డాలర్లలో పెట్టుబడి.. కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ | Marcellus global equities fund dollar investment Indian investors | Sakshi
Sakshi News home page

డాలర్లలో పెట్టుబడి.. కొత్త మ్యూచువల్‌ ఫండ్‌

Jun 8 2026 9:21 AM | Updated on Jun 8 2026 11:09 AM

Marcellus global equities fund dollar investment Indian investors

ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) నియంత్రణలో ఉండే మార్సెలస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌–గిఫ్ట్‌ ఐఎఫ్‌ఎస్‌సీ తాజాగా గ్లోబల్‌ ఈక్విటీస్‌ ఫండ్‌ని ఆవిష్కరించింది. భారతీయ ఇన్వెస్టర్లు.. గ్లోబల్‌ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ జూన్‌ 8న ప్రారంభమై జూన్‌ 19న ముగుస్తుంది.

కనీసం 5,000 డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌ ప్రధానంగా డిఫెన్స్‌–ఏరోస్పేస్, విద్యుదుత్పత్తి, లగ్జరీ కన్జంప్షన్‌ తదితర ట్రెండ్స్‌కి అనుగుణంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. పెట్టుబడులను విదేశీ కరెన్సీలో రిడీమ్‌ చేసుకోవచ్చు. పాన్, ఆధార్‌ వివరాలతో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. గిఫ్ట్‌ సిటీలో విడిగా బ్యాంకు ఖాతా అవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement