ఫేస్‌బుక్ డౌన్.. సేవల్లో అంతరాయం! | Facebook Down Globally, Users Report Login, Feed And Messenger Issues Across Multiple Countries, Check Post Inside | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ డౌన్.. సేవల్లో అంతరాయం!

Jul 19 2026 4:13 PM | Updated on Jul 19 2026 5:25 PM

Facebook Down Users Reporting Login Failures and Access Issues Worldwide

ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఫేస్‌బుక్ సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ వెల్లడించింది.

ఫేస్‌బుక్ అంతరాయం కారణంగా.. చాలా మంది వినియోగదారులు తమ ఫేస్‌బుక్ ఖాతాల్లోకి లాగిన్ కాలేకపోయినట్లు వెల్లడించారు. కొందరు లాగిన్ అయినప్పటికీ పోస్టులు చేయడం, ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయడం, న్యూస్ ఫీడ్‌ను చూడడం వంటి ముఖ్యమైన ఫీచర్లు పనిచేయలేదని పేర్కొన్నారు.

ఫేస్‌బుక్ మెసెంజర్ సేవల్లో కూడా కొంతమందికి అంతరాయం కలిగింది. మెసేజస్ పంపడం, స్వీకరించడం వంటి సౌకర్యాలు సరిగా పనిచేయకపోవడంతో వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యారు. బహుశా సాంకేతిక సమస్యల కారణంగా ఈ అంతరాయం కలిగి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

ఈ సమస్య భారతదేశంతో పాటు.. కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, , టర్కీ మొదలైన దేశాల్లో కూడా తలెత్తింది. దీంతో ఇక్కడ ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోయాయని ఫిర్యాదులు వచ్చాయి. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సాంకేతిక సమస్యగా భావిస్తున్నారు. అయితే సంస్థ.. ఈ సమస్యకు గల కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement