Budget-2025: బడ్జెట్‌లో మాకేంటి? | Public Opinion on Union Budget 2025 26 | Sakshi
Sakshi News home page

Budget-2025: బడ్జెట్‌లో మాకేంటి? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారంటే..

Jan 30 2025 1:31 PM | Updated on Jan 31 2025 1:36 PM

Public Opinion on Union Budget 2025 26

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఆర్థికమంత్రి 'నిర్మలా సీతారామన్‌' (Nirmala Sitharaman) చదివే పద్దుపై అందరిలోనూ అంచనాలున్నాయి. ఆదాయ పన్ను విషయంలో ఊరట ఉంటుందా? ధరలు తగ్గిస్తారా?. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? ఇలా రకరకాల ప్రశ్నలకు ఆరోజున సమాధానం దొరకనుంది. అయితే సాధారణంగా బడ్జెట్‌తో మాకేంటి? అని జనం అనుకుంటారనే భావన ఒకటి ఉంది. కానీ, అది తప్పని సాక్షి.కామ్‌ ప్రయత్నం నిరూపించింది. బడ్జెట్‌లో మాకేంటి అంటున్న ‘సామాన్యుడి’ మనోగతం వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం.. 

👉సాధారణ ప్రజలకు మాదిరిగా కాకుండా.. సూపర్ రిచ్ వారికి కొంత ట్యాక్స్ పెంచాలి. ఎందుకంటే సాధారణ ప్రజలు, కోటీశ్వరులు ఇద్దరూ కూడా సమానంగా ట్యాక్స్ కడుతున్నారు. ఇది ధనవంతులపై ప్రభావం చూపకపోయినా, సామాన్యులకు భారంగా ఉంటుందని కార్పొరేట్ ఉద్యోగి అన్నారు. టోల్ గేట్ చార్జీలను కూడా కొంత తగ్గిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు.

👉భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ రంగానికి కొంత ఎక్కువ బడ్జెట్‌ కేటాయించాలి. రైతుకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉంటే బాగుంటుందని.. చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు పేర్కొన్నారు.

👉మధ్యతరగతి వేతన జీవులు.. ప్రతీసారి బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ చివరకు నిరాశే మిగులుతూ వస్తోంది. ఈసారైనా మాలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల, కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటోంది. కాబట్టి ఈసారి బడ్జెట్‌లో మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 
::ఏపీకి చెందిన ఓ వైద్యుడి అభిప్రాయం

👉ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే, అందరికి ఉపయోగకరంగా ఉంటుందని, మదనపల్లెకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025పై తన ఆశాభావం వ్యక్తం చేశారు.

👉2025-26 బడ్జెట్‌లో నిత్యావసరాల ధరలపై ట్యాక్స్ తగ్గించాలని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మెదక్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్ధి చెప్పారు.

👉బడ్జెట్ వచ్చినప్పుడల్లా.. ఏదేదో అంచనాలు వేసుకుంటూనే ఉంటాను. కానీ అంచనాలను తగ్గట్టుగా ఎప్పుడూ బడ్జెట్ ఉండటం లేదు. ఈ సారైనా నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ తగ్గించాలని జర్నలిస్ట్‌ పేర్కొన్నారు.

👉నిత్యావసరాల ధరలతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఆటోమొబైల్ మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని ఆశిస్తున్నట్లు.. హైదరాబాద్లో కెమెరామెన్‌గా పని చేసే వ్యక్తి చెప్పారు.

👉సీనియర్ సిటిజన్, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి, ఈ బడ్జెట్‌ 2025పై స్పందిస్తూ.. వ్యవసాయదారులకు అవసరమైన పథకాలను మరిన్ని ప్రవేశపెట్టాలని, వ్యవసాయ పనిముట్ల మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని పేర్కొన్నారు.

:: సిరికుమార్‌, సాక్షి వెబ్‌ బిజినెస్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement