అమెరికాలోని ఎన్నికల చరిత్రలో మరో భారతీయ మహిళ చర్రిత సృష్టించారు. వాషింగ్టన్ డీసీ (Washington, DC) మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా 31 ఏళ్ల రినీ సంపత్ చరిత్ర సృష్టించారు. 'అమెరికన్ డ్రీమ్' సాకారం కోసం ఏడేళ్ల వయసులోనే అమెరికాకు వలస వచ్చిన ఆమె ఇపుడు 2026 మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన నామినేషన్ అర్హతను ఆమె సాధించడం విశేషం.
తమిళనాడులో తేనిలో జన్మించిచారు రినీ సంపత్. తన ఏడవ ఏట తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్‌లో పట్టా పొందారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు మరియు ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 'థారోస్' (Tharros) అనే సంస్థకు డైరెక్టరీగా వ్యవహరిస్తున్నారు.
రినీప్రచారాస్త్రాలు -నినాదాలు
గత పదేళ్లుగా వాషింగ్టన్ డీసీలోనే నివసిస్తున్న రినీ మేయర్ పదవికి జరిగే ఎన్నికల బ్యాలెట్‌లో స్థానం సంపాదించారు. నగరంలోని ప్రాథమిక సేవలను మెరుగుపరచడమే తన లక్ష్యమని సంపత్ నొక్కి చెప్పారు. ‘ఫిక్స్ ద బేసిక్స్’ (Fix the Basics) “కొత్త డీసీ” (A new DC) అనే నినాదంతో అంటూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం.
పోటోమాక్ నదిలో మురుగునీరు కలవకుండా అడ్డుకోవడం.
ధరలను తగ్గించడం.
911 అత్యవసర సేవల వెయిటింగ్ సమయాన్ని తగ్గించడం.
ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!
తమ కుటుంబం అమెరికాకు రావాలని తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని మార్చివేసిందని రినీ చెబుతారు. తన మూలాలే ప్రజా సేవకు తన ప్రేరణకు కేంద్రమన్నారు. తన తాతగారు తనకెప్పుడూ పెద్ద స్ఫూర్తి అని, ప్రజా సేవలో ఆయన మార్గమే తనను నడిపిస్తుందంటారామె. "నేను రాజకీయ నాయకురాలిని కాదు. నాకు ఎటువంటి ప్రత్యేక ప్రయోజన గ్రూపులతో సంబంధం లేదు. నగర ప్రాథమిక సేవలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టే ఒక బయటి వ్యక్తి అవసరం ఉందని రినీ పేర్కొన్నారు.
కాగా ఈసారి ఎన్నికల్లో రినీ సంపత్.. జనీస్ లూయిస్ జార్జ్, కెన్యాన్ మెక్‌డఫీ, గ్యారీ గుడ్‌వెదర్, రాబర్ట్ ఎల్ గ్రాస్, రోండా హామిల్టన్ వంటి వారితో తలపడుతున్నారు. ఆమె నామినేషన్ పత్రాలపై 4,500 కంటే ఎక్కువ మంది ప్రజలు సంతకాలు చేసి మద్దతు తెలపడం విశేషం.
ఇదీ చదవండి : ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్!


