భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వినియోగదారుల కోసం ప్రత్యేక వాయిస్ ఓన్లీ ప్లాన్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం సిమ్‌ను ఉపయోగించే వారికి ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
జియో రూ.448 ప్లాన్
జియో రూ.448 ప్లాన్ ద్వారా వినియోగదారులు 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తం 1,000 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో మొబైల్ డేటా లభించదు. అదనంగా జియోటీవీ, జియోఏఐ క్లౌడ్ వంటి సేవలు లభిస్తాయి. అయితే.. ఈ ప్లాన్‌తో జియో 5G సేవలు అందుబాటులో ఉండవు. అవసరమైతే వేరుగా డేటా వోచర్ రీచార్జ్ చేసుకుని ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో కూడా డేటా ఉండదు. అవసరమైతే డేటా వోచర్‌ను విడిగా రీచార్జ్ చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనంగా 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఉచిత యాక్సెస్, సేఫ్ నెట్‌వర్క్ సర్వీస్, ఫ్రీ హలో ట్యూన్స్ వంటి సౌకర్యాలు కూడా అందిస్తారు.
ఈ రెండు ప్లాన్లు వాయిస్ కాల్స్ కోసం మంచి ఎంపికలే. అయితే జియో ప్లాన్‌లో 1,000 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తే, ఎయిర్‌టెల్ ప్లాన్‌లో 900 ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే ఉంటాయి. అయితే ఎయిర్‌టెల్ అదనంగా అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి ఉపయోగకరమైన సర్వీస్ అందిస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ మెరుగ్గా పనిచేస్తుందో దాని ఆధారంగా ఎంపిక చేసుకోవడం మంచిది. జియో సేవలు బాగా అందుబాటులో ఉంటే రూ.448 ప్లాన్ మంచి ఎంపిక. అదనపు డిజిటల్ ప్రయోజనాలు కావాలనుకునే వారు ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
ఇదీ చదవండి: ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!


