ఇన్వెస్టర్స్‌ అలర్ట్‌: న్యూ ఫండ్‌ ఆఫర్స్‌ | Bajaj Life Nifty 200 Value 30 Index Fund Launched, Baroda BNP Paribas Services Fund Offers New Investment Opportunity | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్స్‌ అలర్ట్‌: న్యూ ఫండ్‌ ఆఫర్స్‌

Jul 27 2026 12:03 PM | Updated on Jul 27 2026 12:22 PM

New Fund Offers Bajaj Allianz Nifty 200 Value 30 Baroda BNP Services Fund NFO July 2026

బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా నిఫ్టీ 200 వేల్యూ 30 ఇండెక్స్‌ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) జూలై 27 వరకు అందుబాటులో ఉంటుంది. పారదర్శకమైన విధంగా ఎంపిక చేసిన 30 వేల్యూ ఆధారిత కంపెనీల్లో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఇది బజాజ్‌ లైఫ్‌కి చెందిన యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లతో అందుబాటులో ఉంటుంది. లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ స్థిరత్వం, మిడ్‌ క్యాప్‌ కంపెనీల వృద్ధి అవకాశాల మేళవింపుతో ఇన్వెస్టర్లకు మరింత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇది ఉంటుందని బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రావు రావూరి తెలిపారు.  

బరోడా బీఎన్‌పీ పారిబా సర్వీసెస్‌ ఫండ్‌ 
సేవల రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను కల్పిస్తూ బరోడా బీఎన్‌పీ పారిబా తాజాగా సర్వీసెస్‌ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ జూలై 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా అధిక వృద్ధి అవకాశాలున్న బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీఈఎస్, టెలీకమ్యూనికేషన్స్, హెల్త్‌కేర్, ఈ–కామర్స్‌ రంగ సంస్థల షేర్లలో ఇది ఇన్వెస్ట్‌ చేస్తుంది. మూడేళ్ల పైగా కాలానికి ఇన్వెస్ట్‌ చేసేవారికి ఈ ఫండ్‌ అనువుగా ఉంటుంది. ఏకమొత్తంగా కనీసం రూ. 1,000 నుంచి, నెలవారీ సిప్‌ ద్వారా రూ. 500 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఈ స్కీముకు రోహన్‌ కొర్డె ఫండ్‌ మేనేజరుగా వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement