FIFA World Cup Trophy History: ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా?

FIFA World Cup 2022: Meet The Makers Of-Football World Cup Trophy - Sakshi

ఫుట్‌బాల్‌లో సాకర్‌ సమరానికి ఉండే క్రేజ్‌ వేరు. ఫిఫా వరల్డ్‌కప్‌ కోసం ప్రపంచంలోని నలుమూలల నుంచి దేశాలు పోటీ పడుతుండడంతో ఎనలేని క్రేజ్‌ వచ్చింది. జరిగేది నాలుగేళ్లకోసారి అయినప్పటికి దానిని సొంతం చేసుకోవాలని ప్రతీ జట్టు ప్రయత్నిస్తుంటుంది. 32 జట్లు పాల్గొనే ఈ మెగా సమరంలో చివరికి ట్రోఫీ మాత్రం దక్కేది ఒక్కరికే.

ఇప్పటివరకు ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో పర్యటించింది. దీనిని తయారు చేసే విధానం నుంచి దీని విలువ వరకూ అన్నీ ఆశ్చర్యం కలిగించేవే. మరి బంగారు వర్ణంలో దగదగ మెరిసిపోయే ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ వెనుక ఉన్న చరిత్రతో పాటు ఎవరు తయారు చేస్తారు.. ఎలా తయారు చేస్తారనేది తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇక ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌ టోర్నీ ఖతార్‌ వేదికగా నవంబర్ 20న ప్రారంభమై.. డిసెంబర్‌ 18న ముగుస్తోంది. 

ఫిఫా వరల్డ్‌కప్‌ తయారు చేసేది ఇలా..
ఫిఫా వరల్డ్‌కప్‌ను 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. ఈ ట్రోఫీ ఎత్తు 37 సెంటీమీటర్లు. బరువు ఆరు కేజీలు. ఇద్దరు వ్యక్తులు భూగోళాన్ని మోస్తున్నట్లుగా ఈ ట్రోఫీని తీర్చిదిద్దారు. ఈ ట్రోఫీని తయారు చేసినప్పుడు దీని విలువ 50 వేల డాలర్లు. కానీ దీని ప్రస్తుత విలువ 2 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.160 కోట్లు కావడం విశేషం.

ట్రోఫీ తయారు చేసేది ఆ కుటుంబమే
50 ఏళ్లకుపైగా ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఇటలీకి చెందిన ఒకే కుటుంబం తయారు చేస్తోంది. వరుసగా రెండోసారి కూడా ఇటలీ టీమ్‌ వరల్డ్‌కప్‌లో పాల్గొనకపోయినా.. ఈ ట్రోఫీ రూపంలో ఇటలీ ప్రాతినిధ్యం ఉండటం విశేషం. ప్రస్తుత ట్రోఫీని 1971లో ఇటలీలోని సిల్వియో గాజానిగా అనే ఆర్టిస్ట్‌ రూపొందించాడు. అంతకుముందు ట్రోఫీని బ్రెజిల్‌కు ఇచ్చేయడంతో ఈ కొత్త ట్రోఫీని రూపొందించాల్సి వచ్చింది.

వరుసగా మూడుసార్లు గెలిచే జట్టుకు అసలు ట్రోఫీ
ఇక ఇప్పుడు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని గాజానిగా కుటుంబమే తయారు చేస్తూ వస్తోంది. నిజానికి ప్రతిసారీ విజేతకు బంగారు ట్రోఫీని బహూకరించి తర్వాత తిరిగి తీసుకుంటారు. వాళ్లకు బంగారుపూత ఉన్న నకలును ఇస్తారు. అయితే ఏదైనా టీమ్‌ మూడుసార్లు ట్రోఫీని గెలిస్తే వాళ్లకు మాత్రం అసలు ట్రోఫీని ఇచ్చేసి మళ్లీ కొత్తగా మరొక ట్రోఫీని తయారు చేస్తారు.

ఈ ట్రోఫీని జూలెస్‌ రిమెట్‌ ట్రోఫీగా పిలుస్తారు. ఫిఫా మూడో అధ్యక్షుడిగా ఉన్న రిమెట్‌ గౌరవార్థం ట్రోఫీకి ఆ పేరు పెట్టారు. ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ తయారు విధానాన్ని సిల్వియోగాజానిగా కుటుంబం అల్‌జజీరా చానెల్‌తో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ యూట్యూబ్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.

చదవండి: FIFA: ప్రపంచానికి తెలియని కొల్హాపూర్‌ ఫుట్‌బాల్‌ చరిత్ర

FIFA WC 2022: బెల్జియంపై భారీ అంచనాలు.. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top