breaking news
Death Benefits
-
EPFO సభ్యుడు మరణిస్తే నగదు క్లెయిమ్ ఎలా?
ఉద్యోగస్థుల ఆర్థిక భద్రతకు అండగా నిలిచే ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్ఓ) సభ్యుడు అకస్మాత్తుగా మరణిస్తే సదరు కుటుంబ సభ్యులు లేదా నామినీలు పీఎఫ్ నగదును ఎలా పొందాలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. క్లెయిమ్‌ల తిరస్కరణను తగ్గించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఇటీవల తన పాత వ్యవస్థను నూతన సీఐటీఈఎస్ (కేంద్రీకృత ఐటీ సేవలు) వ్యవస్థలోకి మార్చింది. ఆటోమేటెడ్ ప్రీ-వాలిడేషన్ ద్వారా దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తున్నారు.ఎవరు క్లెయిమ్ చేయవచ్చు?ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం, మరణించిన సభ్యుని ఆన్లైన్ ఈ-నామినేషన్ ఆధారంగా నామినీ దరఖాస్తు చేయవచ్చు. నామినీ మైనర్ (18 ఏళ్ల కంటే తక్కువ) అయితే, అతడి సంరక్షకులు (గారెంట్) పీఎఫ్ నిధుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నామినేషన్ లేకపోతే తహసీల్దార్ లేదా మేజిస్ట్రేట్ ధ్రువీకరించిన వారసత్వ ధ్రువీకరణ పత్రంతో చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు.ఏ ఫారాలు దేనికి..ఫారమ్ 20: సభ్యుని ఖాతాలో జమ అయిన పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి.ఫారమ్ 10డీ: అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు నెలవారీ పెన్షన్ అందించడానికి.ఫారమ్ 5ఐఎఫ్: ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద లభించే ఉచిత జీవిత బీమా పరిహారాన్ని పొందేందుకు.ఆన్లైన్ దరఖాస్తు విధానంప్రస్తుతం ఈ ఆన్లైన్ క్లెయిమ్ సేవ ఈపీఎఫ్ఓ అధికారిక యూనిఫైడ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది.దశ 1: ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి డెత్ క్లెయిమ్ ఫారమ్ ఎంచుకోవాలి.దశ 2: మరణించిన సభ్యుని 12 అంకెల యూఏఎన్, లబ్ధిదారుని ఆధార్ సంఖ్య, పేరు, పుట్టిన తేదీ నమోదు చేసి 'Get Authorisation PIN' పై క్లిక్ చేయాలి.దశ 3: అవసరమైన వివరాలను బ్లాక్ లెటర్లలో స్పష్టంగా పూర్తి చేసి క్లెయిమ్ రకాన్ని (ఫారమ్ 20/10D/5IF) ఎంచుకోవాలి.దశ 4: సభ్యుని మరణ ధ్రువీకరణ పత్రం, లబ్ధిదారుని బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్ కాపీని (ఐఎఫ్ఎస్సీ కోడ్, అకౌంట్ నంబర్ స్పష్టంగా కనిపించేలా) అప్లోడ్ చేయాలి.దశ 5: ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా? -
షాకిచ్చిన ఒరాకిల్ : గూగుల్‌లోని ఈ పాలసీ తెలుసా?
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ ప్రకటించిన భారీ లేఆఫ్స్ టెక్ ప్రపంచం ప్రకంపనలు రేపాయి. రేపటినుంచి మీ సేవలు అవసరం లేదు అంటూ కేవలం తెల్లవారుజామున 6 గంటలకు పంపిన ఒకే ఒక్క ఈమెయిల్ టెకీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఆందోళన ఇలా ఉండగానే మరో భిన్నమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే..ఒకవైపు ఒరాకిల్ 30వేలమంది ఉద్యోగుల తీసివేత ప్లాన్లతో షాక్ ఇవ్వగా, మరోవైపు గూగుల్ తన ఉద్యోగుల కుటుంబాలకు అందించే 'మరణానంతర ప్రయోజనాల' వివరాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.ఒకవైపు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' విశేషంగా నిలిచాయి. వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం గూగుల్‌లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి భారీ ప్రయోజనాలు అందిస్తోంది.గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' మరణించిన ఉద్యోగి భాగస్వామికి (Spouse) 10 ఏళ్ల పాటు సగం జీతాన్ని గూగుల్ చెల్లిస్తుంది. అలాగే స్టాక్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఉద్యోగికి రావాల్సిన అన్-వెస్టెడ్ స్టాక్స్ (Unvested Stocks) అన్నీ తక్షణమే కుటుంబానికి అందుతాయి.దీంతోపాటు పిల్లలకు 19 ఏళ్ల వయస్సు వచ్చే వరకు (ఒకవేళ ఫుల్ టైమ్ స్టూడెంట్ అయితే 23 ఏళ్ల వరకు) ప్రతి నెల 1,000 డాలర్లు (సుమారు రూ. 