ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ | Rich Dad Poor Dad Author Robert Kiyosaki Explain About Being Rich and Being Wealthy | Sakshi
Sakshi News home page

ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ

Jul 19 2026 6:59 PM | Updated on Jul 19 2026 9:33 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Explain About Being Rich and Being Wealthy

చాలామంది ధనవంతుడు, సంపన్నుడు పదాలు ఒకే అర్థంలో ఉపయోగిస్తుంటారు. కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందని రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధనవంతుడు
ఒక వ్యక్తి ఏడాదికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుంటే.. అతన్ని ధనవంతుడు అని అంటారు. ఉదాహరణకు ఒక డాక్టర్ సంవత్సరానికి రూ. మూడు కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ అతడు జాబ్ మానేస్తే (పని ఆపేస్తే) ఆదాయం కూడా ఆగిపోతుంది. అంటే అతని జీవనశైలి పూర్తిగా అతను చేసే పనిపై ఆధారపడి ఉంటుందన్నమాట.

సంపన్నుడు
సంపన్నుడు అంటే తన ఆస్తుల ద్వారా నిరంతరం ఆదాయం పొందే వ్యక్తి. అంటే అతను పని చేయకపోయినా, అతని పెట్టుబడులు, వ్యాపారాలు, ఆస్తులు అతనికి ఆదాయాన్ని అందిస్తాయి. అంటే ఆ వ్యక్తి డబ్బు సంపాదించడానికి కేవలం తన సమయాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.

అందుకే.. ఆర్థికంగా ఎదగాలంటే కేవలం ఎక్కువ జీతం లేదా ఎక్కువ ఆదాయం సంపాదిస్తే సరిపోదు. ఆ ఆదాయంతో భవిష్యత్తులో ఆదాయం తెచ్చే ఆస్తులను నిర్మించుకోవడం ముఖ్యం. ఇల్లు, వ్యాపారం, పెట్టుబడులు వంటి ఆస్తులు మనకు నిరంతర ఆదాయాన్ని అందిస్తాయి.

సాధారణంగా ఒక ధనవంతుడు నేను ఎంత సంపాదిస్తున్నను? అని మాత్రమే ఆలోచిస్తాడు. కానీ సంపన్నుడు నాకు ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులు ఎన్ని ఉన్నాయి అని లెక్క వేసుకుంటాడు. దీన్నిబట్టి చూస్తే.. ఒక్క ఆలోచనా విధానమే వారి ఆర్థిక జీవితాన్ని మార్చేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇదీ చదవండి: సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా

ఎక్కువ ఆదాయం సంపాదించడం ఒక్కటే నిజమైన సంపదకు గుర్తు కాదు. మన దగ్గర ఉన్న ఆస్తులు మనకు నిరంతరం ఆదాయం తెచ్చిపెడుతున్నాయా లేదా అనేదే అసలు విషయం. కాబట్టి డబ్బుకోసం మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం లేకుండా.. మన డబ్బు మన కోసం పనిచేసే స్థితిని ఏర్పరచుకోవడమే నిజమైన సంపన్నత.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement