర్ గైడ్లు పర్యాటకులకు దగ్గరయ్యేందుకు ‘భాష’ను ఉపయోగిస్తుంటారు. అయితే కిమ్ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనే.. టూర్ గైడ్లు శిక్షణ పొందుతున్నారు. మూడు నెలల కాలపరిమితో కొనసాగే ఈ ట్రైనింగ్ ప్రొగ్రాం ఆగస్టు 21వ తేదీనే ప్రారంభమైంది. అయితే ఈ విధంగా భాషను నియంత్రించడం ద్వారా తన ప్రజలను, పర్యాటకులను విదేశీ ప్రభావాల నుండి దూరంగా కిమ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అయితే ఈ నిర్ణయం కేవలం ఐస్ క్రీమ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. హ్యామ్‌బర్గ్ ఇలా మరికొన్ని పదాలను కూడా లోకల్ భాషలోనే పిలవాలనే హుకుం జారీ అయ్యింది. పూర్తిగా ఉత్తర కొరియా సంస్కృతితో కొనసాగుతూ.. విదేశీ పదాలను, మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా కల్చర్ ప్రభావం ఇక్కడి పర్యాటకంలో ఉండకూడదనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి పర్యాటక కంపెనీలు చెబుతున్నాయి. ఉల్లంఘిస్తే.. ఉత్తర కొరియాలో పాశ్చాత్య.. దక్షిణ కొరియా పదజాలాలంపై నిషేధం కొనసాగుతోంది. ఒకవేళ దీనిని గనుక ఉల్లంఘిస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లపాటు నిర్బంధ కూలీగా కిమ్ ప్రభుత్వం కోసం పని చేయాలనే శిక్ష విధిస్తారు. ఆ సమయంలో సరైన భోజనం, వైద్య వసతులు అందవు. లేదంటే కుటుంబాలను వెలివేస్తారు. భారీగా జరిమానాలతో పాటు ఆస్తులనూ జప్తు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది కేవలం భాష ఉల్లంఘన మాత్రమే కాదు.. ఆన్టీ-సోషలిస్టు చర్యగా పరిగణించే అవకాశం లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో.. మరణశిక్ష కూడా విధించొచ్చు. కొసమెరుపు..ఎస్కిమోలు.. ఈ పదం ఎక్కడైనా విన్నట్లు ఉందా?.. అలస్కా, కెనడా, గ్రీన్లాండ్, సైబీరియా.. అర్కిటిక్ రీజియన్‌లోని మంచు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలు. అయితే.. ఇప్పుడా పదం అవుట్‌డేటెడ్ అయ్యింది. కొన్ని తెగలు ఆ పదాన్ని అభ్యంతరకరంగా కూడా భావిస్తున్నాయి. అందుకే ఈ పదం పెద్దగా వినియోగంలో కనిపించడం లేదు. అలాంటిది ఈ పదం ఇప్పుడు నార్త్ కొరియాలో ప్రముఖంగా వినిపిస్తుండడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇంగ్లీష్ నుంచి నేరుగా పదాన్ని తీసుకోవద్దనే ప్రయత్నంగా కనిపిస్తోంది. కిమ్.. కొన్ని సంచలన నిర్ణయాలువిదేశీ వినోదం.. మీడియాపై నిషేధం: ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలు, సంగీతం, టీవీ షోలు చూడటం నేరంగా ప్రకటించారు. దీన్ని "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించి కఠిన శిక్షలు విధించారు.మొబైల్ ఫోన్లపై నియంత్రణ: విదేశీ నెట్‌వర్క్‌లను ఉపయోగించే మొబైల్ ఫోన్లు కలిగి ఉండటం నేరం. ప్రజలు గోప్యంగా మాట్లాడటం, సమాచారం పంచుకోవడం నిషేధంహాట్డాగ్లపై నిషేధం: పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే హాట్‌డాగ్ వంటి ఆహారాలను తినడం, తయారు చేయడం నిషేధించారు. ఇది "దేశద్రోహం"గా పరిగణించబడుతోంది.బుదాయ్-జిగే (Korean-American fusion dish) నిషేధం: దక్షిణ కొరియా నుండి వచ్చిన మాంసం, బీన్స్, సాసేజ్‌లతో తయారయ్యే ఈ వంటకం మార్కెట్లలో అమ్మకాన్ని నిలిపివేశారు.వివాహ విభజనపై శిక్షలు: విడాకులు తీసుకునే దంపతులను కారాగార శిక్షలకు గురిచేశారు. ఇది "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించబడుతోంది.ఆధ్యాత్మిక స్వేచ్ఛపై.. మత స్వేచ్ఛ, కార్యక్రమాలు, సంఘాలు ఏర్పరచడం వంటి పౌర హక్కులను పూర్తిగా నిషేధించారు.జూలై 8, డిసెంబర్ 17 తేదీల్లో పుట్టినరోజులపై నిషేధం: ఈ తేదీలు కిమ్ గత పాలకులు కిమ్ ఇల్-సంగ్ , కిమ్ జోంగ్-ఇల్ చనిపోయిన తేదీలు. దీంతో.. ఆరోజుల్లో ఉ.కొ. పౌరులు పుట్టినరోజు చేసుకోకూడదుహెయిర్స్టైల్, లెదర్జాకెట్లపై నిషేధం: కిమ్ ప్రభుత్వానికి నచ్చని హెయిర్‌స్టైల్‌లు వేసుకోవడం నేరంగా మారింది. ప్రత్యేకంగా నిర్దేశించిన స్టైల్లే అనుమతించబడ్డాయి. అలాగే కిమ్ వేసుకునే జాకెట్లు, డ్రెస్సింగ్ స్టయిల్‌ను ఫాలో అయినా సరే అది నేరమే. అలాగే.. యువత ఆలోచనా స్వేచ్ఛను కట్టడి చేసేందుకు, విదేశీ సమాచారం పొందకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. పైనే చెప్పుకున్న నేరాలన్నీ శిక్షార్హమైన నేరాలే. వీటికి పాల్పడినవారిని శ్రమ శిబిరాలకు పంపించడం సాధారణంగా మారింది. అక్కడ వారు జీతం లేకుండా, భద్రత లేకుండా పనిచేయాల్సి ఉంటుంది.ఒకవేళ అదే నేరాన్ని కిమ్ తీవ్రంగా భావిస్తే మాత్రం.. అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుకోవాల్సిందే!. -
2-3 నిమిషాల్లో విరిగిన ఎముకలు అతికితే!!
ఈ గమ్మును మీ విరిగిన ఎముకల మధ్య రాస్తే.. అవి రెండు నుంచి మూడు నిమిషాల్లో అతుక్కుంటాయి అంటూ ఓ వీడియో గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఈ గ్లూ మీద జరిగిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని.. ఇది మార్కెట్లోకి రావడమే ఆలస్యమని.. ఇది గనుక అందుబాటులోకి వస్తే వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పునకు కారణమవుతుందని ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత?.. ఓసారి పరిశీలిస్తే.. విరిగిన ఎముకలు అంత ఈజీగా అతుకుతాయా? గంటల తరబడి ఆపరేషన్లు చేస్తే.. నెలలు, సంవత్సరాల తరబడి అవి అతుక్కుంటున్నాయి. అలాంటిది కేవలం సెకన్ల వ్యవధిలో ఓ సూది ద్వారా అతుక్కనేలా చేయొచ్చా?. చైనా పరిశోధకులు కనిపెట్టిన బోన్ గ్లూకు అసలు శాస్త్రీయత ఉందా?.. ఆ ప్రచారంలో ఉన్నట్లు విరిగిన ఎముకలను గంటల పాటు శస్త్రచికిత్స చేసి, స్టీల్ ప్లేట్లు అమర్చే సంప్రదాయ వైద్యం ఇక చరిత్ర అవ్వబోతోందా?.. షెజాంగ్ స్థానిక మీడియా ప్రకారం.. తూర్పు చైనా(China)లోని షెజాంగ్ ప్రావిన్స్‌లో ‘బోన్ 02’ అనే బోన్ గ్లూ(bone glue)ను పరిశోధకులు ఆవిష్కరించారు. దీంతో విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లోనే అతికించవచ్చని ఆ కథనం సారాంశం. సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్ షాన్‌ఫింగ్ నేతృత్వంలోని బృందం దీనిని డెవలప్ చేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన జిగురు కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ఎముకను బాగుచేస్తుందని అంటున్నారాయన. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలోనూ దీని పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడించారు. సంప్రదాయ వైద్యంలో ఎముకలు అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి, స్టీల్ ప్లేట్లను అమర్చుతారు. కానీ ఈ ఇంజెక్షన్‌తో అలాంటి అవసరం రాదని అంటున్నారాయన. పైగా బోన్ 02 శరరీంలో ఈజీగా కలిసిపోతుందని, కాబట్టి మరో సర్జరీ అనే అవసరం లేకుండా చేస్తుందని చెబుతున్నారాయన. ఆపరేషన్ల సక్సెస్ రేటు తక్కువగా ఉంటుండడమే.. తనకు దీనిని రూపొందించాలనే ఆలోచన కలగజేసిందని అంటున్నారాయన.ఇంతకీ ఈ గ్లూను అభివృద్ధికి ప్రేరణ ఏంటో తెలుసా?. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలు. వాటి జీవశైలిని పరిశీలించిన లిన్ షాన్‌ఫింగ్ ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టారు.ట్రయల్స్.. సక్సెస్.. ‘బోన్ 02’(Bone-02)ని లాబోరేటరీలో కూడా పరీక్షించారు. అందులో తేలింది ఏంటంటే.. ఇది 400 పౌండ్ల బలాన్ని తట్టుకోగలదు (అంటే చాలా బలంగా అంటుకుంటుంది). 0.5 MPa కోత బలం (shear strength) అంటే పక్కదిశలో ఒత్తిడిని తట్టుకునే శక్తి ప్రదర్శించింది. అలాగే.. 10 MPa సంపీడన బలం (compressive strength) అంటే నేరుగా ఒత్తిడిని తట్టుకునే శక్తి చూపించింది. ఈ లక్షణాలన్నీ సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యం దీనికి ఉందని సూచిస్తున్నాయి. అలాగే.. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా.. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ ‘బోన్ 02’లోని మరో విశిష్ట లక్షణం ఉండనే ఉంది. మొత్తం 150 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్‌లో ఇది విజయవంతంగా పని చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీన దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే.. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (NMPA) నుంచి పూర్తి మార్కెట్ అనుమతి పొందిందా? అనేదానిపై సష్టత కొరవడింది. వైద్య చరిత్రలో మైలురాయే!ఎముకలను అతికించేందుకు ఈ తరహా ప్రయోగాలు గతంలోనూ జరిగాయి. 1940 కాలంలో.. ఎముకలను అతికించే పదార్థాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మొదలైంది. 1950 నుంచి ముప్పై ఏళ్లపాటు నాన్‌స్టాప్‌గా ఈ తరహా పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం జంతు మూలాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థం, బలమైన అంటుకునే లక్షణాలున్న ఎపాక్సీ రెసిన్లు (Epoxy Resins) రసాయనాలు, వేగంగా గట్టిపడే ప్లాస్టిక్ తరహా అక్రిలేట్లు (Acrylates)సైనోఎక్రిలేట్లు (super glue తరహా) పదార్థాలు ఉపయోగించారు. అయితే.. ఇవి ఎముకలను అతికించే సామర్థ్యం ప్రదర్శించినా.. బాడీకి పనికి రాకుండా పోయాయి. వీటి వల్ల బయోకంపాటబిలిటీ సమస్యలు ఎదురయ్యేవి. అంటే.. ఇన్ఫెక్షన్, అలర్జీలు వచ్చేవి. పైగా శరీర కణజాలాన్ని దెబ్బ తీశాయి. వాటిని తొలగించేందుకు రెండో సర్జరీ అవసరం అయ్యేవి. ఈ కారణాల వల్ల, వాటిని వైద్యంగా విరమించాల్సి వచ్చింది. సైనోఎక్రిలేట్లు (super glue తరహా) వంటి పదార్థాలతో ప్రయోగాలు జరిగాయి.1990–2010 మధ్యకాలంలో.. బయోకంపాటబుల్ పాలిమర్లు, కోలాజెన్, కెరటిన్, కైటోసన్ వంటి పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇవి శరీరంలో కరిగిపోవడం, తక్కువ రిస్క్ ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉన్నా, అంత బలంగా అంటుకునే సామర్థ్యం ప్రదర్శించలేకపోయాయి. 2010 తర్వాత.. బయోమిమిటిక్ దిశగా ప్రయోగాలు జరిగాయి. అంటే.. ఆల్చిప్పలు, గవ్వలు, గోరింటాకు వంటి జీవుల నుంచి స్ఫూర్తి పొందిన బయోమిమిటిక్ గ్లూలు అభివృద్ధి చేయడం మొదలైంది. ఇవి నీటి లోపల కూడా బలంగా అంటుకునే లక్షణాలను కలిగి ఉండటంతో, శరీరంలోని రక్త ప్రవాహంలో కూడా పనిచేయడం లాంటి ఫలితాలను ఇచ్చాయి. అలా కొన్ని గ్లూలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నా.. అక్కడ సరైన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. ఇలాంటి టైంలో.. చైనా బోన్ 02 గ్లూలు వాస్తవిక ప్రయోగ దశకు చేరుకోవడం గమనార్హం. సాధారణంగా, ఇలాంటి వైద్య పరికరాలను Class III medical deviceగా పరిగణిస్తారు. కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్, టెక్నికల్ సమీక్ష, రెగ్యులేటరీ అనుమతులు అవసరం. ఆ తర్వాతే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇది మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో.. వైరల్ అవుతున్న ఆ వీడియో.. ఆ కథనం రెండూ నిజమే. ‘బోన్ 02’ అనే గ్లూ ఎముకలు అతికించడంలో వేగంగా, బలంగా, సురక్షితంగా పనిచేస్తోందని రుజువైంది. ఇది సంప్రదాయ చికిత్సకు మంచి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
నేపాల్ అగ్నిగుండాన్ని చల్లార్చిన యాప్!
కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం(గత) 26 సోషల్ మీడియా యాప్‌లపై విధించిన నిషేధం.. ఆ దేశంలో అలజడిని సృష్టించింది. జెడ్ జనరేషన్ యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టడం.. వాటిని అదుపు చేసే క్రమంలో హింస చెలరేగి 51 మంది మరణించడం.. యాప్ బ్యాన్ ఎత్తివేత.. అయినా శాంతించని యువత.. ప్రధాని రాజీనామా.. ఆపై ఆందోళనకారుల ఛాయిస్ ప్రకారం తాత్కాలిక ప్రధాని ఎంపిక.. ఇదంతా పదిరోజుల వ్యవధిలోనే చకచకా జరిగిపోయింది. అయితే సో.మీ. బ్యాన్ నేపథ్యంలో ఆందోళనకారులు డిస్కార్డ్ Discord అనే చాట్ ప్లాట్‌ఫారమ్‌ను భలేగా ఉపయోగించారు. ఒకవేళ ఈ యాప్ గనుక లేకుండా ఉంటే.. నేపాల్ ఇంకా అగ్నిగుండంగా రగిలిపోతూ ఉండేదేమో అనే చర్చా నడుస్తోందక్కడ.పాలన పేరిట ఇన్నేళ్లుగా కొనసాగిన అవినీతికి నేపాల్ యువత ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంది. ఆందోళనలను ఉధృతంగా జరిపి ప్రభుత్వం మెడలు వచ్చింది. అయితే ఈ ఆందోళనలను సమన్వయపర్చుకోవడానికి డిస్కార్డ్ యాప్‌నే Gen Z నిరసనకారులు ఉపయోగించుకున్నారు. అంతేకాదు.. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత.. తమ ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుడ్ని ఎన్నుకునే క్రమంలోనూ ఈ వేదికనే ఉపయోగించుకున్నారు. Discord అనే యాప్ గురించి మిలెనియల్స్కు పెద్దగా పరిచయం లేకపోయినా.. Gen Z యువత మాత్రం సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన వేదికగా భావిస్తోంది. డిస్కార్డ్(Discord) అనేది 2015లో ప్రారంభమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్. ఇది గేమర్ల కోసం ఆటల మధ్యలోనే స్నేహితులతో చాట్ చేయడానికి రూపొందించబడిన ఒక యాప్. అయితే.. 2020లో మహమ్మారి సమయంలో Gen Z యువతలో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. Discord ద్వారా వినియోగదారులు సర్వర్లు అనే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి.. టెక్స్ట్, ఆడియో, వీడియో చానెల్స్ ద్వారా చర్చలు జరపడం ప్రారంభించారు. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ వంటి ఫీచర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సర్వర్‌లో గరిష్టంగా 5 లక్షల మంది చేరవచ్చు, కానీ ఒకేసారి 2.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్‌గా ఉండగలరు. అందుకే నేపాల్ యువత ఉద్యమానికి దీన్నొక వేదికగా మల్చుకుంది. వీపీఎన్ సాయంతో.. సాధారణంగా వీపీఎన్‌లను ఎందుకు ఉపయోగిస్తారు?.. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. నేపాల్ యువత మాత్రం ఈమధ్య దీనిని తాజాగా నిరసనలకే ఉపయోగించింది(నేపాల్‌లో VPNల వినియోగం 3 రోజుల్లోనే 6,000% పెరిగింది.. అలాగే 5వ రోజుకొచ్చేసరికి 8,000% పెరిగింది.). నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం కొనసాగుతున్న వేళ.. విస్తృత యాప్‌గా పేరున్న డిస్కార్డ్(Discord) వీపీఎన్ సాయంతో అందుబాటులోకి తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఉన్నట్లు ఎండ్లెస్ ఫీడ్లు లేకుండా.. వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లతో Discord ఉండడం వల్లే దీనిని రైట్ఛాయిస్గా అక్కడి యువత భావించింది. అలా.. "Youth Against Corruption" అనే Discord సర్వర్‌లో 145,000 మందికి పైగా సభ్యులుగా చేరారు. ఈ సర్వర్‌లో చర్చలు, అనౌన్స్మెంట్స్, ఫ్యాక్ట్ చెక్, హెల్ప్లైన్లు వంటివి కొనసాగించింది. వారు ఏర్పాటు చేసిన Discord సర్వర్లలో ఇన్ఫర్మేషన్ సులభంగా పాసయ్యింది. పెద్ద సంఖ్యలో సభ్యులు చర్చలు జరిపేందుకు ఇదొ కీలక వేదికగా నిలిచింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.ఓటింగ్ కూడా.. నేపాల్ తాత్కాలిక నాయకత్వం విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని డిస్కార్డే తొలగించింది!. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, నేపాల్ పవర్ హౌజ్‌గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, రాపర్ బాలేంద్ర షా(బాలెన్), ఇలా పలువురి పేర్లతో ఓ డైలామా ఏర్పడగా.. డిస్కార్డ్ జరిగింది ఓటింగ్ ద్వారా స్పష్టత తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారానే ప్రతిపక్షాన్ని కూడా సమన్వయపర్చుకుని.. రాజకీయ అనిశ్చితిని తొలగించింది. ఈ ఓటింగ్‌ను పర్యవేక్షించిన శశ్వత్ లామిచ్ఛానే కూడా ఈ విషయాల్ని ధృవీకరించారు. ఇక డిస్కార్డ్లో ఓటింగ్ బుదవారం పూర్తైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 50 శాతం ఓట్లు సుశీల్ కార్కీకే పడ్డాయి. ఆ మరుసటి రోజు ఆమె నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీచీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను కలిశారు. అలా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎపిసోడ్లో ఉత్కంఠ వీడింది. అయితే.. ఇండియా టుడే ఓఎస్ఐఎన్టీ(Open-Source Intelligence) సర్వే ప్రకారం ఈ ఓటింగ్‌లో పాల్గొన్నవాళ్లంతా నేపాల్ పౌరులేనా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. భారత్‌లోనూ డిస్కార్డ్Discord ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అమెరికాలో దాదాపు 25 కోట్లు, బ్రెజిల్లో ఐదున్నర కోట్ల యూజర్లు ఉన్నారు. ఆ తర్వాత భారత్‌లోనూ ఐదు కోట్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తునన్నారు. ఈ లిస్ట్‌లో కెనడా, ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ విండోస్, మాక్ఓఎస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, లైనక్స్ వెబ్ బ్రౌజర్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 30కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది, అందులో తెలుగు మాత్రం లేదు. డిస్కార్డులో గేమింగ్ మాత్రమే కాదు.. పౌర ఉద్యమాలు, రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. సొంత సర్వర్‌తో క్రియేటివ్ కమ్యూనిటీలు నిర్మించుకునేందుకు వీలుగా ఉండడంతోనే ఇది సాధ్యమవుతోంది. అంత నిషేధంలోనూ Gen Z యువతకు డిస్కార్డ్ యాప్ ఒక గళం ఇచ్చింది. ఒకవేళ ఈ యాప్‌ను జెన్ జెడ్ యువత గనుక సమర్థవంతంగా ఉపయోగించుకుని గనుక ఉండి ఉంటే.. నేపాల్ ఉద్యమం అసంఘటితంగా, అస్పష్టంగా, మరింత హింసాత్మకంగా మారిపోయే అవకాశం ఉండేదేమో!. -
ఈ నెపో కిడ్స్ విలాసాలు.. చూస్తే మతిపోవాల్సిందే!
నేపాల్‌లో యువత ఆందోళనలు, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. గత వారంరోజులుగా సోషల్ మీడియాలో సమాంతరంగా ఇంకో ట్రెండ్ నడుస్తోంది. అదే పొలిటికల్ నెపో కిడ్స్‌కు వ్యతిరేకంగా సాగుతున్న క్యాంపెయిన్. అందుకే పరిశీలకులు.. నేపాల్ ఆందోళలను కేవలం అవినీతి వ్యతిరేక పోరాటంగానే కాకుండా యువత పట్ల గద్దెదిగిన ప్రభుత్వపు నిర్లక్ష్యం, సామాజిక అసమానతలపైనా తిరుగుబాటుగానూ విశ్లేషిస్తున్నారు. నెపో కిడ్స్.. నేపాల్ జనరేషన్ జెడ్ ఉద్యమానికి కేంద్ర బిందువైందన్న విషయం ఆశ్చర్యం కలిగించేదే. ఒకవైపు దేశంలో యువత నిరుద్యోగం, ఆయా కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతుంటే.. మరోవైపు రాజకీయ నేతల పిల్లలు మాత్రం విలాసాలకు పోయారు. సోషల్ మీడియా అకౌంట్లలో.. లక్షల రూపాయల విలువైన దుస్తులు, బ్యాగులు ధరించి ఫోజులు, విదేశీ విహారాలు, విలాసవంతమైన జీవనశైలిని రీల్స్.. ఫొటోల రూపంలో ప్రదర్శించుకున్నారు. ఈ హెచ్చుతగ్గులపై నేతలను నిలదీసేందుకు యువత అదను కోసం ఎదురు చూసింది. అప్పటిదాకా అవినీతిపైనే పోరాటం చేయాలనుకున్న వాళ్లకు.. సరిగ్గా ఆ సమయంలో సోషల్ మీడియా బ్యాన్ రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది.నేపాల్ ఆందోళనలతో అక్కడి యువతకు నెపో కిడ్స్ వ్యవహారాన్ని ప్రశ్నించేందుకు సరైన సమయం దక్కింది. తొలుత అందుబాటులో ఉన్న టిక్‌టాక్ లాంటి కొద్ది ప్లాట్‌ఫారమ్‌లలో వాళ్ల లైఫ్‌స్టైల్‌ను ఏకిపారేశారు. బ్యాన్ ఎత్తేశాక.. ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అలా.. #NepoBabiesNepal అనే హ్యాష్‌ట్యాగ్ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ జాబితాలో.. మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి కుమార్తె శ్రింఖల ఖటీవాడ, సింగర్.. మాజీ ప్రధాని షేర్ బహాదూర్ డెఉబా కోడలు శివానా శ్రేష్ఠ, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ "ప్రచండ" మనవరాలు స్మితా దహాల్, గండకి ప్రావిన్స్‌కు మాజీ మంత్రి బిందు కుమార్ థాపా కొడుకు సౌగత్ థాపాలు.. ఇలా మరికొందరిని తెరపైకి తెచ్చారు. అక్కడి కరెన్సీ ప్రకారం.. వీళ్లు వాడే వస్తువులు అత్యంత ఖరీదైనవే కావడంతో యువతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.వాళ్ల ఒంటి మీద దుస్తుల దగ్గరి నుంచి, వాళ్లు వాడే కార్లు, బ్యాగులు, పర్‌ఫ్యూములు, చివరకు ఆహార విషయంలోనూ ప్రదర్శించే విలాసాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ల వాళ్ల నివాసాలపై దాడులు చేసినప్పుడు ఆ లగ్జరీ వస్తువుల్ని కొందరు ఎత్తుకెళ్లిపోయారు. మరికొందరు ఆకతాయిలు ఆ లగ్జరీ గూడ్స్‌ను చూపిస్తూ.. ‘‘చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటూ’’ సెటైర్లు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో కొందరు తమ అకౌంట్లను, పేజీలను క్లోజ్ చేసేశారు. మరికొందరు పోస్టులు చేయకుండా ఉండిపోయారు. దాడులు చేస్తారనే భయంతో.. ఈ తరహా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో నేతల పిల్లల ఆస్తులపైనా దర్యాప్తు జరిపించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలా మొదలై..అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత.. ముఖ్యంగా Gen Z చేపట్టిన ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది. పోలీసుల వల్ల కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇది హింసాత్మకంగా మారడంతో.. 31 మంది ఆందోళనకారులు మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామం.. జెన్‌జెడ్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్న నినాదంతో.. కేబినెట్ మంత్రులు, మాజీ నేతల ఇళ్లపై దాడులకు దిగి తగలబెట్టారు. దొరికిన వాళ్లను దొరికినట్లు చితకబాదారు. దీంతో.. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సంక్షోభం తలెత్తినవేళ.. పరిస్థితి అదుపు తప్పకూడదనే ఉద్దేశంతో సైన్యం రంగంలోకి దిగింది. రాజధాని ఖాట్మండు సహా ప్రధాన నగరాల్లో కర్ఫ్యూలు విధించి పహారా కాస్తోంది. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఉద్యమకారుల నేతలకు మధ్య ఉండి ప్రభుత్వ ఏర్పాటు చర్చలను సైన్యమే ముందుకు తీసుకెళ్తోంది. రాజ్యాంగాన్ని తిరగరాసి సుపరిపాలన దిశగా అడుగు పడాలని, గత మూడు దశాబ్దాలుగా పాలకులు పాల్పడిన అవినీతిపై విచారణకు జరిపించాలని, అలాగే పోరాటంలో మరణించిన వాళ్లను అమరవీరులుగా గుర్తించి వాళ్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని జెన్‌జెడ్ యువత డిమాండ్లు చేస్తుండడం తెలిసిందే.పేదల బతుకులు చీకట్లతో తడిసిన వేళ..వెలుగుల్లో నేతల వారసులు విలాసాలు ఆరబోశారు! ఆవేదన అగ్గిలా మారి.. సమానత్వం కోసం గళం విప్పిందిఇక చాలు!" అని యువత నినదించగా.. పాలకుల పీఠాలు ఖాళీ అయ్యాయి.ఇది నేపాల్ ఉద్యమం కాదు.. అక్కడి ఒక తరం గుండె చప్పుడు -
దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది!
‘‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’’ నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు, దివంగత నూతన్‌ప్రసాద్ ఒకానొక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే కానీ.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఊహూ.. మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కానే కాదు. పాక్‌తో యుద్ధం.. లేదా అమెరికాతో టారిఫ్‌ల విషయం అంతకంటే కాదు. దీనికంటే కొంచెం సీరియస్ విషయం. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా. ఏమిటంటారా.. తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది!జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే కానీ.. అన్నివేళలా కాదు. ఎందుకంటే.. సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే.. దేశం ముసలిదైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్తా ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకీ విషయం అర్థమైపోతుంది. ‘‘మా దేశం రండి. ఉచితంగా ఇల్లిస్తాం. ఉద్యోగం వెతుక్కునేంతవరకూ నెలవారీ భృతి కూడా ఇస్తాం’’ అంటూ కొన్ని యూరోపియన్ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం..1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఆరుగురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి.. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు... బోలెడంత మంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే.. దేశ అవసరాల కోసం అనండి.. ఇంకో కారణం చేతనైనా కానివ్వండి ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది. ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారికంటే పుట్టే వారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌కు ఉన్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే.. పద్నాలుగేళ్ల లోపువారు 24 శాతం మంది ఉంటే పనిచేసే స్థితిలో ఉన్న వారు (15 - 64) వారు 68 శాతం మంది ఉన్నారు. మిగిలిన ఏడు శాతం మంది 65 ఏళ్లపైబడ్డ వృద్ధులు!అయితే ఏంటి?2050 నాటికి దేశంలో 65 ఏళ్లపైబడ్డ వారు మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంచనా. అంటే.. సుమారు 19 కోట్ల మంది పని చేసే స్థితిలో ఉండరు. వీరందని పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధివేటలో నగరాలకు మళ్లిపోవడం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. యూరోపియన్ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు (వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటివి)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
మూరెడు మల్లెపూలే కాదు.. వీటితోనూ తంటాలే!
మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటి నవ్య నాయర్‌కి ఆస్ట్రేలియాలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూరెడు మల్లెపూలు.. అదీ బ్యాగులో ఉన్నందుకే ఆమెకు ఆ ఫైన్ పడింది. ఈ చేదు అనుభవంపై ఆమె సైటైర్లు వేసుకుంటోంది కూడా. అయితే.. ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్‌పోర్టుకు ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాంగా పేరుంది. కేవలం మల్లపూలే కాదు.. మరికొన్ని వస్తువులను కూడా అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని మీకు తెలుసా?.. ఓనం ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన మల్లూ బ్యూటీ నవ్య నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన తండ్రి తచ్చిన మల్లెపూల మూరను ఆమె బ్యాగులో ఉంచుకుని ఎయిర్‌పోర్టులో దిగారు. అయితే.. మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడి అధికారులు ఆమెకు రూ.1.14లక్షల జరిమానా వేశారు. 28 రోజుల్లో ఆ జరిమానా కట్టాలని ఆమెకు స్పష్టం చేశారు. మల్లెపూల తరహాలో మూరెడున్న వంద కేటగిరీల వస్తువులపై అక్కడ నిషేధం అమల్లో ఉంది. అందులో.. తాజా, ఎండిన పూలు, తాజా పండ్లు, కూరగాయలు, మూలికలు, మసాలా దినుసులు, గింజలు, పాల సంబంధిత ఉత్పత్తులు, బర్ఫీ.. రసగుల్లా, రసమలై, గులాజ్జామూన్, మైసూర్ పాక్, సోన్‌పాపిడి ఇలా.. స్వీట్లు, బియ్యం, టీ, ఇంటి భోజనం, తేనే, పెంపుడు జంతువుల ఆహారం.. ఈకలు, ఎముకలు, చర్మం (సంబంధిత వస్తువులు కూడా!), చెట్లు.. జంతువుల నుంచి తయారు చేసిన మందులు, చివరకు.. విమాన, నౌకల ప్రయాణాల నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా అనుమతించరంతే. ప్రయాణికులు వీటిని తీసుకెళ్లడం అక్కడ నిషిద్ధం. వాటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. పైగా వాటి వల్ల పర్యావరణానికి హాని అని భావిస్తున్నారు. చివరకు.. మన పండుగలు పబ్బాలు ఉన్నాయని విజ్ఞప్తులు చేసుకున్నా కూడా వాళ్లు వినరు. అయితే మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్‌కు మాత్రం ఎందుకనో అనుమతిస్తారు!. నవ్య మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్‌లో మల్లెపూలును తీసుకువచ్చినందుకు జరిమానా విధించారు. అనంతరం మెల్బోర్న్లో జరిగిన ఓనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటి నవ్య తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను తీసుకువచ్చిన పూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించేవరకు తనకు తెలియదని చమత్కరించింది. కానీ, ఆస్ట్రేలియా సరిహద్దుల్లో నిషేధిత వస్తువులపై కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల ప్రకారం.. నిషేధిత/ప్రకటించని వస్తువులు (ఆహారం, మొక్కలు, జంతు ఉత్పత్తులు, ఔషధాలు) సరిహద్దులో పట్టుబడితే.. వెంటనే వాటిని ధ్వంసం చేస్తారు. ప్రయాణికులకు తక్షణ జరిమానాలు విధిస్తారు. విషయం తీవ్రమైందిగా భావిస్తే.. వీసా రద్దు చేస్తారు. మరింత తీవ్రమైందిగా అనుకుంటే.. తీవ్ర ఉల్లంఘనల కింద పరిగణించి జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ప్యాసింజర్ కార్డులో వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి. అప్పుడు.. అనుమతించని వస్తువులు తీసేసినా జరిమానా ఉండదు. లేకుంటే.. నవ్య నాయర్‌లా 15 సెం.మీ. మల్లెపూలకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నవ్యా నాయర్(ధన్య వీణ) 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుశా జిల్లాలో జన్మించారు. 2001లో ఇష్టం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు, ప్రధానంగా మలయాళ సినిమాల్లో.. ఆడపా దడపా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో జంటగా నటించిన నందనం అనే సినిమాలో నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ పొందిన నర్తకి, పలు స్టేజ్ షోలు కూడా చేశారు. 2010లో వ్యాపారవేత్త సంతోష్ మెనన్ను వివాహం చేసుకున్నారు.. ఈ జంటకు ఓ కుమారుడు. యాక్టింగ్‌తో పాటు టీవీ షోలు, రచనల ద్వారా కూడా ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంటున్నారు. -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్‌మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్‌జీపీటీ లాంటి ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్‌లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్‌బాట్‌ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్‌మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్‌మన్‌ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్‌లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్‌గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్‌తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్‌మన్‌ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్‌గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్‌లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్‌లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్‌లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్‌కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్‌గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్‌లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్‌మన్ పోస్ట్‌తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్‌ఫేక్‌లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్‌మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్‌బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్‌చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
టీచర్స్ డే.. ఆరోజులు మళ్ళీ రావు!
టీచర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, జీవితం ఎలా ఉండాలో చూపించే దారిదీపం.. ఇది ఇవాళ విపరీతంగా కనిపిస్తున్న ఓ కొటేషన్. వాట్సాప్‌లో స్టేటస్‌గా, ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్‌లతో తెగ వైరల్ అవుతోంది. డిజిటల్ యుగంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ మారిపోయిందనడానికి ఇదే ఒక రుజువు. కానీ.. నిజమైన టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో మీకు తెలుసా?టీచర్స్ డే అంటే గుర్తొచ్చేది.. ఒకానొక టైంలో స్కూళ్లలో జరిగిన అద్భుతమైన వేడుకలు. టీచర్ల కోసం దాచుకున్న, పేరెంట్స్‌ను అడుక్కున్న సొమ్ముతో కొనే గిఫ్ట్‌లు, ఫేవరెట్ టీచర్ల కోసం స్పెషల్‌గా రాసి.. గీసి తీసుకొచ్చే గ్రీటింగ్స్, వాళ్ల కోసం కొని తెచ్చే గులాబీ పువ్వులు.. బొకేలు, శాలువాలు, చాకెట్లు.. అబ్బో మామూలు హడావిడి నడిచేది కాదు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. బడి పిల్లలే టీచర్ల అవతారం ఎత్తి పాఠాలు బోధించడం గురించి. టీచర్స్ డే.. స్టూడెంట్స్ టీచర్లుగా మారి పాఠాలు చెప్పేవారు. అబ్బాయిలు ప్యాంట్షర్టులు.. పంచెలు, అమ్మాయిలు చీరలు, ప్రిన్సిపాల్ గెటప్‌కు సూట్ బూట్ స్పెషల్‌గా వచ్చేవాళ్లు. టీచర్లు హాయిగా విశ్రాంతి తీసుకుని.. నవ్వుతూ, ఆటలాడుతూ సందడిగా గడిపేవారు. విద్యార్థులు టీచర్ల వేషాలు వేసుకుని, బోధనలో తాము నేర్చుకున్నదాన్ని తిరిగి చూపించేవారు. ఆ సమయంలో టీచర్లనూ అనుకరించేవాళ్లు. అలా బడులలో ఒక పండుగ వాతావరణం కనిపించేది. అయితే ఈ ఒక్కరోజు మార్పు.. ఒక ఆట కాదు. గురుపూజోత్సవం ఉద్దేశం వేరు. గురువుల బాధ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం. టీచర్ అంటే మనల్ని భయపెట్టే వ్యక్తి కాదు.. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి అని తెలియజేసేది. ఆ అనుభవం విద్యార్థుల్లో గౌరవం, కృతజ్ఞత, నైతికత పెంచేది. నేను చదివిన బడిలో నాలుగేళ్లపాటు టీచర్స్ డే రోజున.. ‘సార్’గా మారిపోయాను నేను. అందులో.. పదో తరగతి చదివే టైంలో మా క్లాస్ వాళ్లకే పాఠాలు చెప్పాల్సి రావడం నన్ను ఎంతో ఎగ్జయిట్ చేసింది. నీట్‌గా టక్ చేసుకుని.. సోషల్ బుక్ చేతిలో పట్టుకుని.. పైకి గంభీరంగా బిల్డప్ ఇచ్చినా, లోపల మాత్రం ఉప్పొంగే ఆనందంతో తరగతి గదిలో అడుగుపెట్టాను. సీరియస్‌గా పాఠం చెబుతూ.. మధ్యలో ప్రశ్నలు అడుగుతూ, చాక్‌పీస్ ముక్కలను వాళ్లపైకి విసురుతూ.. ఆన్సర్ చెప్పనివాళ్లకు పన్మిష్మెంట్ కూడా ఇస్తూ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. ‘‘ఆగరా.. రేపు నీ పని చెప్తాం’’ అంటూ నా ఫ్రెండ్స్ నావైపు చూసిన గుర్రుచూపు ఇప్పటికీ నాకు గుర్తు. అరేయ్.. నిజంగా టీచర్లా చేస్తున్నావ్ కదరా అంటూ మా హెడ్ మాస్టర్, టీచర్లు ఇచ్చిన కాంప్లిమెంట్లు, ఆరోజు సాయంత్రం నాకు బెస్ట్ టీచర్‌గా ఇచ్చిన షీల్డ్.. ఏనాటికి మరిచిపోలేను. నాకే కాదు.. మీలోనూ ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు. ఈరోజుల్లో.. అలాంటి వేడుకలు కొంత తగ్గినట్లే అనిపిస్తుంది. టెక్నాలజీ, విద్యావిధానాలు కారణాలు ఏమైనా కావొచ్చు. ఇప్పుడు అలాంటి అనుభవాలు తగ్గిపోయాయి. టీచర్స్ డే అంటే ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లా.. స్కూల్ ఈవెంట్‌లా అతికష్టంలా కనిపిస్తోంది. టీచర్స్ డే వేడుకలు సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోతున్నాయి. ఎంతైనా ఆరోజులే వేరు.. బడిలో మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గురువు ఉంటారు. వారు చూపిన దారే మన ప్రయాణానికి మార్గదర్శకంగా మారుతుంది. అలాంటి వ్యక్తులకు ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఫోన్‌కాల్, ఒక చిన్న “థ్యాంక్యూ” కూడా వాళ్ల హృదయాన్ని తాకొచ్చు. ఇట్లు.. ఓ నిత్యవిద్యార్థి -
A23A: ముక్కలై.. మెగా టైటిల్‌ను కోల్పోయి!
ఈ భూమ్మీద ఏదీ శాశ్వతం కావన్నాడు ఓ కవి. ప్రభుత్వాలు, పదవులు, ఘనతలు, రికార్డులు.. రోజులు, ఏండ్లు దొర్లే కొద్దీ కొత్తదనానికి అనుగుణంగా మార్పునకు లోనవుతుంటాయి. A23a విషయంలోనూ ఇప్పుడు అదే జరిగింది. ఆరు ముంబై మహానగరాలు కలిస్తే ఎలా ఉంటుందో.. ఆ సైజులో ఉండి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఈ ఐస్‌బర్గ్ హఠాత్తుగా ముక్కలైంది.అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి 1986 ఆగష్టులో విడిపోయింది. అప్పటి నుంచి 34 ఏళ్లుగా అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అయితే 2020 నుంచి వెడ్డెల్ సముద్రం పశ్చిమం వైపు అది నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కిందటి ఏడాది జనవరిలో అది సుడిగుండంలో చిక్కుపోయింది. అయితే అనూహ్యంగా డిసెంబర్ మధ్యలో అది అక్కడి నుంచి బయటపడింది.బలమైన గాలుల ప్రభావమే దాన్ని అక్కడి నుంచి బయటపడేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అటుపై యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ దీనిని ఈ భూమ్మీద అతిపెద్ద ఐస్‌బర్గ్🧊గా ప్రకటించింది. ఒక చిన్న ద్వీపం పరిమాణంలో ఉండి, ట్రిలియన్ టన్నుల బరువుతో.. ప్రపంచంలో నీటిపై తేలియాడుతూ అతిపెద్ద మెగా ఐస్బర్గ్గా గుర్తింపు దక్కించుకుంది.ఆ టైంలో సుమారు 4వేల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ఐస్‌బర్గ్.. బ్రిటీష్ సరిహద్దుల వైపు ప్రయాణించడాన్ని శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనించారు. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌత్ జార్జియాను అది ఢీ కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది ముక్కలైనట్లు సైంటిస్టులు గురువారం ప్రకటించారు. రాబోయే మరికొన్ని వారాల్లో అది మరిన్ని ముక్కలు కావొచ్చని చెబుతున్నారు.మెగా టైటిల్ దానికే..A23A ముక్కలు కావడంతో మెగా ఐస్‌బర్గ్ టైటిల్ కోల్పోయింది. అమెరికాలోని రోడ్ ఐల్యాండ్ స్టేట్ పరిమాణంలో ఉండేది.. ఇప్పుడు టెక్సాస్ స్టేట్‌లోని హ్యూస్టన్ పరిమాణానికి పడిపోయింది. దాని ముక్కలకు.. ఏ23డీ, ఏ23ఈ గా నామకరణం చేశారు. దీంతో.. బ్రిటన్ డీ15ఏ ప్రపంచంలోని అతిపెద్ద ఐస్‌బర్గ్ ఘనతను సొంతం చేసుకుంది.D15A ఐస్‌బర్గ్ అనేది అంటార్కిటికాలోని అమేరీ ఐస్ సెల్ఫ్ Amery Ice Shelf నుంచి విడిపోయిన భారీ మంచు పర్వతం. ఇది మొదటగా D15 అనే పేరుతో గుర్తించబడింది, కానీ 2016లో ఇది రెండు భాగాలుగా విడిపోయింది. ఇందులో D15A అతిపెద్ద భాగం. D15B అతి చిన్న భాగం. D15A పరిమాణం.. పొడవు: 51 నాటికల్ మైళ్ళు, వెడల్పు: 24 నాటికల్ మైళ్ళు. ఇది సుమారు 3,000 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. అంటే గోవా రాష్ట్రం అంత పరిమాణం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. D15A స్థిరంగా ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులు, సముద్రపు వేడి నీరు, మరియు అలల ప్రభావం వల్ల దీని భవిష్యత్తు కూడా అనిశ్చితంగా ఉంది.A68a గురించి..ఏ68ఏ.. A23a కంటే ముందు ప్రపంచంలో మెగా ఐస్బర్గ్గా రికార్డుల్లో నమోదైంది. పరిమాణంలో లండన్ నగరం కంటే మూడు రెట్లు పెద్దది. బరువు ఒక ట్రిలియన్ టన్నులుగా ఉండేదని అంచనా. ఇది కూడా సౌత్ జార్జియాను ఢీ కొట్టవచ్చని అప్పట్లో ఆందోళన చెందారు. అయితే.. ఐల్యాండ్‌కు సరిగ్గా వంద మైళ్ల దూరంలో ఉండగానే దానికి భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆపై అది సముద్రంలోనే కరిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఏం జరగొచ్చు?ఏ23ఏ ముక్కలు కావడం అనేది కొత్త విషయం ఏం కాదని.. అదే సమయంలో ఆసక్తికరమైన అంశమేనని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన శాస్త్రవేత్త టెడ్ స్కాంబోస్ చెబుతున్నారు. తుపానులు, అలలు A23A అనే భారీ హిమపర్వతాన్ని బలహీనపరిచాయని, దాని లోపల ఉన్న చీలికలను బయటపెడుతూ వచ్చిందని అంటున్నారు. ఇక.. మీజర్స్ అనే మరో శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం.. త్వరలోనే ఇదిట్రాక్ కూడా చేయలేనంత చిన్న ముక్కలు కావొచ్చని అంటున్నారు. అయితే..వేసవి ముగిసే దాకా ఆ A23A ముక్కలు అలాగే ఉంటే మాత్రం.. ముప్పు తప్పదని స్కాంబోస్ అంటున్నారు. వేడి నీరు కారణంగా ఒక్క రోజులోనే అది మంచు పర్వతం కుప్పకూలినట్లుగా విరిగిపోవచ్చు అని చెప్పారాయన. ఇదిలా ఉంటే.. మంచుపర్వతాలు విరిగిపోవడం వల్ల నేరుగా సముద్ర మట్టం పెరగదు. కానీ ఐస్ షెల్ఫ్‌లు చిన్నవిగా మారితే.. భూభాగంపై ఉన్న మంచు వేగంగా కరిగి సముద్రంలో కలిసే అవకాశం ఉంటుంది, ఇది సముద్ర మట్టం పెరగడానికి కారణమవుతుంది. -
అంతగా అక్కడ ఏం నచ్చింది జక్కన్న?
ఎస్ఎస్ రాజమౌళి.. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ చిత్రం.. భావోద్వేగ దృశ్యవిచిత్రమే. భారీ స్థాయిలో నిర్మాణం.. అద్భుతమైన హీరోయిజం.. హైస్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆయన చెక్కే చిత్రాలు.. ప్రపంచం మొత్తం భారత చలనచిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేశాయి. అయితే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్‌పై ఇప్పుడు ఆయన దృష్టి పడింది.జక్కన్న ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుతో (SSMB 29) ఓ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో షూటింగ్ చేసుకుంటోందీ చిత్రం. ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మూవీ టీమ్ మర్యాదపూర్వకంగా కలిస్తే.. ఆసక్తికర విషయాన్నే ఆయన తెలియజేశారు.Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents. Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025రాజమౌళి రెండు దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. చాలా శక్తివంతమైన కథనాలను, దృశ్యాలను, లోతైన సాంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి 120 మందితో కూడిన రాజమౌళి టీమ్ కెన్యాను ఎంచుకుంది. మసాయి మరా మైదానాల నుంచి మొదలు సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో భాగం కాబోతున్నాయి.సుమారు 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే అవకాశం ఉంది. కెన్యాలో షూటింగ్ చేయడం ఒకమైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని, సుందర దృశ్యాలను చూపడంలో ఈ సినిమా శక్తిమంతంగా పనిచేయనుంది. ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో గర్వంగా ఉంది అని ట్వీట్ చేశారాయన. సో.. మహేష్ సినిమాతో సరికొత్త ప్రపంచాన్నే ఆవిష్కరించేందుకు రాజమౌళి సిద్ధమయ్యారన్నమాట. మరి అంతగా ఆయన్ని ఆకర్షించిన విషయాలు అక్కడేం ఉన్నాయి?..కెన్యాలోని మసాయి మరా, లేక్ నైవాషా, అంబోసెలీ నేషనల్ పార్క్.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రకృతి, వన్యప్రాణి, సఫారీ గమ్యస్థానాలు. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తే..మసాయి మరా నేషనల్ రిజర్వ్ (Masai Mara National Reserve).. బిగ్ ఫైవ్‌కు ఆవాసం. అంటే.. సింహం, చిరుతపులి, ఏనుగు, గేదె, రైనోలు ఇక్కడ నివసిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూలై-అక్టోబర్ మధ్యలో లక్షలాది వన్యప్రాణులు (విల్డీబీస్ట్, జెబ్రాలు) టాంజానియాలోని సెరెంగెటి నుంచి మసాయి మరాకు వలస వస్తాయి.సుమారు 500కి పైగా పక్షుల జాతులు ఆవాసం ఉన్నట్లు అంచనా. ఉదయం, సాయంత్ర వేళల్లో గేమ్ డ్రైవ్‌లు ద్వారా వన్యప్రాణులను దగ్గరగా చూడొచ్చు.అంబోసెలీ నేషనల్ పార్క్ (Amboseli National Park).. ఆఫ్రికాకు మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంగా పేరున్న కిలిమంజారో పర్వతశ్రేణి నేపథ్యంగా కనిపిస్తుంది ఈ పార్క్. ఆఫ్రికన్ ఏనుగుల గుంపులకు ఇది ఎంతో ప్రసిద్ధి. సింహాలు, చిరుతలు, జిరాఫీలు, జీబ్రాలు అనేక ఇతర జాతులు కనిపిస్తాయి. పొడి ప్రాంతం అయినప్పటికీ ఇక్కడి నీటి వనరులు వన్యప్రాణులకు ఆకర్షణగా నిలుస్తాయి.లేక్ నైవాషా (Lake Naivasha).. అనేక రకాల పక్షులు, నీటిలో నివసించే వన్యప్రాణులతో ఈ సరస్సు జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంటుంది. ప్రైవేట్ అభయారణ్యం.. క్రెసెంట్ ఐల్యాండ్‌లో జిరాఫీ, జీబ్రాలు, ఇతర మృగాలు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. దీంతో ఫొటోగ్రాఫర్లు, నేచర్ లవర్స్‌కి ఇదొక స్వర్గధామం. నైవాషా ఐకానిక్ సరస్సులో హిప్పోలు(నీటి ఏనుగులు), పక్షుల రాకపోకలతో కనువిందు చేసే దృశ్యాలను చూడటానికి బోటు ప్రయాణాలు అందుబాటులో ఉన్నాయి.ఈ మూడింటితో పాటు అరుదైన జాతుల వన్యప్రాణుల ఆవాసం సంబురు (Samburu)లోనూ చిత్రీకరణ జరగవచ్చని తెలుస్తోంది. గ్రెవీస్ జెబ్రా (Grevy's Zebra), సోమాలీ ఆస్ట్రిచ్ (Somali Ostrich), రెటిక్యులేటెడ్ జిరాఫీ (Reticulated Giraffe), బేసియా ఒరిక్స్ (Besia Oryx), గెరెనుక్ (Gerenuk) ఈ ఐదు అరుదైన జాతుల వల్ల ఈ ప్రాంతాన్ని ‘సంబురు స్పెషల్ ఫైవ్’ అని పిలుస్తారు. వన్యపప్రాణి పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లకు ఇది వరల్డ్ ఫేవరెట్ స్పాట్‌గా పేరుంది.భారతీయ చిత్ర పరిశ్రమ.. కెన్యా అడవులను ప్రధాన లొకేషన్‌గా ఎంచుకోవడం ఇదే మొదటిసారి!!. పైగా మసాయి మరా, అంబోసెలీ, లేక్ నైవాషా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో, వన్యప్రాణులతో నిండి కెన్యా సఫారీకి ఇవి ఒక కంప్లీట్ ప్యాకేజీగా ఉన్నాయి. దీనికి తోడు చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఒక రగ్డ్ ఎక్స్‌ప్లోరర్ రోల్లో కనిపిస్తారని.. అరుదైన ఔషధం కోసం వెతుకుతూ అడవుల్లో ప్రయాణిస్తారనే స్టోరీ లైన్ ఒకటి తెరపైకి వచ్చింది. సో.. ఈ తరహా కథకు పురాతనమైన.. మనిషి నియంత్రణలో లేని అడవులు(అన్టేమ్డ్) అవసరమని రాజమౌళి అనుకుని ఉండొచ్చు. పైగా కెన్యా లాంటి దేశం భారతీయ సినిమాకు కొత్త వేదికగా నిలవడమే కాకుండా పాన్ వరల్డ్ ప్రేక్షకులనూ ఆకట్టుకునే ప్రయత్నం కూడా. మొదట్లోనే చెప్పుకున్నట్లు.. లార్జర్ దెన్ లైఫ్ అనిపించాలంటే విలక్షణమైన కెన్యా దేశపు లొకేషన్లు ఈ విజన్‌కు సరిపోతాయి అని జక్కన్న ఫిక్స్ అయి ఉండొచ్చు. -
చైనా-భారత్-పాక్.. కనివినీ ఎరుగని రీతిలో విధ్వంసం!
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే.. భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.ఇక.. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్‌లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు. చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అంటే..మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్‌లో ఈ సీజన్లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ✅ పరిష్కార మార్గాలు• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. -
మరో అద్భుతం భారతీయ రైల్వే ఖాతాలో..
