స్కూల్‌లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు! | Rich Dad Poor Dad Author Robert Kiyosaki Explain Money Lessons | Sakshi
Sakshi News home page

స్కూల్‌లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు!

Jul 21 2026 5:46 PM | Updated on Jul 21 2026 7:09 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Explain Money Lessons

గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్ వంటివాటిలో పెట్టుబడుల గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' ఇప్పుడు డబ్బు విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన ఫేస్‌బుక్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..

మన జీవితంలో ప్రతి వయసుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా 20, 30, 40 సంవత్సరాల వయసు అనేది మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక దశలు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మన జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ డబ్బు సంపాదించడం, పెట్టుబడులు పెట్టడం, ఆస్తులు సృష్టించడం వంటి విషయాలను మనకు ఎవరూ స్పష్టంగా నేర్పించరు.

20 ఏళ్ల వయసులో.. డబ్బు కంటే నేర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కంటే, మనకు ఎక్కువ అనుభవం, కొత్త నైపుణ్యాలు నేర్పించే అవకాశాలను ఎంచుకోవడం మంచిది. సేల్స్ ఎలా చేయాలి, డబ్బు ఎలా తిరుగుతుంది, వ్యాపారం ఎలా నడుస్తుంది, ఆర్థిక విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి? వంటి అంశాలు నేర్చుకోవాలి. ఈ వయసులో సంపాదన కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు.. ఎందుకంటే మనం సంపాదించుకునే జ్ఞానం, నైపుణ్యాలు భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలను తీసుకొస్తాయి.

30 ఏళ్ల వయసు.. వచ్చేసరికి ఆస్తులు నిర్మించడం ప్రారంభించాలి. అంటే.. కేవలం జీతం మీద ఆధారపడకుండా, భవిష్యత్తులో ఆదాయం వచ్చే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి. చిన్న మొత్తంతో అయినా పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోవాలి. అది ఒక చిన్న వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ పెట్టుబడి కావచ్చు లేదా ప్రతి నెల ఆదాయం వచ్చే ఏదైనా మార్గం కావచ్చు. మొత్తం మీద ఈ వయసులో పెట్టుబడులు పెట్టడం గురించి తెలుసుకోవాలి, ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం.

ఇక 40 ఏళ్ల వయసులో.. కేవలం జీతం కోసం పనిచేసే పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. ఈ దశలో మన ఆదాయాన్ని ఆస్తులుగా మార్చుకోవాలి. ఎందుకంటే ఒక ఉద్యోగంపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరంగా మారవచ్చు. ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మనం పని చేయకపోయినా ఆదాయం వచ్చే విధంగా పెట్టుబడులు, వ్యాపారాలు లేదా ఇతర ఆదాయ మార్గాలను పెంచుకోవాలి.

నిజానికి డబ్బు గురించి చాలా ముఖ్యమైన విషయాలు మనకు పాఠశాలల్లో నేర్పించరు. మంచి ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు.. సంపాదించిన డబ్బును ఎలా పెంచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనేది కూడా తప్పకుండా తెలుసుకోవాలి. 20ల్లో నేర్చుకోవాలి.. 30ల్లో నిర్మించాలి.. 40ల్లో ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేయాలి. ఈ సూత్రాలను ముందుగానే అర్థం చేసుకుంటే, భవిష్యత్తులో డబ్బు కోసం మాత్రమే పనిచేయకుండా, డబ్బు మన కోసం పనిచేసే పరిస్థితిని సృష్టించుకోవచ్చు అని కియోసాకి చెబుతున్నారు.

ఇదీ చదవండి: ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement