దేశంలో 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో, రూ.350లోపు బడ్జెట్‌లోనూ పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. అయితే రూ.350లోపు ఉన్న అన్ని ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా లభించదు. జియో అధికారిక నిబంధనల ప్రకారం, అపరిమిత ట్రూ 5G వినియోగానికి ప్రత్యేక అర్హతలు ఉన్నాయి.
రూ.350లోపు జియో ప్లాన్లు.. ప్రయోజనాలు
రూ.349 ప్లాన్
» వాలిడిటీ: 28 రోజులు
» రోజుకు 2 జీబీ డేటా
» అపరిమిత వాయిస్ కాల్స్
» రోజుకు 100 ఎస్ఎంఎస్
» జియో ట్రూ 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో, 5జీ ఫోన్ కలిగిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా.
రూ.329 ప్లాన్
» 28 రోజుల వాలిడిటీ
» రోజుకు 1.5 జీబీ డేటా
» అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్
రూ.319 ప్లాన్
» క్యాలెండర్ నెల వాలిడిటీ
» రోజుకు 1.5 జీబీ డేటా
» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్
రూ.299 ప్లాన్
» 28 రోజుల వాలిడిటీ
» రోజుకు 1.5 జీబీ డేటా
» అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్
రూ.249 ప్లాన్
» 28 రోజుల వాలిడిటీ
» రోజుకు 1 జీబీ డేటా
» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్
రూ.239 ప్లాన్
» 22 రోజుల వాలిడిటీ
» రోజుకు 1.5 జీబీ డేటా
» అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్
రూ.209 ప్లాన్
» 22 రోజుల వాలిడిటీ
» రోజుకు 1 జీబీ డేటా
» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్
రూ.200 ప్లాన్
» 28 రోజుల వాలిడిటీ
» మొత్తం 30 జీబీ డేటా (రోజువారీ పరిమితి లేదు)
» డేటా అవసరాన్ని బట్టి వినియోగించుకునే అవకాశం
రూ.198 ప్లాన్
» 14 రోజుల వాలిడిటీ
» రోజుకు 2 జీబీ డేటా
» అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్
రూ.189 ప్లాన్
» 28 రోజుల వాలిడిటీ
» మొత్తం 2 జీబీ డేటా
» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు.