ఈ మధ్యకాలంలో ఇండియన్ రైల్వేస్ ఎన్నో అద్భుత ఘట్టాలను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్, పొడవైన రైల్వే టన్నెల్, చారిత్రక పాంబన్ బ్రిడ్జ్.. ఇలాంటి నిర్మాణాల తర్వాత ఇప్పుడు మరో ‘వావ్’ ఫీట్‌ను సాధించింది. అదే.. దేశంలోనే అత్యంత పొడవైన గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ పూర్తి చేయడం. కట్నీ జంక్షన్లో ఇంజినీరింగ్ అద్భుతం.. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జంక్షన్ వద్ద ఈ గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జ్ మొత్తం 33.40 కిలోమీటర్లు పొడవు. ఇందులో ఒకటి "అప్" ట్రైన్ల కోసం (ఇప్పటికే పూర్తయింది). మరొకటి "డౌన్" ట్రైన్ల కోసం.. ఇది 17.52 కిలోమీటర్ల పొడవుతో ఇంకా నిర్మాణంలో ఉంది. అప్ బ్రిడ్జ్‌ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) ఆమోదించారు. దీంతో అతిత్వరలోనే ఇది ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం.. 15.85 కిలోమీటర్ల పొడవుతో, ఫిల్లర్లపైనే నిర్మించిన ఈ ఎలివేటెడ్ ట్రాక్ నగరాన్ని పూర్తిగా మళ్లించి ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ అంటే.. రవాణా మార్గాలు (రోడ్లు, రైల్వేలు) ఒకే స్థాయిలో కాకుండా, వేర్వేరు ఎత్తుల్లో నిర్మించడమన్నమాట. తద్వారా వాటి మధ్య రాకపోకలలో అంతరాయం లేకుండా చేయొచ్చు. అంటే.. సిగ్నల్స్ లేకుండా ప్రయాణించగలవు. తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో పూర్తి కావాలనే టార్గెట్ ఉంది. గతి శక్తి పథకంలో భాగంగా.. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి పథకంలో భాగంగా చేపట్టబడింది. "అప్ లైన్" సెపరేటర్ నిర్మాణ ఖర్చు ₹580 కోట్లు కాగా, రెండు సెపరేటర్ల మొత్తం ఖర్చు రూ.1,247.68 కోట్లుగా అంచనా.ట్రాఫిక్ తగ్గింపు, సమయపాలన మెరుగుదల.. దేశంలోనే అతిపెద్ద రైల్వే జెంక్షన్ యార్డ్‌గా న్యూ కట్నీకి పేరుంది. గూడ్స్ & ప్యాసింజర్ ట్రైన్ల అధిక రాకపోకల వల్ల నిత్యం ఇక్కడ తీవ్ర రద్దీ నెలకొంటోంది. తద్వారా రైళ్ల రాకపోకలపై ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. అయితే.. తాజా గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ వాడకంలోకి వస్తే ఈ సమస్య తొలిగిపోనుంది. అదెలాగంటే.. సింగ్రౌలి, బిలాస్పూర్ నుంచి వచ్చే ట్రైన్లు ఇక న్యూ కట్నీ జంక్షన్(కట్నీ ముద్వారా) వద్ద ఆగాల్సిన అవసరం లేదు. కోటా, బీనా వైపు వెళ్లే ట్రైన్లకు ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. అంటే.. వెస్ట్ సెంట్రల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేజోన్ల నుంచి వచ్చే రైళ్ల రాకపోకలు సునాయసంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రయాణ సౌలభ్యం, సరుకు రవాణా మెరుగుదల.. కట్నీని మళ్లించే ట్రైన్లు ఇక నాన్ స్టాప్‌గా ప్రయాణించగలవు. ధన్‌బాద్, గయా, ముజఫర్‌పూర్ వంటి నగరాలకు వెళ్లే ప్రత్యేక ట్రైన్లు కూడా హాల్టింగ్ లేకుండా ముందుకు వెళ్తాయి. అదనంగా.. పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా సకాలంలో జరిగేందుకు వీలు కల్పించనుంది. నిర్మాణంలో వినియోగించిన వనరులు15,000 టన్నుల స్టీల్1.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్1.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టినాలుగు Rail Over Rail (ROR) బ్రిడ్జ్‌లు, వాటిలో పొడవైనది 91.40 మీటర్లుఈ అద్భుతమైన నిర్మాణం భారత రైల్వేలు సాధించిన మరో ఘనతగా నిలిచింది. దేశ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. -
శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం
వచ్చే పదేళ్లనాటికి దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు రక్షణ కల్పించే సాంకేతిక ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మిషన్‌కు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రగా పేరు పెడుతున్నట్లు చెప్పారు. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతంగా భావించబడే.. పరమ పవిత్రమైనదిగా పూజలు అందుకునే సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి ఎలా చేరిందో తెలుసా?.. వామన, లింగ పురాణాల్లో సుదర్శన చక్రం కథ భాగాన్ని చూడొచ్చు. శ్రీదాముడు అనే రాక్షసుడు అహంకారంతో విర్రవీగుతూ దైవ శక్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో.. ధర్మ విరుద్ధంగా లక్ష్మీదేవిని వశపరచుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు.. శ్రీమహావిష్ణువు పరమశివుడి శరణు వేడుతాడు. అయితే అప్పటికే కైలాసగిరిలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. దీంతో కార్తీక శుక్ల చతుర్దశి నాడు శివుడిని పూజించేందుకు విష్ణువు కాశీకి వెళ్తాడు. వెయ్యి బంగారు పద్మాలతో శివుడిని పూజించాలనుకుంటాడు విష్ణువు. అయితే విష్ణువుకు భక్తి పరీక్ష పెట్టాలని.. అందులో ఓ పద్మాన్ని శివుడు మాయం చేస్తాడు. దీంతో.. కమల నయనుడిగా పేరున్న నారాయణుడు తన కంటినే తామర పువ్వుగా శివుడికి సమర్పించేందుకు సిద్ధమవుతాడు.విష్ణువు భక్తిని చూసి శివుడు ఆనందించి.. శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో.. ‘‘ధర్మ రక్షణ కోసం ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది. మూడు లోకాల్లో దీనికి సాటి ఆయుధం లేదు’’ అని శివుడు చెబుతాడు. అయితే ఆ చక్రం శక్తిని పరీక్షించదలిచి.. తొలుత శివుడిపైనే ప్రయోగించే వరం కోరతాడు విష్ణువు. అందుకు శివుడు సంతోషంగా అంగీకరిస్తాడు. మహా విష్ణువు సంధించిన సుదర్శన చక్రం శివుని మూడు భాగాలుగా ఖండిస్తుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. ఈ చక్రం తన రూపాలను ఖండించగలిగింది గానీ తత్వాన్ని కాదని చెబుతాడు. సుదర్శన చక్రాన్ని శ్రీదాముడిని సంహరించేందుకు ఉపయోగించమని సూచిస్తాడు. మహావిష్ణువు అలాగే చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. మహావిష్ణువు అవతారం కాబట్టే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ కోసం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి చేరింది.ఒక్కసారి సంధిస్తే..సూర్య భగవానుడి తేజస్సు కలిగిన సుదర్శన చక్రం హిందూ పురాణాలలో మహావిష్ణువు చేతిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది. అందుకే దీనిని సుదర్శనం అంటారు. రెండు వరుసల్లో పదునైన పళ్లతో గుండ్రటి ఆకారంలో ఉంటుంది. భక్తుల కంటిని ఇది ఆభరణమే. కానీ, ధర్మాన్ని రక్షించేందుకు దుష్టసంహారంలో శిక్షాయుధంగా ఇది ప్రయోగించబడింది. ఒక్కసారి సంధిస్తే.. లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంత వరకు వెనక్కి రాదు. చక్రానికి ఉన్న ఆ ముళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వల్ల వేగంగా తిరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలోని ఏవైనా పదార్థాలను అతి పదునైన అంచులతో తేలికగా కత్తిరించగలదని ప్రశస్తి. అయితే.. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు.. భక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. సుదర్శన చక్రాన్ని ధ్యానించడం వల్ల శాంతి, సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి.సుదర్శనోపనిషత్తు ప్రకారం.. సుదర్శన చక్రాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారుచేశాడు. విశ్వకర్మ తన కూతురు సంజనాను సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని తేజస్సు మూలంగా ఆమె ఆయన్ని చేరలేకపోతుంది. ఇది గమనించిన విశ్వకర్మ.. సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అప్పుడు రాలిన పొడితో.. పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం తయారు చేశాడు.సుదర్శన చక్రం సంహారాలుశ్రీదాముడితో పాటు హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు(శివుని మూడు ఖండాలు) అనే రాక్షసులను సుదర్శన చక్రం ద్వారా మహావిష్ణువు సంహరించినట్లు వామన పురాణంలో పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో.. శ్రీకృష్ణుడు నూరు పాపాలు చేసిన శిశుపాలుడిని సుదర్శన చక్రంతోనే సంహరించాడు. జరాసంధుడు, కంసుడు, నరకాసురుడు కూడా సుదర్శన చక్రంతోనే మరణించారు. ఇవేకాదు.. పురాణా ఇతిహాసాల్లో సుదర్శన చక్రం చుట్టూ అల్లుకున్న సందర్భాలు ఇంకెన్నో. అయితే.. సుదర్శన చక్రం భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉంది?.. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత సుదర్శన చక్రం తిరిగి విష్ణువుకు చేరిందని విశ్వాసం. ఇది భౌతికంగా కనిపించదుగానీ కాదు.. ఆధ్యాత్మికంగా విశ్వంలో ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతోంది.అన్నమయ్య నోట.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున సుదర్శన చక్రానికి చక్రస్నానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సుదర్శన చక్రంపై ప్రత్యేకంగా కీర్తనలు రచించారు. అందులో “చక్రమా హరిచక్రమా” అనే పద్యం ప్రసిద్ధి పొందింది. విశాఖపట్నం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుదర్శన చక్రానికి అంకితంగా “సుదర్శన హోమం” నిర్వహించబడుతుంటుంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయం ఉంది. -
పాట వచ్చి 28 ఏళ్లైనా పవర్ ఏమాత్రం తగ్గలేదు
ఆ పాట.. మన దేశాన్ని ప్రేమించమని చెప్పే పాట. అందులోని సంగీతం.. దేశాన్ని చూపే చూపును మార్చేసిన ఒక భావోద్వేగం. అది వింటున్నప్పుడు ప్రతీ భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. దేశం పట్ల ప్రేమను పదే పదే గుర్తు చేస్తుంది. అందుకే అదొక కాలాతీత గీతమై.. కోట్లాది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రెహమాన్ Vande Mataram ఆల్బమ్.. 28 ఏళ్ల తర్వాత కూడా నేటికి అదే ఉత్సాహంతో, అదే గర్వంతో దేశమంతటా మార్మోగుతోంది.అప్పటికే సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏఆర్ రెహమాన్‌కు ఐదేళ్లు అయి ఉంటుంది. కానీ, ఆ తక్కువ కాలంలోనే అతని సంగీతానికి దేశం చికుబుక్ రైలే అంటూ చిందులేస్తోంది. సరిగ్గా.. అదే సమయంలో సోనీ మ్యూజిక్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. లోకల్ టాలెంట్‌ను ఇంటర్నేషనల్‌గా ప్రమోట్ చేసే ప్రయత్నంలో.. తొలిగా రెహమాన్‌తో మూడు ఆల్బమ్స్ కోసం ఒప్పందం చేసుకుంది. అలా పుట్టిందే.. వందేమాతరం ఆల్బమ్. స్నేహితుడి ఆలోచనతో.. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆత్మలు.. యాడ్ ఫిల్మ్మేకర్లు భారత్ బాలా, కనికా. రెహమాన్‌కు బాలా బాల్యమిత్రుడు. అతని సలహా మేరకే సోనీ కంపెనీ తొలి అల్బమ్‌గా దేశభక్తి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు రెహమాన్. పైగా బాలా తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్ల, ఈ పాటకు ఆయన ఎమోషనల్‌గా ఎంతో కనెక్ట్ అయ్యారు. బాలా, కనికలు తల్చుకుంటే స్టైలిష్ ఆల్బమ్ అయ్యి ఉండేది. కానీ, 50 ఏళ్ల స్వతంత్ర భారతావని ఆత్మను చూపించాలని నిర్ణయించుకున్నారు వాళ్లు. అలా ఈ వీడియో కోసం దేశం నలుమూలలకు తిరిగారు. హిమాలయాల శిఖరాల నుంచి.. తమిళనాడులోని గ్రామాల వరకు.. భారతదేశం యొక్క అసలైన రూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. దేశం నలుమూలల అందాలను, ప్రజల జీవనశైలిని, సంస్కృతిని చూపిస్తూ ఈ పాటకు రూపం ఇచ్చారు. లండన్‌కు చెందిన యాక్ బోండీ ఈ పాటకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. పాకిస్తానీ సూఫీ సింగర్ నుస్రాత్ ఫతేహ్ అలీ ఖాన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాడు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఆనాడు లేవు కాబట్టి రెహమాన్‌కు ఎలాంటి ఆటంకాలు.. విమర్శలు ఎదురు కాలేదు. ఈ ఆల్బమ్‌కు కాన్సెప్ట్ అందించడంతో పాటు దర్శకులుగా భారత్ బాలా, కనికాలు వ్యవహరించారు. రెహమాన్ సహదర్శకత్వం వహించాడు. పాటకు హిందీలో సాహిత్యాన్ని అప్పటికే తనతో రంగీలా, దావూద్ చిత్రాలకు పని చేసిన గేయ రచయిత మెహబూబ్‌కు అప్పగించాడు. అలాగే.. తమిళ్ వెర్షన్ థాయి మన్నే వణ్ణక్కంకు సీనియర్ గేయరచయిత వైరముత్తు సాహిత్యం అందించారు. పాటలో వినిపించే ప్రతి పదం.. సంగీతంలోని ప్రతి నోటు.. భారతదేశం పట్ల గౌరవాన్ని, ప్రేమను, గర్వాన్ని వ్యక్తపరిచేలా ఉండేలా చూడాలని రెహమాన్ ఆ ఇద్దరికి విజ్ఞప్తి చేశాడు. అలా ఆ పాట సిద్దమైంది.. కర్లీ జుట్టుతో ఆ పాటలో స్వయంగా రెహమానే నటించారు. కనిక, భరత్ బాలా(ఫైల్ ఫొటోలు) 1997 ఆగస్టు.. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 50 ఏళ్ల సందర్భం. స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు.. మా తుజే సలాం అనే పాట క్యాసెట్ల రూపంలో విడుదలైంది. దేశభక్తికి ఒక శక్తివంతమైన ప్రతీకగా మారడానికి ఈ పాటకు ఎంతో సమయం పట్టలేదు. రోజుల వ్యవధిలోనే దేశంలోనే బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఇంకోవైపు.. విజువల్స్ ఆల్బమ్ ఆరోజుల్లో తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదే సమయంలో.. దేశభక్తిని కమర్షియల్‌గా మార్చారనే విమర్శలు వచ్చాయి. పాటకాపీ రైట్పైనా కొన్ని వివాదాలు నడిచాయి. కానీ, వాటంటిన్ని దాటుకుని ‘మా తుజే సలాం’.. దేశ ప్రజల గుండెను తాకింది. అప్పటి నుంచి గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలప్పుడు టీవీ చానెల్స్ల్లో, విద్యాసంస్థల్లో, మైక్సెట్లలో, రేడియో..ఎఫ్ఎం స్టేషన్లలో, ఆఖరికి ఇప్పుడు రీల్స్ రూపంలో పిల్లల వాయిస్‌తో వినిపిస్తున్న రీమిక్స్గానూ మారుమోగుతోంది. విడుదలై 28 ఏళ్లు అవుతున్నా.. రెహమాన్ ‘వందేమాతరం’ పవర్ ఏమాత్రం తగ్గలేదు. ఇది కేవలం పాట, సంగీతం కాదు.. ఇది భారతీయతకు అద్దం.:::వెబ్ డెస్క్ స్పెషల్VIDEO Credits: SonyMusicIndiaVEVO -
Tsunami waves: చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ
సునామీ.. 2004 డిసెంబర్ 26వ తేదీన హిందూ మహాసముద్ర తీర దేశాల్లో విధ్వంసం సృష్టించే దాకా ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా రష్యాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఫసిఫిక్ తీరంలోని 30 దేశాలు గజగజ వణికిపోతున్నాయి. రాకాసి అలలు తీర ప్రాంతాలను ఇప్పటికే పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో చరిత్ర ఇప్పటిదాకా చవిచూసిన శక్తివంతమైన సునామీ ఏదో చూద్దాం.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్.. భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం. ఈ రీజియన్‌లో ఉన్న రష్యా కామ్చట్కా ద్వీపకల్పం వద్ద రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రత భూకంపం సంభవించి.. పసిఫిక్ తీర దేశాల అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్, అలాస్కా, హవాయి వంటి ప్రాంతాల్లో అలలు 3-4 మీటర్ల(9-13 అడుగుల) ఎగసిపడ్డాయి. ప్రపంచంలో ఇప్పటిదాక సంభవించిన శక్తివంతమైన భూకంపాల లిస్ట్‌లో.. ఇవాళ్టి రష్యా భూకంపానికి ఆరో స్థానం దక్కింది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సునామీల జాబితాను ఓసారి పరిశీలిస్తే.. 2004.. ఇండోనేషియా (సుమాత్రా)లో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం. ఈ భూకంపం ధాటికి సునామీ 13 దేశాల తీరాలను ముంచెత్తి 2,30,000 మందిని బలిగొంది. 2011.. 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్ (టోహోకు) తీరాన్ని ముంచెత్తించింది. ఈ ధాటికి ఫుకుషిమా అణు ప్రమాదం సంభవించడంతో పాటు 18,500 మంది మృతి చెందారు. 1960.. చిలీ (వాల్డివియా) 9.5 తీవ్రతతో భూకంపం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. ఈ ప్రభావం పసిఫిక్ మహాసముద్రం అంతటా కనిపించింది. 1883.. ఇండోనేషియా (క్రాకటోవా) అగ్నిపర్వత విస్ఫోటనం ధాటికి బారీ అలలు ఎగసిపడ్డారు. మొత్తం 36,000 మంది మృతి చెందారు. ఈ పేలుడు శబ్దం.. 4,800 కిలోమీటర్ల దూరం దాకా వినిపించింది!!.సునామీ అనేది జపనీస్ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్‌తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. 1896.. జపాన్ (సాన్రికు)లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 125 అడుగుల అలలు ఎగసిపడ్డాయి. ఈ సునామీ ధాటికి 22,000 మంది మృతి చెందారు. ఈ సునామీ ప్రభావంతో.. హవాయిలో 25 అడుగుల ఎత్తు మేర అలలు ఎగసిపడ్డాయి. చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ(Mega Tsunami).. 1958 అలాస్కా (లిటుయా బే)లో జులై 9వ తేదీన సంభించింది. రిక్టర్ స్కేల్‌పై 7.8 నుంచి 8.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి.. 914 మీటర్ల (3000 అడుగుల) నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. 90 మిలియన్ల టన్నుల రాళ్లు ఒక్కసారిగా గిల్బర్ట్ ఇంటెల్ ఉపనదిలోకి పడిపోయాయి. దీంతో ఓ పెద్ద కొండ ఎత్తు మేర నీరు అలలాగ ఎగసిపడింది. సుమారు 1,720 అడుగుల (524 మీటర్లు) అల.. లిటుయా బేను ముంచెత్తింది. ఇది న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎక్కువ!. ఇదే ప్రాంతంలోని లిథుయా గ్లేసియర్ (Lituya Glacier) వద్ద కొంత మంచు కూడా విరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల వివరాలు చెబుతున్నప్పటికీ.. ప్రధాన అలను ఏర్పరచినది రాళ్ల పతనం మాత్రమే. అయితే ఇక్కడ జనసాంద్రత.. అదీ ఆ సమయంలో తక్కువగా ఉండేది. అందుకే మెగా సునామీ ముంచెత్తినా కేవలం ఐదుగురే మరణించారు. వీళ్లంతా పడవలో ప్రయాణిస్తుండగా మృత్యువాత పడ్డారు. అయితే మరో ఇద్దరు అనూహ్యంగా ఈ విలయం నుంచి ప్రాణాలతో బయటపడడం గమనార్హం. 1868.. పెరూ(చిలీ) 8.5 తీవ్రత భూకంపంతో సునామీ ముంచెత్తి 25,000 మందిని బలిగొంది. ఇది కూడా హవాయిపై ప్రభావం చూపెట్టింది. 1755.. పోర్చుగల్ (లిస్బన్)లో 8.5–9.0 భూకంపం సంభవించింది. 3 నుంచి 6 నిమిషాలపాటు భూమి కంపించింది. 40 నిమిషాల తర్వాత.. భారీ అలలతో అట్లాంటిక్ మహాసముద్రం అల్లకల్లోలంగా మారింది. సునామీ ముంచెత్తడంతో 50,000 మంది మృతి చెందారు. యూరోప్ అంతటా, అలాగే కరేబియన్ దీవులు, బ్రెజిల్‌ను ఈ సునామీ ప్రభావం తాకింది. ఈ భూకంప సునామీ చరిత్రలోనే తత్వవేత్తల రచనలతో.. అత్యంత విధ్వంసకరమైన ప్రకృతి విపత్తుగా నిలిచిపోయింది ఇది. -
నిమిష కేసు: భారతీయల పాలిట లైఫ్‌లైన్.. బ్లడ్‌మనీ!
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవతో మరణశిక్ష అయితే వాయిదా పడింది. క్షమాభిక్ష కోసం యెమెన్‌లో ఇంకా రాయబారం నడుస్తోంది. బాధిత కుటుంబం గనుక బ్లడ్‌మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తేనే నిమిష మరణశిక్ష తప్పుతుంది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ(క్షమాధనం) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2008లో తన కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిష.. కొన్నాళ్లకు సొంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీతో ఆమెకు పొరపచ్చాలు వచ్చాయి. తన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుని తనను వేధిస్తున్నాడంటూ నిమిష ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో మత్తుమందు ఇవ్వడంతో తలాల్ మరణించాడు. ఈ కేసులో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం.. యెమెన్‌లోని సనా సెంట్రల్ జైలులో బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో నిమిషా ప్రియకు శిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈలోపు చర్చలకు తొలిసారి తలాల్ కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో శిక్ష వాయిదా పడింది. మరి బ్లడ్‌మనీకి ఆ కుటుంబం అంగీకరిస్తుందా?.. అసలు బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి ఇంతకు ముందు ఎవరైనా బయటపడ్డారా?. వర్కవుట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా?క్షమాధనం అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఇది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.నిమిష కేసులో తలాల్ అబ్దో మహ్దీ కుటుంబానికి $1 మిలియన్ రక్తపరిహారం(మన కరెన్సీలో 8 కోట్లకు పైనే) ప్రతిపాదించింది నిమిష తల్లి ప్రేమ కుమారి. అయితే బ్లడ్‌మనీ తమ గౌరవానికి భంగం కలిగించే అంశమంటూ గతంలో వాళ్లు తిరస్కరించారు. యెమెన్ అనేది హౌతీ నియంత్రణలో ఉన్న దేశం. ఈ కారణంగానే భారత ప్రభుత్వ జోక్యం కష్టంగా మారింది. క్షమాభిక్ష కోసం మత పెద్దలు, Save Nimisha Priya Action Council ప్రయత్నాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.8.6 కోట్లు తీసుకునేందుకు యెమెన్‌లోని బాధిత కుటుంబాన్ని ఒప్పిస్తే నిమిష ప్రియకు ఊరట దక్కనుంది.వీరంతా ‘బ్లడ్ మనీ’తో బయటపడినవారే..!నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్‌మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం.. ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. 👉2008లో.. సహోద్యోగిని చంపిన కేసులో జస్బీర్ సింగ్ సౌదీ అరేబియా జైలు నుంచి రూ.30 లక్షల బ్లడ్‌మనీ చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2005లోశ్రీలంక పౌరుడ్ని చంపిన కేసులో సులేమాన్‌తో పాటు మరో ఎనిమిది మందికి సౌదీ అరేబియాలోనే మరణశిక్ష పడింది. అయితే రూ. 40 లక్షల బ్లన్మనీతో వీళ్లంతా క్షేమంగా బయటపడ్డారు👉2012లో.. షార్జాలో పాకిస్తానీని మూకహత్య చేసిన కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. బ్లడ్‌మనీ కింద రూ.16 కోట్లు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సాయం కూడా ఉంది. 👉2013లో.. కర్ణాటకకు చెందిన ట్రక్కు డ్రైవర్ సలీమ్ భాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గానూ ఈ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు రూ.1.5 కోట్ల బ్లడ్‌మనీ బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీమ్ శిక్ష నుంచి బయటపడ్డాడు.👉2014లో.. సౌదీలో కారుతో ఓ చిన్నారిని ఢీ కొట్టిన కేసులో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత్య కార్యాలయం సహకారంతో బ్లడ్‌మనీ చెల్లించి ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉2014లో బ్లడ్‌మనీ ఆధారంగానే ముగ్గురు భారతీయులను విడుదల చేసింది సౌదీ. మృతుడి కుటుంబానికి రూ.1.12 కోట్లు చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరణశిక్ష పడింది. ఈ కేసులో ‘బ్లడ్ మనీ’ కింద 2 లక్షల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో ప్రస్తుతం దాదాపు రూ.47లక్షలు) చెల్లిస్తే క్షమిస్తామని బాధిత కుటుంబం తెలిపింది. దాతల సాయంతో ఆ మొత్తాన్ని చెల్లించడంతో ఎనిమిదేళ్ల తర్వాత 2017లో శంకరనారాయణ యూఏఈ జైలు నుంచి విడుదలయ్యాడు.👉2017లోనే.. ఓ పాక్ పౌరుడ్ని హత్య చేసిన కేసులో 10 మంది పంజాబ్ పౌరులకు సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. అయితే బాధిత కుటుంబానికి ₹24 లక్షల (200,000 దిర్హామ్స్) బ్లడ్‌మనీ చెల్లించడంతో క్షమాభిక్ష లభించింది. ఆపై వారు భారత్‌కు తిరిగొచ్చారు. భారత రాయబార కార్యాలయం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు, సామాజిక సంస్థలు కలిసి బ్లడ్‌మనీ సేకరణ చేపట్టారు.👉2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత.. లింబాద్రి తరఫున రూ.1.8 కోట్లు బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. దీంతో ఆయన శిక్ష నుంచి బయటపడి స్వదేశానికి తిరిగొచ్చారు.👉2024లో.. అబ్దుల్ రహీమ్ కేసు విస్తృతంగా చర్చనీయాంశమైంది. కేరళ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీ అరేబియాకు హౌజ్ డ్రైవర్‌గా వెళ్లారు. అక్కడ తన యజమాని ఇంట దివ్యాంగుడైన అనాస్ అల్ షహ్రీ బాధ్యతలు కూడా చూసుకునేవాడు. ఈ క్రమంలో.. ఓ రోజు ప్రమాదవశాత్తూ మరణించాడు. 2018లో సౌదీ కోర్టు హత్య ఆరోపణలపై రహీమ్‌కు మరణశిక్ష విధించింది. 2022లో అక్కడి సుప్రీం కోర్టు కూడా శిక్షను సమర్థించింది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ తెర మీదకు వచ్చింది. బాధిత కుటుంబం ₹34 కోట్లు (15 మిలియన్ సౌదీ రియాల్స్) బ్లడ్‌మనీ తీసుకుంటే క్షమించేందుకు సిద్ధమని తెలిపింది. ఆరు నెలల్లో మొత్తం చెల్లించేలా 2023 అక్టోబర్ 16న ఒప్పందం కుదిరింది. SAVEABDULRAHIM' యాప్ ద్వారా క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు. అలా.. 2024 జూలై 2న రియాద్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో శిక్ష రద్దు అయ్యింది. బ్లడ్‌మనీ చెక్కును బాధిత కుటుంబానికి అప్పగించారు. అయితే.. ఈ ఏడాదిలోనే రహీమ్ విడుదల కావాల్సి ఉంది. ఈ ఘటన.. మానవత్వం, భారతీయుల ఐక్యత, న్యాయం కోసం పోరాటం చూపిన ఉదాహరణగా నిలిచింది.👉2019లో.. అర్జునన్ అతిముత్తు, తమిళనాడులోని తంజావూరు జిల్లా, అతివెట్టి గ్రామంకు చెందిన వ్యక్తి. ఆయన 2013లో కువైట్‌లో తన రూమ్మేట్ అబ్దుల్ వాజిద్ (మలప్పురం, కేరళ)ను హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురయ్యారు. 2016లో శిక్ష ఖరారు అయ్యింది. అయితే బ్లడ్‌మనీ ఒప్పందం కింద.. బాధిత కుటుంబం ₹30 లక్షలు తీసుకుని క్షమాభిక్ష ఇచ్చేందుకు అంగీకరించింది. ఆపై కువైట్ ప్రభుత్వం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అప్పటి కోటక్కల్ MLA అబిద్ హుస్సేన్, యూత్ లీగ్ నేతలు కలిసి క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు.కాగా.. ఈ బ్లడ్ మనీతో భారతీయులకు కూడా పరిహారం దక్కిన సందర్భం ఉంది. 2019 దుబాయ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో భారత్‌కు చెందిన మహ్మద్ మీర్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్.. బ్లడ్ మనీ కింద మీర్జా కుటుంబానికి 5 మిలియన్ల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో అప్పటికి దాదాపు రూ.11కోట్లు) చెల్లించాడు.బ్లడ్‌మనీ తప్పించలేకపోయింది!సౌదీ పౌరుడ్ని హత్య చేసిన కేఏసులో ధరమ్‌పాల్ సింగ్(2020)ను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్లడ్‌మనీని బాధిత కుటంబం తిరస్కరించడంతో మరణశిక్ష అమలు చేశారు.తన యాజమానిని హత్య చేసిన కేసులో కే మాధవన్‌కు సౌదీలో మరణశిక్ష పడింది. అయితే కుటంబం బ్లడ్‌మనీని సేకరించడంలో విఫలమైంది. దీంతో 2004లో మరణశిక్ష అమలు చేశారు.సహోద్యోగిని హత్య చేసిన కేసులో.. షంసుద్దీన్కి మరణశిక్ష పడింది. అయితే బ్లడ్‌మనీని బాధిత కుటుంబం తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలైంది.పెండింగ్‌లో..ఓ దాడి కేసులో యూఏఈలో యూనస్ అనే భారతీయడికి మరణశిక్షపడింది. ఫ్యామిలీ బ్లడ్‌మనీ సేకరించడంలో ఇబ్బంది పడుతోంది. అయితే శిక్ష ఇంకా అమలు కాలేదు.నిమిష ప్రియ కేసులో.. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్‌మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు చర్చల వేళ.. శిక్ష తప్పుతుందో..? లేదో అనే ఉత్కంఠ నెలకొంది. -
భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్‌లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్మెంట్లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.గతంలో ప్రయాగ్‌రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్పూర్, కౌశంబి, ప్రతాప్‌ఘడ్, ప్రయాగ్‌రాజ్‌లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్లో ఈ ఇద్దరినీ రెడ్‌హ్యాండెండ్‌గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్లో బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్‌లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్‌గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్కు ఆమె జనరల్ మేనేజర్‌గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్‌కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం. -
అప్పుడు మోర్బీ.. ఇప్పుడు గాంభీరా!
గుజరాత్లో జరిగిన ఘోర బ్రిడ్జి ప్రమాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి బ్రిడ్జి చీలిపోయి కుప్పకూలిపోవడంతో.. ఐదు వాహనాలు మహీసాగర్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ వంతెనకు మరమ్మత్తులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తుండడం విశేషం. గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఘోరం జరిగింది. పాడ్రా తాలుకాలో ఆనంద్-వడోదర జిల్లాలను కలిపే గాంభీరా వంతెనలో ఓ స్లాబ్ బుధవారం ఉదయం విరిగిపడింది. ఈ హఠాత్ పరిణామంతో రెండు ట్రక్కులు, రెండు వ్యానులు, ఓ ఆటో కింద ఉన్న మహీసాగర్ నదిలో పడిపోయాయి. ప్రమాదం ఉదయం వేళ ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలోనే జరిగింది. ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. పిల్లర్స్ మధ్య భాగం పూర్తిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఘటన సమయంలో ఓ ట్యాంకర్ బ్రిడ్జి అంచునకు వచ్చి ఆగిపోయింది. ఆ ట్యాంకరే అడ్డు లేకుంటే మరికొన్ని వాహనాలు పడిపోయి మరింత నష్టమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు, వడోదర జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడోదర కలెక్టర్‌ను సంప్రదించి.. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు & భవనాల శాఖను ఈ ప్రమాదంపై తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారాయన. ఫైర్ బ్రిగేడ్, బోట్లు, డైవర్స్, NDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టాయి. క్రేన్ల సహాయంతో వాహనాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు.. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి ₹50,000 నష్ట పరిహారాన్ని పీఎంవో ప్రకటించింది. గాంభీరా బ్రిడ్జ్.. గుజరాత్-సౌరాష్ట్రను కలిపే కీలక మార్గం. 1985లో దీనిని ప్రారంభించారు. ఇది ఆనంద్, వడోదర, భరూచ్, అంక్లేశ్వర్ మధ్య ప్రయాణించే వారికీ ప్రధాన రూట్ కావడంతో నిత్యం వాహన రద్దీ ఉంటుంది. అయితే చాలా కాలంగా ఈ బ్రిడ్జి పాడైపోయిన స్థితిలో ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. తరచూ ఈ వంతెన సూసైడ్ స్పాట్‌గా మారిందని, పోలీసులు కూడా ఇక్కడ నిఘా వహించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే.. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. బ్రిడ్జికి అవసరమైనప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం దర్యాప్తులోనే బయటపడుతుందని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ అంటున్నారు. తాజా గాంభీరా బ్రిడ్జి ప్రమాద నేపథ్యంలో.. మూడేళ్ల కిందట జరిగిన గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ప్రమాదం తెర మీదకు వచ్చింది. మోర్బీ బ్రిడ్జ్ ప్రమాదం.. భారతదేశంలో అత్యంత ఘోరమైన ఘటనలలో ఒకటి. 2022 అక్టోబర్ 30వ తేదీన మోర్బీ జిల్లా కేంద్రంలో మచ్చు నదిపై ఉన్న జూల్తో పుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 141 మంది మరణించారు. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్.. మరమ్మత్తుల తర్వాత అక్టోబర్ 26న తిరిగి ప్రారంభమైంది, అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే ఈ బ్రిడ్జిని తెరిచినట్టు తేలింది. కేబుల్స్ తుప్పుపట్టినవి, బోల్టులు సడలిపోయినవి, అధిక బరువు ఉన్న ఫ్లోరింగ్ వేశారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఓరేవా గ్రూప్ అనే ప్రైవేట్ సంస్థ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యత తీసుకుంది, కానీ సరైన అనుమతులు లేకుండానే తెరిచినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. #Gujarat Sad news coming, of a Cable Bridge collapse in Morbi of Gujarat, reports of many injuries as per initial reports.PM @narendramodi ji seeks urgent mobilisation of teams for rescue ops after cable bridge collapse in Gujarat's Morbi#PMModi #Gujarat #Morbi #Cablebridge pic.twitter.com/RyTA7nXeVm— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 30, 2022 ప్రమాదం జరిగిన సమయంలో 500 మందికి పైగా బ్రిడ్జ్‌పై ఉన్నారు, కానీ దాని సామర్థ్యం 125 మంది మాత్రమే. బ్రిడ్జ్ సడెన్‌గా విరిగిపడి, ప్రజలు మచ్చ్ఛు నదిలో పడిపోయారు. మృతుల్లో చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ వేయించి దర్యాప్తు చేయించింది. ఈ కేసులో ఓరేవా సంస్థ మేనేజర్లు, టికెట్ క్లర్కులు, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు.. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలకు పరామర్శ తెలిపారు కూడా. -
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్‌మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ISSలో శుభాంశు శుక్లా.. ఇస్రో ఎందుకో వెనుకబడింది!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు?.. ఇంకెవరు తాజాగా ఆ ఫీట్‌తో చరిత్ర సృష్టించింది భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లానే. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మిషన్‌లో భారతీయ అంతరిక్ష సంస్థ(ISRO) కూడా భాగంగా ఉంది. అలాంటప్పుడు ఇస్రో ఎందుకు దీనిని అంతగా ప్రమోట్ చేసుకోవడం లేదు!!.శుభాంశు శుక్లా అడుగు.. భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. శుభాంశు పైలట్‌గా సాగిన ఐఎస్ఐఎస్కి సాగిన యాక్జియం-4 మిషన్ ప్రయాణం.. అంతరిక్షంపై భారత్ చేసిన సంతకం. కానీ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ISRO తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. దేశం మొత్తం గర్వపడే ఈ ఘనతను మరింత ఉత్సాహంగా, ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే..వీళ్ల తర్వాత శుక్లానే..అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ. సోయుజ్ T-11 (Soyuz T-11) మిషన్ కోసం 1984, ఏప్రిల్ 3న ఆయన స్పేస్‌లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో(సెకండ్‌జనరేషన్ అంతరిక్ష కేంద్రం) ఏడు రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్‌లోకి వెళ్లింది లేదు. కానీ..భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్.. తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీషా బండ్లా, రాజా జాన్ వూర్పుటూర్ చారి మాత్రం రోదసీ యాత్రలు చేశారు. ఈ లెక్కన రాశేష్ శర్మ తర్వాత స్పేస్‌లోకి.. అందునా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగిడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్‌గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు(60 ప్రయోగాల్లో) నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు హైలైట్ చేసుకోవడం లేదు!.అంత బడ్జెట్ కేటాయించి మరీ..అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్న భారత్.. చంద్రయాన్, మంగళయాన్‌తో సూపర్ సక్సెస్ సాధించింది. అలాంటి దేశం తరఫున ఐఎస్ఎస్కి వెళ్లిన తొలి మిషన్ ఇదే. పైగా భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ మిషన్‌కు.. శుక్లా పాల్గొన్న ఈ మిషన్ ముందడుగుగా పరిగణించబడుతోంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు.ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. పైగా తాజా మిషన్‌లో జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకుంటే ఈ విషయాలన్నింటిని భారీగా ప్రచారం చేసుకునేదే. కానీ, ఎందుకో ఆ పని చేయడం లేదు. దీంతో Wake up ISRO! అనే చర్చ మొదలైంది.అందుకేనా?..ఇస్రో మౌనానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంభిస్తుందా? అనే అనుమానం కలగకమానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు..యాక్సియం-4 స్పేస్ మిషన్.. ప్రైవేట్ అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే ISRO, NASA, Axiom Space సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్-3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారం ఇచ్చిన ఇస్రో, తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. మిషన్ ముగిసే సమయంలోనైనా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చేయాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
ఆ అదృశ్య యుద్ధ విమానం వెనుక భారతీయ మేధావి!
వార్ టెక్నాలజీలో అత్యద్భుతం.. నార్త్రోప్ B-2 స్పిరిట్ బాంబర్. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ప్రయోగించడంతో వీటి గురించి మరోసారి చర్చ నడుస్తోంది. అయితే ఈ యుద్ధ విమానాల రూపకల్పనలో భారతీయ మూలాలున్న మేధావి కూడా ఉన్నారు. కాలక్రమంలో.. గూఢచర్యం ఆరోపణలతో ఆయన జైలు పాలు కావడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగిన అంశం.నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia).. ముంబైలోని ఓ పార్శీ కుటుంబంలో 1944లో జన్మించారీయన. ఆపై 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి.. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. 1969లో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ఇంజినీరింగ్ మేధావిగా నార్త్రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్లో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌కు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపకల్పన చేయడంలో గోవాడియా కీలక పాత్ర పోషించారు. అయితే..దశాబ్దంన్నర తర్వాత.. అనారోగ్య కారణాలతో నార్త్రోప్ గ్రుమ్మన్ నుంచి తప్పుకున్న ఆయన న్యూమెక్సికోలో డిఫెన్స్ కన్సల్టింగ్ సంస్థ ప్రారంభించారు. అయితే 1997లో DARPAతో వివాదం కారణంగా ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయింది. దీంతో.. చాలా కాలం ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 2005 అక్టోబర్ 15వ తేదీన హవాయ్‌లోని విల్లాపై దాడి చేసిన ఎఫ్‌బీఐ డబ్బుతో రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. చైనాతో రహస్య సంబంధాల నేపథ్యంలో ఆయన్ని అదే తేదీన అరెస్ట్ చేసింది. విచారణలో నివ్వెరపోయే విషయాలు అధికారులకు తెలిజేశారు. గోవాడియా చైనాలోని చెంగ్డూ, షెన్జెన్ వంటి నగరాలకు ఆరు సార్లు ప్రయాణించి, స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో సహాయం చేశారని నిర్ధారించారు. బదులుగా చైనా నుంచి కనీసం $110,000 పొందారని తేలింది. మొత్తం 14 అభియోగాలలో ఆయన దోషిగా తేలడంతో 2011లో హోనోలులు కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలా ఒక మేధావి జీవితం.. గూఢచారిగా కటకటాల పాలైంది. కీలకంగా గోవాడియానే.. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌ను అమెరికా డిఫెన్స్ కంపెనీ నార్త్రోప్ (ఇప్పటి నార్త్రోప్ గ్రుమన్) రూపొందించింది. ఈ ప్రాజెక్టులో అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పనిచేశారు. మరీ ముఖ్యంగా హాల్ మార్కేరియన్ (Hal Markarian),నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia) గురించి చెప్పుకోవాలి. మార్కేరియన్.. 1979లో B-2 బాంబర్‌కు సంబంధించిన తొలి డిజైన్ స్కెచ్‌లు రూపొందించారు. ఆయన ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. విమానం యొక్క ప్రాథమిక ఆకృతికి బీజం వేశారు. అయితే.. భారతీయ మూలాలున్న ఇంజినీర్ గోవాడియా B-2 బాంబర్‌లోని స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, విమానం ఎగ్జాస్ట్‌ను రాడార్, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేయడంలో ఆయన టెక్నాలజీ కీలకమైంది. వీళ్లిద్దరితో పాటు ఇర్వ్ వాలాండ్, జాన్ కాషెన్, హాన్స్ గ్రెల్మాన్ వంటి స్టెల్త్ టెక్నాలజీ నిపుణులు కూడా భాగస్వాములయ్యారు.వియత్నాం, యోమ్ కిప్పూర్ యుద్ధాల సమయంలో అమెరికా ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించేందుకు నోషిర్ గోవాడియా నేతృత్వంలో.. ‘స్టెల్త్’ సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. ‘బ్లూబెర్రీ మిల్క్‌షేక్’ అనే కోడ్ నేమ్‌తో సాగిన గోప్యమైన ప్రాజెక్టులో గోవాడియా కీలకపాత్ర వహించారు. బాంబర్ ఇంజిన్ ఎగ్జాస్ట్‌ను రాడార్, హీట్ సెన్సర్లకు దృశ్యమవకుండా చేయడం ఆయన ప్రాథమిక లక్ష్యం. ఈ ప్రయత్నంలో ఆయన ఘన విజయం సాధించారు. B-2 బాంబర్ ప్రత్యేకతలుబీ2 బాంబర్.. దట్టమైన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్లలోకి చొచ్చుకుపోవడానికి తక్కువ-పరిశీలించదగిన స్టీల్త్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అందుకే దీనిని స్టెల్త్ బాంబర్ అని పిలుస్తారు. స్టెల్త్ డిజైన్: ఇది ఫ్లయింగ్-వింగ్ ఆకృతిలో ఉండి, రాడార్‌కు కనిపించకుండా ఉండేలా రూపొందించబడింది. దీని రాడార్ క్రాస్ సెక్షన్ ఒక చిన్న పక్షి స్థాయిలో మాత్రమే ఉంటుంది.ఇన్ఫ్రారెడ్ & హీట్ సిగ్నేచర్ తగ్గింపు: ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా రూపొందించి, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేస్తుంది.అత్యధిక పరిధి: ఒకసారి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్‌తో 10,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.అత్యంత ఖచ్చితమైన దాడులు: 40,000 పౌండ్ల బాంబులు మోసే సామర్థ్యం ఉంది, అందులో న్యూక్లియర్ బాంబులు కూడా ఉంటాయి.క్రూ సౌకర్యాలు: దీన్ని “ఫ్లయింగ్ హోటల్” అని కూడా పిలుస్తారు—ఇందులో బెడ్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మిషన్లు 40 గంటలపాటు సాగుతాయి.తయారీ ఖర్చుబీ2 బాంబర్ ఖర్చు: సుమారు $2.1 నుండి $2.2 బిలియన్ (2025 నాటికి ₹17,000 కోట్లకు పైగా).మొత్తం ప్రోగ్రాం వ్యయం: అభివృద్ధి, పరీక్షలు, ఉత్పత్తి కలిపి $79 బిలియన్ ఖర్చయింది.ప్రతి మిషన్ ఖర్చు: ఒక B-2 మిషన్‌కు సగటున $3–4 మిలియన్ ఖర్చవుతుంది. ఎందుకంటే ఒక్క గంట ఫ్లైట్ ఖర్చే $150,000 ఉంటుంది.చైనా డ్రోన్ నిజంగా B-2ని పోలి ఉందా?అవును.. 2025 మేలో చైనాలోని మలాన్ టెస్ట్ బేస్ వద్ద శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన స్టెల్త్ డ్రోన్ B-2 స్పిరిట్‌ను పోలి ఉంది. దీని వింగ్స్పాన్(సుమారు 52 మీటర్లు), టెయిల్‌లెస్ ఫ్లయింగ్-వింగ్ డిజైన్, ఇన్ఫ్రారెడ్-సిగ్నేచర్ తగ్గింపు లక్షణాలు.. ఇవి అన్నీ B-2 లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చైనా యొక్క H-20 ప్రాజెక్ట్ లేదా కొత్త హై-ఆల్టిట్యూడ్ స్టెల్త్ డ్రోన్ కావచ్చు. అయితే ఈ డ్రోన్ రూపకల్పనకు నోషిర్ గోవాడియా అందించిన గోప్య సమాచారం ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇరాన్ కంటే ముందు.. అమెరికా దీనిని ప్రయోగించిన సందర్భాలు🕊️ 1999 – కొసోవో యుద్ధం (Operation Allied Force)- B-2 బాంబర్లు తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న సందర్భం.- మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి నేరుగా సెర్బియాకు వెళ్లి, కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన బాంబింగ్ చేశారు.- ఒక్కో మిషన్ 30 గంటలకు పైగా సాగింది. 🏔️ 2001–2002 – ఆఫ్ఘానిస్తాన్ (Operation Enduring Freedom)- తాలిబాన్ స్థావరాలు, శిక్షణ శిబిరాలు, గుహలపై దాడులు.- అమెరికా నుంచి నేరుగా ఎగిరి, మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్‌తో లక్ష్యాలను చేరుకున్నారు. 🏜️ 2003 – ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)- ప్రారంభ దాడుల్లో భాగంగా సద్దాం హుస్సేన్‌కు చెందిన కమాండ్ సెంటర్లు, మిస్సైల్ సదుపాయాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి. 🌍 2011 – లిబియా (Operation Odyssey Dawn)- మూడు B-2 బాంబర్లు లిబియాలోని ఎయిర్‌ఫీల్డ్స్, ఫోర్టిఫైడ్ షెల్టర్లపై దాడి చేసి, నో-ఫ్లై జోన్ అమలు ప్రారంభానికి దోహదం చేశాయి. ⚔️ 2017 – సిరియా (అధికారికంగా నిర్ధారణ కాలేదు)- ఐసిస్ స్థావరాలపై B-2 బాంబర్లు GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయని నివేదికలు ఉన్నాయి. 🚀 2024 – యెమెన్- హౌతీ తిరుగుబాటుదారులపై దాడి. ఈ మిషన్ ద్వారా బీ-2 బాంబర్ సామర్థ్యాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించారు. 🌑 2025 – ఇరాన్ (Operation Midnight Hammer)- 7 B-2 బాంబర్లు 37 గంటల పాటు ఎగిరి, ఇరాన్‌లోని Fordow, Natanz, Isfahan న్యూక్లియర్ కేంద్రాలపై 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయి. -
Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.1.ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్‌పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్‌కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్‌సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 4. అమెరికా నిన్న ఇరాన్ అణు స్థావరాలపై బంకర్ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్-ఇజ్రాయెల్ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్ అభివర్ణించింది. మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
అవునా.. ఈ శతాబ్దపు వివాహం ఇదేనా?
ప్రపంచంలో ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన పెళ్లిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది ఏదో తెలుసా?.. రెండు దశాబ్దాల కిందటే.. వందల కోట్లు ఖర్చు చేసిన ఆ వివాహ విశేషాల గురించి చివర్లో చెప్పుకుందాం. ఈలోపు.. ఈ శతాబ్దపు వివాహం(Wedding of the Century) ఇదేనంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ విషయంలో ఆ ప్రాంత ప్రజలు రెండుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. ఇంతకీ పెళ్లి గోల ఏంటంటే..అమెరికా టెక్ దిగ్గజం జెఫ్ బెజోస్(61)కి ఆయన ప్రేయసి, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్కు జరగబోయే వివాహం గురించే ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటలీ నగరం వెనిస్లో జూన్ 24 నుంచి 26వ తేదీల మధ్య మూడు రోజులపాటు అంగరంగ వైభంగా ఈ వివాహ వేడుక జరగనుంది. లియోనార్డో డికాప్రియో, కిమ్ కార్డాషియన్, బియాన్స్, మిక్ జాగర్ లాంటి ప్రముఖులు ఈ వివాహానికి అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇందుకోసం భారీగానే వెచ్చించబోతున్నారట.వెనిస్లోని చారిత్రక భవనాలు, ప్యాలెస్‌లను వివాహ వేదికల కోసం అద్దెకు తీసుకుందీ జంట. ఒక్క ఫ్లవర్ డెకరేషన్ కోసం రూ.8 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. కేటరింగ్ కోసం రూ.10కోట్ల దాకా కేటాయించారు. కేవలం లారెన్ ధరించబోయే దుస్తులు, ఆభరణాల కోసం ₹12 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఇవేకాకుండా.. అతిథులకు వసతి, రవాణా.. విలాసవంతమైన హోటళ్లు, వాటర్ టాక్సీలు, ప్రైవేట్ బోట్ల ఖర్చు కోసం మిలియన్లు కుమ్మరించబోతున్నాడు ఈ అపర కుబేరుడు. ఈ వివాహ వేడుకకు అంచనా ఖర్చు ₹125 కోట్ల నుంచి ₹166 కోట్ల ($15 మిలియన్ నుంచి $20 మిలియన్ వరకు) మధ్యగా ఉండొచ్చని ఒక అంచనా. వీళ్ల వివాహం మాటేమోగానీ.. ‘‘వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ’’ అంటూ సోషల్ మీడియా ఊదరగొట్టేస్తోంది. అదే సమయంలో ఈ హైప్రొఫైల్ వెడ్డింగ్ వివాదానికి కూడా దారి తీసింది. కొంతమంది ఈ వేడుకను వెనిస్కు గౌరవంగా భావిస్తున్నారు. నగరానికి పర్యాటక ఆదాయం తీసుకురావచ్చని ఆశిస్తున్నారు. అయితే.. వెనిస్ను ప్రైవేట్ పార్టీగా బెజోస్ భావిస్తున్నారా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. "No Space for Bezos! అనే నినాదాలతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ పాటికే రియాల్టో వంతెనపై భారీ బ్యానర్లు కట్టారు. ఈ వేడుక వల్ల నగరంలో అధిక రద్దీ నెలకొంటుందని, స్థానికులకు అసౌకర్యం కలగడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్‌గా అమెజాన్‌ను ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS కూడా బెజోస్ నేతృత్వంలోనే ప్రారంభమైంది. మెకెంజీ స్కాట్‌ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆపై లారెన్ సాంచెజ్‌తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారు. ‘‘నాకు నెంబర్‌వన్ కిరీటం అవసరం లేదు. ఉపాధి కల్పించే యజమానిగా గుర్తింపు కావాలి’’ అనేది ఆయన philosophy. ఉద్యోగులతో వ్యక్తిగతంగా లేఖలు రాయడం, వారిని ప్రోత్సహించడం వంటి చర్యలు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్‌తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్‌తో డేటింగ్ మొదలు పెట్టి.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు.. టాప్ 10 జాబితా పరిశీలిస్తే.. 1.ఖాదిజా ఉజాఖోవా Weds సైద్ గుట్సెరీవ్ – సుమారు ₹8,300 కోట్లు(1 బిలియన్ డాలర్లు)2016లో మాస్కోలో జరిగిన ఈ పెళ్లిలో జెన్నిఫర్ లోపెజ్, ఎన్‌రికె ఇగ్లెషియస్ లైవ్ షోలు ఇచ్చారు. అతిథులకు బెంట్లీ కార్లలో స్వాగతం పలకడంతో పాటు బంగారు బాక్స్‌లను గిఫ్ట్‌లుగా ఇచ్చారు. 2. అనంత్ అంబానీ Weds రాధికా మర్చంట్ – సుమారు ₹5,000 కోట్లు2024లో జరిగిన ఈ పెళ్లిలో జరిగిన సందడి అంతా ఇంతా కాదు. పాప్ సింగర్ రిహన్నా ప్రత్యేక షోతో అలరించారు. ఖరీదైన క్రూయిజ్ పర్యటనలతో పాటు ప్రపంచ ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3. ఇషా అంబానీ Weds ఆనంద్ పిరమల్ – సుమారు ₹800 కోట్లు2018లో ఉదయ్‌పూర్‌లోని రాజమహల్లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో బియాన్స్ లైవ్ షో ఇచ్చారు. 4. వనీషా మిట్టల్ Weds అమిత్ భాటియా – సుమారు ₹550 కోట్లు2004లో ఫ్రాన్స్‌లో వెర్సైల్స్ ప్యాలెస్‌లో వివాహ వేడుక జరిగింది. కైలీ మినోగ్ ప్రదర్శనతోపాటు ఐఫెల్ టవర్ వద్ద బాణా సంచాలు కాల్చి వేడుక నిర్వహించారు. 5.ప్రిన్స్ చార్ల్స్ Weds ప్రిన్సెస్ డయానా – సుమారు ₹400 కోట్లు1981లో ఈ రాయల్ వెడ్డింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మంది వీక్షించారు. 6. ప్రిన్స్ హ్యారీ Weds మేఘన్ మార్కెల్ – సుమారు ₹375 కోట్లు2018లో విండ్సర్ క్యాసిల్‌లో జరిగిన ఈ వివాహ వేడుక.. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. 7. కింగ్ ఫెలిప్ Weds క్వీన్ లెటీషియా (స్పెయిన్) – సుమారు ₹290 కోట్లుఆ దేశ రాజధాని మాడ్రిడ్‌లో రాజ సంప్రదాయాలతో ఘనంగా జరిగిందీ వివాహం. 8. ప్రిన్స్ విలియం Weds కేట్ మిడిల్టన్ – సుమారు ₹275 కోట్లు2011లో వెస్ట్‌మినిస్టర్ ఏబీ చర్చిలో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి 1,900 మందికిపైగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు 9. అంజెలా బేబి Weds హువాంగ్ షియామింగ్ (చైనీస్ సెలెబ్రిటీలు) – సుమారు ₹260 కోట్లు2015లో హోలోగ్రాఫిక్ క్యాసెల్‌లో.. ప్రత్యేక డిజైనర్ గౌన్‌తో వధువు మెరిసిపోగా.. ఈ వివాహం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 10. మైఖేల్ జార్డన్ Weds ఎవెట్ ప్రియెటో – సుమారు ₹80 కోట్లుబాస్కెట్బాల్ చక్రవర్తి మైఖేల్ జార్డన్ వివాహం క్యూబన్ అమెరికా మోడల్ య్వెట్ ప్రియెటో 2013లో జరిగింది. సుమారు 500 మంది అతిథుల నడుమ.. ఉషర్, రాబిన్ థిక్ లైవ్ షోలతో ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుక. పైవాటిల్లో భారత పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. వ్యాపారవేత్త అమిత్ భాటియాతో వనీషా వివాహం 2004లో సుమారు రూ. 550 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్ ప్యాలెస్ వేడుకగా జరిగింది. ఆరు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకకు హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకకు అయిన ఖర్చు కంటే అధిక ఖర్చుతో జరిపించిన వివాహాలు ఉన్నప్పటికీ.. అప్పటి బడ్జెట్.. పరిస్థితులు.. ఇతర కారణాలతో వనీషా మిట్టల్ వివాహ వేడుక గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. -
హర్మూజ్ జలసంధి మూతపడితే...???
ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. వారం రోజుల పరస్పర క్షిపణి దాడుల తరువాత ఇరుదేశాలిప్పుడు పైచేయి కోసం కొత్త ఎత్తుగడలు పన్నుతున్నాయి. జోక్యం చేసుకోవాలని ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికాను రెచ్చగొడుతూంటే.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా సమస్యను అంతర్జాతీయ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఏమిటీ హర్మూజ్ జలసంధి? దాన్ని మూసేస్తే ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్‌కు ఏమిటి నష్టం?(India Effects With Hormuz Block). సూయెజ్ కెనాల్... యూరప్ దేశాలను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గం. సరుకుల రవాణాకు అత్యంత కీలకం. సూయెజ్ లాంటిదే ఈ హర్మూజ్ జలసంధి కూడా. ఇరాన్, ఒమాన్‌ల మధ్య ఉంటుంది. పర్షియన్ జలసంధిని ఒమాన్ జలసంధితో, అరేబియా సముద్రంతోనూ కలుపుతుంది. సూయెజ్ కెనాల్, హర్మూజ్ జలసంధులు రెండింటి ద్వారా ముడిచమురు, ఎల్‌ఎన్‌జీలు సరఫరా అవుతూంటాయి. మన దేశం సౌదీ అరేబియా, ఖతార్ తదితర మధ్యప్రాచ్చ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు, ఎల్ఎన్జీ గ్యాస్‌లు సూయెజ్తోపాటు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతూంటాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్ కెనాల్ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు మోతాదు హర్మూజ్ ద్వారా సాగుతూంటుంది. భారీ నౌకలు, ఆయిల్ కంటెయినర్లు ఉన్న నౌకలు వీటిని భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలకు సరఫరా చేస్తూంటాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం వరకూ దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇరాక్‌లోని బస్రా నుంచి అత్యధికంగా 20 - 23 శాతం వస్తూంటే.. రష్యా నుంచి వచ్చేది 18 - 20 శాతం వరకూ ఉంటుంది. ఇవి కాకుండా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా (ఆరేడు శాతం), నైజీరియా, పశ్చిమ ఆఫ్రికా, కువైట్ల నుంచి మిగిలిన ముడిచమురు కొనుగోలు చేస్తూంటాం. ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) విషయానికి వస్తే మన దిగుమతుల్లో సగం ఖతార్ నుంచి అందుతూంటే.. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియా, రష్యా, మొజాంబీక్ల నుంచి మిగిలిన సగం వస్తాయి. 2022 తరువాత అంటే ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు కొంచెం పెరిగాయి. ఇజ్రాయెల్‌పై కోపంతోనో లేక ఆ దేశానికి సర్ది చెప్పగల సామర్థ్యమున్న అమెరికా పట్టించుకోవడం లేదనో ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి! ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
తోడబుట్టిన బలగం
‘శత్రువులు ఎక్కడో ఉండరు’ అని ఒక సినిమా డైలాగ్. ఇంట్లో టీవీ రిమోట్ కోసం ఫైటింగ్జరిగేది ఆ ‘శత్రువుల’తోనే! ఇంట్లో ప్రతిదానికీ పోటీ ఉండేది ఆ ‘శత్రువుల’ మధ్యనే! ఇంతగా ఫైటింగ్ చేస్తారా.. ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా జాడీ పగలగొట్టేసినప్పుడు, ఆ విషయాన్ని దాచి పెట్టటానికి తోడుదొంగలయ్యేది మళ్లీ ఆ‘శత్రువులే’! వాళ్లెవరంటారా, ఇంకెవరు? తోబుట్టువులు! కొండంత ధైర్యం.. అమెరికాకు చెందిన బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ 395 కుటుంబాలను కలిసి చేసిన అధ్యయన ఫలితాల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ కరువైనప్పటికీ తోబుట్టువులతో బలమైన బంధాలు ఉంటే, కౌమారదశలో నిరాశ, ఆందోళన, ఒంటరితనం అనేవి ఆవరించే అవకాశం 60 శాతం వరకు తక్కువగా ఉంటుందట. తోబుట్టువులు ఉన్నవారు మనోవ్యథల నుంచి వేగంగా కోలుకుంటారు. మానసిక అనారోగ్యాలకు భయపడిపోకుండా ధైర్యంగా పోరాడతారు. సామాజికంగానూ మెరుగైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. అసలు తోబుట్టువులంటూ ఉంటే చాలు.. వాళ్ల బంధం గట్టిగా లేకున్నా వాళ్లు ఉన్నారన్న ధైర్యమే భావోద్వేగాల పరంగా ముఖ్యపాత్ర వహిస్తుందట.మైగ్రేన్లు, రక్తపోట్లు రావు.. తోబుట్టువులుంటే ఉండే ఆ ధీమా బాల్యంతోనే ఆగిపోదు. యవ్వనం, వృద్ధాప్యం వరకూ కూడా మన వెంట వస్తుంది. ఇల్లినాయ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం కనీసం ఒక తోబుట్టువైనా ఉన్న వ్యక్తులు సామాజికంగా గణనీయమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు. బయటి పోటీ ప్రపంచంలో బలమైన వ్యక్తుల మధ్య తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. తోబుట్టువులు మాట్లాడుకుంటారు, విభేదిస్తారు. వాదించుకుంటారు, పోటీ పడతారు, రాజీపడతారు.. ఇవన్నీ కూడా వారికి మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు. ఈ సందర్భంగా వచ్చే ఆలోచనలు, మానసిక పరిపక్వత వంటివి భవిష్యత్తులో ఉద్యోగం, వివాహం, స్నేహం తదితర సంబంధాల్లో వచ్చే సమస్యల పరిష్కారానికి తెలివిడి కలిగిన మార్గాన్ని ఏర్పరుస్తాయట. బ్రిటన్‌కు చెందిన ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ పరిశోధన కూడా.. తోబుట్టువులతో దగ్గరి సంబంధాలు ఉన్న పెద్దలు జీవితంలో సంతృప్తిగా ఉన్నట్లు కనుగొంది. తోబుట్టువులతో దృఢమైన అనుబంధాలు కలిగి ఉన్న పెద్దలు మైగ్రేన్లు, అధిక రక్తపోటుతో సహా, ఒత్తిడి సంబంధిత అనారోగ్యాలకు 20–25 శాతం తక్కువగా గురవుతారని 2019 సైకలాజికల్ సైన్స్ అధ్యయనం వెల్లడించింది.మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా తోబుట్టువుల బాంధవ్యాలకు ప్రాముఖ్యం ఉంది. జర్మనీలో, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ చేసిన సుదీర్ఘ అధ్యయనాలు – కనీసం ఒక తోబుట్టువు ఉన్న వ్యక్తులు పెద్దయ్యాక చక్కని సామాజిక సంబంధాలను కలిగి ఉండే అవకాశం 45 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాయి. కుటుంబ గౌరవం, పెద్దల సంరక్షణకు పెద్దపీట వేసే జపాన్ లో.. తోబుట్టువులు తరచూ సంరక్షణ పాత్రలను పోషిస్తుంటారు. సాధారణంగా తండ్రి లేదా తల్లి లేని సింగిల్ పేరెంట్ కుటుంబాల్లో పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ, అమెరికాలో ‘చైల్డ్ డెవలప్మెంట్ జర్నల్’లో వచ్చిన పరిశోధనా వ్యాసం – సింగిల్ పేరెంట్ కుటుంబాల పిల్లల్లో.. తోబుట్టువులు ఉన్నవారు ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని, తోబుట్టువుల అండే అందుకు కారణమని వెల్లడించింది. తోడున్నవాళ్లూ తోబుట్టువులే!.. ఇదంతా చదివాక, ‘అరే, నాకు తోబుట్టువులు లేరే’ అని డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తోబుట్టువులు లేని వాళ్లు కూడా –తోబుట్టువులతో ముడిపడి ఉన్న భావోద్వేగ ప్రయోజనాలను, ముఖ్యంగా మెంటల్ సపోర్ట్‌ను.. స్నేహితులు, బంధువులు లేదా దీర్ఘకాలం రూమ్మేట్లుగా ఉన్న ‘తోబుట్టువుల లాంటి’ వారి ద్వారా పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఒకే రక్తాన్ని పంచుకుపుట్టకపోవడం అన్నది ప్రతికూలాంశం ఏమీ కాబోదని, జన్యువులతో సంబంధం లేకుండా కూడా తోబుట్టువులు దొరకొచ్చని కూడా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రాణ స్నేహితులు కూడా ఒకరకంగా తోబుట్టువులే.తోబుట్టువులు ఉంటే చాలు..» తోబుట్టువులు ఉన్నవారు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు 60 శాతం తక్కువ (బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ)» తోబుట్టువులు ఉన్నవాళ్లకు రాజీపడటం, దీర్ఘకాల అనుబంధాలను కొనసాగించటం వంటి నైపుణ్యాలు అలవడతాయి. (యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్)» తోబుట్టువులతో బాల్యంలో చక్కటి సంబంధాలు ఉన్న పెద్దల్లో ఒత్తిడి సంబంధ అనారోగ్యాలు 2025 శాతం వరకు తక్కువ (సైకలాజికల్ సైన్స్) తాజా పరిశోధన ప్రకారం.. బాల్యంలో ఈ తోబుట్టువులు ఎంత కొట్టుకున్నా... పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఒకరికొకరు అండగా, ఆలంబనగా ఉంటారట. మీకో తోబుట్టువు ఉంటే, మీ లోపల మీకు ఎప్పటికీ ఒక తోడు ఉన్నట్లేనని పరిశోధకులు అంటున్నారు. ఇదెలాగంటే –అక్క అమ్మగా మారిపోయి అక్కునచేర్చుకుంటుంది. తమ్ముడు టెక్నాలజీలో కింగ్ అయిపోయి అన్నగారి సందేహాలను తీరుస్తాడు.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
Bike Taxi Ban: అవసరమైతే హైదరాబాద్‌కి పోతాం!
కర్నాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలకు నిన్నటి(జూన్16) నుంచి బ్రేకులు పడ్డాయి. కోర్టు తీర్పు.. ప్రభుత్వం నుంచి విధానాల రూపకల్పనపై సరైన స్పందన లభించకపోవడంతో ప్రస్తుతం బైక్ ట్యాక్సీలపై నిషేధం అమలు అవుతోంది. దీంతో లక్ష మంది గిగ్ వర్కర్లపై ప్రభావం పడుతోంది. ఇందులో.. ఇదే తమ జీవనోపాధి అని వాపోతున్నారు వేలమంది రైడర్లు. కర్నాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం వేలాది మంది రైడర్లను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు బైక్‌లు నడుపుతున్న విద్యార్థుల దగ్గరి నుంచి.. ఉద్యోగాలు పొగొట్టుకున్న టెక్కీల దాకా ఈ సేవలనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొందరికి ఇది పార్ట్ టైం జాబ్ కాగా.. మరికొందరికి ఫుల్ టైం ఆదాయం అందించే వనరు. 👉కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే మానేసిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ప్రతీ రైడ్ ఒక కొత్త వ్యక్తిని కలవడానికి కలిగించిన అవకాశం. ఈ ప్రయాణం నా ఒంటరితనాన్ని అధిగమించడంలో సహాయపడింది. నేను ఆనందంగా చేసే పనిలో ఆదాయం కూడా వచ్చింది. అలాంటి ఆదాయ వనరుకు ఇప్పుడు గండిపడింది.👉ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు. బిజినెస్ ప్రారంభించాలన్న కల ఉంది. కానీ నెలవారీ జీతంతో పొదుపు కష్టం. అందుకే బైక్ టాక్సీల వైపు వచ్చాను. టార్గెట్లు లేవు, ఒత్తిడి లేదు, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ నిషేధం నా వంటి కలలవాళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే హైదరాబాద్‌కు మారిపోతాను, కానీ ఈ పని వదలను:::మహదేవపురకు చెందిన ఇంద్ర శేఖర్(25) 👉బైక్ రైడ్లతో రోజుకు రూ.3,000 సంపాదించేవాడిని. అందులో కనీసం రూ.2,000 పొదుపు చేసేవాడిని. ఈ రోజుల్లో ఖర్చులకు ఫుల్ టైం ఉద్యోగం ఒక్కటే సరిపోవడం లేదు. పెద్ద నగరాల్లో జీవించాలంటే అదనపు ఆదాయం కచ్చితంగా అవసరం. అలాంటి ఆదాయం లేకుండా పోయింది:::జగదీష్(24), నాన్-ఐటీ ప్రొఫెషనల్👉సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు సాగర్ బైక్ ట్యాక్సీలతో రైడ్లు కొడుతూ సంపాదించుకుంటున్నాడు. ఈ సేవలు నా జీవన విధానాన్ని మార్చేశాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. నా ఆదాయ మార్గం పూర్తిగా కోల్పోయాను. ఇప్పుడు మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని తెలిపాడు. 👉వైట్‌ఫీల్డ్‌లో నివసించే 27 ఏళ్ల టెకీకి ఇది పార్ట్‌టైం జాబ్. ఆఫీస్ తర్వాత బైక్ టాక్సీ రైడ్లు చేస్తాను. ట్రాఫిక్‌లో ఒంటరితనాన్ని తగ్గించేందుకు ఇది మంచి మార్గం. కానీ, ఇప్పుడది లేకుండా పోతోంది అని అంటున్నాడు. నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ స్పందనబైక్ ట్యాక్సీ డ్రైవర్లను ఏదో నేరస్తుల్లాగా పరిగణించడం అన్యాయం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో మేమూ భాగమే. మమ్మల్ని చర్చ లేకుండానే ఎందుకు బయటకు తోసేస్తున్నారు?. లైసెన్సింగ్, ఇన్సూరెన్స్, భద్రతపై స్పష్టమైన నిబంధనలు కావాలి. లక్షకు పైగా గిగ్ వర్కర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది. తీర్పు ఇలా..కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. గత శుక్రవారం ( జూన్ 13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే, నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తే స్టే ఇచ్చేందుకు సుముఖత చూపిస్తామని కోర్టు తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిబంధనలను రూపొందించేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది.మాకు అవసరంబెంగుళూరులో నిత్యం తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రస్తావిస్తూ అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యాఖ్యలతో తమ ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా ట్రాఫిక్‌తో స్తంభించిపోయే బెంగుళూరుకు బైక్ టాక్సీలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రజా రవాణా మార్గాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పును, ప్రభుత్వవ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.వా.. ఎన్ను ఐడియాఇలాంటి నిర్ణయాలతో సంబంధం లేకుండా తమ దారులు తమకు ఉన్నాయని యాప్ ఆధారిత అగ్రిగేటర్లు అంటున్నాయి. రాపిడో తమ యాప్‌లో 'బైక్' సర్వీసును 'బైక్ పార్శిల్'గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే 'పార్శిల్'గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ‘‘రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్‌గా పంపించుకోండి. దీనిని 'ప్యాస్ - ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్' అనొచ్చు" అంటూ ఓ యూజర్ ఇందుకు సంబంధించిన బుకింగ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అలాగే.. ఉబెర్ 'మోటో'ను 'మోటో కొరియర్'గా మార్చింది. వా.. ఎన్ను ఐడియా(వా.. ఏం ఐడియా!) తెలివైన ఎత్తుగడ" అని మరో యూజర్ పేర్కొన్నారు. -
బోయింగ్ డ్రీమ్‌లైనర్ రహస్యాల్ని బయటపెట్టి..
అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్‌బాడీ ఎయిర్లైనర్తో సమీక్ష జరిపిన తర్వాతే ఏ నిర్ణయం అనేది ప్రకటించనుందని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. అయితే.. బోయింగ్ విమానం.. అందునా డ్రీమ్‌లైనర్(Dreamliner) ఎంత మాత్రం సురక్షితం కాదన్న ఆ సంస్థ వేగు, మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ స్టేట్మెంట్ ఇప్పుడు తాజా ప్రమాద నేపథ్యంలో తెర మీకు వచ్చింది. బోయింగ్‌లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన బార్నెట్.. ఆయన 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా లోపాలను బయటపెట్టి సంచలన చర్చకు దారి తీశారు. అయితే ఆయన సజీవంగా లేరు. 👉జాన్ బార్నెట్(John Barnett) 2024 మార్చిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌత్ కరోలీనా చార్లెస్టన్లో తన ట్రక్కులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. అందుకు.. ‘‘ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను’’ అంటూ ఆయన చేతిరాతతో దొరికిన నోట్‌ను ప్రస్తావిస్తుంటారు.👉ఆ నోట్ ఆధారంగా.. ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్‌పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. 👉787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. అయితే ఆ విమానం అందుకు పనికి రాదన్నది బార్నెట్ వాదన. 👉బోయింగ్ సంస్థలో బార్నెట్ మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2010 నుండి 787 డ్రీమ్‌లైనర్‌ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్‌లో క్వాలిటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ చేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా.. బోయింగ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.ఏం చెప్పాడంటే.. 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి.. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసింది’’ అంటూ చెప్పారాయన. అలాగే.. Photo Credits: Netflix👉ఇదే కాకుండా కార్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యులేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ వ్యక్తం చేసిన కొన్ని ఆందోళనల్ని సమర్థించింది. 👉2022లో నెట్ఫిక్స్ ‘డౌన్‌ఫాల్: ది కేస్ అగెనెస్ట్ బోయింగ్’ డాక్యుమెంటరీలో జాన్ బార్నెట్ కనిపించారు. ప్రత్యేకించి 737 మ్యాక్స్ ప్రమాదాల గురించి ఆయన చర్చించారు.👉2024 మొదట్లో.. అలస్కా ఎయిర్‌లైన్స్ తలుపులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బోయింగ్ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపించారు. చివరకు.. తన మరణానికి ముందు కూడా ఆయన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 👉అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. తాజాగా.. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంతో.. బోయింగ్ డ్రీమ్‌లైనర్‌పై బార్నెట్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. -
భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!
భారత్‌లో ఇవాళ(జూన్ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?ఆగష్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్‌టాప్ రన్‌వే తో పాటు ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారుమే 22, 2010ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక) వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.• కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్‌ను రద్దు చేయడంలో విఫలమవడం, జులై 17, 2000జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)• వివరాలు: కోల్‌కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.• ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.• కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.నవంబర్ 12, 1996సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్, కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. ఏప్రిల్ 26, 1993ఔరంగబాద్‌లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.ఆగష్టు 16, 1991ఇంఫాల్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారుఫిబ్రవరి 14, 1990ఇండియన్ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగుతుండగా.. క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. అక్టోబర్ 19, 1988ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.జూన్ 21, 1982ఎయిర్ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.జనవరి 1, 1978ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. అక్టోబర్ 12, 1976ముంబైలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.మే 31, 1973ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయిజూన్ 14, 1972లో.. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు జులై 28, 1963లో.. యునైటెడ్ అరబ్ ఎయిర్‌లైన్స్ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారుజులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్‌ఈస్ట్‌లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.మే 25, 1958లో.. అన్ అవ్రో యార్క్ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్‌లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.ఇదీ చదవండి: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో -
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
భూతల స్వర్గంగా పేరున్న కశ్మీరానికి దేశం నలుమూలల నుంచే కాదు.. యావత్ ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు క్యూ కట్టేవారు. పచ్చని గడ్డి మైదానాలు.. దూరంగా ఫైన్ చెట్ల మధ్య నుంచి కనిపించే మంచుపర్వతాలు చూపరులను ఎంతో ఆకట్టుకునే ఏప్రిల్-జూన్ సీజన్ మరేంతో ప్రత్యేకంగా ఉండేది. అలాంటి సీజన్ ఇలా బోసిపోయి ఉంటుందని అక్కడి టూరిస్ట్ గైడులు, వ్యాపారులు కలలో కూడా ఊహించి ఉండరు!. పహల్గాం ఉగ్రదాడితో.. కశ్మీర్ పర్యాటకాన్ని చీకట్లు కమ్మేశాయి. మంగళవారం మధ్యాహ్నాం ఉగ్రదాడి జరగ్గా.. బుధవారం ఉదయం నుంచే పర్యాటకులు శరవేగంగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. శ్రీనగర్ వెళ్లే విమానాలు ఖాళీగా బోసిపోయి కనిపిస్తుండగా.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇళ్ల రైలు ప్రయాణాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయాణాలు కన్ఫర్మ్ కాగా.. హోటల్స్, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్లు, రోడ్లు ఇలా ఎక్కడపడితే అక్కడ ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు పర్యాటకులు. 48 గంటలు.. ఎంత మారిపోయిందో?పహల్గాం ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండు రోజులు గడిచింది. ఈ రెండు రోజులు మొత్తం జమ్ము కశ్మీర్ పర్యటకం స్తంభించిపోయింది. జమ్ము కశ్మీర్‌కు మణిహారంగా భావించే దాల్ సరస్సు చుట్టుపక్కల ఒక్క పర్యాటకుడు కూడా కనిపించలేదంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. నిత్యం టూరిస్టులతో బిజీబిజీగా గడిపే షికారాలు.. మూలనపడ్డాయి. అలాగే.. దాడి జరిగిన బైసరన్ లోయ పూర్తిగా సైన్యం అదుపులో ఉండిపోయింది. ఇక మిగతా పర్యాటక ప్రాంతాల పరిస్థితి కూడా దాదాపుగా అంతే ఉంది. పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. జీవనాధారం దెబ్బ తింటుందనే.. పహల్గాం దాడి.. తదనంతర పరిణామాలు జమ్ము కశ్మీర్‌కు మళ్లీ పాత కల్లోల రోజులను గుర్తు చేస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ మే జూన్ నెలల జమ్ము పర్యాటకానికి ఎంత కీలకం. అలాంటి సమయంలో.. అదీ పర్యాటకుల మీద జరిగిన ఉగ్రదాడి కశ్మీర్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టిన చీడపురుగుల్ని వెతికి నలిపేయాలంటూ పద్మశ్రీ గులాం రసూల్‌ఖాన్ కోరుతున్నారు. ‘‘ఇక్కడి జనాలకు పర్యాటకమే జీవనాధారం. అలాంటిది దెబ్బ తింటే వాళ్లు ఎలా బతుకుతారు?’’ అని ప్రశ్నిస్తున్నారాయన. ఈ క్రమంలో టూరిస్టులకు కొందరు వ్యాపారులు ధైర్యం చెబుతూ.. బతిమాలుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రగిలిపోయిన కశ్మీర్ ప్రజలుఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో తీవ్ర స్థాయిలో నిరసనలు జరిగింది బుధవారమే. గత 35 ఏళ్లలో ఏప్రిల్ 23వ తేదీన కశ్మీర్ తొలిసారిగా మొత్తం మూత పడింది. సాధారణ ప్రజలు, వర్తకులంతా రోడ్డెక్కి ఉగ్ర చర్యను ఖండించారు. ఇది తమ ఆత్మపై జరిగిన దాడిగా భావించి ఆందోళనకు దిగారు. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని, నిరసన ర్యాలీలో కలిసి రావాలని మసీదుల్లోని మైకుల ద్వారా విజ్ఞప్తులు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, ఐ యామ్ ఇండియన్ అంటూ ఉగ్రచర్యను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. పర్యాటకులకు సాయంజమ్ము కశ్మీర్ టూరిజం విభాగం ధైర్యం చెబుతున్నప్పటికీ.. పర్యాటకులు మాత్రం కశ్మీర్‌ను వీడడం ఆపడం లేదు. ఈ క్రమంలో అక్కడి వ్యాపారులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా పర్యాటకులకు సాయంగా నిలుస్తున్నారు. ఉచితంగా ఆహార పొట్లాలను, మంచి నీటిని అందిస్తున్నారు. ఉగ్రదాడి తర్వాత స్వస్థలాలకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోయిన వాళ్లకు ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మరికొందరు డ్రైవర్లు వాళ్లను రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో ఉచితంగా దించుతున్నారు. ఎంతో కొంత డబ్బు ఇవ్వడానికి పర్యాటకులు ప్రయత్నిస్తున్నా.. వాళ్లు వద్దని చెబుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సాయాన్ని కూడా కొందరు విమర్శిస్తుండగా.. ఎక్కువ మంది అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by Molitics (@moliticsindia)‘‘మేమూ మనుషులమే. ఇది పర్యాటకమో.. మా ఆదాయానికో సంబంధించింది కాదు. సరదాగా కుటుంబాలతో వచ్చిన ఆ పర్యాటకులు చేసిన తప్పేంటి?. ఈ దాడికి పాల్పడిన వాళ్లను సైన్యం వదిలిపెట్టకూడదు. అవసరమైతే మేమూ సైన్యానికి మా వంతు సాయం అందిస్తాం. ఇది డబ్బో, వ్యాపారానికో సంబంధించింది కాదు. మానవత్వానికి సంబంధించింది. అలాంటిది.. మానవత్వం మీద దాడి జరిగింది మరి’’ అని కొందరు కశ్మీరీలు భావోద్వేగంగా చెబుతున్నారు.కొసమెరుపు.. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వినితా చైతన్య.. దాల్ సరస్సులో షికారా ప్రయాణాన్ని తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒకవైపు టూరిస్టులు ఆ వైపు వెళ్లేందుకు జంకుతుంటే.. ఆమె మాత్రం ఆ ప్రయాణం రద్దు చేసుకోవడం ఇష్టం లేక ఆస్వాదించానంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Vinita Chaitanya (@vinitachaitanya) -
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.కశ్మీర్ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్ ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్ అల్పైన్ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. పైగా ల్యూలియన్ సరస్సుకు బైసరన్ వ్యాలీ బేస్‌గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.అయితే పహల్గాం(pahalgam) బైసరన్ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్ వెహికిల్స్‌ను అనుమతించరు. పహల్గాం టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్‌తోనే బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్‌లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్ ఫైర్ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్‌లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్ వ్యాలీ.. నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.ఎమోషనల్ పోస్టులుపహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్ మీడియాలో బైసరన్ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)#baisaranvalley. Kashmir. Had been there 2 years before with family. Can’t imagine today this tragic incidence has happened at the same place. My heart goes out to the victims, their families and all those tourist civilians who lost their life🙏 pic.twitter.com/MabmrYmG5F— Rakesh Banerjee (@RakeshB41201077) April 22, 2025 Most people refer to Baisaran Valley in Pahalgam as "Mini Switzerland" but I prefer to call it by its own name Baisaran. After all, it’s Kashmir, not Switzerland. Why would I compare such a breathtaking place in Kashmir to another country? Baisaran has its own unique charm.. pic.twitter.com/MDLDXl41L7— batukh (@Samaandar_) March 13, 2025 -
ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!
ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. .. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.పంతాలతో కుటుంబాలు నాశనంసామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు⇒ మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.⇒ ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.⇒ మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.⇒ 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.⇒ 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ⇒ 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.⇒ 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.ఆలోచన తీరు మారాలి కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీకుల వివక్షపై అవగాహన కల్పించాలి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా, కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్ :::సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
TN Vs Centre: భాషా యుద్ధం.. ఇది ఈనాటిదేం కాదు!
జాతీయ విద్యా విధానం(National Education Policy 2020) అమలు విషయంలో.. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా సంచలన ఆరోపణలు చేయగా.. బీజేపీ అంతే ధీటుగా బదులిచ్చింది. బలవంతంగా హిందీ భాషను రుద్ది.. స్థానిక భాషలను కనుమరుగయ్యే స్థాయికి చేర్చారంటూ ఆరోపిస్తున్నారాయన. సోదరీసోదరీమణుల్లారా.. గత 100 సంవత్సరాల్లో ఎన్ని భాషలను హిందీ మింగేసిందో తెలుసా? భోజ్‌పురి, మైథిలీ, అవాదీ, బ్రజ్, బుంధేలీ, ఖుమావోని, మఘాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌ఘడీ, అంగిక, సంతాలి, హో, ఖారియా, ఖోర్థా, కుర్మాలీ, ముండారీ, కురుఖ్.. ఇలా పాతికకుపైగా నాశనం చేసింది. ఇంకోన్ని భాషలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఏకపక్షంగా హిందీని రాష్ట్రాలపై రుద్దేయాలన్న నిర్ణయం.. పురాతన భాషలను తుడిచి పెట్టేస్తోంది. ఉత్తర ప్రదేశ్, బీహార్లు హిందీకి గుండెకాయలు అని చెబుతుంటారు. కానీ, ఆ రాష్ట్రాల్లో అసలైన భాషలు అంతరించే స్థితికి చేరుకున్నాయి అని స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీ అమలు విషయంలో తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని.. కేవలం 2026 ఎన్నికల్లో లాభం కోసమే పాకులాడుతున్నాయని కేంద్రం డీఎంకే ప్రభుత్వంపై మండిపడుతోంది. అయితే స్టాలిన్ ఈ విమర్శలను కూడా తిప్పికొట్టారు. తమిళనాడుకు మాత్రం ఆ నిర్ణయం(NEP) ఏవైపు దారి తీస్తుందో తెలుసని, అందుకే అమలు చేయబోమంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన.My dear sisters and brothers from other states,Ever wondered how many Indian languages Hindi has swallowed? Bhojpuri, Maithili, Awadhi, Braj, Bundeli, Garhwali, Kumaoni, Magahi, Marwari, Malvi, Chhattisgarhi, Santhali, Angika, Ho, Kharia, Khortha, Kurmali, Kurukh, Mundari and… pic.twitter.com/VhkWtCDHV9— M.K.Stalin (@mkstalin) February 27, 2025ఇదిలా ఉంటే.. స్టాలిన్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆయన(Stalin) వాదన అసంబద్ధంగా(Silly)గా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తొలుత జాతీయ విద్యావిధానం అమలు చేస్తామని తమిళనాడు కూడా అంగీకరించిందని, ఆపై రాజకీయ లబ్ధి కోసమే యూటర్న్ తీసుకుందని మండిపడ్డారాయన. ఇక.. ఎన్ఈపీ అమలుకు సన్నద్ధంగా లేకపోవడం వల్లే తమిళనాడుకు వచ్చే రూ. 2,400 కోట్ల ఫండ్‌ను కేంద్రం ఆపేసిందన్న ఆరోపణలనూ మంత్రి ధర్మేంద్ర తోసిపుచ్చారు. ఎన్ఈపీ ప్రకారం రాష్ట్రాలు తమకు నచ్చిన భాషలను అమలు చేసే అవకాశం ఉందని, కానీ తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.హిందీ భాష అమలు విషయంలో కేంద్రం గనుక తమ రాష్ట్రంపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే.. మరో భాషా యద్ధానికి(Language War) సిద్ధమంటూ సీఎం స్టాలిన్, ఆయన తనయుడు.. డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే..అప్పటి నుంచే అనుమానాలుభారత రాజ్యాంగం ప్రకారం 15 ఏళ్లపాటు హిందీతో పాటు ఇంగ్లీష్‌ను అధికారిక ఉత్తర్వుల కోసం వినియోగించాలని కానిస్టిట్యూట్ అసెంబ్లీ నిర్ణయించింది. దీని ప్రకారం.. జనవరి 26, 1950 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే 1965లో ఆ గడువు పూర్తి కావడంతో.. హిందీయేతర రాష్ట్రాలు ఆందోళన బాట పట్టాయి. బలవంతంగా తమ రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేస్తారేమో అని ఉద్యమాలు మొదలుపెట్టాయి. తమిళ సంప్రదాయాలతో పాటు భాషప్రతిపాదికన మద్రాస్ గడ్డపై ద్రవిడ ఉద్యమం జరిగింది. అలాంటి చోట హిందీ భాష ప్రవేశపెట్టడంపై దశాబ్దాల నుంచే వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. 1965లో తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో భారీ హిందీ భాష అమలు వ్యతిరేక ఉద్యమం జరగ్గా.. అది హింసాత్మక మలుపు తీసుకుంది. హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ.. ఎంతో మంది బలిదానం చేసుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ను తమిళనాడులో అధికార పీఠం నుంచి దించేయడానికి ఓ కారణమైంది. తమిళనాడులో రెండు భాషలే..సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని తొలి డీఎంకే ప్రభుత్వం.. 1968లో తమిళనాడు కోసం ఓ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తమిళం, ఆంగ్లం మాత్రమే బోధించాలని ఉంది. అయితే అదే సమయంలో ఇందిరా గాంధీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం కొఠారి కమిషన్(1964-66) నివేదిక ఆధారంగా తొలిసారి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టింది. సమాన విద్యావకాశాలను ప్రొత్సహించడంతో పాటు జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా మూడు భాషల ఫార్ములాను ప్రవేశపెట్టాలని సదరు కమిషన్ సూచించింది. దీని ప్రకారం.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలను సూచించింది. అయితే ఆ టైంలోనూ హిందీ తప్పనిసరి కాదని కేంద్రం చెప్పినా.. ఆ విద్యావిధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది.👉1968లో ఇందిరా గాంధీ హయాంలో మొదటి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. 14 ఏళ్లలోపు వారికి తప్పనిసరి విద్య, శాస్త్ర విజ్ఞాన రంగాలపై అవగాహన ద్వారా ఆర్థిక అభివృద్ధి, సమాన విద్యావకాశాలు, టీచర్లకు శిక్షణ.. ఇతర అంశాలతో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇందులో మూడు భాషల విధానం తీసుకొచ్చింది కేంద్రం. 👉ఇక.. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో మరోసారి ఎన్ఈపీ తెరపైకి వచ్చింది. ఈసారి మూడు భాషల అంశం లేకుండా.. కేవలం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అన్ని వయసుల వారికి విద్యను అందించడం మీదనే ఫోకస్ చేసింది.👉ముచ్చటగా మూడోసారి.. పీవీ నరసింహారావు హయాంలో ప్రవేశపెట్టారు. అయితే.. 1986 ఎన్ఈపీకే కొన్ని మార్పులుచేర్పులు చేశారు. సమకాలీన సవాళ్లను ప్రస్తావిస్తూ.. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంపై ఆయన దృష్టిసారించారు.ఇక.. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే ఉద్దేశంతో.. 2020, జులై 29వ తేదీన జాతీయ విద్యా విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా 1986 జాతీయ విద్యా విధానాన్ని(ఇప్పుడు అమల్లో ఉన్నదే) సమూలంగా మార్చేసింది. జులై 29, 2020లో అప్పటి కేబినెట్ నూతన విద్యా విధానానికి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం 10+2గా ఉన్న బేసిక్ అకడమిక్ వ్యవస్థను.. 5+3+3+4గా మార్పు చేయడంతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ ఎన్ఈపీ ప్రకారం.. మూడు లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో హిందీ కూడా ఉంది. కానీ.. ఇది బలవంతపు నిర్ణయం కాదని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. రాష్ట్రాలు, రీజియన్లు, విద్యార్థులు తమకు నచ్చి భాషలను ఎంచుకునే వీలు ఉంటుందని చెబుతూ వస్తోంది. అయితే ఇది తమ మాతృభాషకు దొడ్డిదారిన ముప్పు కలిగించే ప్రయత్నమేనని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానం అమలు చేయబోమని చెబుతోంది. ఇక 2026లో ఈ విద్యావిధానం అమల్లోకి రానుంది. -
Budget-2025: బడ్జెట్లో మాకేంటి?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థికమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) చదివే పద్దుపై అందరిలోనూ అంచనాలున్నాయి. ఆదాయ పన్ను విషయంలో ఊరట ఉంటుందా? ధరలు తగ్గిస్తారా?. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? ఇలా రకరకాల ప్రశ్నలకు ఆరోజున సమాధానం దొరకనుంది. అయితే సాధారణంగా బడ్జెట్‌తో మాకేంటి? అని జనం అనుకుంటారనే భావన ఒకటి ఉంది. కానీ, అది తప్పని సాక్షి.కామ్ ప్రయత్నం నిరూపించింది. బడ్జెట్లో మాకేంటి అంటున్న ‘సామాన్యుడి’ మనోగతం వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం.. 👉సాధారణ ప్రజలకు మాదిరిగా కాకుండా.. సూపర్ రిచ్ వారికి కొంత ట్యాక్స్ పెంచాలి. ఎందుకంటే సాధారణ ప్రజలు, కోటీశ్వరులు ఇద్దరూ కూడా సమానంగా ట్యాక్స్ కడుతున్నారు. ఇది ధనవంతులపై ప్రభావం చూపకపోయినా, సామాన్యులకు భారంగా ఉంటుందని కార్పొరేట్ ఉద్యోగి అన్నారు. టోల్ గేట్ చార్జీలను కూడా కొంత తగ్గిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు.👉భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ రంగానికి కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. రైతుకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉంటే బాగుంటుందని.. చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు పేర్కొన్నారు.👉మధ్యతరగతి వేతన జీవులు.. ప్రతీసారి బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ చివరకు నిరాశే మిగులుతూ వస్తోంది. ఈసారైనా మాలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల, కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటోంది. కాబట్టి ఈసారి బడ్జెట్లో మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ::ఏపీకి చెందిన ఓ వైద్యుడి అభిప్రాయం👉ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే, అందరికి ఉపయోగకరంగా ఉంటుందని, మదనపల్లెకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025పై తన ఆశాభావం వ్యక్తం చేశారు.👉2025-26 బడ్జెట్లో నిత్యావసరాల ధరలపై ట్యాక్స్ తగ్గించాలని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మెదక్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్ధి చెప్పారు.👉బడ్జెట్ వచ్చినప్పుడల్లా.. ఏదేదో అంచనాలు వేసుకుంటూనే ఉంటాను. కానీ అంచనాలను తగ్గట్టుగా ఎప్పుడూ బడ్జెట్ ఉండటం లేదు. ఈ సారైనా నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ తగ్గించాలని జర్నలిస్ట్ పేర్కొన్నారు.👉నిత్యావసరాల ధరలతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఆటోమొబైల్ మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని ఆశిస్తున్నట్లు.. హైదరాబాద్‌లో కెమెరామెన్‌గా పని చేసే వ్యక్తి చెప్పారు.👉సీనియర్ సిటిజన్, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి, ఈ బడ్జెట్ 2025పై స్పందిస్తూ.. వ్యవసాయదారులకు అవసరమైన పథకాలను మరిన్ని ప్రవేశపెట్టాలని, వ్యవసాయ పనిముట్ల మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని పేర్కొన్నారు.:: సిరికుమార్, సాక్షి వెబ్ బిజినెస్ డెస్క్ -
పుట్టుకతో వచ్చే పౌరసత్వం: భారత్ సహా ఏ దేశాల్లో ఎలా ఉందంటే..
విదేశీయులకు పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అమెరికాలో సహజంగా దక్కుతున్న పౌరసత్వ హక్కును రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారు. కానీ, న్యాయస్థానం తాజాగా ఆ ఆదేశాలకు మోకాలడ్డేసింది. దీంతో అప్పీల్‌కు వెళ్లాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే.. జన్మతః దక్కే పౌరసత్వం విషయంలో మిగతా దేశాలు ఏం విధానాలు పాటిస్తున్నాయో తెలుసా?.అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ ఒక్కరికీ అక్కడి పౌరసత్వం దక్కేలా అక్కడి రాజ్యాంగం హక్కు కల్పించింది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ హక్కు దక్కాలి కూడా. అయితే ఆ హక్కును తనకున్న విశిష్ట అధికారంతో మార్చేయాలని ట్రంప్ భావించారు.ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇకపై అమెరికా నేలపై విదేశీయులకు పుట్టే పిల్లలను అమెరికా పౌరులుగా పరిగణించకూడదన్నది ఆ ఆదేశాల సారాంశం.👉పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తింపజేయడమే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్. తల్లిదండ్రుల జాతీయత.. అంటే వాళ్లది ఏ దేశం, ఇమ్మిగ్రేషన్ స్టేటస్.. అంటే ఏ రకంగా వలసలు వచ్చారు ఇలాంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా అమెరికాలో ఇంతకాలం పౌరసత్వ గుర్తింపు ఇస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తంగా ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్, జస్ సోలి’’ అనే రెండు సిద్ధాంతాల ఆధారంగా సిటిజన్‌షిప్‌ను వర్తింపజేస్తున్నారు. అయితే.. ఎక్కువ దేశాలు మాత్రం పౌరసత్వాన్ని ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్’’ ఆధారంగానే పౌరసత్వం అందిస్తున్నాయి . జస్ సాన్‌గ్యుఇనిస్ అంటే.. వారసత్వంగా(రక్తసంబంధంతో) పౌరసత్వ హక్కు పొందడం. జస్ సోలి అంటే.. ఫలానా దేశంలో పుట్టిన కారణంగా ఆ దేశ పౌరసత్వ హక్కు లభించడం. 👉ఇప్పటిదాకా అమెరికా మాత్రమే కాదు.. మరికొన్ని దేశాలు పుట్టుకతో పౌరసత్వం విషయంలో జస్ సోలి వర్తింపజేస్తున్నాయి. అందులో అమెరికా పొరుగుదేశాలైన కెనడా కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అమెరికా తరహాలోనే ఈ దేశం కూడా తమ గడ్డపై పుట్టే విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తింపజేస్తోంది. అయితే అమెరికాలోలానే ఇక్కడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.👉అమెరికా రెండు ఖండాల్లో మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలాదేశాలే ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. చిలీ, కంబోడియా మాత్రం ఇవ్వడం లేదు. ఆ దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ ఆధారంగా పౌరసత్వం అందించడంపై ప్రధానంగా దృష్టిసారించాయి. 👉యూరప్, ఆసియా, ఆఫ్రికా.. చాలా దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ మీదే జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం షరతులతో కూడిన సడలింపులు ఇచ్చాయి ఉదాహరణకు.. జర్మనీ, ఫ్రాన్స్‌లాంటి దేశాలు తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లపాటు(ప్రస్తుతం 8 సంవత్సరాలుగా ఉంది) జీవించి ఉండాలి. అలా ఉంటే ఆ పిల్లలకు ఆ దేశాల పౌరసత్వం వర్తిస్తుంది. అలాగే.. కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి.👉భారత్‌లో జన్మతఃపౌరసత్వంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. జస్ సాన్గ్యుఇని అనుసరిస్తోంది మన దేశం. అంటే.. వారసత్వంగా రక్తసంబంధీకులకు పౌరసత్వం వర్తిస్తుందన్నమాట. అయితే.. 1928లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. జస్ సోలిని భారత్‌లోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. అంటే.. భారత గడ్డపై జన్మించే విదేశీయులకు కూడా ఇక్కడి పౌరసత్వం వర్తింపజేయాడన్నమాట. జస్ సాన్గ్యుఇని ‘జాతి భావన’ మాత్రమే ప్రతిబింబిస్తుందని, అదే జస్ సోలి అనేది సమాన హక్కుల భావనను చూపిస్తుందని ఈ కమిటీ అభివర్ణించింది. ఈ కమిటీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రూ ఉన్నారు.1949లో రాజ్యాంగం కూడా ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. కానీ, కాలక్రమేణా భారత్‌లో వారసత్వ పౌరసత్వానికే ప్రాధాన్యం లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం.. జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్లు ఉండాలి. మరొకరు చట్టపరంగా వలసదారు అయి ఉంటే సరిపోతుంది.👉జపాన్‌లోనూ కఠిన నిబంధనలే అమలు అన్నాయి. అయితే ఏ జాతీయత లేని స్థితిలో ఆ పిల్లలకు అక్కడి పౌరసత్వం ప్రసాదిస్తారు. స్పెయిన్‌లో పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి కచ్చితంగా పౌరసత్వం ఉండాలి. లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి.👉ఇటలీలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై పరిమితులున్నాయి. పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి ఇటలీ పౌరసత్వం ఉండాలి. లేదంటే.. ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలి. అప్పుడే పౌరసత్వం ఇస్తారు.👉యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మలేషియా.. ఇలా మరికొన్ని దేశాల్లోనూ తల్లిదండడ్రులు కచ్చితంగా ఆ దేశ పౌరులై ఉంటేనే, లేదంటే శాశ్వత నివాసుతులై ఉంటేనే అక్కడి పౌరసత్వం సంక్రమిస్తుంది. 👉జన్మతః పౌరసత్వ హక్కుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సమానత్వం, ఏకీకరణలతో పాటు జాతీయత విషయంలో న్యాయపరమైన చిక్కులేవీ తలెత్తకుండా ఉంటాయి. అయితే.. అభ్యంతరాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అక్రమ వలసదారుల్నిప్రొత్సహించడంతో పాటు దేశంపై ఆర్థికపరమైన భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలోనే పౌరుల జాతీయత-వలసవిధానం గురించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇది ‘‘బర్త్ టూరిజం’’గా మారే ప్రమాదం లేకపోలేదని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. దాదాపు 6,20,000 మంది ఈ యుద్ధంలో మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. ఈ 157 ఏళ్ల చరిత్రను రాజ్యాంగ సవరణ ద్వారా కాకుండా.. తన సంతకంతో మార్చేయాలని ట్రంప్ భావించడం విశేషం. -
ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!
యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది కోల్‌కతా యువ వైద్యురాలి హత్యాచారం కేసులో.. సంజయ్ రాయ్‌కి మరణశిక్ష పడకపోవడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత అరుదైన కేసు కాదనే ఉద్దేశంతోనే అంతటి శిక్ష వేయడం లేదని సీల్దా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ కేసులో కంటికి కన్నులాగా.. ప్రాణానికి ప్రాణం తీయడమే సరైందని.. న్యాయస్థానం ఆ అంశాల్ని పరిశీలించి ఉండాలనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో బెంగాల్లోనే చర్చనీయాంశమైన కేసుల్ని ప్రస్తావిస్తున్నారు.కిందటి ఏడాది ఆగష్టులో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారోదంతం.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన బాట చేపట్టడంతో వైద్య సేవలపైనా ప్రభావం పడడమే అందుకు ప్రధాన కారణం. అదే సమయంలో మహిళలపై అఘాయిత్యాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందనే వాదనను ఈ కేసు తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే బెంగాల్ సర్కార్ అపరాజిత పేరుతో ప్రత్యేక చట్టం చేసుకుంది కూడా. కానీ, దోషికి సరైన శిక్ష పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఆర్జీకర్ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించాయి పశ్చిమ బెంగాల్ న్యాయస్థానాలు.1. ఆగష్టు 2023లో మతిగరలో 16 ఏళ్ల అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అతనికి సిలిగూరి కోర్టు కిందటి ఏడాది సెప్టెంబర్ 21న మరణశిక్ష విధించింది.2. 2023 ఏప్రిల్‌లో.. తిల్జల ప్రాంతంలో ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగింది. సెప్టెంబర్ 26వ తేదీన ఆ మానవమృగానికి మరణశిక్ష విధించింది కోల్కత్తా కోర్టు.3. కిందటి ఏడాది అక్టోబర్‌లో కుల్తలి ఏరియాలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడ్డ వ్యక్తికి.. డిసెంబర్ 6వ తేదీన కోర్టు మరణశిక్ష విధించింది.4. డిసెంబర్ 13వ తేదీన.. తొమ్మిదేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడికి మరణశిక్ష విధించింది ఫరక్కా కోర్టు.5. కిందటి ఏడాది నవంబర్‌లో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడి ప్రాణం తీసిన కిరాతకుడికి ఆదివారం(జనవరి 20న) హూగ్లీ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.ఈ ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించిన న్యాయస్థానాలు.. ఆర్జీకర్ కేసు, ఆ కేసులో చోటుచేసుకున్న పరిణామాలను ఎందుకు అంతతీవ్రమైనవిగా పరిగణించలేకపోయిందనేది పలువురి ప్రశ్న. అయితే దీనికి న్యాయ నిపుణులు వివరణ ఇస్తున్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ మాట్లాడుతూ.. ఈ తరహా శిక్షలు కేవలం బాధితురాలికో, ఆమె కుటుంబానికో మాత్రమే కాదు.. యావత్ సమాజానికి న్యాయం జరుగుతుందనే సందేశాన్ని పంపిస్తాయి. మహిళలు, మరీ ముఖ్యంగా మైనర్ల విషయంలో కలిగే అభద్రతాభావాన్ని తొలగించే అడుగు అని అన్నారు. అయితే.. పైన చెప్పుకున్న అన్ని కేసులు మైనర్లపై జరిగిన అఘాయిత్యాలే. తీర్పులు ఇచ్చిన అన్ని కోర్టులు.. పోక్సో న్యాయస్థానాలే. పైగా ఈ కేసులన్నింటిలో బాధిత చిన్నారులకు.. వాళ్ల కుటుంబ సభ్యులతో నేరానికి పాల్పడిన వాళ్లకు పరిచయాలు ఉన్నాయి. నమ్మి వెంట వెళ్లిన చిన్నారులను చిధిమేశాయి ఆ మానవమృగాలు. పైగా ఈ కేసుల్లో బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే అత్యంత అరుదైన కేసులుగా ఆయా న్యాయస్థానాలు గుర్తించాయి అని చెబుతున్నారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ. మతిగర, కుల్తలి, ఫరక్కా కేసుల్లో స్వయంగా ఈయనే వాదనలు వినిపించారు. పై ఐదు కేసుల్లో మరణశిక్షలను, అలాగే ఆర్జీకర్ కేసుల్లో యావజ్జీవ కాగారార శిక్షను న్యాయనిపుణులు సమర్థిస్తున్నారు. భావోద్వేగాలు, ప్రజాభిప్రాయాలు.. న్యాయవ్యవస్థలను ఎంతమాత్రం ప్రభావితం చేయబోవని చెబుతున్నారు. అలాగని.. ఆ ఆందోళనలను గనుక పరిగణనలోకి తీసుకుని కోర్టులు సత్వర న్యాయానికి ప్రయత్నించడం ఎంతమాత్రం మంచిదికాదని అంటున్నారు.అత్యంత అరుదైన కేసంటే.. మన దేశంలో అంత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్షలు విధిస్థాయి న్యాయస్థానాలు. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఆధారంగా సుప్రీం కోర్టు తొలిసారి ఈ తరహా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు ముగ్గురిని హతమార్చాడనే అభియోగాల కింద బచ్చన్ సింగ్ అనే వ్యక్తికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించగా.. హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత కేసు సుప్రీం కోర్టుకు చేరింది.ఐపీసీ సెక్షన్ 302 రాజ్యాంగబద్ధతతో పాటు సీఆర్పీసీలోని సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్షలకు ప్రత్యేక కారణాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలను ఈ కేసు సవాల్ చేసింది. అయితే ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ వైసీ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. 1980 ఆగష్టు 16వ తేదీన తీర్పు వెల్లడించింది. కింది కోర్టులు విధించిన మరణశిక్షను సమర్థించింది.భారతీయ న్యాయవ్యవస్థకు ‘‘అత్యంత అరుదైన కేసు’’ సిద్ధాంతాన్ని తెచ్చిపెట్టింది ఈ తీర్పు. నేర తీవ్రత, ప్రత్యేక పరిస్థితులను, మానవ హక్కులను గౌరవించడంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే.. అంతిమ మార్గంగా మరణశిక్షలు విధించాలని తీర్పు సమయంలో రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు తర్వాతి కాలంలో భారతీయ కోర్టులకు మార్గదర్శకంగా మారింది.అంత్యత అరుదైన కేసులకు వర్తించేవి ఇవే..నేర తీవ్రతనేరానికి పాల్పడ్డ తీరు, ఉద్దేశాలుఆ నేరం.. సమాజంపై చూపించే ప్రభావంనేరస్తుడి వయసు, కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పరిస్థితులునేరస్థుడిలో జైలు జీవితం పరివర్తన తీసుకొచ్చే అంశాల పరిశీలనమన దేశంలో అత్యంత అరుదైన కేసుల్లో మరణశిక్షలు పడ్డవెన్నో. వాటిల్లో కోల్‌కతాలో స్కూల్ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ ధనంజయ్ ఛటర్జీ(1990)కి, నిర్భయ ఘటన(2012)లో, 2008లో ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్‌లకు అత్యంత ప్రముఖమైన కేసులుగా నిలిచాయి.అయితే.. అత్యంత అరుదైన కేసుల్లో సాధారణంగా కింది కోర్టులు మరణశిక్షలు విధిస్తుంటాయి. వాళ్లు పైకోర్టులకు వెళ్లినప్పుడు.. ఊరట లభించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి అని బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ జయంత మిత్రా అంటున్నారు. ఆర్జీకర్ కేసులోనూ నిందితుడు పైకోర్టులో తనకు పడ్డ జీవితఖైదు శిక్షనూ సవాల్ చేసే అవకాశం లేకపోదని చెబుతున్నారాయన. -
హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం, ఆ ఘనత ఎవరికంటే..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావడంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంధీలను విడిచిపెట్టడంతో(Gaza hostage release) పాటు కాల్పుల విమరణ ఒప్పందానికి సిద్ధపడడంతో ఇరువర్గాలను ట్రంప్ మెచ్చుకున్నారు. అయితే.. మరో ఐదు రోజుల్లో ఆయన వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. ఈలోపే గాజా యుద్ధం ముగింపు దిశగా అడుగు పడడాన్ని ఆయన తన విజయంగా అభివర్ణించుకుంటున్నారు.‘‘కిందటి ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మేం చారిత్రక విజయం సాధించాం. ఆ ఫలితమే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ ఉంచారు. నిబద్ధతతో కూడిన తన పరిపాలన.. శాంతి, సామరస్యంతో ప్రపంచానికి శక్తివంతమైన సంకేతాలను పంపిందని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇజ్రాయెల్ సహా మా మిత్రపక్షాలతో మేం(అమెరికా) సత్సంబంధాలు కొనసాగిస్తాం. అలాగే.. గాజాను మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చబోం అని ఆయన రాసుకొచ్చారు.తాజాగా హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు.కాగా, హమాస్‌కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకు అమెరికా సహా పలు దేశాలు నిర్విర్వామంగా కృషి చేస్తూ వస్తున్నాయి. గాజా శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్, ఖతార్‌ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ టైంలో(కిందటి ఏడాది మే చివర్లో) ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఖతార్ ద్వారా హమాస్‌కు సైతం ఆ ఒప్పందం చేరవేశారు. ఇక గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు, దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న వందలమంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తలూపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే..మొదటి దశఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి.రెండో దశసైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి.మూడో దశగాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.అయితే.. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పంద సూత్రాలకే ఇరు వర్గాలు అంగీకరించాయా? లేదంటే అందులో ఏమైనా మార్పులు జరిగాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మధ్యవర్తులు చెబుతున్న సమాచారం ప్రకారం.. తొలి దశలో యుద్ధం నిలిపివేతపై చర్చలను ప్రారంభించడంతో పాటు, ఆరు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలి. హమాస్ చెరలో బందీలుగా ఉన్న సుమారు 100 మందిలో 33 మందిని ఈ సమయంలో విడిచిపెట్టాలి’’ అని ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రతినిధులు ధృవీకరించారు. ఈ ఒప్పందంపై గురువారం ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నద్ధమవుతున్నారు.ఖతార్ పాత్ర ప్రత్యేకం.. కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహించాయి. ఈక్రమంలో రెండుసార్లు కాల్పుల విరమణపై చర్చలు జరగ్గా అవి ఫలించలేదు. అయితే గాజాలో శాంతి స్థాపన కోసం ఖతార్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మొదటి నుంచి ఆసక్తికరంగా సాగాయి. 2012 నుంచి దోహాలో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నాల్లో ఖతార్ కీలకంగా వ్యవహరిస్తుందని తొలి నుంచి చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఖతార్ ఈ చర్చల్లో ముందుకు వెళ్లింది కూడా. అయితే ఒకానొక దశలో అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గింది. దీంతో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను ఖతార్ నిలిపివేసిందన్న కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఖతార్ వాటిని ఖండించింది. అదే సమయంలో దోహాలో హమాస్ కార్యకలాపాలను బహిష్కరించాలని అమెరికా ఇచ్చిన పిలుపును కూడా ఖతార్ పక్కన పెట్టి మరీ చర్చలకు ముందుకు తీసుకెళ్లి పురోగతి సాధించింది ఖతార్. గాజా బాధ్యత ఎవరిది?తాజా ఒప్పందంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఒప్పందం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వెనక్కుమళ్లుతాయా?.. లేకుంటే పాక్షికంగానే జరుగుతుందా?. భవిష్యత్తులో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగకుండా ఉంటుందా? అన్నింటికి మించి.. యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతాన్ని ఎవరు పాలిస్తారు? దాని పునర్నిర్మాణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది.ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది. -
రేపటి కోసం.. ఢిల్లీ, ముంబైలా కాదు రాజపాళ్యంలా..!
నా కోసం.. నా కుటుంబం.. అని ఆలోచనలో చేసే మనుషులు ఉన్న ఈ కాలంలో.. మన కోసం.. మన ఊరి కోసం.. రేపటి తరాల కోసం మంచి వాతావరణాన్ని అందించాలని ప్రతినబూనింది ఇక్కడో ఊరు. ఈ క్రమంలో ఆకట్టుకునే ప్రయత్నాలతో ముందుకు పోతోంది.రాజపాళ్యం.. తమిళనాడులో పశ్చిమ కనుమల్లో ఉండే ఓ పట్టణం. ఇక్కడ జనాభా రెండు లక్షలకు పైనే. మామిడి పండ్లకు, మరీ ముఖ్యంగా నాటు కుక్కలకు ఫేమస్ ఈ ప్రాంతం. అయితే ఈ మధ్య ‘2040 మిషన్’తో ఈ ప్రాంతం వార్తల్లోకి ఎక్కింది. అప్పటికల్లా కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి(zero carbon city) తీసుకొచ్చే వ్యూహాలు అమలు చేస్తోంది.కార్బన్ న్యూట్రల్ బై 2040 కార్యక్రమం కోసం అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు సత్పలితాలను ఇస్తున్నాయి. అక్కడి జనాలు సోలార్ ఎనర్జీకి క్రమక్రమంగా అలవాటు పడుతున్నారు. పవన్ విద్యుత్‌కు పెద్ద పీట వేసే ప్రయత్నాల్లో అక్కడి అధికార యంత్రాంగం ఇప్పటికే తలమునకలైంది. పునరుత్పాదక విద్యుత్ కోసం పరిశ్రమలను ప్రోత్సహించాలని, అలాగే సీఎన్జీ బయో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.2021లో రాజపాళ్యం నుంచి 7 లక్షల టన్నుల కర్భన ఉద్గారాలు వెలువడ్డాయి. వాటిని జీరోకి తేవాలన్నదే మిషన్ 2040 ఉద్దేశం.పర్యావరణ ప్రయోజనాలుకార్బన్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయిగాలి నాణ్యత పెరుగుతుందిపచ్చదనం విస్తరిస్తుందిజల వనరులు సంరక్షణఆర్థిక ప్రయోజనాలుపునరుత్పాదకతో.. ఖర్చులు తగ్గుతాయిఉపాధి కల్పన, ఉద్యోగాలు దొరుకుతాయిRajapalayam leads small town India 🇮🇳 towards green future.The beautiful city of Rajapalayam in Tamil Nadu has developed a masterplan for a zero carbon city. It will inspire cities across India and the globe.Rajapalayam (200 000 inhabitants) plans to source enegy from solar,… pic.twitter.com/7yujcIimP5— Erik Solheim (@ErikSolheim) January 6, 2025సామాజిక లాభాలుప్రజారోగ్యంఆయుష్షు పెరిగే అవకాశంకమ్యూనిటీ ఎంగేజ్మెంట్అలాగే.. ప్రయాణాల కోసం సంప్రదాయ ఇంధనవనరుల మీద కాకుండా ఈ-బస్సులు, ఈ-వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు.. మొక్కల పెంపకంతో పాటు జలవనరులు కాలుష్యం బారినపడకుండా పరిరక్షించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆఖరికి.. పండుగలకు, ఇతర కార్యాక్రమాలకు ప్లాస్టిక్‌ను దూరంగా ఉంచుతూ వస్తున్నారు.కేవలం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల కోసం పచ్చటి ప్రకృతిని అందిద్దాం అనే నినాదానికి అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆధునీకరణలో భాగంగా తమ ఊరు ఏ ఢిల్లీ, ముంబైలాగో కాలుష్య నగరంగా మారాలని అక్కడి ప్రజలు ఆశించడం లేదు. రాజపాళ్యంలా ఉండి.. కాలుష్యరహిత ప్రాంతంగా దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు.సవాళ్లుకాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారంసాంకేతికంగా అవరోధాలు ఎదురయ్యే అవకాశంపూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు మరికొంత సమయంపారిశ్రామిక సహకారంపాటించడమే కాదు.. పర్యవేక్షణ కూడా సవాల్‌తో కూడున్నదే. కానీ, పచ్చటి భవిష్యత్తుతో దక్కే ఫలితం మాత్రం దీర్ఘకాలికమైంది. -
‘హర్షా భాయ్.. శత్రువుకి కూడా ఇలాంటి పరిస్థితి రాదేమో!’
మొన్నీమధ్యే ‘లక్కీ భాస్కర్’ అనే ఓ సినిమా వచ్చింది. ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి అయిన హీరో.. దేశంలోనే అతిపెద్ద స్కాంలో తెలిసీతెలియకుండానే భాగం అవుతాడు. మోసాన్ని మోసంతోనే జయించి వంద కోట్లు తన ఖాతాలో వేసుకుంటాడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు క్లాప్స్.. విజిల్స్. ‘‘ఛస్.. అదొక ఆర్థిక మోసం’’ అనేవాళ్లు లేకపోలేదు. ‘‘సినిమానే కదా గురూ.. పైగా నేరం రుజువు కాలేదు.. అడ్జస్ట్ అయిపో’’ అని సలహా ఇచ్చేవాళ్లు లేకపోలేదు. ఉఫ్.. హీరో కాబట్టి సేవ్ అయిపోయాడు. ప్రేక్షకుల మనన్ననలు పొందగలిగాడు. అదే నిజజీవితంలో జరిగితే..! అఫ్కోర్స్ ఈ సినిమా కూడా వాస్తవ ఘటనల స్ఫూర్తితోనే తెరకెక్కిందనుకోండి. కానీ..”రిస్క్ హై తో ఇష్క్ హై” అనుకునే ఓ దిగువ మధ్యతరగతి వ్యక్తి.. డబ్బు సంపాదించాలనే కసితో వాణిజ్య రాజధానిలో అడుగుపెట్టాడు. కామర్స్ గ్రాడ్యుయేట్ నుంచి ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా ఆపై ప్రసన్న ప్రాంజివందాస్ దగ్గర శిష్యరికంలో స్టాక్ బ్రోకర్‌గా రూపాంతరం చెందాడు. ఆపై తన సోదరుడితో కలిసి గ్రోమోర్ అనే బ్రోకరేజ్ సంస్థను స్థాపించి.. 1987లో స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో.. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఒడిసి పట్టుకున్నాడు. ఎస్బీఐలాంటి ప్రభుత్వ బ్యాంకుతో సహా అవినీతిమయమైన వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేయగలిగాడు. బ్యాంకుల నుంచి కోట్ల డబ్బుని సేకరించి.. దలాల్ స్ట్రీట్‌నే శాసించాడు. వెరసి.. వేల కోట్లను చాకచక్యంగా పిండుకున్నాడు. ఈ కథను Scam 1992 పేరుతో వెబ్ సిరీస్‌గా తీస్తే జనాలు థ్రిల్లయిపోయారు. ఆయన రిఫరెన్స్‌తో లక్కీ భాస్కర్ సినిమా తీస్తే అదిరిపోయిందన్నారు. పైగా ఆ కథల్లోంచి ఆర్థిక పాఠాలను, జీవిత సత్యాలను వెతికారు. ప్చ్.. తప్పులేదు సోషల్ మీడియా జమానా అలాంటిది మరి!.అది 2001 ,డిసెంబర్ 31.. దేశం మొత్తం న్యూఇయర్ సంబరాలకు సిద్ధమవుతోంది. అలాంటి టైంలో పత్రికల్లో, టీవీల్లో వచ్చిన ఓ వార్త అందరినీ ‘అరరె’ అనుకునేలా చేసింది. 47 ఏళ్ల వయసున్న హర్షద్ మెహతా.. థానే జైల్లో గుండె నొప్పితో కన్నుమూశాడు అని. ఓవైపు మెహతా ఫొటో.. మరోవైపు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరగాడి అస్తమయం అనే లైన్లు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వీల్‌చైర్‌లోనే కుప్పకూలిపోయాడంటూ పేర్కొన్నాయవి. ఓ సాధారణ గుజరాతీ జైన్ కుటుంబంలో పుట్టి.. స్టాక్ మార్కెట్ సామ్రాజ్యంలో బిగ్ బుల్గా ఎదిగాడు హర్షద్ మెహతా. ఆరోజుల్లో.. మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకున్న ఎంతో మందికి మూడు పదుల వయసున్న హర్షద్ మెహతా(Harshad Mehta) ఓ రోల్ మోడల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి దేశంలోనే అతిపెద్ద స్కాంలో సూత్రధారి అయ్యాడు. అప్పటిదాకా ఆర్థిక మేధావి అనిపించుకున్న వ్యక్తి.. ఆర్థిక మోసగాడనే ముద్రతో విచారణ, ఐదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొన్నాడు. చివరకు.. అనామక పరిస్థితుల నడుమ జైలు ఊచల మధ్య కన్నుమూయడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు మనీలైఫ్ ఎడిటర్‌గా ఉన్న సుచిత్ర దలాల్.. ఒకప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కాలమిస్ట్. హర్షద్ మెహతా సెక్యూరిటీస్ స్కాం తుట్టెను కదిలించారామె. ఆమె ప్రచురించిన ఆ ఇన్వెస్టిగేషన్ కథనాలు.. ఆ టైంలో మీడియా రంగంలోనే పెద్ద సెన్సేషన్ అయ్యాయి. కట్ చేస్తే.. అదే ఏడాది నవంబర్ 9వ తేదీన సీబీఐ ప్రముఖ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతాను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి మరణించేదాకా.. తొమ్మిదేళ్లపాటు జ్యూడిషియల్ కస్టడీ కింద జైల్లోనే గడిపారాయన. మరోవైపు ఆయన కుటుంబం న్యాయపోరాటం మొదలుపెట్టింది కూడా అప్పటి నుంచే..స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా ఎంత హుందాగా ఎత్తుకు ఎదిగారో.. అంతే దీనస్థితిలో పాతాళానికి చేరుకున్నారు. హర్షద్‌మెహతా మరణాంతరం.. ఆయన కుటుంబం 20 ఏళ్ల పాటు మీడియా కంటపడకుండా అజ్ఞాతం జీవితం గడిపింది. అతుర్ మెహతా.. హర్షత్ మెహతా కొడుకు. ఇన్వెస్టర్‌గా, ఎంట్రాప్రెన్యూర్గా ఓ దుస్తుల కంపెనీని నడిపిస్తున్నారు. అతుర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు. అమెరికాలో స్థిరపడ్డాడని కొందరు.. లేదు ముంబైలోనే ఉన్నాడని మరికొందరు చెబుతుంటారు. అతని ఆస్తిపాస్తులు వగైరా వివరాలు వెతికినా ఇంటర్నెట్లో పెద్దగా కనిపించదు. ఇక.. హర్షద్ సోదరుడు, ఆయనతోపాటు కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన అశ్విన్ లా చదవి.. ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. తన అన్న, కుటుంబం పేరిట నడుస్తున్న కేసులను ఆయనే వాదిస్తున్నారు ఇప్పుడు. ఈయన కూడా అంతే.. మీడియా కంట పడకుండా, ఇంటర్వ్యూల జోలికి పోకుండా బతుకుతున్నారు. ఇక జ్యోతి మెహతా(Joti Mehta).. హర్షద్ భార్య. ఆయన మరణాంతరం 20 ఏళ్లకు ఆమె నోరు విప్పారు. అయితే అది తన భర్త పేరిట ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారానే.‘‘నా భర్త హర్షద్ మెహతా చనిపోయింది సకాలంలో వైద్యం అందకనే. అసలు అంతకుముందు ఆయనకు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవు. కేవలం జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భర్త చనిపోయాడు. ఆరోజు సాయంత్రం తన ఛాతీలో నొప్పిగా ఉందని ఆయన పక్క సెల్లో ఉన్న తన సోదరుడికి సమాచారం ఇచ్చారు. ఆయన ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. జైల్లో ఉన్న వైద్యులు పరీక్షించి గుండెపోటు మాత్రలు లేవన్నారు. అయితే తన మెడికల్ బాక్సులో అవి ఉన్నాయని ఆయన మాత్రలను తెప్పించి వేసుకున్నారు. ఆ మందు నాలుగు గంటలపాటు మెహతాను బతికించింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో.. అర్ధరాత్రి దాటాక ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. నాడు జైలు అధికారులు సకాలంలో స్పందించి ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే.. ఆయన చనిపోయేవారే కాదు’’ అని జ్యోతి తెలిపారు. అంతేకాదు.. తన భర్త మరణానికి సంబంధించి అధికారులు ఎలాంటి విచారణ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక ఇవ్వలేదని.. జైలు అధికారులను ఎన్నిసార్లు కోరినప్పటికీ స్పందన ఉండడం లేదని అంటున్నారామె. ఏ నోళ్లు అయితే పొగిడియో..అవే నోళ్లు నా భర్తను ఆర్థిక నేరస్థుడిగా ప్రచారం చేశాయి. శత్రువుకు కూడా మాకు వచ్చిన కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాం అని చెబుతున్నారామె. అంతేకాదు harshadmehta.in ద్వారా సంచలన విషయాలు తెలియజేసే ప్రయత్నమూ చేస్తున్నారు. కుటుంబ కష్టాలుహర్షద్ మెహతాపై బ్యాంకుల చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఆధారంగా 72 క్రిమినల్ కేసులు, 600కిపైగా సివిల్ అభియోగాలు నమోదు అయ్యాయి. కానీ, అందులో కేవలం నాలుగు అభియోగాల్లో ఆయన జైలు పాలయ్యారు. 1992, జూన్ 4న సీబీఐ మెహతా కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సెర్చ్ ఆపరేషన్ జరిపింది. సోదాల్లో ఎన్నో డాక్యుమెంట్లు, షేర్ మార్కెట్ కు సంబంధించిన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుంది. అప్పటికి ఆ కుటుంబం ఆస్తుల విలువ రూ.1,700 కోట్లు అని ఓ అంచనా. అనంతరం హర్షద్ మెహతా తన 1992-93 ఏడాది ఆదాయంపై ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేశాడు. ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దాన్ని తిరస్కరించింది. మెహతా ఫ్యామిలీ రూ.4 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు 1995లో ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. చివరికి ఈ వ్యవహారం కాస్తా ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యునల్ కు చేరింది. ఈలోపు ఆయన మరణించారు. మరోవైపు మెహతా కుటుంబంపై ఆదాయ శాఖ చర్యలు కొనసాగాయి. వరసగా వారి సంబంధిత ఆస్తులపై తనిఖీలు చేపట్టింది. చివరకు 23ఏళ్ళ తరువాత ట్రిబ్యునల్.. మెహతా కుటుంబ పన్ను కట్టాలనే ఐటీ శాఖ డిమాండ్ ను తోసిపుచ్చింది. ఆ కుటుంబానికి క్లీన్ చిట్ ఇస్తూ.. పన్ను కట్టాల్సిన అవసరం లేదని తేల్చింది.అదే టైంలో.. హర్షద్ మెహతా లావాదేవీల కారణంగా చెల్లించాల్సిన బకాయిలు ఆస్తుల కంటే ఎన్నో రేట్లుగా తేలింది. సంపాదించినదంతా దాదాపుగా బకాయిల చెల్లింపుకే సరిపోయింది. వీటిలో చాలావరకు సెటిల్మెంట్ కాలేక కోర్టుల దాకా చేరాయి. అయితే ఈ విషయంలో మెహతా కుటుంబానికే ఊరట లభించింది. ఫెడరల్ బ్యాంకు, కిషోర్ జననీ దావాలో జ్యోతి మెహతా రూ.6 కోట్ల సెటిల్మెంట్ విజయం సాధించారు. అలాగే.. న్యాయపోరాటం తర్వాత వేలంపాట లేకుండా కొన్ని ఆస్తులు తిరిగి ఆ కుటుంబానికే చేరాయి. అలా ఆ వచ్చినదాంతోనే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. స్కాం ఏంటంటే..లక్కీ భాస్కర్ సినిమా చూసినవాళ్లకు హర్షద్ మెహతా చేసిన నేరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఈ కథనం నేపథ్యంలో మరోసారి సింపుల్‌గా గుర్తు చేస్తున్నాం. స్టాక్ మార్కెట్(Stock Market)కు అమిత్ బచ్చన్‌గా పేర్కొందిన హర్షద్ మెహతా.. తన సోదరుడితో కలిసి గ్రోమోర్ అనే బ్రోకరేజ్ సంస్థను ఏర్పాటు చేశాడు. కోట్ల రూపాయలను, బ్యాంకులలో లోన్ పెట్టి తీసుకుని, ఆ డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, లాభాలు గడించి తిరిగి బ్యాంకులకు చెల్లించడం చేసేవాడు. రెడీ ఫార్వడ్ డీల్, బ్యాంకు రీసిప్ట్ లను వాడుకుని.. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆ డబ్బును మంచి నీళ్ళకంటే కూడా దారుణంగా తన చుట్టూ తిప్పుకున్నాడు. స్టాక్ మార్కెట్ లో లొసుగులను వినియోగించి కోట్లకు పడగలెత్తాడు. బ్యాంక్ రిసిప్టుల ని, సంతకాలని ఫోర్జరీ చెయ్యడం అతిపెద్ద నేరం. అలా.. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని (1992 సెక్యూర్టీస్) అతిపెద్ద కుంభకోణానికి హర్షద్ మెహతా పాల్పడ్డాడు. అయితే ఈ కేసు నుంచి తప్పించాలని రూ.1 కోటిని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు లంచంగా ఇచ్చానంటూ హర్షద్ చేసిన ప్రకటన ఆ టైంలో రాజకీయంగానూ దుమారం రేపింది. వేకప్ కాల్.. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుదిపేసింది. షేర్ల కొనుగోలుకు బ్యాంకులోని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిసి ఆర్థిక మేధావులు విస్తుపోయారు. బీఎస్ఈ సెక్యూరిటీస్‌ల కుంభకోణం ద్వారా రూ.5,000 కోట్ల మోసానికి పాల్పడ్డారని రకరకాల సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. 1992లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చాక స్టాక్ మార్కెట్లు 72 శాతం పతనమయ్యాయి. ఆ కాలంలో ఇన్వెస్టర్లు రూ.4,000 కోట్లు నష్టపోయారు. మార్కెట్లపై ఈ పరిణామ ప్రభావం రెండేళ్లపాటు కొనసాగింది. దీని తరువాత కొత్తగా అనేక కఠిన చట్టాలను దేశంలో తీసుకురావటం జరిగింది. -
ఆహా.. అందాల రాణులు.. అస్సలు తగ్గేదే లే!
-
అందుకే మన్మోహన్ సైలెంట్‌గా ఉండేవారట!
విషయం వీక్‌గా ఉన్నప్పుడే.. పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనేది ఓ నానుడి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో అది పూర్తి వ్యతిరేకంగా. స్టేట్స్ మన్‌గా సెన్సేషన్సలిజానికి వీలైనంత దూరంగా ఉండేవారాయన. ఆయన వస్తున్నారంటే.. మీడియా కూడా పెద్దగా హడావిడి చేసేది కాదు. దీనిని అలుసుగా తీసుకునే ప్రతిపక్షాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరోలా ప్రొజెక్ట్ చేశాయి. ఆయన్ని రకరకాలుగా నిందించాయి. అయితే ఆయన మౌనం వెనుక కారణాలు లేకపోలేదు.. ‘‘మన్మోహన్ అనే వ్యక్తి ఓ సైలెంట్ పీఎం.. దేశానికి డమ్మీ పీఎం. ఆయనకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడమంటే భయం. మన్మోహన్ సింగ్ కాదు.. ఆయన మౌనమోహన్ సింగ్. అధిష్టానం చేతిలో ఆయనొక కీలు బొమ్మ. జన్‌పథ్ నుంచే దేశ పాలన అంతా సాగుతోంది’’.. యూపీఏ రెండు టర్మ్‌ల పాలనలో ప్రతిపక్షాలు తరచూ ఈ విమర్శలు చేసేవి. కానీ.. ప్రధానిగా ఆయన ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చారు. వాటిని నిశితంగా విశ్లేషిస్తే.. ఆయన ప్రెస్మీట్లో అనవసర అంశాలు కనిపించవు. దేశ, అంతర్జాతీయ, ఆర్థిక సంబంధిత అంశాలపై అలవోకగా మాట్లాడేవారు. అలాగే పాలనాపరమైన నిర్ణయాలను ప్రకటించేవారు. మైకుల ముందు మన్మోహన్ సింగ్(Manmohan Singh) ముక్కుసూటిగా మాట్లాడేవారు. విషయం ఏది ఉన్నా.. నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పేవారు. రాజకీయ విమర్శలు చేయడం అత్యంత అరుదుగా ఉండేది. అయితే.. నెమ్మదిగా మాట్లాడడం ఆయనకంటూ ఓ మైనస్ అయ్యింది.ఇక.. డిజిటల్ మీడియా ఆయన హయాంగా ఉన్న టైంలోనే అభివృద్ధి చెందింది. కానీ, సమకాలీన రాజకీయ నేతల్లో సోషల్ మీడియాను పరిమితంగా ఉపయోగించారాయన. సంప్రదాయ మీడియా మీదే ఆయన దృష్టంతా ఉండేది. మన్మోహన్ తన పుస్తకం ‘‘ఛేజింగ్ ఇండియా’’లోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా తన నాయకత్వ లక్షణాలను సమర్థించుకున్నారు కూడా.‘‘ఆ టైంలో మీడియా ఫోకస్ అంతా వేరేలా ఉండేది. ఆయన ప్రెస్ మీట్ అంటే పెద్ద హడావిడి ఉండేది కాదు. ఆయన సూచన మేరకే అలా జరిగేది!. తనను ప్రధానిగా కూడా ప్రమోట్ చేసుకోవడానికి అంతగా ఆయన ఆసక్తి చూపించేవారు కాదు. అందుకు రాజకీయ పరమైన కారణాలూ ఉండొచ్చు. ఇప్పుడున్నట్లు సోషల్ మీడియా ఉండి ఉంటే.. ఆయన ఎంతటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తో.. హుషారైన వ్యక్తో ప్రతీ ఒక్కరికీ తెలిసి ఉండేది’’ అని ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఆయన నిష్క్రమణ తర్వాత మరికొందరు జర్నలిస్టులు ఆయనతో ఇంటెరాక్షన్ సమయంలో అనుభవాల్ని పంచుకోవడమూ చూస్తున్నాం.పదేళ్లపాటు.. 2004-2014 మధ్య యూపీఏ తరఫున ప్రధానిగా ఆయన 117సార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. మీడియా సమావేశాలు, విదేశీ పర్యటనల్లో విలేకరులతో ఇంటెరాక్షన్, దేశీయ పర్యటనలు, వార్షిక సమావేశాలు, రాజకీయ.. ఎన్నికల ప్రచారాలు మొత్తం కలిపి ఉన్నాయి. ప్రత్యేకించి విదేశీ పర్యటనలో.. తిరుగు ప్రయాణాల్లో.. ఆయన విమానాల్లోనే జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే అవి విమర్శలకు సైతం తావిచ్చాయి కూడా. అలాగే మీడియా ముందుకు వచ్చేందుకు ఏనాడూ ఆయన తటపటాయించేవారు కాదు.. అది ఎంత పెద్ద అంశమైనా అనర్గళంగా మాట్లాడేవారు. మీడియా ముఖంగా ఆయన కఠినంగా మాట్లాడింది లేదు. అయితే ఈ మృదు స్వభావమే ఆయన్ని మీడియాలో పెద్దగా హైలెట్ చేయలేకపోవడానికి ప్రధాన కారణమైంది. అదే సమయంలో.. డిగ్నిఫైడ్ లీడర్‌గా ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టింది.మన్మోహన్.. పుట్టిపెరిగిన పరిస్థితులు కూడా ఆయన రిజర్వ్డ్ నేచర్‌కు మరో కారణం. బ్రిటిష్ ఇండియాలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన మన్మోహన్.. విభజన తర్వాత భారత్‌కు వలస వచ్చారు. అయితే బాల్యంలో ఆయన అల్లరి మాములుగా ఉండేది కాదట. ఈ విషయాన్ని ఆయన బాల్య స్నేహితుడు రాజా ముహ్మద్ చాలా ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మన్మోహన్ తండ్రి డ్రైఫ్రూట్స్ వ్యాపారి. దీంతో ఆయన తన జేబులో ఏవో ఒకటి తీసుకుని వచ్చేవారట. వాటి కోసం జరిగిన అల్లరి అంతా ఇంతా కాదని చెప్పారాయన.మన్మోహన్ ప్రధాని అయ్యాక.. తన బాల్య స్నేహితుడిని చూసేందుకు నేరుగా ఆయన నివాసానికే వెళ్లారు రాజా ముహ్మద్. ఇక తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ దగ్గరే పెరిగారాయన. ఆ టైంలోనే ఆయనలోని అల్లరి మరుగున పడింది. ఆమె సంరక్షణలో ఆయన ఎంతో క్రమశిక్షణ అలవర్చుకున్నారు. కరెంట్ లేని ఓ గ్రామంలో కిరోసిన్ దీపపు వెలుగులోనే చదువుకునేవారు. స్నేహితులతో కలిసి ఆయన బయటకు వెళ్లడం.. ఆడడం అరుదుగా ఉండేవి. ఉన్నత విద్య సమయంలో.. ఆర్వాత ఉన్నత పదవులు అధిరోహించిన టైంలోనే ఆయన ఒద్దికగా ఉన్నారు. ప్రధానిగా దిగిపోయాక.. రాజకీయాలకు ఆ కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది!. పైగా చిన్నప్పటి నుంచి ఆయన ఓ విషయాన్ని అలవర్చుకున్నారు. ఎక్కువ వినడం.. ఎక్కువగా అర్థం చేసుకోవడం.. తక్కువగా మాట్లాడం.. వెరసి మౌనమునిగా బతకడం. ఇదే ఆయన తుదిశ్వాస విడిచేవరకు పాటిస్తూ వచ్చారు. మేధావులు మౌనం వహించినప్పుడు.. మూర్ఖుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం::నెల్సన్ మండేలాఒక మూర్ఖుడి ఆవేశం కన్నా ఒక మేధావి మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదకరం:::నేతాజీ సుభాష్ చంద్రబోస్ -
సునామీ @20 ఏళ్లు: అలా జరిగి ఉంటే పెను విధ్వంసం తప్పేది!
ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. హహాకారాలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతూ చెల్లాచెదురైన జనం.. రెప్పపాటులో వాళ్లను ముంచేసిన రాకాసి అలలు.. నేలకూలిన భవనాలు-ముక్కలైన జీవనాధారాలు.. వెతికేకొద్దీ బయటపడ్డ శవాలు.. వెరసి ఎటుచూసినా కన్నీళ్లే!. సరిగ్గా.. 20 ఏళ్ల క్రితం సునామీ(Tsunami) సృష్టించిన విధ్వంసపు జ్ఞాపకాలివి. అప్పటిదాకా సాగర ఆటుపోట్లను ఆహ్లాదంగా భావించిన తీర ప్రాంత ప్రజలు.. ఘోర విపత్తును చూసింది మాత్రం అదే తొలిసారి!. ఇంతకీ ఆరోజు అసలేం జరిగింది? వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే విలయాన్ని పసిగట్టడంలో శాస్త్రవేత్తలు, అధికారుల అంచనాలు ఎక్కడ తప్పాయి?.డిసెంబర్ 26, 2004.. సమయం ఉదయం 7.58నిమిషాలు. ఇండోనేషియాలోని సుమత్రా ఉత్తర వైపున్న సముద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’(పసిఫిక్ మహాసముద్రం) ప్రాంతమది. దీంతో అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు షరామాములుగా మారిందక్కడ. ఆ పూట సంభవించిన వాటిని కూడా తేలికపాటి ప్రకంపనలుగానే అధికారులు భావించి తేలికగా తీసుకున్నారు. కానీ, ఆ ప్రకంపనలు ఒక ప్రళయాన్నే తీసుకొచ్చాయి. 🌊తీవ్ర భూకంప ప్రభావంతో.. సముద్రంలో 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి అలలు. ఆ అలలు తీర ప్రాంతం నుంచి ఐదు కి.మీ పాటు భూభాగంలోకి చొచ్చుకొచ్చేశాయి.ఇండోనేషియా.. అచె ప్రాంతంలోనే లక్షా యాభై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.శ్రీలంక.. సుమత్రాకు 1,700 కిలోమీటర్ల దూరంలోని శ్రీలంక తీర ప్రాంతాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది. వివిధ తీర ప్రాంతాల్లో రాకాసి అలల ధాటికి 35 వేల మంది మరణించారు.భారత్.. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్లోనూ నష్టం జరిగింది. కేరళకు స్వల్ప నష్టం వాటిల్లింది. మొత్తంగా 16, 389 మంది మరణించారు.థాయ్‌లాండ్.. భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖావో లాక్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది. 8 వేలమంది మరణించారు. వీళ్లలో క్రిస్మస్, న్యూఇయర్ సెలవులకు వచ్చిన టూరిస్టులే అధికంగా ఉన్నారు.🌊2004 హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ కారణంగా.. మొత్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు విడిచారు. చెల్లాచెదురైనవాళ్లు లెక్కలేనంత మంది. నిరాశ్రయులైనవాళ్లు ఇంకొందరైతే.. జీవనాధారాలను కోల్పోయారు మరికొందరు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆయా దేశాల పర్యాటక రంగం కుదేలు కావడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపెట్టింది. ఏకంగా 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. మానవతా ధృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా అందించిన సాయం.. చరిత్రలోనే అతిపెద్ద సాయంగా నిలిచిపోయింది. అయినప్పటికీ.. తీర ప్రాంతాలు, మానసికంగా అక్కడి ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది.10 నిమిషాల భూకంపం!రిక్టర్ స్కేల్‌పై 9.1-9.3 మధ్య తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమి పది నిమిషాలపాటు కంపిస్తూనే ఉంది. ఆ కారణంతోనే సముద్రపు అలలు రాకాసి రూపం సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలను క్షణాల్లో చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్‌లాండ్, మాల్దీవులు.. ఇలా 14 దేశాలను సముద్రపు అలలు ముంచెత్తాయి. అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఎక్కడో 9వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్టేట్ ఓక్లాహామాలోనూ దీని ప్రభావం కనిపించిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సునామీ అనే పేరు మనవాళ్లు విన్నది అప్పుడే తొలిసారి!.ఆసియాలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డు21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన భూకంపంప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన భూకంపాల్లో మూడో శక్తివంతమైందిఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం!2004 సునామీ 21వ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుగా చరిత్రకెక్కింది*భూకంపాల కొలమానం.. సిస్మోగ్రఫీ అనేది 1900 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. చదవండి: ఆధునిక చరిత్రలోనే అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?. 🌊సునామీ.. మనిషి నిలువరించలేని ఓ ప్రకృతి విపత్తు!. తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే సునామీని ముందుగానే గుర్తించగలిగే గ్లోబల్ వార్నింగ్ వ్యవస్థ మాత్రం ఒకటి ఉంది. సముద్ర భూగర్భంలో చెలరేగే అలజడులు.. అలల తీవ్రత ఆధారంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇందుకోసం ‘సునామీ వార్నింగ్ సిస్టమ్’(TWS) పని చేస్తుంది. 🌊ప్రపంచంలోనే తొలి సునామీ హెచ్చరికల వ్యవస్థ.. 1920లో హవాయ్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంభవించిన విపత్తుల ఆధారంగా దానిని ఆధునీకరించుకుంటూ వచ్చారు. ఫసిఫిక్ సముద్రం, నార్త్ అమెరికా సంబంధిత వ్యవస్థలు తర్వాతి కాలంలో ఏర్పాటయ్యాయి. కానీ.. 2004 దాకా హిందూ మహాసముద్రంలో సునామీల హెచ్చరికలకు సంబంధించి ఇలాంటి వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ లేకపోవడం.. ఇంతటి విషాదానికి కారణమైందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది.🌊2004 బాక్సింగ్ డే సునామీ తర్వాత.. ఆ మరుసటి ఏడాది IOTWMSను యునెస్కో ఏర్పాటు చేసింది. భారత్ తరఫున Indian Tsunami Early Warning Centre (ITEWC), ఈ IOTWMSతో సమన్వయం జరుపుతోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో ITEWCను 2007లో ఏర్పాటు చేశారు. సముద్ర గర్భంలో చోటు చేసుకునే మార్పులు, సునామీల మీద అధ్యయనాలు.. పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ. 🌊ప్రపంచంలో.. దాదాపు అన్ని సముద్ర రీజియన్లలో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి వ్యవస్థలు కచ్చితత్వం విషయంలోనూ కొన్ని లోపాలు బయటపడ్డాయి. దీంతో విపత్తులకు తగ్గట్లుగా మార్పులు చేస్తూ వస్తున్నారు. 2018 డిసెంబర్లో అగ్నిపర్వతం బద్ధలై సునామీ ముంచెత్తింది. దీంతో.. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి సముద్ర మట్టం స్థాయికి సెన్సార్లను ఏర్పాటు చేశారు. అలా.. అప్పటినుంచి సునామీ హెచ్చరికలు తరచూ జారీ అవుతుండడం చూస్తున్నాం. అయితే ఇలాంటి వ్యవస్థ 20 ఏళ్ల కిందట ఉండి ఉంటే.. ఆనాడు అంతటి విధ్వంసం తప్పేది ఏమో!.🌊సునామీ అంటే?.. Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణంగా.. భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. సాధారణంగా సునామీలు అలల లాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు చాలా తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. ఈ రాకాసి అలలు కలిగించే నష్టం కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి.. 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల వాటిల్లిన విధ్వంసమే ఇందుకు ఉదాహరణ.:::సాక్షి వెబ్‌డెస్క్ -
#Mentoo: ఓ డాక్టర్.. ఓ పోలీస్.. ఇలా ఎందరో?
చట్టం ముందు అందరూ సమానమే.. ఇది అనుకోవడానికే తప్ప ఆచరణలో లేదనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. ఇంతకాలం పేద-ధనికలాంటి తారతమ్యాలు వినిపిస్తే.. ఇప్పుడు ఆడ-మగగా మారిందది. అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం నేపథ్యంతో ఈ చర్చ మరింత వేడిని రాజేస్తోంది. బెంగళూరు, ఢిల్లీ.. ఇలా మెట్రో నగరాల్లో జస్టిస్ ఫర్ అతుల్ పేరిట సంఘీభావ ప్రదర్శనలు చేసే స్థాయికి చేర్చింది. భార్య కుటుంబం పెట్టిన వేధింపులు.. తప్పుడు కేసులను భరించలేక.. వ్యవస్థతో పోరాడటంలో తడబడిన అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కానీ, అతని చివరి కోరికగా.. న్యాయం కోసం అతని తరఫున మేం పోరాడతాం అంటూ కొందరు భర్తలు రోడ్డెక్కారు. దేశ జనాభాలో ట్యాక్సులు కట్టేవాళ్లలో మగవాళ్లదే సింహభాగం. కానీ, చట్టాలు మాత్రం కేవలం మహిళల పక్షమే వ్యవరిస్తున్నాయని అంటున్నారు. సమాజంలో పురుషుల ప్రాణాలూ ముఖ్యమేనని.. వారికీ చట్టపరమైన రక్షణ కావాలని ముక్తకంఠంతో కోరుతున్నారు వాళ్లు. అయితే.."70 Crore men pay tax in India, not even one welfare scheme for men is funded by our own taxes."Delhi joins Bengaluru in nation wide protests for Atul Subhash's suicide due to harassment by wife and judiciary. pic.twitter.com/RZwJgql0sf— Mick Kay (@mick_kaay) December 14, 2024 అతుల్ ఘటన తర్వాత.. ఈ బర్నింగ్ టాపిక్కు మరో రెండు ఘటనలు తోడయ్యాయి. కర్ణాటకలో హులిమవు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ హెచ్‌సీ తిప్పన్న(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి రైలు పట్టాలపై పడుకుని చితికిపోయాడు. భార్య, ఆమె కుటుంబం పెట్టే నరకం భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తిప్పన్న రాసిన ఓ సూసైడ్ నోట్ చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు..డిసెంబర్11వ తేదీన.. రాజస్థాన్‌లో హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్(35) కృతినగర్‌లోని తన క్లినిక్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య వేధింపులే కారణమంటూ లేఖ రాశాడు. భార్యను పచ్చిబూతులు తిడుతూ రాసిన ఆ లేఖలో.. ప్రస్తుత వైవాహిక వ్యవస్థను, ఆ వ్యవస్థ కారణంగా తాను ఎదుర్కొన్న న్యాయపరమైన చిక్కులను, తన నిస్సహాయతను ఆ లేఖలో ప్రముఖంగా ప్రస్తావించాడు. జస్టిస్ ఈస్ డ్యూబెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఏఐ ఇంజినీర్‌గా పని చేస్తున్న యూపీవాసి అతుల్ సుభాష్.. నగరంలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భార్య, ఆమె కుటుంబం తనను ఎంతగా వేధించిందో పే..ద్ద సూసైడ్ నోట్ రాసి.. గంటన్నరపాటు వీడియో తీసి Justice Is Due అని శరీరానికి అంటించుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. సుప్రీం కోర్టు తన గోడును వినాలని.. తనకు న్యాయం దక్కని తరుణంలో.. తన అస్తికలను కోర్టు బయటే మురికి కాలువలో కలపాలని.. ఒకవేళ న్యాయం దక్కితే పవిత్ర గంగలో కలపాలని డెత్ నోట్లో కోరాడతను. ఈ క్రమంలో పేజీల కొద్దీ అతుల్ వ్యధ.. ముఖ్యంగా తన కొడుకును ఉద్దేశించి రాసిన లేఖ.. చివరి బహుమతి.. అన్నీ చాలామందిని భావోద్వేగానికి గురి చేసింది.ఇక.. తన సోదరుడి మరణం వెనుక ఆయన భార్య నిఖితా సింఘానియా కుటుంబ ప్రొద్భలం ఉందని అతుల్ సోదరుడు మారతహల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఖిత కోసం అతుల్ చేయగలిగిందంతా చేశాడని.. అయినా తన సోదరుడి ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడతను. ఈ కేసు దీంతో.. బెంగళూరు పోలీసులు ఆమె స్వస్థలం ఔన్పూర్కు పంపించారు. గత మూడు రోజులుగా ఆ టీం దర్యాప్తు జరుపుతోంది. అయితే.. నిందితురాలు నిఖిత ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడకు నోటీసులు అంటించారు. కచ్చితంగా పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అతుల్ మృతి తర్వాత.. రెండ్రోజులకు కొన్ని మీడియా సంస్థలు నిఖిత నివాసానికి చేరుకున్నాయి. ఆమె అందుబాటులో లేకపోగా.. సోదరుడు, తల్లి మాత్రం మీడియాను ఉద్దేశించి దుర్భాషలాడారు. ఆపై రెండ్రోజులకే వాళ్లు కూడా పరార్ కావడం గమనార్హం.ఒక భార్య.. ‘ఏడు’ భరణం కేసులువైవాహిక చట్టాల దుర్వినియోగంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. అలాంటి ఘటనలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టులో చట్టంతో ఆడుకున్న ఓ భార్య ఉదంతం చర్చనీయాంశమైంది..ఒకావిడ తన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ భర్త ఆమెకు ఏడో భర్త. అప్పటికే ఆరుగురు మాజీ భర్తల నుంచి విడాకులు తీసుకుని. భరణం కోసం కోర్టును ఆశ్రయించింది. ఇక.. ఏడో భర్త నుంచి భరణం అడిగిన కేసులో న్యాయమూర్తి ఆ అంశాన్ని ప్రస్తావించారు.SERIAL 498A ACCUSER A WOMAN IN KARNATAKA HAS MARRIED 7 TIMESSTAYED WITH EACH MAX 1 YEARFILED 498A, MAINTENANCE CASES ON ALLTAKEN MONEY FROM 6 HUSBANDSNOW FIGHTING CASE WITH 7TH Despite having all records with him, MiLord not sending her to JailJAI HO EQUALITY 🙏 pic.twitter.com/3zpdBFNP1m— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 26, 2024ప్రతీ భర్తతో ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఆమె కాపురం చేసి.. విడాకులకు వెళ్లిందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రస్తావిస్తూ.. చట్టంతో మీరు ఆడుకుంటున్నారు అని మహిళను సదరు జడ్జి మందలించారు. అలాగే.. ఆ ఆరుగురి నుంచి ఆమె భరణం భారీగానే పుచ్చుకుందట. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. కర్ణాటకలోనే మరో ఉదంతంలో..ఓ మహిళ తన మాజీ భర్త నుంచి నెలకు రూ.6,16,300 భరణం ఇప్పించమని కోర్టును కోరింది. అయితే ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి.. అంత ఖర్చులు ఉంటే డబ్బులు సంపాదించుకోవాలంటూ ఆ మహిళకు సూచించింది. ఇదే సమయంలో భరణం అనేది భర్తకు శిక్ష కాదని గుర్తు చేసింది.ఇదీ చదవండి: అతుల్ మృగంలా ప్రవర్తించాడు: నికిత ఆరోపణ -
అవును.. వైవాహిక అత్యాచారం నేరమే.. కాదు!
ఆమె అతనికి ఓ ఆట బొమ్మ మాత్రమే... ప్రతి రాత్రి ఆమెతో ఆమె జీవితంతో ఆడుకోవాలని చూస్తాడు.. చిన్నదైనా..పెద్దదైనా ఇద్దరి మధ్యా ఎప్పుడైనా గొడవ జరిగితే... ఆ ప్రతీకారాన్ని రాత్రి మంచంపై తీర్చుకోవడం అతనికి అలవాటు. ఆమె ఆరోగ్యం బాగోలేకున్నా అతనికి ఏమీ పట్టదు. కేవలం కోరికలు తీర్చే ఓ యంత్రంలా మాత్రమే ఆమెను చూస్తాడు. ఆరోగ్యం బాగోలేదు.. ఇవాళ శారీరంగా కలిసే శక్తి లేదని ఎప్పుడైనా చెబితే... ఇక ఆ రాత్రి పిడి గుద్దులు కురిపించి.. నరకం చూపిస్తాడు.. బలవంతంగా అనుభవించి పక్కకు జరుగుతాడు.." తన వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల ఓ మహిళ సుప్రీంకోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలివి. ఆమె చెప్పినదంతా వింటే మీకేం అనిపిస్తుంది? ఓ అత్యాచార బాధితురాలి మాటలు లాగా అనిపించడంలేదా? అయితే కేంద్రానికి మాత్రం దీన్ని రేప్ లాగా భావించడంలేదు.. కారణం ఒక్కటే.. వారిద్దరూ భార్యభర్తలు! అదేంటి.. దంపతులైతే మాత్రం బలవంతంగా భార్యపై ఓ మృగంలా పడిపోవచ్చా అని అడిగితే మాత్రం కేంద్రం దగ్గర సమాధానం ఉండదు.. ఈ తరహా వైఖరి కేవలం కేంద్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు .. భార్య శరీరాన్ని సొంత ఆస్తిగా భావించే భర్తలకు కూడా వైవాహిక అత్యాచారం ఓ నేరంలా అనిపించదు..! ఇంతకీ మ్యారిటల్ రేప్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఈ వైవాహిత అత్యాచార బాధితుల బాధ ఎలాంటిది? దేశంలో మ్యారిటల్ రేప్ బాధితులు ఎంతమంది ఉన్నారు?'పురుషుడు పురుషుడే.. చట్టం చట్టమే.. స్త్రీపై పురుషుడు అత్యాచారం చేసినా, భార్యపై భర్త అత్యాచారం చేసినా అది అత్యాచారమే..' కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న రెండేళ్ళ క్రితం ఒక కేసులో ఇచ్చిన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇవి! అయితే చట్టాలు మాత్రం ఆయన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. అటు కేంద్రం కూడా మ్యారిటల్ రేప్‌ను నేరంగా అసలు అంగీకరించడంలేదు. భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 👉ఇక భారత న్యాయ సంహిత-BNS ప్రకారం వైవాహిక అత్యాచారం నేరం కాదు. ఈ మ్యారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించడం కారణంగా వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని కేంద్రం అనేకసార్లు కోర్టుల్లో వాదిస్తూ వచ్చింది. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినలైజ్ చేయడం వివాహబంధాలకు హాని కలుగుతుందన్నది వారి ప్రధాన వాదన. అయితే వివాహ వ్యవస్థను ఓ sacred institutionగా భావించడం కారణంగానే కేంద్రం ఈ విధంగా మాట్లాడుతోందని మహిళా సంఘాలు చెబుతుంటాయి. Consent.. అంటే అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొనడం మహిళా హక్కులకు పూర్తి వ్యతిరేకమంటారు. నిజానికి కేవలం భార్య అయినంతా మాత్రనా ఏ మహిళా కూడా తన హక్కులను కోల్పోదు. అందుకే Marriage is not an excuse for any kind of rape అని చెబుతారు మహిళా సంఘాల నేతలు!👉అయితే కేంద్రం మాత్రం వివాహ వ్యవస్థ రక్షణ కోసమే మ్యారిటల్ రేప్‌ను క్రిమినలైజ్ చేయడం లేదని పదేపదే చెబుతుంటుంది. ఒకవేళ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తిస్తే ఫేక్ కేసులు పెట్టేవారు పెరుగుతారని.. ఇది ఓవరాల్‌గా వివాహ వ్యవస్థకు హాని చేస్తుందని వాదిస్తుంటుంది. అటు ఈ మ్యారిటల్ రేప్‌ని నేరంగా పరిగణించాలని పోరాడే వారు మాత్రం కేంద్రం వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదంటారు. చట్టాల చాటున ఫేక్ కేసులు పెట్టే వారూ ఎక్కడైనా ఉంటారని.. అలాంటి ఘటనలు జరుగుతున్నాయని అసలు మొత్తానికే చట్టం లేకుండా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. 👉నిజానికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ ఆఫ్రికా లాంటి అనేక దేశాలు మ్యారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాయి. ఇటు ఇండియాలో మాత్రం మ్యారిటల్ రేప్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2018లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం, వివాహితులలో 29శాతం మంది శారీరక లేదా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. వైవాహిక అత్యాచారం కారణంగా మహిళలు ఎదుర్కొనే బాధ భరించరానిది. మానసికంగా ఎంతో కుంగిపోతారు. డిప్రెషన్ లాంటి సమస్యలు వేధిస్తాయి. అటు శారీరక హింస ఎలాగో ఉంటుంది. ఇటు సామాజికంగానూ ఎన్నో సవాళ్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. 👉గృహ హింస, మహిళలపై లైంగిక వేధింపుల కట్టడికి సంబంధించిన చట్టాలను తీసుకురావడంలో ఇండియా కాస్త పురోగతిని సాధించింది కానీ ఈ వైవాహిక అత్యాచార విషయంలో మాత్రం సాంప్రదాయ ఆలోచనలతో అసలు నేరాన్ని నేరంకాదని చెబుతుండడం బాధకరమని బాధితులు వాపోతుంటారు. నిజానికి గృహ హింస వివిధ రూపాల్లో ఉంది. భర్తకు భార్య పగలంతా ఒక యంత్రంలా పని చేయాలి. రాత్రికి కోరికలు తీర్చే బొమ్మలా సిద్ధం కావాలి. నిద్ర, అలసట ఉండకూడదు. పీరియడ్స్, జ్వరం ఏమీ అనకూడదు. ఇవే చాలా మంది మ్యారిటల్ రేప్ బాధితులు చెప్పే మాటలు..! వాస్తవానికి ఇలాంటి కేసులు బయటకు రావడమే చాలా అరుదు. కుటుంబం విచ్ఛిన్నమవుతుందనే భయాలు, బెదిరింపులు వల్ల వైవాహిక హింస భారతీయ సమాజంలో ఎక్కువగా బహిర్గతం కాదు. అటు కేంద్రం మాత్రం ఇది అసలు నేరమే కాదంటోంది..!:::త్రినాథ్ బండారు, సాక్షి డిజిటల్ -
ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ!
ఓటీటీ వచ్చాక థియేటర్లకు ప్రేక్షకుల పరుగులు తగ్గిపోయాయి. వెండితెర ప్రదర్శనలు వారాలకే పరిమితమయ్యాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. సినిమా ఎంత బాగున్నా సరే యాభై రోజుల లోపు స్మార్ట్ తెరకు తేవాల్సిందే. అందుకే బెనిఫిట్ షోలు.. అడ్డగోలుగా పెంచుతున్న టికెట్ రేట్లతో సినిమాలకు కలెక్షన్లు రాబడుతున్న రోజులివి. అయినా అనుకున్న ఫిగర్‌ను రీచ్ కాలేకపోతున్నారు కొందరు నిర్మాతలు. కానీ, కళ్లు చెదిరేరీతిలో కలెక్షన్లతో.. ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమ. వాస్తవికతతో పాటు ఆహ్లాదకరమైన కథలను అందించే చిత్ర పరిశ్రమగా పేరున్న మాలీవుడ్‌కు పేరు దక్కింది. అంతర్జాతీయంగానూ ఆ చిత్రాలకు అంతే గుర్తింపు దక్కుతోంది. కానీ, ఇదే పరిశ్రమకు వంద కోట్ల చిత్రం ఒక కలగానే ఉండేది. లిమిట్ బడ్జెట్, దానికి తగ్గట్లుగా తెరకెక్కే చిత్రం.. అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టేది మలయాళ సినిమా. ఫలితంగా రూ.20.. 30 కోట్ల కలెక్షన్లు రావడమే కష్టంగా ఉండేది. అయితే.. మలయాళం సినిమా మొదలైన 85 ఏళ్లకు(1928లో తొలి చిత్రం రిలీజ్..).. హాఫ్ సెంచరీ క్లబ్‌లోకి ‘దృశ్యం’(2013) రూపంలో ఓ చిత్రం అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ‘పులిమురుగన్’ సెంచరీ క్లబ్‌కి అడుగుపెట్టిన తొలి మల్లు చిత్ర ఘనత దక్కించుకుంది. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు.. 2024 ఏడాదిలో ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపోయేలా చేసింది.ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాల్లో ఐదు సినిమాలు కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించాయి. అందులో మొదటిది.. మంజుమ్మల్ బాయ్స్. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మిస్టరీ గుహల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రమిది. కేరళలో మాత్రమే కాదు.. తమిళనాట సైతం ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కమల్ హాసన్ ‘గుణ’ లోని పాట.. మంజుమ్మల్ బాయ్స్ బ్యాక్‌డ్రాప్‌కే హైలైట్. టోటల్ రన్లో ఏకంగా డబుల్ సెంచరీ(రూ.240 కోట్ల వసూళ్లు) రాబట్టి.. ఆ భాషలో కలెక్షన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టి నటించిన సినిమా. విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎడారి దేశంలో ఓ వలసజీవి ఎదుర్కొనే అవస్థలే ఈ చిత్ర కథాంశం. నజీబ్ అనే వ్యక్తి వాస్తవ గాథను బెన్యామిన్ ‘ఆడుజీవితం’గా నవల రూపకంలోకి తీసుకెళ్తే.. దానిని రచయిత కమ్ దర్శకుడు బ్లెస్సీ వెండితెరపైకి తేవడానికి 16 ఏళ్లు పట్టింది. కలెక్షన్లపరంగా 150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అవార్డులను సైతం కొల్లగొట్టింది.ఆవేశం ఫహద్ ఫాజిల్ వన్ మేన్ షో. ముగ్గురు కాలేజీ యువకులకు, ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ రంగా మధ్య నడిచే కథ ఇది. మలయాళంలో జీతూ మాధవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 156 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో రీల్స్ ద్వారా ఈ చిత్రం మరింత ఫేమస్ అయ్యింది.ఏఆర్ఎం(అజయంతే రంధం మోషణం)మిన్నల్ మురళితో తెలుగువారిని సుపరిచితుడైన టోవినోథామస్ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం. ఓ వంశంలో మూడు తరాలకు.. ఓ విగ్రహ నేపథ్యంతో నడిచే కథ ఇది. జితిన్‌లాల్ ఈ యాక్షన్ థిల్లర్‌ను తెరకెక్కించారు. ఫుల్ రన్లో వంద కోట్లు రాబట్టింది ఈ చిత్రం.ప్రేమలుమలయాళంలో చిన్నచిత్రంగా వచ్చి.. కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించింది ఈ చిత్రం.యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా గిరిష్ ఏడీ దీనిని తెరకెక్కించాడు. ఏకంగా 136 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రాలు బోనస్..మాలీవుడ్‌కు నిజంగా ఇది లక్కీ ఇయరే. పై ఐదు చిత్రాలు మాత్రమే కాదు.. కలెక్షన్లపరంగా మరికొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇందులో.. విపిన్ దాస్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్-బసిల్ జోసెఫ్-నిఖిలా విమల్ నటించిన గురువాయూర్ అంబలనాదయిల్, రూ.90 కోట్లతో సెంచరీ క్లబ్‌కి ఎక్కడం మిస్ అయ్యింది ఈ సినిమా. ఇక.. వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్లో ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ో నటించిన ‘‘వర్షన్గలక్కు శేషం’’, దింజిత్ అయ్యతాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘‘కష్కింద కాండం’’, మమ్మూటి నటించిన ‘టర్బో’, ‘భ్రమయుగం’ చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. ఇతర చిత్ర పరిశ్రమలు కుళ్లుకునేలా చేశాయి. -
ఇంకా తెలవారని సిరియా!
కుటుంబ పాలనలో.. ఆ పాలకుల నియంతృత్వ పోకడలతో యాభై ఏళ్లుగా చిధ్రమైంది సిరియా. దశాబ్దంపైగా సాగిన అంతర్యుద్ధం ఆ నేలపై ఐదు లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. 13 లక్షల మందిని దేశం విడిచిపోయేలా చేసింది. చివరకు తిరుగుబాటుదారులు పైచేయి సాధించడంతో నియంతాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దీంతో.. 2024 డిసెంబర్ 8న సిరియా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చింది. కానీ..సిరియాలో చీకట్లు తొలగినా.. ఇంకా తెలవారలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసద్ పలాయనం తర్వాత ఊహించిందే జరుగుతోంది. ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. అలాగే సైన్యం, భద్రతా బలగాలు వెనక్కి తగ్గడం.. శాంతిభద్రతలు పూర్తిగా పట్టు తప్పాయి. చాలాచోట్ల దోపిడీల్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడడం అక్కడ ఇప్పట్లో కుదరని పని. పోనీ.. ఆపద్ధర్మ ప్రభుత్వమైనా ఏర్పడాలన్నా కొత్త తలనొప్పి వచ్చిపడింది!.నా కేబినెట్లో పని చేసినవాళ్లంతా రెబల్స్‌కు సన్నిహితులే. కాబట్టి సిరియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకైనా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. -ప్రధాని ముహమ్మద్ అల్ జలీల్రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చాయి. సిరియాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మేం ఎలాంటి ఆటంకాలు కలిగించబోం.-రెబల్స్ గ్రూప్స్సిరియాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వ ఏర్పాటుకు మా పూర్తి మద్ధతు తప్పక ఉంటుంది. - విపక్షాల కూటమిసిరియాలో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రజలు మాత్రమే కాదు.. ఆయుధం పట్టి పోరాడిన వాళ్ల మద్దతు కూడా ముఖ్యమే!-హెచ్‌టీఎస్ గ్రూప్ నేత డిమ మౌస్సాపైన ప్రకటనలన్నీ ప్రభుత్వ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరులో అవి తలమునకలైపోయాయి. ప్రభుత్వ ఏర్పాటునకు ప్రభుత్వాలు ముమ్మరం చేశామని, చర్చలు జరుపుతున్నామని చెప్పిన రెబల్ గ్రూప్ హెచ్‌టీఎస్.. ఇంకోపక్క యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తోంది. తూర్పు సిరియాలోనే అతిపెద్ద పట్టణమైన దెయిర్ అల్ జౌర్పై పట్టుకోసం దాని మిత్రపక్షాలతో తీవ్రంగా యత్నిస్తోంది. ఇంకోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ స్వాధీనంలో ఉన్న అలెప్పోపై.. టర్కీ మద్దతుతో సిరియన్ నేషనల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇంకా కొన్ని రెబల్ గ్రూప్స్.. పలు ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇవికాకుండా..ఇదీ చదవండి: అసద్ పీఠాన్ని కూలదోసిన పిల్ల చేష్టలు!సిరియాలో ఆయుధ కారాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. ముఖ్యంగా రసాయనిక ఆయుధాలు హెజ్బొల్లాలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో తాము దాడుల్ని కొనసాగిస్తున్నామని ప్రకటించుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు అమెరికా కూడా సహాకారం అందిస్తోంది. మరోవైపు.. ఈ పరిణామాలను ఉగ్ర సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే రెబల్స్‌లో కొన్నింటికి వీటి మద్దతు ఉంది. హెచ్‌టీఎస్ లాంటి సంస్థ మూలాలు ఆల్‌ఖైదా నుంచే ఉన్నాయి. పైగా ఒకప్పుడు అలావైట్, సున్నీల మధ్య చిచ్చులో జిహాదీ గ్రూపులు చలి కాచుకున్న చరిత్ర ఉండనే ఉంది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తితే గనుక ఆ గ్రూపులు మరింత బలపడొచ్చు.ప్రస్తుతానికి.. సిరియాలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. అంతర్యుద్ధం ముగిసిపోయిందనడానికి అస్సలు వీల్లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తోంది. వీటికి తోడు విదేశీ జోక్యం ఈ సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి.. వీలైనంత త్వరగా అధికార శూన్యత భర్తీ జరిగి.. దేశం వెలుతురు దిశగా పయనించాలని సిరియా ప్రజానీకం బలంగా కోరుకుంటోంది. -
Disease X: ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?
అంతుచిక్కని వ్యాధి మధ్య ఆఫ్రికా దేశం కాంగోను వణికిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పటిదాకా ఓ అంచనాకి రాలేకపోయింది. ఇప్పటిదాకా ఈ వ్యాధి బారినపడి 31 మంది చనిపోగా.. అందులో పిల్లలే ఎక్కువమంది ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్లూ తరహాలో విజృంభిస్తూ.. శ్వాసకోశ సమస్యలతో మరణాలకు కారణమవుతోందని ఈ వ్యాధిపై వైద్య నిపుణులు ఓ అంచనాకు వచ్చారు.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి ఈ అంతుచిక్కని వ్యాధి విషయం చేరింది. నవంబర్ 29వ తేదీన కాంగో ఆరోగ్య శాఖ.. డబ్ల్యూహెచ్‌వోకి ఈ వ్యాధి గురించి నివేదిక ఇచ్చింది. ఇప్పటికే దర్యాప్తు నడుస్తోంది. దర్యాప్తులో ఆఫ్రికా సీడీసీ(వ్యాధుల నియంత్రణ &నిర్మూలన) కూడా భాగమైంది. అయితే ఇన్నిరోజులు గడిచినా వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఈ వ్యాధిని డిసీజ్ (Disease X)గా పరిగణిస్తున్నారు.ఏమిటీ డిసీజ్ ఎక్స్కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరో మహమ్మారి విజృంభణ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత కొంతకాలంగా అంచనా వేస్తోంది. శరవేగంగా వ్యాపిస్తూ మనుషులకు ప్రాణాంతకంగా(హైరిస్క్ రేటు) మారవచ్చని అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే ఆ ముందస్తు మహమ్మారికి ‘డిసీజ్ ఎక్స్’గా నామకరణం చేసింది. ఆపై దానిని ఎబోలా, జికా వైరస్ సరసన జాబితాలో చేర్చింది.అయితే.. డిసీజ్ ఎక్స్‌కు ఏ వైరస్ కారణం కావొచ్చనే దానిపై డబ్ల్యూహెచ్‌వో ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, కోవిడ్ తరహాలోనే శ్వాసకోశ సంబంధమైనదే అయ్యి ఉండొచ్చని మాత్రం నిపుణులు అంచనా వేస్తున్నారు.సంబంధిత వార్త: డిసీజ్ ఎక్స్ ప్రభావం కరోనా కంటే ఎన్ని రేట్లంటే..ఆలోపు వ్యాక్సిన్ సిద్ధం!డిసీజ్ ఎక్స్‌పై ఓవైపు ఆందోళనలు నెలకొంటున్న వేళ.. మరోవైపు వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌లోనే మార్పులు చేస్తోందని తెలుస్తోంది. అలాగే.. భవిష్యత్తులో రాబోయే మహమ్మారి కోసం మరిన్ని వ్యాక్సిన్లను సిద్ధం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.కాంగోలో విజృంభిస్తోంది ఏంటి?మారుమూల కువాంగో(Kwango) నుంచి అంతుచిక్కని వ్యాధి విజృంభణ మొదలైందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటిదాకా 406 కేసులు నమోదుకాగా.. 31 మంది చనిపోయారు. మృతుల్లో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే పాతికేళ్లలోపు వాళ్లలోనే లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాంగో కొత్త వ్యాధి లక్షణాలుజ్వరంతలనొప్పిదగ్గు,జలుబుఒళ్లు నొప్పులుఅయితే.. కాంగోలో అంతుచిక్కని వ్యాధి రికార్డుల్లోని తీవ్రస్థాయిలో కేసులను పరిశీలించిన డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం.. పౌష్టికాహార లోపాన్ని గుర్తించినట్లు చెబుతోంది. చనిపోతున్నవాళ్లలో శ్వాసకోశ ఇబ్బందులు, రక్తహీనత సమస్యలను గుర్తించినట్లు వెల్లడించింది. అలాగే వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ఆహార కొరత, తక్కువ వ్యాక్సినేషన్ నమోదు, పరీక్షలకు.. వైద్యానికి సరైన వసతులు లేకపోవడం కూడా గుర్తించినట్లు ఓ నివేదిక ఇచ్చింది. అయితే కాంగోలో విజృంభిస్తోందని డిసీజ్ ఎక్స్ యేనా? దాని తీవ్రత ఏంటి? వ్యాప్తి రేటు తదితర అంశాలపై ల్యాబోరేటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాతనే(అదీ దశలవారీగా) ఈ వ్యాధి విజృంభణకు గల కారణాలపై కచ్చితమైన నిర్దారణకు రాగలమని ఆ బృందం స్పష్టత ఇచ్చింది. -
Syria: పిల్ల చేష్టలనుకుంటే.. నియంత పాలన అంతానికి నాంది పలికింది!
ఏ పని చేస్తే ఏం జరుగుతుందో.. తెలిసీతెలియని వయసులో ఆ బాలుడు చేసిన పని.. సిరియా ముఖచిత్రాన్నే మార్చేసింది. నిరంకుశ పాలనపై దేశం మొత్తాన్ని ఒకతాటిపైకి తెచ్చి నిరసన గళం విప్పేలా చేసింది. అసద్ నియంత పాలనకు వ్యతిరేకంగా అప్పటిదాకా రెబల్స్ చేస్తున్న తిరుగుబాటును.. ముమ్మరం చేయడానికి నాంది పలికింది. ఆ చర్యే.. దశాబ్దాల పోరు తర్వాత సిరియాకు స్వేచ్ఛా వాయువుల్ని అందించబోతోంది. కానీ, యుక్తవయసుకొచ్చిన అతని ముఖంలో మాత్రం సంతోషం కనిపించడం లేదు.తన తండ్రి హఫీజ్ మరణాంతరం వారసత్వంగా వచ్చిన సిరియా అధ్యక్ష పదవిని బలవంతంగానే అంగీకరించాడు డాక్టర్ బషర్ అల్ అసద్. అయితే నియంత పోకడకు అలవాటు పడడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. అదే సమయంలో అరబ్ విప్లవం మొదలైంది. కుటుంబ పాలనలో నలిగిపోయిన సిరియన్లకు ఈ విప్లవం ఓ ఆశాజ్యోతిలా కనిపించింది. దారా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మువావియా సియాస్నే.. ఈజిప్ట్, ట్యూనీషియలో ఏం జరిగిందో టీవీల్లో చూశాడు. పరుగున వెళ్లి తన స్నేహితులను పోగు చేశాడు. స్కూల్ ఆ గోడ మీదే కొన్ని రంగులు తీసుకుని రాతలు రాశాడు.‘‘డాక్టర్.. తర్వాత నీ వంతే!’’ అంటూ అధ్యక్షుడు అసద్‌ను ఉద్దేశించి సరదాగా రాసింది సియాస్నే బృందం. పిల్ల చేష్టలనుకుని.. ఎవరూ ఆ రాతల్ని పట్టించుకోలేదు. కానీ, కొన్నాళ్లకు పోలీసులు ఆ రాతలను సీరియస్‌గా తీసుకున్నారు. దగ్గర్లోని కొందరు కుర్రాళ్లను అదుపులోకి తీసుకుని రాసిందో ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఈలోపు విషయం సియాస్నే తండ్రికి తెలిసి భయపడ్డాడు. ‘ఎందుకు రాశావ్?’ అనే కొడుకును అడిగితే.. అలా జరిగిపోయిందంటూ నిర్లక్క్ష్యపు సమాధానం ఇచ్చాడు. అయితే వెంటనే దాక్కోమని సలహా ఇచ్చాడు ఆ తండ్రి. ఉదయం వెళ్లొచ్చులే అని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు ఆ బాలుడు. అయితే..వేకువజామున 4 గం. ప్రాంతలో మువావియా సియాస్నే చేతులకు బేడీలు పడ్డాయి. గోడ మీద రాతలు రాసే టైంలో మరో ముగ్గురు స్నేహితులు మువావియా వెంట ఉండడంతో.. వాళ్లనూ లాక్కెళ్లారు. పాడై పోయిన భోజనం, ఒంటి మీద నూలుపోగు లేకుండా కర్రలతో బాదుతూ.. కరెంట్ షాక్‌తో థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. దాదాపు నెలన్నరపాటు ఆ నలుగురికి నరకం అంటే ఏంటో చూపించారు. ఇంతలో తమ బిడ్డల కోసం ఆ తండ్రులు స్టేషన్ల గడప తొక్కారు.‘‘వీళ్లను మరిచిపోండి. ఇళ్లకు పోయి మీ పెళ్లాలతో మళ్లీ పిల్లల్ని కనండి. చేతకాకపోతే.. మీ ఆడాళ్లను మా దగ్గరకు పంపండి’’ అంటూ అతిజుగుప్సాకరంగా మాట్లాడిన ఆ పోలీసుల మాటలను దిగమింగుకుని వాళ్ల తండ్రులు వెనుదిరిగారు. మానవ హక్కుల సంఘాల ద్వారా తమ పిల్లలను విడిపించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈలోపు నెల గడిచింది. విషయం దేశం మొత్తం పాకింది.అధ్యక్షుడు అసద్‌కు కోపం తెప్పించిన ఆ నలుగురు పిల్లల విముక్తి కోసం వేల మంది రోడ్డెక్కారు. వాళ్లను విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ ఉద్యమించారు. ఈ ఉద్యమం దావానంలా వ్యాపించింది. మార్చి 15, 2011లో అసద్ పాలనకు వ్యతిరేకంగా సిరియా వ్యాప్తంగా సంఘటితంగా జరిగిన ప్రజా నిరసన కార్యక్రమాలు(Day of Rage).. ఆ దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అయితే.. అప్పటికే అణచివేతను అలవాటు చేసుకున్న అసద్.. ఆ ఉద్యమాన్ని హింసాత్మకంగా మారేదిశగా కవ్వింపు చర్యలకు దిగాడు. అది కాస్త.. లక్షల మందితో తిరుగుబాటుగా తయారైంది. 45 రోజుల తర్వాత.. క్షమాభిక్ష పేరిట ఆ నలుగురిని విడిచిపెట్టారు. మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల వైపు చూడకూడదని లిఖితపూర్వకంగా రాయించుకున్నారు. అయితే.. మువావియా జీవితం అప్పటి నుంచి కుదేలయ్యింది. నాలుగేళ్ల తర్వాత అంతర్యుద్ధంలోనే తన తండ్రి తుటాలకు బలయ్యాడు. ఆ తర్వాతి రోజుల్లో సిరియా విముక్తి పేరిట ఏర్పాటైన సైన్యంలో చేరాడతను. ఇన్నేళ్ల అంతర్యుద్ధాన్ని.. అందులో పోయిన లక్షల ప్రాణాలను తల్చుకుంటూ.. తాను అలాంటి పని చేయకుండా ఉండాల్సిందని కాదని అంటున్నాడు.‘‘మేం జైలు నుంచి బయటకు వచ్చాక.. బయట ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. వాళ్లంతా మాకు మద్దతుగా వచ్చారా? అని ఆశ్చర్యపోయాం. ఆ క్షణం సంతోషంగానే అనిపించింది. కానీ, ఇప్పుడు ఆరోజు నేను అలా చేయకుండా ఉండాల్సిందేమో అనిపిస్తోంది. ఆనాడు అలా నేను గోడ మీద రాసి ఉండకపోతే.. అసద్‌కు కోపం తెప్పించి ఉండకపోతే.. తిరుగుబాటు ఈ స్థాయిలో జరిగి ఉండేది కాదేమో!. లక్షల ప్రాణాలు పోయేవి కావేమో అని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు’’.. అయితే అసద్ పాలనకు ముగింపు పడినందుకు మాత్రం తనకు సంతోషంగానే ఉందంటున్నాడతను.కీలక పరిణామాలు..మువావియా-అతని స్నేహితుల అరెస్ట్.. తదనంతర పరిణామాల తర్వాత అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమాలు చేశారు. ఉగ్ర సంస్థలు, తిరుగుబాటు దారులు మరోవైపు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టే యత్నం చేశారు. కానీ, వీటినీ అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేస్తూ వచ్చింది. నిరంకుశ పాలన దిశగా అసద్‌ను అడుగులేయించింది. 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకోగా.. 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా సిరియాలో రంగ ప్రవేశం చేశాయి.మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి.అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 13 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు.అయితే 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ మిత్రదేశం రష్యాకు పలాయనం చిత్తగించక తప్పలేదు. హమ్జా అలీ అల్ ఖతీబ్.. బషర్ అల్ అసద్ కర్కశపాలనకు బలైన ఓ పసిప్రాణం. కేవలం 13 ఏళ్ల వయసులో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నాడంటూ అభియోగాలు మోపి అరెస్ట్ చేసి.. కస్టడీలో తీవ్రంగా హింసించారు. చివరకు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. రమారమి.. మువావియా సియాస్నేని హింసించిన సమయంలోనే ఈ ఘటనా జరిగింది. అయితే సోషల్ మీడియాలో సిరియా నియంతాధ్యకక్షుడు అసద్‌కు వ్యతిరేకంగా.. హమ్జా పేరిట నడిచిన ఉద్యమం ఈనాటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. -
‘‘లంచం.. సత్యం.. నిత్యం.. అనంతం’’!
ప్రజల సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిలో.. చివరకు వాళ్ల దగ్గరకు చేరేది కేవలం 15 పైసలే!. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన మాట ఇది. ఈ మాట ఇవాళ్టికీ ఎన్నికల టైంలలో కొందరు నేతల నోటి వెంట వినాల్సి వస్తోంది. అంటే.. అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదా?.సమాజాన్ని పట్టి పీడించే సమస్యలంటూ అవినీతి, లంచగొండితనం మీద సినిమాలు తీసే దర్శకులు కూడా.. క్లైమాక్స్‌లో వాటికి ఓ సరైన ముగింపు చూపలేకపోతున్నారు. అందుకు కారణం.. జనం అవసరాలు అంతలా ఉండడం. వాటిని ఆసరాగా చేసుకుని కొంతమంది అత్యాశకు పోతున్నారు. వేలు, లక్షల్లో వేతనాలు వస్తున్నా.. చాలదన్నట్లుగా పక్కచూపులు చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే.. ఇలాంటి వాటికి తావులేకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ(డీబీటీ)లాంటి ఆలోచనలు చాలావరకు ఊరట ఇస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..👉దేశంలోని మెజార్టీ కంపెనీలు ప్రభుత్వ అధికారులకు ఏదో ఒక దశలో లంచాలు ఇచ్చామని ఒప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన విస్తుపోయే వివరాలు.. ఓ సర్వే ద్వారా వెల్లడయ్యాయి.👉సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రకారం.. గత ఏడాది కాలంలో ఒక్కసారైనా లంచం ఇచ్చామని మనదేశంలో సుమారు 66 శాతం కంపెనీలు తెలిపాయి. బలవంతంగా లంచం ఇవ్వాల్సి వచ్చిందని 54 శాతం బిజినెస్‌లు, పనులు వేగంగా పూర్తి చేసేందుకు లంచం ఇవ్వడానికి వాలంటరీగా ముందుకొచ్చామని 46 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి.👉తూనికలు-కొలతలు, ఔషధాలు, ఆరోగ్యం.. ఈ విభాగాలు అత్యంత అవినీతిమయంగా మారాయి. ఈ విభాగాలకు సంబంధించిన ప్రతీ నాలుగింటిలో ముగ్గురు తప్పనిసరిగా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇక.. 👉మొత్తం 159 జిల్లాల్లోని కంపెనీల అభిప్రాయాలను సేకరించి ఈ వివరాలను బయటపెట్టింది. ఈ సర్వే కోసం 18 వేల రెస్పాన్స్‌లను సేకరించింది. ఇంకా ఈ సర్వే రిపోర్ట్‌లో.. ప్రభుత్వ డిపార్ట్మెంట్లతో డీల్ చేస్తున్నప్పుడు పర్మిట్స్ పొందడానికి, సప్లయర్ క్వాలిఫికేషన్, ఫైల్స్, ఆర్డర్స్, పేమెంట్స్ పొందడానికి లంచం ఇచ్చుకోవల్సి వచ్చిందని బిజినెస్‌లు తెలిపాయి. ‘ప్రభుత్వ అనుమతులను వేగంగా పొందాలంటే లంచం ఇవ్వడం తప్పదని చాలా బిజినెస్‌లు పేర్కొన్నాయి. ప్రాసెస్‌లో ఇదొక పార్ట్‌గా మారిందని చెప్పాయి. అథారిటీ లైసెన్స్ డూప్లికేట్ కాపీ కోసం కూడా లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందని, ప్రాపర్టీ సంబంధిత అంశాల్లో లంచం తప్పదని బిజినెస్‌లు పేర్కొన్నాయి. గత ఏడాది కాలంలో వివిధ రూపాల్లో లంచం ఇచ్చుకున్నామని 66 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి. అయితే..159 జిల్లాల్లో వివిధ రంగాలకు చెందిన 9 వేల వ్యాపారాలను ఈ సర్వేలో భాగం చేసింది లోకల్‌సర్కిల్స్. మెట్రో(టైర్1) జిల్లాల నుంచి 42 శాతం, టైర్ 2 జిల్లాల నుంచి 33 శాతం, టైర్-3, టైర్-4 జిల్లాల నుంచి(రూరల్) 25 శాతం పాల్గొన్నారు.ఇందుగలడందులేడనిసందేహము వలదుఎందెందు వెదకి చూచినఅందందు అమ్యామ్యా మూలము గలదు!.. అవినీతిలో భారత్ స్థానం ప్రపంచంలో ఎంతో తెలుసా?లంచం ఇచ్చినవాళ్లలో 47 శాతం.. తాము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అమ్యామా ముట్టజెప్పామని చెప్పారు. 62 శాతం మంది జీఎస్టీ అధికారులకు లంచాలిచ్చి పనులు చేయించుకున్నామని తెలిపారు. ప్రతీ ఇద్దరిలో ఒక వ్యాపారవేత్త.. కాలుష్యనివారణ, మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ రంగాల్లో అధికారులకు అమ్యామ్యా ఇచ్చామన్నారు. అయితే ఇదే సర్వేలో ఇంకో ఆసక్తికరమై విషయం గమనిస్తే..లంచం ఇవ్వకుండానే పనులు పూర్తి చేసుకోగలిగామని 16 శాతం బిజినెస్‌లు చెప్పాయి. అలాగే లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదని 19 శాతం బిజినెస్‌లు పేర్కొన్నాయి. అవినీతి నిరోధక చట్టం(2018-సవరణ) ప్రకారం.. లంచం తీసుకోవడం మాత్రమే కాదు.. ఇవ్వడమూ నేరమే. అయినా ఇలాంటి సర్వేలు అప్పుడప్పుడు మన దేశంలో లంచగొండితనం ఎంత లోతుల్లో వేళ్లు పాతుకుపోయిందో అనే విషయాన్ని మనకు చెబుతుంటాయి. అవినీతి అవగాహన సూచిక 2023 ప్రకారం.. 180 దేశాల్లో భారత్ 93వ స్థానంలో ఉంది. -
పాక్ గడ్డపై భారత జట్టుకు మానని గాయాలు!
దాయది దేశాల క్రికెట్ పోరు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. కొన్ని కోట్ల మందికి, ముఖ్యంగా ఇరుదేశాల క్రికెట్ అభిమానుల్ని ఒకచోటుకు చేర్చి.. విపరీతమైన మజాను అందిస్తుంటుంది. అయితే ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు సన్నగిల్లడం, సరిహద్దు వివాదం, ఉగ్రదాడుల నేపథ్యాలు పరస్పర పర్యటనలకు ఇరుదేశాలను దూరం చేస్తూ వస్తున్నాయి. ఈ కారణంగానే వచ్చే ఏడాదిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌కు ఫిక్స్ అయ్యింది. అయితే..క్రికెట్ రంగంలోనే రిచ్చెస్ట్ బోర్డు అని.. ఐసీసీనే ప్రభావితం చేయగల సత్తా ఉందనే పేరుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)కి. అంతటి శక్తివంతమైన బోర్డు.. పాక్ గడ్డకు తమ ఆటగాళ్లను పంపించేందుకు, అక్కడి పిచ్‌లపై ఆడించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తోంది. దీనికి కొంత సమాధానం భారత మాజీ క్రికెటర్ రాసిన పుస్తకంలో దొరికింది.👉80వ దశకం చివర్లో.. పాక్-భారత్ మధ్య కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఉగ్రవాదాన్ని పైసలు, ఆశ్రయమిచ్చి మరీ పోషిస్తోందంటూ పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో భారత్ ఎండగట్టడం మొదలుపెట్టింది అప్పుడే. అలాంటి టైంలో అనూహ్యంగా.. భారత జట్టు పాక్ పర్యటన వెళ్లాల్సి వచ్చింది.👉1989-90 సీజన్లో కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్వంలోని భారత జట్టు.. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు పాక్‌కు వెళ్లింది. అన్ని టెస్టులు డ్రాగా ముగియగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది. అయితే.. కరాచీ స్టేడియంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఎవరూ ఊహించని ఓ ఘటన జరిగింది. పాక్ జట్టు బ్యాటింగ్.. భారత్ ఫీల్డింగ్ చేస్తోంది. ఆ సమయంలో పథాన్ దుస్తుల్లో ఓ వ్యక్తి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. బహుశా ఎవరైనా అభిమాని తమ ఫేవరెట్ ప్లేయర్‌ను కలవడానికి అయ్యి ఉంటారేమో!.. సిబ్బంది అతన్ని అడ్డుకుంటారులే అనుకుంటూ భారత ఫీల్డర్లు తమతమ స్థానాల్లో ఉండిపోయారు. అయితే పిచ్‌ను సమీపించే కొద్దీ.. అతని ఉద్దేశం ఏంటో ఆటగాళ్లకి అర్థమైంది. ప్రోకశ్మీర్, భారత వ్యతిరేక స్లోగన్లతో దూసుకొచ్చాడతను. అసలు ఈ పర్యటనకు రాకుండా ఉండాల్సిందంటూ భారత ఆటగాళ్లు దూషిస్తున్నాడతను. ఇంతలో అంపైర్లు జోక్యం చేసుకుని.. అతన్ని అడ్డగించే మైదానం నుంచి వెనక్కి పంపే ప్రయత్నం చేయబోయారు. అయితే ఆ వ్యక్తి సరాసరి కృష్ణమాచారి శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఏదో అన్నాడు. అంతే.. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఒకరి గల్లా ఒకరు పట్టుకుని లాగేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ షర్ట్ చినిగిపోయింది. దీంతో జట్టు సభ్యులంతా దగ్గరికి పరిగెత్తారు. ఈలోపు.. సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని అక్కడి నుంచి లాక్కెల్లారు. క్రికెటర్ నుంచి కామెంటేటర్‌గా మారిన సంజయ్ మంజ్రేకర్ తన ‘ఇంపర్ఫెక్ట్’లో ఈ ఘటన గురించి రాసుకొచ్చారు. మంజ్రేకర్‌కు మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్‌కు కూడా ఈ మ్యాచ్ టెస్ట్ డెబ్యూ కావడం గమనార్హం.అయితే ఈ ఘటన తర్వాత..శ్రీకాంత్ తన షర్ట్ మార్చుకుని వచ్చాడు. అసలేం జరగనట్లు ఆట యధావిధిగా జరిగింది. కానీ ఇదే మ్యాచ్‌లో.. మరో భారతీయ ఆటగాడు ముహమ్మద్ అజారుద్దీన్పైనా మెటల్ హుక్తో దాడి జరిగింది. ఒకవేళ.. ఇవాళ అలాంటి ఘటనలే గనుక ఈనాడు జరిగి ఉంటే.. ఆ మ్యాచ్, సిరీస్..మొత్తం పర్యటనే రద్దు అయ్యి ఉండేదేమో!.👉ఇక.. అదే టూర్లో జరిగిన మరో ఘటన గుర్తు చేసుకుంటే.. మూడో వన్డే సందర్భంగా పెద్ద రచ్చే చెలరేగింది. కరాచీ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరుగుతుండగా.. 28 పరుగులకు పాక్ మూడు వికెట్లు పొగొట్టుకుంది. అది సహించలేని అభిమానులు భారత జట్టు ఆటగాళ్ల మీదకు రాళ్లు విసిరారు. పాక్ కెప్టెన్ జావెద్ మియాందాద్ అభిమానుల్ని శాంతపర్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు టియర్ గ్యాస్ ప్రయోగించి చెల్లాచెదురు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి.. తిరిగి లాహోర్‌లో నిర్వహించారు.👉ఈ ఘటన తర్వాత ఇరు కూడా దేశాలు పర్యటనలను కొనసాగించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే సిరీస్‌లు నిర్వహించుకున్నాయి. తటస్థ వేదికల్లోనూ మ్యాచ్‌లు ఆడాయి.. ఇంకా ఆడుతున్నాయి. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భద్రతా కారణాల వల్లే తమ జట్టును పాక్‌కు పంపలేమని బీసీసీఐ కుండబద్ధలు కొట్టేసింది. ఇందుకు పైన చెప్పుకున్న కారణాలే కాదు.. ఇంకో ముఖ్యమైన ఘటన ఉంది.2009 శ్రీలంక జట్టుపై పాక్ పర్యటనలో జరిగిన దాడి.. క్రికెట్ చరిత్రలో ‘బుల్లెట్’ అక్షరాలతో లిఖించబడింది. టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా ముసుగులతో వచ్చిన కొందరు తూటాల వర్షం కురిపించారు. ఆరుగురు పోలీసాఫీసర్లు చనిపోగా.. లంక టీంకు ఆటగాళ్లు, అధికారులు ఏడుగురు గాయపడ్డారు. ఘటన తర్వాత ఎయిర్‌లిఫ్ట్ ద్వారా క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. క్రికెట్ చరిత్రలోనే అదొక చీకటి దినంగా మిగిలిపోయింది.ఈ ఘటన తర్వాత చాలా దేశాలు తమ జట్లను పాక్‌కు పంపేందుకు భయపడ్డాయి. అయితే భారత్ మాత్రం 2008 తర్వాతి నుంచి పాక్ గడ్డపై సిరీస్ ఆడలేదు. ముంబై 26/11 దాడులే అందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.👉పాక్ క్రికెట్ జట్టు ఇప్పటిదాకా పదిసార్లు.. భారత్‌లో పర్యటించింది. 1989 ఘటనలు పాక్ గడ్డపై భారత్‌కు మానని గాయం. అయితే ఆ ఘటనల తర్వాత కూడా భారత జట్టు మూడుసార్లు పాక్ పర్యటనకు వెళ్లింది. కానీ, మునుపటిలా పరిస్థితులు లేవిప్పుడు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగితే పర్వాలేదు. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కానీ, పాక్‌లో ఇప్పుడు పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్‌తో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. పైగా.. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత రాజకీయంగానూ పాక్‌లో సంక్షోభం నడుస్తోంది. ఒకవైపు ఉగ్రదాడులు.. ఇంకోవైపు అనుమానాస్పద రీతిలో ఉగ్ర నేతలు హతమవుతుండడం తీవ్ర చర్చనీయాంశంమైంది. అలాంటప్పుడు భారత ఆటగాళ్లకు భద్రత కల్పించడం ప్రశ్నార్థకమే!. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే ఇటు బీసీసీఐ, అటు కేంద్రప్రభుత్వం టీమిండియాను పాక్ పర్యటనకు అనుమతించడం లేదన్నది అర్థమవుతోంది. -
అదే జరిగితే.. బతుకులు ‘రోడ్డు’న పడవు!
‘‘యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడడం కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడడం’.. సినిమా డైలాగే కావొచ్చు.. ఇది అక్షర సత్యం. ఏదో ఒక పని మీద రోడ్ల మీదకొచ్చి.. ఇంటికి చేరుకునేలోపే ఛిద్రమవుతున్న బతుకులు ఎన్నో. మన దేశంలో ఆ సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది కూడా. తప్పేవరిదైనా.. శిక్ష మాత్రం ఆ కుటుంబాలకే పడుతోంది.ఇరుకు రోడ్లు మొదలుకుని.. గల్లీలు, టౌన్లలో, రద్దీగా ఉండే సిటీ రోడ్లపైన, విశాలమైన రహదారుల్లోనూ.. ప్రమాదాలనేవి సర్వసాధారణంగా మారాయి. మనదేశంలో ప్రతీరోజూ రోడ్డు ప్రమాదాల్లో లెక్కలేనంత మంది మరణిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యలేవీ ఫలించినట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సాంకేతికత’నే మరోసారి నమ్ముకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏఐ.. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(కృత్రిమ మేధస్సు). సోషల్ మీడియాలో కేవలం వినోదాన్ని అందించే సాధనంగానే చూస్తున్నారు చాలామంది. కానీ, దాదాపు ప్రతీ రంగంలోనూ ఇప్పుడు దీని అవసరం పడుతోంది. ప్రపంచం అంతటా.. ఏఐ మీద కళ్లు చెదిరిపోయే రేంజ్లో బిజినెస్ నడుస్తోంది. కానీ, ఇలాంటి టెక్నాలజీ సాయంతోనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తే ఎలా ఉంటుంది?.ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించేది ఏ దేశంలోనో తెలుసా?మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా రోడ్ల నిర్మాణం, వాటి రిపేర్ల కోసం అయిన ఖర్చు ఘనంగానే ఉంది. అయినప్పటికీ కొన్ని సవాళ్లు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. పెరిగిన రద్దీ, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, సురక్షిత ప్రయాణ పద్దతుల(సేఫ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్) మీద వాహనదారుల్లో అవగాహన లేకపోవడం.. వీటితో పాటు ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం, పేలవమైన రోడ్ల నిర్వహణ, భద్రతా చర్యలు సరిపోకపోవడంలాంటివి నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.2022లో.. అధికారిక గణాంకాల ప్రకారం 4,60,000 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిల్లో 1,68,491 మంది మరణించగా.. 4,43,366 మంది గాయపడ్డారు.2023లో.. 4,12,432 యాక్సిడెంట్లు జరిగితే 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది క్షతగాత్రులయ్యారు.ఈ లెక్కల ఆధారంగా.. రోడ్డు ప్రమాదాలు 11 శాతం పెరిగితే.. మరణాలు దాదాపు 10 శాతం, గాయపడినవాళ్ల సంఖ్య 15 శాతం పెరుగుతూ వచ్చింది.అరికట్టడం ఎలా?సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(CRRI).. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో 2008 నుంచి 2021 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించింది. దాదాపు 30 లక్షలకుపైగా జనాభా ఉన్న నాగ్‌పూర్‌లో.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడాదికి సగటున 200 మంది చనిపోతున్నారు. గాయపడేవాళ్ల సంఖ్య 1000కి పైనే ఉంటోంది. మహారాష్ట్రలో ఇదే అధికమని తేలింది.ఈ అధ్యయనం ఆధారంగా.. సాంకేతికతకు ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌ను జత చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గించొచ్చని చెబుతున్నారు. అదెలాగంటే.. ఏఐను ఉపయోగించి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌ను రూపొందించడం. ఇందులోనే ఆడియో, వీడియో వ్యవస్థలను కూడా రూపొందించారు.ఎలాగంటే.. ఈ సిస్టమ్‌ను వాహనాల విండ్ షీల్డ్(ముందు ఉండే అద్దాలకు) అమర్చడం ద్వారా ముందు ఉన్న రోడ్లను పూర్తిగా స్కాన్ చేస్తుంది. ముందు ఏదైనా ముప్పు పొంచి ఉంటే గనుక.. ఆ ఆడియో లేదంటే వీడియో అలారమ్ ద్వారా వాహనం నడిపేవాళ్లను అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ప్రమాదాలను తృటిలో తప్పించుకునే అవకాశం ఉంటుంది. కేవలం కార్లు, భారీ వాహనాలకే కాదు.. ద్విచక్ర వాహనదారులకు, పాదాచారులకు, వీధుల్లో తిరిగే జంతువుల విషయంలోనూ వర్తిస్తుంది.ఆచరణలోకి వచ్చిందా?అవును.. నాగ్‌పూర్‌లోనే సెప్టెంబర్ 2021లో iRASTE ప్రాజెక్టు ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, తద్వారా కొందరి ప్రాణాలైనా నిలబెట్టడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రైవేట్ వాహనాలను కాకుండా.. ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారు. నాగపూర్ అర్బన్-పెరి అర్బన్ రోడ్డు నెట్‌వర్క్‌లో నడిచే సుమారు 150 బస్సులకు ఏఐ టెక్నాలజీ కెమెరాలను అమర్చారు. కనీసం 2.5 సెకండ్ల తేడాతో ప్రమాదం జరిగే ముందు.. ఇవి డ్రైవర్లను అప్రమత్తం చేసేవి. అలా.. రెండేళ్లకు పైగా ఈ పైలట్ ప్రాజెక్టును. బ్లాక్,గ్రే పాయింట్లుగా విభజించి పరిశీలించారు. ఫలితం ఇలా.. ఐఆర్ఏఎస్టీఈ ప్రాజెక్టు క్రమక్రమంగా మెరుగైన ఫలితం చూపించడం మొదలుపెట్టింది. సకాలంలో డ్రైవర్లు స్పందించడంతో ప్రమాదాలు జరగకుండా చూసుకోగలిగారు. అయితే ఇది 100కు వంద శాతం సక్సెస్‌ను(66%) ఇవ్వలేకపోయింది. ప్రాణనష్టం తప్పినప్పటికీ ప్రమాదాల్లో గాయపడిన వాళ్ల సంఖ్య మాత్రం అంతేస్థాయిలో కొనసాగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. జులై 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య.. నాగ్‌పూర్ గ్రే స్పాట్స్‌లో డ్రైవర్లు సకాలంలో ప్రమాదాలు జరగకుండా చూడగలిగారు. తద్వారా.. 36 మంది ప్రాణాలు నిలబడ్డాయి.మన దేశంలో రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించే దేశం మనది. 2018-2022 మధ్య తమిళనాడులో రికార్డు స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా మరణాలు మాత్రం ఉత్తర ప్రదేశ్‌లో సంభవించాయి. 2021, 2022 సంవత్సరాల్లో 22,595.. 21,227 మంది మరణించారు. వీటిల్లో ఓవర్ స్పీడ్ మరణాలే అత్యధికంగా ఉన్నాయి. అలాంటి దేశంలో 2030నాటికల్లా.. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం(ప్రాణ, వాహన నష్టం) 50 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే.. ఏఐ సంబంధిత వాహనాలను రోడ్లపైకి తేవాల్సిందేనంటున్నారు మేధావులు. ఇది ఒక తరహా ఆలోచన మాత్రమేనని.. మరిన్ని అవకాశాలను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నారు వాళ్లు. తద్వారా మరిన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా చూడొచ్చని చెబుతున్నారు. -
అకాల్ తఖ్త్.. ఆదేశిస్తే ఏదైనా చేయాల్సిందే!.. మరి ఉల్లంఘిస్తే?
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన పాపాలకుగానూ(తప్పిదాలు).. ఏకంగా డిప్యూటీ సీఎంగా పని చేసిన ఓ వ్యక్తికి శిక్షలు విధించింది సిక్కు మతానికి చెందిన అకాల్ తఖ్త్. బాత్రూంలు, వంటగదులు, వరండాలు కడగడం.. షూలు, చెప్పులను శుభ్రం చేయడం లాంటి పనులు చేయాలని హుకుం జారీ చేసింది. ఆ ఆదేశాల్ని ఉల్లంఘించకుండా సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరసావహించారు. ఈ క్రమంలోనే ఆయనపై జరిగిన హత్యాయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. అకాల్ తఖ్త్ విధించిన ఈ శిక్షల గురించి తెలిసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు.సిక్కు మత సమగ్రతను కాపాడుకోవడంతో పాటు తప్పు చేసిన వ్యక్తికి తన తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చి.. తద్వారా మత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని మార్చుకోవడమే అకాల్ తఖ్త్ ఉద్దేశం. అయితే.. ఇక్కడే కొన్ని సందేహాలు కలగకమానవు. అసలు అకాల్ తఖ్త్‌ను నడిపించేదెవరు?. ఒకవేళ ఆ శిక్షకు తలొగ్గకపోతే ఏం చేస్తారు?. నిజంగానే తీవ్ర పరిణామాలు ఉంటాయా?. సాధారణంగా అకాల్ తఖ్త్ విధించే శిక్షలను పరిశీలిస్తే..బహిరంగ క్షమాపణలు.. తప్పు చేసినవాళ్లతో సిక్కు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారుపాప పరిహారం కింద.. సేవా కార్యక్రమాల్లో(బాత్రూంలు, వంటగది, వరండాలు శుభ్రం చేయడం.. వంట చేర్చి వార్చడం, కాపలా పని, వగైరా) ద్వారా పాప పరిహారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. బహిష్కరణ.. నేర తీవ్రతను బట్టి సిక్కు సమాజం నుంచి వాళ్లను వెలివేస్తారు. ఇది కొంత కాలపరిమితితో ఉంటుంది. తద్వారా.. మతపరమైన కార్యక్రమాల్లో వాళ్లు భాగం కాలేరు. మరి ఈ శిక్షలను ఉల్లంఘిస్తే..?ఎవరైనా అకాల్ తఖ్త్ శిక్షలను గనుక ఉల్లంఘిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.శాశ్వత బహిష్కరణ.. అకాల్ తఖ్త్ శిక్షలకు తలొగ్గనివాళ్లను శాశ్వతంగా సిక్కు సమాజం నుంచి వెలివేస్తారు.సామాజిక బహిష్కరణలో భాగంగా.. సిక్కు కమ్యూనిటీ నుంచి వాళ్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎలాంటి సాయం అందించరు. తద్వారా.. వాళ్లను ఒంటరిని చేసేస్తారు.ఆధ్యాత్మిక సయోధ్య.. దండించడం బదులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించి.. వాళ్లను మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి ఉండదంటారు కదా. ఒత్తిడి చేయడం ద్వారా వాళ్లు తమ తప్పులను ఒప్పకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.ఇవేవీ పని చేయని క్రమంలో.. సిక్కు సంఘాలే రంగంలోకి దిగుతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. ఇన్నేళ్ల కాలంలో పరిస్థితి ఇంతదాకా ఏనాడూ రాలేదు.అకాల్ తఖ్త్ ద్వారా శిక్షించబడిన వాళ్లు ఎందరో.. వాళ్లలో కొందరు ప్రముఖులూ ఉన్నారు.మహారాజా రంజిత్ సింగ్సిక్కుల తొలి చక్రవర్తి. పరమతానికి చెందిన నృత్యకారిణిని వివాహం చేసుకున్నారనే నేరం కింద అకాల్ తఖ్త్ ఆయనకు కొరడాతో దెబ్బలు తినాలని శిక్ష విధించింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పడంతో మన్నించి వదిలేసింది తఖ్త్.జ్ఞానీ జైల్సింగ్భారత మాజీ రాష్ట్రపతి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని అనుమతించారనే నేరం కింద ఆయన్ని అకాల్ తఖ్త్ శిక్షించింది. అయితే రాత పూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారు.బూటా సింగ్కేంద్ర మాజీ మంత్రి. ఈయన్ని కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కిందే శిక్షించింది అకాల్ తఖ్త్. శిక్షను అంగీకరించిన ఆయన.. కమ్యూనిటీ సేవలో పాల్గొన్నారు కూడా.సుర్జిత్ సింగ్ బర్నాలాపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఆపరేషన్ బ్లాక్ థండర్(అమృత్సర్ గోల్డెన్ టెంపుల్‌లోకి బ్లాక్ క్యాట్ కమాండోలను అనుమతించడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ని కాస్త కఠినంగానే శిక్షించారు. అకాల్ తఖ్త్కు జరిమానా కట్టడంతో బూట్లు శుభ్రం చేసి.. సిక్కు ప్రార్థనల్లో పాల్గొని తన పాపపరిహారం చేసుకున్నారాయన. సుఖ్వీర్సింగ్ బాదల్పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఇందులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్దతు ఇవ్వడం కూడా ఉంది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్బీర్ను దోషిగా తేల్చింది. అయితే తాను చేసిన తప్పులను అంగీకరించిన(మూడు నెలల కిందటే) సుఖ్బీర్ బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆపై కాలు ఫఫ్రాక్చర్ అయ్యి వీల్ చైర్‌కు పరిమితమైనా సరే.. అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి పార్టీ నేతలతో కలిసి ఇప్పుడు అకాల్ తఖ్త్ విధించిన శిక్షలను అనుభవించారు. అకాల్ తఖ్త్.. ఒరిజినల్ పేరు అకాల్ బుంగా. సిక్కులు పవిత్రంగా భావించే ఐదు తఖ్త్‌లలో ఇది ఒకటి. పంజాబ్ అమృత్సర్ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లో ఉంది. సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం. సిక్కు మతగురువు గురు హరగోవింద్ జూన్ 15, 1606లో దీనిని అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో నెలకొల్పారు. ఆ ప్రాంతంలోనే ఆయన బాల్యమంతా గడిచిందన్న వాదన ఒకటి ఉంది. 👉పిరి-మిరి అంటే.. ఆధ్యాత్మికంగానే కాకుండా సిక్కు సమాజానికి ఎదురయ్యే ఆందోళనల మీద చర్చ జరిపే ఉద్దేశంతో ఒక తాత్కాలిక అధికార వేదికను గురు హరగోవింద్ స్థాపించారు. పిరి-మిరికి ప్రతీకగా ఈ వేదికపై రెండు కత్తులను ఉంచారాయన. హర్గోవింద్తో పాటు బాబా బుద్ధా, భాయ్ గురుదాస్లు అకాల్ తఖ్త్ ఏర్పాటులో భాగమయ్యారు. 👉సిక్కుల అత్యున్నత విభాగంగా అకాల్ తఖ్త్కు పేరుంది. సర్బత్ ఖాల్సా యావత్ సిక్కు సంఘాలకు అత్యున్నత అధికారి కాగా.. జతేదార్(లీడర్)ను అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధిగా గుర్తిస్తారు. సిక్కులకు మతపరమైన అధికారానికి కేంద్రంగా ఉన్న అకాల్ తఖ్త్‌ను అభివర్ణిస్తారు. 👉 పంజాబ్‌తో పాటు పాట్నా, బీహార్, మహారాష్ట్రలలో ఇలాంటి అధికార కేంద్రాలే ఉన్నాయి. అకాల్ తఖ్త్ నుంచి జారీ అయ్యే హుకామ్నామా(ఆదేశాలను).. ప్రతీ సిక్కు పాటించడం తప్పనిసరి. 👉 అకాల్ తఖ్త్ అనేది.. ఆకాలంలో అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సిక్కులు చేసిన పోరాటానికి గుర్తు. అయితే ఈ సిక్కుల సార్వభౌమాధికార ప్రతీకపై దాడులు జరిగాయి. 18వ శతాబ్దంలో అహ్మద్ షా అబ్దాలీ దాడులతో మొదలై.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌లో అకాల్ తఖ్త్ దెబ్బ తింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తాత్కాలికంగా అకాల్ తఖ్త్ నిర్మాణం జరిగినప్పటికీ.. దానిని ప్రభుత్వ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసి.. పునఃనిర్మించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో.. దామ్‌దామి తక్సల్ 14వ జతేదార్ అయిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలేపై.. పంజాబ్‌లో అతివాద సంస్థను నడిపిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. 1983 జులైలో.. అకాలీదళ్ అధ్యక్షుడు హర్చరణ్ సింగ్ లాంగోవాల్, అప్పటి అకాల్ తఖ్త్ జతేదర్ల ఆహ్వానం మేరకు బింద్రాన్‌వాలే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. అక్కడ అరెస్ట్‌కు భయపడి అకాల్ తఖ్త్‌లో తలదాచుకున్నాడు. అయితే.. అతని జాడ కనిపెట్టిన అప్పటి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. భారత సైన్యానికి అనుమతి ఇచ్చింది. 1984 జూన్ 3 నుంచి జూన్ 5వ తేదీల మధ్యలో.. గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నడిచింది. ఈ ఆపరేషన్‌లో అకాల్ తఖ్త్ భారీగా డ్యామేజ్ అయ్యింది. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో భింద్రాన్వాలే చనిపోయాడు.ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత.. అకాల్ తఖ్త్‌ను తిరిగి నిర్మించేందుకు అప్పటి జతేదార్ బాబా సంతా సింగ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందుకు కేంద్రం నుంచి నిధుల సమీకరణ కూడా చేయాలనుకున్నాడు. అయితే.. అందుకు సిక్కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయినా కూడా సర్బత్ ఖాల్సా సహకారంతో జతేదార్ నెలన్నర వ్యవధిలోనే(1984, ఆగష్టు 11) అకాల్ తఖ్త్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే.. అదే సర్బత్ ఖాల్సా కూల్చేయాలని తీర్మానం చేసింది. జనవరి 1986లో కూల్చేసి.. బాబా సంతా సింగ్‌ను సిక్కు మర్యాదను దెబ్బ తీశాడనే కారణం చూపించి వెలివేసింది. 2001లో తిరిగి ఆయన్ని సిక్కు కమ్యూనిటీలో చేర్చుకుంది. అయితే.. సిక్కులకు న్యాయ పీఠంగా అకాల్ తఖ్త్ కొనసాగుతున్నప్పటికీ.. కాలక్రమంలోని పరిణామాలు(నిర్మాణాలపరంగా) మాత్రం ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. -
పాక్ పరువు తీసిన ‘మార్షల్ లా’కు అంత పవర్ ఉందా?
