EPFO సభ్యుడు మరణిస్తే నగదు క్లెయిమ్ ఎలా? | How to Claim EPFO Death Benefits Online? Step-by-Step Guide for PF Pension | Sakshi
Sakshi News home page

EPFO సభ్యుడు మరణిస్తే నగదు క్లెయిమ్ ఎలా?

Jul 27 2026 1:38 PM | Updated on Jul 27 2026 1:42 PM

How to Claim EPFO Death Benefits Online? Step-by-Step Guide for PF Pension

ఉద్యోగస్థుల ఆర్థిక భద్రతకు అండగా నిలిచే ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్‌ఓ) సభ్యుడు అకస్మాత్తుగా మరణిస్తే సదరు కుటుంబ సభ్యులు లేదా నామినీలు పీఎఫ్ నగదును ఎలా పొందాలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. క్లెయిమ్‌ల తిరస్కరణను తగ్గించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్‌ఓ ఇటీవల తన పాత వ్యవస్థను నూతన సీఐటీఈఎస్ (కేంద్రీకృత ఐటీ సేవలు) వ్యవస్థలోకి మార్చింది. ఆటోమేటెడ్ ప్రీ-వాలిడేషన్ ద్వారా దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తున్నారు.

ఎవరు క్లెయిమ్ చేయవచ్చు?

ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం, మరణించిన సభ్యుని ఆన్‌లైన్ ఈ-నామినేషన్ ఆధారంగా నామినీ దరఖాస్తు చేయవచ్చు. నామినీ మైనర్ (18 ఏళ్ల కంటే తక్కువ) అయితే, అతడి సంరక్షకులు (గారెంట్‌) పీఎఫ్ నిధుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నామినేషన్ లేకపోతే తహసీల్దార్ లేదా మేజిస్ట్రేట్ ధ్రువీకరించిన వారసత్వ ధ్రువీకరణ పత్రంతో చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఏ ఫారాలు దేనికి..

ఫారమ్ 20: సభ్యుని ఖాతాలో జమ అయిన పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి.

ఫారమ్ 10డీ: అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు నెలవారీ పెన్షన్ అందించడానికి.

ఫారమ్ 5ఐఎఫ్‌: ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) పథకం కింద లభించే ఉచిత జీవిత బీమా పరిహారాన్ని పొందేందుకు.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం

ప్రస్తుతం ఈ ఆన్‌లైన్ క్లెయిమ్ సేవ ఈపీఎఫ్‌ఓ అధికారిక యూనిఫైడ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది.

దశ 1: ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి డెత్ క్లెయిమ్ ఫారమ్ ఎంచుకోవాలి.

దశ 2: మరణించిన సభ్యుని 12 అంకెల యూఏఎన్‌, లబ్ధిదారుని ఆధార్ సంఖ్య, పేరు, పుట్టిన తేదీ నమోదు చేసి 'Get Authorisation PIN' పై క్లిక్ చేయాలి.

దశ 3: అవసరమైన వివరాలను బ్లాక్ లెటర్లలో స్పష్టంగా పూర్తి చేసి క్లెయిమ్ రకాన్ని (ఫారమ్ 20/10D/5IF) ఎంచుకోవాలి.

దశ 4: సభ్యుని మరణ ధ్రువీకరణ పత్రం, లబ్ధిదారుని బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్యాన్సిల్డ్‌ చెక్ కాపీని (ఐఎఫ​్‌ఎస్‌సీ కోడ్, అకౌంట్ నంబర్ స్పష్టంగా కనిపించేలా) అప్‌లోడ్ చేయాలి.

దశ 5: ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి దరఖాస్తును సబ్మిట్‌ చేయాలి.

ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement