మరాఠా గడ్డపై ‘సునేత్ర’ చరిత్ర.. వీళ్ల గురించి తెలుసా? | List Of Women Deputy CMs In India Special Story, Sunetra Pawar Set To Take Oath As Maharashtra Deputy CM | Sakshi
Sakshi News home page

మరాఠా గడ్డపై ‘సునేత్ర’ చరిత్ర.. వీళ్ల గురించి తెలుసా?

Jan 31 2026 1:14 PM | Updated on Jan 31 2026 3:00 PM

List Of Women Deputy CMs In India Special Story

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రి కానున్నారు. ఆమె శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో ఐదుగురు మహిళలు.. ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యలక్ష్మి.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

కమలమ్మ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 1952లో కమలమ్మ తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా పనిచేశారు. దీంతో, ఆమె దేశ చరిత్రలోనే మొదటి ఉప ముఖ్యమంత్రిగా చర్రితలో నిలిచిపోయారు.

పాముల పుష్ఫ శ్రీవాణి.. ఏపీలో వైఎస్సార్‌సీపీ ‍ప్రభుత్వ హయాంలో పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్ల పాటు డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగారు.

తారాసింగ్‌.. పంజాబ్‌కు చెందిన తారా సింగ్‌ 1960లో తాత్కాలికంగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆమె విధుల్లో కొనసాగారు.

రాజేంద్ర కౌర్‌ భట్టాల్‌.. పంజాబ్‌కు చెందిన రాజేంద్ర కౌర్‌ భట్టాల్‌ 1996లో ఉప ముఖ్యమంత్రిగా విధుల్లో కొనసాగారు. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లకు పైగా ఆమె డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

నిత్యానందా దేవి.. బీహార్‌కు చెందిన నిత్యానందా దేవి 1990ల్లో తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆర్జేడీ ప్రభుత్వ హయాంలో ఆమె విధులు నిర్వహించారు.

జమునా దేవి.. మధ్యప్రదేశ్‌కు చెందిన జమునా దేవి 1998లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఐదేళ్ల పాటు కొనసాగారు. దిగ్విజయ్‌ సింగ్‌ ప్రభుత్వం ఐదేళ్ల పీరియడ్‌ మొత్తం ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దీంతో, ఎక్కువ కాలం డీప్యూటీ సీఎంగా ఉన్న మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.

కమలా బెనీవల్‌.. రాజస్థాన్‌కు చెందిన కమలా బెనీవల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎంగా కొనసాగారు. 2003లో అశోక్‌ గెహ్లాట్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.

దియా కుమారి.. రాజస్థాన్‌కు చెందిన దియా కుమారి బీజేపీ ‍ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా దాదాపు రెండేళ్ల పాటు ఉన్నారు. ప్రస్తుత భజన్‌ లాల్‌ శర్మ ప్రభుత్వంలో 2023 నుంచి బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

పార్వతీ పరిడా.. ఒడిశాకు చెందిన పార్వతి ప్రస్తుత సీఎం మోహన్‌ చరణ్‌ మాంఝీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. 2024 జూన్‌ నుంచి బాధ్యతల్లో ఉన్నారు.

అయితే, దేశంలో ముఖ్యమంత్రి స్థానాల్లో మహిళలు ఎక్కువ కాలం సేవలు చేసినప్పటికీ.. ఉప ముఖ్యమంత్రలుగా మాత్రం చాలా తక్కువ మంది, తక్కువ కాలం మాత్రమే విధుల్లో ఉన్నారు. పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే మహిళలు ఈ పదవిని చేపట్టారు. ప్రస్తుతం (2026 జనవరి నాటికి) రెండు రాష్ట్రాల్లో (రాజస్థాన్‌, ఒడిశా) మాత్రమే మహిళలు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. భవిష్యత్తులో మహిళల రాజకీయ ప్రాధాన్యం పెరుగుతున్నందున మరిన్ని రాష్ట్రాల్లో మహిళలు డిప్యూటీ సీఎంలుగా ఉండే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement