షాకిచ్చిన ఒరాకిల్‌ : గూగుల్‌లోని‌ ఈ పాలసీ తెలుసా? | Engineer highlights how Google protects families after employee death | Sakshi
Sakshi News home page

షాకిచ్చిన ఒరాకిల్‌ : గూగుల్‌లోని‌ ఈ పాలసీ తెలుసా?

Apr 4 2026 4:15 PM | Updated on Apr 4 2026 4:31 PM

Engineer highlights how Google protects families after employee death

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఒరాకిల్‌  ప్రకటించిన భారీ లేఆఫ్స్‌ టెక్ ప్రపంచం ప్రకంపనలు రేపాయి. రేపటినుంచి మీ సేవలు అవసరం  లేదు అంటూ కేవలం తెల్లవారుజామున 6 గంటలకు పంపిన ఒకే ఒక్క ఈమెయిల్  టెకీలను దిగ్భ్రాంతికి గురిచేసింది.  అయితే  ఈ ఆందోళన ఇలా ఉండగానే మరో భిన్నమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే..

ఒకవైపు ఒరాకిల్  30వేలమంది ఉద్యోగుల తీసివేత ప్లాన్లతో   షాక్ ఇవ్వగా, మరోవైపు గూగుల్ తన ఉద్యోగుల కుటుంబాలకు అందించే 'మరణానంతర ప్రయోజనాల' వివరాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

ఒకవైపు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' విశేషంగా నిలిచాయి.  వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం  గూగుల్లో  పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి భారీ ప్రయోజనాలు అందిస్తోంది.

గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' 
మరణించిన ఉద్యోగి భాగస్వామికి (Spouse) 10 ఏళ్ల పాటు సగం జీతాన్ని గూగుల్ చెల్లిస్తుంది. అలాగే స్టాక్ బెనిఫిట్స్‌ కూడా అందిస్తుంది.  ఉద్యోగికి రావాల్సిన అన్-వెస్టెడ్ స్టాక్స్ (Unvested Stocks) అన్నీ తక్షణమే కుటుంబానికి అందుతాయి.

దీంతోపాటు  పిల్లలకు 19 ఏళ్ల వయస్సు వచ్చే వరకు (ఒకవేళ ఫుల్ టైమ్ స్టూడెంట్ అయితే 23 ఏళ్ల వరకు) ప్రతి నెల 1,000 డాలర్లు (సుమారు రూ. 83,000) అందుతాయి. సర్వీస్‌తో సంబంధం లేకుండా అంటే ఉద్యోగి ఎంత కాలం పనిచేశారనే దానితో సంబంధం లేకుండా కొత్తగా చేరిన వారికైనా, పదేళ్ల అనుభవం ఉన్న వారికైనా ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి.

ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్‌ లేఆఫ్‌ : ఈ టెకీ ప్లాన్‌ మామూలుగా లేదు!

ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
మరోవైపు ఈ ప్రయోజనాలపై ఒక సీనియర్ ఇంజనీర్ ఉదాహరణను నెటిజన్లు విశ్లేషించారు. గూగుల్ పాలసీ ప్రకారం, ఒక సీనియర్ ఇంజనీర్ మరణిస్తే ఆ కుటుంబానికి 15 కోట్లకు పైగా అందుతాయి. 2012లో గూగుల్ HP మాజీ చీఫ్ లాస్లో బాక్ రూపొందించిన ఈ విధానం రూపొందించారనీ ఉద్యోగి కుటుంబ భద్రత సంస్థ బాధ్యత అని గూగుల్ నమ్ముతుందని  ఆయన వ్యాఖ్యానించారు.

  • 10 ఏళ్లలో సుమారు 925,000 డాలర్ల జీతం.

  • లైఫ్ ఇన్సూరెన్స్ కింద 555,000డాలర్లు

  • స్టాక్స్ రూపంలో డాలర్లు 350,000.

  • పిల్లలకు నెలకు వెయ్యి డాలర్లు.

మొత్తంగా చూస్తే వెస్టెడ్ స్టాక్స్ కాకుండానే దాదాపు రూ. 15.5 కోట్లు కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

నెటిజన్ల స్పందన
"మా మేనేజర్ శనివారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే ఏదో కొండను తవ్వి తెచ్చినట్లు ఫీల్ అవుతారు. కానీ గూగుల్ తన ఉద్యోగి లేకపోయినా వారి కుటుంబాన్ని కాపాడుతోంది.  ఇది కదా లైఫ్ గోల్స్ అనాల్సింది!" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. నిజంగా గ్రేట్‌ ఇది.. దీని విలువను లెక్కగట్టేంత వరకు దీన్ని గ్రహించలేరు అని ఒకరు,  కంపెనీలు ఈ విధంగా ఇంత దీర్ఘకాలికంగా ఆలోచించడం చాలా అరుదు.” అని మరొకరు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో చరిత్ర : ఎవరీ రినీ సంపత్‌?

Advertisement
 
Advertisement
Advertisement