#Number'18': కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది

Virat Kohli-Jersey Number-18-Great Connection With Him Again Proved - Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి జెర్సీ నెంబర్‌ ఏంటని అడిగితే టక్కున వచ్చే సమాధానం '18'. నిజానికి 18 నెంబర్‌ జెర్సీ అనేది కోహ్లి తన తండ్రి జ్ఞాపకార్థం వేసుకుంటున్నట్లు చాలాసార్లు తెలిపాడు. తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గురువారం(మే 18న) ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరిశాడు. నాలుగేళ్ల తన ఐపీఎల్‌ సెంచరీ నిరీక్షణకు తెరదించిన కోహ్లి ఆ సెంచరీ అందుకుంది మే 18 కావడంతో మరోసారి అతని జెర్సీ నెంబర్‌ ప్రస్తావనకు వచ్చింది.


Photo: IPL Twitter

మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ జెర్సీ నెంబర్‌-18పై మరోసారి స్పందించాడు. నిజాయితీగా చెప్పలాంటే అండర్‌-19 క్రికెట్‌ ఆడేటప్పుడే నాపేరుతో 18 నెంబర్‌ జెర్సీ ఇచ్చారు.  ఆ క్షణం 18 అనేది నా జీవితంలో ప్రత్యేకంగా మారబోతుందన్నది అప్పటికి తెలియదు. యాృదృశ్చికంగా నేను క్రికెట్‌లో అడుగుపెట్టింది ఆగస్టు 18న.. నా తండ్రి చనిపోయింది డిసెంబర్‌ 18న.. రెండు ముఖ్య సంఘటనలు ఒకే తేదీన జరగడం ఎప్పటికి మరిచిపోను అని చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. కోహ్లి 18 నెంబర్‌ వెంటపడినట్లు అనిపించడం లేదు.. అతని వెనకాలే 18 వస్తున్నట్లు తెలుస్తోంది.


Photo: IPL Twitter

'18' నెంబర్‌తో కోహ్లికున్న అనుబంధం..
► ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో(మే 18, 2023) కోహ్లి సెంచరీ చేసింది '18' వ ఓవర్లోనే. సిక్సర్‌ కొట్టి కోహ్లి సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. 
కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది 2008 ఆగస్టు 18 నాడే.


చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కోహ్లి సెంచరీ చేసింది కూడా '18' వ తేదీనే. మార్చి 18, 2012లో ఢాకాలో పాక్‌తో జరిగిన వన్డేలో విరాట్‌ 183 పరుగులు చేశాడు. యాదృశ్చికంగా అతను ఆరోజు చేసిన పరుగుల్లోనూ '18' కనిపించడం విశేషం.
ఇక కోహ్లి టెస్టుల్లో రెండు శతకాలను ఇదే రోజున బాదాడు. 18 ఆగస్టు 2018లో ఇంగ్లండ్‌పై 103 పరుగులు.. 2013 డిసెంబర్ 18న దక్షిణాఫ్రికాపై 119 పరుగులు చేశాడు.


ఇక కోహ్లి 17 ఏళ్ల వయసులో అతని తండ్రి ప్రేమ్‌ కోహ్లి 2006 డిసెంబర్‌ '18' వ తేదీన తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ సమయంలో కోహ్లి రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. తండ్రి మరణ వార్తను దిగమింగి మ్యాచ్‌ ఆడిన కోహ్లి 90 పరుగులు చేశాడు. మ్యాచ్‌ ముగిశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. 
ఇక  కోహ్లి జెర్సీ నెంబర్‌ '18' కి మరో ప్రత్యేకత కూడా ఉంది. కోహ్లి తండ్రి ప్రేమ్‌ కోహ్లి క్రికెట్‌ ఆడే రోజుల్లో 18 నెంబర్‌ జెర్సీనే వేసుకోవడం విశేషం. అందుకే కోహ్లి తన తండ్రి జ్ఞాపకార్థం అదే నెంబర్‌ జెర్సీతో కనిపిస్తున్నాడు.

చదవండి: కోహ్లి ఫిదా..  తెలుగోళ్ల అభిమానమే వేరప్పా!

నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో మెరిసిన 'కింగ్‌' కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top