రాజకీయాలపై ఆసక్తి కలిగినవారికి ప్రపంచ రాజకీయ చిత్రం ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తుంది. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ ఉన్నట్టుండి ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలకలం చెలరేగింది. అయితే ఇంతలోనే అక్కడి పార్లమెంట్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో దానిని రద్దు చేయాల్సి వచ్చింది.చర్చనీయాంశంగా మారి..1980 తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్ లా(సైనిక పాలన) విధించడం ఇదే తొలిసారి. ఈ నేపధ్యంలో మరోసారి మార్షల్ లా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఈ మార్షల్ లా చట్టాన్ని తరచూ అమలు చేసి, అపఖ్యాతి పాలయ్యింది. ఇంతకీ మార్షల్ లా అంటే ఏమిటి? అ చట్టాన్ని అమలు చేసినప్పుడు దేశంలోని పరిస్థితులు ఎలా ఉంటాయి?శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు..నిజానికి మార్షల్ లా అంటే దేశ అధికారమంతా సైన్యం చేతుల్లోకి వెళ్లడం. దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు దీనిని అమలు చేస్తారు. ఇది దేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా దేశమంతటికీ వర్తించవచ్చు. ఇది అమలైనప్పుడు పౌర పరిపాలన ముగుస్తుంది. శాంతి భద్రతల నుండి న్యాయ వ్యవస్థ వరకు సర్వం సైన్యం నియంత్రణలోకి వస్తుంది. అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న సైన్యం అవసరమని భావించిన పక్షంలో ప్రధానిని ఉరితీసే దిశగా కూడా యోచించేందుకు ఈ చట్టంలో అవకాశాలున్నాయి. ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ పర్యవేక్షణలో..ప్రజలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మార్షల్ లా వర్తిస్తుంది. ఇది యుద్ధం, తిరుగుబాటు లేదా పెద్ద ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సంభవించవచ్చు. మార్షల్ లా అమలైనప్పుడు సైన్యం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది న్యాయపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. పాకిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్షల్ లా ప్రయోగించడం ఆనవాయితీగా మారింది.పాక్‌లో నాలుగు సార్లు మార్షల్ లా పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు సార్లు మార్షల్ లా విధించారు. 1958లో మొదటిసారిగా, దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పటినప్పుడు నాటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా మార్షల్ లా విధించారు. అనంతరం మిలటరీ జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తదనంతర కాలంలో దేశంలో సైనిక, రాజకీయ శక్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.అడుగంటిన సామాన్యుల స్వేచ్ఛ1977, జూలై 5 న జనరల్ జియా-ఉల్-హక్ పాకిస్తాన్లో మార్షల్ లా విధించి, అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టాడు. జియా దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, తనను తాను అత్యున్నత పాలకునిగా ప్రకటించుకున్నాడు. రాజకీయ అస్థిరతతో పాటు సామాన్యుల స్వేచ్ఛ కూడా అడుగంటిపోవడంతో నాడు పాకిస్తాన్ గడ్డు రోజులను ఎదుర్కొంది. 1999లో పాకిస్తాన్లో మరోమారు మార్షల్ లా విధించారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తొలగించి, జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈసారి కూడా రాజకీయ అస్థిరతను నెపంగా చూపారు. ఇతని పాలనలో సైనిక నియంతృత్వ పోకడ చాలా కాలం పాటు దేశంపై కొనసాగింది.జర్మన్, జపాన్లలో..మరికొన్ని దేశాలలోనూ మార్షల్ లా అమలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జర్మన్, జపాన్లలో సైన్యం పాలనను చేపట్టింది. ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో శ్రీలంకలో, యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో మార్షల్ లా విధించారు. అయితే పదే పదే మార్షల్ లా అమలు చేస్తూ పాకిస్తాన్ అపఖ్యాతి పాలైంది. ఈ చట్టం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతగా నిర్వీర్యం చేస్తుందో పదే పదే మార్షల్ లా విధించడం చూస్తే అర్థమవుతుంది. మార్షల్ లా అమలు చేసేముందు పర్యవసానంగా వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల దక్షిణ కొరియా నిర్ణయం ద్వారా స్పష్టమైంది.ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
వయనాడ్ బరిలో సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రియాంకా గాంధీ నేపథ్యం..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.సత్యన్ మొకేరి నేపథ్యం..సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్డీఎఫ్ భావిస్తోంది.:::సాక్షి వెబ్ డెస్క్ -
HYD: వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్
హైదరాబాద్ అంటే బిర్యానీ, బాహుబలి, బ్యాడ్మింటన్..!! గతంలో అప్పటి రాష్ట్రపతి నగరానికి విచ్చేసిన సందర్భంలో అన్న మాటలివి. అంటే నగరంలో అంతర్జాతీయ క్రీడలు అంతటి ప్రశస్తిని సాధించుకున్నాయి. బ్యాడ్మింటన్ మాత్రమే కాదు హాకీ, టెన్నిస్, క్రికెట్, చెస్, రన్నింగ్ ఈ మధ్య కాలంలో రెజ్లింగ్ వంటి విభిన్న క్రీడాంశాల్లో హైదరాబాద్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అనాదిగా కొనసాగుతున్న ఈ ఆనవాయితీని ప్రస్తుత తరం క్రీడాకారులు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గుర్తింపు పొందిన క్రీడల్లోనే కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందేందుకు వినూత్న క్రీడలు, అథ్లెటిక్స్ను ఎంచుకుని ఆయా విభాగాల్లో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరం దృష్టి సారించిన క్రీడలు, అందులోని ప్రత్యేకతలను ఓసారి తెలుసుకుందామా..!! అంతర్జాతీయ క్రీడలకు హైదరాబాద్ నగరానికి ఆనాటి నుంచే అవినాభావ సంబంధముంది. దేశ ఖ్యాతిని ప్రపంచదేశాల సరసన అగ్ర స్థానంలో నిలబెట్టిన హైదరాబాదీయులు, ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రికెట్లో అజహరుద్దిన్, వెంకటపతిరాజు, వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీరాజ్ ప్రస్తుతం మహ్మద్ సిరాజ్, టెన్నిస్‌లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధూ, సైనా నేహ్వాల్, రన్నింగ్‌లో పీటీ ఉష, చెస్‌లో ద్రోణవ్లలి హారిక, రెజ్లింగ్‌లో నిఖత్ జరీనా ఇలా ఒక్కొక్కరూ ఒక్కో క్రీడలో అత్యత్తమ నైపుణ్యాలను కనబర్చి ఆయా క్రీడాంశాల్లో భారత్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. అదే విధంగా వ్యక్తిగతంగానూ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను రాసుకుని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇదే తరహాలో ఈ తరం క్రీడాకారులు ఇప్పటికే గుర్తింపు పొందిన క్రీడలు కాకుండా వినూత్నంగా ఎంపిక చేసుకుని ఒలింపిక్స్ స్థాయిలో క్రీడా నైపుణ్యాలను కనబరుస్తున్నారు. సెయిలింగ్ టాప్.. స్కేటింగ్ రాక్.. ప్రస్తుత తరం.. హైదరాబాదీ క్రీడాకారులు ఆర్చరీ పై ప్రత్యేక దృష్టి సారించారు. నగరం వేదికగా ఈ వారసత్వ క్రీడపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా ఈ సారి జరిగిన ఒలింపిక్స్‌లో తెలుగు కుర్రాడు ధీరజ్ ఆర్చరీలో నాలుగో స్థానంలో నిలిచి భవిష్యత్ ఆర్చరీని శాసించేది మేమేనని హింట్ ఇచ్చాడు. నగరం వేదికగా 150 మంది ఆర్చరీ అథ్లెట్లు ఉన్నారని ఓ అంచనా. జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఆర్చరీ టీం ద్వితీయ స్థానంలో ఉందని క్రీడారంగ నిపుణులు పేర్కొన్నారు. 2028 ఒలింపిక్సే లక్ష్యంగా ఈ క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.రోయింగ్‌లోనూ రాణిస్తూ..ఇదే కోవలో రోయింగ్ కూడా రాణిస్తుంది. రోయింగ్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. అంతాగా ప్రచారంలోకి రాకపోయినప్పటికీ.. స్కేటింగ్‌లో కూడా హైదరాబాదీలు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తున్నారు. వీటితో పాటు రైఫిల్ షూటింగ్లో కూడా నగరవాసులు గురి పెట్టారు. ఇప్పటికే నేషనల్స్‌లో పతకాలు సాధించడమే కాకుండా గ్లోబల్ వేదికపై మరోసారి గురి చూసి షూట్ చేయడానికి సన్నద్ధమౌతున్నారు. మరో వైపు స్విమ్మింగ్‌లోనూ మనం ముందంజలో ఉన్నాం. గత ఐదేళ్లలో నగరానికి చెందిన స్విమ్మర్లు జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. అయితే వినూత్నంగా పికిల్ బాల్ వంటి సరికొత్త క్రీడలను నగరవాసులు తెరపైకి తీసుకొస్తున్నారు. సెయిలింగ్‌లోనూ..దీంతో పాటు సెయిలింగ్‌లోనూ హైదరాబాద్ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తుంది. ఈ ఏడాది నేషనల్స్‌లో హైదరాబాదీ సెయిలర్స్ గోవర్ధన్, దీక్షిత కొమురవెళ్లి వంటి సెయిలర్స్ టాప్–1లో కొనసాగుతుండటం విశేషం. అంతేకాకుండా ప్రతీ కొంగర వంటి నావికులు ఒలింపిక్సే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నారు.నూతనోత్సాహంతో గుర్తింపు.. క్రీడలో రాణించాలనే తపనకు నూతనోత్సాహాన్ని, అంతకు మించిన గుర్తింపును తెస్తున్నారు. ఇందులో భాగంగానే సెయిలింగ్‌లో ఎంతో శ్రమించి జాతీయ. అంతర్జాతీయ స్థాయిలో రాణించాను. వైఏఐ జూనియర్ నేషనల్స్ 2022 ఆప్టిమిస్టిక్ బాలికల విభాగంలో కాంస్యం, మాన్సూన్ రేగట్టా 2023 ఇదే విభాగంలో బంగారు పతకంతో వివిధ జాతీయ స్థాయి పోటీల్లో పతకాలను సాధించాను. పీవీ సింధూ, సానిమా మీర్జాలాగే నేను అంతర్జాతీయ స్థాయి పతకాలను సాధించి దేశానికి, నగరానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నాను. :::దీక్షిత కొమురవెళ్లినా విద్యార్థులే నిదర్శనం.. రానున్న కాలంలో ఆర్చరీలో హైదరాబాద్ క్రీడాకారులు టాప్‌లో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం నా విద్యార్థులే.. నా వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్ 2లో ఉన్నారు. 2028 ఒలింపిక్సే లక్ష్యంగా ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను సన్నద్ధం చేస్తున్నాను. :::రాజు, ప్రముఖ కోచ్, ఆర్చరీ నేషనల్ చాంపియన్:::సాక్షి, సిటీబ్యూరో -
సీజేఐగా తండ్రి తీర్పులనే తిప్పికొట్టి.. డీవై చంద్రచూడ్ వెల్లడించిన టాప్ 10 తీర్పులివే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధనుంజయ యశ్వంత్(డీవై) చంద్రచూడ్‌కు శుక్రవారం లాస్ట్ వర్కింగ్ డే. ఆదివారం( నవంబర్ 10) ఆయన సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. వృత్తిపరంగా తాను చాలా సంతృప్తి చెందానని, తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని కోరారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో కేసుల పరిష్కారాల్లో డీవై చంద్రచూడ్ తనదైన ముద్ర వేశారు. అనేక మైలురాయి తీర్పులు వెల్లడించారు. అంతేగాక చంద్రచూడ్..భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ తనయుడు కూడా. తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు.. చీఫ్ జస్టిస్‌గా తండ్రి ఇచ్చిన తీర్పులనే తిరగరాశారు డీవై చంద్రచూడ్. వైవీ చంద్రచూడ్ 2017-18లో తీసుకున్న అడల్టరీ చట్టం, శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసుల్లో తీసుకున్న నిర్ణయాలను కుమారుడు డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు. 👉1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తన తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. ‘వ్యభిచార చట్టం అనేది పితృస్వామ్య నియమం. లైంగిక స్వయంప్రతిపత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. 👉 1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసులో, గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని పేర్కొన్నది. ఈ బెంచ్‌లో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఉన్నారు. కాగా, 2017 లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ బెంచ్‌లో డీవై చంద్రచూడ్ ఉన్నారు. ‘ఏడీఎం జబల్పూర్ కేసులో మెజారిటీ నిర్ణయంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని అంగీకరించడం ద్వారా భారతదేశ ప్రజలు తమ జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వానికి అప్పగించలేదు’ అని డీవై చంద్రచూడ్ తన నిర్ణయాన్ని రాశారు. కాగా 2022 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రచూడ్.. ఆయన పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులు వెల్లడించారు. ఆర్టికల్ 370, స్వలింగ సంపర్కుల వివాహం, రామ మందిరం, డ్రైవింగ్ లైసెన్స్, బుల్డోజర్ చర్య, ఉమర్ ఖలీద్, స్టాన్ స్వామి, జీఎన్ సాయిబాబా బెయిల్‌కు సంబంధించి తన తీర్పును ఇచ్చారు. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కేసు, కేరళకు చెందిన హదియా కేసు, అవివాహితల అబార్షన్ హక్కు కేసుల్లో.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో పరిణతి చెందిన తీర్పులను వెలువరించారు. వాటిని ఓసారి పరిశీలిస్తే.. ఎలక్టోరల్ బాండ్స్ కేసురాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2018 నుంచి అమలులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్షమని వాదించింది. రాజకీయ పార్టీలు, దాతల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, సంజీవ్ ఖన్నా, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను ప్రచురించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ప్రైవేట్ ఆస్తి వివాదం..ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కావని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయలేవని స్పష్టం చేసింది. అయితే, కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజారిటీతో వెలువడిన తీర్పులో పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పును వెలువరించింది.ఆర్టికల్ 3702023 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది.జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.స్వలింగ వివాహం2023 అక్టోబర్‌లో స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది, స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపింది స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని సీజేఐ పేర్కొన్నారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని, ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.సెక్షన్ 6Aగత నెల అక్టోబర్‌లో అస్సాం వలసలకు సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించించింది. భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6(ఎ)కు రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. 1996-71 మధ్య అస్సాంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) శరణార్థులను భారత పౌరసత్వం పొందేందుకు 1985లో తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ రాజ్యాంగ బద్దమేనని 4:1 తీర్పులో వెల్లడించింది. ఇది కేవలం అస్సాం రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా చేసిన ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వ భావనకు వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తిరస్కరించింది.జైళ్లలో కుల ఆధారిత వివక్షకుల ఆధారంగా జైల్లోని ఖైదీలపై వివక్ష చూపడడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.యూపీ మదరసా చట్టంఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ మదర్సా- 2004 ఎడ్యుకేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, బోర్డు లౌకిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందంటూ దానిని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఈ చట్టం లౌకిక వాద సూత్రాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు తప్పుగా అభిప్రాయపడిందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.నీట్ వివాదందేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీకైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పాట్నా, హజారీబాగ్‌లలో మాత్రమే పేపర్ లీక్ అయిందని పేర్కొన్నది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే, గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్ట సభల్లో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు.బాల్య వివాహంబాల్య వివాహాల నిషేద చట్టం-2006ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్యవివాహాల నిరోధం, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టిసారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది.తన పదవీకాలం చివరి రోజు సైతం. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాపై కీలక తీర్పును వెలువరించింది. దీనిని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బెంచ్ నిర్ణయించింది. అయితే, దీనికి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు 4:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. -
ట్రంప్‌కే పట్టం: ఎదురుదెబ్బలను తట్టుకుని పైకిలేచి రెండోసారి వైట్‌హౌజ్‌కు..
కొందరు ఆయన్ను ప్రేమిస్తారు.. మరికొందరు ఆయన్ను ద్వేషిస్తారు.. కానీ ఆయన్ను విస్మరించడం మాత్రం ఎవరి వల్లా కాదు.. ఆయనే డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు అభిశంసనకు గురైన మిస్టర్ ట్రంప్..రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ గతంలో ట్విట్టర్ ఆయన్ను వెలివేసింది.. 2020 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆయన పడిన పాట్లు అన్నీఇన్నీ కావు.. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. తలదించలేదు.. వెన్నుచూపని వీరుడిలా మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఎదురుగా బలమైన ప్రత్యర్థి కమల హారీస్ ఉన్నా ఏ మాత్రం బెదరలేదు... వణకలేదు..! డొంక తిరుగుడు మాటలు ఏ మాత్రం తెలియని ట్రంప్.. తన ముక్కుసూటితనంతోనే ఓటర్ల మనసును గెలిచి 47వ ప్రెసిడెంట్‌గా 2025 జనవరి 20న రెండోసారి ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. పడి చోటే లేచిన ట్రంప్ తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. రెండోసారి వైట్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిలియనీర్ ట్రంప్నేపథ్యం..డోనాల్డ్ ట్రంప్ జూన్ 14, 1946న న్యూయార్క్‌లోని ఓ సంపన్న కుటుంబంలో పుట్టారు.ట్రంప్ తండ్రి ఫ్రెడ్ విజయవంతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి. న్యూయార్క్‌తో పాటు అమెరికాలోని వివిధ నగరాల్లో ట్రంప్ కుటుంబానికి చాలా అపార్ట్మెంట్లు, ఆస్తులు ఉన్నా...ట్రంప్ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఆయన కుటుంబానికి ఉన్న డబ్బే ట్రంప్‌కు స్కూల్లో శాపంగా మారింది. ట్రంప్‌ను చాలా మంది వేరుగా చూసేవారు. అందరిలో ఒకడిలా ట్రంప్‌ని ఉండనివ్వలేదు. ఇదే ఆయన్ను స్కూల్లో క్రమశిక్షణ తప్పేలా చేసింది. పదేపదే స్కూల్ టీచర్ల నుంచి కంప్లైంట్ వస్తుండడంతో ట్రంప్‌ను మిలటరీ స్కూల్‌కు పంపారు తల్లిదండ్రులు. అక్కడే ట్రంప్‌కు డిసిప్లెన్ అలవాటైంది. అయితే అదే స్కూల్ ఆయన్ను తల్లిదండ్రుల నుంచి దూరంగా పెరిగేలా చేసింది. అటు తండ్రి ఫ్రెడ్ కూడా చాలా స్ట్రిక్ట్. దీంతో ట్రంప్ బాల్యం ఆంక్షలు మధ్య ఏ మాత్రం స్వేచ్ఛ లేనట్టే గడిచింది.వ్యాపారవేత్తగా..చదువులు పూర్తి చేసిన తర్వాత ట్రంప్ తన తండ్రి లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లారు. తండ్రిలా కాకుండా వ్యాపారంలో రిస్క్ చేయాలన్నది ట్రంప్ ఆలోచన. బోల్డ్‌గా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లిన ట్రంప్ చాలాసార్లు వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నారు. 1980లలో విలాసవంతమైన భవనాలు, హోటళ్ళు, కాసినోలలో భారీగా పెట్టుబడి పెట్టారు. అయితే 1990ల ప్రారంభంలో అమెరికాను చుట్టేసిన మాంద్యం ట్రంప్ కు నష్టాలను తెచ్చిపెట్టింది. భారీ అప్పులు ఆయన నెత్తిమీద వచ్చి పడ్డాయి. కొన్నాళ్లపాటు దివాలా అంచు వరకు ఉన్న ట్రంప్ 2000వ సంవత్సరం తర్వాత కోలుకున్నారు. నాడు రియాలిటీ టీవీ షోలలో కనిపించి మెరిశారు. ది అప్రెంటిస్ అనే బిజినెస్ పోటీ షోతో ప్రజలకు దగ్గరయ్యారు . ఈ ప్రొగ్రామ్‌లో 'యు ఆర్ ఫైర్' అని ట్రంప్ చెప్పే డైలాగ్ నాడు అమెరికాలో మారుమోగింది. ఇలా తనకంటూ ఓ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ట్రంప్ మరోసారి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. రాజకీయాల్లోనూ..ఇలా 2015 వరకు వివిధ వ్యాపారాల్లో బిజీగా ఉన్న ట్రంప్ అదే సంవత్సరం నుండి ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ట్రంప్ చెప్పినప్పుడు అంతా నవ్వారు. పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నాడని ఎగతాళి చేసినవారు కూడా ఉన్నారు. అయితే ట్రంప్ ఎవరి మాటలు పట్టించుకోలేదు.. చేయాల్సింది చేశారు.. నామినేషన్ వేయడమే కాదు.. 2016ఎన్నికల్లో గెలిచి అమెరికా 45వ అధ్యక్షుడిగా వైట్ హౌస్ మెట్లెక్కారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారే కానీ ఎన్నో సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఎన్నో వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. వివిధ అంశాల్లో ఆయన విధానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విధానాలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లిం వ్యతిరేకి అంటూ దుయ్యబట్టాయి. అంతేకాదు అనేకసార్లు నల్లజాతీయులకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.ఆయన హయంలోనే ప్రపంచాన్ని కుదిపేసిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగింది.ట్రంప్ పాలనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అటు NATO మిత్రదేశాలతోనూ అమెరికా సంబంధాలు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే దెబ్బతిన్నాయి. ఓటమి తర్వాత..2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఆ తర్వాత మరిన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడి చేయడం, అక్కడి పరిసరాలకు నిప్పు పెట్టడం అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. నాడు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ తన సపోర్టర్స్‌ను ప్రసంగాలతో రెచ్చగొట్టడం కారణంగానే వారంతా విధ్వంసానికి దిగారని నాటి సైనికాధికారులే ప్రకటించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ నుంచి ట్రంప్ అభిశసంనలకు గురవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని అంతా భావించారు. అయితే అందరి ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆయన ట్రంప్ ఎందుకవుతారు.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు రెడీ అయ్యారు. పడిలేచిన కెరటంలా..భారీ సంపద, హోదా ఉన్నప్పటికీ ఆయన ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు, కిందపడి మళ్లీ లేచి గెలిచిన నైజం ఆయనలోని పోరాటయోధుడిని కళ్లకు కడుతోంది. ఎన్నో కష్టమైన ఆర్థిక, రాజకీయ క్షణాలను ఒంటరిగానే ఎదుర్కొన్న ట్రంప్ వ్యక్తిగతంగానూ ఎన్నో బాధలు పడ్డారు. ట్రంప్‌ని ఎన్నో అంశాల్లో తిట్టేవారు ఉండొచ్చు కానీ ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేని విషయం ఒకటుంది. ఆయన మందు తాగరు.. అల్కహాల్‌కు చాలా దూరంగా ఉంటారు. 1981లో తన సోదరుడు అల్కహాల్ అలవాటు కారణంగానే అనారోగ్యంతో చనిపోయాడు. ఇది ట్రంప్‌ను ఎంతగానో కుంగదీసింది. అందుకే మద్యాన్ని పుచ్చుకోని ట్రంప్ తన తోటివారికి కూడా మందు తాగవద్దని చెబుతుంటారు. అటు ట్రంప్ వైవాహిక జీవితం కూడా ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది. 1990లో మొదటి భార్య ఇవానాతో విడాకులు ట్రంప్‌ను మానసికంగా కుమిలిపోయేలా చేసింది. అటు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇలా వ్యక్తిగతంగా, రాజకీయపరంగా ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా గెలవడాన్ని ఒక ఏడాది ముందు వరకు ఎవరు ఊహించి ఉండరు కూడా. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు కూడా తమతో తామే మూసివేసిన తలుపుల లోపల సొంత యుద్ధాలను ఎదుర్కొంటారని చెప్పేందుకే ట్రంప్ జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం.. మరి అగ్రరాజ్యపు అధ్యక్షునిగా మున్ముందు ప్రపంచానికి ఎటువంటి దక్షత ప్రదర్శిస్తాడో ఈ మొక్కవోని వ్యాపారి ట్రంప్. తన టెంపరితనంతో ప్రత్యర్ధులకు టెంపరేచర్ పెంచి ఎదురులేని విక్టరీ సాధించిన ట్రంప్ వచ్చే నాలుగేళ్లు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి:::నాగ త్రినాథ్ బండారు , సాక్షి డిజిటల్ -
Who is Nasrallah: ఇజ్రాయెల్ మోస్ట్‌వాంటెడ్ ఇతనే!
పశ్చిమాసియాలో ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాలస్తీనా అనుకూల.. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(IDF) భీకర దాడులు కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను లక్ష్య్ంగా చేసుకుని బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంలో బాంబులు కుమ్మరించింది. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని హెజ్బొల్లా ప్రకటించుకున్నప్పటికీ.. ఆయన కుమార్తె జైనబ్ మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ నజ్రల్లా ఎవరు?. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నది పరిశీలిస్తే..పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో) నిర్మూలనే లక్ష్యంగా 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని బీరుట్ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టి విజయం సాధించింది. అయితే, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నంచిన పీఎల్ఓలోని కొందరు 1982 జూన్‌లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షైన్ బెట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 91 మంది ఇజ్రాయెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తామే కారణమని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి హెజ్బొల్లాగా ఏర్పాటయ్యారు. ఈ సంస్థ ఏర్పాటులో ముసావితో కలిసి నస్రల్లా కీలక పాత్ర పోషించాడు.1992లో అప్పటి హెజ్బొల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావి హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను తన మార్గదర్శి స్థానం నుంచి నస్రల్లా అందుకున్నాడు. అప్పటికి అతడి వయసు 32 ఏళ్లే. అతడి నాయకత్వంలో హెజ్బొల్లా ఇంతలా బలపడి ఉంటుందని బహుశా అప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ఊహించకపోవచ్చు.పశ్చిమాసియాలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చాడు. హెజ్బొల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించగలిగాడు. 2011లో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు ఈ సంస్థ సాయం చేసింది.దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌తో హెజ్బొల్లా చేసిన భీకర పోరాటం తర్వాత నస్రల్లా పేరను అరబ్ దేశాల్లో మార్మోగింది. 2006లో లెబనాన్‌లో 34 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఓడించడంలో అతడు కీలక ప్రాత పోషించాడు. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారాడు.నస్రల్లా కేవలం హెజ్బొల్లా చీఫ్‌గా మాత్రమే గుర్తింపు లేదు. బీరుట్ శివారులోని బుర్జ్ హమ్ముద్ ప్రాంతంలో 1960లో నస్రల్లా జన్మించాడు. అతని తండ్రి ఓ చిరు కూరగాయల వ్యాపారి. షియా కుటుంబంలో తొమ్మిది మంది తోబుట్టువుల్లో ఒకడైన నస్రల్లా.. చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు. 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్, పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు. అప్పటి హెజ్బొల్లా సారథి అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడడంతో ఆయన జీవితమే మలుపు తిరిగింది. నస్రల్లా భార్య ఫాతిమా యాసిన్. నలుగురు పిల్లలు. 1997లో ఇజ్రాయెల్ యుద్ధంలో తన పెద్ద కొడుకు హదీని కోల్పోయాడాయన. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని దాహియా ప్రాంతంలోని హెజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో నస్రల్లా కూతురు కుమార్తె జైనబ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నా.. ఆమె మృతిని హెజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. హెజ్బొల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జైనబ్ మృతి నిజమైతే గనుక.. ప్రతీకారంగా హెజ్బొల్లా దాడులను తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది కూడా. ఇంతకీ నస్రల్లా ఎక్కడ?నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. తాజా దాడుల్లో నస్రల్లా మరణించాడా? లేదా సురక్షితంగానే ఉన్నాడా? అన్నదానిపై స్పష్టత లేదు. తాము జరిపిన దాడుల్లో అతడు బతికే అవకాశాలు లేవని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు, హెజ్బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతో ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియరాలేదు. కానీ, కమ్యూనికేషన్ కట్ అయ్యినట్లు సమాచారం. మరోవైపు, హెజ్బొల్లా స్థావరాలపైకి యాంటీషిప్ క్షిపణులతో ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరుట్ సహా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో సైరెన్ల మోత మోగుతోంది. -
వయనాడ్ విషాదం: ఈ తరహా విపత్తుల్ని ముందుగా గుర్తించలేమా? మానవ తప్పిదాలతోనే..
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముందక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. సోమవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనతో అసులు కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటికి గల కారణాలేంటీ? ఏంటీ అనే దానిపై అందరూ చర్చిస్తున్నారు.. సహజంగా సంభవించే ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు విరిగిపడటం ఒకటి. వానకాలంలో భారీ వర్షాల కారణంగా కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు కిందకు పడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటాం. మన దేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడటానికి సహజమైన కారణాలు కంటే మానవ చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాల సమయంలో ఏటవాలు(స్లోప్) సరిగా ప్లాన్ చేయకపోవటం, వృక్ష సంపదను భారీగా తొలగించటం, కొండపై పడి కిందకు జాలువారే నీరు వెళ్లే వ్యవస్థలో ఆటంకాలు.. కారణాల వల్ల కొండచరియలు విరిగిపడుతుంటాయి.సరైన గ్రేడింగ్ లేకుండా వాలు నిర్మాణం: ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్డు, భవన నిర్మాణాల్లో ఏటవాలుకు సరైన గ్రేడింగ్ లేకుండా నిర్మించినప్పుడు అవి పటిష్టంగా ఉండవు. దీంతో కొండప్రాంతాల్లో సమానంగా లేని భూమి ఉపరితలం అధికం అవుతుంది. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడతాయి. నీళ్లు వెళ్లే మార్గాల్లో..: సహజంగా కొండల మీద వాన పడినప్పుడు.. ఆ నీరు పల్లానికి వెళ్తుంది. అందుకోసం సహజంగా మార్గాలు ఏర్పడతాయి. అయితే ఆ వ్యవస్థల దిశ మార్చడం, అందులో ఏమైనా మార్పులు చేయడంతో ఆ నీరు కిందకు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా.. ఆ వాననీరుతో ల మట్టి, రాళ్లు బలహీనపడి కొండచరియలు హఠాత్తుగా విరిగిపడతాయి.పాత కొండచరియల్లో తవ్వకాలు: పాత కొండచరిచయలు ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు, భారీ నిర్మాణాలు చేపట్టం వల్ల కూడా వర్షాకాలంలో అవి విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక.. వీటితో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, అధిక వర్షపాతం, కొండ ప్రాంతాల్లో అడవుల నరికివేత, కొండ దిగువ ప్రాంతాల్లో గనులు, క్వారీల తవ్వకాలు వంటివి చేయటం కారణంగా తరచూ కొండచరియలు విరగిపడతాయి. మానవులు చేసే ఈ చర్యలు వల్ల కొండ పైభాగాల్లో ఉండే రాళ్లు, మట్టిలో పటుత్వం తగ్గడంతో అకస్మాత్తుగా ఈ ఘటనలు జరుగుతాయి. భూకంపాల వల్ల కూడా తరచుగా కొండచరియలు విరిగి పడుతుంటాయి.తేడాలు ఇవే..ఎక్కువగా మట్టి, ఇసుక, బండరాళ్ల మిశ్రమాలతో వదులుగా ఉంటుంది. ఫలితంగా వర్షం నీరు వదులుగా ఉండే భాగాల్లోకి సులభంగా చొచ్చుకొనిపోతుంది. అడుగున ఉండే మట్టి నీటితో తడుస్తుంది. తద్వారా కొండవాలు వెంబడి రాళ్లు దిగువ వైపు సులువుగా జారిపోతాయి. ఉత్తర భారత భూభాగం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక.. భూభాగం శిలలతో కూడి ఉంటే ఇలాంటి ముప్పు తక్కువగా జరగొచ్చు. ఉదాహరణకు.. తెలంగాణ ప్రాంతాల్లో ఉండే గ్రానైట్ లాంటి శిలల్లో సిలికా ధాతువు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శిలల్లో కాఠిన్యత పెరిగి గట్టిగా ఉంటాయి. పగుళ్లు సులువుగా ఏర్పడవు. అయితే..ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఖోండలైట్ లాంటి శిలల్లో అల్యూమినియం ధాతువు ఎక్కువుగా ఉండటం వల్ల శిలల్లో కాఠిన్యత తగ్గి గట్టిగా ఉండవు. పగుళ్లు సులభంగా ఏర్పడతాయి. రసానిక చర్యలతో క్రమేణా మట్టిలా మార్పు చెందుతాయి. ఈ మట్టి శిలల పగుళ్ల మధ్య కూడా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు మట్టి తడిసి శిలలు కొండవాలు వెంబడి దిగువ భాగానికి జారడానికి దోహదపడుతుంది.ముందస్తు సూచనలుకొండచరియలు విరిగి పడటం వంటి విపత్తులు సంభవించే ముందుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేల, గోడల్లో పగుళ్లు రావడం. స్తంభాలు, వృక్షాలు పక్కకు వంగిపోవటం, కొండల నుంచి మట్టి రాలటం వంటివి చోటు చేసుకుంటాయి. ఇలా చేస్తే..ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండే కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కొండల నుంచి మట్టి, రాళ్లు రోడ్ల మీద పడకుండా గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్ ద్వారా రక్షణ కల్పించాలి. పగుళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలకు సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.కొండ ఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలి. -
మీకు తెలుసా? ఈ దేశాల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెటే ముద్దు
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం కూడా. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్ బ్యాలెట్, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చూద్దాం. 👉ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ పద్దతినే అవలంభిస్తున్నాయి. 👉పిలిఫ్పైన్స్, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్, ఇటలీ, కజకస్థాన్, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.👉భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.👉జర్మనీ, నెదర్లాండ్స్, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉2006లో నెదర్లాండ్స్ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్ చేశాయి. బ్యాలెట్ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 👉సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.👉అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్ లేదంటే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.👉2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.👉ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్ డిజిట్‌లోపు మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 👉భూటాన్, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 👉ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్ బ్యాలెట్ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు. -
సలార్ కాటేరమ్మ కథ తెలుసా?
ఒక బల్లెంతో వెనుకనుంచి వచ్చే శత్రువుల్ని పొడిచి.. ముందున్న వాళ్లను కత్తులతో చీల్చేసి.. ఇంతలో ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అని డైలాగ్పడగానే.. అపరకాళిలా అవతారం కటౌట్లో ప్రభాస్ అబ్బో రోమాంఛితమైన ఆ సలార్ సీన్.. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. విజిల్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇంతకీ ఈ కాటేరమ్మ కథ గురించి తెలుసా? ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరీ దేవత. నమ్ముకున్నవాళ్లకు అండగా ఉంటూ.. దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ. దక్షిణ భారత దేశంలో.. మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా, కర్ణాటకలో కాటేరమ్మగా Kateramma ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటోంది. పార్వతిదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను.. కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు. కొన్నిచోట్ల ఊరికి కాపలా దేవతగా.. మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు. జానపద కథ ప్రచారం.. కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతి దేవి రోజూ రాత్రిళ్లు ఎటో వెళ్లిపోతుంటుంది. సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుతుంది. ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు. తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతి బాధపడుతుంది. ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు. హఠాత్తుగా కాళి రూపంలోకి మారిపోయి.. శవాలను తవ్వి బయటకు తీసి తినే యత్నం చేస్తుందామె. ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. ఆమె అందులో పడిపోయి.. తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది. ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడబోనని శివుడికి మాటిస్తుంది. భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి, విధేయురాలైన భార్య.. పార్వతిదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది. అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే.. కాటేరీ దేవతగా చెబుతుంటారు. తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా, సర్వరోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటోంది కాటేరమ్మ. ఈ దేవతకు జాతరలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. దళిత కమ్యూనిటీలో మరోలా.. అయితే తమిళనాడు, కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి. శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుంటుందని.. ఈ కారణం చేతనే ఆమె ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలి దేవతగా కొలుస్తుంటారు. కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని భక్తులు పేర్కొంటారు. నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. జంతు బలిలో కోళ్లను, మేకల్నే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు. కుల దేవతగానూ కాటేరమ్మ దక్షిణ భారతంలో పూజలు అందుకుంటోంది. మద్రాసీ సంస్కృతిలో మద్యం, సిగరెట్లు సైతం సమర్పిస్తుంటారు. మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తారు. ఇదీ చదవండి: సలార్ మూవీ రివ్యూ శక్తివంతమైన దేవతగా.. కాటేరమ్మ.. అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. ఉగ్ర రూపంలోనే కాదు.. శాంత స్వరూపిణిగానూ పూజలు అందుకుంటోంది. నీలి రంగు లేదంటే నలుపు రంగు విగ్రహాల్ని.. ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా.. ఒక్కో చేతిలో కత్తి, త్రిశూలం, తామర, గిన్నెతో రూపొందిస్తారు. మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్రరూపంలో ఏర్పాటు చేస్తారు. దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు.. శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు. ట్రినిడాడ్, గుయానా, జమైకా, మారిషస్, సౌతాఫ్రికాలో స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలు అందుకుంటోంది. కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా.. రక్త కాటేరమ్మగానూ కాటేరీ దేవి ఆరాధ్య దైవం. రోగాలు మాయం చేయడంతో పాటు దుష్టశక్తుల్ని వదిలిస్తుందని నమ్ముతారు. అలా కన్నడనాట శక్తివంతమైన దేవతగా పేరున్న కాటేరమ్మ రిఫరెన్స్‌ను ఇలా ప్రభాస్ ఫైట్ సీన్‌తో Salaar Kateramma Scene ప్రేక్షకులకు రుచిచూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ -
186 ఏళ్ల తర్వాత.. కొత్త చరిత్రకు శ్రీకారం
ఢిల్లీ: భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్–ఐపీసీ), 1860, నేర విచారణ ప్రక్రియా స్మృతి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్–సీఆర్పీసీ), 1898, భారత సాక్ష్య చట్టం (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్), 1872 ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రక్రియ పార్లమెంటులో ప్రారంభమైంది. స్వతంత్ర భారతంలో ఇది విప్లవాత్మక చర్యగా భావిస్తున్నారు. ఈ నెల 11న ఈ మూడు చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు (బీఎన్ ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు (బీఎన్ ఎసెస్), భారతీయ సాక్ష్య బిల్లు (బీఎస్)లను కేంద్ర హోం మంత్రి అమిత్ ప్రవేశపెట్టారు. కీలకమైన ఈ 3 మూడు బిల్లులను సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి, వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు సూచించడానికి పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లులను తర్వాత నివేదించారు. ► కాలం చెల్లిన చట్టాలను రద్దుచేయడం లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం, మార్పులు అవసరమైన చట్టాలను సవరించడం, మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సాధారణం. అయితే, ఈ మూడు చట్టాలూ న్యాయవ్యవస్థ విచారణ ప్రక్రియకు సంబంధించినవి కావడంతో కొత్త బిల్లులపై ఆసక్తి పెరుగుతోంది. బ్రిటిష్ వారి పాలనాకాలంలో రూపొందించి, అమల్లోకి తెచ్చిన పై మూడు చట్టాలకూ తర్వాత, స్వతంత్ర భారతంలో అవసరమైన సవరణలు చేశారు. అయినా.. ► మారిన పరిస్థితులు, అభిప్రాయాల కారణంగా 21వ శతాబ్దంలో భారత పార్లమెంటు ఈ మూడింటి స్థానంలో కొత్త బిల్లులు రూపొందించి, వాటికి చట్ట రూపం కల్పించే ప్రక్రియను 17వ లోక్ సభ చివరి సంవత్సరంలో ప్రారంభించడం మంచి పరిణామమని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా వీటిలో అత్యంత కీలకమైన భారత శిక్షా స్మృతి (ఐపీసీ) ఎలా అమలులోకి వచ్చింది ఓసారి గుర్తుచేసుకుందాం. ఇంగ్లిష్ వారి హయాంలో 1862 నుంచి అమలులోకి వచ్చిన ఐపీసీ తొలుత ఈస్టిండియా కంపెనీ పాలనలో ఇండియాలోని మూడు ప్రధాన ప్రాంతాలను (కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలు) కేంద్రీకృత పాలనా వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. కంపెనీ అధీనంలోని అన్ని భూభాగాల ప్రజల కోసం శాసనాలు చేయడానికి సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ ఏర్పాటయింది. కొత్తగా చేసే చట్టాల రూపకల్పనకు కౌన్సిల్ లో న్యాయవిభాగం సభ్యుడు థామస్ బీ మెకాలే అధ్యక్షతన రెండేళ్ల తర్వాత లా కమిషన్ ఏర్పాటు చేశారు. తమ మాతృదేశం బ్రిటన్‌లో అమలులో ఉన్న సాధారణ ఇంగ్లిష్ చట్టాల ఆధారంగా ఇండియాలో అమలు చేసే చట్టాలు ఉండాలనేది వారి అప్రకటిత లక్ష్యం. మొదట సమగ్రమైన పీనల్ కోడ్ (శిక్షా స్మృతి) ను రూపొందించే బాధ్యతను లా కమిషన్ కు అప్పగించారు. ► మెకాలే బృందం హడావుడిగా ఒక ముసాయిదా స్మృతిని నాటి గవర్నర్ జనరల్ కు 1837లో సమర్పించింది. కొన్నేళ్లు అధ్యయనం చేశాక మెకాలే వారసులు డ్రింక్ వాటర్ బెతూన్, బార్నెస్ పీకాక్ దాన్ని సంపూర్ణంగా సవరించారు. సవరించిన ముసాయిదాను 1856లో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించారు. 1857లో తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయి తిరుగుబాటు) కారణంగా ఈ ముసాయిదాను చట్టంగా చేసే పని నిలిచిపోయింది. ఈ బెంబేలెత్తిన బ్రిటిష్ సర్కారు భవిష్యత్తులో ఇలాంటి ‘తిరుగుబాటుదారుల’ను అణచివేసే అధికారాన్ని దఖలు పరచుకుంటూ ఈ ముసాయిదాను మరోసారి సవరించింది. భారీ మార్పులతో రూపొందించిన ముసాయిదాను కేంద్ర చట్టసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించగా 1860లో దీన్ని ఆమోదించించారు. ► ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) పేరుతో 1862లో ఇది అమలులోకి వచ్చింది. వెంటనే నాటి న్యాయస్థానాల భాష అయిన ఉర్దూలోకి దీన్ని అనువాదం చేయించారు. ఉర్దూ తర్జుమా ప్రతికి ‘తాజీరాతే హింద్’ అని పేరుపెట్టారు. మొదట ఈ ఐపీసీలో 23 చాప్టర్ల కింద 511 సెక్షన్లు ఉన్నాయి. 11 ఐపీసీ సవరణ చట్టాల పేరుతో దానిలో మార్పులు చేశారు. చాప్టర్ల సంఖ్య 25కు పెంచారు. స్వతంత్ర భారతంలో 1959 నుంచి ఐపీసీని 12 పర్యాయాలు సవరించారు. 1860 నుంచి దానికి అదనంగా 61 సెక్షన్లు జోడించారు. అలాగే, అనవసరమని భావించిన 21 సెక్షన్లను తొలగించారు. ప్రస్తుతం ఐపీసీలో 555 సెక్షన్లు ఉన్నాయి. కోడ్ అనే మాటకు సంస్కృతంలో స్మృతి అంటారు. దాన్నే ఇప్పుడు హిందీలో సంహిత అనే పేరుతో కొత్త శాసనం రూపొందిస్తున్నారు. అయితే.. బ్రిటిష్ వారి జమానాలో ఐపీసీని భారతీయ దండ్ సంహిత అని హిందీలోకి అనువదించినప్పటికీ అప్పట్లో అది ప్రాచుర్యంలోకి రాలేదు. ::: విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు -
డిజిటల్ ప్రపంచానికి కష్టకాలం తప్పదా?
పొద్దున లేనిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా.. మధ్యలో మనం చేసే దాదాపు ప్రతీ పనికి-స్మార్ట్ ఫోన్‌తో ముడిపడిపోయింది. ఎందుకంటే.. మనమంతా డిజిటల్ వరల్డ్‌లో దర్జాగా బతుకుతున్నాం. ఇంటర్నెట్ లేకుంటే ఏ పనులూ జరగవు!. అలాంటిది ఇంటర్నెట్లేని రేపటిని ఊహించుకోగలమా?.. అమ్మో కలలో కూడా కష్టం అంటారా?.. అయితే ఇది చదివేయండి! ఇంటర్నెట్ అపోకలిప్స్ internet apocalypse.. ఇప్పుడు వార్తల్లో చక్కర్లు కొడుతూ ప్రజల్ని భయపెడుతున్న పదం. దీనర్థం ఇంటర్నెట్కి గడ్డుకాలం వచ్చిందని అప్రమత్తం చేయడమే!. 2025 నాటికల్లా సోలార్ మాగ్జిమమ్(ఉగ్రరూపానికి అన్నట్లు)కి సూర్యుడు చేరుకుంటాడని.. అప్పుడు ఏర్పడే సౌర తుపాన్ల ధాటికి ఇంటర్నెట్కు విఘాతం కలగవచ్చని తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకవేళ సౌర తుపాను గనుక భూమిని తాకితే!.. ఈ చర్చ ఇప్పటిది కాదు.. గత కొంతకాలంగా నడుస్తూ వస్తోంది. సౌర తుపాను భూమిని గనుక తాకితే గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోతుంది. అంటే ఇంటర్నెట్ సహా అన్నీ సంధాన వ్యవస్థలు ఆగిపోవచ్చన్నమాట. ఆశ్చర్యకరంగా.. ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరిస్తున్నారు. Internet Apocalypse 2025 ఎందుకీ అంతరాయం సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. సమాచార వ్యవస్థకు సంబంధించిన ప్రతీదానిని దెబ్బ తీస్తుంది. 2025 ఇంటర్నెట్ Internet Apocalypse 2025 సంక్షోభాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ధృవీకరించలేదు. కానీ, చర్చ జోరుగా నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా మీమ్స్ కనిపిస్తున్నాయి. మరి ఆధారం ఏమిటి?.. ఎందుకంటే స్పేస్‌సైన్స్ ఆ వాదనతో ఏకీభవిస్తోంది కాబట్టి. సోలార్ మాగ్జిమమ్ ప్రభావం ఇంటర్నెట్పై కచ్చితంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితులకు ముందుగా సన్నద్ధం కావాలంటూ ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు. సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1859లో టెలిగ్రాఫ్స్ సేవలు దెబ్బ తిన్నాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉండొచ్చని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సంగీత అబు జ్యోతి చెబుతున్నారు. నష్టం ఊహించని దానికంటే.. Internet Apocalypse 2025 సంభవిస్తే గనుక సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు ఉంటుంది?.. తిరిగి ఎన్నిరోజుల్లో యధాస్థితికి తీసుకురావొచ్చనేది ఇప్పుడే చెప్పలేం. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం ఎలా ఎదుర్కొంటుందో కూడా ఊహించలేం. కానీ, జరిగే నష్టం మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుందనేది మాత్రం చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా సౌరతుపాను Internet Apocalypse 2025 గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుంది. -
బర్త్‌డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్‌గా డబుల్ సెంచరీ
వన్డేల్లో ఎంఎస్ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్. అంతకముందు పాకిస్తాన్‌పై 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్ మాత్రం ధోని కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్లు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్‌లను మిడిలార్డర్లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్‌గా ధోని డబుల్ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో కాదు.. దేశవాలీ క్రికెట్లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడడం ఇక్కడ మరో విశేషం. జూన్ 6, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ధోని షామ్ బజార్ క్లబ్ తరపున 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. పి-సేన్ టోర్నమెంట్లో భాగంగా జార్జ్ టెలిగ్రాఫ్‌తో షామ్ బజార్ క్లబ్ జట్టు తలపడింది. ఆ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్‌కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్‌లైన్స్‌తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్‌డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేష్(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ధోని 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్లో ఓపెనర్‌గా ధోనికిదే అత్యధిక స్కోరు. ఇక ధోనికి వన్డేల్లో డబుల్ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. On MS Dhoni's 42nd birthday, I found this report from 7th June 2005. It was about Dhoni hitting 207 off just 126 balls with 10 6s for Shyambazar Club against George Telegraph in the P Sen tournament at the Eden Gardens. pic.twitter.com/HbZNIHTD1o — Joy Bhattacharjya (@joybhattacharj) July 7, 2023 ఇక టీమిండియా కెప్టెన్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అక్కడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్‌గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు -
సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్
ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ ఆటతీరుతో వరుసగా సిరీస్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. స్టోక్స్ కెప్టెన్‌గా.. మెక్కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లండ్ జట్టు 13 టెస్టుల్లో 11 విజయాలు సాధించింది. అన్నింటిలోనూ బజ్‌బాల్ ఆట దూకుడునే ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించి సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లండ్ జట్టు తమ బజ్‌బాల్ దూకుడు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఆసీస్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఒక్కరోజులోనే డిక్లేర్ చేసింది. అయితే ప్రతీసారి మనది కాదని తెలుసుకోని ఇంగ్లండ్ ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు తలవంచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఐదోరోజు సూపర్‌గా బౌలింగ్ చేసినప్పటికి పాట్ కమిన్స్, నాథన్ లయోన్ల అద్బుత పోరాటం ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేసింది. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం బజ్‌బాల్ ఆటను సమర్థించుకున్నాడు. ఒక్క టెస్టులో ఓడిపోయినంత మాత్రానా బజ్‌బాల్‌ను పక్కనపెట్టేదే లేదని కుండబద్దలు కొట్టాడు. సీన్ మొత్తం రివర్స్.. అయితే బుధవారం(జూన్ 28న) లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో సీన్ మొత్తం రివర్స్ అయింది. బజ్‌బాల్ ఆటతో దూకుడు కనబరుస్తామనుకున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎందుకంటే తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా వేగంగా ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇలాగే ఆడుతామంటూ బజ్‌బాల్ ఆటను ఇంగ్లండ్‌కు చూపించింది. డేవిడ్ వార్నర్, ట్రెవిస్ హెడ్లు వన్డే స్టైల్లో వేగంగా ఆడితే.. స్మిత్ ఎప్పటిలాగే తన నిలకడైన ఆటను ప్రదర్శిస్తూ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సెంచరీకి దగ్గరయ్యాడు. ఓవర్‌కు 4.08 రన్‌రేట్‌తో 83 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఒక దశలో వార్నర్-లబుషేన్, ట్రెవిస్ హెడ్- స్మిత్ జోడి ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున జోడించారు. నిజంగా ఇది ఇంగ్లండ్ ఇది ఊహించలేదు. ఇక రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ నుంచి డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలెక్స్ క్యారీ, లాస్ట్ మ్యాచ్ హీరో పాట్ కమిన్స్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. తొలి సెషన్లో వీరిని ఎంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు అంత మంచిది. రెండు సెషన్ల పాటు ఆసీస్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 500 స్కోరు దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలైనట్లే. బజ్‌బాల్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిద్దామనుకున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియానే ముచ్చెమటలు పట్టించేలా కనిపిస్తోంది. చదవండి: రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా భారత్ చేతిలో ఓడినా సరే.. మాకు అదే ముఖ్యం: పాక్ స్టార్ క్రికెటర్ -
టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు..
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023 మెగా సమరానికి మరో 99 రోజుల కౌంట్‌డౌన్ మిగిలి ఉంది. నాలుగోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న టీమిండియా పెవరెట్‌గా కనిపిస్తోంది. పుష్కరకాలం కిందట ధోని సేన స్వదేశంలో ప్రపంచకప్‌ను కొట్టి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. తాజాగా మరోసారి వరల్డ్‌కప్‌కు మన దేశం ఆతిథ్యం ఇస్తుండడంతో రోహిత్ సేన ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మంగళవారం ఐసీసీ.. వరల్డ్‌కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం పది వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో 48 లీగ్ మ్యాచ్‌లు సహా రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనుంది. మొదటి సెమీఫైనల్‌కు ముంబై.. రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ఇక ప్రతిష్టాత్మక ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక టీమిండియా తొమ్మిది వేదికల్లో(హైదరాబాద్ మినహా) వివిధ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు ఆడేందుకు దేశం మొత్తం మీద ప్రధాన నగరాల్లో దాదాపు పదివేల కిలోమీటర్లు(9700 కిమీ) ప్రయాణం చేయనుంది. ఇందులో చిన్నజట్లతో మ్యాచ్‌లు మినహాయిస్తే భారత్ ఎదుర్కొనే ఐదు ప్రధాన ప్రత్యర్థులు, ఎక్కడ మ్యాచ్ ఆడుతుందనేది ఒకసారి పరిశీలిద్దాం. ఐదు ప్రధాన జట్లతో ఆడబోతున్న మ్యాచ్‌ల్లో పిచ్‌లు టీమిండియాకు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నారు. అదే సమయంలో ఒక్కో జట్టుకు ఒక్కో పిచ్‌ను రూపొందించనుండడం విశేషం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(అక్టోబర్ 8, చెన్నై వేదికగా) ఈ మెగా సమరంలో టీమిండియా ఆడబోయే తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిగా బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. అప్పటికి చలికాలం సీజన్ ప్రారంభం అవుతుంది. రెండో బ్యాటింగ్ సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే చాన్స్ ఉండడంతో ఇక్కడ ఏ జట్టైనా తొలి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపుతుంది. దీన్నిబట్టి చెన్నై పిచ్ కాస్త స్లగిష్గా ఉండే అవకాశముంది. ఇక 1987 నుంచి టీమిండియా చిదంబరం స్టేడియంలో 14 మ్యాచ్‌లాడి ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇందులో నాలుగు విజయాలు ఈ దశాబ్దంలో వచ్చినవే. గతేడాది ఇక్కడ జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. ఇక స్టేడియంలో పలు మార్పులు చేస్తున్నారు. స్టేడియం ఫ్లడ్‌లైట్స్‌ను ఎల్ఈడీ వెలుగులతో నింపుతున్నారు. ఇక మ్యాచ్‌కు రెండు ఎర్రమట్టి పిచ్‌లను తయారు చేస్తున్నారు. తుది దశ పనులు జరుగుతున్నాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్(అక్టోబర్ 15, అహ్మదాబాద్) వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. ఈ ఒక్క మ్యాచ్ మరొక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. లక్షా 30వేల మంది కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో భారత్, పాక్ జరిగే రోజున స్టేడియం సామర్థ్యానికి మించి జనం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరుదేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది. ఇక పిచ్‌ను ప్లాట్‌గా రూపొందిచే ప్రక్రియలో ఉన్నారు. ఎందుకంటే మ్యాచ్‌లో పరుగుల వర్షం రావాలని.. బ్యాటింగ్‌కు అనుకూలించేలా పిచ్‌ను తయారు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్రమోదీ స్టేడియం స్పిన్నర్లకు అనువుగా ఉంటుంది. అయితే ఈసారి ఎర్రమట్టి బదులు నల్లమట్టిని పిచ్‌కు వాడనున్నారు. దీంతో కాస్త లోబౌన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కువమేరకు ప్లాట్‌గానే రూపొందించనున్నారు. అంటే చిరకాల ప్రత్యర్థుల పోరులో పరుగుల సునామీని చూసే అవకాశం ఉంటుంది. 1984 నుంచి టీమిండియా ఇక్కడ 18 మ్యాచ్‌లు ఆడితే 10 విజయాలు సాధించింది. 2021లో ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు మార్చారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(అక్టోబర్ 22, ధర్మశాల) దేశంలో అతిచిన్న స్టేడియాల్లో ధర్మశాల ఒకటిగా ఉంది. ఇక్కడి బౌండరీ లైన్ చాలా దగ్గర్లో ఉంటుంది. ఇక్కడి పిచ్ పేసర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే న్యూజిలాండ్‌తో ఆడబోయే మ్యాచ్‌కు నల్లమట్టిని ఉపయోగించి పిచ్‌ను రూపొందించనున్నారు. బ్యాటింగ్ ట్రాక్‌కు అనుకూలమైనప్పటికి మ్యాచ్ రోజు ఎండ ఉంటే పరుగులు బాగానే వస్తాయి. ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే మాత్రం రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవు. అందుకే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం. మన దేశంలో కొత్త స్టేడియాల్లో ఒకటిగా ఉన్న ధర్మశాలలో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడితే రెండు గెలిచి.. రెండింట ఓడింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్(అక్టోబర్ 29, లక్నో) ఐపీఎల్ సమయంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో పెద్దగా పరుగుల వరద పారింది లేదు. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్పిన్ ట్రాక్నే కంటిన్యూ చేయనున్నారు. ఇక్కడ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌లో ప్రొటీస్ ఓడిపోయింది. ఇక్కడి పిచ్ ప్రభావం కారణంగా జట్లు స్కోర్లు 250 నుంచి 270 మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పిచ్‌పై నల్లమట్టిని ఉపయోగించనున్నారు. ఎక్కువగా స్పిన్నర్లు ప్రభావం చూపించే మ్యాచ్‌లో పేసర్లకు అనువైన బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా(నవంబర్ 5, కోల్‌కతా) అహ్మదాబాద్ తర్వాత కెపాసిటీలో, స్టేడియం సామర్థ్యంలో రెండో అతిపెద్ద స్టేడియం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మెగాటోర్నీలు ఎప్పుడు జరిగినా నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. పైగా ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు సూపర్ రికార్డు ఉంది. ఆడిన 22 మ్యాచ్‌ల్లో 13 మ్యాచ్‌లు గెలిచింది. 2011 నుంచి 2017 వరకు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఆరుసార్లు గెలుపొందితే.. రెండో బ్యాటింగ్ చేసిన జట్లు ఐదుసార్లు గెలుపొందాయి. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అటు పేసర్లకు.. ఇటు స్పిన్నర్లకు సమానపాత్ర ఉంటుంది. ఇక్కడ మంచు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. చదవండి: వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..? ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది
భారత క్రికెట్లో ఈరోజుకు(జూన్ 25) ఒక విశిష్టత ఉంది. కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్‌కప్ సాధించి ఇవాళ్టికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన విండీస్‌ను ఫైనల్లో ఓడించి ప్రఖ్యాత లార్డ్స్ బాల్కనీ నుంచి వరల్డ్‌కప్ ట్రోపీని అందుకోవడం ఎవరు మరిచిపోలేరు. 1983.. టీమిండియా క్రికెట్ భవిష్యత్తును మార్చివేసిన సంవత్సరంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఏదో మొక్కుబడిగా మ్యాచ్‌లు చూసిన సందర్భాలే ఎక్కువగా ఉండేది. కానీ భారత్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత దేశంలో క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా భారత్ క్రికెట్లో నూతన ఒరవడి 1983కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా తయారైంది. ఇప్పుడంటే క్రికెట్లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐ తన కనుసైగలతోనే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ 40 ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది. అందరూ టీమిండియాను తక్కువ చేసి చూసినవారే. ఆ ప్రపంచకప్‌లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ డెవిల్స్ భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్‌కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వేను ఇంగ్లండ్ అవమానించిన తీరు అభిమానుల గుండెల్లో ఎప్పటికి గుర్తుండిపోతుంది. అసలు ఏం జరిగింది? ఎన్‌కేపీ సాల్వే 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పదవీకాలంలో 1983 ప్రపంచ కప్ కోసం కపిల్ నేతృత్వంలోని భారత్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అసమాన ప్రదర్శనతో భారత్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు రావడంతో టీమిండియా కప్ కొడుతుందన్న నమ్మకం ఎవరికి లేదు. అప్పటికి భారత్ ఫైనల్ దాకా వెళ్లడమే చాలా గొప్ప ఫీట్ అని చెప్పుకున్నారు. అదే సమయంలో బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఆతిథ్య ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి రెండు టిక్కెట్లు మాత్రమే అడిగాడు. అయితే టికెట్టు ఉన్నప్పటికీ సాల్వేకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో విసిగిపోయిన సాల్వే ఇంగ్లండ్ బోర్డు దురహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్ ప్రపంచకప్‌ను గెలుచుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన అవమానం సాల్వే మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని తనలో తాను శపథం చేసిన సాల్వే.. కేవలం నాలుగేళ్లలోనే తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 1975,79,83 వరల్డ్‌కప్‌లు చూసుకుంటే ఈ మూడు ఇంగ్లండ్ గడ్డపైనే జరిగాయి. అప్పట్లో మిగతా దేశాల్లో క్రికెట్‌కు అనుగుణమైన పరిస్థితులు అంతగా లేవు. కానీ సాల్వే ఎలాగైన తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు.ఇంగ్లండ్ దురహంకారానికి బ్రేక్ వేయాలంటే ఈసారి జరగబోయే వరల్డ్‌కప్ కచ్చితంగా ఇంగ్లండ్ వెలుపల జరగాల్సిందే. 1987 ప్రపంచ కప్(1987 World Cup)ను భారత్, పాకిస్తాన్ భాగస్వామ్యంతో నిర్వహించాలని సాల్వే ప్రతిపాదన పంపాడు. ప్రపంచకప్‌కు భారత్, పాక్‌లు ఆతిథ్యమిస్తున్న విషయం తెలుసుకొని కంగుతిన్న ఇంగ్లండ్ ఆసియా దేశాలు ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించలేవని పేర్కొంది. ఇంగ్లండ్ బోర్డు చేసిన ఈ ప్రకటన సాల్వే మరింత గట్టిగా పని చేసేందుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. లాహోర్‌లో పాకిస్థాన్ కౌన్సిల్‌తో సమావేశం నిర్వహించి అన్నింటికీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు తుది మెరుగులు దిద్దారు. సాల్వే ప్రయత్నాల ఫలితంగా 1987 ప్రపంచకప్ మొదటిసారిగా ఇంగ్లండ్ వెలుపల జరిగింది. పాకిస్థాన్‌తో కలిసి టోర్నీని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటికి మూడుసార్లు వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఈ ఏడాది నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల క్రితం 2011 వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా.. ధోని నేతృత్వంలో రెండోసారి టైటిల్‌ను కొల్లగొట్టింది. తాజాగా రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి కప్ కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 1983 World Cup Final highlights. Kapil Dev's running catch to dismiss Viv Richards was the turning point! pic.twitter.com/7vs9kZj6HU — Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023 #OnThisDay in 1983, India lifted the Cricket World Cup for the first time, etching the name in golden letters! A monumental triumph that ignited a cricketing revolution and forever changed the course of Indian cricket. #1983WorldCup @BCCI pic.twitter.com/Ru6wDkHWg8 — Jay Shah (@JayShah) June 25, 2023 చదవండి: రోహిత్ వద్దు.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే! -
#LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా..
5 అడుగుల 9 అంగుళాలు.. మొహంపై చెరగని చిరునవ్వు.. 18 ఏళ్లుగా తన ఆటతో అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు.. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు.. ఈ తరంలో ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోటీ పడుతున్న అతను ఒక మెట్టుపైనే ఉన్నాడు.అతనే అర్జెంటీనా గ్రేట్ లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ కెరీర్లో చూడాల్సినవన్నీ చూశాడు. పసిఫిక్ దేశాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్‌ను 2021లో అర్జెంటీనాకు అందించాడు. ఇక ఇంతకాలం వెలితిగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను కూడా గతేడాది ఒడిసిపట్టాడు. వరల్డ్‌కప్ సాధించిన తర్వాత ఆటకు గుడ్‌బై చెప్తాడని అంతా భావించారు. కానీ మెస్సీ అలా చేయలేదు. తనలో శక్తి ఉన్నంతవరకు ఆడతానని.. ఇక ఆడలేను అన్నప్పుడు రిటైర్ అవుతానని మెస్సీ స్వయంగా పేర్కొన్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా అభివర్ణిస్తున్న లియోనల్ మెస్సీ ఇవాళ(జూన్ 24న) 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి కెరీర్లో ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగిన శిఖరంలా కనిపించే మెస్సీకి గుండె లోతుల్లోనుంచి చెబుతున్న ఒక్క మాట.. Happy Birthday Lionel Messi.. విచిత్రమైన డెబ్యూ.. ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా. అయితే తొలి మ్యాచ్‌లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో రిఫరీ మెస్సీకి రెడ్‌కార్డ్ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది. అంతుచిక్కని వ్యాధి.. మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్‌బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్‌కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు.. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరపున 175 మ్యాచ్‌ల్లో 103 గోల్స్ చేశాడు. అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా.. ఫుట్‌బాల్ ప్రపంచంలో రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో ఎక్కువగా బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్.. పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ తరపున 75 మ్యాచ్‌ల్లో 32 గోల్స్.. ఓవరాల్‌గా అంతర్జాతీయ, ప్రైవేటు ఫుట్‌బాల్ క్లబ్స్ కలిపి 1028 మ్యాచ్‌లాడి 807 గోల్స్‌తో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. Happy Birthday Thalaivaaa😘🐐❤️#LeoMessi #Messi𓃵 #Messi #LionelMessi #HappyBirthdayMessi pic.twitter.com/NY7CR1WQrD — Chikadhee 🇦🇷 ™ (@Chickadhi) June 23, 2023 Happy 36th birthday GOAT 🐐#LionelAndresMessi. Happy Birthday Leo 🦁 Hoping for another Ballon d'Or in October. 🤗🤗#Messi #Leo #Messi36 #Messi𓃵 #MessiBirthday #LionelMessi pic.twitter.com/pSwzXxD0Hs — Fukkard (@Fukkard) June 24, 2023 #GOAT𓃵 #Messi𓃵 📸🙌🏻🐐🎂 pic.twitter.com/chrslX3wvd — sameer ᴩᴀᴛʜᴀɴ 👑🦁 (@sameerp07528955) June 24, 2023 -
కశ్మీర్ విల్లో బ్యాట్లకు ఫుల్ డిమాండ్.. వన్డే ప్రపంచకప్‌కు తొలిసారి
అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత మళ్లీ 12 ఏండ్లకు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో ఈసారి రోహిత్ సేన కప్ కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచ కప్ నేపథ్యంలో బీసీసీఐ కూడా పక్కా ప్రణాళికతో ఉంది. భారీగా లాభాలను ఆర్జించాలని చూస్తోంది. వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం వచ్చింది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ లో కాశ్మీర్ విల్లో(Kashmir Willow Bats) క్రికెట్ బ్యాట్లను ఎక్కువగా ఉపయోగించాలని బీసీసీఐ అనుకుంటుంది. కాగా క్రికెట్లో ఇప్పటికైతే ఇంగ్లీష్ విల్లో , కశ్మీర్ విల్లో బ్యాట్లను వాడుతున్నారు. వీటిలో ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్(English Willow Bats)కు ఎక్కువగా క్రేజ్ ఉంది. ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక వంటి దేశాలు.. ఈ ప్రపంచకప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీనికి ఒక కారణం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచ కప్(T20 World Cup)లో మెుదటిసారిగా కశ్మీర్ విల్లో బ్యాట్ ను ఉపయోగించిన బ్యాటర్.. టి20 ప్రపంచ్ కప్ లో అత్యంత లాంగ్ సిక్స్ కొట్టాడు. దీంతో అప్పటి నుంచి ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది. ఇక మరో కారణం ఏంటంటే కాశ్మీర్ విల్లో బ్యాట్లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లతో పోలిస్తే.. చౌకగా ఉంటాయి. అలాగే ఈ బ్యాట్స్ నాణ్యత కూడా బాగా ఉంటుంది. కాశ్మీర్ విల్లో బ్యాట్లు.. రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య ధర ఉంటుంది. అదే ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ చూసుకుంటే.. రూ.లక్ష వరకూ ఉంటాయి. దీంతో నాణ్యతతో తక్కువ ధరకు వచ్చే.. కశ్మీర్ విల్లో బ్యాట్లపై ఆటగాళ్లు దృష్టి పెడుతున్నారు. బ్యాట్ల తయారీతో కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్బెహరా, చార్సూ, సేతార్ సంగం, హల్ములా, సంగం, పుజ్టెంగ్, మిర్జాపూర్, సేతార్ గ్రామాలు, పంజాబ్‌లోని జలంధర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Heega Kashmir willow Hx 509 cricket bat (Grade 2) is manufactured using selected Kashmir willow and is hand-crafted with utmost precision. The bat is suitable for leather balls.https://t.co/Xzxz6ys3JS#englishwillowbat #kashmirwillowbat #heegasports pic.twitter.com/Vqo7kgGaEs — Heega Sports (@HeegaSports) May 20, 2023 చదవండి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా 13 సిక్సర్లతో ఊచకోత.. బౌలింగ్‌లో ఆఖరి బంతికి గెలిపించిన చిచ్చరపిడుగు -
బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్
ఆటలో ప్రతీరోజు మనది కాదు. ప్రయోగాలు మంచిదే అయినప్పటికి ప్రతీసారి అది మనకు కలిసి వస్తుందని చెప్పలేం. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టకు ఈ విషయం బాగా అర్థమయి ఉంటుంది. బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతీరుతో తమకు ఎదురులేదని విర్రవీగుతున్న ఇంగ్లండ్‌ను ఆసీస్ అణిచివేసింది. అది కూడా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కావడంతో ఇంగ్లీష్ అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. బజ్‌బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్ ఏడాది కాలంగా మంచి ఫలితాలను సాధించింది. బెన్‌స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు కొత్తగా కనిపించింది. ఇదే బజ్‌బాల్ మంత్రంతో పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లను మట్టికరిపించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ జరుగుతున్నది ప్రతిష్టాత్మక యాషెస్.. అందునా ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయం తెలిసి కూడా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిరోజే సాహసం చేశాడు. పూర్తి బ్యాటింగ్ చేయకుండా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిచ్చింది. 386 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి 273 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సొంతగడ్డపై జరుగుతుండడంతో ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి రోజు బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పారు. ఇక ఐదోరోజు ఆటలో వరుణుడు దోబుచులాడడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపించాయి. ఇంగ్లండ్ వ్యూహం బెడిసికొట్టేలా కనిపించింది. అయితే రెండో సెషన్లో కుదురుకున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు పడగొట్టింది. అరె మళ్లీ ఇంగ్లండ్ బజ్‌బాల్ మంత్రం ఫలించిందే అనుకుంటున్న తరుణంలో పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు తమ పోరాటంతో ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేశారు. ప్రతీసారి బజ్‌బాల్ దూకుడు పనికి రాదన్నది మరోసారి ఇంగ్లండ్‌కు అర్థమయి ఉండాలి. రెండో టెస్టు నుంచి బజ్‌బాల్ క్రికెట్‌ను పక్కనబెడతారా లేక కొనసాగిస్తారా అనేది చూడాలి. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలి సెషన్లో వర్షంతో ఆటకు అంతరాయం కలగడం.. రెండో సెషన్లో పిచ్‌పై ఉన్న పదును ఉపయోగించుకొని ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లతో చెలరేగారు. దీంతో ఆఖరి సెషన్లో ఎలాగైనా నిలబడి డ్రా చేసుకున్నా చాలు అనే దోరణిలో తొలుత ఆసీస్ ఆట కొనసాగింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ధైర్యం ప్రదర్శించాడు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన కమిన్స్.. లయన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ‘డ్రా’కు అవకాశమివ్వకుండా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నాథన్ లయన్ (28 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. దీంతో ఇంగ్లండ్ గెలిచేందుకు బాట వేసుకున్న ఆఖరి సెషన్లో వీళ్లిద్దరు పిచ్‌పై పరుగులతో పాగా వేశారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. Ball by ball Last 4 overs of Ashes thriller between Australia and England in first test at Edgbaston #Ashes23 pic.twitter.com/OYpoar6vhW — Spartan (@_spartan_45) June 20, 2023 చదవండి: 2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా? -
యాషెస్ సమరం.. పరుగుల వరద పారించిన టాప్-10 బ్యాటర్లు
మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ(జూన్ 16న) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. యాషెస్ ట్రోపీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద ఉండగా.. 2015 తర్వాత మళ్లీ యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను దెబ్బతీయాలని కంకణం కట్టుకుంది. బజ్‌బాల్‌తో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ను.. ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిష్టాత్మక సిరీస్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు వికెట్లతో బౌలర్లు చెలరేగితే.. మరోపక్క బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకోవాలని చూస్తుంటారు. ఆసీస్ త్రయం స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రెవిస్ హెడ్ సూపర్‌ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ చరిత్రలో పరుగుల వరద పారించి టాప్-10 క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం. డాన్ బ్రాడ్‌మన్: ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ యాషెస్ సిరీస్‌లో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో 37 టెస్టులాడిన బ్రాడ్‌మన్ 5028 పరుగులు సాధించాడు. ఈ దిగ్గజం చేసిన 10వేల పరుగుల్లో సగం పరుగులు యాషెస్ సిరీస్‌లోనే వచ్చాయంటే బ్రాడ్‌మన్ ఎంత కసితో ఆడాడో అర్థమవుతుంది. 90 సగటుతో బ్యాటింగ్ చేసిన బ్రాడ్‌మన్ 1930లో జరిగిన సిరీస్‌లో ఏకంగా 974 పరుగులు సాధించాడు. ఇప్పటికి ఇదే అత్యధికంగా ఉంది. జాక్ హబ్స్: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన జాక్ హబ్స్ యాషెస్‌లో 41 టెస్టులాడి 3636 పరుగులు సాధించాడు. 12 సెంచరీలు బాదిన జాన్ హబ్స్ బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అలెన్ బోర్డర్: ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ అలెన్ బోర్డర్‌కు కూడా యాషెస్ సిరీస్‌లో మంచి రికార్డు ఉంది. 28 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్ 55.55 సగటుతో 3222 పరుగులు చేశాడు. స్టీవ్ వా: ఆసీస్ దిగ్గజ కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు కూడా యాషెస్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసిన స్టీవ్ వా 3143 పరుగులు సాధించాడు. ఆసీస్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు యాషెస్‌లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండుసార్లు యాషెస్ ట్రోపీని నెగ్గడంతో పాటు అతని కెప్టెన్సీలో యాషెస్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయాలు అందుకోవడం విశేషం. స్టీవ్ స్మిత్: ప్రస్తుతం బ్రాడ్‌మన్ రికార్డును అందుకోగల సత్తా కేవలం స్టీవ్ స్మిత్‌కు మాత్రమే ఉంది. ఈ శకంలో బెస్ట్ టెస్టు క్రికెటర్‌గా పేరు పొందిన స్మిత్ యాషెస్‌లో 32 టెస్టుల్లో 3044 పరుగులు బాదాడు. తాజాగా జరగనున్న సిరీస్‌లో స్టీవ్‌స్మిత్ కీలకం కానున్నాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లకు తలనొప్పిగా తయారయ్యాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం. డేవిడ్ గోవర్ ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ గోవర్ యాషెస్‌లో 38 టెస్టులాడి 3037 పరుగులు చేశాడు. వాలీ హామండ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వాలీ హామండ్ 33 టెస్టుల్లోనే 3852 పరగులు సాధించాడు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 27 టెస్టుల్లోనే 2741 పరుగులు సాధించాడు. క్లిమెంట్ హిల్: ఆస్ట్రేలియా క్రికెటర్ క్లిమెంట్ హిల్ 41 టెస్టుల్లో 2660 పరుగులు సాధించాడు. జాన్ హెడ్రిచ్: ఇంగ్లండ్‌కు చెందిన జాన్ హెడ్రిచ్ యాషెస్‌లో 32 మ్యాచ్‌లాడి 2644 పరుగులు సాధించాడు. చదవండి: ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్ శర్మ 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్' పదం ఎలా వచ్చిందంటే?
క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. దాయాదులు తలపడుతున్నాయంటే రెండు దేశాల్లోని క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలవుతుంటాయి. అచ్చం అలాంటి పోరు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య కూడా ఉంటుంది. అది కూడా సంప్రదాయ టెస్టు క్రికెట్లో. టి20 క్రికెట్ లాంటి వేగవంతమైన ఆట వచ్చాకా కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ టెస్టు సిరీస్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాదాపు 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. కేవలం ఒక ట్రోపీలో ఉన్న బూడిద కోసం కొదమసింహాల్లా తలపడే రెండు జట్ల పోరు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రెండేళ్లకు ఒకసారి జరిగే యాషెస్ సిరీస్ మళ్లీ వచ్చేసింది. జూన్ 16 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరగనుంది. యాషెస్ సిరీస్‌కు ఈసారి ఇంగ్లండ్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో అసలు యాషెస్ అనే పేరు ఎలా వచ్చింది.. ఈ సిరీస్ ఎందుకు ఇరుదేశాలకు ప్రతిష్టాత్మకం అనేది మరోసారి తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ 1882లో మొదలైన గొడవ.. 1882లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలిసారి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాయి. ఆ ఏడాది ఇంగ్లండ్‌కు టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. అప్పటివరకు 22 టెస్టుల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే ఓడిపోయింది. దీంతో సిరీస్‌లో ఫెవరెట్‌గా కనిపించిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఆ సిరీస్‌లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆసీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ విజయానికి కేవలం 85 పరుగులు మాత్రమే కావాలి. అప్పటికి ఇంగ్లండ్ టీం స్కోరు రెండు వికెట్లకు 51 పరుగులు. క్రికెట్ అంటేనే అన్ ప్రిడిక్టబుల్ కాబట్టి.. అనూహ్యంగా ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. ఆగస్టు 29 న ఇంగ్లండ్ ఓడిపోయింది. ఈ ఓటమి ఇంగ్లండ్ మీడియాను తాకింది. ఇంగ్లండ్‌లోని ప్రతీ వార్తాపత్రిక ఇంగ్లండ్ టీంను దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు వందల్లో వెలువడ్డాయి ఈ ఓటమి తరువాత, స్పోర్టింగ్ టైమ్స్ అనే పత్రిక ఇంగ్లీష్ క్రికెట్ కోసం ఒక సంతాప సందేశాన్ని ప్రచురించింది. “ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది.. ” అంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని వారాలకే హాన్ ఐవో బ్లిగ్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ఈ సందర్భంగా బ్లిగ్ మాట్లాడుతూ... యాషెస్‌ను తిరిగి తీసుకొస్తానని శపథం చేశాడు. స్థానిక మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ మళ్లీ వందల సంఖ్యలో వార్తలు ప్రచురించాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ విల్ మర్దోక్ కూడా ఇలాంటి ప్రకటనే చేశాడు. యాషెస్‌ను ఇంగ్లండ్ పట్టుకెళ్లకుండా అడ్డుకుంటామని పేర్కొన్నాడు. కలశంలో బూడిద.. అయితే ఇంగ్లండ్ ఓటమిని దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు రాసిన వార్తా పత్రికలను ఒక మహిళా బృందం తగలబెట్టింది. దానికి సంబంధించిన బూడిదను కలశం లాంటి పాత్రలో పెట్టి అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ బ్లైగ్కు అందించారు. కాగా ఆ కలశంలో నిజమైన యాషెస్ ఇప్పటికీ ఉపయోగించిన ఒక జత స్టంప్ బెయిల్ల్ను లండన్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి కాగా పెళుసుగా ఉండే అసలైన దానిని లార్డ్స్‌లోని క్రికెట్ మ్యూజియంలో చూడొచ్చు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు. కాగా సిరీస్ గెలుపొందిన జట్లకు కలశం ప్రతిరూపాన్ని అందజేస్తారు.ఆ తర్వాత ఈ సిరీస్ కోసం కలశం రూపంలోనే ప్రత్యేక ట్రోఫీని తయారు చేశారు. దీనిలో మొప్పలను కాల్చిన తర్వాత బూడిదను ఉంచుతారు. ఈ ట్రోఫీని యూఆర్ఎన్ అని కూడా పిలుస్తారు, ఇది బూడిద కలిగిన పాత్ర. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మొదట్లో ఇంగ్లండ్.. ఇప్పుడు ఆసీస్‌దే ఆధిపత్యం ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య 72 యాషెస్ సిరీస్‌లు జరిగితే.. అందులో ఆస్ట్రేలియా 3 సార్లు, ఇంగ్లండ్ 32 సార్లు విజయాలు అందుకోగా.. ఆరు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి. ఇక 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్‌లో 356 మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 150.. ఇంగ్లండ్ 110 మ్యాచ్‌లు నెగ్గగా.. 96 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ప్రస్తుతం యాషెస్ ట్రోపీ ఆస్ట్రేలియా వద్ద ఉంది. 2021-22లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్ 2015 తర్వాత మళ్లీ యాషెస్‌ను గెలవలేకపోయింది. ఈసారి స్టోక్స్ నేతృత్వంలో బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ ఎలాగైనా యాషెస్ ట్రోపీని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇటీవలే టీమిండియాను ఓడించి ప్రపంచటెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా 73వ సారి జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 16 నుంచి 20 వరకు జరగనుంది. చదవండి: ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా? #TNPL2023: రోజుకో విచిత్రం.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్ -
#NovakDjokovic: సెర్బియా యోధుడి చరిత్ర.. టెన్నిస్‌లో కొత్త రారాజు
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం(జూన్ 11న) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా తన ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ జమ చేసుకున్నాడు. తద్వారా ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన యోధుడిగా రికార్డులకెక్కాడు. ఇంతకవరకు నాదల్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్‌లతో సంయుక్తంగా ఉన్న జొకోవిచ్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ గెలవడంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పురుషుల టెన్నిస్‌లో కొత్త రారాజుగా ఆవిర్భవించాడు. ► జొకోవిచ్ సాధించిన 23 గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పది ఉండగా.. ఆ తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఏడుసార్లు గెలుచుకున్నాడు. ఇక యూస్ ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడేసి సార్లు నెగ్గిన జొకోవిచ్.. నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కనీసం మూడుసార్గు నెగ్గిన తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. ► ఇక జొకోవిచ్ ఇప్పటివరకు సాధించిన 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో పది గ్రాండ్‌స్లామ్‌లు 30 ఏళ్లలోపే సాధించడం గమనార్హం. ► రోలాండ్ గారోస్‌లో(ఫ్రెంచ్ ఓపెన్)లో ఛాంపియన్‌గా అవతరించిన అతిపెద్ద వయస్కుడిగానూ జొకో చరిత్ర సృష్టించాడు. 2023 ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకునే నాటికి జొకో వయసు 36 ఏళ్ల 19 రోజులుగా ఉంది. ఈ నేపథ్యంలో రఫెల్ నాదల్(35 ఏళ్ల 11 నెలల 19 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు. ► ఇక ఓపెన్ శకంలో మహిళల, పురుషుల టెన్నిస్ విభాగాలను కలిపి చూస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారుల్లో సెరెనా విలియమ్స్‌తో కలిసి జొకోవిచ్(23 టైటిల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలిస్థానంలో ఉంది. ఒకవేళ వచ్చే నెలలో ఆరంభం కానున్న వింబుల్డన్‌లో గనుక జొకోవిచ్ టైటిల్ కొడితే మాత్రం మార్గరెట్ కోర్ట్ సరసన నిలవనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7-6(7-1), 6-3, 7-5తో గెలుపొందాడు. మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలిసెట్లోనే జొకోవిచ్‌కు కాస్పర్ రూడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను జొకోవిచ్ 7-1తో కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండానే కేవలం 45 నిమిషాల్లో 6-3తో సొంతం చేసుకున్నాడు. కీలకమైన మూడోసెట్లో కాస్పర్ రూడ్ ఫుంజుకోవడంతో మళ్లీ టైబ్రేక్ తప్పదనిపించింది. ఈ దశలో రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 7-5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. One of the best speeches after winning a grand slam Special achievement, special speech NEVER GIVE UP#RolandGarros #RolandGarros2023 #Djokovic #NovakDjokovic pic.twitter.com/zcwbd4Up6X — Vaibhav Sharma (@vaibhav_4x) June 11, 2023 🏆🇷🇸#RolandGarros | @DjokerNole pic.twitter.com/sopyII3GfQ — Roland-Garros (@rolandgarros) June 11, 2023 A legendary moment ✨#RolandGarros @DjokerNole pic.twitter.com/IdT4LWqqjO — Roland-Garros (@rolandgarros) June 11, 2023 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title. ⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB — Roland-Garros (@rolandgarros) June 11, 2023 చదవండి: French Open 2023 Final: జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ -
512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఎన్నోసార్లు జట్టుకు ఆపద్బాందవుడయ్యాడు. తన ఇన్నింగ్స్‌లతో ఎన్నోసార్లు టీమిండియాకు విజయాలు అందించాడు. కెరీర్ ఆరంభంలో మూడు ఫార్మాట్లలో ఆడిన రహానే క్రమంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అయినా సంప్రదాయ ఫార్మాట్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు. ఎంత బాగా ఆడినా ఏదో ఒక దశలో ఒక బ్యాడ్‌ఫేజ్ అనేది ఉంటుంది. ఆ సమయంలో ఎవరికైనా అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. అజింక్యా రహానేకు కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. రెండేళ్ల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే ఘోర ప్రదర్శన కనబరిచాడు. అంతే దెబ్బకు టీమిండియాలో చోటు కోల్పోయాడు. జాతీయ జట్టుకు దూరమైనప్పటికి రహానే పెద్దగా బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం మళ్లీ తనను వెతుక్కుంటూ వస్తుందని నమ్మాడు. అందుకు తగ్గట్టుగానే దేశవాలీ క్రికెట్ అయిన రంజీ ట్రోపీ సహా మిగతా టోర్నీల్లో పాల్గొని సెంచరీలతో చెలరేగినా రహానేకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఐపీఎల్ 2023 సీజన్ వచ్చింది. రహానేను పెద్దగా ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో సీఎస్కే రూ. 50 లక్షల కనీస ధరకే రహానేను సొంతం చేసుకుంది. అయితే రహానే అప్పటికే పరుగుల దాహంతో ఉన్నాడు. ఆకలి మీద ఉన్న సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో అప్పటికి ఎవరికి తెలియదు. కానీ రహానేను సీఎస్కే కెప్టెన్ ధోని నమ్మాడు. ధోని నమ్మకాన్ని రహానే నిలబెట్టాడు. గతంలో ఐపీఎల్ ఆడినప్పటికి రహానేలో ఇంత వేగవంతమైన ఆట ఎప్పుడు చూసింది లేదు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన రహానే 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో చూపెట్టిన సూపర్ ఫామ్ రహానేను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్ సమయంలో ఏప్రిల్ 23న మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. ''ఇది సరిపోదు.. నా బెస్ట్ ఇంకా రావాల్సి ఉంది'' అంటూ కామెంట్ చేశాడు. అలా 512 రోజుల విరామం తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే సరికొత్తగా కనిపించాడు. ఐపీఎల్ తన ఆటతో దూకుడుగా కనిపించిన అదే రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో శాంతంగా కనిపించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ కొత్త రహానేను చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. తొలుత జడేజాతో కలిసి 70 పరుగులు జోడించిన రహానే.. ఆపై శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఏకంగా 109 పరుగులు జోడించి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒక దశలో 200 లోపే చాప చుట్టేస్తుందనుకున్న తరుణంలో శార్దూల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానే టీమిండియా పరువు కాపాడాడు. చివరికి 129 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 89 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తన బెస్ట్ ఇవ్వాల్సి ఉంది అని చెప్పిన మాటకు కట్టుబడి తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన రహానే రెండు వారాల వ్యవధిలోనే అభిమానులకు తనలోని డబుల్ వర్షన్ చూపించాడు. 96 at Durban 118 at Wellington 103 at Lord's 147 at Melbourne 126 at Colombo 108* at Jamaica 81 at Nottingham 112 at Melbourne 89 at Oval The crisis man at Overseas, Rahane. pic.twitter.com/LW52iqOAtH — Johns. (@CricCrazyJohns) June 9, 2023 TAKE A BOW, AJINKYA RAHANE. 89 in 129 balls with 11 fours and a six. An innings to remember on the Test return, what a knock. He made a grand comeback! No words can describe his contribution today. pic.twitter.com/N4QsbvWiVz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే -
డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లండ్‌లోనే ఎందుకు?
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలు క్రికెట్ ఆడుతున్న సభ్యదేశాల్లో ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటుంది. వన్డే వరల్డ్‌కప్, టి20 వరల్డ్‌కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా మెగాటోర్నీలు ఏవైనా ఏదో ఒక దేశం ఆతిథ్యం ఇవ్వడం కనబడుతుంది. అయితే తాజాగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు మాత్రం ఇంగ్లండ్ మాత్రమే ఎందుకు ఆతిథ్యమిస్తోంది అని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. తొలిసారి 2021లో నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదిక అయింది. ఈసారి ఓవల్ స్టేడియంలో రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తున్నారు. రెండు వేర్వేరు స్టేడియాల్లో రెండు ఫైనల్స్ జరిగితే ఇందులో కామన్‌గా ఉంది మాత్రం టీమిండియానే. వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న టీమిండియా ఈసారి కూడా మ్యాచ్ గెలస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. 2021లో కివీస్‌తో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను ఐసీసీ ఇంగ్లండ్‌లోనే ఎందుకు నిర్వహిస్తుందనే ప్రశ్నకు ఒకటే సమాధానం వినిపిస్తుంది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లాంటి ఆసియా ఖండపు దేశాల్లో జూన్ నెలలో ఎలాంటి టెస్టు మ్యాచ్‌లు జరగవు. దానికి కారణం వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్, శ్రీలంక ఇలా ఏది చూసుకున్నా ఉపఖండపు దేశాల్లో వాతావరణ పరిస్థితి ఒకలాగే ఉంటుంది. అందుకే జూన్ నుంచి ఆగస్టు వరకు ఉపఖండపు దేశాలు స్వదేశంలో టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడవు. మనం సరిగ్గా గమనిస్తే జూన్ నెలలో ఇంగ్లండ్ మినహా ఏ దేశంలోనూ ఎక్కువగా క్రికెట్ మ్యాచ్‌లు జరగవు. ఈ సమయంలో ఇంగ్లండ్ లాంటి యూరోప్ దేశంలోనే పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉంటాయి. అందుకే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించడానికే మొగ్గు చూపుతుంది. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో నిర్వహించాలని ఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా.. ఇంగ్లండ్‌లోని పరిస్థితులు ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా ఉంటాయి. ఇక్కడి పిచ్లన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు కాస్త అనుకూలంగా ఉంటాయి. ఇంగ్లండ్ పిచ్‌ల్లో ఎక్కువగా స్వింగ్ కనిపిస్తుంది. ఆసీస్ పిచ్‌లు ఎక్కువగా బౌన్సీ ట్రాక్‌లు ఉంటాయి. ఇక న్యూజిలాండ్‌లోనూ పరిస్థితులు అలానే ఉంటాయి. అందుకే ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్నప్పటికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ టీమిండియాకు ఇది కాస్త ప్రతికూలమని చెప్పొచ్చు. 2021లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా తడబడింది. స్వింగ్ పిచ్‌లపై బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన టీమిండియా బ్యాటర్లు వికెట్లుపారేసుకున్నారు. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపింది లేదు. ఈసారి కూడా పరిస్థితి అలానే కనిపిస్తోంది. ఓవల్ పిచ్ టీమిండియా కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువగా సహకరిస్తుందని తెలుస్తోంది. అలా అని పిచ్‌ను తప్పు బట్టడానికి లేదు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు ఎలాగైతే వికెట్లు తీశారో.. టీమిండియా ఇన్నింగ్స్‌లోనూ ఇప్పటివరకు పడిన ఆరు వికెట్లలో ఐదు పేసర్లే పడగొట్టారు. అయినా ఆసీస్ బ్యాటర్లు యదేచ్ఛగా బ్యాట్ ఝులిపించిన చోట టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయలేక అల్లాడిపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా ఈసారి కూడా రన్నరప్‌గా నిలిచేలా కనిపిస్తోంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఐసీసీ ఇంగ్లండ్‌లో నిర్వహిస్తున్నప్పటికి బీసీసీఐ పెద్దగా అడ్డుచెప్పడం లేదు. క్రికెట్ ప్రపంచాన్ని కనుసైగలతో శాసిస్తున్న బీసీసీఐ తలచుకుంటే డబ్ల్యూటీసీ వేదికను మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ టెస్టు ఛాంపియన్షిప్ విషయంలో బీసీసీఐ సీరియస్‌గా కనిపించడం లేదు. టెస్టు క్రికెట్లో పెద్దగా కాసుల వర్షం కురిసే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ తన దృష్టంతా టి20లు, వన్డేలపైనే ఉంచింది. బీసీసీఐ ఆలోచనా ధోరణి మారాలని అభిమానులు భావిస్తున్నారు. ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్(FTP) పేరిట ఇప్పటికే రానున్న మూడేళ్లకు షెడ్యూల్ రూపొందించిన ఐసీసీ వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను కూడా ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇది మార్చడానికి అవకాశం లేకపోయినప్పటికి బీసీసీఐ చొరవ తీసుకొని ఐసీసీని ఒప్పించి 2027 టెస్టు ఛాంపియన్‌షిప్‌కు తటస్థ వేదికలో జరిగేలా చూడొచ్చు. అలా కాదని బీసీసీఐ పట్టించుకోకుండా ఉంటే మాత్రం టీమిండియా భవిష్యత్తులోనూ రన్నరప్‌గానే నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: WTC Final Day-3: రహానే ఫిఫ్టీ.. 200 మార్క్ దాటిన టీమిండియా -
అతనికి కుటుంబమే ప్రాణం.. మరి గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడంటే..
లక్నో సిటీ సివిల్ కోర్టులో బుధవారం విచారణ జరుగుతుండగానే కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే డాన్ అక్కడికక్కడే చనిపోయాడు. మూడు దశాబ్దాలుగా దాదాపు పాతిక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు సంజీవ్ జీవా. కానీ, ఒకప్పుడు అతనికి కుటుంబమే ముఖ్యంగా ఉండేంది. దానిని పోషించుకునేందుకు కాంపౌండర్ పని కూడా చేశాడు. అలాంటోడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు?.. అతని నేరచరిత్ర నెత్తుటి మరకలతో ఎలా సాగిందో చూస్తే.. అది 90వ దశకం ప్రారంభం కాలం అది. పశ్చిమ యూపీలోని ముజఫ్ఫర్ నగర్లో శంకర్ హాస్పిటల్ ఉండేది. అక్కడ కంపౌండర్‌గా పనిచేసే ఒక యువకుడు అందరికి మందులు పొట్లాలు కట్టేవాడు. చేసేది కంపౌండర్ పనే అయినా అందరూ అతన్ని ‘డాక్టర్’ అనే సరదాగా పిలిచేవారు. ఆ టైంలో అతనికి కుటుంబం తప్ప మరో ఊసు ఉండేది కాదు. వాళ్ల కోసం పగలురాత్రి తెగ కష్టపడేవాడు. అయితే.. ఆ డబ్బు సులువుగా వచ్చే మార్గం ఏంటో త్వరలోనే అతను అర్థం చేసుకున్నాడు. నెమ్మదిగా అతనిలో నేర స్వభావం బయటపడడం ప్రారంభమైంది. తాను, తన కుటుంబం బతకాలంటే డబ్బు కావాలి. అది ఎంత ఖర్చు చేసినా తరగనంత. అందుకోసం నేరవృత్తిని ఎంచుకున్నాడు. తన డాక్టర్‌కు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న ఒక వ్యాపారిని బెదిరించడం ద్వారా ఆ యువకుడు తన నేరసామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. అక్కడతో ఆగలేదు… తరువాతి కాలంలో తన డాక్టర్నే కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశాడు. సంజీవ్ జీవా పూర్తి పేరు సంజీవ్ మహేశ్వరి . యూపీలోని ముజఫ్పర్ నగర్‌కు చెందిన వ్యక్తి. తన నేర సామ్రాజ్యం ప్రారంభంలోనే కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 90వ దశకం చివరికి వచ్చేనాటికి సంజీవ్ కలకత్తాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి 2కోట్లు డిమాండ్ చేశాడు. అప్పట్లో కిడ్నాపర్ డిమాండ్ చేసే డబ్బు విలువను బట్టి ఆ గ్యాంగ్ ఎంత పెద్దదో డిసైడ్ చేసేవారు. తరువాతి కాలంలో తనదంటూ ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్న సంజీవ్… విదేశాల నుంచి ఆయుధాలను తీసుకువచ్చాడు. యూపీలోని షామ్లీ జిల్లాలో పోలీసులు చెక్‌పోస్టు వద్ద అనిల్ అనే ఒక రౌడీ దగ్గర నుంచి ఏకే-47తోపాటు 1300బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ యూనివర్సిటీ డీన్ హత్యకేసులో నిందితుడు. అనిల్‌కు ఈ ఆయుధాలు అమ్మింది సంజీవ్ అని పోలీసులు తేల్చారు. ముజఫ్పర్నగర్ కేంద్రంగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన సంజీవ్ … మెల్లిగా కాంట్రాక్టు కిల్లింగ్లను ప్రారంభించాడు. సంజీవ్ నేర ప్రపంచంలో బ్రహ్మదత్త ద్వివేది హత్య సంచలనం సృష్టించింది. 90వ దశకంలో యూపీ రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా బ్రహ్మదత్త ద్వివేదికి పేరుంది. బీఎస్పీ రాజకీయాలను మలుపు తిప్పిన గెస్ట్‌హౌజ్ సంఘటనలో మాయావతికి ద్వివేది సహాయం చేశారు. కవిగా, సిద్ధాంత కర్తగా బ్రహ్మదత్తకు బీజేపీలో మంచి గుర్తింపు ఉండేది. బీజేపీ నాయకుడైనప్పటికీ… మాయావతి ఆయనను సోదరుడిగా భావించేది. ఫిబ్రవరి 1997లో తన ఇంటి దగ్గర నుంచి వెలుతున్న సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ద్వివేది అక్కడికక్కడే చనిపోయారు. అద్వానీ, వాజ్‌పేయి హుటాహుటిన లక్నో వచ్చి ద్వివేది అంత్యక్రియల్లోపాల్గన్నారంటే.. ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. ఫరూకాబాద్ ఎమ్మెల్యే విజయ్‌సింగ్ తో పాటు సంజీవ్ జీవా కూడా ఇందులో దోషిగా కోర్టు తేల్చింది. ఈ కేసులో సంజీవ్ జీవాకు యావజ్జీవా కారాగార శిక్షపడింది. అయితే సంజీవ్ జీవా మాత్రం పోలీసులకు చిక్కలేదు. మున్నా బజరంగీతో చేరడం ద్వారా సంజీవ్ తన నేరసామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. 2005నాటికి సంజీవ్ జీవా బీఎస్పీ ఎంపీగా ఉన్న మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీతో జీవా చేతులు కలిపాడు. ఇదే సమయంలో జరిగిన కృష్ణానంద్ రాయ్ హత్యతో సంజీవా ఫేమస్ అయిపోయాడు. మహమ్మదాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణానంద్ రాయ్ బీజేపీలో కీలకమైన నేత. 2005 నవంబర్‌లో రాయ్ తన ఇంటి నుంచి ఒక కార్యక్రమానికి వెళ్లివస్తుండగా నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ఆయనను అడ్డుకున్నారు. ఏకంగా ఏకే-47 ఆయుధాలతో దాదాపు 500బుల్లెట్లు ఫైర్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ వాహనం పూర్తిగా బుల్లెట్లతో జల్లెడలా మారిపోయింది. ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారి శరీరాల నుంచి దాదాపు 50బుల్లెట్లు బయటకు తీశారు. కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మున్నాబజరంగీని జైలులో హత్య చేశారు. లోక్‌సభ సభ్యుడు ముఖ్తార్ అన్సారి కేసు నుంచి తప్పించుకోగలిగారు. ఇక సంజీవ్ జీవా ఈ కేసులో కీలక నిందితుడని విచారణలో తేలింది. ప్రస్తుతం జైలులో ఉన్న సంజీవాను కోర్టులో జడ్జి ముందు విచారణ జరుగుతుండగానే.. లాయర్ల దుస్తుల్లో వచ్చి మరీ కాల్చి చంపారు. సంజీవా భార్య పాయల్ చౌదరి ఆర్ఎల్డీ పార్టీ నుంచి ముజఫ్ఫర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. తన భర్తకు ప్రాణహాని ఉందని సంజీవ్ భార్య ఆ మధ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏది ఏమైనా సంజీవ్ చావుతో… యూపీ రక్తచరిత్రలో ఓ అంకం ముగిసినట్లయ్యింది. :::ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
'ఎరుపు బంతి'.. ప్రాభవం కోల్పోతున్న దశ నుంచి శిఖరస్థాయికి
క్రికెట్ అంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు టి20 క్రికెట్. అయితే ఇదే టి20 క్రికెట్, వన్డే క్రికెట్‌కు మూలం సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్ అని మరిచిపోవద్దు. మనకు తెలిసి క్రికెట్ ప్రారంభమైంది దాదాపు మూడు వందల ఏళ్ల కిందటి పైమాటే. తొలుత బ్రిటీష్ వాళ్లు క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. 17,18వ దశకంలో ఇంగ్లండ్‌లో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. కాలక్రమంలో ఇంగ్లండ్ దేశం క్రికెట్‌కు పుట్టినిల్లుగా తయారైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. 18వ దశకం చివరి నుంచి 19వ దశకం ఆరంభం వరకు ఎక్కువ మ్యాచ్‌లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్యే జరిగేవి. అయితే మన దేశం బ్రిటీష్ వారి చేతుల్లో ఉండడంతో ఇక్కడ కూడా క్రికెట్‌పై ఆసక్తి బాగా ఉండేది. మన దేశం తరపున బ్రిటీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రికెట్‌పై ప్రజల్లో ఆసక్తి పెరగడం మొదలైంది. ఇక క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి టెస్టు క్రికెట్ ఫార్మాట్లోనే చాలాకాలం పాటు ఆట జరిగింది. 1975లో తొలి ప్రపంచకప్ జరిగే వరకు కూడా టెస్టు క్రికెట్ మాత్రమే ఎక్కువగా జరిగేది. మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికి 1980 తర్వాత హాకీ ప్రభావం కోల్పోవడం ప్రారంభమైంది. అదే సమయంలో క్రికెట్ మాత్రం వైభవం పెరుగుతూ వచ్చింది. 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కపిల్ డెవిల్స్ ప్రపంచకప్ విజేతగా నిలవడంతో క్రికెట్‌పై క్రేజ్ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. అక్కడి నుంచి టీమిండియా వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయ క్రీడ హాకీ నుంచి క్రికెట్ అనేలా మన ప్రాభవం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.1990వ దశకంలో క్రికెట్లో పెను మార్పులు వచ్చాయి. వన్డే మ్యాచ్‌లకు కలర్ జెర్సీలు వాడడం.. ఎర్రబంతుల స్థానంలో తెల్లబంతులు ఉపయోగించడం మొదలైంది. క్రమంగా వన్డే క్రికెట్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. వన్డే క్రికెట్‌కు ఆదరణ వచ్చినా టెస్టులకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే టి20 క్రికెట్ వచ్చాకా మాత్రం టెస్టులపై ఆసక్తి సన్నగిల్లింది. వన్డేలు ఒక్కరోజులో ముగిసిపోతే.. టి20లు మాత్రం మూడున్నర గంటల్లోనే ముగిసి అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటి ఆటగాళ్లలో ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్ కన్నా మూడు గంటల్లో ముగిసిపోయే టి 20 క్రికెట్ అంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడిందేమో అన్న సంకేతాలు వినిపించాయి. కానీ మనం ఒకటి అనుకుంటే ఐసీసీ మరోలా ఆలోచించింది. ప్రాభవం కోల్పోతున్న టెస్టు క్రికెట్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో కొత్త హంగులు తీసుకొచ్చింది. టెస్టు క్రికెట్ ఐదు రోజుల పాటు జరిగినప్పటికి అందులో ఉండే మజా వేరుగా ఉంటుంది. బ్యాటర్ల నుంచి కళాత్మక షాట్లు.. బౌలర్లు తీసే వికెట్లలో నైపుణ్యం కనిపిస్తుంటుంది. టి20ల్లో ఎంత వేగంగా ఆడినా.. బ్యాటింగ్‌లో నైపుణ్యం బయటపడేది టెస్టు క్రికెట్ ద్వారానే. ఇక స్పిన్నర్లు, పేసర్లు పోటీ పడి వికెట్లు తీస్తుంటే చూడముచ్చటగా ఉండేది. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లు కూడా దాదాపు మూడురోజుల్లోనే ముగిసిపోతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ మంచి టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగడమే దీనికి కారణం. టీమిండియా ఓటమిపాలైనప్పటికి డబ్ల్యూటీసీకి మాత్రం మంచి ఆదరణ లభించింది. దీన్నిబట్టి చూస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో టెస్టు క్రికెట్‌ను నిలబెట్టేందుకు ఐసీసీ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది. చదవండి: WTC Final: టెస్టుల్లో టీమిండియా తరపున సిక్సర్ల రారాజు ఎవరంటే? -
Old Parliament: ఏకైక ప్రత్యక్ష సాక్షి అదొక్కటే!
పార్లమెంట్ పాతదైపోయింది. హాల్స్ నుంచి ప్రతీది.. ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగణంగా సరిపోవడం లేదు. పైగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భవిష్యత్ కోసం కొత్తది కావాల్సిందే.. నరంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ఇలాంటి ప్రకటనే చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి.. భారీ వ్యయంతో పార్లమెంట్ నూతన భవనాన్ని నిర్మించింది కూడా. రేపు(ఆదివారం) పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ తరుణంలో ఆధునిక భారత దేశ చరిత్రలో కీలక ఘట్టాలకు ఏకైక ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పార్లమెంట్ ప్రస్థానాన్ని తిరగేద్దాం.. కౌన్సిల్ హౌజ్ నుంచి పార్లమెంట్ అనే గుర్తింపు దాకా.. బ్రిటిషర్ల కాలంలో చట్ట సభల ద్వారా మొదలై.. 76 ఏళ్ల ప్రజాసామ్య దేశానికి సంబంధించి మొదటి మీటింగ్ జరిగింది ఈ భవనంలోనే!. ఉభయ సభల్లోని సభ్యుల మధ్య వాదప్రతివాదనలు, చర్చలు, నేతల కీలక ప్రసంగాలు, ప్రభుత్వాల పని తీరుపై ఓటింగ్‌లు.. ఇలాంటి ఎన్నో ఘట్టాల ద్వారా అనుబంధాన్ని అల్లేసుకుంది. దాని చరిత్రను పరిశీలిస్తే.. 👉 1911లో కోల్‌కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. అందుకోసం న్యూఢిల్లీని నిర్మించాలనుకుంది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీ ప్రణాళికా దశకి చేరింది. ఆ సమయంలో తక్కువ సభ్యులున్న లెజిస్టేటివ్ కౌన్సిల్ కోసం గవర్నర్ జనరల్ నివాసం (ఇప్పుడున్న రాష్ట్రపతి భవన్) సరిపోతుంది కదా అని బ్రిటిష్ అధికారులు భావించారు. వేసవిలో సిమ్లాలోని వైస్రాయ్ లాడ్జ్‌లో, శీతాకాలంలో అప్పటి ఢిల్లీ సెక్రటేరియెట్ బిల్డింగ్‌లో (ఇప్పుడది ఢిల్లీ అసెంబ్లీగా ఉంది) భేటీ అయ్యేవాళ్లు. అయితే.. 👉 1918లో మాంటెగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు తెర మీదకు వచ్చాయి. దాని ప్రకారం.. చట్టసభల ప్రాధాన్యంతో పాటు... సభ్యుల సంఖ్యా పెరిగింది. ఎగువ, దిగువ సభలనేవి అమల్లోకి వచ్చాయి. వీటితో పాటు సిబ్బంది సంఖ్యా పెరిగింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు చేసింది. ఒకటి.. టెంట్ల కింద సభను నిర్వహించటం. రెండవది.. శాశ్వత భవంతిని నిర్మించడం. అలా.. 1921లో పార్లమెంట్ భవనానికి తొలి అడుగు పడింది. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ) తొలి భవంతి. 👉 న్యూ ఢిల్లీ నగర రూపశిల్పులు.. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూటెన్, హెర్బర్ట్ బేకర్లు ఎగువ, దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలను ప్రతిపాదించారు. ల్యూటన్ గుండ్రంగా, బేకర్ త్రికోణాకారంలో ప్రణాళికలు తయారు చేశారు. చివరకు ల్యూటన్ దానికే బ్రిటిష్ సర్కారు మొగ్గు చూపింది. 👉 1921 ఫిబ్రవరి 12న.. డ్యూక్ ఆఫ్ కానాట్ ‘ప్రిన్స్ ఆర్థర్’ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో నిర్మితమైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో.. 27 అడుగుల ఎత్తైన పిల్లర్లు 144 ను ఉపయోగించి.. ఈ అందమైన భవంతి నిర్మించారు. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా పక్కా ప్లాన్‌తో చాలా బలంగా ఈ నిర్మాణం జరిగింది. బహుశా అందుకేనేమో ఈ 96 ఏళ్ల కాలంలో.. పార్లమెంట్ భవనానికి జరిగిన రిపేర్ సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. 👉 మధ్యలో సెంట్రల్ హాల్, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు... చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. సెంట్రల్ హాల్ చుట్టూ ఉండే ఒక ఛాంబర్లో సంస్థానాధీశుల సభ (ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్), మరోదాంట్లో స్టేట్ కౌన్సిల్ (ఎగువ సభ, ప్రస్తుత రాజ్యసభ), మూడోదాంట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ, ప్రస్తుత లోక్‌సభ) ఉండేవి. 👉 మధ్యప్రదేశ్‌లోని చౌసత్ యోగిని దేవాలయాకృతి స్ఫూర్తితో పార్లమెంట్ భవనం నిర్మించారనే ఒక ప్రచారం కూడా నడుస్తుంటుంది. అలా మన పార్లమెంటు భవనం ప్రారంభం కాగా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. 👉 బ్రిటిషర్ల కాలంలో చట్టసభగా కొనసాగిన ఈ భవనం.. అధికార మార్పిడికి వేదికైంది. అంతేకాదు.. కొత్త ఏర్పాట్లు జరిగేదాకా మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటు కాంప్లెక్స్‌లోనే ఉండేది. 👉 స్థలాభావాన్ని అధిగమించటం కోసం 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు. అయినా స్థలం సరిపోయేది కాదు. 👉 సెంట్రల్ హాల్లో మూడోదైన లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే 1929లో విప్లవకారుడు భగత్‌సింగ్, ఆయన సహచరుడు బతుకేశ్వర్ దత్‌లు బాంబు విసిరారు. 👉 2001లో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడి జరిగింది పార్లమెంట్ భవనంపై. స్వతంత్ర భారతంలోని అత్యంత కీలక చట్టాలకు ఈ పార్లమెంట్ భవనమే ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీలాంటి చీకట్లతో పాటు స్వాత్రంత్య దినోత్సవ వేడుకల వెలుగుల్ని వీక్షించింది ఈ భవంతి. మహ మహా మేధావుల నేతృత్వంలో ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకే కాదు.. వివాదాలకు, నేతల వ్యక్తిగత విమర్శలకూ ఈ ప్రజాస్వామ్య సౌధం వేదికగా మారింది. 👉 నూతన భవన నిర్మాణంలో సుమారు 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు సాగాయి. సెంట్రల్ విస్టా వెబ్సైట్ ప్రకారం.. పాత పార్లమెంటు భవన నిర్మాణానికి అవసరమైన రాళ్లు, మార్బుల్స్ కోసమే రాళ్లు కొట్టేవాళ్లను, మేస్త్రీలను కలిపి 2,500 మందిదాకా అప్పట్లో నియమించారట. 👉 కార్యకలాపాలకు కొత్త పార్లమెంట్ భవనం ఉపయోగించినప్పటికీ.. పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చబోమని కేంద్రం ఇప్పటికే తెలిపింది. దానికి మరమత్తులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. పాత పార్లమెంటు భవనాన్ని దేశ పురావస్తు సంపదగా పరిరక్షిస్తామని తెలిపారు. ఆ అవసరం ఉంది కూడా. 👉 మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న టైంలో.. పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2500 ఏళ్ల నాటి భారతీయ విశిష్ట నాగరికత సంస్కృతులు ఇందులో అద్దంపట్టేలా ఏర్పాటు చేశారు. -
జాఫర్‌కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్‌కార్డ్; భలే దొరికాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు వెళ్లే దారిలో ఎలిమినేటర్‌ను క్లియర్ చేసి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 26(శుక్రవారం) గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్లో సీఎస్కేను చిత్తు చేసి ఆరోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇక బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై గెలుపుకు ప్రధాన కారణం ఆకాశ్ మధ్వాల్. తన సంచలన బౌలింగ్‌తో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రూ.20 లక్షల కనీస ధరకు మాత్రమే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ఆకాశ్ మధ్వాల్‌ను ముంబై తమ ట్రంప్‌కార్డ్‌గా భలే ఉపయోగించుకుంది. అంతకముందు లీగ్ దశలోనూ ప్లేఆఫ్ చేరాలంటే ఎస్ఆర్హెచ్పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లనూ ఆకాశ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఏడు మ్యాచ్‌లాడిన ఆకాశ్ మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. యార్కర్ల కింగ్ బుమ్రా లేని లోటును మధ్వాల్ తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా ఎదిగాడు. Photo: IPL Twitter ఎలిమినేటర్ లాంటి కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన మధ్వాల్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. జాఫర్ వెలికితీసిన ఆణిముత్యం.. ఆకాశ్ 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడటం విశేషం. అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కారణం. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో మధ్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడు. యూపీ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మధ్వాల్.. 2022-23 దేశవాళీ సీజన్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. Photo: IPL Twitter ఇంజనీర్ నుంచి క్రికెటర్‌గా.. పంత్ పొరుగింట్లో నివాసం 1993 నవంబర్ 23న ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని జన్మించిన ఆకాశ్ మధ్వాల్ ఇంజినీరింగ్ చదివాడు. అంతే కాదు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పొరుగింట్లోనే అతడు నివసిస్తుండటం విశేషం. వీరిద్దరూ అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గరే శిక్షణ పొందారు. 2019-20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కోసం.. ఆకాశ్ ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. 2019 డిసెంబర్ 25న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. Photo: IPL Twitter ఆర్సీబీ వదిలేసింది.. ముంబై ఒడిసిపట్టింది 2021లోనే ఆకాశ్ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఆర్సీబీ అతన్ని వేలంలో కొనుగోలు చేసినప్పటికీ.. ఆ సీజన్లో ఆడే అవకాశం లభించలేదు. 2022లో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2022 సీజన్లోనే సూర్యకుమార్ యాదవ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన వేలంలో రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. Photo: IPL Twitter ఈ సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. 2021 సీజన్లోనే ఆర్సీబీ ఆకాశ్‌కు అవకాశం ఇచ్చి ఉండుంటే.. ఆ జట్టులో అతడు బుమ్రాలా ఎదిగేవాడు. కానీ బెంగళూరు అవకాశం ఇవ్వకుండా అతన్ని వదిలేసుకోగా.. ముంబై మాత్రం ఆకాశ్‌ను ఆడించి ప్రయోజనం పొందింది. 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: #DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు! పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం -
కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి జెర్సీ నెంబర్ ఏంటని అడిగితే టక్కున వచ్చే సమాధానం '18'. నిజానికి 18 నెంబర్ జెర్సీ అనేది కోహ్లి తన తండ్రి జ్ఞాపకార్థం వేసుకుంటున్నట్లు చాలాసార్లు తెలిపాడు. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం(మే 18న) ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరిశాడు. నాలుగేళ్ల తన ఐపీఎల్ సెంచరీ నిరీక్షణకు తెరదించిన కోహ్లి ఆ సెంచరీ అందుకుంది మే 18 కావడంతో మరోసారి అతని జెర్సీ నెంబర్ ప్రస్తావనకు వచ్చింది. Photo: IPL Twitter మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ జెర్సీ నెంబర్-18పై మరోసారి స్పందించాడు. నిజాయితీగా చెప్పలాంటే అండర్-19 క్రికెట్ ఆడేటప్పుడే నాపేరుతో 18 నెంబర్ జెర్సీ ఇచ్చారు. ఆ క్షణం 18 అనేది నా జీవితంలో ప్రత్యేకంగా మారబోతుందన్నది అప్పటికి తెలియదు. యాృదృశ్చికంగా నేను క్రికెట్లో అడుగుపెట్టింది ఆగస్టు 18న.. నా తండ్రి చనిపోయింది డిసెంబర్ 18న.. రెండు ముఖ్య సంఘటనలు ఒకే తేదీన జరగడం ఎప్పటికి మరిచిపోను అని చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. కోహ్లి 18 నెంబర్ వెంటపడినట్లు అనిపించడం లేదు.. అతని వెనకాలే 18 వస్తున్నట్లు తెలుస్తోంది. Photo: IPL Twitter '18' నెంబర్‌తో కోహ్లికున్న అనుబంధం.. ► ఎస్ఆర్హెచ్తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో(మే 18, 2023) కోహ్లి సెంచరీ చేసింది '18' వ ఓవర్లోనే. సిక్సర్ కొట్టి కోహ్లి సెంచరీ మార్క్ అందుకున్నాడు. ►కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది 2008 ఆగస్టు 18 నాడే. ►చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కోహ్లి సెంచరీ చేసింది కూడా '18' వ తేదీనే. మార్చి 18, 2012లో ఢాకాలో పాక్‌తో జరిగిన వన్డేలో విరాట్ 183 పరుగులు చేశాడు. యాదృశ్చికంగా అతను ఆరోజు చేసిన పరుగుల్లోనూ '18' కనిపించడం విశేషం. ►ఇక కోహ్లి టెస్టుల్లో రెండు శతకాలను ఇదే రోజున బాదాడు. 18 ఆగస్టు 2018లో ఇంగ్లండ్‌పై 103 పరుగులు.. 2013 డిసెంబర్ 18న దక్షిణాఫ్రికాపై 119 పరుగులు చేశాడు. ►ఇక కోహ్లి 17 ఏళ్ల వయసులో అతని తండ్రి ప్రేమ్ కోహ్లి 2006 డిసెంబర్ '18' వ తేదీన తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ సమయంలో కోహ్లి రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. తండ్రి మరణ వార్తను దిగమింగి మ్యాచ్ ఆడిన కోహ్లి 90 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ►ఇక కోహ్లి జెర్సీ నెంబర్ '18' కి మరో ప్రత్యేకత కూడా ఉంది. కోహ్లి తండ్రి ప్రేమ్ కోహ్లి క్రికెట్ ఆడే రోజుల్లో 18 నెంబర్ జెర్సీనే వేసుకోవడం విశేషం. అందుకే కోహ్లి తన తండ్రి జ్ఞాపకార్థం అదే నెంబర్ జెర్సీతో కనిపిస్తున్నాడు. చదవండి: కోహ్లి ఫిదా.. తెలుగోళ్ల అభిమానమే వేరప్పా! నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో మెరిసిన 'కింగ్' కోహ్లి -
గుజరాత్ ఇప్పటికే; పోటీలో ఏడుజట్లు.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు?
ఐపీఎల్ 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. గతేడాది ఛాంపియన్స్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ సోమవారం ఎస్ఆర్హెచ్పై విజయంతో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్లు అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో చివరి 8 లీగ్ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఛాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ Photo: IPL Twitter మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్ లు ఆడి 7 గెలిచింది. ఐదు ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. 15 పాయింట్లు, 0.381 నెట్ రన్‌రేట్ తో సీఎస్కే రెండో స్థానంలో ఉంది. డీసీతో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. అయితే టాప్ 2లో ఉంటుందా అన్నది మాత్రం మిగతా టీమ్స్ గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఇక చివరి మ్యాచ్ ఓడిపోతే సీఎస్కే ఇంటిదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. మరో ఐదు జట్లు 15 పాయింట్ల కంటే ఎక్కువ సాధించే వీలు ఉండటమే దీనికి కారణం. అయినా అన్ని మ్యాచ్ ల ఫలితాలు సీఎస్కేకు అనుకూలంగా వస్తే.. ఆ టీమ్ చివరి మ్యాచ్ లో ఓడినా క్వాలిఫై అవుతుంది. ముంబై ఇండియన్స్ Photo: IPL Twitter 12 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ ఏడు గెలిచి, ఐదు ఓడిపోయింది. 14 పాయింట్లు, -0.117 నెట్ రన్ రేట్‌తో ఆ టీమ్ మూడోస్థానంలో ఉంది. లక్నో, హైదరాబాద్ లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తే టాప్ 2లో ముంబై క్వాలిఫై అవుతుంది. ఒకటి గెలిచి, మరొకటి ఓడితే 16 పాయింట్లతో మిగతా టీమ్స్ గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ రెండింట్లోనూ ఓడితే కష్టమే. అప్పటికీ అవకాశం ఉన్నా.. నాలుగోస్థానం కోసం మరో మూడు టీమ్స్ తో పోటీ ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ Photo: IPL Twitter లక్నో సూపర్ జెయింట్స్ 12 ఆడి 6 గెలిచి, ఐదు ఓడిపోయింది. ఒకటి ఫలితం తేలలేదు. 13 పాయింట్లు, 0.309 నెట్ రన్‌రేట్ తో నాలుగోస్థానంలో ఉంది. ముంబై, కేకేఆర్‌తో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తేనే లక్నో ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒకటి గెలిచి, మరొకటి ఓడితే నెట్ రన్‌రేట్ తో సంబంధం లేకుండా మిగతా ఫలితాలు లక్నోకు అనుకూలంగా వస్తే అర్హత సాధిస్తుంది. రెండూ ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Photo: IPL Twitter ఆర్సీబీ 12 ఆడి, ఆరు గెలిచి, మరో ఆరు ఓడింది. 12 పాయింట్లు, 0.166 నెట్ రన్‌రేట్ తో ఐదో స్థానంలో ఉంది. సన్ రైజర్స్, జీటీతో మ్యాచ్ లు ఉన్నాయి. ఆర్ఆర్ పై భారీ విజయం ఆర్సీబీ అవకాశాలను మెరుగుపరిచింది. నెట్ రన్‌రేట్ పాజిటివ్ గా ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిస్తే 16 పాయింట్లతో ఆ టీమ్ అర్హత సాధించే అవకాశాలు ఉంటాయి. ఒకటి గెలిచి మరొకటి ఓడితే మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిందే. రాజస్థాన్ రాయల్స్ Photo: IPL Twitter గతేడాది రన్నరప్స్ రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లలో ఆరు గెలిచి, ఏడు ఓడిపోయింది. 12 పాయింట్లు, 0.140 నెట్ రన్‌రేట్ తో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఆర్సీబీ చేతుల్లో దారుణమైన ఓటమి ఆర్ఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. చివరి మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిందే. అప్పటికీ మిగతా మ్యాచ్ ల ఫలితాలను బట్టే ఆర్ఆర్ క్వాలిఫై అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఆర్సీబీ, లక్నో తమ చివరి రెండు మ్యాచ్ లు ఓడటంతోపాటు సన్ రైజర్స్ తమ చివరి మ్యాచ్ లో ముంబై చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితేనే ఆర్ఆర్ చివరి మ్యాచ్ గెలిస్తే అర్హత సాధిస్తుంది. ఇక ఓడితే మాత్రం ఇంటికే. పంజాబ్ కింగ్స్ Photo: IPL Twitter పంజాబ్ కింగ్స్ 12 ఆడి ఆరు గెలిచి, ఆరు ఓడింది. 12 పాయింట్లు, -0.288 నెట రన్‌రేట్ తో ఏడో స్థానంలో ఉంది. డీసీ, ఆర్ఆర్ లతో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే పంజాబ్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే నెట్ రన్‌రేట్ నెగటివ్ గా ఉండటంతో భారీ విజయాలు సాధించడంతోపాటు ఇతర జట్ల నుంచి కూడా సాయం అందాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటి ఓడినా నాలుగోస్థానం కోసం మరో నాలుగు టీమ్స్ తో పోటీ పడాల్సి వస్తుంది. మిగిలిన రెండు మ్యాచ్ లనూ పంజాబ్ కింగ్స్ ధర్మశాలలో ఆడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ Photo: IPL Twitter కేకేఆర్ 13 మ్యాచ్ లు ఆడి ఆరు గెలిచి, ఏడు ఓడింది. 12 పాయింట్లు, -0.256 నెట్ రన్‌రేట్ తో 8వ స్థానంలో ఉంది. లక్నోతో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే టాప్ 4లో ముగించే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి. లక్నో మిగిలిన రెండు మ్యాచ్ లు, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ కనీసం ఒక్కో మ్యాచ్ లో ఓడాల్సి ఉంటుంది. కేకేఆర్ నెట్ రన్ రేట్ కూడా నెగటివ్ గా ఉండటంతో ఆ టీమ్ క్వాలిఫై అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చదవండి: మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి -
#HBD Sachin: సచిన్ క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే!
సచిన్‌ను క్రికెట్‌కు దేవుడంటారు. ఎందుకంటే క్రికెట్ అనే విశ్వమతంలో ఆ దేవుడు చేసిన అద్భుతాలు అలాంటివి. మరి ఆ దేవుడికి అభిమానులనే భక్తులు ఉండడం సహజమే కదా. అందులో ప్రియ భక్తులు వేళ్ల మీద లెక్కపెట్టేలా ఉంటారు. శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాగో.. సచిన్‌కు సుధీర్ సుకుమార్ చౌదరీ అలాగ!. గుండెల నిండా సచిన్‌ను నింపేసుకున్న సుధీర్.. ఆయన మ్యాచ్ ఆడే సమయంలో మువ్వన్నెల రంగును ఒళ్లంతా పూసుకుని.. చేతిలో జెండాతో ప్రేక్షకుల గ్యాలరీలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. కేవలం సచిన్ కోసమే వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసిన సుధీర్ గురించి.. ఇవాళ్టి సచిన్ పుట్టినరోజు సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుంటూ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏప్రిల్ 24న(సోమవారం) సచిన్ 50వ పడిలోకి అడుగుపెట్టారు. క్రికెట్లో లెక్కకు మించి సాధించిన రికార్డులు ఎన్నో. వంద సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అందుకే సచిన్ అభిమానించేవారు కోట్లలో ఉండేవారు. కానీ ఆ కోట్లాది మంది అభిమానుల్లో కొందరు ప్రత్యేకంగా కనిపించేవారు. ఆ కొందరిలోనూ మరింత ప్రత్యేకంగా కనిపించాడు సుదీర్ కుమార్ చౌదరీ. 👉 శరీరాన్ని మొత్తం భారతీయ జెండాలోని త్రివర్ణ రంగులతో నింపుకొని ఛాతిపై సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ ముద్రించుకొని చేతిలో జాతీయ జెండాను పూని టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడితే అక్కడికి ఒక సైకిల్‌పైనే వెళ్లి మ్యాచ్‌లను చూసేవాడు. అలా సచిన్ ఆటను.. టీమిండియా మ్యాచ్‌లను చూడడం కోసం దేశం మొత్తం తిరిగిన ఘనత అతని సొంతం. మరి సుదీర్ కుమార్ జీవితం ఎలా సాగిందన్నది ఆసక్తికరం ఆరేళ్ల వయసులోనే సచిన్‌కు వీరాభిమాని.. 👉 ఆరేళ్ల వయసులోనే సచిన్‌కు వీరాభిమానిగా మారిపోయిన సుదీర్ కుమార్ చౌదరీ 1982లో బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో కడు పేదరిక కుటుంబంలో పుట్టాడు. ఆరేళ్ల వయసులో సచిన్‌పై ఇష్టం పెంచుకున్న సుధీర్ 14 ఏళ్ల వయసులో తన చదువును వదిలేశాడు. నిరుద్యోగి అయిన అతను కొన్నాళ్లు పాల కంపెనీలో చిరుద్యోగిగా పనిచేశాడు. ఆ తర్వాత టీటీసీ ట్రైనింగ్ తీసుకొని కొంతకాలం టీచర్‌గా పనిచేశాడు. కానీ ఇవేవి అతనికి ఆత్మసంతృప్తిని ఇవ్వలేకపోయాయి. 👉 సచిన్‌పై ఉన్న అభిమానం అతని పెళ్లి వాయిదా వేసుకునే వరకు వెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే సుధీర్ అలా బతకడం కుటుంబసభ్యులకు నచ్చలేదు. తీరు మార్చుకోకుంటే ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు. తల్లిదండ్రుల మాటను ఖాతరు చేయని సుధీర్ కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకి వచ్చేశాడు. తన జీవితం క్రికెట్ మ్యాచ్‌లకే అంకితమని తీర్మానం చేసుకున్న సుధీర్.. పబ్లిక్ సపోర్ట్‌తో వచ్చిన డబ్బులతో స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌లను చూసేవాడు. 👉2003 అక్టోబర్ 28న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా సచిన్ ఆటను చూడడం కోసం సుదీర్ పెద్ద సాహసమే చేశాడు. దాదాపు 21 రోజుల పాటు ముజఫర్‌పుర్ నుంచి మ్యాచ్ జరిగిన ముంబైకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. ఈ మ్యాచ్ ద్వారానే తొలిసారి సుదీర్ కుమార్ చేతిలో భారత జెండాను పట్టుకొని రెపరెపలాడించడం మొదలుపెట్టాడు. ఇక 2010 వరకు దాదాపు 150 మ్యాచ్‌లు వీక్షించడం విశేషం. ఉపఖండపు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో భారత్ ఆడిన సిరీస్‌లకు సైకిల్‌పైనే వెళ్లడం ఆటపై అతనికున్న అభిమానిన్ని చూపిస్తోంది. సచిన్‌ను మెప్పించిన అభిమాని.. పోలీసుల క్షమాపణ 👉2010లో కాన్పూర్ వేదికగా టీమిండియా మ్యాచ్ ఆడేందుకు వచ్చింది. అయితే ప్రాక్టీస్సెషన్ సమయంలో సచిన్‌తో కరచాలనం చేయడానికి సుదీర్ కుమార్ ప్రయత్నించాడు. కానీ పోలీసులు సుదీర్ పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు. ఇది గమనించిన సచిన్ టెండూల్కర్ నేరుగా పోలీసుల వద్దకు చేరుకొని.. అతను నా వీరాభిమాని.. అతను నాకు ఫ్యాన్ కాదు.. నేనే అతని ఫ్యాన్‌ను అని చెప్పాడు. 👉 దిగ్గజం సచిన్ ఆ మాట అనడంతోనే పోలీసులు సుదీర్ కుమార్‌ను క్షమాపణ కోరారు. అలా క్రికెట్ దేవుడిని మెప్పించిన ఘనత సుదీర్ కుమార్‌కే దక్కింది. ఈ సంఘటన తర్వాత సుధీర్ కుమార్ అభిమానానికి పడిపోయిన బీసీసీఐ.. అప్పటినుంచి టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు అతని టికెట్‌కు స్పాన్సర్ చేయడం మొదలుపెట్టింది. 👉 2011 వన్డే వరల్డ్‌కప్.. మరిచిపోలేని క్షణం సుదీర్ కుమార్ జీవితంలో 2011, ఏప్రిల్ 2.. మరిచిపోలేని క్షణాలు. ధోని నేతృత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన రోజు కావడంతో యావత్ భారతావని పులకించిపోయింది. భారత్ డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు మొదలయ్యాయి. ఆ సమయంలో సచిన్ సుదీర్ చౌదరీని డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాడు. జహీర్ ఖాన్ చేతుల మీదుగా వరల్డ్‌కప్ ట్రోఫీ అందుకున్న సుదీర్.. సచిన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. 👉 తన అభిమాన క్రికెటర్ అలా పిలిచి కప్ చేతిలో పెట్టడంతో ఎమోషనల్ అయిన సుదీర్‌ను సచిన్ హగ్ చేసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. వరల్డ్‌కప్ ట్రోఫీతో భారత్.. భారత్ అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. క్రికెట్ చరిత్రలోనే ఇదొక అద్బుత ఘట్టమని చెప్పొచ్చు. తనను అంతగా ప్రేమించిన ఒక అభిమాని సంతోషపెట్టిన సచిన్ పేరు అప్పట్లో మార్మోగిపోయింది. 👉ఇక సచిన్ తన రిటైర్మెంట్ రోజున సుదీర్ చౌదరీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. నా 24 ఏళ్ల కెరీర్లో 14 ఏళ్ల పాటు నాపై అభిమానంతో ప్రతీ మ్యాచ్‌కు హాజరై టీమిండియాను ఆశీర్వదించిన సుదీర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాంటి అభిమాని నాకుండడం గర్వకారణం అని చెప్పుకొచ్చాడు. సచిన్ రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్ల పాటు ధోని అభిమానిగా మారిన సుదీర్ పలు మ్యాచ్‌లకు అతని జెర్సీ నెంబర్ ముద్రించుకొని వచ్చాడు. కానీ ఈ మధ్యన సుదీర్ కుమార్ చౌదరీ పెద్దగా కనిపించడం లేదు. అలా సచిన్ ఉన్నంతకాలం అతని ఆటను చూస్తూ సంతోషపడిన సుదీర్.. భారత్ క్రికెట్లో ఎప్పటికి గుర్తుండిపోయే అభిమానిగా మిగిలిపోవడం ఖాయం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అసలు క్లియోపాత్రా ఏ కలర్? నెట్‌ఫ్లిక్స్‌తో ఎందుకీ రచ్చ!
స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కి మరో వివాదపు సెగ తగిలింది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ఆఫ్రికన్ క్వీన్స్: క్వీన్ క్లియోపాత్ర’ ట్రైలర్ ద్వారానే రచ్చ రేపింది. చరిత్రలో ఉన్న బ్లాక్ క్వీన్స్‌ను హైలెట్ చేస్తూ నిర్మించిన ఈ సిరీస్‌లో క్లియోపాత్ర మీద తీసిన పోర్షన్ ట్రైలర్‌పై ఈజిప్ట్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం.. క్లియోపాత్రా పాత్ర కోసం ఓ బ్లాక్ ఆర్టిస్ట్‌ను ఎంచుకోవడం!. క్వీన్ క్లియో పాత్రా దేహం నలుపు రంగు కాదని.. ఆమె ఛామన ఛాయ రంగులో ఉండేదని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ జాహి హవాస్ నెట్‌ఫ్లిక్స్ క్వీన్ క్లియోపాత్రాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెది యూరోపియన్ మూలాలని చెప్తున్నారాయన. క్లియోపాత్రా గ్రీకుకు చెందిన వ్యక్తి. మాసిడోనియా రాజులు, రాణులతో ఆమెకు దగ్గరి పోలికలు ఉన్నాయి అని పేర్కొన్నారు. మరోవైపు క్లియోపాత్ర రంగును నలుపుగా చూపించడం ద్వారా.. ఆమె ఈజిప్ట్ గుర్తింపును తుడిచేసే ప్రయత్నం జరుగుతోందంటూ మహమొద్ అల్ సెమారీ అనే లాయర్ ఈజిప్ట్ అటార్నీ జనరల్‌కు ఓ విజ్ఞప్తి సమర్పించాడు. ఈజిప్ట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఆ వివాదాస్పద సిరీస్ ప్రసారం కాకుండా చూడాలంటూ కోరారాయన. అయితే.. ఇది అనవసర వివాదమంటోంది ఈ సిరీస్ నిర్మాణంలో భాగం పంచుకున్న జడా పింకెట్ స్మిత్(విల్‌స్మిత్ భార్య). ఇది కేవలం బ్లాక్ క్వీన్స్ గురించి, వాళ్ల గొప్పదనం గురించి చెప్పడమేగానీ ఇతర ఉద్దేశం లేదని ఆమె ఆంటోంది. అయినప్పటికీ.. ఈజిప్ట్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహంతో ఊగిపోతోంది. బ్యాన్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండ్‌ను నడిపిస్తోంది అక్కడి సోషల్ మీడియా. హిస్టరీ ఐకాన్.. క్లియోపాత్రా గ్రేట్ ఫిగర్స్ ఆఫ్ హిస్టరీలో ఒకరిగా పేరుంది క్లియోపాత్రాVII ఫిలోపేటర్కి. ముందున్న ఆరుగురు క్లియోపాత్రాల్లో ఎవరికీ లేని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఈమె గురించి ఇంత చర్చ. రాజకీయ వ్యూహాలు రచించడంలో క్లియోపాత్రాVII సిద్ధహస్తురాలని, కొన్ని సార్లు ఆమె ఎత్తులకు చక్రవర్తులే చిత్తయిపోయేవారని చరిత్ర చెబుతుంది. అంతేకాదు.. గొప్ప అందగత్తె అయినప్పటికీ శారీరక సుఖం కోసం ఆమె ఎంతదాకా అయినా వెళ్తుందనే ప్రచారమూ ఒకటి ఉంది. 👉 క్రీస్తు పూర్వం 48లో ఆమె ఈజిప్ట్‌ను మహారాణిగా పాలించారు. ఆమె ఈజిప్టులోని అలెగ్జాండ్రియలో క్రీస్తు పూర్వం 69లో జన్మించారు. టాలమీ వంశస్థురాలైన క్లియోపాత్రా.. పాలనలోనే కాదు పలు రంగాల్లోనూ నేర్పరి. బహుభాషా కోవిదురాలు. గొప్ప రచయిత. కాస్మోటిక్స్, హెయిర్ కేర్ మీద ఆమె ఓ పుస్తకం కూడా రాశారట. 👉 క్లియోపాత్రా అధికారం కోసం.. సోదరి బైరినైస్, తండ్రి 12వ టాలెమీ మరణాంతరం రాజైన సోదరుడు 13వ టాలెమీ (ఆచారం ప్రకారం.. ఇతన్నే వివాహం చేసుకుని ఈజిప్ట్‌కు రాణి అయ్యింది) పథకం ప్రకారం అడ్డు తొలగించుకుంది. ఆపై ఇరవై ఏళ్లపాటు ఈజిప్ట్‌ను పాలించింది క్లియోపాత్రా. 👉 రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్, అతని కుడిభుజం మార్కస్ ఆంటోనియస్లతో క్లియోపాత్రా రొమాంటిక్ రిలేషన్షిప్ నడిపింది. 👉 క్లియోపాత్రాతో జూలియస్ సీజర్ బంధాన్ని రోమన్ సైన్యాధికారులు తట్టుకోలేకపోయారు. తిరుగుబాటు చేశారు. ఆ పరిణామంతో మనస్తానం చెంది.. కత్తితో పొడుచుకుని క్లియోపాత్రా ఒడిలోనే చనిపోయాడని ఓ కథనం, శత్రువుల చేతిలోనే మరణించాడని మరో కథనం ప్రచారంలో ఉంది. 👉 క్లియోపాత్రా ఒకానొక సమయంలో నిరాదరణకు గురవడంతో తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పాముతో తన వక్షోజాలకు కాటు వేయించుకుని మరీ ప్రాణం విడిచింది. ఆమెతోపాటు ఆమె చెలికత్తెలు కూడా అదే విధంగా చనిపోయారు. అయితే.. ఇది ఒక వర్షన్. ఆమెకు ఎవరో విషం ఇచ్చి చంపారు. ఇది రెండో వర్షన్. దీంతో.. క్లియోపాత్రా మరణం చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోయింది. 👉 టాలోమీ రాజవంశం.. మొదటి శతాబ్దం BCలో రోమన్ ఆక్రమణతో ముగిసింది. 👉 క్లియోపాత్రాకు మొత్తం 4 మంది సంతానమని ఈజిప్ట్ చరిత్ర పుస్తకాలు చెబుతుంటాయి. కానీ వారిలో ఒక్కరు మాత్రమే బతికారట. ఆమె క్లియోపాత్రా సెలిన్. 👉 క్లియోపాత్రా నల్లజాతి మూలాలున్న వ్యక్తేనని ఆఫ్రోసెంటిస్ట్ స్కాలర్స్ ప్రతిపాదించారు. కానీ, చాలామంది మేధావులు మాత్రం ఆమె అందగత్తె కాబట్టే చక్రవర్తులు వెర్రెత్తిపోయారని చెబుతూ ఆ వాదనను కొట్టేశారు. కొసమెరుపు.. క్లియోపాత్రాను ఆఫ్రికన్ సంతతి వ్యక్తిగా చూపించిన ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్ నటి అడెలె జేమ్స్ లీడ్రోల్లో నటించింది. :::సాక్షి వెబ్ ప్రత్యేకం -
సోనియాకు అడ్డుపడి చిన్నమ్మ శపథం! ఆనాడు అలా జరగకపోయి ఉంటే..
దేశంలో కుటుంబ, వారసత్వ రాజకీయాలు వేళ్లానుకునిపోయిన సమయం అది. ఆ సమయంలో.. భర్త చనిపోవడంతో ఆమెనే ప్రధాని అవుతుందని అంతా భావించారు. కానీ, పీఎం పదవితో పాటు పార్టీ పగ్గాలనూ వద్దనుకుని పార్టీ క్యాడర్‌ను, యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేశారామె. దాదాపు అర్ధదశాబ్దంపాటు రాజకీయం ఊసే ఎత్తలేదు. అయితే.. పార్టీ అంతర్గత సంక్షోభం, ఎన్నికల్లో దారుణ ఓటమి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దశాబ్దంపాటు పవర్ఫుల్ ఉమెన్‌గా ప్రపంచాన్ని ఆకట్టుకోలిగారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా.. సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ తన మార్క్ చూపిస్తూ పరిస్థితులను కొంతైనా చక్కబెడుతూ వచ్చారు. సోనియా గాంధీ.. అప్పటిదాకా రాజీవ్ గాంధీ సతీమణి. భర్త మరణాంతరం దాదాపు అర్థదశాబ్దంపాటు రాజకీయాల్లోకి రావడానికి అనాసక్తిని కనబరిచారు. అయితే.. 1996 ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ ఛిన్నాభిన్నం అయ్యింది. మూకుమ్మడిగా సీతారాం కేసరి నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. పార్టీలోని చాలామంది సొంత కుంపట్లను ఏర్పాటు చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో.. కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఒత్తిళ్లు పెరిగాయి. ఆ పరిణామాల నడుమ రాజకీయాల్లోకి అన్యమనస్కంగానే అడుగుపెట్టారామె. 1997 కలకత్తా(కోల్‌కతా)లో జరిగిన ప్లీనరీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం పుచ్చుకున్నారామె. ఆపై 62 రోజులకే ఆమెకు పార్టీ బాధ్యతలు ఆఫర్ చేయగా.. అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారు . అయితే.. ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమె పేరు తెర మీదకు రావడంతో.. 1999 మే నెలలో పార్టీలో సీనియర్లు ముగ్గురు వ్యతిరేక గళం వినిపించారు. విదేశీ మూలాలు ఉన్న ఆమె.. భారత్‌కు ఎలా ప్రధాని అవుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. పార్టీకి రాజీనామా చేసేసి బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారామె. కానీ, ఆమెను నిలువరించిన పార్టీ.. ఆ ముగ్గురు రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ ముగ్గురే శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్.. వాళ్లు స్థాపించుకున్న పార్టీనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. వీళ్లే కాదు.. పార్టీ నుంచి బయటకు వచ్చిన మరికొందరు సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు కూడా. ఇది ఆమె ప్రధాని పదవికి అడ్డు తగిలిన మొదటి సందర్భం. 1999 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీ.. కర్ణాటక బళ్లారి నుంచి, ఉత్తర ప్రదేశ్ అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారామె. ఈ రెండింటిలో ఆమె అమేథీనే ఎంచుకున్నారు. ఇక బళ్లారిలో ఆమె ఓడించింది ఎవరినో తెలుసా?.. చిన్నమ్మగా పేరొందిన సుష్మా స్వరాజ్‌ను. సోనియాగాంధీ బంపర్‌మెజార్టీతో నెగ్గినప్పటికీ.. వాజ్‌పేయి పేరు, ఛర్మిష్మా, ఇతరత్రా కారణాలతో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ఆ సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగారామె. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగ్గా.. అవతలి అభ్యర్థి జితేంద్ర ప్రసాదను 97 శాతం మార్జిన్‌తో ఓడించారామె. అప్పటి నుంచి ఓటింగ్ లేకుండానే ఆమె ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అంతేకాదు.. 2003లో ఏకంగా వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారామె. అధికారంలోకి యూపీఏ కూటమి 2004 సార్వత్రిక ఎన్నికల్లో.. సోనియా గాంధీ ఆమ్ ఆద్మీ(ఆర్డీనరీ మ్యాన్) పేరుతో దేశవ్యాప్త ప్రచారం నిర్వహించారు. అప్పటికే బీజేపీ ఇండియా షైనింగ్ పేరుతో ప్రచారంలో ఉంది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఊహించని పరాభవం ఎదురైంది. ఆ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి.. 2 లక్షలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు సోనియా గాంధీ. దాదాపు 15 పార్టీల కూటమి యూపీఏ పేరుతో కేంద్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. ఈ ఎన్నికల విజయంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీనే దేశానికి ప్రధాని కాబోతున్నారంటూ చర్చ మొదలైంది. కానీ.. ► ప్రతిపక్ష కూటమి సోనియా ప్రధాని కాకుండా మోకాలడ్డింది. సుష్మా సర్వాజ్ అయితే ఏకంగా హెచ్చరికలకే దిగారు. సోనియా గనుక దేశానికి ప్రధానిని చేస్తే.. తాను గుండు చేయించుకుంటానని, కటిక నేలపై నిద్రిస్తానని శపథం చేసి.. రాజకీయ దుమారం రేపారు. మరోవైపు ఎన్డీయేలోని పక్షాలు న్యాయపరమైన కారణాలు చూపించి అభ్యంతరాలు లేవనెత్తారు. భారత పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 5 ప్రకారం.. కోర్టును ఆశ్రయించారు. కానీ, కోర్టు ఆమెకు ఊరటనే ఇచ్చింది. ► రాజకీయంగా చెలరేగుతున్న రగడ కారణంగా.. ప్రధాని పదవి చేపట్టకూడదనే నిర్ణయానికి వచ్చారామె. బదులుగా ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి నామినేట్ చేశారామె. పార్టీ నేతలు కూడా అందుకు అంగీకరించారు. ఆ సమయంలో ఆమె త్యాగనీరతిని అభిమానులు ఆకాశానికెత్తగా.. పొలిటికల్ స్టంట్ అంటూ ప్రత్యర్థులు పెదవి విరిచారు. ఇది రెండోసారి. ► ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వివాదం కారణంగా.. ఎంపీ పదవికి, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ పదవికి ఆమె రాజీనామా ప్రకటించారు. ఆపై 2006 మే నెలలో జరిగిన ఉప ఎన్నికలో రాయ్ బరేలీ నుండి 400,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► 2009లో ఆమె నాయకత్వంలోనే మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కేంద్రంలో కొలువు దీరింది. ఆ ఎన్నికల్లో 206 లోక్‌సభ సీట్లు గెలవగా.. 1991 నుంచి అప్పటిదాకా ఏపార్టీ కూడా అంత సీట్లు గెలవకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లోనూ రాయ్ బరేలీ నుంచి ఆమె గెలుపొందారు. ► 2013లో.. పదిహేనేళ్లపాటు వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా పని చేసిన వ్యక్తి రికార్డును నెలకొల్పారామె. ► 2013లోనే.. ఎల్జీబీటీ హక్కులను బలపరుస్తూ ఐపీసీ సెక్షన్ 377 మద్దతు ప్రకటించారు. ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. కాంగ్రెస్‌కు 44, మొత్తంగా యూపీఏ కూటమికి 59 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే.. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ గెలుపొందారు. ► అదే ఏడాదిలో తెలుగు రాష్ట్రాల విభజన ద్వారా సోనియమ్మగా పార్టీ నేతలచేత పిలిపించుకున్నారామె. ► ప్రతిపక్షాన్ని బంధించే జిగురు లాంటి వ్యక్తి సోనియా. ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు వామపక్ష దిగ్గజ నేత సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి. కాంగ్రెస్ పగ్గాలు సోనియాకా? రాహుల్‌కా? అనే చర్చ నడిచిన సమయంలో ఆయన సోనియాకే ఓటేశారు. ► 2016 నుంచి ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. 2017 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి 49వ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. తిరిగి.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె ప్రచారం ద్వారా తెర మీదకు వచ్చారు. బీజాపూర్‌లో ఆమె బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అదే సమయంలో బీజాపూర్ పరిధిలోని ఐదు స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. జనతా దళ్ (సెక్యులర్)తో పోత్తు విషయంలోనూ ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. ► 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్-యూపీఏ కూటమి ఓటమిపాలైంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో.. తిరిగి సోనియా గాంధీకే పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ► కాంగ్రెస్‌కు కుటుంబ పార్టీ అనే మచ్చ చెరిపేసేందుకు.. శాశ్వత అధ్యక్ష ఎన్నిక జరగాలని, ఆ నాయకత్వంలోనే 2024 ఎన్నికలకు వెళ్లాలని సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఆమె అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. అయితే గెహ్లాట్ ఎన్నికల బరి నుంచి తప్పుకోగా.. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించి కాంగ్రెస్‌కు గాంధీయేతర కుటుంబ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ► 1999లో అమేథీ నుంచి 4,18,960 ఓట్లు(67.12 శాతం ఓటు షేర్), బళ్లారి నుంచి 4,14,650 ఓట్లు(51.70 శాతం ఓటు షేర్) మెజార్టీతో ఆమె నెగ్గారు. ఆ తర్వాత 2004 ఎన్నికలో రాయ్ బరేలీ నుంచి 3,90,179 ఓట్ల మెజార్టీతో.. 2006 ఉప ఎన్నికలో ఏకంగా 4,74,891 ఓట్ల మెజార్టీతో ఆమె నెగ్గారు. తిరిగి 2009 ఎన్నికలో 4,81,490 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో 5,26,434 ఓట్ల మెజార్టీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 5,34,918 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ప్రతీ ఎన్నికకు ఆమె విక్టరీ మెజార్టీ గణనీయంగా పెరుగుతూ పోవడం గమనార్హం. ► 2004-14 అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో దేశంలో శక్తివంతమైన మహిళలు, ప్రభావశీలుర జాబితాలోనూ ఆమె ప్రతీ ఏడాది నిలుస్తూ వచ్చారు. ► 2007లో టైమ్స్ మ్యాగజైన్.. టాప్ 100 ప్రభావశీలుర జాబితాలో సోనియా గాంధీకి చోటు ఇచ్చింది. ► 2013లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల్లో 21వ ర్యాంక్, మహిళల్లో 9వ ర్యాంక్ కట్టబెట్టింది. ► మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా.. 2007 అక్టోబర్ 2వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ఆమె ప్రసంగించారు. ఆనాటి నుంచి గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తూ వస్తున్నారు(ఐరాసలో తీర్మానం పాస్ అయ్యింది 2007 జులై 15న). ► నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్‌గా, యూపీఏ చైర్‌పర్సన్‌గానూ ఆమె కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. అందులో నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టంగా మారడం అనే రెండు ప్రధానమైనవి ఉన్నాయి. రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) కాంగ్రెస్ ప్లీనరీలో 76 ఏళ్ల సోనియా గాంధీ ప్రసంగిస్తూ.. పొలిటికల్ రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చిన సందర్భంలో.. -
కథ కంచికి.. హెచ్‌సీఏకు తగిన శాస్తి
వెంకటపతిరాజు, మహ్మద్ అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇలా ఆణిముత్యం లాంటి క్రికెటర్లను దేశానికి అందించిన ఘనత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ది(హెచ్‌సీఏ). అలాంటి హెచ్‌సీఏ ఇవాళ అంతర్గత కుమ్ములాటలు, చెత్త రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయింది. ఇంత జరుగుతున్నా బీసీసీఐ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ సుప్రీం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీ హెచ్‌సీఏ వ్యవహరాలను చూసుకుంటుందని తెలిపింది. ఇన్నాళ్లుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన హెచ్‌సీఏ కథ చివరికి ఇలా ముగిసింది. టాలెంటెడ్ ఆటగాళ్లను పట్టించుకోకుండా ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారినే ఆడించడం హెచ్‌సీఏలో కామన్‌గా మారిపోయింది. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలోనూ హైదరాబాద్ జట్టు దారుణ ప్రదర్శనను కనబరిచింది. నాలుగు రోజుల మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి నిండా ఒక్కరోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేక.. సరిగా బౌలింగ్ చేయలేక చేతులెత్తేస్తున్నారు. టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో పరాజయం.. ఒక మ్యాచ్ డ్రాతో ఒక్క పాయింటుతో గ్రూప్-బి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. రంజీలో పాల్గొన్న మిగతా రాష్ట్రాల జట్లు ఆటలో ముందుకు వెళుతుంటే.. హెచ్‌సీఏ మాత్రం మరింత వెనక్కి వెళుతుంది. పాలకుల అవినీతి పరాకాష్టకు చేరడమే హైదరాబాద్ క్రికెట్ దుస్థితికి ప్రధాన కారణమన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌కు టికెట్ల అమ్మకంపై జరిగిన రగడ హెచ్‌సీఏలోని అంతర్గత విబేధాలను మరోసారి బహిర్గతం చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ సహా మిగతా కార్యవర్గ సభ్యులు మధ్య తలెత్తిన విబేధాలతో ఆటను సరిగా పట్టించుకోవడం లేదని భావించిన సుప్రీం కోర్టు పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్‌సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు జిస్టిస్ కక్రూ, డీజీపీ అంజనీ కుమార్, వెంకటపతిరాజు, వంకా ప్రతాప్‌లతో తాత్కాలిక కమిటీని నియమించింది. అయినప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా హెచ్‌సీఏ పరిస్థితి ఉంది. పైగా వంకా ప్రతాప్ కమిటీ బాధ్యతల్లోనే గాకుండా జట్టు సెలక్షన్ కమిటీలోనూ వేలు పెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సీఏ అకాడమీ డైరెక్టర్‌గా వంకా ప్రతాప్ నెలకు రూ. 3 లక్షలు జీతం తీసుకుంటున్నప్పటికి.. పర్యవేక్షక కమిటీకి హాజరైనందున తనకు రూ. 5.25 లక్షలు ఇవ్వాలని హెచ్‌సీఏకు విజ్ఞప్తి చేశాడు. తన స్వప్రయోజనాల కోసం హెచ్‌సీఏను వంకా ప్రతాప్ భ్రష్టు పట్టిస్తున్నారని కొంతమంది పేర్కొన్నారు. మాజీ ఆటగాళ్లు పరిపాలకులుగా ఉంటే హెచ్‌సీఏ కాస్త గాడిన పడుతుందని భావించారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు సగటు క్రికెట్ అభిమానులను ఆవేదన కలిగించాయి. ఇంత జరుగుతున్నా బీసీసీఐ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడం సగటు అభిమానిని ఆశ్చర్యానికి గురి చేసింది. త్వరలో హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరగాలని కొంతమంది హెచ్‌సీఏ ప్రతివాదులు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) కథ కంచికి చేరింది. సుప్రీంకోర్టు హెచ్‌సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై ఏకసభ్య కమిటీ హెచ్‌సీఏ వ్యవహారలన్నీ చూసుకుంటుందని సుప్రీం పేర్కొంది. చదవండి: అజారుద్దీన్‌కు చుక్కెదురు.. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు


