దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంకు షేర్ల కుదేలుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్‌లోనూ భారీగా పతనమయ్యాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తత కారణంగా అధిక చమురు ధరలు కూడా రిస్క్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 715.06 పాయింట్లు లేదా 0.92 శాతం క్షీణించి 76,755.05 వద్ద, నిఫ్టీ 191.45 పాయింట్లు లేదా 0.79 శాతం క్షీణించి 23,996.25 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ లోని 30 స్టాక్స్ లో 22 షేర్లు నష్టపోయాయి. రేపటి క్యూ 1 ఫలితాలకు ముందు ఇండిగో 3.7 శాతం క్షీణతతో టాప్ లూజర్ గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఢమాలయ్యాయి. మరోవైపు, ఎటర్నల్, Q1 ఫలితాల తరువాత ఉత్తమ పనితీరును కనబరిచింది.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.09 శాతం, 1.54 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ అత్యంత క్షీణించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగాయి.