83,000) అందుతాయి. సర్వీస్‌తో సంబంధం లేకుండా అంటే ఉద్యోగి ఎంత కాలం పనిచేశారనే దానితో సంబంధం లేకుండా కొత్తగా చేరిన వారికైనా, పదేళ్ల అనుభవం ఉన్న వారికైనా ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!మరోవైపు ఈ ప్రయోజనాలపై ఒక సీనియర్ ఇంజనీర్ ఉదాహరణను నెటిజన్లు విశ్లేషించారు. గూగుల్ పాలసీ ప్రకారం, ఒక సీనియర్ ఇంజనీర్ మరణిస్తే ఆ కుటుంబానికి 15 కోట్లకు పైగా అందుతాయి. 2012లో గూగుల్ HP మాజీ చీఫ్ లాస్లో బాక్ రూపొందించిన ఈ విధానం రూపొందించారనీ ఉద్యోగి కుటుంబ భద్రత సంస్థ బాధ్యత అని గూగుల్ నమ్ముతుందని ఆయన వ్యాఖ్యానించారు.10 ఏళ్లలో సుమారు 925,000 డాలర్ల జీతం.లైఫ్ ఇన్సూరెన్స్ కింద 555,000డాలర్లుస్టాక్స్ రూపంలో డాలర్లు 350,000.పిల్లలకు నెలకు వెయ్యి డాలర్లు.మొత్తంగా చూస్తే వెస్టెడ్ స్టాక్స్ కాకుండానే దాదాపు రూ. 15.5 కోట్లు కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.నెటిజన్ల స్పందన"మా మేనేజర్ శనివారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే ఏదో కొండను తవ్వి తెచ్చినట్లు ఫీల్ అవుతారు. కానీ గూగుల్ తన ఉద్యోగి లేకపోయినా వారి కుటుంబాన్ని కాపాడుతోంది. ఇది కదా లైఫ్ గోల్స్ అనాల్సింది!" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. నిజంగా గ్రేట్ ఇది.. దీని విలువను లెక్కగట్టేంత వరకు దీన్ని గ్రహించలేరు అని ఒకరు, కంపెనీలు ఈ విధంగా ఇంత దీర్ఘకాలికంగా ఆలోచించడం చాలా అరుదు.” అని మరొకరు పేర్కొన్నారు.ఇదీ చదవండి: వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో చరిత్ర : ఎవరీ రినీ సంపత్? -
ఎలాంటి పాలసీ తీసుకోవాలంటే..
రాజేశ్ సూద్ ఎండీ, సీఈఓ, మ్యాక్స్ లైఫ్ జీవిత బీమా... ప్రతి ఒక్కరికీ ధీమా కలిగిస్తుంది. వ్యక్తి ఆర్థిక ప్రణాళికలకు స్థిరత్వాన్నీ, సంపూర్ణత్వాన్నీ ఇచ్చేదే బీమా. దీర్ఘకాలిక పొదుపును, రక్షణను, పన్ను ప్రయోజనాలను సమకూర్చే ఏకైక సాధనం జీవిత బీమా మాత్రమే. తొలిసారిగా ఇలాంటి పాలసీని కొనుగోలు చేసే వారికి ఏది మంచి పాలసీ అనే సందేహం ఉంటుంది. పాలసీ తీసుకొనే ముందు చూడాల్సిన అంశాలను తెలుసుకుందాం. వారో వీరో చెప్పారని వద్దు... మీ స్నేహితులో, బంధువులో చెప్పారని పాలసీని కొనవద్దు. వ్యక్తులకు, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా జీవిత బీమాను రూపొందించారు. మీ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటే మీకు జీవిత బీమా చాలా అవసరం. మీపై ఆధారపడిన వారు ప్రస్తుతానికి లేనప్పటికీ, భవిష్యత్తులో అలాంటి వారు మీకు ఉంటారని భావిస్తే చిన్న పాలసీతో ప్రారంభించాలి. ఎంత మొత్తానికి జీవిత బీమా అనేది మీ వార్షిక ఆదాయం, ఖర్చులు, మీ తదనంతరం కుటుంబానికి అవసరమయ్యే సొమ్ము వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అవగాహనకు రావచ్చు. తగిన పాలసీ: ఇప్పుడు అనేక రకాల జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు అవసరమైనవి ఎంచుకోవాలి. తొలిసారిగా కొనే వారికి తగినవి నాలుగు రకాలున్నాయి. అవి: 1. నిర్ణీత కాలవ్యవధిలో మరణానంతర ప్రయోజనాలు (డెత్ బెనిఫిట్స్) కల్పించే టర్మ్ పాలసీ. 2. పూర్తి జీవితకాల కవరేజీ కల్పించే హోల్ లైఫ్‌టైమ్ పాలసీ. 3. మరణం సంభవించినపుడు లేదా నిర్ణీత తేదీన బెనిఫిట్లను అందించే ఎండోమెంట్ పాలసీ. 4. బీమా చేయించుకున్న వారు నిర్ణీత వయస్సుకు చేరినపుడు (రిటైర్మెంట్ వంటివి) చెల్లింపులు చేసే యాన్యుయిటీ పాలసీ. వీటిలో మీకు ఏది అన్ని విధాలుగా తగినదో తెలుసుకునేందుకు ఏజెంట్ అడ్వయిజర్‌ను సంప్రదించవచ్చు. జీవిత బీమా పాలసీని కొనడమంటే సదరు ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లే. కనుక, బీమా ప్రొడక్టును కొనేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, దీర్ఘకాలిక అవసరాల కోసం ఏటా చేయాల్సిన పెట్టుబడులను మదింపు చేయండి. రిస్కు తీసుకునే సామర్థ్యం ఎంతవరకు ఉందో గమనించండి. మీకు ఎక్కువ అనుకూలంగా ఉండే పాలసీని ఎంచుకోండి. ఇదే కసరత్తు ఏటా చేస్తుండాలి. ఎందుకంటే, ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు కాలక్రమేణా మారుతుంటాయి కదా!


